9, జనవరి 2021, శనివారం

ప్రవర

 *ప్రవర ఎలా చెప్పాలి...?*


*1) భగవంతుని ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో కుడి చెవిని, ఎడమ చేత్తో ఎడమ చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*

*2) మానవుల ముందు ప్రవర చెప్పేటప్పుడు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని ముందుకు వంగి చెప్పవలెను.*

*3) చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు /సజ్జనేభ్యః శుభం భవతు. ఆయా సందర్భానుసారంగా చెప్పవలెను.*


*ఋషి1_________, ఋషి 2_______,ఋషి 3_________త్రయార్షేయ ప్రవరాన్విత, _________గోత్రద్భవస్య, _________సూత్రం _______ శాఖాధ్యాయిః _______(పేరు) శర్మణ్ అహంభో అభివాదయే, అభివాదయామి.*

🦜🦜🦜🅰️🦜🦜🦜

*ఓం🕉️భారతీయ సంస్కృతి*


*కొన్ని బ్రాహ్మణ  గోత్రాలు మరియు వాటి ప్రవరలు..*


*1. భరద్వాజ :*


ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య


*2. వాథూలస :*


భార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య


*3. శ్రీవస్త లేక శ్రీవత్స :*


 భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా ఋషేయ ప్రవరాణ్విత శ్రీవత్సస గోత్రస్య


*4. శ్యాలంకాయన :*


 విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవరత త్రయా ఋషేయ ప్రవరాణ్విత శ్యాలంకాయనస గొత్రస్య


*5. షతమర్షన:* 


ఆంగిరస, ఫౌరుకుత్స, త్రాసతస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత షతమర్షనస గోత్రస్య


*6. ఆత్రేయ:* 


ఆత్రేయ, ఆర్చనాస, శ్యావాస్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆత్రేయ గోత్రస్య


*7. కౌషిక:*


 విశ్వామిత్ర, ఆఘమర్షన, కౌసిక త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌషిక గొత్రస్య


*8. ఖలబొధన/ఖలభవస (రెండు రకాలు)*


1. ఖలబొధన: విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలబొధన త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలబొధన గోత్రస్య


2. ఖలభవస:


విశ్వామిత్ర, ఆగమర్షన, ఖలభవస త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఖలభవస గొత్రస్య


*9. విశ్వామిత్ర:* 


విశ్వామిత్ర, దేవరత, ఔతల త్రయా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర గోత్రస్య


*10. కౌండిన్య:* 


వాసిష్త, మైత్రావరుణ, ఖౌందిన్యస త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌండిన్యస గోత్రస్య


*11. హరితస:* 


ఆంగిరస, అంబరిష, యువనశ్వ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత హరితస గోత్రస్య


*12. గౌతమస :* 


ఆంగిరస, ఆయస్య, ఆఔశిద్యస, కాక్షివత, వమదెవ, గ్రిహదుగ్ద, గౌతమస – సప్తా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య


*13.ఔద్గల్య (మూడు రకాలు)*


1. ఆంగిరస, భర్మ్యశ్వ, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


2. తర్క్ష్య, భార్మ్యశ్వ, మౌద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


3. ఆంగిరస, ఢవ్య, ఔద్గల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఔద్గల్య గోత్రస్య


*14. శందిల్య (మూడు రకాలు)*


1. కాశ్యప, అవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


2. కాశ్యప, ఆవత్సార, శాందిల్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


3. కాశ్యప, దైవల, ఆసిత త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


*15. నైత్రువకాశ్యప:*


కాశ్యప, ఆవత్సర, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత నైత్రువకాశ్యపస గోత్రస్య


16. కౌత్స: ఆంగిరస, మాంధత్ర, కౌత్స త్రయా ఋషేయ ప్రవరాణ్విత కౌత్సస గోత్రస్య


*17. కన్వ (రెండు రకాలు)*


1. ఆంగిరస, ఆజమీద, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య


2. ఆంగిరస, కౌర, కన్వ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కన్వస గోత్రస్య


*18. పరాసర:* వాశిష్త, శాక్త్య, పరాసర త్రయా ఋషేయ ప్రవరాణ్విత పరాసరస గోత్రస్య


*19. అగస్త్య:* అగస్త్య, తర్ధచ్యుత, శౌమవహ త్రయా ఋషేయ ప్రవరాణ్విత అగస్త్యస గోత్రస్య


*20. ఘర్గి (రెండు రకాలు)*


1. ఆంగిరస, బర్హస్పత్య, భారద్వజ, ఉపాధ్యయ త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య


2. ఆంగిరస, శైన్య, గార్గ్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగిరసస గోత్రస్య


*21. బాదరాయణ:*


 ఆంగిరస, ఫార్షదశ్వ, ఋతితర త్రయా ఋషేయ ప్రవరాణ్విత బాదరాయణ గోత్రస్య


*22. కశ్యప (మూడు రకాలు)*


1. కాశ్యప, ఆవత్సార, దైవల త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


2. కాశ్యప, ఆవత్సార, నైత్రువ త్రయా ఋషేయ ప్రవరాణ్విత కాశ్యపస గోత్రస్య


3. కాశ్యప, ఆవత్సార, నైత్రువ, రేభ, రైభ , శాందిల, శాందిల్య సప్తా ఋషేయ ప్రవరాణ్విత కాశ్య్పస గోత్రస్య


*23. సుంక్రితి లేదా శాంక్రిత్య గోథ్ర (రెండు విధాలు)*


1. ఆంగిరస, కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య


2. శధ్య ,కౌరవిధ, శాంక్రిత్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాక్రిత్యస/సుంక్రిత్స గోత్రస్య


*24. ఆంగీరస :* 


ఆంగీరస, ఫురుకుత్స్య, ఠ్రాసదస్య త్రయా ఋషేయ ప్రవరాణ్విత ఆంగీరస గోత్రస్య


*25. గౌతం/గౌతమస :*


 అంగీరస, ఆయస్య, గౌతమస త్రయా ఋషేయ ప్రవరాణ్విత గౌతమస గోత్రస్య


*26. అగ్నివైవశ్వత:*


 ఆంగీరస, భార్హస్పత్స్య, భారద్వాజ, శ్రుక్వ, ఆగ్నివైవశ్వత పంచాఋషేయ ప్రవరాణ్విత అగిన్వైవశ్వత గోత్రస్య


*27. శాంఖ్యాయన:*


 విశ్వామిత్ర, ఆఘమర్షన, దేవవ్రథ శాంఖ్యాయన త్రయా ఋషేయ ప్రవరాణ్విత శాంఖ్యాయన గోత్రస్య


*28. విశ్వామిత్ర:* 


శ్రౌమిత, ఖామకయన, దేవతరస, దేవరత,పంచా ఋషేయ ప్రవరాణ్విత విశ్వామిత్ర


*29. కపి:* 


ఆంగీరస, అమాహైయ, ఔరుక్షయ, త్రయా ఋషేయ ప్రవరాణ్విత కపిస గోత్రస్య.

🦚🦚🦜🅰️🦜🦚🦚

విదుర నీతి*

 *విదుర నీతి*


జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.

ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.

రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.

సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!

జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.

మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.

‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.


సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

దారంతో కట్టిన పూలు

 దారంతో కట్టిన పూలు


చెన్నై నుండి ఒక భక్తుడు చాలా పూలు తెచ్చి శ్రీమఠంలో ఒక పెద్ద రాశిగా పోసాడు. అందులో చాలా రకాలైన పూలు ఉన్నాయి, గుబురుగా కట్టిన మల్లెదండలు, పరిమళం వెదజెల్లే చాలా రకాలైన రంగురంగు పూలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన దండలు ఉన్నాయి. కాని, వాటిని శ్రీచంద్రమౌళీశ్వరునకు అలంకరించడానికి పనికిరావు. ఆ పూలదందలన్నీ దారంతో కట్టబడ్డాయి అరటి బెరడు దారంతో కాదు. శ్రీమఠంలో దారంతో కట్టిన మాలలను చంద్రమౌళీశ్వరునకు అలంకరించరు. ఆ భక్తుని నిరాశ మాటలలో చెప్పలనవి కాదు. అతను చాలా ప్రయాసతో ఆ పూలను తెచ్చాడు కాని ఒక చిన్న మల్లె దండ కూడా అలంకారానికి పనికిరాదు.


పరమాచార్యస్వామి వారు పూజ ముగించుకుని బయటకు వచ్చారు. వెళ్తూ బుట్టలలో ఉన్న పూలను చూసారు.


మహాస్వామి వారు పరిచారకులతో ”వీటిని ఎందుకు పూజకు తీసుకుని రాలేదు?’ అని అడిగారు.


”వాటన్నింటిని దారంతో కట్టారు” అని చెప్పారు.


వాటిని తెచ్చిన ఆ భక్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. తన అజ్ఞానానికి స్వామి వారు ఏమంటారో అని కొంచం ఆందోళనగా ఉన్నాడు. కాని మహాస్వామి వారు కరుణా సముద్రులు.


”దారంతో కట్టిన పూలు స్వామి అలంకరణకు పనికిరావు. కాని నాకు పనికివస్తాయి” అని అన్నారు.


అక్కడున్న భక్తులు ఆనందపడ్డారు. పరమాచార్య స్వామి వారు ఒక చెక్క పీఠంపైన కూర్చున్నారు. తెచ్చిన పూలను మాలలను స్వామి వారికి అలంకరించారు. అది చూడడానికి పూలంగి సేవ లాగా కనపడింది. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు.


”సాక్షాత్ తిరుపతి వెంకటాచలపతి” అన్నాడొక భక్తుడు.


”సాక్షాత్ తిరుచెదూర్ మురుగన్” అన్నారు మరొకరు.


”సాక్షాత్ కంచి కామాక్షియే” అన్నారింకొకరు.


ఒక వేదాంతి పారవశ్యంతో అన్నాడు. “ఈ ప్రపంచం జగన్ మిథ్య అని చెప్పేవారందరూ ఒక్క క్షణం అలోచించండి. ఈ క్షణం వాస్తవం సత్యం. బ్రహ్మం సత్యం. దేవుడు ఉన్నాడు అన్నది నిజం (సగుణ బ్రహ్మం పరమ సత్యం). దేవుడు గుణాహితుడై పరిపూర్ణ గుణములచేత ప్రకాశించి ఉన్నాడు. పెరియవ... రూపహితుడైన దేవుడు. దైవం మానవ రూపంలో అన్నది నిజం (సగుణం ... సద్గుణం). గుణముల చేత ప్రకాశించువారే శ్రేష్టమైనవారు. పెరియవ సగుణబ్రహ్మం... బ్రహ్మానందం”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

ఉత్తమజ్ఞానం

 *📖 మన ఇతిహాసాలు 📓*



*ఉత్తమజ్ఞానం*


పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు.


తిరిగి తిరిగి అలసిపోయిన పులస్త్యుడు ఒకనాడు ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పులస్త్యుడు అక్కడే కూర్చుని తదేకంగా చూడసాగాడు. మరు సటి రోజు భారీ వర్షం కురిసి విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి.


రైతు మళ్లీ వేరే విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ తర్వాత వర్షమే పడలే దు. రైతు దూరంగా బావి నుంచి నీళ్లు తోడి పోశాడు. కానీ బావి కూడా ఎండిపోయింది. రైతు పట్టువిడవకుండా ఇంకా ఎంతో దూరంలో వున్న నది నుంచి నీళ్లు తెచ్చిపోయసాగాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తాయి. పంట దండిగా పండింది. రైతు హాయి గా పంట కోసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పులస్త్యుడికి అసలు విషయం అర్థమైంది.


ఉత్తమజ్ఞానం ఎక్కడో లేదు, మనచుట్టూ కనిపించే ప్రతి దానిలోనూ వుంటుంది. అదే రైతు తనకు ఇచ్చిన ఉపదేశంగా భావించాడు పులస్త్యుడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

తెలివైన రైతు

 *✍🏼 నేటి కథ ✍🏼*



*తెలివైన రైతు*



రాజా విజయేంద్రవర్మ తన పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక రోజు రాజ్యంలో పర్యటిస్తున్నాడు. పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతును "నువ్వు సంపాదించే దానితో సంతోషంగా ఉన్నావా?" అని అడిగాడు. "సంతోషంగా ఉన్నాను రాజా! నేను రోజుకు ఒక రూపాయి మాత్రమే సంపాదిస్తాను. దానిలో 25 పైసలు తింటాను. మరో 25 పైసలు అప్పుగా ఇస్తాను. మరో 25 పైసలు రుణం చెల్లిస్తాను. మిగిలిన 25 పైసలు పడవేస్తాను" అని చెప్పాడు రైతు.


"అయినా నీవు సంతోషంగా ఉన్నావని ఎలా చెప్పగలవు?" అడిగాడు రాజు. "రాజా! నా మొదటి 25 పైసలు నా కుటుంబ సభ్యులు ఆహారానికి, రెండో 25 పైసలు నేను పిల్లలపై ఖర్చ చేస్తాను కాబట్టి అది నా భవిష్యత్తుకు బీమా వంటిది. మరో 25 పైసలు నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తాను. వారి రుణం తీర్చుకోవడానికంటే సంతోషం ఏముంటుంది. చివరి 25 పైసలు నేను బీదవారికి దానం చేస్తాను.


రైతు చెప్పిన దానిని విని రాజు సంతోషించాడు. అతనికి ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చి, "నా మొహం వందసార్లు చూసే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పవద్దు" అని రాజు దర్బారుకు చేరుకున్నాడు.


రైతు చెప్పిన చిక్కు ప్రశ్నను రాజు తన దర్బారులో వారి ముందు ఉంచాడు. జవాబు చెప్పిన వారికి మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఒక తెలివైన అధికారికి రాజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ రైతును కలిశాడన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే రైతు దగ్గరకెళ్ళి అతనికి బంగారు నాణాల మూట ఇచ్చి తిరిగి నగరానికి చేరుకున్నాడు.


మర్నాడు ఉదయం ఆ రైతు కూడా దర్బారుకు వచ్చాడు. ఆ తెలివైన అధికారి చక్కగా చిక్కు ప్రశ్నలకు జవాబును వివరించాడు. అంతే, కోపంతో ఊగిపోతు రాజు "నీకెంత ధైర్యం! నా మొహం వందసార్లు చూపిన తరువాత గాని జవాబు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పానుగా! అని రైతు మీద ఆగ్రహించాడు.


"రాజా! మీ మాటలను నేను జవదాటలేదు. ఈ అధికారి గారు నాకు వంద బంగారు నాణాలు ఉన్న ఒక మూటను ఇచ్చారు. నాణాలపై మీ బొమ్మ ముద్రించి ఉంది. కాబట్టి నేను వందసార్లు మీ మొహం చూసిన తరువాత గాని ఈ జవాబు అధికారికి చెప్పలేదు" అని వివరించాడు రైతు.


రాజు తన అధికారి తెలివికి, రైతు మేధస్సుకు సంతోషించి వారిద్దరినీ సత్కరించాడు. 


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

గురు మర్యాద

 🌹గురు మర్యాద !🌹


        దేవతలలో త్వష్ట అనే వాడు తన తపోశక్తితో మూడతలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవి కోరి ఘోరతస్సు చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకుబెళుకులకు లొంగక పోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయం ఒక సంవత్సరం పాటు రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆవిషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు, అతడు బ్రహ్మహత్యా పాతకం చేసాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచి పెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేసాడు.


        ఇది తెలిసిన త్వష్ట కోపించి, ఇంద్రుడిని చంపడానికి వృత్తాసురుడిని సృష్టించాడు. అధిక బల సంపన్నుడైన వృత్తాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలు శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్ళి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్ధించారు. 


        “మీరు వెళ్ళి ఇంద్రుడికి వృత్తుడికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంత మయ్యేలా చేస్తాను " అన్నాడు. 


        ఋషులంతా వృత్తాసురుడి వద్దకు వెళ్ళి


         "ఇంద్రుడు అజేయుడు నీవా అధిక బలశాలివి మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు కనుక ఇంద్రుడితో మైత్రి చేసుకో " అని నచ్చచెప్పారు. 


        దానికి వృత్తాసురుడు అందుకు అంగీకరిస్తూ...


        "బదులుగా నాకు ఒక వరం ప్రసాదించండి. నేను తడిసిన దానితో కాని ఎండిన దానితో కాని రాత్రి కాని పగలు కాని సంహరించబడకూడదు. అందుకు ఒప్పుకుంటే ఇంద్రుడితో సంధి చేసుకుంటా" అన్నాడు. 


        ఆ మేరకు ఒప్పందం కుదిరింది.


        కానీ ఇంద్రుడు మాత్రం అతడిని సంహరించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు అసుర సంధ్యలో సముద్రతీరంలో విహరిస్తున్న వృత్తాసురుడిని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువుని ప్రార్ధించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సాయంతో వృత్తుని సంహరించాడు


        దేవేంద్రుడికి వృత్తాసుర సంహారం చేయడం వలన మరల బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంది. ఒక సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును ఇతరులకు పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం మాత్రం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి, కుష్ఠు వ్యాధి చేత పుండ్లు పడిపోయి, ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. 


        అది బ్రహ్మహత్యాపాతక స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగు పెడుతూ అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకు వెళ్ళినా విడిచి పెట్టలేదు. అప్పుడు ఇంక దారిలేక ఇంద్రుడు ఈశాన్య దిక్కుపట్టి పరుగెత్తి మానస సరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. 


        అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేక పోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్న ఒక తామరపువ్వు గుండా తామర నాళం లోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. 


        అలా ఇంద్రుడక్కడ వేయి సంవత్సరాలు ఉన్నాడు. ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకోనక పోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు. ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు. 


        ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేలోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఇంద్రపదవి ఖాళీగా ఉండటం వల్ల ఆ పదవిలోకి తాత్కాలికముగా అనేక యాగాలు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. 


        ఇంద్ర పదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి ఆలోచన పుట్టింది. అదేమిటంటే.....


         ‘ఇంద్రపదవి ఒకటీ ఇచ్చి వదిలిపెడితే ఎలా ?! శచీదేవి కూడా నాది కావాలి కదా !’ అనుకుని-


        “ప్రస్తుతం నేనే ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు" అని శచీదేవికి వర్తమానం పంపాడు. 


        అది వినగానే శచీదేవికి చిర్రెత్తుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మవారికి నమస్కరించింది. లలితా సహస్రంలో అమ్మవారికి "పులోమజార్చిత" అని పేరు ఉంది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలితా పరాభట్టారిక అర్చింప బడుతూ ఉంటుంది. భార్య చేసే పూజల వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. 


        అందుకని శచీదేవి పూజల వలన ఇంద్రుడు ఇంద్రపదవిలో ఉన్నాడు. భర్త చేసిన దోషంతో భార్యకు సంబంధం లేదు కాబట్టి బృహస్పతి ఈమెకు దర్శనం ఇచ్చి 


        "అమ్మా! దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో అలాగే వీడితోటి ఒక అపచారం చేయించు. కాబట్టి నహుషుడిని సప్తర్షులు మోస్తున్న పల్లకిలో రా ! నీవు నాకు భర్తవు అవుదువు గాని అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి అయ్యో, ఈ పని చేయ్యొచ్చునా లేదా అని ఉండదు. సప్తర్షులను పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు” అని చెప్పాడు. 


        బృహస్పతి చెప్పిన విధంగానే నహుషుడుకి కబురు పంపింది. అతడు సప్తర్షులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి ఉన్నారు.


        ఆయన మహాశక్తి సంపన్నుడు. కొంచెం పొట్టిగా ఉంటాడు. అందువల్ల ఆయన అడుగులు గబగబా వేయడం లేదు. నహుషుడు లోపలినుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో...


         “సర్ప సర్ప (నడు నడు)” అని ఆయనను హుంకరించి డొక్కలో తోశాడు. అగస్త్యుడికి కోపం వచ్చింది. నహుషుడి వంక చూసి...


        “చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక పోతున్న వాడిని అయిన నన్ను "సర్ప సర్ప" అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండచిలువవై భూలోకంలో పడిపో" అని శపించాడు.


        వెంటనే నహుషుడు కొండచిలువయి క్రిందపడ్డాడు. ఇపుడు మళ్లీ ఇంద్రపదవి ఖాళీ అయింది. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరకు వెళ్ళారు. వెయ్యి సంవత్సరాలు తపించిన ఇంద్రుడి శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. 


        పూర్తి నివారణ కాలేదు. అప్పుడు ఇంద్రుడిని తీసుకు వచ్చి అశ్వమేధ యాగం చేయించారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాపపరిహారం చేశాడు. ఏది చేసినా భగవానుడే చేయాలి. అందుచేత ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు పాత్రుడయ్యాడు. 


        బ్రహ్మహత్యా పాతకం నివారణయ్యి మరల వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషముగా గురువును సేవిస్తూ కాలమును గడిపాడు. 


        ఇంద్రపదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి అనేది దీని ద్వారా తేటతెల్లమవుతోంది.


                                  🌺🌼🌺

మనిషి విలువ

 ( మనిషి విలువ )


మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?


🌺 మనిషి " రంగూ , రూపూ " చూసి  మాత్రం " విలువ " ఇవ్వరు.!!

🍀కేవలం బాగున్నారు అన్న " ప్రశంస "  దక్కుతుంది .!!


 💐అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.!!

🥀వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని 

       " అణుకువ " నటిస్తారు.

                    అంతవరకే.!!!


🌺పదవి , పలుకుబడి , చూసినా , అవి   ఉన్నన్ని రోజులూ చుట్టూ  తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు వాడుకుందామని 

పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే 

ఒక్కడూ ఉండడు.

                   "ఇది నిజం"


🍀 కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత 

గొప్పగా చెబుతారు.!

కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!!


🌺మనిషి " విలువ " పొందాలంటే   ఉండవలసినవి 

     కరుణ,

      దయ,

      ప్రేమ ,

       జాలి ,

    సేవాభావం ,

  సాయపడాలనే తపన ,

      మంచి మనసు ,

       తెగింపు ,

    విశాలహృదయం ,

          ఉండాలి.!!!


  పై లక్షణాలు మనకు ఉంటె


               " విలువ " 


🌿మనం పిలవకుండానే 

    మన దగ్గరకు  వస్తుంది.!!!.

                         

     🌺☕శుభోదయం ☕🌺

🙏 స్త్రీ మూర్తులకి ఇవి అవసరం 🙏

 🙏 స్త్రీ మూర్తులకి ఇవి అవసరం 🙏


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


1. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.


2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..


3. అరికాలు లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు..


4. తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది..


5. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం , బైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..


6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది.


7. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.


8. తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తల లో ఎదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి. 


9. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడ కూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకో కూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు..


10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..


11. కుటుంబ సభ్యులు దగ్గర  ఏది దాపరికం ఉండకూడదు..


12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్దతులు .


13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి , అమంగళం పలక కూడదు..పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికి న వస్తువులు తెచ్చి దాచ కూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది..


14. గొరోజనం వశీకరణకువాడుతారు మీకు తెలియని  కొత్త వారి నుండి  మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. 


15. చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ల కూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో  ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు...🙏


🙏గోవిందా గోవిందా 🙏

గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు*

 *ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు*


🌺మన దేశంలోని కొన్ని ఆలయాల గర్భగుడుల లోనికి కొందరిని రానిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చు - అని కొందరంటారు.


🌺కానీ కొన్ని ఆలయాలలో గర్భగుడిలోనికి వెళ్ళక పోవడం నియమం. అది శాస్త్రాలు ఏర్పరచినది. ఏ వర్ణంవారు కూడా గర్భగుడిలోనికి రారు. దానికంటూ నియమించిన అర్చకులు తప్ప. దీని వెనుక భౌతిక - ధార్మిక కారణాలున్నాయి.


🌺మూర్తిని తాకాలన్నా, అర్చించాలన్నా సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం. అవి అందరికీ సాధ్యం కావు.


🌺“సదాచారం లేనివారు, రజస్వలయైన వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం/లింగంలోని దైవశక్తి ఇంక ఉండదు. వెంటనే ప్రోక్షణాదులు జరపాలి. లేకపోతే క్రమంగా ఆ విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తాయి.


🌺ఆ గ్రామ, నగరాలలో ఉపద్రవాలు వస్తాయి. వ్యాధులతో , శోకాలతో ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయి" - అని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది.


🌺సంప్రోక్షణం ప్రకుర్వీత

తద్దోషస్యోపశాంతయే|

దోషైరుపహతం జ్ఞాత్వా

ప్రాసాద ప్రతి మాదికం|| (ఈశ్వర సంహిత)


🌺విలంబనే తు నిష్కృత్యా

వినశ్యేద్దేవ సన్నిధిః|

తత్స్థాః ప్రేతా భయం కుర్యుః

వ్యాధి శోకాదిభిర్నృణామ్|| (విష్ణు సంహిత)


🌺ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే, వీటినీ విశ్వసించాలి. విగ్రహాన్ని దేవతా శక్తిగా మార్చడం ఒక మహా ప్రక్రియ. ప్రతిమాశోధన - అనేది మంత్ర, యజ్ఞాదులతో చేసి, యంత్రాది, ప్రతిష్టాది విధానాలతో ఆ బింబంలో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తారు. వాటిని స్పర్శించా లన్నా, అర్చించాలన్నా ఆయా నియమాలను అనుష్టించే వారికే అర్హత ఉంటుంది.


అయితే దేవాలయంలోని మూర్తిని తాకవలసిన అవసరమేముంది? నమస్కరిస్తేచాలు - ఆ మూర్తినుండి శక్తి తరంగాలు ప్రసరిస్తాయి. ధ్యానిస్తే చాలు - తరించిపోతాం. అందుకే - గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం-వంటివి అంద రూ దర్శించి అనుగ్రహం పొందడానికై ఏర్పాటు చేశారు. యుగాలనుండి అందరూ ఆలయానికి వెళ్ళి స్వామి దయను పొందుతున్నారు.


🌺భౌతికంగా ఆలోచించినా - గర్భాలయంలోకి జనం ఎక్కు వైనా, అందరూ తాకుతున్నా ప్రశాంతత దెబ్బతినడం, విగ్రహ శిల అరిగిపోవడం వంటివి జరుగుతాయి. కొద్దిమంది నియమితంగా సేవిస్తే- అవి పదిలంగా ఉంటాయి.


🌺స్థూలంగా ఆలోచిస్తే అసమంజసంగా అనిపించేవి, సూక్ష్మం గా గమనిస్తే సముచితంగా అనిపిస్తాయి. ఆ సూక్ష్మదృష్టి, తెలివిలేని మూర్ఖులు మన మతాన్ని విపరీత దృష్టితో చూస్తున్నారు. వైద్యచికిత్సా కేంద్రాలలో శస్త్రచికిత్సవంటివి జరిగేచోట వైద్యుడు, రోగి తప్ప ఎవరూ ఉండరు. ఎందుకు? అది ఒక సూక్ష్మ విజ్ఞానం. అలాగే దేవతా వ్యవస్థది మరొక సూక్ష్మవిజ్ఞానమే. నమ్మితే ఈ విజ్ఞానాన్నీ నమ్మాలి.


🌺సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఏ పరిమితులు, నియమాలు ఉండవు. ఎవరైనా, ఎక్కడైనా, ఎలాగైనా స్మరించి, ధ్యానించి, కీర్తించి ధన్యులు కావచ్చు. కానీ ఒక విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తిస్తాయి.

  🙏🙏🙏🙏🙏

కలియుగ రక్షణ కవచము

 _*కలియుగ రక్షణ కవచము*_ 🙌


*ఇది ప్రతి రోజు చదివిన వారికి దైవానుగ్రహముతో ఏది కొదవ లేకుండా, కలిమాయాశక్తుల నుండి రక్షణ కలుగుతుంది.* 


ఈ శుభ సమయంలో నేను అత్యంత పవిత్రమైన *కలియుగ రక్షణ కవచము* ను పఠిస్తున్నాను. నాకు నా జన్మ నక్షత్ర, నామ నక్షత్ర, ప్రస్తుత కాల దశ రీత్యా, గోచార రీత్యా నాకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, నా విద్యాభ్యాసములో అభివృద్ధిని, జీవితంలో ఉన్నత స్థితిని పొందాలని మరియు నేటి *కరోనా* లాంటి అనేక వ్యాధుల నుండి నేను తట్టుకోగలగాలని, ఈ కలుషిత వాతావరణంలోని చెడు సూక్ష్మ జీవుల నుండి రక్షింపబడాలని ఈ కలియుగ రక్షణ కవచమును పఠిస్తున్నాను. 


లోకజనని మాతా గోవిందమాంబ దేవి సమేత జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహము మాకు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. 🙏


ఆరవ రోజు.. 


*49) ఆలీ అరటి పండు తల్లి తలపై గుండు*

 *కలికాల పురుషులను తెలియండయా*


*50) తల్లి యెవరో తెలియదు నన్నేల తెలియరు*

*కామాంధులై కాలిపోయేరయా*


 *51) ఆకలి తీరని ఆశా పిశాచిని*

 *నమ్మినా నిను మ్రింగి పోయేనురా*


*52) ఆశకు దాసుడు అందరికీ దాసుడే*

 *ఆశ లేని వాడే మహనీయుడురా*


*53) ఆస్తిపాస్తుల కొరకు ఆలు బిడ్డల కొరకు*

*యేడ్చేటి అజ్ఞాను లున్నారయా*


*54) దైవంబు తలచుకొని యేడ్చేటి జ్ఞానులు*

 *ధన్యులై నరకంబు  దాటేరయా*


*55) మంత్ర యుగమే పోవు నువ్వు యంత్ర యుగమే వచ్చు*

 *యంత్ర యుగ మానవులు బ్రతికేరయా*


*56) సూర్యుని శక్తితో సర్వంబు నడిచేటి*

 *రోజులే వచ్చేను తెలియండయా*


*57) కృష్ణమ్మ కసి బెట్టి కనకదుర్గమ్మను*

 *ముక్కు పోగు వరకు నీటిలో ముంచేను*


*58) కనకదుర్గ లేచి వాడ వాడల తిరుగు* 

*అది చూచి పాపులు హడలి  సచ్చేరయా*


*59) జోల పాటలు పాడు స్త్రీల కన్నుల నుండి*

 *రక్తంబు గారెేను నమ్మండయా*


 *60) చంటి బిడ్డకు పాలు ఇవ్వకపోయిన తల్లి*

 *స్థనములో రక్తం కారేనయా*


(రోజు కొన్ని) 


_*లోకాసమస్తాః సుఖినోభవంతుః సర్వేసుజనాః సుఖినోభవంతుః*_🙏


_*హరిః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామియే నమః*_🌹🙏🌹

పంచముఖ హనుమాన్

 పంచముఖ హనుమాన్


మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని చేధించుకుని అందరి కళ్లుగప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకు పోతాడు మైరావణుడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. 


మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకొంటాడు. దాని కోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు.


పంచ అంటే అయిదు. ఐదు అనే సంఖ్య పంచ భూతాలకు సంకేతం. మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. స్వామివారి పంచ ముఖాల్లో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ద్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఈ ఐదు రూపాలు అభయాన్నిస్తాయి.

క్షమాగుణం


క్షమాగుణం:-

మన మనసులో రెండు వైరుధ్య భావాలుంటాయి. ఒకటి క్షమించడం. రెండోది పగతీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. అదే 'కురుక్షేత్రం'. క్షమ గెలిస్తే హృదయం ఆనందమయం. మనసులో అంతులేని సంతోషం. మనిషికి తృప్తి. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం. 'గుండెలో పగ దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది భారతం. పగవల్ల పగపోదనీ, ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్స అనీ భారత మహేతిహాస ఉద్బోధ!


'నా కన్ను నువ్వు పొడిస్తే నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్నుకు కన్ను పన్నుకు పన్ను' సిద్ధాంతంతో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా గుడ్డివాళ్లతో, బోసినోటివాళ్లతో నిండిపోతుంది. ఈ పగ, ప్రతీకారం అనే విషచక్రం నుంచి బయటపడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం. ఇందువల్ల రెండు లాభాలు. ఒకటి- క్షమించేవారు ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడిగా మార్చేస్తుంది. 'పొరపాటు మానవ సహజగుణం, క్షమ దైవ విశిష్టగుణం' అని ఆంగ్ల సామెత. మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు.


ఏకనాథుడు పాండురంగడి భక్తుడు. ప్రశాంతచిత్తుడు. సదా స్వామి సేవలో, భజనలో కాలం గడిపేవాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడ్డారు. ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు. ఏకనాథుడు రోజూ తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మి వేశాడు. ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో, చిరునవ్వు చెరగనీయకుండా వెనక్కి వెళ్లి నదీస్నానం ఆచరించాడు.. ఇలా మొత్తం నూట ఏడుసార్లు జరిగింది. ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడకుండా, మందస్మిత వదనంతో అన్నిసార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు. దీంతో ఆ కుటిలుడి హృదయం చలించిపోయింది! 


ఆయన ఏకనాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజంగా దైవస్వరూపులు. మీ నిగ్రహం చెడగొట్టి, ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు. మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశచూపారు. మీ క్షమాగుణం తెలియక నేనీ నీచకృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో. ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.


'నాయనా, నీవు నాకెంతో మేలుచేశావు. నాచేత నూట ఎనిమిదిసార్లు పవిత్ర నదీస్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచిపోను!' ఏకనాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్నుడయ్యాడు. ఆ భక్తాగ్రేసరుడి క్షమాగుణం ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు.


క్షమ అంటే భూమి. భూమి ఓర్పుగల తల్లి కనుకనే మనం ఎంత బాధపెట్టినా భూమాత మనపై పగ తీర్చుకోవాలనుకోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదేపనిగా హింసించకూడదు. క్షమాగుణానికీ హద్దులుంటాయని గుర్తుంచుకోవాలి!


 క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు. ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థులైన మహాపురుషులెందరో ఉన్నారు. ఆర్యసమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపైంది. 


ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి, ఆహారంలో విషం పెట్టించారు. దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు. తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో!


 నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతకనీయరు!'

తనకు ప్రాణహాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణదానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు. పగతీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే! నిజానికి అభద్రత మిగులుతుంది. చిత్తవికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.

స్వస్తి🙏🙏🙏🙏

సరస్వతి

 సరస్వతి*

                  ➖➖➖✍️


సరస్వతి అంటే చదువులతల్లి. సరస్వతి అంటే అంతర్వాహిని అయిన ఒక పుణ్యనది. సరణం అంటే విస్తరించడం. ఇది నదికి సహజమే. అనేక సరస్సులు కలిగింది సరస్వతీనది. జ్ఞానాత్మకమైన చదువు ఒకచోట స్తబ్ధంగా ఉండదు. జ్ఞానం కాంతి వంటిది. అది అంతటా విస్తరిస్తుంది. ఇలా విద్యాదేవతగానూ నదీమాతగానూ ‘సరస్వతి’ అనే పదం సార్థకం. సరస్వతీనది పైకి కనిపించదు. భూమిపొరల్లోనుంచి ప్రవహిస్తుంది. జ్ఞానం కూడా పైకి కనిపించదు. మెదడునుంచి నిరంతరం ఉద్భవిస్తూనే ఉంటుంది.


విద్యాధిదేవత అయిన సరస్వతిని పుస్తక రూపిణిగా ఆరాధిస్తారు. పుస్తకమే సరస్వతీ స్వరూపం. పుస్తకం చేతిలో ఉంటే విద్యాదేవత కరతలంలో ఉన్నట్లే. 


బ్రహ్మదేవుడి భార్య సరస్వతి. బ్రహ్మదేవుడు సృజనకారుడు. సృష్టిరచన ఆయన పని. సృజన చేయాలంటే జ్ఞానం అవసరం. అందుకే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీదేవిని వివాహం చేసుకొన్నాడు. ఈ ప్రపంచం అంతా ఒక అద్భుతసృష్టిగా కనబడుతుంది. సరస్వతి తెల్లనిదని వేదాలు మొదలుకొని అన్ని వాఙ్మయాలూ వర్ణిస్తున్నాయి. రెండు చేతుల్లో వీణను, ఒక చేతిలో పుస్తకాన్ని, మరొక చేతిలో అక్షమాలను ధరించి, తెల్లని పద్మంపై అధిష్ఠించిన సరస్వతీ మాతను ధ్యానించడం సంప్రదాయం. రుద్రాక్షలను అక్షాలంటారు. రుద్రాక్షలతో కూడిన దండ అంటే అక్షరాలతో కూడిన మాలిక అని ఉపాసకులు చెబుతారు. పుస్తకం సకల విజ్ఞానాలకు, వీణ లలితకళలకు, అక్షమాల ఉపాసనకు సంకేతాలుగా కనిపిస్తాయి.


జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానం ఒక జడపదార్థం లాంటిది. జడపదార్థంలో 

ఏ కదలికా ఉండదు. చైతన్యం శూన్యం అవుతుంది. చైతన్యం లేని పదార్థం నిద్రాణమై ఉంటుంది. కనుక ఎలాంటి స్పందనా ఉండదు. జ్ఞానం తేజోవంతమైంది. అది నిత్యచైతన్యంతో అలరారుతుంది. జ్ఞానం ఎప్పుడూ జాగ్రదవస్థలోనే ఉంటుంది. ఎప్పుడూ మేలుకొని ఉండటం జ్ఞానలక్షణం. జ్ఞానం వల్ల ప్రమాదాలు ఉండవు. ఎక్కడ అగాధం ఉందో, ఎక్కడ అపాయం ఉందో తెలిస్తే అలాంటి చోటికి ఏ జీవీ వెళ్లదు. కనుక ప్రతి ప్రాణికీ జ్ఞానం ఆవశ్యకం. జంతువులలో, పశు, పక్ష్యాదులలోనూ ప్రమాదాన్ని పసిగట్టే జ్ఞానం ఉంటుంది. మనిషికే కాదు సకలప్రాణులకూ జ్ఞానం కావలసిందే. మనిషి జంతువులకంటే మిన్నగా వివేకశీలం కూడా కలిగి ఉంటాడు. వివేకం జ్ఞానం వల్లనే సాధ్యం.


సరస్వతికి వాణి అని ఇంకో పేరు. వాణి అంటే పలుకు. పలుకు సంస్కారవంతంగా ఉంటేనే మనిషికి గొప్ప అలంకారంగా మారుతుందని భర్తృహరి మహాకవి తన సుభాషిత త్రిశతిలో అంటాడు. శరీరం నిండా ఎన్ని నగలు వేసుకున్నా మాట చక్కగా లేకుంటే మనిషి విలువ కోల్పోతాడు. మనిషికి మాట ఆభరణం. మాట వజ్రాయుధం. మాట ఎంతో పవిత్రమైంది. దాన్ని దుర్వినియోగం చేయరాదు. చెడుకోసం వినియోగించరాదు. పూర్వం దేవతలు, మహర్షులు సైతం లోకకంటకులైన వారిని శిక్షించడానికే శాపాలు పెట్టేవారు. లోకరక్షణకోసం వరాలు ఇచ్చేవారు.


వాక్కు ఒక నది కనుక అది ఎంత నిర్మలంగా ఉంటే అంత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. స్వచ్ఛమైన పలుకుల నదిలో స్నానం చేసేవారు నిర్మలదేహులే కాదు... మానసికంగానూ వాచికంగానూ ఆరోగ్యవంతులై ఉంటారు. మహనీయులందరూ వాఙ్మయ సరస్వతిని ఎంతో పవిత్రంగా ఉపయోగించినవారే. మాట సత్యాన్ని, ధర్మాన్ని నిలుపుతుంది. మాట లోకాలను రక్షిస్తుంది. మనిషిని ఉత్తమస్థితికి చేరుస్తుంది. ఇదే సరస్వతీ తత్త్వం అంటే!✍️

                          (ఈనాడు అంతర్యామి)

              - డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ.


                         🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


భగవత్ తత్త్వం

 భగవత్ తత్త్వం ఏమిటో తెలుసుకుంటే ఫలితం ఎంతగానో ఉంటుంది (4వ మంత్రం)                  [ఉపనిషత్తులు]                                


భగవత్ తత్త్వం చాలా విచిత్రమైనది, ఎంత తెలుసుకున్నా ఎంతో కొత్తగానే ఉంటుంది. "ఆశ్చర్యవద్ పశ్యతి కశ్చిదేనం" అంటాడు గీతలో స్వామి. అత్మని గురించిగానీ పరమాత్మని గురించి ఎంతెంత తెలుసుకున్నా ఆశ్చర్యకరమైనవే ఉంటాయి. భగవంతుని ఈశితృత్వాన్ని, నియమించే సామర్థ్యాన్ని తెలుసున్న వ్యక్తికి ఫలితం ఎంతగానో ఉంటుంది. తెలుసుకోవడం ఏమిటో, ఫలితం ఏమిటో, దానికి ఏర్పడ్డ ఆటంకం ఎట్లా తొలగించాలో తెలిపింది ఈశావాస్య ఉపనిషద్. ఈ ఆత్మ తత్వం గురించి తెలిస్తే తప్ప మనం గుర్తించలేం. అందుకు అది మనకు చేసే ఉపకారమేమిటో తెలియాలి. పరమాత్మతో కలిసి ఉంటే కలిగే ఆనందం తెలియదు కనుక అది చెప్పింది మంత్రం. పరమాత్మ యొక్క విచిత్రమైన ప్రవృత్తిని అందంగా చెబుతుంది ఈ ఉపనిషద్.


అనేజదేకం మనసో జవీయో నైనధేవా ఆప్నువన్ పూర్వమర్షత్ |

తద్ధావతో అన్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నాపో మాతరిశ్వా దధాతి       ||   (4)


"పూర్వమర్షత్" మనం పుట్టక ముందు ఈ గాలి ఎట్లా అయితే వ్యాపించి అంతటా ఉందో పరమాత్మ తత్త్వం ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటినుండో అట్లానే వ్యాపించి ఉంది. మనకే కాదు మనకంటే ముందే ఉన్న దేవతలకే తెలియదు, "నైనధేవా ఆప్నువన్" చతుర్ముఖాదులు, ఇంద్రాది దేవతలకీ తెలియదు. చతుర్ముఖ బ్రహ్మ మన కంటే ముందు పుట్టాడు,  మన కంటే ఎక్కువ కాలం ఉంటాడు, మన కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటాడు,  మన కంటే ముందే వేదాన్ని మొదట పొందాడు కానీ ఆయనకి కూడా ఈ తత్త్వాన్ని చెప్పలేక పోతాడు. "ధాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీ అంతరిక్షమతోస్వాహాః" ఈ చూసే విశ్వం ఆకాశం ఇవన్నీ నేను పుట్టించడం లేదు, దాన్ని ఎలా వాడాలో తెలుసుకొని చేస్తున్నాను అన్నాడు ఆయన.



ఏలా ఉంటుంది ఈ తత్త్వం ? "అనేజద్" ఎప్పటికీ చెదరదు. పరమాత్మ అనేవాడు అనంతవిశ్వంలో లేని చోటు లేదు కనుక కంపించడం అనేది లేనే లేదు. ఒక డబ్బాలో ఒక రాయి వేడి కదిలిస్తే ఆ రాయి కంపిస్తుంది. ఎందుకంటే కొంత ఖాలీ ఉంది కనుక, అదే రాయి ఆ డబ్బా ఉన్నంతే ఉంటే అది గబ్బాని కదిపినా ఆ లోన రాయి కంపించదు. అట్లా అనంత విశ్వంలో పరమాత్మ లేని చోటు అంటూ లేదు, కనుక ఆయన "అనేజద్".



"ఏకం" ఆయన ఎప్పుడూ ఒక్కడే. ప్రపంచాన్ని శాసించే పరమాత్మలెంతమంది ? "క్షరం ప్రధానం అమృతాక్షరం హరః క్షరాత్రాణావీషతే దేవ ఏకః" అని చెప్పింది స్వేతాస్వేతరం అనే ఉపనిషత్తు. ప్రకృతి అంతా క్షరం, ప్రకృతి మార్పు చెందేది. అమృతాక్షరం హరః - అమృతం అంటే నశించనిది, నశించని జీవుడికి హరుడని పేరు. ప్రకృతిని తన కర్మ కోసం హరింపజేసుకొను వాడు.  ఈ క్షరమును ఈ అమృతమును రెంటినీ ఈశతే దేవ ఏకః - శాసించు దివ్యమైన పరమాత్మ ఒక్కడే. బృహదాయణ్యక ఉపనిషద్ చెబుతుంది "దివ్యః దేవః ఏకః నారాయణః" ఈ జగత్తులో ఒక్కో వస్తువులో ఉన్న వాడే నీలోనూ ఉన్నాడు, ఈ పరమాత్మ "దివ్యః దేవః" అంతటా సాకల్యముగా ప్రకాశిస్తూనే ఉంటాడు, ఎందరు అట్లాంటి వారు అంటే "ఏకః" తనవంటి సాటియైన తత్త్వం మరొకడు లేని వాడు ఆయన, ఒక్కడే.  ఏమని పిలవవచ్చు ? "నారాయణః" నారాయణుడు.


ఎలా ఉంటాడు ఆయన ? మనసో జవీయః. అంటే మనస్సుకంటే వేగంగా ఉంటాడు. లోకంలో చెబుతుంటారు కదా గాలికంటే వేగంగా మనస్సు అని. మనం ఇక్కడ ఉండగా మనం తలిస్తే ఎక్కడికో వెళ్ళి పోగలం. కానీ పరమాత్మ వేగం ఈ మనస్సు వేగం కంటే ఎక్కువ. మనం  అంటే ఒక్క కూర్చొని ఊహించాలి మనస్సుతో, కానీ ఆయనకి ఆ పని కూడా లేదు ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు కనుక.  ఎంత ఆశ్చర్యం కదూ. మనసో జవీయః. గజేంద్రుడి కథ ఉంది, అందులో ఆయన మనస్సులో కలడు కలడు అన్న వాడు కలడో లేడో అనుకున్నాడట, అందుకే సరే అని పరమాత్మ ఏం చేయలేదట. ఇక నీవేతప్ప మొరొకడు లేడు అన్నప్పుడు పరమాతమ వెంటనే వచ్చాడట. వచ్చిన వేగాన్ని అద్భుతంగా వర్ణిస్తారు కవులు. భక్తుల కోసం ఆయన ఎంత వేగంగా వస్తాడో తెలుపటాని అట్లా వర్ణిస్తారు. అందుకే భట్టర్లవారు హే భగవన్ నేను నీకు నమస్కారం పెట్టను, నీభక్తులని రక్షించాలని నీకున్న ఆర్తికి నమస్కారం అన్నాడు. ఆయన పేరు అర్తత్రాణపరాయణః. భక్తులను రక్షించడానికి ఆయన ఆర్తి చెందుతాడట. ఆయనగబగబా వచ్చి రక్షించినట్లు అద్భుతమైన వర్ణన ఆయన త్వరని చెప్పడానికే తప్ప ఆయన ఎక్కడినుండో రావాల్సిన అవసం లేదు వేదవ్యాసుడి భాగవతంలో ఆయన . పిలవగానే   వచ్చి ముసలి నోటి నుండొ గజేంద్రుని కాలిని విడిపించాడని ఉంది. ఆయన అక్కడినుండే వచ్చాడు, కారణం ఆయన మనసోజవీయ. వేదవ్యాసుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అని చూపించాడు, కవులు ఆయన త్వరని చూపించారు. ఈ రెండూ భగవంతుని గుణాలే. ఎందుకు ? "తద్ధావతో అన్యానత్యేతి తిష్ఠత్" లోకంలో పరుగు పరుగులో వెళ్ళ గలం అనుకునే ఏవరినా పరమాత్మను పట్టుకుందాం అన్నా చిక్కనంత వేగం ఆయనది, ఎందుకంటే ఈ వేగాన్ని అతిక్రమించినవాడు, ఆయన అంతటా ఉన్నవాడు.


అంతటా ఎలా ఉన్నాడు ? "తస్మిన్నాపో మాతరిశ్వా దధాతి". ఆకాశంలో గాలి, తేమ అవన్నీ నిరాధారంగా కనిపిస్తాయి. మేఘాలు ఎలా నిలిచాయి ఆకాశంలో ? గాలి వ్యాపించగలదు కానీ కొంత మేర దాటి చూస్తే గాలి ఉండదు. గాలి సంచారాన్ని ఎవడైనా చేయిపెట్టి ఆపాడా ? ఇది వాతావరణం పై మాట. ఇక వాతావరణంలో చూస్తే ఈ గాలి సంచారాన్ని ఎవరు చేయిస్తున్నారు ? వీటిని అట్లా నిలబెట్టిన వాడు పరమాత్మ. ఏదైనా ఒక కార్యం నడుస్తుంది అంటే దాన్ని నిలబెట్టే వాడు పరమాత్మ. వీటన్నింటిని నియమించేవాడు వెనకాతల ఒకడున్నాడని మరచిపోకు. తస్మిన్ నాపో - అన్నింటిని నియంత్రించే పరమాత్మ చేతనే మాతరిశ్వా దధాతి - అన్నీ ధరించబడుతున్నాయి కనుక. వాడి సంకల్పంచే అన్నీ అట్లా నిలబడగలుగుతున్నాయి. అట్లా గాలి, నీరు అన్నీ వాడిచే నిలబడి ఉన్నాయి.

*శ్రీ లలితా నామ వైభవం-12*

 *శ్రీ లలితా నామ వైభవం-12*


మనోరూపేక్షుకోదండా_పంచతన్మాత్రసాయకా’ 

అమ్మవారు కుడి చేతిలోపైన చెఱుకువిల్లు పట్టుకుంటుంది. మనసే చెఱుకువిల్లు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. ఒక సుషుప్తిలో తప్ప ఎప్పుడూ నిద్రాణముగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే శంకరభగవత్పాదులు మనసును కోతితో పోలుస్తారు. 

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ

నటత్యాశా శాఖస్వటతి ఝటిత స్యైర మభిత:

కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం

ధృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో|| 

 మనసు మోహాటవిలో తిరుగుతూ ఎప్పుడూ తనకు లేని దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. శరీరముతో అనుభవించలేని దానిని మనసుతో అనుభవించే ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ఈశ్వరుని పట్టుకుంటే అన్నిసార్లు పుణ్యం. ఎన్నిసార్లు అక్కరలేనివి పట్టుకున్నదో అన్నిసార్లు పాపము ఖాతాలో పడుతుంది. ఒక్కనాటికి పట్టుకునే ప్రయత్నము చెయ్యదు. మనసు మాట వింటుంటే అది ఎప్పుడూ మంచిమాట చెప్పదు. మంచిబుద్ధితో అలవాటు చేసి అమ్మవారి చేతిలో చెఱుకువిల్లు చూస్తే మారుతుంది. మనసుకి లొంగడము అంటే మన్మధుని చెఱుకువిల్లుకి లొంగడమే. అందులోనుంచి ఎప్పుడూ కామబాణములు పడుతూ ఉంటాయి. అదే చెఱుకువిల్లు అమ్మవారు పుచ్చుకుంటే పరిస్థితి మారుతుంది. కామబాణములకు బదులు ఈశ్వరుని వైపు తిప్పే బాణములు పడి మనసు మారడము క్రియాశక్తి. అమ్మవారి ఎర్రటికాంతి మీద పడడము వలన వచ్చింది. అది పడి ఈ నాలుగు కదిలితే చేతులు, ఆయుధములు  కనపడితే తప్ప వ్యక్తిలో మార్పు రాదు. 

 అమ్మవారు కుడివైపు పై చేతిలో అరవిందము, అశోకము,  చూతము, నవమల్లికము, నీలోత్పలము అన్న ఐదు పుష్పబాణములు పట్టుకున్నది. ఈ ఐదుపువ్వులు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములనే తన్మాత్రలు.  వీటికి లొంగి సుఖములు అనుభవిస్తుంటారు. అమ్మవారు పట్టుకున్నవి పువ్వులే. పువ్వు స్పర్శ చాలా కోమలముగా ఉంటుంది, దానిలో తేనె ఉన్నది, మంచి రూపము ఉన్నది, మంచి వాసన ఉన్నది. పువ్వులో ఉన్న తేనె కోసము ఝుంకారము చేస్తూ తుమ్మెద వస్తుంది. నిశ్శబ్దముగా తేనె త్రాగుతుంది. పువ్వుకొరకు దాని శబ్దం కనక అది పువ్వుకే చెందుతుంది. అమ్మవారికి నమస్కరించని వారు తన్మాత్రలతో పశువులా తిరగడము జరుగుతుంది. అమ్మవారికి నమస్కరించిన వారు తన్మాత్రల లౌల్యమునుండి బయటికి రావడము జరుగుతుంది. ఒక్కక్క తన్మాత్రకు ఒక్కక్క జాతి నశించిపోతున్నది. శబ్ద తన్మాత్రకు జింకల జాతి, స్పర్శ తన్మాత్ర కి ఏనుగుల జాతి, రస తన్మాత్ర కి చేపలజాతి, రూప తన్మాత్ర కి మిడతల జాతి, గంధ తన్మాత్రకు తుమ్మెదల జాతి నశించిపోతున్నాయి. శబ్ద లౌల్యం, రస లౌల్యం, రూప లౌల్యం, స్పర్శ లౌల్యం, గంధ లౌల్యం అన్నిటికీ లౌల్యమే! అమ్మవారి చేతిలో ఉన్న ఐదు పుష్పబాణములను చూస్తే తన్మాత్రలు పోవు. అనుభవించడములో మార్పువస్తుంది. ‘పంచతన్మాత్రసాయకా’ - అమ్మవారి అనుగ్రహము కలిగి ఈ ఐదు తన్మాత్రలతో జీవితము పండించుకోవడము జరుగుతుంది. జీవితములో ఈ మార్పులు రావడమే ప్రధానము.


*శ్రీ మాత్రే నమః*

శ్రీమద్రామాయణావతరణము

 🌹శ్రీమద్రామాయణావతరణము 🌹 


బ్రహ్మ దేవు డంత పరికించి మౌనిని

యమిత కరుణ తోడ నభయ మిచ్చె 

కలవరమున నుండ గమనించి యతనితో 

పరమ కరుణ తోడ పలికె నిట్లు                   27 


వాల్మీకి కవివరా ! వగపేల నీకింత 

         సమ్మత మోందుము స్వాoతమందు

క్రౌoచపులుగు చావు కలత కల్గించగా 

         పల్కినాడవు  నీవు బాధ యందు 

శోకంబు కతనను శ్లోకమ్ము వెలువడె

         నప్రయత్నంబుగా నాస్య మందు

నీ నోట నా మాట నే పలికించితి 

          భావి కావ్యంబుకై పరమమౌని !

నీవు నుడివిన శ్లోకమే నిక్కముగను 

ఆదికావ్యంబునకు నది యాద్య మగును 

నవ్యరచనతో రామాయణమును నీవు 

నిర్మితముసేయ తరియించు నీదుజన్మ      28

   

శ్రీకరుoడైనట్టి శ్రీరామచంద్రుండు

          ధర్మాత్ము డత్యంత ధార్మికుండు

సర్వసద్గుణపూర్ణ  సత్వాభిరాముండు

           ధీమతి ధీరుండు దివిజనుతుడు

శ్రీరాముగాథకు శ్రీకారమున్ జుట్టి

          నారదుండుడివిన నయము గాను

కావ్యంబు రచియించు కడురమ్య మొప్పగా

           మునివరావాల్మీకి ! మొనసి యిపుడు

పదము లందు గాని పాదంబు లను గాని

సకల యంశ ములును సత్య మగును

ఎట్టి దోష పదము లేర్పడ విచటను

సాధు సమ్మ తముగ సాగు కవిత              29 


శ్రీ రాము చరితమ్ము  సీతమ్మ గాథయు

          భరతాది లక్ష్మణ భవ్య కథలు

దశముఖు డాదిగా దైత్యుల  గాథలు

          నుర్వి శ్రేష్టంబు లై నొప్పుచుండె

అవి రహస్యంబులై యలరారు చుండెను

          బయలు పరచు వాని భవ్యముగను

తీరుగా సురమౌని తెల్పని విషయముల్

          స్ఫురణ కొచ్చు నునీకు స్థూల ముగను

రమ్య మైన యట్టి రఘు రాము చరితంబు

సర్వ పాప ములను సమయ జేయు

శ్రవణ మాత్ర ముననె సమకూరు తోషంబు

భక్తి ముక్తి గలుగు ప్రజల కెల్ల                    30



గోపాలుని మధుసూదన రావు 🙏

మర్కటం - మాటలు

 మర్కటం - మాటలు


వేసవి కాలంలోని ఒక సాయింత్రం. పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్ళబుట్టలు, ఎండుద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి. 


హఠాత్తుగా కోతుల దండు ఒకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనెసీసాలను తోసి కిష్కింద చేస్తున్నాయి. అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. 


కాని మహాస్వామివారి ముఖపద్మంలో రేఖామాత్రమైనా విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగలద్వారా ఆజ్ఞాపించారు. స్వామివారిని కాపాడుకోవాలని చేతులలో కర్రలు పట్టుకుని వస్తున్నవారల్లా ఆ కర్రల్లాగే స్థాణువులై నిలబడిపోయారు. 


కొద్దిసేపటి తరువాత ఆ కోతులన్నీ వచ్చిన పని ముగించుకుని రామకార్యార్థమై వెళ్ళిపోయాయి. అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు. 


తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒకతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బలవల్ల అది కొన్ని రోజులకి మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. ఆ పిల్లకి వివాహం చెయ్యవలసిన వయసు వచ్చింది. అతను మహాస్వామివారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకుని బాధపడ్డాడు.


“మట్టితో కోతిబొమ్మను తయారుచేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు. మనఃస్పూర్తిగా ఒప్పుకున్నవాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యి” అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు.


కోతులను ఎప్పుడు కొట్టరాదు. వాటి మీద జాలి చూపించాలి. అవి రామణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ‘ఆంజనేయుడు’ అని తలచి వాటిని వదిలిపెట్టాలి.


ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

వరుణ_యాగానికీ__వర్షానికి_సంబంధం

 *వరుణ_యాగానికీ__వర్షానికి_సంబంధం_ఏమిటి..?* 


మంత్రాలకి చింతకాయలు రాల్తాయా..??అంటూ సందేహించే వారికోసం:- 

     

ॐ మనకి విశ్వంలో వర్షానికి  ముఖ్యంగా రెండు energy systems కారణం గా ఉంటాయి.

    

1.#శబ్ద_తరంగాలు 

2.#ఉష్ణ_తరంగాలు 


మంత్రాలు ద్వారా శబ్ద తరంగాన్ని , అగ్ని ద్వారా ఉష్ణ తరంగాన్ని ప్రేరేపిస్తున్నాం.. 


ॐ యఙ్ఞాలలో సమిధలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమలు, సోమ (ఒక రకం మొక్క).. యివి వాడతారు.. వాటి ప్రాముఖ్యత యిపుడు చూద్దాం.


ॐ ఆవు నెయ్యి అగ్ని లో వేసినపుడు ఒక లీటరు నెయ్యి కి ఒక టన్ ఆక్సిజన్ వస్తుంది. 


ॐ ఆవు పాలు 100 డిగ్రీలకు ఆహుతి అయ్యాక ethelene oxide వస్తుంది.. యిది సూక్ష్మ క్రిములను చంపేస్తుంది.


ICU లో sterilization కి ఈ gas వాడతారు. కొత్త ఇంటిలో పాలు పొంగించడానికి ఇది ఒక కారణం.. 


ॐ ఆవు పాలు, నెయ్యి కలసినపుడు propelene oxide వస్తుంది. కృత్రిమ వర్షానికి ఈ వాయువే కారణం.


ॐ సోమ అనే మొక్క scientific name ASCLEPIUS ACIDA.. ఈ మొక్క downstream water quality అంటే భూమి లో వున్న నీటి శాతాన్ని, నాణ్యతను పెంచుతుంది. 


ఈ మొక్క ని యజ్ఞంలో వాడటం వల్ల cloud seeding అంటే వర్షపాతం ను పెరిగేలా చేసి cloud condensing మేఘాలను సంక్షేపనం చేసి వర్షం వచ్చేలా చేస్తుంది. యిది ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. 


ॐ ఆవు పిడకలు తెలిసినదే కదా radiation absorber.. 


ॐ గంధం, నెయ్యి... యివన్ని యజ్ఞంలో కలిసి hydro carbons ని oxidise చేసి formic acid, acetic acid అనే క్రిమినాశిని వాయువులు ఏర్పడతాయి. 

     

#ఇది_మన_యఙ్ఞానికి_ఉన్న_ప్రాముఖ్యత..


సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి - పాటించండి..

🙏🏻

మొగలిచెర్ల

 *ప్రార్ధన..పరిష్కారం..*


ఆదివారం నాడు మధ్యాహ్నం అన్నదానానికి ముందుగా..అంటే..మధ్యాహ్నం 12.30 గంటలకు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యం పెట్టి హారతులిస్తారు..అప్పటిదాకా వేచివున్న భక్తులందరూ ఆ హారతి కళ్లకద్దుకొని..అన్నదానం సత్రం వద్దకు వెళ్లి భోజనం చేస్తారు..సహజంగా మధ్యాహ్న భోజనం తరువాత శ్రీ స్వామివారి మందిరం దాదాపుగా ఖాళీ అయిపోతుంది..భక్తులు తమ తమ ఊళ్లకు ప్రయాణమై వెళ్ళిపోతారు..చాలా కొద్దిమంది మాత్రమే సాయంత్రం వరకూ వుంటారు..మధ్యాహ్నం హారతి, అన్నదానం తరువాత..దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా చాలా తక్కువ సంఖ్య లోనే వుంటారు..సాయంత్రం నుంచీ నేనూ మా సిబ్బందీ మందిరం తాలూకు లెక్కలు చూసుకుంటూ ఉంటాము..


ఆరోజు ఆదివారం..సాయంత్రం నాలుగు గంటల సమయం లో బస్సు దిగి దంపతులిద్దరు మందిరం లోకి వచ్చారు..ఒకరకంగా వయసు పైబడిన వాళ్లే..మెల్లిగా మేము కూర్చున్న చోటుకి వచ్చి.."మేము దూరప్రాంతం నుంచి వస్తున్నాము..ఈరాత్రికి ఇక్కడ బస చేయాలని అనుకుంటున్నాము..మేము ఉండటానికి ఏదైనా వసతి ఉన్నదా..?" అని అడిగారు..ఆ సమయానికి అన్ని గదులూ ఖాళీ గానే ఉంటాయి కనుక.."మీకొక గది ఇస్తాము..మీ వివరాలు చెప్పండి..నమోదు చేసుకోవాలి.." అని మా సిబ్బంది చెప్పారు.."నా పేరు సత్యనారాయణ మూర్తి..ఈవిడ నా భార్య వనజ..మాది విశాఖపట్నం..మొన్న గురువారం నాడు గొలగమూడి వచ్చి వెంకయ్య స్వామివారి మందిరం వద్ద ఉన్నాము..నిన్న ఉదయం మాలకొండ వచ్చాము..అక్కడినుంచి భైరవకోన వెళ్లి ఈరోజు ఉదయం మిట్టపాలెం నారాయణ స్వామి మందిరం చూసి..ఇప్పటికి ఇక్కడికి చేరాము..ఈరాత్రికి ఇక్కడ నిద్ర చేసి..రేప్పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని..తిరిగి వెళ్లిపోతాము.." అన్నారు..వాళ్ళకొక గది కేటాయించి.."రాత్రికి కూడా ఇక్కడ  మందిరం లో భోజన వసతి ఉన్నది.." అని చెప్పారు..సరే అన్నట్లు తలాడించి తమ గదికి వెళ్లిపోయారు..


ప్రక్కరోజు సోమవారం ఉదయం ఆరుగంటల కల్లా ఆ దంపతులు, శుభ్రంగా తయారయ్యి,  శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చేసారు..అర్చకస్వాములు హారతులు ఇచ్చేదాకా వేచి వున్నారు..ఆ తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహానికి అర్చన చేయించుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..కొద్దిసేపు అక్కడే మంటపం లో కూర్చున్నారు.."ఇక్కడ నిర్వహణ చేసేది మీరేనా.."? అని నన్నడిగారు సత్యనారాయణ మూర్తి గారు..అవును అన్నాను..మెల్లిగా లేచి ఇద్దరూ నా దగ్గరకు వచ్చారు..ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.."మేము మరో రెండురోజులు ఇక్కడ ఉంటాము..మీకేమీ అభ్యంతరం లేదుకదా..? మేమున్న గది కి బాడుగ ఇస్తాము..కొంచెం ప్రశాంతంగా ఉన్నది..ధ్యానం చేసుకోవచ్చు..అందుకని అడిగాను.." అన్నారు.."వుండండి..ఇబ్బందేమీ లేదు.." అన్నాను.."సంతోషమండీ.." అన్నారాయన..


మూడురోజులున్నారు..ఉదయం సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుంటూ..వీలున్నప్పుడల్లా అర్చక స్వాముల అనుమతితో స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకుంటూ..తమకు ఓపిక ఉన్నంతవరకూ ప్రదక్షిణాలు చేస్తూ కాలం గడిపారు..గురువారం ఉదయం నేను స్వామివారి మందిరం లోకి వచ్చేసరికి..నాకొసమే ఎదురు చూస్తున్నట్లుగా..నేను కూర్చునే స్థలం వద్ద నిలబడి వున్నారు..వాళ్ళను కూర్చోమని చెప్పాను..నేను కూర్చోగానే..నా దగ్గరగా జరిగి.."బాబూ ప్రసాద్..మీతో ఒక విషయం చెప్పాలి..ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాము..మా అబ్బాయి కి వివాహం జరిగి మూడేళ్లు అయింది..అమ్మాయి కూడా లక్షణమైన పిల్ల..రెండేళ్లు కాపురం చేసిన తరువాత..వీళ్ళ మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి..విడిపోయేదాకా వచ్చింది పరిస్థితి..అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది..రోజూ వాళ్ళు పడే గొడవలు చూడలేక మేము తల్లడిల్లిపోయాము..

ఎలాగైనా వాడి కాపురం బాగుపడేటట్లు చూడమని అందరు దేవుళ్ళనూ మొక్కుకున్నాము..ఇంట్లో వాడి బాధ చూడలేక మేము ఇలా క్షేత్రాలు తిరుగుతున్నాము..ఎందుకనో ఇక్కడికి వచ్చిన తరువాత కొద్దిగా ప్రశాంతత వచ్చింది..స్వామివారి వద్ద మా ప్రార్ధన ఫలించిందేమో తెలీదు కానీ..మా వియ్యంకుడు రాత్రి ఫోన్ చేసాడు..మమ్మల్ని వచ్చేయమన్నాడు..మాట్లాడుకుందాము అన్నాడు..కోడలూ మాట్లాడింది..మళ్లీ అరగంటకు మా అబ్బాయి కూడ ఫోన్ చేసాడు..మమ్మల్ని వెంటనే వచ్చేయమన్నాడు..మంచిరోజులు వచ్చాయని అనిపించింది..వాడి కాపురం బాగుపడి..వాళ్లిద్దరూ లక్షణంగా ఉంటే..మళ్లీ ఇక్కడికి వస్తాము.." అన్నారు.."వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి స్వామివారి సమాధి వద్ద మొక్కుకొని వెళ్ళండి.." అన్నాను..సరే అన్నారు..ఆరోజే వెళ్లిపోయారు..


సుమారు సంవత్సరం తరువాత ఆ సత్యనారాయణ మూర్తి గారు రెండు వారాల క్రితం భార్యతో కలసి వచ్చారు..వాళ్ళిద్దరి ముఖం లో ఆనందం ఉంది.."తమ కుమారుడి సంసారం చక్కబడిందనీ..ఇప్పుడు కోడలు గర్భవతిగా ఉన్నదనీ..ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారని చెప్పి.."అంతా స్వామివారి దయ..మా మొర విన్నారు.." అని స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారు..కోడలు కాన్పు అయిన తరువాత..అందరమూ కలిసి వచ్చి..ఇక్కడ అన్నదానం చేస్తామని చెప్పారు..


సమాధి లో కూర్చుని ఉన్న ఆ స్వామివారు ఆ దంపతుల ప్రార్ధన చక్కగా విని, పరిష్కారం చూపారని మేము అనుకోవడం లో ఆశ్చర్యం లేదు కదా..!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

దివ్యబోధ

 *దివ్యబోధ*


పైకి ఏదో వేదాంతంలా, వైరాగ్యంలా ఈ మాటలు కనిపిస్తాయి కానీ, దృఢమైన వైరాగ్యం మనస్సులో ఉన్న వాడే అవినీతికి పాల్పడకుండా ఉంటాడు. నవజీవనంలో కావాల్సింది కూడా అదే. ఏమిటా వేదాంతం? ఏమిటా వైరాగ్యం? ఏమిటా దృఢమైన విశ్వాసం? అంటే...

శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడి దివ్యబోధ మొదలుపెడుతూ ఇలా అంటాడు. అర్జునా!....

 

దేహినోస్మిన్‌ యథా దేహే కౌమారం యౌవనం జరా

తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి

 

ఎనిమిదేళ్ల వరకు ‘బాల్యం’ అంటారు. పదహారేళ్ల వరకు ‘కౌమారం’, పదహారు నుంచి ముప్ఫైఆరు వరకు యవ్వనం, అక్కడి నుంచి ‘ప్రౌఢ వయస్సు’ అని అంటారు. యాభై ఆరేళ్లు దాటాక ‘వార్థక్యం’ అంటారు. కౌమారం, యవ్వనం, ముసలితనం...ఇవన్నీ ఏవిధంగా ప్రాప్తిస్తున్నాయో, ‘తథా దేహాంతరప్రాప్తిః’ అదేవిధంగా మరణం కూడా వస్తుంది. అది కూడా మరొక దశ. అందుచేత వయస్సు శాశ్వతం కాదు. మనస్సు శాశ్వతం కాదు. ‘ధీరస్తత్ర న ముహ్యతి’ అంటే ధీరుడైన వాడెవడూ ఈ మరణం గురించి శోకించడు.

 

శరీరంలో వచ్చే ఇన్ని మార్పులకు సిద్ధమైనప్పుడు, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం ఎందుకు? మృత్యువు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటుంది. కాబట్టి చావు గురించి బాధగానీ, భయంగానీ లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్లాలి. ఉన్నంత కాలం మన పని మనం చేశామా? లేదా? వయస్సులు మారుతున్నాయి. మనస్సులు మారుతున్నాయి. అభిప్రాయాలు మారుతున్నాయి. అనుబంధాలు మారుతున్నాయి. ఏదీ శాశ్వతం కానప్పుడు ఎందుకు బాధపడాలి? ఈ గంభీరమైన నివృత్తిని మనస్సులో ఉంచుకుంటే ఎవరిపట్ల ఎలా ఉండాలో అలాగే ఉంటాం. ఎప్పుడూ నిశ్చింతగా ఉంటాం.

ప్రపంచంలోని భక్తివిశ్వాసాలకు సంబంధించి- మనుషుల్ని ఆస్తికులు, నాస్తికులుగా భావిస్తుంటాం. భగవంతుణ్ని అర్చించనివారు, నమ్మనివారు అందరూ నాస్తికులేనా? నమ్మనివారు అంటే, వారు భగవంతుడికి శత్రువులని అనుకోలేం. శత్రుత్వమైనా, అసలంటూ అక్కడ ఒక రూపం ఉండాలి. అప్పుడే కదా శత్రుత్వం ఉండేది!

హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపాది రాక్షసులు ‘హరి’ అని ఒక రూపం ఉందని భావించే, ఆయన పట్ల శత్రుత్వం వహించారు. నాస్తికుల కంటే శత్రువులే నిరంతరం హరి స్మరణ చేస్తుంటారు. భక్తుల కంటే అధికంగా స్మరి స్తామన్నారు జయ విజయులు. అందుకే వారు హరి భక్తులుగా ఏడు జన్మలు కాకుండా, హరితో వైరాన్ని మూడు జన్మలపాటు కోరుకున్నారు. ఆయనతో ఎడబాటును మూడు జన్మలకు ముగించాలన్నదే వారి కోరిక!

మానవజాతిలో ఆస్తికులు, నాస్తికులు కాకుండా మధ్యేమార్గంలో కొందరుంటారు. వారిది డోలాయమాన వైఖరి, దయనీయ పరిస్థితి. వారికి భక్తి ఉందా అంటే, లేదనిపిస్తుంది. లేదా అంటే ‘ఉంది’లా ఉంటుంది. ఏమిటిది? భక్తిని అనుసరించాలని, దైవాన్ని నమ్మాలని, దైవభావననే సాధన చేయాలని పలువురికి మనసులో ఉంటుంది. లోపల ఏదో ఒక భయం, బెరుకు ఉంటాయి. భక్తి అంటే ఏమిటి, ఏం చేయాలి; భగవంతుడు నన్ను, నావంటివారిని కరుణిస్తాడా అని ప్రశ్నించుకుంటారు.

వారిలో అనేక నియమ నిష్ఠలుంటాయి. పాపభీతి, దేన్నీ వదులుకోలేని తత్వం నెలకొని ఉంటాయి. ఏ మాత్రం అనుభవం లేని రంగం కాబట్టే- వారిలో ఎన్నో అపోహలు, సందేహాలు. భగవంతుడు లేడని అనుకుందామా అంటే, దానికీ మనసు ఒప్పదు! ఒకవేళ ఆయనంటూ ఉంటే- ఇంతవరకు ఆయన కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయని జీవితం వారిది. ఎటూ తేల్చుకోలేనంతటి సందిగ్ధ, సందేహ అవస్థలు వారివి.

మనిషి ఎప్పుడూ క్రియాశీలుడు, కర్మయోగి కావాలి. మనసు స్థిరంగా ఉండాలి. దేవుడు ఉన్నాడన్న నమ్మకం నూరు శాతం కలిగి ఉంటే, చలించని మానసంతో నిలుస్తాడు మానవుడు. అదే మానవజన్మ పరమార్థం, అతడు నెరవేర్చాల్సిన కర్తవ్యం. ఉత్కృష్ట జీవితం అంటే అదే! భగవత్‌ స్పృహ సర్వకాలాల్లోనూ శ్రేయస్కరం. తాను పొందింది ఏమిటో మనిషికి తెలియకున్నా- ఏదో కోల్పోయిన వెలితి, బాధ అతడికి ఉండవు.

దేవుడు ఉన్నాడు... ఉన్నాడా, లేడు... లేడా? ఈ డోలాయమాన స్థితి మనిషికి స్థిరత్వమివ్వదు. దేవుడు లేడు అనే కంటే, ‘ఉంటే ఏం చేయాలి, ఆ కృప ఎలా పొందాలి, అది నాకు సాధ్యమేనా’ అనుకొని ఎంతో నమ్మినవారు ఎందరో ఉన్నారు. సాధనలో వారు ముందున్నారు.

ఇవన్నీ కాదు. పుట్టిన ప్రతి జీవీ గిట్టడం ఎంత సత్యమో- అతడితో పాటు అతడి లోపల, బయట భగవంతుడు ఉన్నాడన్నదీ అంతే సత్యం. వేల సంవత్సరాలు చీకటి నిండిన గదిలోనూ, చిరుదీపం వల్ల అంతటా వెలుగు నిండుతుంది. అలాగే మానవుడు దేవుడి పట్ల కలిగించుకునే, వెలిగించుకునే చిన్నపాటి నమ్మకమే అతడి జీవితంలోని గాఢాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. వెలుగు లక్షణం, లక్ష్యం- చీకటిని పారదోలడం. మనిషి జీవితంలో నమ్మకాన్ని వెలిగించుకుంటే చాలు. భక్తి, సాధన, గమనం, గమ్యం... ఆయనే చూసుకుంటాడు. భగవంతుడు ఉన్నాడని నమ్మడమంత భద్రమైన జీవితం మరెక్కడా లేదు.

నిన్నే నమ్ముకున్నానని ఆయనకు హామీ ఇవ్వనక్కర్లేదు. ఒట్టుపెట్టి మరీ చెప్పనక్కర్లేదు. ఆ భావం మనసులో ఉదయిస్తే చాలు. పువ్వును అనుసరించే పరిమళంలా, భగవంతుడి అనుగ్రహ ప్రకాశం భక్తుడి నమ్మకాన్ని వెన్నంటి వస్తుంది. అదే ఆహ్లాదకరమైన భావం.