చ.మతమను పేరు జెప్పుచు నమానుషమైన విరోధ భావ సం
శ్రితమగు నీచ కృత్యములు సేయుచు మానవ జాతికిన్ మహో
ధ్ధృతముగ హానిఁ జేసెడు విధిం గన చిత్తము ఖేదమొందు నీ
గతులను సృష్టి సేయు పలు గాకులఁ గూల్చగ రాదొ! భారతీ!౹౹85
చ.స్తుతమతులైన విజ్ఞులు యశోగతి నందగ గూర్చినార లీ
మతమును మానవాళికి సమంచిత రీతిని నొక్క త్రాటిపై
హితము నొసంగ జేయు మతి నింపును గూర్చు పథమ్ము గాగ స
మ్మతమును దెల్పు భావ పరిమాణమె యిద్ది గణింప భారతీ!౹౹ 86
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి