26, డిసెంబర్ 2023, మంగళవారం

Poverty in Pakistan


 

Free energy


 

Ejipt kota


 

అజ్ఞానం అనేవి

 నేర్చుకోవడం మొదలైతే జ్ఞానం, అజ్ఞానం అనేవి తెలుస్తాయి... పరుగు మొదలు పెడితే గెలుపు, ఓటములు అర్థమవుతాయి... 

జీవించటం మొదలు పెడితే నవరస బావాలు తెలుస్తాయి... మొదలు పెడితేనే ఏదైనా  అనుభవపూర్వకంగా తెలుసుకోగలం

ఎప్పుడు బాధపడుతూఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతు ఉంటే జీవితం తలవంచుతుంది. .._

జీవితంలో అతిముఖ్యమైనది ఒక చిరునవ్వు, ప్రేమతో ఒక పలకరింపు.అవి ఎంతటి బాధనైనా మాయం చేస్తుంది. నవ్వుతు జీవించండి. నలుగురికి మీ నవ్వులు పంచండి...👌

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////       1* సేవకులు మొదటిసారి నేరం చేస్తే, అది వారి తప్పు. రెండవ పర్యాయం కొనసాగిస్తే అది నీ తప్పు.         2* సప్త సముద్రాలలో పడి ప్రాణాలతో తిరిగి వచ్చినవాడిని చూసాం గానీ సప్త వ్యసనాలలో ఒక్క దానిలో పడి తేలినవాడిని ఇంతవరకు చూడలేదు. ఆ సప్తవ్యసనాలు ఏవంటే 1 స్త్రీ 2 జూదం 3 మద్యపానం 4 వేట 5 వాక్పారుష్యం 6 కఠిన దండన 7 ధనాన్ని వృధా చెయ్యడం.                           4* మబ్బులు బాగా కమ్మి వర్షం రాకడ సంకేతంగా ఆకాశంలో మెరుపు తీగ వెలుగులు విరజిమ్ముతుంది. డబ్బుతోటో, అధికారం లేదా పదవి ద్వారా వచ్చే గౌరవమర్యాదలు మెరుపు తీగల్లాంటివి. మేథస్సు మరియు విద్యకు మాత్రమే శాశ్వత గౌరవమర్యాదలు లభిస్తాయి.                           3* మనిషి అనేవాడు ఈ ఏడింటినీ వదలుకుంటే ఉన్నతిని పొందగలడు. అవి వరుసగా సోమరితనం, గర్వం, చంచల స్వభావం, అనవసర ప్రసంగం, దురభిమానం, త్యాగభావం లేకపోవడం మరియు పెద్దల పట్ల వినయవిధేయతలు లేకుండటం.                          5* దైవం రెండు చేతులు ఎందుకిచ్చాడంటే ఒక దానితో కష్టపడి సంపాదించమని, రెండవదానితో త్యాగబుద్ధి తో దానధర్మాలు చెయ్యమని.                         6* విడువకూడని ఆరు సద్గుణాలు ఇవి. సత్యం, దానం, అసూయ చెందకుండా ఉండటం, కష్టాల్లో సహనం, ధైర్యం మరియు చురుకుగా ( సోమరితనం విడిచి) ఉండటం.                            7* సందేహం ఏర్పడినప్పుడు అడిగేవాడు ఆ క్షణం వరకు మూర్ఖుడే. అంగీకరిద్దాం. అసలు అడగటానికి జంకేవాడు జీవితాంతం మూర్ఖుడే!                                 8* సహనం సమస్త విజయాలకు తల్లివేరు. గుడ్డును నిర్ణీత కాలం వరకు వేచి చూసి కోడిపిల్లను పొందగలం గానీ త్వరపడి పగులగొట్టి కాదు కదా!                            9* ఒక సంవత్సరం లోనే కోటీశ్వరుడైపోవాలనుకొనే వ్యక్తి మూడు నెలల్లో కారాగారానికి గాని, ఆరు నెలల్లో ఉరిత్రాడు వద్దకు గానీ వెళ్ళడం ఖాయం.         10* వైదిక ఆచారం ప్రకారం "" శతమానం భవతి శతాయుః"" అనే మాట వాస్తవమే! మనమే ఈ దిగువ పనులతో మన ఆయుష్షుకు కత్తెరలు వేసుకొంటున్నాం. అవి వరుసగా అతిగర్వం, అతిగా వాగడం, పాపాలు చెయ్యడం, మిక్కుటమైన కోపం, వ్యక్తిగత స్వార్థం, పరదూషణ మరియు మిత్రద్రోహం.                        ( సాధనమున పనులు సమకూరు ధరలోన.--- యోగి వేమన.)                     తేది 23--12--2023, శనివారం, శుభోదయం.

శ్రీకృష్ణావతారం

 *శ్రీకృష్ణావతారం:*  

  సంపుటి:: 5


🍁🍁🍁🍁🍁


*శ్రీకృష్ణ జననం:*


ఉగ్రసేనునికి క్షేత్రజ కుమారుడయిన కంసుడేగాక మరి ఎనిమిది మంది కుమారులు జన్మించారు. కంస, కంసవతి మొదలయిన అయిదుగురు కుమార్తెలు కూడా జన్మించారు. ఉగ్రసేనుని తమ్ముడు దేవకుడికి నలుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు జన్మించారు. ఆ ఏడుగురిలో చివరది దేవకి. ఈ ఏడుగురినీ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు.


 దేవకీ వసుదేవులకే శ్రీకృష్ణుడు జన్మించాడు. దానవాంశంతో జన్మించిన కంసుడు చిన్ననాటి నుంచే ఎన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డాడు. పుణ్యాత్ములను, బ్రాహ్మణులను హింసించసాగాడు. జరాసంధుని కుమార్తెలయిన అస్తి, ప్రాప్తిలను వివాహం చేసుకున్నాడతను. శిశుపాలుడు, దంతవకు్త్రడుతో స్నేహం కలుపుకున్నాడు. తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి, తనని తాను రాజుగా ప్రకటించుకుని ప్రజలను పీడించసాగాడు.


ఆడపిల్లను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు, ఆమె వెంట అన్నో తమ్ముడో లేదంటే పుట్టింటికి సంబంధించిన మరొక వ్యక్తి ఎవరయినా ఉండడం ఆచారం. తోడుగా వెళ్ళి ఆమెను అత్త ఇంట దిగవిడచి రావడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే దేవకీ వసుదేవుల వివాహం అనంతరం వారిని దిగ విడచి వచ్చేందుకు తోడుగా కంసుడు బయల్దేరాడు. 


చెల్లెలినీ, బావగారినీ రథంలో కూర్చోబెట్టుకుని, తానే రథాన్ని నడపసాగాడు కంసుడు. ఆ రథాన్ని అనేకమంది దాస దాసీజనం, పరివారం అనుసరించాయి. సకల మర్యాదలతో చెల్లెలిని అత్త వారింటికి తీసుకుని వెళ్తున్నాన్న ఆనందంలో ఉన్నాడు కంసుడు. అప్పుడు ఓ విచిత్రం జరిగింది. ఉత్సాహంగా ఉల్లాసంగా రథాన్ని నడుపుతున్న కంసుణ్ణి ఉద్దేశించి ఆకాశవాణి ఇలా పలికింది.


‘‘కంసా! సోదరిని సంతోషంగా అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నావు. చేజేతులా చావుని కొని తెచ్చుకుంటున్నావు. ఈ దేవకి కడుపున పుట్టిన ఎనిమిదవ బిడ్డే నీ ప్రాణాల్ని హరిస్తుంది. ఆ బిడ్డ చేతిలో నీకు మరణం తప్పదు.’’వినవచ్చిన ఆ మాటలకు విస్తుపోయాడు కంసుడు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏకదీక్షతో ఆలోచించాడు. ఆకాశవాణి మాటలు నిజం కాకతప్పదు. తనకి మరణం తధ్యం. దానిని తప్పించుకోవాలి. ఎలా?రథం దిగాడు కంసుడు. కొరకొరా చెల్లెలు దేవకిని చూశాడు.


 ఆమె సిగను పట్టి కిందకి లాగాడు. మొలలోని కత్తిని ఆమె పైకి దూశాడు.‘‘బావా’’ అడ్డుకున్నాడు వసుదేవుడు. ‘‘ఇది నా చెల్లెలు కాదు, నా ప్రాణాల్ని హరించే రాక్షసి. దీనిని ఈ క్షణమే హతమార్చి, నన్ను నేను కాపాడుకుంటాను. తప్పుకో.’’ అన్నాడు కంసుడు.


 వసుదేవుణ్ణి వెనక్కి నెట్టాడు. తూలిపడబోయి నిలదొక్కుకుని, కంసుని కాళ్ళు పట్టుకున్నాడు వసుదేవుడు.‘‘బావా! భోజకులానికే ఎన్నదగినవాడవు. శూరుడవు. నీకు తెలియని ధర్మం లేదు. స్త్రీహత్య మహాపాతకం. చెల్లెలు, కొత్తపెళ్ళికూతురు, కాళ్ళపారాణి కూడా ఆరలేదు. అలాంటిదాన్ని, అమాయకురాలిని చంపుతాననడం ధర్మమా చెప్పు? దయచేసి నా మాట విను, దేవకిని వదలిపెట్టు.’’ ప్రాథేయపడ్డాడు. వినలేదు కంసుడు. దేవకిని చంపితీరుతానన్నాడు. 


ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాడు వసుదేవుడు. అయినా ఒప్పుకోలేదతను.


కొడుకుల నిచ్చెద నని సతి

విడిపించుట నీతి; వీఁడు విడిచిన మీఁదం

గొడుకులు పుట్టినఁ గార్యము

తడఁబడదే? నాటి కొక్క దైవము లేదే?


పుట్టబోయే కొడుకులను ఇస్తాను అని మాట ఇచ్చి, భార్యను విడిపించడం తెలివైనపని. వీడిప్పుడు వదిలితే తరువాత కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏ దైవమో అడ్డుపడక పోతుందా?


ఎనిమిదవ చూలు వీనిం

దునుమాడెడి నంచు మింటఁ దోరపుఁబలుకుల్ 

వినఁబడియె; నేల తప్పును? 

వనితను విడిపించు టొప్పు వైళం బనుచున్,


ఎనిమిదవ గర్భంలో పుట్టేవాడు వీడిని సంహరిస్తాడని మాటలు సూటిగా వినువీధి నుంచి వినపడ్డాయి. అవి ఎందుకు తప్పుతాయి. త్వరగా నా భార్యను విడిపించడం మంచిది” అని ఆలోచించాడు వసుదేవుడు


 తీవ్రంగా ఆలోచించి అప్పుడు ఇలా అన్నాడు వసుదేవుడు.

లలనకుఁ బుట్టిన కొమరుని

వలనం దెగె దనుచు గగనవాణి పలికె నం 

చలిగెద వేని మృగాక్షికిఁ

గల కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్.


“ఈమెకు పుట్టిన కొడుకు వలన మరణిస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు. దేవకికి పుట్టిన కొడుకులు అందరినీ నీకు తెచ్చి ఇస్తాను. వారిని నువ్వు చంపుదువుగాని.”దేవకిని వదులు.’’ వసుదేవుని వాగ్దానానికి శాంతించాడు కంసుడు. దేవకిని విడచిపెట్టాడు.



‘‘మాట తప్పవు కదా?’’ అడిగాడు వసుదేవుణ్ణి. తప్పనన్నాడతను. ‘‘సరే, వెళ్ళిరండి.’’ కంసుడు ఇద్దరినీ వదిలేశాడు. బ్రతుకుజీవుడా అని భర్త సహా అత్తారింటికి చేరుకున్నది దేవకి. 


సుదతి మున్ను గన్న సుతుఁ గీర్తిమంతుని

పుట్టుఁ దడవు కంసభూవరునకుఁ

దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ

డాశపడక సత్యమందు నిలిచి.

దేవకీదేవి మొదటి కాన్పులో ప్రసవించిన కొడుకు కీర్తిమంతుడు. ఆమె కన్న ఆ మొదటి కుమారుడిని పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకువచ్చి అన్నమాట ప్రకారం కంసుడికి ఇచ్చేసాడు


పసిబిడ్డను తీసుకుని చూశాడు కంసుడు. వేలెడు లేడు. తనని వీడేం చేస్తాడనుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. 


కొడుకు నీవు మరలఁ గొనిపొమ్ము వసుదేవ! 

వెఱపు లేదు నాకు వీనివలన; 

నల్గ వీనికి; భవ దష్టమపుత్రుండు

మృత్యు వఁట; వధింతు మీఁద నతని


“బావా! వసుదేవా! నీ కొడుకును తీసుకువెళ్ళు. వీడి వలన నాకు భయం లేదు. నీ ఎనిమిదవ పుత్రుడే నా పాలిట మృత్యువట. వాడు పుట్టిన వెంటనే వధిస్తాను.”

వసుదేవునికి పిల్లాణ్ణి తిరిగి ఇచ్చేశాడు కంసుడు. ఆ బిడ్డపేరే కీర్తిమంతుడు.



ధేనుకారిష్టకాఽనిష్టికృద్-ద్వేషిహా

కేశిహా కంసహృద్-వంశికావాదకః |

పూతనాకోపకః సూరజాఖేలనో

బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||


బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం

ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |

వాన్యయా మాలయా శోభితోరః స్థలం

లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||


రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే


శ్రీ కృష్ణ దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం. 


*Follow: సనాతన హిందూ ధర్మం*

అభ్యాసం-37

 *జైశ్రీరామ్*


                                 2-7-2020

                                అభ్యాసం-37


                              *సుభాషితం*


"ఆలస్యం హి మనుష్యాణాం

  శరీరస్ధో మహాన్ రిపుః |

  నాస్త్యుద్యమ సమో బంధుః

  కృత్వాయం నా వసీదతి"||


                               *భావం* 


సోమరితనం అనేది మనుష్యులకు ప్రధాన శత్రువు.అది మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది.పని అనేది మనకి అత్యంత నమ్మకమైన బంధువు లాంటిది (Work is God). అది పతనంనుండి కాపాడుతుంది.


                           *అమృతవచనం* 


ఒక *ఫ్రెంచ్* దేశస్థుడు భారత్ వచ్చి 2017 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా అన్నారు:

        పూర్వకాలంలో భారతీయులు నూతన పరిశోధనలు చేసి అనేక విషయాలలో వినూత్నమైన పద్దతులను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు అందించేవారు. కాని ప్రస్తుతం అదిలేదు. ప్రస్తుతం ఆ ఆవిష్కరణా సామర్థ్యాన్ని కోల్పోయి విదేశీ అనుకరణను మొదలు పెట్టారు.భారత్ ఒక అగ్రదేశంగా ప్రపంచదేశాలలో ఉన్నతమైనిదిగా ఎదగవలసిఉంది.కాని భారతీయులు ఇతరులను అను‌కరించేవారు (Best copiers) గా తయారయ్యారు.ఇది చాలా శోచనీయం.

       *బాలీవుడ్* కూడా సీన్ బై సీన్ (scene by scene) సన్నివేశాలు,మాటలు అన్నీ పశ్చిమ దేశాలను అనుకరిస్తోంది.

        పూర్వకాలంలో మొగలుల పరిపాలనా సమయంలో కూడా భారతీయులు పరశోధనాత్మకం (innovative) గా ఉండేవారు. **చెస్**ఆటను కనిపెట్టారు.లెక్కలకు ఆధారము ప్రాణము అయిన *సున్నాను* కనిపెట్టారు. భారత్ యొక్క *ఖగోళభౌతికశాస్త్రం* (Astrophysics) ప్రపంచ దేశాలలో ఉన్నతమైనది.18వ శతాబ్దం వరకూ భారత ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉన్నతంగా ఉండేవారు.

       *వస్త్రపరిశ్రమలో* భారత్ కు గొప్పపేరు.భారత్ లో తయారుచేసిన వస్త్రాలు, చేతితో నేసినవి విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది.ఆరోజుల్లో కరెన్సీ లేదు వస్తువుల మార్పిడే జరిగేది.వస్త్రాలకు సమానమైన తూకం బంగారం వచ్చేది. 10 గజాల చీరను అగ్గిపెట్టెలో పట్టేటట్లుగా చేయగల అద్భుతమైన నైపుణ్యం భారతీయుల్లో ఉండేది.

         భారత్ మీద వరుసగా విదేశీ ఆక్రమణలవల్ల,విధర్మీయ పాలనవల్ల పరిశోధనాత్మకమైన తత్వాన్ని భారతీయులు  కోల్పోయారు.విదేశీపాలనలో అనేక యిబ్బందులకు లోనై ఇమేజినేషన్,ఇన్నొవేషన్ లేకుండా పోయింది.

        స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఆ బానిసత్వ భావాలు,అనుకరణ విధానాలు పోలేదు.దానినుంచి భారతీయులు త్వరగా బయటకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.


                       శ్రీవేంకటేశ్వర్లు వబిలిశెట్టి

                          విశ్వహిందూ పరిషత్


.

శకుని పగ*

 *శకుని పగ*




చెవి దగ్గర చేరి, చెడు మాటలు తలకెక్కించి చెడగొట్టేవారిని చూసినప్పుడు, ఇతడు శకునిలా దాపురించాడని అంటూ ఉంటాం మనం. 


శకుని మాయావి, మోసగాడు, జూదగాడు. కుట్రలకూ, కుతంత్రాలకూ, దురాలోచనలకూ దుర్బోధలకూ మారు పేరు. ఇతడి మూలంగా నే కౌరవులు సర్వనాశనమైనారు. అందుకే మహాభారతంలో ఇతడి పాత్ర చాలా ముఖ్య మైంది. దుర్యోధనుడికి మేనమామ అయిన శకుని గురించి ఎంతో కుతూహలంగా ఉండే కథ ఒకటి ఉంది.


భారత కథా కాలంలో గాంధార దేశాన్ని సుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు నూరుగురు కుమార్లు, ఒక కూతురు ఉన్నారు. కూతురి పేరు గాంధారి. ఆమెకు వైధవ్యయోగం ఉందని జోతిష్కులు చెప్పారు. అది తప్పించడానికై ఆమె తండ్రి పండితుల సలహా ప్రకారం గాంధారిని మొదట ఒక మేకపోతుకు ఇచ్చి పెళ్ళి చేశాడు. తరవాత ఆ మేక చచ్చిపోయింది. ఆ తరవాత కొంతకాలానికి గాంధారి ధృతరాష్ట్ర మహా రాజును పెళ్ళాడింది.


గాంధారి కొడుకులు కౌరవులు. ధృతరాష్ట్రుడి తమ్ముడైన పాండురాజు కుమార్లు పాండవులు. చిన్నతనం నుంచే కౌరవులకూ పాండవులకూ సరి పడేదికాదు. ముఖ్యంగా దుర్యోధనుడికీ భీముడికీ అసలు సరిపడదు. భీముణ్ణి చూసి దుర్యోధనుడు ఓరీ ! రండ కొడుకా ! ' అని ఎగతాళి చేసి, అవమానిస్తూ ఉండేవాడు. భీముడికి రోషం వచ్చేది. కాని ఏం చేస్తాడు? కుంతి కుమార్లు అయిన పాండవులు పాండురాజు వల్లకాక దేవతల వరం వల్ల పుట్టినవాళ్ళు. దుర్యోధనుడు భీముణ్ణి రండ కొడకా అనడానికి అదే కారణం.


కాని రోషం పట్టలేని భీముడు దుర్యోధనుని తల్లి గాంధారి ఒకసారి వైధవ్యం పొందిన తరవాత, ధృతరాష్ట్రుడిని పెళ్ళాడిందన్న రహస్యం ఎలాగో తెలుసుకున్నాడు. ఇంకేం? అతనికీ సందు దొరికింది. "నేను రండ కొడుకు నైతే నీవు ముండ కొడుకువు!" అని దుర్యోధనుడిని హేళన చేసి బదులుకు బదులు తీర్చుకున్నాడు.


దుర్యోధనుడికి అభిమానం పుట్టుకొచ్చింది. తన తల్లి గాంధారి ఒకసారి వితంతువు అయిన తరవాత తన తండ్రిని పెళ్ళి చేసుకున్న మాట నిజమేనని తెలుసుకున్నా డు. తాతగారే ఈ మోసం చేశాడని వారి కుటుంబం పై పగబట్టాడు. తాత సుబలుడిని, నూరుగురు మేనమామలను చెరసాలలో పెట్టించాడు. వారికి అన్నం నీళ్ళు లేకుండా చేసి చిత్రహింసలు పెట్టాడు. అంతమందికీ ఒక గుప్పెడు మెతుకులు పడేసేవాడు. అప్పుడు సుబలుడు, అతని కుమారులు ఆ గుప్పెడు మెతుకులూ తాము తినకుండా అందరిలోకీ చిన్న వాడైన శకునికి పెట్టేవారు.


"గుప్పెడన్నంతో మన ప్రాణాలు ఎలాగూ నిలువవు. పసివాడైన శకునికి పెడితే, వాడొక్కడైనా బ్రతుకుతాడు. మన వంశం నిలుస్తుంది” అనుకున్నారు వారు.


“నాయనా, శకునీ! మేమెలాగూ చచ్చిపోతాం. నీవొక్కడివే ఇక మిగిలేది. దుర్మార్గుడైన నీ మేనల్లుడు దుర్యోధనుడిని ఎలాగైనా నాశనం చేసి పగ తీర్చుకో. మా ఆత్మలకు శాంతి కలిగించు” అని శకునికి బోధించారు గాంధార రాజులు.


పసివాడైన శకుని గుండెల్లో ఈ పలుకులు గాఢంగా నాటుకున్నాయి. కొన్నేళ్ళకు శకుని తండ్రి, అన్నలు అంతా అన్నం, నీళ్ళు లేక చనిపోయారు. అప్పుడు శకుని, చనిపోయిన తన తండ్రి ఎముకలు అరగదీసి, వాటితో చక్కని పాచికలు తయారుచేశాడు. ఆ పాచికలు శకుని ఎలా చెబితే అలా వింటాయి. ఏ పందెం కావాలని వాటిని విసిరితే ఆ పందెం పడుతుంది. ఎవరికంటా పడకుండా ఆ పాచికలు దాచి ఉంచాడు శకుని.


చెరసాల నుంచి విడుదలైన తరవాత శకుని, తన వాళ్ళెవరూ లేనందున, హస్తినాపురం లోనే అక్కను, బావను కనిపెట్టుకుని అక్కడే ఉండిపోయాడు. మనస్సులో పగ రగులుతు న్నా అది ఎప్పుడూ బయటపడనీయలేదు. మేనల్లుడు దుర్యోధనుడంటే ఎక్కడలేని ప్రేమ, అభిమానం నటిస్తూ వచ్చాడు. లోపల ఉద్దేశం మాత్రం తన వాళ్ళను నాశనం చేసిన ట్లే. అతన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేయాలన్నదే. అందుకే శకుని ఎప్పుడూ దుర్యోధనుడి పై ఎక్కడలేని ప్రేమ ఒలకపోస్తూ మెల్లగా అతని చెవి దగ్గర చేరేవాడు. దుర్బుద్ధులు అతని తల కెక్కించేవాడు. దురాలోచనలు నూరిపోసేవాడు.


ఈ విధంగా పాండవుల పై దుర్యోధనుడికి అసూయ, ద్వేషం పుట్టించాడు. ఇతని ప్రేరణ వల్లనే దుర్యోధనుడు, ధర్మరాజును జూదానికి పిలిచాడు. మాయాజూదంలో శకుని ధర్మరాజును ఓడించి, పాండవులను అడవులకు పంపాడు. సంధి కుదరకుండా చేసి యుద్ధం జరిగేలా పన్నాగం పన్నాడు. తన వాళ్ళందరినీ దుర్యోధనుడు నాశనం చేసినట్టే చివరకు దుర్యోధనుడిని, అతని సోదరులను నాశనం చేసి, ఆ విధంగా పగ తీర్చుకున్నాడు.


సేకరణ

మోక్షపథం

 Pilladi Rudrayya గారి post🙏


పదమూడవ శతాబ్దంలో జ్ఞానదేవ్ అనే ఒక మహనీయుడు పిల్లల ఆటను👆తయారుచేశారు.ఆ ఆట పేరు మోక్షపథం లేదా పరమపద సోపాన పటము.*

*మన సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న బ్రిటిష్ వారు ఆటల్లో కూడా మనవారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని గ్రహించి,ఆ ఆటని మొత్తం మార్పు చేసి Snakes and Ladders గా విడుదల చేసారు.*

*మహనీయులైన జ్ఞానదేవ్ రూపొందించిన పాత ఆటలో వంద చతురస్రములు(గడులు) ఉంటాయి.12వ చతురస్రం అంటే 'నమ్మకం' అని,51వ చతురస్రం 'విశ్వసనీయత' అని, 57వ చతురస్రం 'దాతృత్వాన్ని' సూచిస్తుంది. 

అలాగే 76వ చతురస్రం 'జ్ఞానాన్ని' సూచిస్తుంది, 

78వ చతురస్రం 'మునివృత్తి' ని సూచిస్తుంది.*

*ఆ గళ్ళ క్రింద నిచ్చెన ఉంటుంది కనుక ఆ గడిలో పాచిక పడితే నిచ్చెన ఎక్కి, వేగంగా ఆటలో పైకివెళ్లే అవకాశం వస్తుంది.*

అలాగే 4వ గడి 'అవిధేయతకు' ప్రతీకగా,

44వ చతురస్రంలో పడితే 'అహంకారం' అని, 49వ గడిలో పడితే 'అశ్లీలత' అని, 

52వ గడిలోకి ప్రవేశిస్తే 'దొంగతనం' అని, 

58వ గడిలో 'అబద్దలాడుట' అని, 62వ చతురస్రం లోకి ప్రవేశిస్తే 'తాగుబోతు' అని, 

69వ గదిలోకి అడుగు పెడితే 'అప్పులుపాలు' అని,

73వ గడిలోకి ప్రవేశిస్తే 'హంతకుడు/హత్యలు' అని, 

84వ చతురస్రంలోకి వెళితే 'కోపిష్టి' అని, 92వ చతురస్రం 'దురాశను', 95వ గడి 'గర్వాన్ని' సూచిస్తాయి. చివరగా 99వ గడి 'కామాన్ని'

సూచిస్తాయి.

*ఈ గళ్ళల్లో పాము నోరు తెరుచుకుని ఉంటుంది కనుక ఆ గడిలోకి వచ్చిన పావు క్రిందకు జారిపోతుంది. 

మొత్తంమీద ఈఆటద్వారా ఏది మంచి, ఏది చెడు అనేది పిల్లలకు తెలుస్తుంది.

చెడు మార్గాన్ని ఎంచుకునే వారు అధః పాతాళానికి చేరుకుంటారని, మంచి గుణాలను అలవర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతామని ఆటద్వారా చెప్పడం విశేషం.

100వ గడిలోకి ప్రవేశిస్తే "మోక్షం".*

*ప్రతి నిచ్చెన పైభాగంలో ఎవరో ఒక దేవుడు/దేవత, లేకపోతే స్వర్గం,కైలాసం,వైకుంఠమో లేదా బ్రహ్మలోకమో ఇలా ఉంటాయి.*

*ఆట ఆడుతుంటే పిల్లలకు ఉత్సాహంతో పాటు నిజ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుందో తెలుస్తుంది.*

*అంతటి మహత్తరమైన ఆటను కూడా వక్రీకరించి తమదైన ముద్రవేసుకుని ఏవిధమైన సందేశం లేకుండా చేశారు తెల్లతోలు కప్పుకున్న నల్లటి మనసున్న బ్రిటీషర్స్....*

*ఆటపాటల ద్వారా కూడా దివ్యమైన సందేశాన్ని అందించిన ఘనత మన ప్రాచీన భారతీయ సంస్కృతిది. అటువంటి సంస్కృతి సంప్రదాయాలను విడిచిపెట్టి అన్య సంస్కృతలకై వెంపర్లాడడం నేటి మానవ దౌర్భల్యం!! ఈ సంగతిని గుర్తించి ఇకనైనా జాగ్రత్త పడితే మన భవిష్యత్తు తరాలు బాగుంటాయి లేదంటే అంతే సంగతులు.....*

ఆలోచనాలోచనాలు

 @@@ ఆలోచనాలోచనాలు @@@                                   1* "" Opportunity is NO WHERE"" అని నీరసపడి కూర్చోకండి.  "" Opportunity is NOW  HERE."" అనే ఆశాభావంతో జీవితంలో పురోగమించండి.                  2* అసూయ అనేది అస్తవ్యస్తమైన దయ్యం వంటింది. అది ఎదుటి వారి కంటే మనకే హాని కలుగజేస్తుంది.                       3* అందరిపట్ల మర్యాదగా వ్యవరించండి. ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోండి. ఒక్కరిద్దరితో మాత్రం స్నేహంగా ఉండండి. ఎవరికీ శత్రువు కాకండి.                                4* అద్భుత విజయం వెనకవున్న రహస్యం కేవలం కష్టించి పనిచేయడమే! అందుకే క్రమశిక్షణే సోపానం. అన్నిటికీ అదృష్టంపై ఆధారపడేవాడు తన జీవితాన్ని లాటరీగ చేసుకొంటాడు.                     5* అవమానకరమైన బ్రతుకు బ్రతికేకన్నా గౌరవప్రదమైన మరణమే మేలు. ఆకలితో నకనకలాడుతున్నా సింహం మాంసాన్ని విడిచి గడ్డి మేయదు కదా!                    6* భూములు, భవనాలు, ఆస్తిపాస్తులు, బాంక్ బాలెన్సులు -- వీటన్నిటికన్నా చక్కటి కుటుంబం, మంచి మిత్రులు, ఆపదలో సహాయపడగల్గిన బంధువర్గం-- ఇదే నిజమైన సంపద.                                 7* ఆశావాది చూసేది గులాబీని; ముళ్ళను కాదు. నిరాశావాది చూసేది ముళ్ళనే; కాదు గులాబీని; --- ఖలీల్ జిబ్రాన్.                    8* ఇతరుల కోసం ఆరు గంటలు కష్టపడడానికి అతడు ఇష్టపడలేదు. ప్రస్తుతం తనకోసం పన్నెండు గంటలు శ్రమిస్తున్నాడు. ఆ వ్యక్తినే సమాజం వ్యాపారస్థుడు అని పిలుస్తుంది.                    9* ఈ మాటలను చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది. కానీ చెప్పక తప్పడం లేదు. ఇతరులు శ్రమించి సంపాదించినదానిని తేరగా తిందామనుకొన్న ప్రతి వ్యక్తి "" మరొకరు కక్కిన కూటికి ఆసించే ఆశపోతే!""                    10* ఈ రోజు చెయ్యగలిగిన పనిని రేపటికి వాయిదా వెయ్యవద్దు. ఎందుకంటే ఆ రాబోయే "" రేపు"", రెండు రోజుల పనిభారాన్ని మొయ్యలేకపోవచ్చు.           11* ఇతరులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? ఒకందుకు ఇది మంచిదే! మనపట్ల మరొకరు జాలి చూపడం కంటే అసూయ చెందడం మెరుగైనదే!                         12* సత్యం ఇది. ఏ రోగం లేనివాడు పడుచువాడు. ఏ అప్పు లేనివాడే నిజమైన సంపన్నుడు.                 13* నీవు నడక నేర్చేముందు, సైకిల్ తొక్కడం నేర్చేటప్పుడు ఎన్ని పర్యాయాలు పడి లేచావో, గుర్తు తెచ్చుకో! ఎన్నటికీ ప్రయత్నాన్ని విడిచిపెట్టకు. ( Never , Never, Never give up!).    14*  ఈ ప్రపంచంలో కీర్తి శిఖరాలను అధిరోహించిన వారంతా ఒక్క అంగలో శిఖరాగ్రాన్ని చేరలేదు. ప్రపంచమంతా గాఢమైన నిద్రలో విశ్రాంతి తీసుకొంటుంటే, వీరు మాత్రం ఎన్నో సుఖాలను త్యాగం చేసి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, పైకి ఎగబ్రాకారు.                          15* ఎత్తెన పర్వతాలను అధిరోహించే వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. వారు ఎంతో ముందుకు వంగి పైకి సాగుతుంటారు. మనమూ అంతే! ఎంత అణకువగా ఉంటే అంత వేగంగా కార్యసిద్ధి అవుతుంది.                           తేది 22--12--2023, శుక్రవారం, శుభోదయం.

*ఆశ-అత్యాశ

.


                    *ఆశ-అత్యాశ*

                      ➖➖➖✍️


ఇది కలికాలం!


కొంతమంది మోసకారులు..

అమాయకులను ఎన్నోరకాలుగా

ప్రలోభాలకు గురిచేసి ఆశపెడతారు.


ఎవరో బాధల్లో వున్నారు, ₹. 2000/-

పంపండి, తర్వాత 18,500/- పంపుతాము అని, 

మరింకేవో మోసపు మాటలు చెప్పి మనలను నమ్మించి మననుంచి 

సొమ్ము ఫోన్ లో G/pay 

Pone pay చేయించుకుంటారు.

ఎవరినీ నమ్మవద్దు.


ఈమధ్య ఒక ఆధ్యాత్మిక గ్రూప్ లో…

జరిగిన సంఘటన…👇


ఒకడు తను భక్తి పరుడనని గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి,

అనునయింగా అడ్మిన్ పవర్ తీసుకుని, ఆగ్రూప్ లోవున్న మిగిలిన అడ్మిన్ లను రిమువ్ చేసి 

తను ఒక్కడే అడ్మిన్ గా వుంటూ 

గ్రూప్ లోని మిగిలిన సభ్యులను

ప్రలోభ పెట్టి మోసగిస్తున్నాడు.


ఎవరూ ఎవరికీ డబ్బులు పంపవద్దు.

మోసపోవద్దు.


అటువంటి వానితో మోసగించబడితే

సైబర్ క్రైమ్:  155260 కి ఫోన్ చేసి వివరాలు చెప్పండి.

లేదా 1903కి ఫోన్ చేయండి.


వారిపై తగు చర్యలు తీసుకుని ఆ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తారు.



అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చేయండి. 

ప్రజలను మోసపోకుండా కాపాడండి.🙏

*కొత్త పచ్చళ్ళు

 *SP PICKLES* 

&  *POWDERS*


*కొత్త పచ్చళ్ళు రెడిగా యున్నాయి*

*రీసెల్ చేసుకునేవారికి.. కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలి అనుకుంటున్నాము* *సంప్రదించగలరు* 

*సాంప్రదాయ పచ్చళ్ళు*

*మాదగ్గర కలర్స్  ఫ్రీజ ర్వేటివ్స్ వెయ్యకుండా సంప్రదాయ పద్దతిలో పచ్చళ్ళు పొడులు బహ్మనులచే మాత్రమే సూచిగా రుచికరంగా నిల్వా ఉండేవిధంగా క్వాలిటీ పదార్ధాలతో తయారు  చేయబడతాయి*


*మీ ఇంటి శుభకార్యలకు కావలసిన పిండివటలు ఆర్డర్ పై మీకు కావలసిన విధంగా తయారు చేసి ఇవ్వగలము* 


*పచ్చళ్ళు*:  *1kg cost*

*ఉప్పు పచ్చళ్ళు పోపు లేకుండా*


చింతకాయ తొక్కు 450/-

ఉసిరి తొక్కు 450/-

ఉప్పు గోంగూర  450/-

టమోటా       450/-

మగయా       450/-

నిమ్మకాయ    450/-

దబ్బాకాయ   450/-


*ఇంగువ పోపు వేసినవి రెడీటూఈట్*


చింతకాయ(ఎండుమిర్చి  తో పండుమిర్చి ...కారం తో చేసినది )     550/-

ఉసిరి పచ్చడి 550/-

గోంగూర       650/-

టమోటా       550/-

నిమ్మకాయ    550/-

డబ్బాకాయ   550/-

పులిహోర గోంగూర 750/-

పండుమిర్చి 600/-

పండుమిరప గోంగూర 650/-

ఆవకాయ(వెల్లుల్లి/లేకుండా)  600/-

బెల్లం ఆవకాయ 600/-

పెసర ఆవకాయ 600/-

మెంతి ఆవకాయ  600/-

ఉసిరి అవకాయ 600/-

పచ్చ ఆవకాయ  850//

పనసపోట్టు ఆవకాయ  750/-

మాగాయ  600/-

*వంకాయ నిల్వ పచ్చడి* 600/-

అల్లం పచ్చడి   600/-

మామిడి అల్లం  650/-

మామిడి అల్లం ఆవకాయ 700/-


*పొడులు* :   *1kg cost*

కంది పొడి  650/-

నువ్వులపొడి 700/-

ధనియాల పొడి 550/-

పప్పులపొడి 550/-

కరివేపాకు కారప్పొడి  550/-

మునగాకు కారపొడి  550/-

మునగాకు పొడి 2000/-

పుదీనా కారపొడి  550/-

అవిశగింజల పొడి 550/-

కొబ్బరి పొడి  600/-

రసం పొడి  550/-

కాకరకాయ పొడి 600/-

సాంబారు పొడి 650/-

నల్లకారం 600/-


*AS బ్రాండ్ పప్పు నూనె గుంటూరు కారం  బళ్లారి కారం

మిర్చి తెచ్చి తోడిమాలు ఓలిచి కారం మేమే తయారు చేస్తాము ఆవాలు కుడా మేమే కడిగి ఆరబెట్టి పిండి పడతాము*

 మావోద్ద తయారు చేయు పచ్చళ్ళు పొడులలో వెల్లుల్లి

వాడము  వెల్లుల్లి కావాలి అనుకున్నవాళ్లకు వల్లవరకు వాళ్లకుకేవలసిన విధంగా తయారు చేసి ఇవ్వగలము*


*వడియాలు* & *వొరుగులు *అప్పడాలు*:

ఆవిరి వడియాలు 550/-

సగ్గుబియ్యం వడియాలు  550/-

పెసర అప్పడాలు       100pices - 650/-

మినప అప్పడాలు 100p 650/-

మిర్చి   1kg  950/-

గుమ్మడి వొడియలు 950/-

పేలవొడియాలు  600/-

మినపిండి వోడియలు  650/-

బుడందోసకాయ వొరుగు  950/-

వొంకాయ  వొరుగు  850/-

దొండకాయ  వొరుగు  850/-

చిట్టెంటపోటు  kg 950/-


*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు*

*చార్జీలు అదనం*


*దయచేసిమీకుతెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటున్నాము* 🙏


*వివరములకు సంప్రదించండి*

*పుచ్చ పల్లవి*

*గౌతమస గోత్రం*

*విజయవాడ*

*7981370664*

*0866‌ 2533848*

శివానందలహరీ – శ్లోకం – 40*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 40*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ధీయన్త్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై-*

*రానీతైశ్చ సదాశివస్య చరితామ్భోరాశిదివ్యామృతైః ।*

*హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే*

*దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః ॥*


భగవంతుడా, విశ్వేశ్వరా! బుద్ధి అను యంత్రముద్వారా, వాక్కులనే కుండలతో, కవిత్వములను పిల్లకాలువల వరసల గుండా, నా హృదయమను పొలములోకి తీసుకురాబడిన సదాశివుని చరిత్రమను అమృతసముద్రపు జలముల వల్ల భక్తి అనే పంట బాగుగా విస్తరిస్తోంది. ! నీ భక్తుడనైన నాకు కరువు వల్ల భయం ఎక్కడిది ?


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

అర్జున విషాద యోగము*

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                  *శ్లోకము 2*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంజయ ఉవాచ*


*దృష్ట్వా తు పాణ్డవానీకం*

*వ్యూడం దుర్యోధనస్తదా |*

*ఆచార్యముపసంగమ్య*

*రాజా వచనమబ్రవీత్ ||*


*భాష్యము:*

ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మికదృష్టి సైతము లోపించెను. ధర్మవిషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండియు ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసికొనగలిగెను. 


కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనెంచి, పవిత్రస్థలముచే పవిత్రులైన అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరుగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవసేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజ్జస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతియైన ద్రోణాచార్యుని చెంతకు చేరేనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రత ననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసివచ్చెను. కనుకనే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగపరచలేకపోయెను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  -‌ పూర్ణిమ - మృగశిర  -‌ భౌమ వాసరే* *(26-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/bGepkY1D2Lw?si=DGx3kA94dyBFoeDv


🙏🙏

సంపూర్ణ శ్రీ శివమహాపురాణం

 సంపూర్ణ శ్రీ శివమహాపురాణం - కైలాస సంహితా - అధ్యాయం - 4                                                                                                                                       సన్న్యాస నియమములు


ఈశ్వరుడిట్లు పలికెను -


ఓ మహాదేవీ! నీయందు నాకు గల ప్రేమచే నేనీపైన సంప్రదాయానుసారముగా సన్య్యాసియొక్క దినచర్యను గురించి చెప్పెదను (1). సన్న్యాసి బ్రాహ్మముహూర్తమునందు నిద్రలేచి, శిరస్సునందు తెల్లని పద్మము రూపములో నుండే సహస్రారచక్రమునందు కూర్చుండియున్న గురువును భావన చేయవలెను (2). స్ఫటికమువలె స్వచ్ఛమైనవాడు, రెండు నేత్రములు గలవాడు, వరద-అభయముద్రలను దాల్చియున్నవాడు, మనస్సునకు ఆహ్లాదమును కలిగించువాడు, శివస్వరూపుడు అగు గురువునకు మనస్సులో భావనలచే సంపాదింపబడిన గంధము మొదలగు ద్రవ్యములతో చక్కగా క్రమములో సర్వోపచారములను చేసి, తరువాత చేతులను జోడించి నమస్కరించవలెను (3,4). ఓ మహాదేవా! నేను ఉదయము మొదలిడి సాయంకాలము వరకు, సాయంకాలము మొదలిడి ఉదయము వరకు ఏయే పనులను చేయుదునో, అవి అన్నియు నీ ఆరాధనయే అగుగాక! (5) తరువాత గురువునకు విన్నవించి, ఆయన అనుమతిని (మానసికముగా) తీసుకొని, కూర్చుండి ప్రాణాయామమును చేసి మనస్సును ఇంద్రియములను దేహమును జయించి (6), మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు ఆరు చక్రములను (స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రములు) ధ్యానము చేయవలెను. బ్రహ్మరంధ్రమునకు మధ్యలో కోటి మెరపులతో సమానమగు తేజస్సు కలిగినట్టియు, సర్వశ్రేష్ఠమగు తేజోమయమగు నా సచ్చిదానందమూర్తిని ధ్యానించవలెను. నిర్గుణపరబ్రహ్మ, దోషరహితుడు అగు సదాశివుని 'సో%హమస్మి ( సదాశివుడు నేనే అగుచున్నాను)' అని భావన చేసి ఆ సదాశివునితో ఏకత్వముననుభవించి, తరువాత బయటకు వచ్చి సుఖముగా దూరమునకు వెళ్లవలెను (7-9). సావధానచిత్తుడగు ఆ యతి శిరస్సుపై వస్త్రమును కప్పుకొని ముక్కునకు వస్త్ర మును కట్టుకొని నేలపై గడ్డిని ఉంచి దేహమును శోధించి చేతితో గుహ్యము ధరించి పైకి లేచి తరువాత జలాశయమునకు వెళ్లి నీటిని గ్రహించి జాగరూకతతో శౌచమునాచరించవలెను (10, 11).


చేతులను, కాళ్లను కడుగుకొని రెండు సార్లు ఆచమనమును చేసి ఓంకారమును స్మరిస్తూ ఉత్తరము వైపునకు తిరిగి మౌనముగా పళ్లను తోముకొనవలెను (12). అమావాస్యనాడు, ఏకాదశి నాడు పళ్లను తోముకొనుటకు గడ్డిని కాని, ఆకులను కాని వాడరాదు. మిగిలిన రోజులలో వాటితో మాత్రమే తోముకొనవలెను. పన్నెండు సార్లు నీటిని పుక్కిలించి తరువాత ముఖమును కడుగుకొన వలెను (13). రెండు సార్లు ఆచమనమును చేసి మట్టితో మరియు నీటితో వెనుక భాగమును శుద్ధి చేసి అరుణోదయకాలము (సూర్యోదయమునకు అరగంట ముందు) మట్టితో స్నానమును చేయవలెను (14). గురువును మరియు నన్ను స్మరిస్తూ స్నానమును సంధ్యావందనము మొదలగు వాటిని చేయవలెను. ఆ వివరములను విస్తారమగుననే భయముతో ఇక్కడ చెప్పుట లేదు. వాటిని మరియొక చోట చూచి తెలుసుకొన వలెను (15). అర చేతులతో శంఖముద్రను పట్టి దానితో నీటిని తీసుకొని ఓంకారమును ఉచ్చరిస్తూ పన్నెండు లేదా ఆరు, లేదా మూడు పర్యాయములు తలపై అభిషేకించుకొనవలెను (16). ఒడ్డు పైకి వచ్చి, కౌపీనమును ఉతుకుకొని రెండు సార్లు ఆచమనమును చేసి వస్త్ర ముపై నీటిని చల్లి ఒంటిని తుడుచుకొనవలెను (17). ముందుగా ముఖమును తుడుచుకొని, తరువాత శిరస్సుతో మొదలిడి దేహమును అంతటా అదే వస్త్రముతో తుడుచుకొని, గురువు సన్నిధిలో నిలబడవలెను (18). శుభ్రమగు లంగోటాను ముడి ఎడమ వైపునకు వచ్చు విధముగా కట్టుకొని, తరువాత భస్మను ధరించవలెను. ఓ పార్వతీ! ఆవిధానమును చెప్పుచున్నాను (19). రెండు సార్లు ఆచమనమును చేసి సద్యోజాతమంత్రముతో భస్మను తీసుకొని 'అగ్నిరితి' అను మంత్రముతో దానిని అభిమంత్రించి దేహమును స్పృశించవలెను (20). తరువాత 'ఆపో వా' అను మంత్రముతో నీటిని అభిమంత్రించి దానితో భస్మను తడుపవలెను. ఓ పరమేశ్వరీ! ఓమాపో జ్యోతిః, మానస్తోకే అను మంత్రములను పఠించి, దానిని ముద్ద చేసి, రెండు ముద్దలుగా విభజించి, ఒక ముద్దను మరల అయిదు భాగములుగా చేసి, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు అను స్థానములయందు 'ఈశానః' ఆను మంత్రముతో మొదలిడి సద్యోజాతమంత్రము వరకు అయిదు మంత్రములను క్రమముగా పఠిస్తూ ధరించవలెను. తరువాత, దేహమంతటా ఓంకారమును ఉచ్చిరిస్తూ ఆ భస్మను పూసుకొనవలెను. తరువాత చేతులను కడుగుకొని రెండవ ముద్దను తీసుకొని దానిని పూర్వమునందు వలెనే చక్కగా పూజించి దానితో త్రిపుండ్రము (లలాటముపై మూడు రేఖలు) ను ధరించవలెను (21-24).


త్రియాయుషమంత్రమును, త్ర్యంబకమంత్రమును ఒక్కొక్కటి మూడు సార్లు చొప్పున జపించి ఓంకారమును నమశ్శివాయ మంత్రమును పఠించి శిరస్సు, లలాటము, వక్షఃస్థలము, భుజములు అను స్థానములయందు భస్మను ధరించవలెను (25). అపుడు విద్వాంసుడగు ఆ యతి పంచీకరణమంత్రమునుచ్చరించి తన గురువును భావన చేయవలెను. తరువాత చెప్పబోవు విధములో ఆరు ప్రాణాయామములను చేయవలెను (26).తరువాత నాభి, రెండు బాహువులు, వాటి సంధులు, వీపు అను స్థానములను క్రమముగా స్పృశించి, చేతులను కడుగుకొని రెండు సార్లు యథావిధిగా ఆచమనమును చేసి (27), కుడిచేతితో నీటిని తీసుకొని, ఎడమ చేతితో దానిని కప్పి పన్నెండు సార్లు ఓంకారముతో అభిమంత్రించవలెను (28). ఈ విధముగా శిరస్సుపై మూడు సార్లు సంప్రోక్షించుకొని, తరువాత మూడు సార్లు ఆ నీటిని త్రాగవలెను. తరువాత ఓంకారమును జపిస్తూ ఏకాగ్రమగు మనస్సుతో, సూర్యమండలమునకు మధ్యలోనున్నవాడు, సకలతేజోరాశి, పరంబ్రహ్మ, ఎనిమిది చేతులు గలవాడు, నాలుగు ముఖములు గలవాడు, అర్ధనారీశ్వరుడు, ఆశ్చర్యమును గొల్పువాడు, సర్వులకు ఆశ్చర్యమును కలిగించే గుణములు గలవాడు, సకలాభరణములతో విరాజిల్లువాడు అగు ఈశ్వరుని ధ్యానించి, తరువాత మూడు సార్లు యథావిధిగా అర్ఘ్యమునీయవలెను (29-31). తరువాత గాయత్రిని 108 సార్లు జపించి పన్నెండు తర్పణముల నీయవలెను. మరల ఆచమనమును చేసి యథావిధిగా మూడు సార్లు ప్రాణాయామమును చేయవలెను (32). తరువాత మనస్సులో శివుని స్మరిస్తూ పూజాగృహమునకు విచ్చేయవలెను. ద్వారము వద్దకు వచ్చి కాళ్లను కడుగుకొని మౌనియై రెండు సార్లు ఆచమనమును చేయవలెను (33). తరువాత ఆ పూజాగృహములోనికి ముందు కుడి కాలిని పెట్టి యథావిధిగా ప్రవేశించవలెను. పవిత్రాంతఃకరణుడగు యతి ఆ మండపము లోపల క్రమముగా మండలమును రచించవలెను (34).


శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసాచారమును వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

*శ్రీ రామరక్షా స్తోత్రం-06* -

 🪷🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః౹*

*స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నే చ కార్ముకః॥*


- *శ్రీ రామరక్షా స్తోత్రం-06* -


తా𝕝𝕝 

సమస్త విద్యలకు నిధియైన రాముడు నా నాలుకను, భరతునిచే నమస్కరింప బడువాడు నా కంఠమును, భుజములందు దివ్యాయుధములను ధరించువాడు నా మూపును, తన భుజబలముతో శివధనుస్సును విరిచినవాడు నా భుజములను కాపాడుగాక. విద్యానిధి అయినవాడు నా జిహ్వను, భరతునిచే పూజింపబడిన వాడు నా కంఠమును, దివ్యాయుధుడు నా స్కంధములను, శివుని విల్లు విరచినవాడు నా భుజములను రక్షించుగాక. నా నాలుకను విద్యానిధి, కంఠమును భరత వందితుడు కాచుగాక. *స్కంధములను దివ్యాయుధధారి, భుజములను శివధనుస్సును విరిచిన స్వామి కాపాడుగాక*.

మంగళవారం, డిసెంబరు 26,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, డిసెంబరు 26,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - శుక్ల పక్షం

తిథి:పౌర్ణమి తె5.14వరకు

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:మృగశిర రా10.16 వరకు 

యోగం:శుక్లం తె3.46వరకు

కరణం:విష్ఠి సా5.13 వరకు తదుపరి బవ తె5.14 వరకు

వర్జ్యం:లేదు

దుర్ముహూర్తము:ఉ8.43 - 9.26 &

రా10.41 - 11.33

అమృతకాలం:మ1.18 - 2.55

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి : ధనుస్సు చంద్రరాశి : వృషభం 

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.28


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

ఉన్నోడే గర్భాలయంలోకి వెళతాడు

 1. శ్రీశైలం లో ఒకప్పుడు శివ లింగాన్ని తాకి, అభిషేకం చేయాలి అంటే ఫ్రీ. ఇది నేను చూసాను. 

2. ఆ తరవాతా 100 రూపాయలు పెట్టారు. ఇదీ చూసాను.  3.ఆ తర్వాత కాంగ్రెస్ మహానుభావులు 1116 చేసారు.

4. ఇక ఇప్పుడు 5000 చేసారు. 

అయినా హిందువులు 5000 ఇచ్చి, గర్భాలయంలో అభిషేకం చేయిస్తారు తప్ప, "పేద వాడికి ఈ దేవుడు అందుబాటులో ఉండడా ?" అని ప్రశ్న వేయరు. 


ఆంధ్రప్రదేశ్ లో గుడి-వ్యాపారం బాగుంది. ప్రభుత్వమే ఈ వ్యాపారం చేస్తుంది. 


శ్రీశైలం లో దేవాలయానికి మొదటగా దిక్కు ఉన్నది అక్కడి చెంచులు, ఆటవికులు. వారినైనా ఫ్రీగా గర్భాలయం లోకి రానిస్తారా లేదా ? ఆలయాన్ని విస్తరించి, అద్భుతంగా తీర్చిదిద్దిన రెడ్డి రాజులకు కూడా పాపం తెలివి లేదు...ఉంటే, ఇలా 5000 Rs టిక్కేట్ పెడతారని తెలిసుంటే...గుడిని డెవలప్ చేసేవారు కాదేమో. 


 ఈవిషయంలోమన ప్రభుత్వానికి జేజేలు చెప్పాల్సిందే


ఏ పార్టీ వారున్నా, ఉత్తరప్రదేశ్ ను పాలించిన పార్టీలకు తెలివి లేదు.... ఎందుకంటే... కాశీలో ఇప్పటికీ ఫ్రీగా శివలింగానికి...భక్తులే గంగ నీరు తెచ్చి అభిషేకం చెయొచ్చు. మన పెబుత్వాలను అక్కడ వేస్తే నాసామిరంగా... దెబ్బకు గుడి అంటే పారిపోయేలా చేస్తారు. 


గ్రామాలలో గుళ్లలో దేవుడికి దీపం పెట్టే పూజారులు డబ్బులేక అవస్థలు పడుతుంటారు. ఏ మహానుభావుడో ఓ 500 ఇస్తే చాలు, వారం హాయిగా బతకొచ్చని వెర్రి చూపూలు చూస్తుంటాడు. రారు, ఇవ్వరు. గ్రామాల్లోని పురాతన గుళ్ళు శిథిలం అవుతుంటాయి. డబ్బురాని , సెంటిమెంట్ వర్క-ఔట్ అవని గుళ్లను ప్రభుత్వాలు లైట్ తీసుకుంటాయి. తమ ఆధీనంలోని గుళ్లలో టికెట్లతో, హుండీలతో భక్తులను పిండుతాయి. కోట్లు, కోట్లు డబ్బు దండుకుని... ఏనాడు ఫ్రీగా ఒక భగవద్గీత పుస్తకం కూడా భక్తులకు పంచిపెట్టవు. 


ఎంతైనా... నోరు మెదపని తెలుగు హిందువులు గొప్పోళ్ళు కదూ. తప్పులు చూపిస్తే... నువ్వు ఫలానా పార్టీ అంటారు...ఫలానా కులం అంటారు....


 తెలుగు హిందువుల దగ్గర డబ్బులున్నాయి...5000 పెడతారు, ఉన్నోడే గర్భాలయంలోకి వెళతాడు ...

⚜ శ్రీ దేవికూప్ భద్రకాళి శక్తిపీఠం

 🕉 మన గుడి : నెం 280


⚜ హర్యానా : థానేసర్🕉


⚜ హర్యానా : థానేసర్


⚜ శ్రీ దేవికూప్ భద్రకాళి శక్తిపీఠం



💠 నవరాత్రులలో శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

కురుక్షేత్రంలోని శక్తిపీఠం శ్రీ దేవికూప్ భద్రకాళి మందిర్‌లో మా సతీదేవి కుడి చీలమండ పడిపోయిందని నమ్ముతారు.  

అలాగే ఈ శక్తిపీఠంలో శ్రీ కృష్ణుడు బలరాముల శిరోముండనం కార్యక్రమం జరిగింది అంటారు.


 

💠 భద్రకాళి ఆలయం హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా తానేసర్‌లోని ఝాన్సా రోడ్డులో ఉంది.  భద్రకాళి ఆలయాన్ని శ్రీ దేవికూప్ ఆలయం అని కూడా అంటారు. 

ఈ ఆలయం దేవి యొక్క తొమ్మిది రూపాలలో ఒకటైన కాళీ దేవికి అంకితం చేయబడింది.  

ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.  


💠 శక్తిపీఠ్ శ్రీ దేవికూప్ భద్రకాళి మందిర్‌ను “సావిత్రి పీఠం”, “దేవి పీఠం”, “కాళికా పీఠం” లేదా “ఆది పీఠం” అని కూడా పిలుస్తారు. 


 

🔆 చరిత్ర 🔆


💠 సతీ మాత తన తండ్రి ప్రజాపతి దక్షుని ఇష్టానికి విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంది. 

ప్రజాపతిగా తన నియామకాన్ని జరుపుకోవడానికి,  దక్షుడు ఒక యాగాన్ని నిర్వహించాడు, అక్కడ అతను అన్ని దేవతలను ఆహ్వానించాడు, కానీ శివుడు మరియు అతని స్వంత కుమార్తెను ఆహ్వానించలేదు. 


💠 సతిదేవి ఆహ్వానం లేకుండా వెళ్లి, అతిథులందరి సమక్షంలో మహాదేవుడిని దక్షుడు అవమానించినప్పుడు ఆశ్చర్యపోయి చాలా అవమానించారని బాధ పడింది.

ఆమె యాగ అగ్నిలో అడుగుపెట్టి తన జీవితాన్ని ముగించుకుంది. 


💠 ఈ విషయం తెలిసి పరమశివుడు చాలా బాధపడ్డాడు మరియు కోపానికి గురయ్యాడు. సతీ మాత దేహాన్ని తీసుకుని ఘోరమైన తాండవం చేశాడు. 

ప్రపంచాన్ని వినాశనం నుండి రక్షించడానికి, విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని శివుడి నుండి వేరు చేశాడు. 


💠 సతీ మాత శరీరం 51 భాగాలుగా నరికివేయబడింది. శరీర భాగాలు పడిపోయిన ప్రతిచోటా శక్తిపీఠం వచ్చింది.

ఈ విధంగా, ఈ భాగాలు పడిపోయిన ప్రదేశాలు పవిత్రమైన "శక్తిపీఠం"గా ఉద్భవించాయి.  ఇదంతా ఒకరి సాధారణ మేలు కోసమే జరిగింది.  

నైనా దేవి, జ్వాలాదేవి, కమాఖ్య మొదలైనవి 52 పవిత్ర శక్తిపీఠాలలో ఉన్నాయి. 


💠సతిదేవి యొక్క కుడి చీలమండ ఈ ప్రదేశంలో పడింది. ఈ ఆలయంలో నిర్మించిన బావిలో సతీదేవి కుడి చీలమండ పడింది, అందుకే ఈ ఆలయాన్ని శ్రీ దేవికూప్ ఆలయం అని కూడా పిలుస్తారు.


💠 భద్రకాళి శక్తిపీఠంలో  శ్రీకృష్ణుని ప్రస్తావన వచ్చినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. 

మహాభారత యుద్ధంలో విజయం సాధించడానికి పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ఇక్కడికి వచ్చారని కూడా నమ్ముతారు


💠 పాండవులు మరియు కౌరవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్రం అని మనందరికీ తెలుసు. మంచికి చెడుకి యుద్ధం ప్రారంభానికి ముందు, పాండవులు విజయం కోసం మా భద్రకాళిని ప్రార్థించారు. వారు రథాలు, గుర్రాలు మరియు సంపదను కూడా దానం చేశారు. 

దీని ప్రకారం ఒకరి కోరిక నెరవేరినప్పుడు, వారు తమ శక్తికి అనుగుణంగా మట్టి, వెండి లేదా ఇతర లోహాలతో చేసిన గుర్రాలను లేదా నిజమైన గుర్రాలు మరియు రథాలను సమర్పించే సంప్రదాయం ఆలయంలో ప్రబలంగా ఉంది.

 

💠 భద్రకాళి  ఆలయంలో కాళీమాత  పెద్ద  విగ్రహాన్ని ప్రతిష్టించారు మరియు మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే, ఒక పెద్ద తామరపువ్వు తయారు చేయబడింది, అందులో సతీ తల్లి కుడి పాదం యొక్క చీలమండ తెల్ల పాలరాయితో తయారు చేయబడింది. 

 


💠 భద్రకాళి శక్తిపీఠం ఆలయం లేదా 

సావిత్రి శక్తిపీఠ్ దేవాలయం యొక్క గర్భగుడిలో, భద్రకాళి మాత మూర్తిని, వస్త్రాలు మరియు నగలతో అందంగా అలంకరిస్తారు


💠 గర్భగుడిలో మాతా సరస్వతి, మాతా గాయత్రి మరియు ఇతరుల మూర్తులు కూడా ఉన్నాయి. ప్రక్కనే ఉన్న గదిలో, సీతా-రామ మరియు రాధా-కృష్ణ వంటి అవతారాలను చూడవచ్చు. 

ఆలయ మొదటి అంతస్తులో శివలింగాన్ని ప్రతిష్టించారు. 

గరుడుడిపై విష్ణువు తన సుదర్శన చక్రంతో మరియు సతీమాత శరీరాన్ని మోస్తున్న శివుని శిల్పాలు కూడా ఉన్నాయి. 


💠 నవరాత్రి మరియు మహా శివరాత్రి ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు.

నవరాత్రులలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నవరాత్రి సందర్భంగా ఆలయాన్ని నాలుగు టన్నుల స్వదేశీ, విదేశీ పుష్పాలు, ఎనిమిది క్వింటాళ్ల పండ్లతో అలంకరిస్తారు.

అంతే కాకుండా ఆకర్షణీయమైన దీపాలను ఏర్పాటు చేస్తారు



💠 కురుక్షేత్ర  నుండి దాదాపు 6 కి.మీ దూరంలో ఉంది.



© Santosh Kumar


⚜ శ్రీ దేవికూప్ భద్రకాళి శక్తిపీఠం



💠 నవరాత్రులలో శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

కురుక్షేత్రంలోని శక్తిపీఠం శ్రీ దేవికూప్ భద్రకాళి మందిర్‌లో మా సతీదేవి కుడి చీలమండ పడిపోయిందని నమ్ముతారు.  

అలాగే ఈ శక్తిపీఠంలో శ్రీ కృష్ణుడు బలరాముల శిరోముండనం కార్యక్రమం జరిగింది అంటారు.


 

💠 భద్రకాళి ఆలయం హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా తానేసర్‌లోని ఝాన్సా రోడ్డులో ఉంది.  భద్రకాళి ఆలయాన్ని శ్రీ దేవికూప్ ఆలయం అని కూడా అంటారు. 

ఈ ఆలయం దేవి యొక్క తొమ్మిది రూపాలలో ఒకటైన కాళీ దేవికి అంకితం చేయబడింది.  

ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.  


💠 శక్తిపీఠ్ శ్రీ దేవికూప్ భద్రకాళి మందిర్‌ను “సావిత్రి పీఠం”, “దేవి పీఠం”, “కాళికా పీఠం” లేదా “ఆది పీఠం” అని కూడా పిలుస్తారు. 


 

🔆 చరిత్ర 🔆


💠 సతీ మాత తన తండ్రి ప్రజాపతి దక్షుని ఇష్టానికి విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంది. 

ప్రజాపతిగా తన నియామకాన్ని జరుపుకోవడానికి,  దక్షుడు ఒక యాగాన్ని నిర్వహించాడు, అక్కడ అతను అన్ని దేవతలను ఆహ్వానించాడు, కానీ శివుడు మరియు అతని స్వంత కుమార్తెను ఆహ్వానించలేదు. 


💠 సతిదేవి ఆహ్వానం లేకుండా వెళ్లి, అతిథులందరి సమక్షంలో మహాదేవుడిని దక్షుడు అవమానించినప్పుడు ఆశ్చర్యపోయి చాలా అవమానించారని బాధ పడింది.

ఆమె యాగ అగ్నిలో అడుగుపెట్టి తన జీవితాన్ని ముగించుకుంది. 


💠 ఈ విషయం తెలిసి పరమశివుడు చాలా బాధపడ్డాడు మరియు కోపానికి గురయ్యాడు. సతీ మాత దేహాన్ని తీసుకుని ఘోరమైన తాండవం చేశాడు. 

ప్రపంచాన్ని వినాశనం నుండి రక్షించడానికి, విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని శివుడి నుండి వేరు చేశాడు. 


💠 సతీ మాత శరీరం 51 భాగాలుగా నరికివేయబడింది. శరీర భాగాలు పడిపోయిన ప్రతిచోటా శక్తిపీఠం వచ్చింది.

ఈ విధంగా, ఈ భాగాలు పడిపోయిన ప్రదేశాలు పవిత్రమైన "శక్తిపీఠం"గా ఉద్భవించాయి.  ఇదంతా ఒకరి సాధారణ మేలు కోసమే జరిగింది.  

నైనా దేవి, జ్వాలాదేవి, కమాఖ్య మొదలైనవి 52 పవిత్ర శక్తిపీఠాలలో ఉన్నాయి. 


💠సతిదేవి యొక్క కుడి చీలమండ ఈ ప్రదేశంలో పడింది. ఈ ఆలయంలో నిర్మించిన బావిలో సతీదేవి కుడి చీలమండ పడింది, అందుకే ఈ ఆలయాన్ని శ్రీ దేవికూప్ ఆలయం అని కూడా పిలుస్తారు.


💠 భద్రకాళి శక్తిపీఠంలో  శ్రీకృష్ణుని ప్రస్తావన వచ్చినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. 

మహాభారత యుద్ధంలో విజయం సాధించడానికి పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ఇక్కడికి వచ్చారని కూడా నమ్ముతారు


💠 పాండవులు మరియు కౌరవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్రం అని మనందరికీ తెలుసు. మంచికి చెడుకి యుద్ధం ప్రారంభానికి ముందు, పాండవులు విజయం కోసం మా భద్రకాళిని ప్రార్థించారు. వారు రథాలు, గుర్రాలు మరియు సంపదను కూడా దానం చేశారు. 

దీని ప్రకారం ఒకరి కోరిక నెరవేరినప్పుడు, వారు తమ శక్తికి అనుగుణంగా మట్టి, వెండి లేదా ఇతర లోహాలతో చేసిన గుర్రాలను లేదా నిజమైన గుర్రాలు మరియు రథాలను సమర్పించే సంప్రదాయం ఆలయంలో ప్రబలంగా ఉంది.

 

💠 భద్రకాళి  ఆలయంలో కాళీమాత  పెద్ద  విగ్రహాన్ని ప్రతిష్టించారు మరియు మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే, ఒక పెద్ద తామరపువ్వు తయారు చేయబడింది, అందులో సతీ తల్లి కుడి పాదం యొక్క చీలమండ తెల్ల పాలరాయితో తయారు చేయబడింది. 

 


💠 భద్రకాళి శక్తిపీఠం ఆలయం లేదా 

సావిత్రి శక్తిపీఠ్ దేవాలయం యొక్క గర్భగుడిలో, భద్రకాళి మాత మూర్తిని, వస్త్రాలు మరియు నగలతో అందంగా అలంకరిస్తారు


💠 గర్భగుడిలో మాతా సరస్వతి, మాతా గాయత్రి మరియు ఇతరుల మూర్తులు కూడా ఉన్నాయి. ప్రక్కనే ఉన్న గదిలో, సీతా-రామ మరియు రాధా-కృష్ణ వంటి అవతారాలను చూడవచ్చు. 

ఆలయ మొదటి అంతస్తులో శివలింగాన్ని ప్రతిష్టించారు. 

గరుడుడిపై విష్ణువు తన సుదర్శన చక్రంతో మరియు సతీమాత శరీరాన్ని మోస్తున్న శివుని శిల్పాలు కూడా ఉన్నాయి. 


💠 నవరాత్రి మరియు మహా శివరాత్రి ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు.

నవరాత్రులలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నవరాత్రి సందర్భంగా ఆలయాన్ని నాలుగు టన్నుల స్వదేశీ, విదేశీ పుష్పాలు, ఎనిమిది క్వింటాళ్ల పండ్లతో అలంకరిస్తారు.

అంతే కాకుండా ఆకర్షణీయమైన దీపాలను ఏర్పాటు చేస్తారు



💠 కురుక్షేత్ర  నుండి దాదాపు 6 కి.మీ దూరంలో ఉంది.