( మనిషి విలువ )
మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?
🌺 మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.!!
🍀కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .!!
💐అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.!!
🥀వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని
" అణుకువ " నటిస్తారు.
అంతవరకే.!!!
🌺పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు వాడుకుందామని
పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే
ఒక్కడూ ఉండడు.
"ఇది నిజం"
🍀 కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత
గొప్పగా చెబుతారు.!
కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!!
🌺మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి
కరుణ,
దయ,
ప్రేమ ,
జాలి ,
సేవాభావం ,
సాయపడాలనే తపన ,
మంచి మనసు ,
తెగింపు ,
విశాలహృదయం ,
ఉండాలి.!!!
పై లక్షణాలు మనకు ఉంటె
" విలువ "
🌿మనం పిలవకుండానే
మన దగ్గరకు వస్తుంది.!!!.
🌺☕శుభోదయం ☕🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి