15, మార్చి 2025, శనివారం

తెలుగుభాష గొప్పదనం*

 *తెలుగుభాష గొప్పదనం*


*అత్త:* ఇదిగో కోడలు పిల్లా! ఓ సారిలా రా!

*కోడలు:* వస్తున్నా *నత్తయ్యా*

*అత్త:* అత్తయ్యా అని అనలేవూ? నత్తయ్యా, గిత్తయ్యా అని అనకపోతే

*కోడలు:* నేను నత్తయ్యా అన్నానా? మడిగట్టుకుని గూడ వున్నారు, అబద్ధమాడ *కత్తయ్యా!* మైల పడిపోతారు.

*అత్త:* ఇప్పుడే మన్నావ్ ! కత్తయ్యా అనలేదటే ! పరమ సాత్వికురాలిని నన్నే కత్తయ్యా అంటావా !

*కోడలు :* అయ్యో ! నా ఖర్మకొద్దీ దొరికా *రత్తయ్యా* మీరు

*అత్త:* మళ్ళీ ఇంకో కొత్త కూత ! ఇప్పుడు రత్తయ్యా అని అన్నావా లేదా ?

*కోడలు:* అయ్యో ! నా రాత! అది సంధి. మీరు తెలుగు సరిగ చదువుకోలే *దత్తయ్యా*

*అత్త:* మరో మాయదారి కూత. దత్తయ్యా అట ! వాడెవడు? అయ్యో ! అయ్యో ! నేను నీలాగ చదువుకోలేదని నన్ను *నత్తయ్యా, కత్తయ్యా , రత్తయ్యా, దత్తయ్యా* అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే ! అబ్బాయి రానీ చెబుతా నీ సంగతి

*కోడలు:* అలా ఉడికి పోయి ఆయాసం తెచ్చుకోకండి. బిపి పెరుగుతుంది. మీరనుకున్న వన్నీ *‘ఉకారసంధి’* వలన ఏర్పడిన పదా *లత్తయ్యా*

*అత్త:* ఓరి దేవుడో! నన్ను మళ్ళీ లత్తయ్యంటోంది నాయనో !

ఇదే తెలు *'గత్తయ్యా'*

*తేనెలొలుకు తెలుగు* ఇంతటి మాధుర్యం ఏ భాషకు ఉంటుంది **చెప్పత్తయ్య* xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxఈ పోస్టు పాతదే...                     కానీ మిత్రులందరు తెలుగు గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలని పోస్ట్ చేశాను (దీన్ని ఓ మిత్రుడు నాకు పంపాడు)

ప్రియ బాంధవా మేలుకో 10*

 *ప్రియ బాంధవా మేలుకో 10*


సామాజిక స్పృహ కలిగివున్న రచయితలు భారత దేశపు అద్భుతమైన, ప్రశంసనీయమైన అభివృద్ధిని వీక్షించడంలేదనుకోరాదు. దేశ గణతంత్ర దినోత్సవ తదనంతర కాలంలో

 (1947 - 2024) భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాలలో ఒకటిగా అవతరించినదను మాట విశ్వ వ్యాప్తము. దేశాంతర్గతంగా సామాజిక అభివృద్ధి, లింగ సమానత్వం, పర్యావరణ మరియు హరిత రక్షణ, పేదరిక నిర్మూలన, అణగారిన వర్గాల సాధికారత, అందరికీ విద్య, ఉపాధి కల్పన, ప్రజారోగ్య మరియు వృద్ధుల సంరక్షణ, వీటన్నిటితో పాటు నిరంతర ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక, సైనిక, అంతరిక్ష, భూగర్భ మరియు సాగర జల రంగాలలో  విస్తరణ. రహదారి, వాయు మరియు నావికా క్షేత్రాలలో పురోగతి. భారత దేశానికి ఆటపట్టైన చతు షష్టి (64) కళలలో... చిత్ర లేఖనం, సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, కవిత్వం ఇత్యాది కళలతో బాటు *చోర కళ* గూడా ఇందులో ఇమిడి ఉన్నది. అన్ని కళలలో ఉన్న పండిత ప్రఖాండులతో బాటు చోర కళలో గూడా నిష్ణాతులున్నారు. క్షణాలలో ఇంకా చెప్పాలంటే రెప్పపాటులో  డబ్బులు కాజేస్తారు.


సాంకేతిక, వ్యాపార మరియు పరిశ్రమలకు సంబంధించిన అధునాతన విశ్లేషణ... అనగా బిగ్ డేటా, డేటా మైనింగ్, డేటా విజువలైజేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర గణాంక పద్ధతులతో  ఇతర అగ్ర దేశాల కోవలో చేరడమే గాకుండా అంతర్జాతీయ పోటీలలో అగ్రగామిగా నిలుస్తున్నది భారత దేశం.


భారత దేశం తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే తన జాతీయ ప్రయోజనాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉన్నతమైన విదేశీ విధానమును ఏర్పరచుకున్నది తద్వారా అంతర్జాతీయంగ ప్రపంచంలోని అన్ని దేశాలతో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తూ ఇతర దేశాలను ప్రభావితం చేస్తున్నది మరియు ఆకర్షిస్తున్నది. మూడవ ఆర్థిక ప్రధాన దేశంగా అడుగు లేస్తున్నది.


భారత దేశం యుక్తమైన, యోగ్యమైన, ఉన్నతమైన, మనోజ్ఞమైన,  ప్రశంసనీయమైన, శ్లాఘనీయమైన సాఫల్యాలతో అలరారుతూ, అమృతతుల్యమైన క్షీర భాండం లాగా సాక్షాత్కరిస్తుంటే..ఇంకా దేశం గురించి నిరాశావాదనలు, చర్చలు ఎందుకను ప్రశ్న  మిగిలియే ఉంటుంది. 

 *క్షీర భాండాలతో బాటు లవణ కళికలు* గూడా అవరోధాలుగా, తిరోగమనానికి, అపకీర్తికి, దేశభక్షణకు సహకరిస్తూంటాయని గ్రహించిన వాడే సామాజిక రచయిత.


*ప్రజా చైతన్యం వెల్లి విరిసిన చోట, జాతి సమైక్యత వల్ల మాత్రమే దుష్టులు భయపడతారు*.


ధన్యవాదములు

*(సశేషం)*

కర్మ _పునర్జన్మ

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

          *కర్మ _పునర్జన్మ:*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి.*


*1. మొదటిది:- మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.*


*2. రెండవది: వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.*


*3. మూడవది:- ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.*


*ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు. మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.*


*మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి. విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని మూడు జన్మల్లో హరి వైరులుగా మారి, శ్రీహరి తో చంపబడి వైకుంఠం చేరతారా? లేదా ఏడు జన్మల్లో హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా? అని అడిగితే వారు ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము అన్నారు.*


*మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ? దీనికి మనం ఏమి చేయాలి. దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు.*


*భగవద్గీత..జ్ఞానయోగం..19 శ్లో:*

                

*యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జీతాః*

*జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితమ్ బుధాః*

                                                  

*--ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు జ్ఞానం అనేయగ్ని చేత దహించబడతాయి.*

                  

*జ్ఞాన యోగం: 37 శ్లో:*


*"యధేయాంసి సమిద్ధో అగ్ని ర్భస్మాత్కురుతే అర్జున*

*జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కతరుతే తధా”*

                                                             *--అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.*


*ఈ ఉపదేశం లో పరమార్ధం ఏమిటి?* 


*జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే… మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు. మనం ఈ కర్మ రహస్యాన్ని… జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా! కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు. జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమయింది కదా!*


*ఓం నమో భగవతే వాసుదేవాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈ శ్లోకంలో మహాదేవుడైన ఈశ్వరుని సింహ రూపంగా స్తుతిస్తున్నారు. ఈశ్వరుని యందు సింహ లక్షణాలు ఉన్నాయని శంకరులు చెప్పారు.*


*శ్లోకం. :  44*        


*కరలగ్నమృగః కరీంద్రభంగో*

                         

*ఘన శార్దూల విఖండనోస్తజంతుః*

                         

*గిరిశో విశదాకృతిశ్చ చేతః*

                         

*కుహరే పంచముఖోస్తిమే కుతోభీః ?*


*పదవిభాగం :-*


*కరలగ్నమృగః _  కరీంద్ర భంగః _ ఘన శార్దూల విఖండనః _ అస్తజంతుః_ గిరిశః _ విశదాకృతిః _ చ _ చేతఃకుహరే _ పంచముఖః _ అస్తి _ మే _ కుతః _ భీః.*


*తాత్పర్యము :-*


*సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటాయి. పరమేశ్వరుడు కూడా మృగమును చేతిలో ధరించాడు. సింహము గజములను చంపుతుంది. ఈశ్వరుడు సహితమూ గజాసురుని సంహరించాడు. సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది.  పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుని ఖండించాడు. సింహాన్ని చూసి జంతువులన్నీ కనబడకుండా పారిపోతాయి. ఈశ్వరుని యందే జంతువులన్నీ లయము చెందుతాయి. సింహానికీ శివునికీ పర్వతమే నివాస స్థలము. సింహము శరీరకాంతి తెలుపు. ఈశ్వరుడు కూడా తెలుపే. సింహము పంచముఖి. అనగా విశాలమైన నోరు కల్గి యుంటుంది. ఈశ్వరునికీ ఐదు ముఖాలున్నాయి. అటువంటి మహాదేవుడు నా హృదయమనే గుహలో నివసించి యున్నాడు. నాకు ఏ భీతియూ లేదు.*


*వివరణ :-*


*ఈశ్వరుడు పంచముఖుడు. ఆయనకు  1). సద్యోజాతం   2). వామదేవం  3)  అఘోరం   4)   తత్పురుషం   5)   ఈశానం  అనే ఐదు ముఖాలున్నాయి.*


*సింహం కూడా పంచముఖమే. అంటే విశాలమైన నోరుగలది అని అర్థం.*


*సింహంవంటి శివుడు తన హృదయమనే గుహ లో వున్నాడు కాబట్టి తనకు ఏమీ భయంలేదని శంకరులు చెప్పారు. పెద్ద వారి యండ దొరికితే మనకు ధైర్యంగా ఉంటుంది కదా ! సింహ లక్షణాలు గల పరమేశ్వరుని యండ దొరికితే ఇంక చెప్పవలసినదేమున్నది ?  అని శంకరులు అన్నారు.*


*అంటే అందరూ శివుని తమ హృదయాల్లో నిలుపుకొన్నట్లయితే మృత్యువు వల్ల కూడా వారికి భయం ఉండదని గ్రహించాలి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

దిలీపుని వృత్తాంతం

 దిలీపుని వృత్తాంతం 


మహాకవి కాళిదాసు రఘువంశంలో వ్రాసిన ప్రార్ధనా శ్లోకం 

వాగర్థావివ సమ్పృక్తౌ వాగర్థప్రతిపత్తయే

జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ ॥


ఇందులో ధాతువు అనగా క్రియ: వందే (ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనము) – నమస్కరిస్తున్నాను.

ప్రశ్న: ఎవరిని (ద్వితీయ విభక్తి)? పార్వతీ పరమేశ్వరౌ – పార్వతిని మరియు పరమేశ్వరుని (ద్వివచనము)

ప్రశ్న: వారు ఎవరు? జగతః పితరౌ – జగత్తునకు తల్లిదండ్రులు ( ద్వివచనము)

ప్రశ్న: వారు ఎటువంటి వారు? వాగర్ధావివ సంపృక్తౌ- మాట మరియు దాని అర్థమువలె ఎప్పుడు కలిసియుండెడి వారు

ప్రశ్న: ఎందు కొరకు(చతుర్ధీ విభక్తి)? వాగర్ధ ప్రతిపత్తయే – మాట మరియు అర్థముల జ్ఞానము కొరకు

భావం 

"పదాలు మరియు వాటి అర్థాల గురించి సరైన జ్ఞానాన్ని పొందడం కోసం ఒక పదం మరియు దాని అర్థం వంటి విడదీయరాని విశ్వం యొక్క తల్లిదండ్రులైన పార్వతి మరియు పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను."


ఇక్కడ నుండి చదవండి కథ 

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ


రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్థాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపరచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ఠుల వారు ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్య పూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!


అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలన4 వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.


ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.


“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. “భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.


ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదు” అని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు “క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు” అని అన్నాడు.


ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.


అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు “తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదుఱు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆఱోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు

దిలీపుడు తిరుగులేని మహారాజుగా తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేసి, నూరో యాగం తలపెట్టేసరికి ఇంద్రుడు భయపడ్డాడు. అశ్వాన్ని మాయం చేసాడు. తెలిసి కొడుకు రఘుని పంపుతాడు. నందిని తోడు వెళుతుంది. ఇంద్రుడు యుద్ధంలో వజ్రాయుధాన్ని విసురుతాడు. అది ఏ ప్రభావమూ చూపలేకపోతుంది. అప్పుడు ఇంద్రుడు అశ్వమేధ యాగానికి అడ్డుచెప్పడు. అశ్వాన్నీ ఇవ్వడు.  రఘు తిరిగి రాజ్యానికి వస్తాడు. దిలీపుడు  రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు!.


సమర్పణ  

.మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పోతన రూపచిత్రణ!

 పోతన రూపచిత్రణ! 


మ:  త్రిజగ  న్మోహన  నీలకాంతి  తనువుద్దీపింపఁ  బ్రాభాత   నీ


        రజ  బంధుప్రభమైన   చేలము  పయిన్  రంజిల్ల , నీలాలక


        వ్రజ   సంయుక్త   ముఖారవింద   మతి  సేవ్యంబై  విజృభింప   మా


        విజయుం   జేరెడు   వన్నెలాఁడు   మది   నావేశించు  నెల్లప్పుడున్!


                   ఆం: భాగవతం-  ప్రధమస్కంథం-  247: వ: పద్యము;


                     

                   ముల్లోకాలను   మైమరపించే   నీలమేఘ  ఛ్ఛాయగల   తనువుతో, ఉదయారుణ   కిరణ  కాంతిని 


   ప్రతిఫలించు   నుత్తరీయంబుతో ,గాలికి  నూయలలూగు  నల్లని   ముంగురులతో  నొప్పు  ముఖారవిందముతో  చూడముచ్చటఁ  గొల్పుచు  మా  అర్జును  దరికి  నరుదెంచుచుండు  అందగాడు  శ్రకృష్ణుఁ డెల్లవేళల  నామదిలో  నిలచుగాక!  అనిభీష్మ స్తుతి;


                 నల్లనివాడే  గాని  యామేనిలో  నొక  మెఱపున్నది. ఆకర్షణ యున్నది. అదియెంతటిదనగా  ముల్లోకములను  మోహింప  జేయు  నంతటిదట! ఆమూర్తి  కన్నుల బడెనా  అంతే  ఆయాకర్షణ  ప్రవాహమున  గొట్టికొని పోవలసినదే!


                         ఇఁక  నాతఁడు ధరించిన పీతాంబరమా  ఉదయారుణ కాంతి రంజితమై  చూపరులకు  యింపు నింపు  చున్నది. 

కృష్ణుడు కదలివచ్చుచుండ  బాలసూర్యోపమ మైన  కాంతిపుంజ  వలయమేర్పడుటకా  వస్త్రము  ఆధారమగుచున్నది. ఎంత యద్భుతము! 


                  మోమా  అరవిందమును  బోలియున్నది. అది నల్లని  ముంగులతో  శోభాయమానమై  యున్నది.కవి బయటకు చెప్పకున్నను  తుమ్మెదలు  ముసిరిన  పద్మమును  బోలియున్నది. 


                              ఇంత  యందమును  మూటగట్టి  వచ్చువాడు  వన్నెలాడు (సోకులరాయడు)  గాకుండునా? 


              ఇదీ  పోతన  గారి  యద్భుత  రూప  చిత్రణా   సామర్ధ్యము!


                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

బంధాలను దగ్గర చేస్తాడు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 మన క్షేమము కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు.. కొన్ని బంధాలను దూరం చేస్తాడు.. దగ్గర చేసిన బంధాలను అలుసుగా చూడకు.. దూరమైన బంధాలు కోసం ఆరాట పడకు.. కానీ కొన్ని విషయాలను గుర్తు పెట్టుకో.. కుక్కని పెంచుకో పర్వాలేదు.. పిల్లిని పెంచుకో పర్వాలేదు...పాముని పెంచుకో పర్వాలేదు..పులిని పెంచుకో పర్వాలేదు.. కానీ *మెహమాటం* మాత్రం పీచుకోకు.. నీ జీవితానే నాశనం చేస్తుంది🔥మనిషి ఎప్పుడో జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ బాగున్నా ఈ రోజును అశ్వాదించలేక భవిష్యత్తును తనకు కావలసిన విధంగా మలచుకొనే అవకాశం ఉన్నా గతం లోనే ఉండిపోయి జీవితాన్ని అందకారం చేసుకుంటున్నాడు🔥మనిషి ఎప్పుడూ గతం నుండి బయట పడటం మరియు కొత్త విషయాలను ప్రయత్నించడం అనేది అభివృద్ధికి ఉత్తమ మార్గం.. సమస్య వస్తే మాట్లాడు.. సంఘర్శణ వస్తే ఆలోచించు.. సంగతులు హద్దులు దాటితే సరిహద్దులు మూసివేయి.. అగ్ని కూడా దహనమై దహిస్తేనే అజ్ఞానం హతం అవుతుంది.. కాబట్టి ఎప్పుడూ ఎలా ఉండాలో తెల్సుకుని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెల్సుకుని ముందడుగు వెయ్🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

Mahabharatham

 *#Mahabharatham* 


 *ॐॐ శ్రీ మహాభారతం -95వ భాగం ॐॐ* 


    *కలియుగ ధర్మం:* 


ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు. మార్కండేయ మహర్షి ధర్మనందనా ! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది, త్రేతాయుగంలో మూడుపాదాలతో నడుస్తుంది, ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది. కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుంది. ధర్మం క్షీణిస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. మానవుల ఆయుస్షు క్షీణిస్తుంది, విద్యలు క్షీణిస్తాయి. విధ్యా హీనత వలన మోహం కలుగుతుంది. మోహము వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధం, క్రోధం వలన వైరం ఇలా ఒక దాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణ భేధం కలుగుతుంది. వర్ణ బేధము వలన వర్ణసంకరం జరుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము, స్వాధ్యాయము విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు. జనపదాలు కౄరమృగాలతో నిండి పోతాయి. అరాచకం ప్రబలుతుంది. రాజులు దుష్టులౌతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచి పెట్టి సేవకా వృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు, కాయలు, పూలు, పండ్లు సరిగా కాయవు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలి వ్యాపారం, వ్యవసాయం చేస్తాడు. నాస్తికులు ప్రబల మౌతారు. దేహ సంరక్షణయే ప్రధానము అనుకుంటారు. పాపం, పుణ్యమూ అనే మాటలకు విలువ ఉండదు. వానలు సకాలంలో కురవవు. విత్తనాలు తాలుగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలు మోసపూరితమౌతాయి. తాకట్టుఆ పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు. సాధు చరితులు, సజ్జనులు రోగపీడితులౌతారు. అధర్మ వర్తనులు దీర్గాయువులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. పనికిరాని పంటలు ఎక్కువ ఔతాయి. మానవులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ ఔతాయి. పితృ కార్యాలలో అర్పించిన పిండములు ఒకరివి మరొకరు తింటారు. దైవకార్యాలు పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులౌతారు. వేదాలను నిందిస్తూ పూజలు వ్రతములు విడనాడి దుర్మార్గులు ఔతారు. బంధువులను, దీనులను, దుర్భలులను, దీనులను మోసగించి వారి ఆస్తులను అపహరిస్తారు. తల్లి తండ్రులను, కన్నపిల్లలను చంపు వారిని, విచ్చలవిడిగా ప్రవర్తించు వారిని ప్రజలు పూజిస్తారు. వారి ధనానికి ఆశపడి బ్రాహ్మణులు వారిని ఆశ్రయిస్తారు. ప్రజలను రక్షించి భూమి పాలించ వలసిన ప్రభువు వారి ధనాన్ని దోచుకుంటాడు. స్త్రీలను, ధనాన్ని, భూములను హరిస్తారు. రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు. అందువలన ప్రజా క్షయం ఔతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భార్యలు భర్తను అవమానిస్తారు. భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. దేవకార్యం, పితృకార్యం నడవవు. వేదాధ్యయనం అంతరిస్తుంది. ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండి పోతుంది. పదహారు ఏండ్లకే నూరేళ్ళు నిండుతాయి. ఏడెనిమిదేళ్ళకే స్త్రీలు సంతానవతులౌతారు. దానం చేసే వాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు. అన్ని తెలిసిన జ్ఞానులు సైతం అధర్మంగా ప్రవర్తిస్తారు. అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు. స్త్రీలు మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కు తోచక నాలుగు దిక్కులకు పారిపోతారు. దోపిడీదారులు, దొంగలూ ప్రజల ధన, ప్రాణాలను దోచుకుంటారు. ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంతవిషయాలు వివరిస్తుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులు ధైర్యం వీడి శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు, పవిత్రమైన ఆశ్రమాలు, బ్రాహ్మణ గృహాలు పాడై పోతాయి. అడవులను ధ్వంశం చేస్తారు. వ్యభిచారం, మద్యపానం ప్రబలి పోతాయి. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. కరవు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుతుంది.


కల్కి అవతారము:

ఇలా కలియుగం ఆఖరి దశకు చేరగానే శంబళ గ్రామంలో కల్కి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్మరణ చేతనే సకల వేదాలు, శాస్త్రాలు అవగతమౌతాయి. అతను సార్వభౌముడౌతాడు. అతడు అధర్మవర్తనులను సంహరించి ధర్మం నిలబెడతాడు. ఆ పై అశ్వమేధయాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తమ ధర్మం నిర్వర్తిస్తారు. కృతయుగం ఆరంభమౌతుంది. ధర్మం నాలుగు పాదాల విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వవైభవం సంతరించుకుంటాయి. సకాలంలో వానలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిరిగి కాలచక్రం మొదలౌతుంది. కనుక ధర్మనందనా ! నీవు బ్రాహ్మణులను అవమానించకు వారికి ఇష్టం వచ్చినవి చేయుము. సమస్త భూతముల యందు అయకలిగి ఉండు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించు. పాపాత్ములను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలి పెట్టు. ఎల్లప్పుడూ సత్యమే చెప్పు.నీవు భరతవంశ సంజాతుడవు నీకు అన్నీ తెలుసు.ప్రాజ్ఞుడవు నీకు చెప్పవలసిన పని లేదు అన్నాడు.ధర్మరాజు మహాత్మా! మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను లోభం, మత్సరం లేకుండా ప్రవర్తిస్తాను. ధర్మం ఆచరిస్తాను అన్నాడు.


 *సశేషం.......*

సంశయము వదలండి

 🙏🕉️🙏 ..... *"శ్రీ"*


*"అశాంతికి మూలకారణం - ఆశించడం!"*

      ☘️🥭☘️🥭☘️🥭☘️

            ☘️🥭🕉️🥭☘️

                  ☘️🥭☘️

                        ☘️

*"మీరు దైవమును ప్రార్ధించడం, భజించడము, ధ్యానించడము వంటి సాధనల ద్వారా దేవునిపై ప్రేమను, భక్తిని, విశ్వాసాలను వృద్ధి చేసుకోవాలే తప్ప మీ కోరికలను తీర్చుకోవడానికి కూడదు."*


*"షరతులతో కూడిన సాధనలను దైవము అంగీకరించడు."*


*"మీరు పైన చెప్పిన సాధనలు చేస్తున్నా కూడా మీపై దైవానుగ్రహం కురవడం లేదంటే కారణం మీలో ఉండిన ఆశలే!! ఆశల వలన ఏదో మూలన సంశయం కలుగుతుంది."*


*"సంశయం వలన సాధనలో లోపం ఏర్పడుతుంది. లోపాలతో కూడుకున్న సాధన దైవమును చేరకయే తిరిగి వెనుకకు వచ్చేస్తుంది."*


*"ఆశలు ఉండకూడదా అంటే? అవసరములు వేరు ఆశలు వేరు."*


*"మీరు దైవమును చిత్తశుద్ధితో విశ్వసించినపుడు మీరు ఎట్టి కోరికలు పెట్టుకోనవసరం లేదు. మీ అవసరములు అన్నీ తానే చూసుకుంటాడు".*


*"ఎక్కడో కొండ మీద  బండరాతి లోపల ఉన్న కప్ప యొక్క అవసరములు అన్నీ చూసుకుంటున్నవాడు, నిత్యమూ స్మరిస్తూ, జపిస్తూ, ధ్యానిస్తూ ఉన్న నిన్ను చూసుకోలేడా?!!"*


*"సంశయము వదలండి. విశ్వాసపరులుగా మెలగండి.."*

              ☘️🥭☘️🥭☘️

                   ☘️🕉️☘️

                        *"శ్రీ"*

ముక్తి అంటే ఏమిటి

 *ఆచార్య సద్భావన*

                  ➖➖➖✍️

*ముక్తి అంటే ఏమిటి?*


*సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు.* 


*అందుకే అంటారు. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది? వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? అని---*


*అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని-----*


*ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు - సామాన్యంగా.*


 *మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు. శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా, యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా; సత్కర్మలు - పుణ్యకార్యాలు ఎన్ని చేసినా, దేవతలను ఎంతగా పూజించినా ముక్తిలేదు.* *వందమంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు - అని.* 


*మరి ఎలా వస్తుంది? 'ఆత్మైక్య బోధేన' - నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు.* 


*పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. అయితే ముక్తి పొందాలనుకున్నవారు - మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి - నిష్కామంగా - ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం.* ✍️                   

 (వివేక చూడామణి: ఆచార్య శంకరులు)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

రఘువంశములో

 *కళలవాడు-శ్రీరామచంద్రుడు..*


 *పుష్టాయ నమః*

                

*శ్రీ రాముడు  రఘువంశములో జన్మించాడు. రఘువంశపు రాజులంతా సూర్య వంశానికి చెందినవారు.*

*ఆకారణంగా రాముడిని ఆయన ‘రామసూర్య’ అని సంబోధించ వచ్చును.   కానీ , రాముడిని 'శ్రీరామచంద్రా' అనే పిలుస్తారు.*


*దీనికి పలు కారణాలు వున్నప్పటికీ, వాల్మీకి రామాయణం లో ఒక  వివరణ వుంది…*


*వాల్మీకి రామాయణంలో బాలకాండం మొదటి సర్గలో రామునిలోని  16 ముఖ్యమైన  సుగుణాలను పేర్కొన్నారు.*


*నింగిలోని చంద్రుని కళలు పదహారు. అలాగే శ్రీరాముడు కూడా షోడశకళలతో విరాజిల్లి అందరిచేత పూజించబడ్డాడు.*


*శ్రీరాముడు…*```

1. గుణవంతుడు.. అతి నిరాడంబరుడు. తను ఎంత ఉన్నతుడైనప్పటికీ  తనకు సాటి కాని  వారితో  కూడా కలసి మెలసి సంచరించాడు.


2. మహావీరుడు: ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగాడు.


3. ధర్మాత్ముడు: పితృవాక్య పరిపాలకుడు. సకల ధర్మ రక్షకుడు.


4. కృతజ్ఞతాభావం కలిగినవాడు.. తనకి ఎవరు ఏ చిన్న సహాయము చేసినా, అది అతిపెద్ద సహాయంగా తలచి తిరిగి వారందరికి తృప్తి కలిగేలా పెద్ద పెద్ద ఉపకారాలు చేసేవాడు.


తనకి ఎవరైనా కీడు తలపెట్టినా  వారిని క్షమించి ఆ క్షణమే మరచి పోయేవాడు.


5. సత్యవాక్పరిపాలకుడు..

ఎన్ని కష్టాలు వచ్చినా..(భగవంతుడు కష్టాలకు అతీతుడైనా, మానవ స్వభావాన్ని అనుసరించి అవతారసమయంలో  ఎన్ని కష్టాలుకలిగినా) ఇచ్చిన మాట తప్పేవాడు కాదు.


6. ధృఢమైన స్వభావం  కలవాడు.. చేపట్టిన కార్యం పట్టుదలతో సాధించేవాడు.


7. పవిత్రమైన శీలము కలవాడు.


8. సర్వభూతేషు హితుడు.. శతృవులకు కూడా సహాయపడేవాడు.


9. విద్వాంసుడు... సకల విద్యలలో పాండిత్యము కలవాడు.


10. సమర్ధవంతుడు - ఏ కార్యమైనను సాధించగల నేర్పరి.రాతిని నాతిని చేయగలడు. గడ్డిపోచను బాణంగా చేయగలడు.


11.  ప్రియదర్శకుడు... ఆ మూర్తిని ఎల్లప్పుడూ దర్శించాలనే కోరికను జనింపజేసేవాడు.


12. ఆత్మస్థైర్యం కలవాడు. ఎప్పుడూ దేనికి భయపడని స్వభావం కలవాడు.


13. జితక్రోధుడు.. తన కోపాన్ని తన కట్టుబాటులో వుంచుకునేవాడు.


14. ద్యుతిమంతుడు.. ప్రకాశవంతుడు.


15. అనసూయాపరుడు -  ఏ విషయంలోనూ ఎప్పుడూ  ఎవరి మీద అసూయ చెందనివాడు.


16. జాతరోషుడు.. శ్రీ రామునికి  ఆగ్రహమే రాదు.  అలాటి కోపమే వస్తే   ఇంద్రాది దేవతలే తల్లడిల్లిపోతారు.


ఈ విధంగా చంద్రుని వలె  16 కళలు గలవాడు శ్రీరాముడు.


పాడ్యమి మొదలు అమవాస్య, పౌర్ణమితో సహా గల 16 తిధులు  చంద్రుని కళలుగా పూర్ణ చంద్రునిగా చెప్తారు.


చంద్రుని16 కళలవలె, ఈ 16  శుభగుణములు పరిపూర్ణంగా కలిగి వున్నందున శ్రీ రాముడు 'రామచంద్రా' అని పిలువబడుతున్నాడు.


రాముని 16  శుభగుణములు, 16 చంద్రకళలతో పోల్చి శ్రీరాముని విశిష్టతను వివరించడం జరిగింది.


'పుష్టః' అంటే పరిపూర్ణుడని అర్ధం. చంద్రుని 16 కళల వలెనె రాముడు  16 శుభగుణములు కలిగి పరిపూర్ణుడైనందున రాముడు' పుష్టః' పిలువబడుతున్నాడు.


ఇది… అనంతుని వేయి ఆనంద నామాలలో 394 వ నామము.


'పుష్టాయ నమః'  అని నిత్యం జపించే భక్తుల జీవితాలలో సకల శుభాలు పరిపూర్ణంగా లభించేలా శ్రీ రాముడు అనుగ్రహిస్తాడు.✍️

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: అర్జున ఉవాచ


జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన 

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ (1)


వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే 

తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో௨హమాప్నుయామ్ (2)


జనార్దనా... కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా  అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్ధ కర్మకు నన్నెందుకు పురికొల్పుతున్నావు అటూయిటూ కాని మాటలతో నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు.

⚜ శ్రీ కుమారనల్లూర్ భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1050


⚜ కేరళ  : కొట్టాయం 


⚜ శ్రీ కుమారనల్లూర్ భగవతి ఆలయం


💠 కుమారనల్లూర్ పురాతన సాంస్కృతిక కేంద్రం.  

ఈ పట్టణం కుమారనల్లూర్ దేవి (దేవత) ఆలయానికి మరియు ఆలయ వార్షిక త్రికార్తిక పండుగకు ప్రసిద్ధి చెందింది.  


💠 ఆలయం ఉనికిలోకి రాకముందు ఈ ప్రాంతాన్ని 'తింగల్‌క్కడు' అని పిలిచేవారు.  

తర్వాత ‘తింగల్క్కడు’ అనే పేరు మారి ‘ఇందు కాననం’గా మారింది.  

కొన్ని పురాతన లిపిలలో, ఆలయం వర్ణించబడింది మరియు మహిషరి కోవిల్ (ఆలయం) అని పిలుస్తారు.


💠 కుమారనల్లూర్ దేవి ఆలయం కేరళలోని 108 దుర్గాలయాలలో (దేవి ఆలయాలు) అత్యంత ముఖ్యమైన దేవి ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.  

చారిత్రక మరియు పౌరాణిక ఆధారాలతో పాటు ఇతర సమాచార వనరుల ప్రకారం ఈ ఆలయం 2400 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతారు.


💠  ఆలయ వాస్తుశిల్పం నాలంబలం మరియు శ్రీకోవిల్ యొక్క విశిష్ట నిర్మాణం కోసం గుర్తించదగినది, ఈ రెండూ శ్రీచక్ర శైలిలో నిర్మించబడ్డాయి (ఒక హ్యాండిల్‌తో కూడిన రింగ్ వంటి వస్తువు, ఇది దేవి యొక్క కుడి చేతిలో ఉంచబడుతుంది).  

ఈ తరహా వాస్తుశిల్పం ఆలయ నిర్మాణంలో చాలా అరుదుగా కనిపిస్తుంది.


🔆 చేరమాన్ పెరుమాళ్ 


💠 దుర్గా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి వైకోమ్ సమీపంలోని ఉదయనపురంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైనప్పుడు చేరమాన్ పెరుమాళ్ కేరళ పాలించే చక్రవర్తి;  అతను కుమార లేదా సుబ్రమణియన్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఒక ప్రదేశంలో (తరువాత దీనిని కుమారనల్లూర్ అని పిలుస్తారు)  ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు.  మరోవైపు తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది.  

దేవి యొక్క రత్నం పొదిగిన ముక్కు ఉంగరం దొంగిలించబడింది లేదా తప్పిపోయింది.  

రాజు విచారణకు ఆదేశించాడు.  

అదే సమయంలో, అతను ఈ సమస్యను 41 రోజుల్లో పరిష్కరించకపోతే ఆలయ పూజారిని చంపాలని ఆదేశించాడు.  

ఎందుకంటే, అతనికి తెలియకుండా ముక్కుపుడక తప్పదు.  

అయితే పూజారి నిర్దోషి.  

ఈ సందిగ్ధంలో అతను అయోమయంలో పడ్డాడు.  

దేవి పాదాలను శరణువేడాడు.


🔆 నలభై రోజులు 


💠 రోజులు మరియు వారాలు గడిచేకొద్దీ, దుఃఖంలో ఉన్న పూజారి తన పగలు మరియు రాత్రులు ఏడుస్తూ మరియు ప్రార్థన చేస్తూ గడిపాడు.  

40వ రోజు రాత్రి, అతను ఆలయ గుమ్మాల వద్ద నిద్రపోయాడు, ధ్యానం చేస్తూ, మరుసటి రోజుతో తన జీవితం ముగుస్తుందని తన విధిని తలచుకున్నాడు.  అయితే ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది.  దేవి అతని ముందు ప్రత్యక్షమై వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశించింది.  అయోమయానికి గురైన పూజారి కళ్ళు చిట్లించాడు.  అతను ఒక దైవిక కాంతి ముందుకు కదులుతున్నట్లు చూశాడు.  ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక దానిని అనుసరించాడు.  

తేజస్సు అతన్ని చాలా దూరం నడిపించింది మరియు చివరకు కుమారనల్లూర్ అని పిలువబడే ప్రదేశానికి చేరుకుంది.  

కుమారనల్లూర్ వద్ద, సుబ్రమణ్యస్వామి లేదా కుమరన్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఆలయం నిర్మాణంలో ఉంది.


🔆 పుణ్యక్షేత్రం 


💠 తేజస్సు ఆలయంలోని శ్రీకోవిల్ (గర్భగృహం)లోకి ప్రవేశించింది.  అంతేకాకుండా, ప్రతిష్టా సమయంలో (స్థాపనకు తగిన సమయం) తేజస్సు శ్రీకోవిల్లోకి ప్రవేశించింది.  అప్పుడు ఒక అసరీరి (నిరాకారమైన మరియు దైవిక స్వరం), ‘కుమారన్ అల్లా ఊరిల్’{మలయాళం}, అంటే, ‘ఈ స్థలం కుమార కోసం కాదు’.  

ఇది కుమారి లేదా దేవి స్థానం.  

అందుకే దీనికి కుమారనల్లూర్ అని పేరు వచ్చింది.  

పెరుమాళ్ నిరాశ మరియు నిరుత్సాహానికి గురయ్యాడు.  నిర్మాణంలో ఉన్న ఆలయంలో కుమారుని విగ్రహాన్ని  ప్రతిష్టించగలిగారు.


💠 తరువాత, పెరుమాళ్ దేవి విగ్రహంతో కుమారనల్లూర్‌కు తిరిగి వచ్చి అక్కడ ప్రతిష్టించడానికి సన్నాహాలు ప్రారంభించాడు. 

 విగ్రహాన్ని మార్చాలి అని అతనికి మరో ఆలోచన తట్టింది.  సమీపంలోని వేదగిరి వద్ద నీటిలో ఒక విగ్రహం పడి ఉంది.  పెరుమాళ్ విగ్రహాన్ని వేదగిరి నుంచి తీసుకొచ్చారు. 


💠 మహర్షి పరశురాముడు గతంలో విగ్రహాన్ని తయారు చేసి పూజించినట్లు చెప్పబడింది.  ప్రతిష్ఠాపన సమయంలో, ఒక బ్రాహ్మణ ఋషి, వెంట్రుకలతో, వచ్చి, శ్రీకోవిల్లోకి ప్రవేశించి, ఒక సెకనులో విగ్రహాన్ని ప్రతిష్టించాడు.  విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన వెంటనే అదృశ్యమయ్యాడు.  ఈ తేదీ వరకు బ్రాహ్మణ ఋషి మహర్షి పరశురాముడు అని ప్రజలు నమ్ముతారు.  మధురై నుండి తేజస్సును అనుసరించిన బ్రాహ్మణ పూజారి ఆలయ పూజారి అయ్యాడు.  అతని నివాసాన్ని మధురై ఇల్లం అంటారు.  అతని వారసులు నేటికీ దేవీని పూజిస్తారు.


🔆 కుమారనల్లూరు త్రికార్తిక ఉత్సవం 


💠 వృశ్చికం (నవంబర్-డిసెంబర్) నెలలో జరుపుకునే ముఖ్యమైన పండుగ త్రికార్తిక.  

కార్తీక రోజున ఉదయనపురం మరియు త్రిస్సూర్ వడక్కునాథ దేవాలయాల ప్రాంగణంలో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.  కార్తీక విళక్కు అని పిలిచే సాయంత్రం దీపాల ప్రదర్శన ఈ వేడుకలో హైలైట్.



💠 కొట్టాయం నగరం  5 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

14-22,23,24,25-గీతా మకరందము

 14-22,23,24,25-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అర్జునుని యా ప్రశ్నను విని భగవానుడు గుణాతీతుని లక్షణములను వివరముగ చెప్పుచున్నారు- 

 

శ్రీ భగవానువాచ — 

ప్రకాశం చ ప్రవృత్తిం చ 

మోహమేవ చ పాణ్ణవ| 

న ద్వేష్టి సమ్ప్రవృత్తాని 

న నివృత్తాని కాంక్షతి || 

 

ఉదాసీనవదాసీనో 

గుణైర్యో న విచాల్యతే | 

గుణా వర్తన్త ఇత్యేవ 

యోఽవతిష్ఠతి నేఙ్గతే ||

 

సమదుఃఖసుఖస్స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః | 

తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిన్దాత్మసంస్తుతిః ||

 

మానావమానయో* స్తుల్యః 

తుల్యో మిత్రారిపక్షయోః | 

సర్వారమ్భపరిత్యాగీ 

గుణాతీతస్స ఉచ్యతే || 

 

తాత్పర్యము:- శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా ! ఎవడు తనకు సంప్రాప్తములైన సత్త్వగుణసంబంధమగు ప్రకాశమును (సుఖమును) గాని, రజోగుణసంబంధమగు కార్య ప్రవృత్తినిగాని, తమోగుణసంబంధమగు మోహమును (నిద్రా,తంద్రతలను) గాని ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో, తటస్థునివలె ఉన్నవాడై గుణములచేత (గుణకార్యములగు సుఖాదులచేత) చలింపజేయడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలిసికొనియుండునో, (ఏపరిస్థితులయందును) చలింపక నిశ్చలముగ నుండునో, మఱియు ఎవడు సుఖదుఃఖములందు సమభావము గలవాడును, ఆత్మయందే స్థిరముగనున్నవాడును, మట్టిగడ్డ, ఱాయి, బంగారము - వీనియందు సమబుద్ధి గలవాడును, ఇష్టానిష్టములందు సమభావము గల్గియుండువాడును, ధైర్యవంతుడును, సమస్త కార్యములందును కర్తృత్వబుద్ధిని వదలువాడును, (లేక కామ్యకర్మలనన్నిటిని విడచువాడును, లేక సమస్తకర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండు వాడును) అయియుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును.


వ్యాఖ్య:- గుణాతీతునియొక్క లక్షణము లిచట పేర్కొనబడినవి. ఈ లక్షణములను బట్టి మనుజుడు త్రిగుణములను దాటినది, లేనిది తెలిసికొనవచ్చును. గుణాతీతుడు తటస్థుడుగనుండుచు తనకు ఏ కారణముచేతనైనా, సత్త్వగుణసంబంధమైన ప్రకాశము (సుఖము) గాని, రజోగుణసంబంధమైన కార్యప్రవృత్తిగాని, తమోగుణసంబంధమైన మోహము (నిద్రాతంద్రతలు) గాని సంప్రాప్తించినచో వానియెడల ద్వేషముగాని, అవి తొలగినచో వానిని కోరుటగాని లేకుండును. గుణాతీతునియొక్క తాటస్థ్యమును, ఔదాసీన్యస్థితిని తెలుపుటకు ఈ విషయము బోధింపబడినదేకాని ఆ యా మోహాదిగుణములు అవలంబనీయములని తెలుపుటకాదు. మఱియు ఇచట మోహమనగా అజ్ఞానమని అర్థముకాదు. ఏలయనిన గుణాతీతునకు అజ్ఞానమెపుడో తొలగిపోయియుండును. భగవానుడు తెలిపిన ఈ గుణాతీతుని లక్షణములందు 'నిశ్చలత్వము', 'సమత్వము' అనునవి ప్రధానముగ గోచరించుచున్నవి -

(1) ‘నిశ్చలత్వము’ - ఏ చిన్న సంఘటన జరిగినను అజ్ఞాని బెదరిపోవును. తన సమత్వమును గోల్పోవును. కాని గుణాతీతుడు మేరుసమానగాంభీర్యముగలిగి, పరిస్థితులకు ఏమాత్రము చలింపకనుండును (న విచాల్యతే, నేఙ్గతే). శ్వాసవాయువు, లేక చిన్న అలలు పర్వతమును కదలింపజాలనట్లును, మేఘములకు పైనున్న సూర్యుని మేఘజనితములగు పిడుగులు, మెఱుపులు, వర్షము బాధింపజాలనట్లును, త్రిగుణములను దాటి మనస్సునకు ఆవలనున్న ఆత్మయందు నిలుకడగలిగియున్న యోగిపుంగవుడు ప్రపంచములోని ఏ సంఘటనచేగాని, ఆపత్తుచేగాని చలింపక సదా ఆత్మయందే సుస్థిరుడై యుండును. ఆ వికటపరిస్థితులన్నియు మనస్సునకు జెందినవి. గుణములకు సంబంధించినవి. ఉపాధికి జేరినవి. "నేను గుణములకంటె వేఱుగనున్నాను. మనస్సునకు అతీతుడనైయున్నాను" అని తలంచి యాతడు మహద్ధైర్యయుతుడై మెలగును. గుణాతీతునియొక్క గుఱుతు ఇదియే.


(2) సమత్వము - మానావమానములందు, నిందాస్తుతులయందు, సుఖదుఃఖము లందు, ఇష్టానిష్టము లందు, శత్రుమిత్రాదులందు, శిలాకాంచనములందు గుణాతీతుడగు మహనీయుడు సమబుద్ధి గలిగియుండును. గుణాతీతుడైన శుకమునీంద్రుడు జనకుని యాస్థానమున కేగినపుడు, ఆతని పరీక్షార్థము జనకునిచే కలుగజేయబడిన సుఖదుఃఖాదులందు ఆతడెంతటి సమత్వమునుజూపెనో ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. అట్టి మహనీయులు నిరంతరము ఆత్మస్థితియందే (ధ్యేయాకారమందే, స్వవస్తువునందే) నిలుకడ గలిగియుందురు. కావున మిథ్యారూప ప్రపంచమునందలి ఇట్టి ద్వంద్వములు వారినేమియు చేయజాలవు. మఱియు నిందాస్తుతులు, సుఖదుఃఖములు మున్నగునవి మనోధర్మములే, కావున మనస్సాక్షియగు ఆత్మయందు సదా సుస్థితులైయుండు గుణాతీతులను, జ్ఞానులను అవి కదలింపజేయజాలవు. మఱియొకనికి కలుగు సుఖదుఃఖములు మనుజుని యెట్లు బాధింపజాలవో, అట్లే ఉపాధిని తనకంటె వేఱుచేసికొనిన జ్ఞానిని, గుణాతీతుని ఆ యా ద్వంద్వములు బాధింపజాలవు.


'సర్వారమ్భపరిత్యాగీ’ - ఈ పదమునకు "సమస్తకార్యములందును కర్తృత్వమును వదలినవాడ”ని అర్థము చెప్పుటయే సమంజసముగ నుండును. లేక, కామ్యకర్మలన్నిటిని వదలినవాడనియు చెప్పవచ్చును.లేక, ఇతరకార్యములన్నిటిని త్యజించివైచి నిరంతరము బ్రహ్మనిష్టయందుండువాడనియు పేర్కొనవచ్చును.

తిరుమల సర్వస్వం 178-*

 *తిరుమల సర్వస్వం 178-*

మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం-3* 

*శ్రీని పైగా మఠానికి ప్రథమ మహంతు అయిన హాథీరామ్ బాబాజీ పట్ల ఆలయ అధికారులకు, అర్చకులకు, జియ్యంగార్లకు, భక్తులకు ఇలా ఆలయంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న వారందరికీ బావాజీ పట్ల విశేషమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. తదనంతర కాలంలో వారి శిష్యులు, అనుచరులు కూడా అదే రకమైన ఆదరాన్ని చూరగొన్నారు. కాబట్టి వారికి అధికారాన్ని అప్పగిస్తే, ఆలయం లోని ఇతరవర్గాల వారికి కూడా సమ్మతంగానే ఉంటుంది.


 అంతే గాకుండా, మహంతు లందరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వారే కాబట్టి, అధికారం వారసులకు సంక్రమించే అవకాశం లేదు.


 మహంతులకు అప్పటికే విస్తృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం సమర్థత ఉన్నాయి.


 ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.


 బ్రిటిష్ వారు ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకు అప్పజెప్పాలని తీర్మానించుకున్న అనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


[ రేపటి భాగంలో... *మహంతుల కాలంలో దేవాలయం నిర్వహణ తీరుతెన్నులను, వారు చేపట్టిన దేవాలయ అభివృద్ధి కార్యకలాపాలు* గురించి తెలుసుకుందా.


 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


  సశేషం...*


ఓం నమోవేంకటేశాయ 

 *తిరుమల సర్వస్వం- 80* 

 

*మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం-2*


 మహంతులకు అప్పటికే విస్తృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం సమర్థత ఉన్నాయి.


 ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.


 బ్రిటిష్ వారు ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకు అప్పజెప్పాలని తీర్మానించుకున్న అనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


 *అధికారాల బదిలీ* 


 ఆ ఉత్తర్వులను అనుసరించి, 1843వ సంవత్సరం జూలై నెలలో మహంతు మఠానికి ఆ సమయంలో నేతృత్వం వహిస్తున్న 'మహంతు సేవాదాస్' గారు 'విచారణకర్త' గా నియమింపబడ్డారు. విచారణకర్త అంటే దాదాపుగా ఈనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో సమాన మన్నమాట. ఆలయ సక్రమ నిర్వహణకుకు, ఆర్థిక వ్యవహారాలకు ఆయనే జవాబుదారీ. ఈ విధంగా మహంతుమఠానికి విశేష అధికారాలు దఖలు పడ్డాయి. అదే నెల 16వ తేదీనాడు, దక్షిణాయన సంక్రాంతి పర్వదినాన అప్పటివరకు ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారి నుండి, ఆలయానికి సంబంధించిన సమస్త స్థిర చరాస్తుల ధర్మకర్తృత్వం మహంతు సేవాదాసుకు బదిలీ చేయబడింది. శ్రీవారి ఆభరణాలు, వాహనాలు, వెండి బంగారు పాత్రలు, ఇతర కైంకర్య సామాగ్రి, రొక్ఖం మొదలైనవన్నీ; పలువురి సమక్షంలో వ్రాతపూర్వకంగా మహంతుకు అప్పజెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన జరిగే *ఆణివార ఆస్థానం* అనే సంవత్సరోత్సవం గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ మధ్య కాలం వరకు ఆలయ ఆర్థిక సంవత్సరం ఆ దినం నుండే ప్రారంభమయ్యేది. అలా దేవాలయ పాలనా బాధ్యతలు చేపట్టిన, బాబాజీ శిష్యులైన, మహంతులు విష్వక్సేనముద్రను తమ అధికారిక ముద్రగా ఎన్నుకొన్నారు. శ్రీవేంకటేశ్వరునికి సర్వసైన్యాధిపత్యం వహించే విష్వక్సేనుడు వారికి అన్ని రకాలుగా దన్నుగా ఉంటాడని వారి విశ్వాసం.

వాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*


*317 వ రోజు*


*కృషార్జునులు రధాశ్వముల సేద దీర్చుట*


అప్పటికి అర్జునుడు అలసి పోయాడు రథాశ్వాలు కూడా అలసి పోయాయి. సైంధవుడు కను చూపు మేరలో కనుపించ లేదు. ఈ పరిస్థితి గమనించిన కౌరవ సేనలు సింహనాదాలు చేస్తూ పాండవ సేనలను తరుముతున్నారు. అర్జునుడు " కృష్ణా ! నేను వీరిని నిలువరిస్తాను నువ్వు రధాన్ని ఆపి రధాశ్వాలకు విశ్రాంతి నిమ్ము " అన్నాడు. ఇదే తగిన సమయమని కౌరవ యోధులు అర్జునుడిని చుట్టుముట్టి శరవర్షం కురిపించారు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వారి మీద ప్రయోగించాడు. సముద్ర తరంగం వలె తన మీద పడుతున్న సైన్యాలను చెలియలి కట్ట వలె అడ్డుకుని అర్జునుడు భల్ల బాణములతో రథములను విరిచి, అర్ధ చంద్ర బాణాలతో ఏనుగులను చంపుతున్నాడు. క్రూర నారాచములతో హయములను నేల పడదోస్తున్నాడు. రణరంగం అంతా మాంస ఖండములతోను, తెగిన తలలతోను, ఏనుగుల అశ్వముల కళేబరములతో నిండి పోయింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో " అర్జునా! మన గుర్రములు సేద తీరాయి కాని వాటికి దాహం వేస్తున్నట్లుంది. అవి నీరు త్రాగితేగాని తెప్పరిల్లవు ఎలా " అన్నాడు. అర్జునుడు " దానిదేముంది కృష్ణా ! ఇక్కడే ఇప్పుడే నీరు తెప్పిస్తాను " అని తన బాణములతో భూమిని చీల్చి ఒక కొలను ఏర్పరచి దానిని నీటితో నింపాడు. అది చూసిన కౌరవ సేనలు ఆశ్చర్య పోయాయి. శ్రీకృష్ణుడు సంతోషించి అర్జునుడిని ప్రశంసించి అశ్వాలతో నీరు త్రావించి రథముకు కట్టి రథము సిద్ధము చేసాడు. అర్జునుడు రథం ఎక్కాడు. శ్రీకృష్ణుడు నొగల మీద కూర్చున్నాడు. అంతలో దూరం నుండి వస్తున్న సుయోధనుడిని చూసి కృష్ణుడు రథమును సుయోధనుడి వైపు పోనిచ్చాడు. అది చూసిన కౌరవయోధులు " ఇప్పటి వరకు కౌరవ సేనలను పీనుగు పెంటలు చేసాడు. ఇప్పుడు సుయోధనుడిని ఎదుర్కొంటున్నాడు ఏమౌతుందో ఏమో " అని తమలో తాము అనుకున్నారు. ఇంతలో పొద్దు వ్రాలడం గమనించి పాంచజన్య, దేవదత్తములు పూరించారు. ఆ ధ్వనికి కౌరవ రాజులు గుండెలు పగిలి సైంధవుడి సంగతి దేవుడెరుగు మన ప్రాణాలు రక్షించుకోవాలి అనుకుని సైంధవుని రక్షణ వలయం నుండి తొలగి పోయారు. అర్జునుడు " కృష్ణా! అడుగో సైంధవుడు. వాడికి చుట్టూ కృపాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, కర్ణుడు కర్ణుని కుమారులు రక్షణగా నిలిచి ఉన్నారు. వాడి చావు నా చేతిలో మూడింది. వీరంతా సైంధవుని రక్షించగలరా . వీరే కాదు దేవతలు దండెత్తి వచ్చినా ఈ రోజు పొద్దు వాలే లోపు వీడిని చంపి తీరుతాను " అన్నాడు. అమిత ఔర్యంతో సైంధవుని వైపు వస్తున్న అర్జునుడిని చూసి కౌరవ యోధులు సైంధవునిపై ఆశలు వదులుకున్నారు. అర్జునుడు సింహనాదం చేసాడు. కృష్ణుడు సైంధవుని వైపు రథం పోనిచ్చాడు. ఇంతలో ద్రోణుడు ఇచ్చిన కవచధారణ చేసిన సుయోధనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝  *నాకీర్తయిత్వా గాఃసుప్యాత్*


 *తాసాం సంస్మృత్య చోత్పతేత్*


        *సాయం ప్రాతర్నమస్యేచ్చ*

 *గాస్తతః పుష్టిమాప్నుయాత్*


                        *గోవైశిష్ట్యం - మహాభారతం*


*తాత్పర్యము : గోవులను కీర్తించకుండా ( నమస్కరించకుండా లేదా స్మరించుకుండా ) నిద్రించరాదు. గోవులను స్మరించి నిద్రలేవాలి. ఉదయం సాయంకాలములలో గోవులకు నమస్కరించినట్లైతే మానవులు బలమును, పుష్టిని పొందుతారు*.


✍️🌹💐🪷🙏

శనివారం,మార్చి.15,2025

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శనివారం,మార్చి.15,2025

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి మ12.59 వరకు

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:ఉత్తర ఉ7.44 వరకు

యోగం:గండం మ1.01 వరకు

కరణం:కౌలువ మ12.59 వరకు

తదుపరి తైతుల రా1.55 వరకు

వర్జ్యం:సా4.57 - 6.43

దుర్ముహూర్తము:ఉ6.13 - 7.48

అమృతకాలం:తె3.30 - 5.16

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30-3.00

సూర్య రాశి: కుంభం 

చంద్రరాశి: కన్య 


సూర్యోదయం:6.13

సూర్యాస్తమయం:6.06


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

 *మిట్టాపల్లి*

గురువు ఘనత*

 *గురువు ఘనత*


1 *ఆ వె విద్య బుద్ధులిచ్చి విలువను పెంచిన* 

*బ్రతుకు బాట చూపి బాగుపరచు* 

*గొప్పవారలైన మెప్పును పొందును*

*నాటినట్టి మొక్క మేటియైన* 



2 *ఆ వె మంచి బాట చూపి మసులుకోమన్నను* 

*బరువు గాను నెంచి గురువు నెపుడు* 

*కించ పరచకుండ పెంచుము మర్యాద*

 *గౌరవంబుదక్కి ఘనత పెరుగు*


*పద్య కవితా శిల్పకళానిధి* 

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

*మిట్టాపల్లి*

Panchaag




 

మతమను పేరు జెప్పుచు

 చ.మతమను పేరు జెప్పుచు నమానుషమైన విరోధ భావ సం

శ్రితమగు నీచ కృత్యములు సేయుచు మానవ జాతికిన్ మహో

ధ్ధృతముగ హానిఁ జేసెడు విధిం గన చిత్తము ఖేదమొందు నీ

గతులను సృష్టి సేయు పలు గాకులఁ గూల్చగ రాదొ! భారతీ!౹౹85


చ.స్తుతమతులైన విజ్ఞులు యశోగతి నందగ గూర్చినార లీ

మతమును మానవాళికి సమంచిత రీతిని నొక్క త్రాటిపై 

హితము నొసంగ జేయు మతి నింపును గూర్చు పథమ్ము గాగ స  

మ్మతమును దెల్పు భావ పరిమాణమె యిద్ది గణింప భారతీ!౹౹ 86

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  - పాడ్యమి - ఉత్తరాఫల్గుని -‌‌ స్థిర వాసరే* (15.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*