🙏🕉️🙏 ..... *"శ్రీ"*
*"అశాంతికి మూలకారణం - ఆశించడం!"*
☘️🥭☘️🥭☘️🥭☘️
☘️🥭🕉️🥭☘️
☘️🥭☘️
☘️
*"మీరు దైవమును ప్రార్ధించడం, భజించడము, ధ్యానించడము వంటి సాధనల ద్వారా దేవునిపై ప్రేమను, భక్తిని, విశ్వాసాలను వృద్ధి చేసుకోవాలే తప్ప మీ కోరికలను తీర్చుకోవడానికి కూడదు."*
*"షరతులతో కూడిన సాధనలను దైవము అంగీకరించడు."*
*"మీరు పైన చెప్పిన సాధనలు చేస్తున్నా కూడా మీపై దైవానుగ్రహం కురవడం లేదంటే కారణం మీలో ఉండిన ఆశలే!! ఆశల వలన ఏదో మూలన సంశయం కలుగుతుంది."*
*"సంశయం వలన సాధనలో లోపం ఏర్పడుతుంది. లోపాలతో కూడుకున్న సాధన దైవమును చేరకయే తిరిగి వెనుకకు వచ్చేస్తుంది."*
*"ఆశలు ఉండకూడదా అంటే? అవసరములు వేరు ఆశలు వేరు."*
*"మీరు దైవమును చిత్తశుద్ధితో విశ్వసించినపుడు మీరు ఎట్టి కోరికలు పెట్టుకోనవసరం లేదు. మీ అవసరములు అన్నీ తానే చూసుకుంటాడు".*
*"ఎక్కడో కొండ మీద బండరాతి లోపల ఉన్న కప్ప యొక్క అవసరములు అన్నీ చూసుకుంటున్నవాడు, నిత్యమూ స్మరిస్తూ, జపిస్తూ, ధ్యానిస్తూ ఉన్న నిన్ను చూసుకోలేడా?!!"*
*"సంశయము వదలండి. విశ్వాసపరులుగా మెలగండి.."*
☘️🥭☘️🥭☘️
☘️🕉️☘️
*"శ్రీ"*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి