15, మార్చి 2025, శనివారం

గురువు ఘనత*

 *గురువు ఘనత*


1 *ఆ వె విద్య బుద్ధులిచ్చి విలువను పెంచిన* 

*బ్రతుకు బాట చూపి బాగుపరచు* 

*గొప్పవారలైన మెప్పును పొందును*

*నాటినట్టి మొక్క మేటియైన* 



2 *ఆ వె మంచి బాట చూపి మసులుకోమన్నను* 

*బరువు గాను నెంచి గురువు నెపుడు* 

*కించ పరచకుండ పెంచుము మర్యాద*

 *గౌరవంబుదక్కి ఘనత పెరుగు*


*పద్య కవితా శిల్పకళానిధి* 

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

*మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: