14, జులై 2026, మంగళవారం

నిర్లక్ష్యమా నీ అంతం ఎప్పుడు 6*

  *నిర్లక్ష్యమా నీ అంతం ఎప్పుడు 6*




*3) త్రిచక్ర వాహనములు ii* సాధారణ ఆటో రిక్షాలతో (నలుగురు మాత్రమే = 3+1) బాటు OLA మరియు RAPIDO సంస్థల ఆటోలు గూడా అధిక సంఖ్యలో దివారాత్రములు ప్రజలకు అందుబాటులో ఉండడం వలన రహదారులకు విశ్రాంతి ఉండదు. రహదారులపై ఎప్పుడుజనాల సందడి ఉంటూనే ఉంటుంది. *పెద్ద ఆటో రిక్షాలు* ఈ రవాణా వాహనాలలో డ్రైవర్ ప్రక్కన ఇద్దరు (1+2=3), ఆటో అంతర్ భాగంలో ఆరుగురికి (7) స్థానం కల్పిస్తారు (నిబంధనలకు విరుద్ధమైనా), గమ్యస్థానాలు చేరుస్తారు. ఇటువంటి పెద్ద ఆటో రిక్షాలు హైదరాబాద్ నగరంలో అధికంగా అగుపడ్తాయి. *పాఠశాల విద్యార్థుల రవాణా ఆటోలు* ఈ ఆటోలలో కూడా దాదాపు ఆరుగురు (1+6) విద్యార్థుల వరకు ప్రయాణింపజేస్తారు. 

 *LPG cylinder ఆటోలు* దాదాపు అన్ని LPG సంస్థలు గృహ, ఉపాహార/ఫలహార (Hotels), భోజనశాలల (Restaurants), వసతి గృహాల (Lodges), పారిశ్రామిక సంస్థల అవసరాలకు LPG cylinder లను ఆటో రిక్షాలలో చేరవేస్తూ ఉంటారు. వీటి అగ్రభాగాన ఇనుప పంజరం (net) లాంటి అమరికలు ఉండనందున, ఒక్కొక్కసారి సిలిండర్లు క్రిందపడి ప్రమాదాలకు హేతువులవుతుంటాయి. ఈ సంఘటనలన్నీ కనిష్ట స్థాయిలో ఉన్నా ప్రమాదాలు ప్రమాదాలే. *Trailor trolley auto లు* త్రిచక్ర వాహనాలకే వెనుక వైపు Trolley లు అమర్చి గృహ, దుకాణ సముదాయ, వాణిజ్య మరియు దినసరి సరుకులు రవాణా చేస్తూ ఉంటారు.


ప్రయాణ ఆటో రిక్షాల అతి వేగము, అదాట్టు (sudden) మళ్లింపులు, రహదారిలో ఇతర వాహనాల మధ్యలో దూరడం, నియమ నిబంధనలు పాటించకుండా ఆటోలను పరుగెత్తించడం వలన ప్రమాదాలు అధికమవుతాయి.


*విజ్ఞప్తి:-* రహదారిలోనున్న తోటి జనుల నిరాసక్తత, నిర్లక్ష్యం, నిస్తేజం రహదారి ప్రమాదాలను ప్రోత్సహించేవిగా ఋజువవుతాయి. బుద్ధి జీవులందరు ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. *ప్రతి సమస్య రక్షక భటులే ఆరి కట్టాలి అని భీష్మించుకుని ఉండరాదు*.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: