15, మార్చి 2025, శనివారం

తిరుమల సర్వస్వం 178-*

 *తిరుమల సర్వస్వం 178-*

మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం-3* 

*శ్రీని పైగా మఠానికి ప్రథమ మహంతు అయిన హాథీరామ్ బాబాజీ పట్ల ఆలయ అధికారులకు, అర్చకులకు, జియ్యంగార్లకు, భక్తులకు ఇలా ఆలయంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న వారందరికీ బావాజీ పట్ల విశేషమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. తదనంతర కాలంలో వారి శిష్యులు, అనుచరులు కూడా అదే రకమైన ఆదరాన్ని చూరగొన్నారు. కాబట్టి వారికి అధికారాన్ని అప్పగిస్తే, ఆలయం లోని ఇతరవర్గాల వారికి కూడా సమ్మతంగానే ఉంటుంది.

 అంతే గాకుండా, మహంతు లందరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వారే కాబట్టి, అధికారం వారసులకు సంక్రమించే అవకాశం లేదు.

 మహంతులకు అప్పటికే విస్తృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం సమర్థత ఉన్నాయి.

 ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

 బ్రిటిష్ వారు ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకు అప్పజెప్పాలని తీర్మానించుకున్న అనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

[ రేపటి భాగంలో... *మహంతుల కాలంలో దేవాలయం నిర్వహణ తీరుతెన్నులను, వారు చేపట్టిన దేవాలయ అభివృద్ధి కార్యకలాపాలు* గురించి తెలుసుకుందా.

 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 

  సశేషం...*

ఓం నమోవేంకటేశాయ 

 *తిరుమల సర్వస్వం- 80* 

*మహంతుల నిర్వహణలో తిరుమల ఆలయం-2*

 మహంతులకు అప్పటికే విస్తృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం సమర్థత ఉన్నాయి.

 ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

 బ్రిటిష్ వారు ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకు అప్పజెప్పాలని తీర్మానించుకున్న అనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 *అధికారాల బదిలీ* 

 ఆ ఉత్తర్వులను అనుసరించి, 1843వ సంవత్సరం జూలై నెలలో మహంతు మఠానికి ఆ సమయంలో నేతృత్వం వహిస్తున్న 'మహంతు సేవాదాస్' గారు 'విచారణకర్త' గా నియమింపబడ్డారు. విచారణకర్త అంటే దాదాపుగా ఈనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో సమాన మన్నమాట. ఆలయ సక్రమ నిర్వహణకుకు, ఆర్థిక వ్యవహారాలకు ఆయనే జవాబుదారీ. ఈ విధంగా మహంతుమఠానికి విశేష అధికారాలు దఖలు పడ్డాయి. అదే నెల 16వ తేదీనాడు, దక్షిణాయన సంక్రాంతి పర్వదినాన అప్పటివరకు ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారి నుండి, ఆలయానికి సంబంధించిన సమస్త స్థిర చరాస్తుల ధర్మకర్తృత్వం మహంతు సేవాదాసుకు బదిలీ చేయబడింది. శ్రీవారి ఆభరణాలు, వాహనాలు, వెండి బంగారు పాత్రలు, ఇతర కైంకర్య సామాగ్రి, రొక్ఖం మొదలైనవన్నీ; పలువురి సమక్షంలో వ్రాతపూర్వకంగా మహంతుకు అప్పజెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన జరిగే *ఆణివార ఆస్థానం* అనే సంవత్సరోత్సవం గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ మధ్య కాలం వరకు ఆలయ ఆర్థిక సంవత్సరం ఆ దినం నుండే ప్రారంభమయ్యేది. అలా దేవాలయ పాలనా బాధ్యతలు చేపట్టిన, బాబాజీ శిష్యులైన, మహంతులు విష్వక్సేనముద్రను తమ అధికారిక ముద్రగా ఎన్నుకొన్నారు. శ్రీవేంకటేశ్వరునికి సర్వసైన్యాధిపత్యం వహించే విష్వక్సేనుడు వారికి అన్ని రకాలుగా దన్నుగా ఉంటాడని వారి విశ్వాసం.

వాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 

*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: