7, డిసెంబర్ 2020, సోమవారం

Jupiter & Saturn Conjunction

  



Remedy from Srimad Bhagavatam for Jupiter & Saturn Conjunction


Guru (Jupiter) and Shani (Saturn) are coming together in the sign of Makara (Capricorn) on December 21st, 2020.

They are already closely conjunct (within 3 degrees) now.

The Story of Gajendra Moksha from the Srimad Bhagavatam has a close connection with this grand conjunction in Capricorn.


Gajendra Moksha


Gajendra Moksha or The Liberation of Gajendra is a Puranic legend from the 8th Skandha of the Bhāgavata Purāṇa, a sacred book in Hinduism. Lord Vishnu came down to earth to protect Gajendra, the elephant, from the clutches of a Crocodile, alternatively known as Makara or Huhu, and with Vishnu’s help, Gajendra achieved moksha, or liberation from cycle of birth and death. Gajendra then attained a form like that of the god (Sarupya Mukti) and went to Vaikuntha with Vishnu. This story was narrated by Shuka to King Parikshit at Parikshit’s request.

There was once an elephant named Gajendra who lived in a garden called Ṛtumat which was created by Varuna. This garden was located on Mount Trikuta, the “Three-Peaked Mountain.” Gajendra ruled over all the other elephants in the herd. One day as usual he went to the lake near by to pick lotus flowers to offer prayer to Lord Vishnu.

Suddenly, a crocodile living in the lake attacked Gajendra and caught him by the leg. Gajendra tried for a long time to escape from the crocodile’s clutches. All his family members, relatives and friends gathered around to help him, but in vain. The crocodile simply would not let go. When they realised that ‘death’ had come close to Gajendra, they left him alone. He trumpeted in pain and helplessness until he was hoarse.

As the struggle was seemingly endless and when he had spent his last drop of energy, Gajendra called to the god Vishnu to save him, holding a lotus up in the air as an offering. Hearing his devotee’s call and prayer, Vishnu rushed to the scene. As Gajendra sighted the god coming, he lifted a lotus with his trunk. Seeing this, Vishnu was pleased and with his Sudharshana Chakra, he decapitated the crocodile.

Gajendra prostrated himself before the god. Vishnu informed Gajendra that he, in one of his previous births, had been the celebrated King Indradyumna, a devotee of Vishnu, but due to his disrespect to the great Sage Agastya, he had been cursed to be reborn as an elephant. Because Indradyumna had been devoted to Vishnu, the god had him born as Gajendra and made him realize that there is something called Kaivalya which is beyond Svarga and Urdhva Loka, the realm of the gods. Indradyumna could attain Moksha finally when he (as Gajendra) left all his pride and doubt and totally surrendered himself to Vishnu.


Symbolic Meaning


The symbolic meaning of Gajendra moksha is that materialistic desires, ignorance and sins create an endless chain of karma in this world and are similar to a crocodile preying upon a helpless elephant stuck in a muddy pond. Humans are thus stuck in a continuous cycle of death and rebirth until the day when they can look beyond everything in this creation and ultimately submit themselves to the supreme being Vishnu .

Source – Wikipedia


Astrological Significance and Remedies


As we know Elephant is connected to the planet Jupiter and the sign of Capricorn also known as Makara is connected to the crocodile. Saturn is the lord of the sign Capricorn.

As we saw in the story Gajendra could not be saved by his own effort, but the minute he remembered the Lord and surrendered to HIM and called out to HIM to save HIM, Lord Vishnu came and protected HIM.

So offering a lotus flower to Lord Vishnu and listening to the Gajendra Moksha Stotram every day until December 21st is a great remedy. If you are unable to do it every day then you can do it on Wednesdays, Thursdays and Saturdays.

Reading this story and sharing this story with everyone is also another great remedy!

For personalized insights and remedies download the align27 app

PC – Pinterest



మూడనమ్మకాలు గల గండ నక్షత్రాలు

 మూడనమ్మకాలు గల గండ నక్షత్రాలు

వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే అమ్మో అమ్మాయిది అశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దు అని వెంటనే చెప్పే మాటలు వింటుంటాం. అశ్లేష, మూల, విశాఖ,మఖ, జ్యేష్ఠా ప్రతి 27 రోజులకు ఒకసారి మొత్తంమీద అయిదు రోజుల పాటు వుండే ఈ నక్షత్ర కాలంలో పుట్టిన ఆడవారు పెళ్లికి పనికిరారా? వారిని చేసుకోకూడదా? శాస్త్రం ఇలా తప్పుడు మాటలు చెప్పిందా? అంటే శాస్త్రం పిచ్చిమాటలు ఎప్పుడూ చెప్పలేదు. అపోహలు, అపవాదులు సంఘంలో అధికంగా ప్రబలిన రోజులివి. శాస్త్ర దూరమైన అంశాలు ఎన్నో మనం అధిక ప్రాచుర్యంలో చూస్తాం.


మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మామగారు చనిపోతారని, మతాంత రంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది. ముహూర్త చింతామణిలో ‘మూలాంత్య పాద సార్పాద్య పాద ఔతమ్ శుభౌ’ అనగా మూల చివరి పాదము నందు అశ్లేష ప్రథమ పాదము నందు జన్మించిన దోషం కలిగించదు అని వున్నది.


అశ్లేష నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే అత్తగారు చనిపోతారని,మతాంతరంలో మొదటి పాదం మాత్రమే శుభమని,2,3,4 పాదాలు అశుభమని చెప్పటం జరిగింది.


జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే కోడలి యొక్క బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడు చనిపోతారని,జ్యేష్టా నక్షత్రం అమ్మాయిని ఇంటిలో చిన్నవారికి ఇచ్చి చేయటం వలన బావగారికి గండము అని చెప్పబడినది. అందువలన ఇంటిలో జ్యేష్ఠులకు ఇచ్చి చేస్తే ఇక బావగారు అనే అంశం ఉండదు కదా! అందువలన దోషం లేదు.


విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఆఖరి మరిది చనిపోతాడని ,మతాంత రంలో మొదటి పాదం మాత్రమే హానికరమని,2,3,4 పాదాలు శుభమని చెప్పటం జరిగింది. మతాంతరంలో ‘విశాఖా తులాయా యుక్తఃదేవరస శుభావహ’ అని వున్నది. తులలో వున్న విశాఖ అనగా విశాఖ 1,2,3 పాదాలు మరుదులకు శుభమే అని వున్నది.


మఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఇంట్లో ఎవరైన చనిపోవచ్చని ...

ఇలా చాలా మూడ నమ్మకాలు ప్రతి వారి హృదయంలో పాతుకు పోయి ఉన్నాయి .


ఈ భయాల వల్ల భవిష్యత్తులో మీరు కూడ అంద విశ్వాసాలకు బలి కావచ్చును.ఎలాగంటే మీరు కోరి మంచిదని నమ్మిన నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకున్నా ఆమెకు కలిగే శిశువు మూల,అశ్లేష,జ్యేష్ట,విశాఖ,మఖ నక్షత్రాలలో జన్మిస్తే మీరు ఆ శిశువుకి వివాహం భవిష్యత్తులో చేయగలరా?అప్పుడు శాస్త్రాన్ని నిందించి ప్రయోజనం ఉండదు.


ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించవు.నక్షత్రాలవల్ల జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు.


నక్షత్రాలపై మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యా భర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లితండ్రులకు,అక్క చెల్లెల్లకు,లేక అన్నదమ్ములకు వర్తించదు.


కాబట్టి మీరు ఏమాత్రం సంకోచం లేకుండా మిగిలిన విషయాలన్నింటికి పొంతన కుదిరితే మూడ నమ్మకాలను వదిలి వివాహం చేయవచ్చు.


జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్యా,వినయం,వివేకం,గుణం,సాంప్రదాయం,సంస్కారం,రూపం గల వదువులను విసర్జింపక మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు.


జాతకం సంబంధం రాగానే మూలా నక్షత్రం,అశ్లేష నక్షత్రం అని సంబంధం వద్దు అని అప వాక్యములు పలకకుండా విచారణ చేయమని విజ్ఞప్తి. శాస్త్రంలో ప్రతి అంశానికీ దోషం గురించి ప్రస్తావించిన గ్రంథంలో దోష పరిహారములు ప్రస్తావించలేదు. గ్రంథాలు అనేకం పరిశీలించిన తరువాత చేయవలసిన నిర్ణయాలు ఏమీ చదవకుండా చేయవద్దు అని సూచన.


‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా

కంఠేబథ్నామి సుభగే త్వంజీవ శరదాం శతమ్’’


ఇది కల్యాణ మంత్రం. రెండు జీవితాలను ఒకటిగా చేసి ముడివేసేదే మాంగల్యం.

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

Relangi vari Panchangam

 https://drive.google.com/file/d/15FrjmA5dctTUmYDl9k007sneDxU645ds/view?usp=drivesdk

కలలు - వాటి ఫ‌లితాలు

 కలలు - వాటి ఫ‌లితాలు


నిద్ర‌లో క‌లలు క‌న‌డం మాన‌వ స‌హ‌జం. కేవలం మ‌నుషులే మాత్రమే కాదు... ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు గనడం అతిసాధార‌ణ‌మే. సింహ స్వప్నం అనే మాట ఆలా పుట్టినదే. ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుంద‌ని అంటారు. జంతులు మాత్రమే కలలకు భయపడతాయా..? కాదు.. కలల పట్ల భయం అనేది మానవులకూ అనాదిగా ఉంది. అందుకు కారణం.. అన్ని కలలు శుభ ఫలితాలనే కలుగజేయవు. 


పురాణాల్లోనూ క‌ల‌ల‌కు సంబంధించిన క‌థ‌లు ఉన్నాయి. రామాయ‌ణంలో.. సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒక రోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి, లంకాదహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది.


కలల ఫ‌లితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి క‌ల‌ల గురించి చెప్పటమేకాక అశుభ స్వప్నాలు వస్తే.. వాటివల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ కథా సందర్భంలో వివ‌ర‌ణ‌ కనిపిస్తుంది. కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.


అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువు.


కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని శాస్త్రం చెబుతోంది. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, దక్షిణ దిక్కు వైపునకు వెళ్ళటం, రోగ పీడితుడిగా ఉండటం, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెబుతోంది. పురాణంలో చెప్పిన స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కలలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది.


రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక ఏడాది కాలం లోపల అది జ‌రుగుతుందని... రెండో జాములో కల వస్తే 6 నెల‌ల లోపున, మూడో జాములో వస్తే 3 నెల‌ల లోపున, నాలుగో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రం చెబుతోంది . సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజులలోపే జరుగుతుందని అంటారు. ఒకే రాత్రి మంచి కల, పీడ కల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుందని... రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలంటారు. అదే శుభస్వప్నమైతే నిద్రపోవటం మంచిది కాదు.


ఆకాశంలో మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు. ఇక జంతువులు క‌ల‌లో వ‌స్తే... కుక్క తమను చూసి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షి గుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు కలలు వచ్చినా నిజజీవితంలో మంచి జరగదట.


ఇలా మంచి క‌ల‌ల‌ గురించి, వాటి ఫలితాల నివారణ కోసం తిల హోమంలాంటి వాటి గురించి అగ్నిపురాణం చెబుతోంది. మంచి క‌ల‌ల వరుసను కూడా ఈ సందర్భంలోనే తెలిపింది. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిద‌ని పరశురాముడికి పుష్కరుడు ఇలా స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. మనిషి మనుగడకు సంబంధించిన అన్ని విషయాలను, శాస్త్రాలను పురాణాలు స్పృశించాయనటానికి ఇదొక ఉదాహరణ.


చెడు క‌ల‌లు దోష శాంతి కోసం పండిత పూజ, నువ్వులతో హోమం చేయ‌డం మంచిది. బ్రహ్మ, విష్ణు, శివ, సూర్యగణాలను పూజించటం, స్తోత్రాలు, పురుష సూక్తం లాంటి వాటిని పారాయణం చేయాలి.


నిజానికి మనసు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఇక మనసు సంతోషంగా వునప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా వుంటాయి. అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయని మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతుంటారు. అయితే అలాంటి స్వ‌ప్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట‌. మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు.. తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయని చెప్పబడుతోంది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కాశి దర్శనం

 ఓం శ్రీ గురుభ్యోం నమ:

ఓం నమో శ్రీ విశ్వంభరాయ నమః


శ్రీ కాశి విశ్వనాథ సేవా సమితి వారిచే శ్రీ కాశి విశ్వనాథునికి నిత్య అభిషేకములు, మాస శివరాత్రికి, మహా శివరాత్రికి నిత్యము మీరు కోరిన రోజున శ్రీ విశ్వనాధునికి మీ గోత్ర నామములతో అభిషేకములు చేయించి ప్రసాదము కొరియర్ ద్వార పంపబడును. శ్రీ కాశి విశాలాక్షి అమ్మవారికి, శ్రీ కాశి అన్నపూర్ణ అమ్మవారికి కుంకుమ అర్చన చేయించబడును.


పితృ దేవతలకు సంబందించిన కార్యక్రమములు, పిండ ప్రదానము, తర్పనములు, అస్తి నిమర్జనము శాస్త్రరీత్య మన ఆచార సాంప్రదాయములను అనుసరించి చేయించబడును. శ్రీ కాశీ విశ్వనాథుని అభిషేకము ఒక్కసారికి మీరు తెలిపిన రోజున మీ గోత్ర నామములతో చేయించుటకు రుసుము Rs. 1116/- . ప్రసాదము మీకు కొరియర్ ద్వార పంపబడును ఆసక్తి కల వారు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు.               


                               కాశి దర్శనం


కాశి కి వచ్చే భక్తులకు వారణాసి స్టేషన్ నుండి పికప్ చేస్కుని వసతి, భోజనములు, దర్శనములు, సైట్ సీఇంగ్, పూజలు, అభిషేకములు, పితృ కార్యక్రమములు, అలహాబాద్, అయోధ్య, నైమిసారన్యము, నేపాలు, పాకేజ్ టూర్స్ నిర్వహించబడును.

సంప్రదించ వలసిన ఫోన్ నంబర్లు : 


నారాయణ మూర్తి:  6309089942, 8586856911, 9129391987


తుల్సిపుర్, వారణాసి.


ధన్యవాదములు

ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!*

 *ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!* 


*దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్తాడు.*

*అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వక స్వాగతం చెబుతాడు. అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభి వందనం చేస్తాడు*.


*అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి* *సంతోషంతో కౌగలించుకొని,* 

*రాజా! మీరు పెద్దవారు.*

*పైగా వరుని పక్షoవారు.!*

*ఇలా మీరు నాకు పాదాభి* *వందనం చేయడం ఏమిటి?గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా? అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన జవాబు చెబుతాడు*.


*మహారాజా మీరు దాతలు.!* 

*కన్యదానం చేస్తున్నారు.!!* 

*నేనైతే యాచకున్ని.! మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను.! ఇప్పుడు చెప్పండి. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప? అని అంటాడు*.


*ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు రాలుస్తూ....ఇలా అంటాడు.*


*ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో?!వాళ్ళు అత్యంత భాగ్యవంతులు.!* 

*ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు! కానీ* 

*ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు.!!!*  


*ఇదీ మన భారతీయత*✊

*ఇదీ మన సంస్కృతి* 🤝

*ఇదీ మన రామాయణం నీతి* 👍

🙏👍👍👌👌👏👏🙏

సంఖ్యావాచక పదాలు*


       *సంఖ్యావాచక పదాలు*

                           5️⃣6️⃣7️⃣8️⃣9️⃣



1️⃣6️⃣


*షోడశ మహారాజులు :*


గయుడు, 

అంబరీషుడు, 

శశిబిందుడు, 

అంగుడు, 

పృథుడు, 

మరుత్తు, 

సుహోత్రుడు, 

పరశురాముడు, 

శ్రీరాముడు, 

భరతుడు, 

దిలీపుడు, 

శిబి, 

రంతిదేవుడు, 

యయాతి, 

మాంధాత, 

భగీరధుడు🌹

తృప్తి.:-

 జధురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారి సందేశము.

 

     తృప్తి.:-   

ఎంతటి ఆస్తిపాస్తు లైనా తృప్తి లేకపోతే ఆ సంపద ఆ మనిషికి ఆనందాన్ని అందించలేవు.

సుఖ సంపదలను కోరుకొనే వ్యక్తి వాటిని పొందటానికి కస్తపడి పని చేయవలసి వస్తుంది .అందువలన అప్పుడు సంతోషము వుండదు.కారణము కస్తము లో సంతోషము లభించదు కదా . వొకవేల ఆ వస్తువును కష్టపడి. సంపాదించినా దానిని 

కాపాడటానికి మరలా కష్టపడాలి . అప్పుడు సంతోషము వుండదు.

ఏ కారణము వలనైనా అలా కష్టపడి సంపాదించినా వస్తువు

పోగొట్టుకుంటే అప్పటి దాకా వున్న సంతోషము పూర్తిగా పోయి మళ్ళ దుఃఖమే మిగులుతుంది .

అందువలన ఉన్నవాటిని వదిలి మరలా ఏదో సంపాదించాలని కోరిక కల్గి వుండటము అనేది మంచిది కాదు. పూర్వ కాలము లో వనాలలో నివసించే మునులకు 

ఆస్తి పాస్తులు ఏమి వుండేవి కావు.అయినా వారు ఆనందముగా లేరా. వారి ఆనందము నకు కారణము వారికున్న తృప్తి యే .

మనము పూజించే శంకరుడు రారీరమంటా విభూతిని పూసుకొని పులి చర్మాన్ని ధరించి వృషభ వాహనుడై వుంటాడు. అంటే మనలోనియింద్రియ సుఖాల నుండి దారి మల్లించటానికే సాంకేతికం గా యిలా చెప్పబడి నది .

మనమెంత ధనవంతులైన సాధారణ జీవితాన్ని గడపాలి .అప్పుడే ఆనందము గా వుండగలము .

ధనము అనుకోకుండా లభిస్తే మంచిపనులు చేయటానికి ధార్మిక కార్యక్రమాలు ను ఆచరించ టాని కే ధనాన్ని ఉపయోగించాలి .మన జీవితాలను సామాన్యం గా

గడపాలి.

యీ ప్రపంచము లో ధనవంతులు ఎవ్వరు పేద వారెవ్వరూ అని ప్రశ్నించుకుంటే ఎవ్వరి హృదయము సంతృప్తి తో నిండి వుందో ఎవ్వరికీ ఏటువంటి కోరికలు లేవో వారే ధనవంతులు.అని ఎవ్వరికీ యీ పైన చెప్పిన కోరికలు వుంటా యో వారే పే దవారని

మనము సమాధానము చెప్పాలి.

అందువలన సంతృప్తి అనే ఆదర్శాన్ని మనము ఆచరిస్తూ ఆనందమయ జీవనాన్నిగడపటానికి ప్రయత్నించాలి .

ఓం శాంతి శాంతి శాంతిః.

ఓం నమశ్శివాయ.

**హిందూ ధర్మం** - 44

 **దశిక రాము**


**హిందూ ధర్మం** - 44


బుద్ధిని వికసింపజేసే ఆహారం తీసుకోవడం ధీః


ఆరోగ్యవంతమైన, పుష్టికరమైన, పోషకాహారం తీసుకుకోవడం ధర్మం అన్నారు మనుమహర్షి. బుద్ధిని వికసింపజేసే ప్రధానమైన ఆహారం ఆవుపాలు. దేశవాళీ ఆవుపాలు రోజు త్రాగేవారికి అమోఘమైన బుద్ధి ఉంటుంది. ఆవుదూడ త్రాగిన తరువాత మిగిలిన పాలనే స్వీకరించాలి. అటువంటి ఆవుపాలు మాత్రమే బుద్ధిని వృద్ధి చేస్తాయి. జెర్సీ ఆవుపాలు విషంతో సమానం. అవి తాగడం కంటే, తాగకపోవడం శ్రేయస్కరం. ఆంగ్లేయులు భారత్‌ను తన ఆధీనంలోకి తీసుకునే సమయానికి కలకత్తాలో జనాభాకు సరిసమానంగా గోవుల సంఖ్య ఉండేది అని బ్రిటీషర్ల రికార్డులు చెప్తున్నాయి. అప్పుడు వ్యవసాయం మొత్తం గో ఆధారితంగానే జరిగేది. దానికి సహజ వ్యవసాయం అని పేరు. అదే పాలేకర్ విధానం. జనమంతా ఆవుపాలనే స్వీకరించేవారు. గేదెపాలు స్వీకరించడం ఈ మధ్య కాలంలో మాత్రమే వచ్చింది. కానీ ఈ గేదెపాలు బుద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు.


దేశవాళీ గోపేడ, గో మూత్రాలను, వేప మొదలైన కొన్ని ఇతర సహజ పదార్ధాలను కలిపి చేసే ఎరువుతో ఆహారం పండించేవారు. ఎద్దు చేత దున్నబడిన భూమిలో పండిన ఆహారం నేత్రవ్యాధులను అస్సలు రానివ్వదని వేదం అంటుంది. ఓ భూమాతా! నువ్వు మా తల్లివి. నిన్ను గోమయం చేత మరింత పవిత్రం చేస్తున్నాము అంటూ గోమయాన్ని (ఆవుపేడ) ఎరువుగా వాడాలని ఒక ఉపనిషత్‌లో మాట. ఈ విధమైన వ్యవసాయ విధానమే దేశమంతటా ఉండేది. ఆ కాలంలో వారు ఒక ఎకరం భూమిలో పండిన ఆహార ధాన్యాలను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎన్ని పరిశోధనలు చేసినా ఈరోజుకు పండిచలేకపోతున్నాయి. ఈ వ్య్వసాయానికి మూలం వేదం. ఈ విధమైన సహజ వ్యవసాయం విధానంలో పండిన ఆహారమే బుద్ధి వికసింపజేస్తుంది.


తద్విరుద్ధంగా రసాయనాల చేత పండిన ఆహారం శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. ఆఖరికి తల్లిపాలల్లో కూడా విషం చేరిపోయిందంటే పరిస్థితి మనం అర్దం చేసుకోవచ్చు. ధీః బుద్ధిని వికసింపజేసే ఆహారం తీసుకోవడం. దీనీ అర్దం ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే అంత మంచిది అని కాదు, మనమున్న ప్రదేశాన్ని బట్టి, నడుస్తున్న ఋతువును బట్టి, వాతవరణ పరిస్థితులను బట్టి, ఎప్పుడు ఏది తీసుకుంటే మనకు మంచిదో ఆయుర్వేదంలో ఋషులు సూచించారు. అట్లాగే అప్పుడు ఏది తీసుకోకూడదో, దాన్ని శాస్త్రంలో నిషేధించారు.


ధీః - మంచి ఆహారాన్ని ఋషులు చెప్పినట్టుగా, మనమున్న దేశకాలాలకు లోబడి స్వీకరించడం.


తరువాయి భాగం రేపు.....

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/LyeuNWbrRlW9fGDW4tOeNY


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

తస్మాత్ జాగ్రత జాగ్రత !

 తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |🙏

               అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||🙏


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|

      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||🙏


తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|

     🙏 జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||


తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


4. 🙏శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|

      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


5. 🙏శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|

      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


6. 🙏శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|

      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.


7. 🙏శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|

      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||


తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?


8. 🙏శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|

      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||


తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?


9. 🙏శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|

      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||


తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?


10. 🙏శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|

      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||


తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?


11. 🙏శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|

      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||


తా - ప్రవహించుచున్ననది లో కర్ర/కట్టె ముక్కలు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

🙏💐🙏💐🙏💐👍

(సేకరణ)

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

కుక్కలు కూడా ముట్టవని ఎందుకంటామో తెలుసా !

  

కుక్కలు కూడా ముట్టవని ఎందుకంటామో తెలుసా !

పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుండేవాడు. బ్రాహ్మణులు నిష్ఠాగరిష్టులై వేదాధ్యయనం చేస్తూ జనహితం కొరకు యజ్ఞయాగాలు తపాలు చేసేవారు. ఈ దేవశర్మ తద్విరుద్ధంగా ప్రవర్తించేవాడు. జూదం వ్యభిచారం మద్యపానం మాంసభక్షణ చేస్తూ దుర్మార్గుల వెంట తిరుగుతూ భ్రష్టుడై సంచరించేవాడు.


అటవిక వనితను పెండ్లాడి పిల్లలను కని వారి పోషణార్థం దొంగతనాలు చేసేవాడు.ఇలాంటి దేవశర్మ ఒకరోజు వేటకై అడవికి పోయినపుడు బాగా మదమెక్కిన ఏనుగు ఇతనిని తరమసాగింది. దానినుండి తప్పించుకోటానికి పారిపోయి ఓ మర్రిచెట్టు చాటున దాక్కొన్నాడు. ఆ బాగా ఊడలుదిగి మూడుయోజనాల వరకు వ్యాపించివుంది. ఎన్నో పశుపక్ష్యాదులు ఆ చెట్టు నీడన సేద తీరేవి.


ఆ చెట్టుమీద నాడిజంఘముడనే పేరుగల కొంగ నివసించేది. నాడిజంఘముడు కొంగ అయినప్పటికి పూర్వజన్మ సుకృతంచేత మానవభాష అతనికి తెలుసు. విరుపాక్షుడనే రాజు ఈ కొంగకు మిత్రుడు. రోజు సాయంత్రం ఇద్దరు కలుసుకొని ఆధ్యాత్మిక చింతన చేసేవారు. నాడిజంఘమునికి పూర్వజన్మలో దేవేంద్రుడు మిత్రుడు కూడా.


ఏనుగు భయంచే నక్కి వణికిపోతున్న దేవశర్మను నాడీజంఘముడు చూచాడు. సహజంగానే మంచివాడైన నాడీజంఘముడు ఆ బ్రాహ్మణుడి భయం పోగొట్టి ఆహారపానీయాలు ఇచ్చి యోగక్షేమాలు అడిగాడు.


దేవశర్మ తాను తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నానని తన కష్టాలు తీరాలంటే ధనం కావాలని చెప్పాడు. నాడీజంఘముడు అతని పరిస్థితికి జాలిపడి రాజైన విరూపాక్షున వద్దకు వెళ్ళి తనపేరు చెప్పి కావాల్సినంత ధనం తెచ్చుకోమని చెప్పాడు.


దేవశర్మ రాజును కలిసి తన పరిస్థితిని చెప్పుకొన్నాడు. దేవశర్మ అబద్ధాలు చెబుతున్నాడని ఆ రాజు సందేహించాడు. దేవశర్మను అనుమానించినప్పటికి ప్రాణమిత్రుడి మాట కాదనలేక అతను మోయనంత ధనాన్ని ఇచ్చి పంపాడు.


కపట బ్రాహ్మణుడు మోయగలినంత ధనాన్ని తీసుకొని మిట్టమధ్యాహ్నానికి మర్రిచెట్టు వద్దకు చేరాడు. ఆ సమయంలో నాడీజంఘముడు విశ్రాంతి తీసుకొంటున్నాడు. దేవశర్మ ప్రయాణబడలికతో అలసిపోయి బాగా ఆకలిమీద ఉన్నాడు. తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని అటుఇటు చూచాడు. నిద్రపోతున్న కొంగతప్ప ఇతరాలు కనబడలేదు. అంతట ఆ బ్రాహ్మణుడు నాడీజంఘముడి మెడవిరచి చంపి కాల్చుకొని తిని ఆకలి తీర్చుకొన్నాడు.


ప్రతిరోజు సాయంత్రం తన వద్దకు రావాల్సిన నాడీజంఘముడు రాకపోయేసరికి విరూపాక్ష మహరాజుకు అనుమానం వచ్చింది. కారణం కనుక్కొని రమ్మని భటులను పంపాడు. భటులు మర్రిచెట్టు వద్ద చిందరవందరగా పడివున్న కొంగఈకలను గుర్తించి ప్రమాదం జరిగిపోయిందని గ్రహించారు. అందుకు కారణాన్ని ఊహించి ప్రయాసపడుతూ ధనాన్ని మోసుకుపోతున్న దేవశర్మను బంధించి రాజు ముందర హజరుపరిచారు. దేవశర్మ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.


దేవశర్మను బంధించి వేటకుక్కలకు ఆహారంగా పడవేశాడు. దేవశర్మ మిత్రద్రోహి, కృతఘ్నుడని ఆ కుక్కలుగ్రహించి ఆకలిగా వున్నప్పటికి వాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.


విరూపాక్షుడు, కొంగకు కర్మకాండలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈకలను మిగిలిపోయిన ఎముకలను తెప్పించి చితిమీద పేర్చి నిప్పు అంటించాడు. అయినా నిప్పు అంటుకోలేదు.

 కర్మకాండల పూజకొరకు తెప్పించిన గోవును అక్కడ అప్పటికే వుంది.లేగదూడ తల్లి వద్ద పాలు త్రాగసాగింది. దూడమూతికి అంటిన పాల నురగ చితిపైనున్న ఈకలు ఎముకలపై పడింది. అమృతతుల్యమైన పాలనురగ పడగానే నాడీజంఘముడు లేచాడు, బ్రతికాడు. రాజు, పరివారం ఎంతో సంతోషించారు. మిత్రులిద్దరు గోమాతకు ప్రదక్షిణచేసి నమస్కరించారు.


జరిగిన సంఘటనను తెలుసుకొని నాడీజంఘముడు ఆ బ్రాహ్మణుని క్షమించాడు. పరివర్తన చెందిన దేవశర్మ విద్యపై దృష్టినిలిపి వేదవేదాంగాలు చదివి నేర్చుకొని శిష్యసమేతంగా ఆ మర్రిచెట్టు సమీపంలో ఆశ్రమం ఏర్పాటుచేసుకొని బాటసారులకు అన్నార్తులకు సాయపడసాగాడు.


కుక్కలు కూడా ముట్టవని మనం ఎందుకు అంటున్నామో అర్థమైంది కదా! 

అందుకే మిత్రద్రోహం చేయరాదు.

చేసిన మేలును మరచి కృతఘ్నులుగా మారరాదు.


చేసిన మేలును మరచిపోనివాడు కృతజ్ఞుడు.


చేసిన మేలు మరచువాడు కృతఘ్నుడు.

.......................................................................................................................

*"గురుర్బ్రహ్మ

  🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం*

*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*

*గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"*

☘☘☘☘☘☘☘☘

*అయితే ఈ శ్లోకం ఎందులోది?* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఏ సందర్భంలోది?*

*ఎవరు వ్రాశారు?వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా?*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది.*

*కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి.* *అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు.* *ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ అంకితం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

గురువు లేకుంటే

 గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు.

మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి

అసలు గురువు అవసరమా?

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

అని ప్రశ్నించాడు.

గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారని అడిగారు.

నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.

అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు.

ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది.

ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.

అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు.

ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు.

కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.

తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ, తిరుగుతూ వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.

ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు.

ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు.

రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.

గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి.

దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు.

ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి.

మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు.

పాపం! అందుకే వీడికి గురువు కావాలి.

ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి.

అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది.

గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు.

శ్రీగణేశషోడశరత్నమాలికాస్తోత్రం

   శ్రీగణేశషోడశరత్నమాలికాస్తోత్రం

1) నమో భగవతే గణేశ్వరాయ 

   ప్రమథగణాధిపసర్వేశ్వరాయ 

   వేదవేదాంగవేద్యశూర్పకర్ణాయ 

   భక్తపరిపాలమూషికవాహనాయ ||


2) నమో భగవతే గణేశ్వరాయ 

   ఉమాశంకరప్రియనందనాయ 

   గురుగుహప్రియాగ్రజాయ 

   బీజాపూరగదేక్షుకార్ముకాయ ||





3) నమో భగవతే గణేశ్వరాయ 

   ముద్గలాదిమునీంద్రపూజితపల్లవపదాయ

   లడ్డూకమోదకకపనసఫలప్రియాయ 

   బ్రహ్మానందరససాగరాయ ||


4) నమో భగవతే గణేశ్వరాయ

   నాట్యవిద్యాప్రవీణాయ 

   గంభీరాలోచనామగ్నాయ 

   గంధర్వగానప్రియాయ ||







5) నమో భగవతే గణేశ్వరాయ 

  సమ్యక్పరిశీలనాశక్తిప్రదాయ  

  ధర్మానుష్ఠానతత్పరప్రియాయ 

  మృదుమంజీరపదాబ్జాయ || 



6) నమో భగవతే గణేశ్వరాయ 

   ఆదిపూజ్యపాత్రనిగ్రహవిగ్రహాయ 

   బ్రహ్మేంద్రాదిసురబృందసేవితాయ 

   శశాంకమదగర్వభంజనాయ ||






7) నమో భగవతే గణేశ్వరాయ 

   నాగయజ్ఞసూత్రధరాయ 

   భక్తమానససరోవరవిహారాయ  

   గంధకుంకుమసింధూరచర్చితాంగాయ ||


8) నమో భగవతే గణేశ్వరాయ 

   చతుర్దశభువనైకరక్షకాయ 

   మూలాధారస్థితశక్తిస్వరూపాయ 

   స్వర్ణాకర్షణభవ్యస్వరూపాయ ||







9) నమో భగవతే గణేశ్వరాయ 

   గద్యపద్యకావ్యనాటకప్రియాయ

   మానవజీవనమార్గనిర్దేశకాయ 

   శుభఫలప్రదాయకవక్రతుండాయ ||


10) నమో భగవతే గణేశ్వరాయ 

    సకలదుఃస్స్వప్నవినాశకాయ  

    విఘ్నయంత్రనిరంజనభంజనాయ 

    కవిబృందవంద్యజ్యేష్థరాజాయ ||







11) నమో భగవతే గణేశ్వరాయ 

    మకరకుండలధరతేజోమయాయ

    శశాంకచూడదివ్యగౌరవర్ణాయ   

    సకలాభరణభూషితలంబోదరాయ ||


12) నమో భగవతే గణేశ్వరాయ 

    ప్రసిద్ధనదీజలాభిషేకాసక్తాయ

    రవిశశాంకపావకతేజోమయాయ 

    మయూఖసింహవాహనారూఢాయ ||







13) నమో భగవతే గణేశ్వరాయ

    ఏకవింశతిపత్రపూజ్యప్రియాయ 

    భాద్రపదచతుర్థీఆవిర్భవాయ 

    సృష్టిస్థిత్యంతకారణాయ ||


14) నమో భగవతే గణేశ్వరాయ 

    కమలాలయతటనివాసాయ 

    భవజలధితారణకారణాయ 

    గంబీజాత్మకదైవతాయ ||







15) నమో భగవతే గణేశ్వరాయ 

    శ్రీకృష్ణబలరామార్చితాయ 

    సకలవాద్యవిద్యాజ్ఞానప్రదాయ 

    దశదిశాంతవిస్తారవిభవవైభవాయ ||


16) నమో భగవతే గణేశ్వరాయ 

    రాగద్వేషాదివివర్జితనిర్మలమానసాయ 

    రక్తవర్ణాంబరధరరక్తమాలాసుపూజితాయ 

    సర్వభూతాంతరస్థవైశ్వానరాయ ||


      సర్వం శ్రీగణేశదివ్యచరణారవిందార్పణమస్తు

పారాయణ లో ఎందుకు సఫలీకృతం కృతంకాలేమెూ

 మనలో చాలా జపం కాని హోమం కాని నామం గాని పారాయణ లో ఎందుకు సఫలీకృతం కృతంకాలేమెూ పరిశీలిద్దాం. ఆధార్ కార్డు లావాదేవీల సక్రమమైన ఇంటి నెంబరుతో సాధన చేయాలి. అనగా మనం నివసించే గ్రామమునకు దగ్గరలో వున్న దిక్కునగల దేవతా మూర్తుల ద్వారా మనం చేసే సాధన ప్రయాణం చేయాలి. వారి అనుమతి తీసుకోవాలి వారి ద్వారా శ్రీ శైలము ద్వారానే హవిస్సును చేరవలెనని. అనగా మన వునికి ఖచ్చితంగా స్పష్టంగా తెలియాలి. మరి యెుక విధానం కూడా. మామూలుగా నవగ్రహ జపం కాని నక్షత్ర జపం గాని చేయునప్పుడు దాని డిగ్రీని అనగా అది వున్న నక్షత్రమును గాని గ్రహమును గాని దాని గోతారంలో దాని డిగ్రీని మనం వున్న డిగ్రీతో అనుసంధానమే జపఫలితం. తలంచి ఆవాహన చేసిన ఆడిగ్రీమీద వున్న శక్తిని దాని లక్షణమును తప్పక ఫలించును. యివేమియును చేయకుండా ఫలించలేదు అంటే ఎలా. ప్రయత్నించి చూడండి పిన్ కోడ్ యింటి నెంబరు లాండ్ మార్కు మన వునికికి ఎలాగునో శక్తి యెుక్క వునికి కూడా అట్లే. యంత్రాధీనమైన శక్తి దేవాలయములో నిలిచియుండును. అందువలన వాటి ద్వారానే మూల మునకు చేరుట. అందుకే దేవాలయములు.

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే*

  జంబుద్వీపే భరతవర్షే భరతఖండే*

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.


అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?


జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:


1) కేతుముల వర్ష 

2) హరి వర్ష 

3) ఇలవ్రిత వర్ష 

4) కురు వర్ష 

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష 

7) కింపురుష వర్ష 

8 ) భద్రస్వ వర్ష


(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)


పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.


ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.


మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.


దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !


మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.


మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?


ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

కంచి పరమాచార్య వైభవం

  🚩 కంచి పరమాచార్య వైభవం🕉️🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️శివాయ గురవే *నమః శివాయ సో మాయ ! *శం భవే! అష్ట మూర్తయే ! *నమస్తే పంచ వాక్త్రాయ ! * శివాయ గురవే నమః! ********* 🚩అల్లరి పనులు 🚩******

*పరమాచార్య స్వామివారికి కూడా చిన్నపిల్లలకు మల్లే అల్లరితనం ఎక్కువ. ఎన్నో అల్లరి పనులు చేసేవారు. అవి చాలా సరదాగా ఉండేవి.


*ఒకరోజు రాత్రి, మరక్కన్ను అనే అతను కాపలా కాస్తున్నాడు. రాత్రి రెండుగంటలు అనుకుంటా. కుర్చీలో కూర్చుని అలాగే నిద్రపోయాడు. నిద్రలేచిన మహాస్వామి వారు బయటకు చూశారు; మరక్కన్ను నిద్రపోవడం చూశారు. అతడిని కాని అక్కడున్న ఎవ్వరిని కాని స్వామివారు నిద్రలేపలేదు. #ప్రతి గంటకు సమయాన్ని సూచిస్తూ చక్క సుత్తితో అక్కడున్న కంచును మ్రోగించడం కాపలా ఉన్న వ్యక్తి పని. స్వామివారు ఆ చెక్క సుత్తిని తీసుకుని వెళ్ళిపోయారు.


*కొద్దిసేపటి తరువాత మరక్కన్ను లేచి మూడు గంటల గంట కొట్టడానికి సుత్తి కోసం వెతికాడు. అక్కడ ఉంటే కదా అది దొరికేది. తనకంటే ముందు లేచి వెళ్ళేది స్వామివారు మాత్రమే కాబట్టి కాస్త భయపడ్డాడు.


తెలవారగానే, మేనేజరు విశ్వనాథ అయ్యర్ గారి దగ్గరకు వెళ్లి దాదాపు ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. “సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటా” అని మేనేజరు చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

***********"******

తరువాత సరైన సమయం చూసి మరక్కన్ను విషయం చెప్పాడు. “అతడిని పిలవండి”. మరక్కన్ను వచ్చాడు.

మహాస్వామి వారు పెద్దగా నవ్వుతూ, “భయపడ్డావా? మంచిది, ఏమి భయపడకు!” అని కండ చక్కెర ప్రసాదంగా ఇచ్చి పంపారు.

-- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

* ధ్యాన శ్లోకం *

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

🚩 తేట గీతి పద్యం🚩*చండికా నాథ విభు ద సంస్తవ్య పాద! *పరమ భక్త జనారాధ్య ప్రమథ నాథ ! *వేద సార ప్రబోధ్య గర్విత నిరోధ ! **చంద్ర శేఖ రేంద్ర! నమామి సం య మీంద్ర!!✡️ శుభ మస్తు*

దేవీ నవరాత్రుల విశిష్టత

 🌷దేవీ నవరాత్రుల విశిష్టత🌷

ఆశ్వయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ" గుర్తుకు రావటమే! అమ్మ అంటే మరి ఎవరోకాదు ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో వున్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది.


ఈ సృష్టిలోగల జ్యోతిర్మండలాలు మానవనిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగానూ, పరాశక్తిగానూ, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.


శ్లో!! సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే, 

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.


ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వీయుజమాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈదేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి మూడురోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.


దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గములేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.


ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కోరోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా 

1. శైలపుత్రి 

2. బ్రహ్మచారిణి 

3. చంద్రఘంట 

4. కుష్మాండ 

5. స్కందమాత 

6. కాత్యాయనీ 

7. కాళరాత్రి 

8. మహాగౌరి 

9. సిద్ధిధాత్రి 

అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవీ "శ్రీకృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోఢశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.


ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో


శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!


అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.


అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆ దేవదేవికి పూజలతోపాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యమూ

గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము.


శ్రీ మాత్రే నమః

విశాఖపట్నం పాత పోస్టాఫీసు

  ఒకప్పుడు విశాఖపట్నం పాత పోస్టాఫీసు, కురుపా మార్కెట్,పూర్ణా మార్కెట్, ఎల్లమ్మ తోట(ఇప్పటి జగదాంబ),ఎ.వి.ఎన్. కాలేజి,కె.జి.హెచ్, కాన్వెంట్ జంక్షన్(చావులమదం అనే పిలిచేవారు) వరకే ఎక్కువమంది ఉండేవారు. కురుపాం మార్కెట్,పూర్ణా మార్కెట్ లొ ఒక సామాజిక వర్గం వారు,కూరలు,పళ్ళు అమ్మడంలొ ఏకచత్రాధిపత్యం కలిగి ఉండేవారు. మొదట ఆప్యాయంగా మాట్లాడినా తరువాత బేరాలాడినా కూరగాయలు ఎంచినా "మామిడి పళ్ళు తిన్న మోఖమే ఇది" అంటూ దారుణంగా హేళన చేసేవారు. ఇక విశాఖపట్నంకి ఇప్పుడున్మ రైల్వేస్టేషనును "వాల్తేర్" అని పిలిచేవారు. రెండోది చివరి స్టేషన్ గా "విశాఖపట్టణం" పాత పోస్టాఫీసు దగ్గర సెలక్టు సినిమా టాకీసుకు ఎదురుగా,దగ్గరగా ఉండేది. కురుపాం మార్కెట్ పరిసర ప్రాంతాల వారు ఆ స్టేషనులోనే దిగేవారు. మేము కురుపాం మార్కెట్ దగ్గరున్న పప్పుల వీధికి ఐదవ వీధి గంగాబత్తుల వారి వీధిలొ గరుడావారి సత్రవను నాలుగు పోర్షన్లుగా అద్దెకు ఇవ్వగా ఒకదాంట్లొ ఉండేవారం. కరెంట్ ఉండేది కాదు. కిరోసిన్ దీపం దగ్గరే ఆరవ తరగతి వరకూ చదువుకున్నాం. టౌను హాలు,బీచ్ దగ్గర కావడంతొ ఎక్కువసార్లు అక్కడే ఆడుకునే వారం. కురుపాం మార్కెట్ దగ్గర శంకర విలాస్ ఒక వైపు మరొ వైపు HMV వాళ్ళ గ్రామ ఫోను కంపెనీ అక్కడ కుక్క బొమ్మతొ బోర్డు ఉండేది. కోట వీధిలోంచి వెళితే సముద్రం దగ్గర కొండపై ఉన్న వెంకటరమణమూర్తి కోవెలకు శనివారం తరచూ నడచుకుని వెళ్ళేవాళ్ళం. ఇక కురుపాం మార్కెట్ నుండి పూర్ణా మార్కెట్ కు వచ్చే తోవలొ మలబార్ కేఫ్,విజయా గార్డెన్సు,రూఫ్ గార్డెన్సు వంటి హొటల్సు బాగా ప్రాముఖ్యం గా ఉండేవి. బీచ్ దగ్గర మినర్వా టాకీస్ అనే ధియేటర్ ఉండేది. అందులొ నాగిన్ అనే సినిమా చూసినట్లు గుర్తు. అయితే రాత్రిళ్ళు సినిమాకి వెళ్ళడానికి జంకేవారు. అదే విధంగా ఉప్పుగాలికి ప్రొజెక్టర్ పాడయిపోయేదని అనేవారు. ఇక లక్ష్మీ టాకీస్ కు మంచి చిత్రాలు వచ్చేవి. ముఖ్యంగా విజయా వారి చిత్రాలు. మాయా బజార్,గుండమ్మ కధ అక్కడే చూసాను. అప్పట్లొ డబ్బులిస్తే గేట్ మేన్ ఇంటర్వెల్ లొ వదిలేసేవాడు. సగం సినిమా చూసి ఆనందపడేవారం. అలాగే ప్రభాత్,సరస్వతి ధియేటర్లు చాలా ఫేమస్. లీలామహల్ లొ కేవలం ఇంగ్లీషు,హిందీ చిత్రాలే ఆడేవి. అంతవరకూ బెంచి,చేరబడే బెంచి,కుర్చీ,బాల్కానీలొ మంచి సౌకర్యమైన కుర్చీలు ఉండేవి. కాని రామకృష్ణా,అలంకార్ ధియేటర్లు ప్రారంభమై అన్ని తరగతులలోనూ కుర్చీలు ప్రారంభమయాయి. పూర్ణా మార్కెట్ కు దగ్గరగా పూర్ణా టాకీసు ఉండేది. ఈ ధియేటర్లొ మధ్యలొ పెద్ద స్తంభాలు ఉండేవి. అలాగే విజయాటాకీసు ఉండేది. వర్షం పడితే ధియేటర్లొ కాళ్ళకింద నీళ్ళు వచ్చేసేవి. ప్రభాత్ లొ ఎక్కువగా నవయుగా డిస్ట్రిబ్యూషన్ సినిమాలు కనుక ఎ ఎన్ ఆర్ చిత్రాలు వచ్చేవి. రామకృష్ణాలొ నర్తనశాల,లవకుశ వంటి చిత్రాలు, అలంకార్ లొ ఆరాధన వంటి చిత్రాలు గొప్ప వసూళ్ళు సాధించాయి. సినిమాకి వెళితే సిగిరెట్ కంపే. ఎ.సి.లు ఉండేవి కావు. మొదటి,రెండొ ఆటకు తలుపులు తీసేసేవారు. కరెంటుపోతే కొంతసేపు చూసి పాస్ ఇచ్చి మరునాడు రమ్మనేవారు. ఇక అప్పుడు అన్నీ ప్రయివేట్ బస్సులే. రూట్ నెంబర్ 13 పాత పోస్టాఫీసు నుండి ఎ వి ఎన్ కాలేజి,కెజి హెచ్,ద్వారకానగర్(ప్రస్తుత డైమెండ్ పార్కు) నుండి రైల్వేస్టేషన్,కాన్వెంట్ వరకూ నడిచే పెద్ద రూటు బస్సు. యూనివర్సిటికి నెం.10 బాగా ప్రసిద్ది. కె జి హెచ్ కు దగ్గరగా ఉన్న "రామకృష్ణా లంచ్ హొమన" భోజనానికి చాలా ప్రసిద్దిగా ఉండేది. చడగాస్ హోటల్ లొ పేపర్ దోశ అప్పట్లొ ప్రత్యేక ఆకర్షణ,కొబ్బరి చట్ని సూపర్. అక్కడ టిఫెన్ తినడానికి జనం టేబుళ్ళపై తాళాలు పెట్టి రిజర్వు చేసుకుని బయట వెయిట్ చేసేవారు. టిఫెన్ హోటళ్ళకు ఉడిపి హోటల్సు చాలా ప్రసిద్ది. లోపలకు వెళ్ళగానే అగరుబత్తి సువాసనలు మహత్తరంగా ఉండేవి. కాఫీ ఇత్తడి లేదా స్టీల్ గ్లాసు దానికింద ఒక గిన్నెతొ ఇచ్చి క్రిందనుండి మీదకు పోసి చల్లార్చి ఇచ్చేవారు.(మిగిలిన జ్ణాపకాలు మరొసారి)...

పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు

 


 *🌼🌿 పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు🌼🌿*

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.


1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.

6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.

7 . సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన 

మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం 

చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.

12 ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అది పరాశక్తి కథ.

  బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అది పరాశక్తి కథ.

🌷🌷 శివుడు జననమరణాలుకు అతీతుడు....

కాలతీతుడు అనగ కాలమునకు వశము కానివాడు.. అందుకే సదాశివుడు అంటాము... అంతయు శివుడే అందుకే ఆందరు దేవతలు శివారదకులే.విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగారధన చేస్తుం టారు.....🌷🌷🌷


🍁🍁🍁 పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభ వం....అది విష్ణువు, బ్రహ్మ లకు కూడా అసంభవం....

అందుకే పరమశివుడు అంటారు 🍁🍁🍁


🔱🔱🔱 మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది. అది

పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. అప్పుడు రాజరా జేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది.... అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడ వలసిందిగా కోరింది....మొదట ముగ్గురూ నిరాక రించారు 🔱🔱🔱


🕉🕉🕉 ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తన ని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు...అది, తనను ఆది పరాశక్తిని వివాహమాడి న అనంత రం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి.... అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రము ను ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు🕉🕉🕉


ఓం నమః శివాయ.....

పవిత్ర స్నానాలు చేసేటప్పుడు

 నదుల్లో, సముద్రాల్లో పవిత్ర స్నానాలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి?


జ: నిద్రించిన వస్త్రాలతో నదిలో మునుగరాదు. ముందు నదీదేవతను, క్షేత్రదేవతలను స్మరించి, సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. పుణ్యనదులలో పాపపరిహారార్థం చేసే పవిత్ర స్నానాలలో కచ్చితంగా నియమాలు పాటించాలి. నదిలో వస్త్రాలు పిండరాదు. సర్ఫ్ లాంటివి ఉపయోగించరాదు. ఉతకరాదు. అభ్యంగన స్నానాలు చేయరాదు. (తలంటుకొనడం వంటివి కూడదు. ఇంక- షాంపూలు, కుంకుడులు వంటివి కూడదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.) పొరపాటున కూడా నదిలోగానీ, నదీతీరాల్లోగానీ మలమూత్ర విసర్జనలు చేయరాదు. చేస్తే మహాపాపం. ఉమ్మరాదు. నీళ్ళను పుక్కిలించి ఉమ్మడం కూడా దోషమే. అవాచ్యాలు, కసురుకోవడాలు వంటివి కూడా చేయరాదు. సముద్రాన్ని కేవలం పర్వసమయాల్లోనే తాకాలి. స్నానం చేయాలి. మాములు సమయాల్లో తాకడం కూడా కూడదు. నదులనీ, సముద్రాలనీ దేవతా స్వరూపాలుగా భావించి తగిన మర్యాదలతో ప్రవర్తించాలి. స్నానసమయంలో సంకల్పాదులు చెప్పుకో

ఓంనమశ్శివాయ

  #.

ఓంనమశ్శివాయ

ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్

మహోంకార రూపమ్ శివమ్ శివమ్

మహా సూర్య చంద్రాగ్ని నేత్రమ్ పవిత్రమ్

మహా గాఢ తిమిరాంతకమ్ సౌరగాత్రమ్

మహాకాంతి బీజమ్ - మహా దివ్య తేజమ్

భవానీ సమేతమ్ - భజే మంజునాధమ్

ఓమ్ నమశ్శంకరాయచ -మయస్కరాయచ

నమశ్శివాయచ -శివతరాయచ - భవయరాయచ

మహ ప్రాణదీపమ్ - శివమ్, శివమ్

భజే మంజునాధమ్ - శివమ్, శివమ్

అద్వైత భాస్కరమ్ - అర్దనారీశ్వరమ్

త్రిదశ హృదయంగమమ్ -చతురుదధి సంగమమ్

పంచభూతాత్మకమ్ - షట్చత్రునాశకమ్

సప్తస్వరేశ్వరమ్ - అష్టసిద్దీశ్వరమ్

నవరస మనోహరమ్ - దశదిశా సువిమలమ్

ఏకాదశోజ్జ్వలమ్ - ఏకనాథేశ్వరమ్

ప్రస్తుతి వశంకరమ్ -ప్రణత జనకింకరం

దుర్జన భయంకరమ్ -సజ్జన శుభంకరమ్

ప్రాణిభవతారకమ్ - ప్రకృతి హిత కారకమ్

భువన భష్యభవనాయకమ్ -భాగ్యాత్మకమ్ రక్షకమ్

ఈశమ్ సురేశమ్ - వృషేశమ్ పరేశమ్

నటేశమ్ గౌరీశమ్ - గణేశమ్ భూతేశమ్

మహామధుర పంచాక్షరీ మీ మంత్ర మార్షమ్

మహాహర్ష వర్ష ప్రవర్షమ్ సుశీర్షమ్

ఓమ్ నమోహరాయచ స్వరహరాయచ పురహరాయచ

రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ

నిత్యాయచ నిర్ణిద్రాయచ

మహ ప్రాణదీపమ్-శివమ్, శివమ్

భజేమంజునాధమ్-శివమ్, శివమ్

ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ

ఢక్కా నినాద నవతాండవాడంబరమ్

తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి

సంగీత సాహిత్య సుమకమల బంభరమ్

ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార

మంత్ర బీజాక్షరమ్ మంజునాధేశ్వరమ్

ఋగ్వేద మాద్యమ్ -యజుర్వేదవేద్యమ్

సామప్రగీతమ్ - అధర్వ ప్రభాతమ్

పురాణేతిహాస ప్రసిద్దమ్ విశుద్దమ్

ప్రపంచైక సూత్రమ్ - విబుద్ధమ్ సుసిద్ధమ్

నకారమ్ మకారమ్ - శికారమ్ వకారమ్

యకారమ్ నిరాకార సాకార సారమ్

మహాకాల కాలమ్ మహానీల కంఠమ్ - మహనంద

నందమ్ మహట్టాట్ట హాసమ్

జటాజూట రంగైక గంగా సుచిత్రమ్

జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రమ్ సుగోత్రమ్

మహాకాశ భాస్వన్మహాభానులింగమ్

మహాబభ్రు వర్ణమ్ సువర్ణమ్ ప్రవర్ణమ్

సౌరాష్ట్ర సుందరమ్ - సోమనాథేశ్వరమ్

శ్రీశైల మందిరమ్ - శ్రీమల్లికార్జునమ్

ఉజ్జయిని పుర - మహాకాళేశ్వరమ్

వైధ్యనాధేశ్వరమ్ -మహాభీమేశ్వరమ్

అమరలింగేశ్వరమ్ రామలింగేశ్వరమ్ -కాశీవిశ్వేశ్వరమ్

పరమ్ ఘృశ్మేశ్మరమ్

త్ర్యయంబకాధీశ్వరమ్ - నాగలింగేశ్వరమ్

శ్రీ కే్దారలింగేశ్వరమ్

అప్లింగాత్మకమ్ - జ్యోతిలింగాత్మకమ్

అఖిల లింగాత్మకమ్ - అగ్ని సొమాత్మకమ్

అనాదిమ్ అమేయమ్ అజేయమ్ అచింత్యమ్

అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్ // అనాదిమ్ //

ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్

ఓమ్ సోమాయచ - సౌమ్యాయచ

భవ్యాయచ - భాగ్యాయచ

శాంతాయచ - శౌర్యాయచ

యోగాయచ - భోగాయచ

కాలాయచ - కాంతాయచ

రమ్యాయచ - గమ్యాయచ

ఈశాయచ - శ్రీ చాయాయచ

శర్వాయచ - సర్వాయచ

🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻

*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:*

  *వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1904 (౧౯౦౪)*


*10.1-886-*


*క. కర్మములకుఁ దగు ఫలములు*

*కర్ములకు నిడంగ రాజు గాని సదా ని*

*ష్కర్ముఁ డగు నీశ్వరుండును*

*గర్మవిహీనునికి రాజు గాఁడు మహాత్మా!* 🌺



*_భావము: మహానుభావా! ప్రజలు చేసిన కర్మములకు తగినట్టి ఫలితములను సామాన్య మానవులకు ఇవ్వటానికి రాజు (ఈశ్వరుడు) ఉండనే ఉన్నాడు. ఈశ్వరుడు ఏ కర్మలు చెయ్యటం లేదని, మానవులు విహిత కర్మలు చేయటం మానరాదు కదా ! అలా చెయ్యని వాళ్లకు తగిన శిక్ష పడుతుంది, ఇంద్రుడు తప్పించగలడా?? వాళ్ళ భవిష్యత్తు మార్చగలడా?_* 🙏



*_Meaning: The Almighty is the one who grants the fruits of one’s actions. Those who do not perform any karma (activity or deed) claim that since the Almighty does not have to do any karma, they too follow suit. Such people get required punishment from the Supreme God. Can Indra change their fate?”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

చిదంబర రహస్యం

 చిదంబర రహస్యం అంటే ఏమిటి...!! పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది.ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.


 పూర్వీకులు అప్ప‌ట్లోనే ఎటువంటి సాంకేతిక సాధనాలు లేకుండానే భూమి అయ‌స్కాంత‌ క్షేత్రం క‌నుక్కున్నారు.... స‌రిగ్గా‌ న‌ట‌రాజ‌ స్వామి బొట‌న‌వేలు కింద‌ ఈ భూమి అంతటికీ అయ‌స్కాంత‌ క్షేత్రానికి కేంద్ర‌ బిందువు ఉంటుంది.ఈ విష‌యాన్ని ప్ర‌సిద్ద‌ త‌మిళ‌ స్కాల‌ర్ "తిరుమూల‌ర్" తన‌ గ్ర‌థం "తిరు మందిరం"లో చెప్పారు.


" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు .


అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......!

ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . 

అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి . 

ఇది ఆశ్చర్యం కదూ !


చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి


చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 ) 


ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .


దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి . 

అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.

" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు 


పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు.


9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . 

అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .

ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు 

ఇదే విష‌యాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉప‌యోగించి క‌నుక్కోవ‌డానికి 8 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.....చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి(centre of earth magnitic field) మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేసారు.


నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ గా అభివర్ణించారు.

 సైన్స్ ఇప్పుడు ప్రచారం చేస్తున్నది హిందూ మతం వేల సంవత్సరాల క్రితం పేర్కొంది!

హిందూ ధర్మం ఒక మతం కాదు. ఇది సనాతన ధర్మ జీవనవిధానం అని 


1.పృథ్విలింగం:


ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.


2. ఆకాశలింగం:


ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.


3. జలలింగం:-


ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.


4. తేజోలింగం:


తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.


5. వాయులింగం:


ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

*భాగవతామృతం*

  *భాగవతామృతం*

భీష్మనిర్యాణము


1-218-వ.వచనము

ఇట్లు పీతాంబరధారియుఁ జతుర్భుజుండు నాదిపూరుషుండు బరమేశ్వరుండు నగు హరియందు నిష్కాముండై విశుద్ధం బగు ధ్యానవిశేషంబుచే నిరస్తదోషుఁ డగుచు ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది ప్రకృతివలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలపున మందాకినీ నందనుం డిట్లనియె.

ఇట్లు = ఈ విధముగ; పీతాంబరధారియున్ = కృష్ణుడు {పీతాంబరధారి - పచ్చని వస్త్రములు ధరించువాడు, హరి}; చతుర్భుజుండున్ = కృష్ణుడు {చతుర్భుజుడు - నాలుగు చేతులవాడు, విష్ణువు}; ఆదిపూరుషుండున్ = కృష్ణుడు {ఆదిపురుషుడు - సృష్టికి ముందునుండి ఉన్నట్టి పురుషుడు, విష్ణువు}; పరమేశ్వరుండున్ = కృష్ణుడు {పరమేశ్వరుడు - సర్వమునకు పైనుండు ప్రభువు, హరి}; అగు = అయిన; హరి = కృష్ణుని {హరి - పాపములను హరించువాడు, విష్ణువు}; అందున్ = అందు; నిష్కాముండు = కోరికలు లేనివాడు; ఐ = అయి; విశుద్ధంబు = మిక్కిలి శుద్ధమైనది; అగు = అయిన; ధ్యాన = ధ్యానము యొక్క; విశేషంబు = విశిష్ఠిత; చేన్ = చేత; నిరస్త = తొలగింపబడిన; దోషుండు = దోషములు గలవాడు; అగుచు = అవుతూ; ధారణావతి = ధారణకలిగినది; ఐన = అయిన; బుద్ధిని = బుద్ధిని; సమర్పించి = లగ్నముచేసి; పరమ = పరమమైన; ఆనందంబునన్ = ఆనంద స్థితిని; ఒంది = పొంది; ప్రకృతి = ప్రకృతి; వలనన్ = సిద్ధము; ఐన = అయిన; సృష్టిపరంపరలన్ = పునర్జన్మములను; పరిహరించు = నివారించు; తలపున = ఉద్దేశముతో; మందాకినీనందనుండు = భీష్ముడు {మందాకినీనందనుడు – గంగాదేవి పుత్రుడు, భీష్ముడు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

మందాకినీనందను డైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామభావంతో, నిర్మలధ్యానంతో పీతాంబరధురుడు, చతుర్భుజుడు, పురాణపురుషుడు, పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతిసిద్ధాలైన సంసారబంధాలను పరిహరించే ఉద్ధేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు

1-219-మ.మత్తేభ విక్రీడితము


"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ

రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక

వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

త్రి = మూడు; జగత్ = లోకములను; మోహన = మోహింప చేయగల; నీల = నీలమైన; కాంతిన్ = కాంతితో; తనువు = శరీరము; ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగ; ప్రాభాత = ఉదయ కాలపు; నీరజ = పద్మములకు; బంధు = బంధువు / సూర్యుని; ప్రభము = కాంతి కలది; ఐన = అయిన; చేలము = వస్త్రము; పయిన్ = పైన; రంజిల్లన్ = ఎఱ్ఱగా ప్రకాశిస్తుండగ; నీల = నల్లని; అలక = ముంగురుల యొక్క; వ్రజ = సమూహముతో; సంయుక్త = కూడిన; ముఖ = ముఖము అనే; అరవిందము = పద్మము; అతి = మిక్కిలి; సేవ్యంబు = సేవింపదగినది; ఐ = అయి; విజృంభింపన్ = చెలరేగుతూ; మా = మా యొక్క; విజయున్ = అర్జునుని; చేరెడు = చేరి యుండు; వన్నెలాఁడు = విలాసవంతుడు; మదిన్ = మనస్సును; ఆవేశించున్ = ప్రవేశించును గాక; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ.

“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.

1-220-మ.మత్తేభ విక్రీడితము


హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ

చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.

హయ = గుఱ్ఱముల; రింఖా = కాలి గిట్టల; ముఖ = చివళ్ళ నుండి లేచు; ధూళి = దుమ్ము వలన; ధూసర = బూడిదవర్ణము; పరిన్యస్త = పైపూత గా ఉన్న; అలక = ముంగురులుతో; ఉపేతము = కూడినది; ఐ = అయి; రయ = వేగమువలన; జాత = పుట్టినట్టి; శ్రమ = శ్రమచేత పట్టిన; తోయ = నీటి, చెమట; బిందు = బిందువులతో; యుతము = కూడినది; ఐ = అయి; రాజిల్లు = ఎఱ్ఱనైన; నెఱ = నిండు; మోము = ముఖము; తోన్ = తో; జయమున్ = జయమును; పార్థున = అర్జునున; కున్ = కు; ఇచ్చు = ఇవ్వవలె ననే; వేడ్కన్ = కోరికతో; అనిన్ = యుద్ధములో; నా = నా యొక్క; శస్త్ర = శస్త్రముల; ఆహతిన్ = దెబ్బల వలన; చాలన్ = అధికముగ; నొచ్చియున్ = నొప్పి చెందియు; పోరించు = యుద్ధమును చేయించు; మహానుభావున్ = మహానుభావుని; మది = మనసు; లోన్ = లో; చింతింతున్ = స్మరింతును; అశ్రాంతమున్ = ఎల్లప్పుడూ.

గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

1-221-మ.మత్తేభ విక్రీడితము


నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో

బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం

బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.

నరు = అర్జునుని; మాటల్ = మాటలను; విని = విన్న వాడై; నవ్వు = నవ్వు; తోన్ = తూ; ఉభయ = రెండు; సేనా = సేనల; మధ్యమ = మధ్యన ఉన్న; క్షోణి = ప్రదేశము; లోన్ = లో; పరులు = శత్రువులు; ఈక్షింపన్ = చూచుచుండగ; రథంబున్ = రథమును; నిల్పి = నిలబెట్టి; పర = శత్రువు లైన; భూపాల = రాజుల యొక్క; ఆవళిన్ = సమూహమును; చూపుచున్ = చూపెడుతూ; పర = శత్రువు లైన; భూప = రాజుల యొక్క; ఆయువులు = ప్రాణములు; ఎల్లన్ = అన్నిటిని; చూపులన = చూపులతోనే; శుంభత్ = మెరయుచున్న; కేళి = విలాసముతో; వంచించున్ = లాగికొను; ఈ = ఈ; పరమేశుండు = పరమమైన ఈశుండు, హరి; వెలుంగుచు = ప్రకాశిస్తూ; ఉండెడును = ఉండుగాక; హృత్ = హృదయ మనే; పద్మ = పద్మమును; ఆసనా = ఆసనముగ; ఆసీనుఁడు = స్వీకరించినవాడు; ఐ = అయి.

ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు, పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో; ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

1-222-క.కంద పద్యము


తనవారిఁ జంపఁజాలక

వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్

ఘన యోగవిద్యఁ బాపిన

మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.

తన = తన యొక్క; వారిన్ = వారిని; చంపన్ = చంపుట; చాలక = చేయలేక; వెనుకకున్ = వెనక్కి; పోన్ = వెళ్లుటను; ఇచ్చగించు = కోరుతున్న; విజయుని = అర్జునుని; శంకన్ = సందేహమును; ఘన = గొప్ప; యోగ = యోగమును గూర్చిన; విద్యన్ = విద్యవలన; పాపిన = పోగొట్టిన; ముని = మునులచే; వంద్యుని = స్తుతింపబడువాని, కృష్ణుని; పాద = పాదముల మీది; భక్తి = భక్తి; మొనయున్ = ఉద్భవించును గాక; నాకున్ = నాకు.

రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.

1-223-సీ.సీస పద్యము


కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి;

గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న;

జగముల వ్రేఁగున జగతి గదలఁ;

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ;

బైనున్న పచ్చనిపటము జాఱ;

నమ్మితి నాలావు నగుఁబాటు సేయక;

మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;

1-223.1-తే.

గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి

నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు

విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

కుప్పించి = దుమికి; యెగసినన్ = పరుగెడుతుండగ; కుండలంబుల = (చెవి) కుండలముల యొక్క; కాంతిన్ = కాంతి; గగన = ఆకాశ; భాగంబు = భాగము; ఎల్లన్ = సమస్తము; కప్పికొనఁగన్ = నిండిపోగా; ఉఱికిన = దుముకిన; ఓర్వక = ఓర్చుకొనలేక; ఉదరంబు = పొట్ట; లోన్ = లోపల; ఉన్న = ఉన్నట్టి; జగముల = జగత్తుల; వ్రేఁగున = వడి వలన; జగతి = భూమి; కదలన్ = కదలగా; చక్రంబున్ = చక్రమును; చేన్ = చేత; పట్టి = పట్టి; చనుదెంచు = వచ్చుచున్న; రయమునన్ = వేగమువలన; పైన = పైన; ఉన్న = ఉన్నట్టి; పచ్చని = పచ్చని; పటము = బట్ట; జాఱన్ = జారగ; నమ్మితిన్ = నమ్ముకొంటిన; నా = నాయొక్క; లావున్ = పరువును; నగుఁబాటు = నవ్వులపాలు; సేయకన్ = చేయకుము; మన్నింపుము = మన్నించుము; అని = అని; క్రీడి = అర్జునుడు; మరలన్ = వెనుకకు; దిగువన్ = లాగుచుండగా; కరి = ఏనుగు; కి = కొరకు;

లంఘించు = దూకు; సింహంబు = సింహము; కరణి = వలె; మెఱసి = ప్రకాశించుచు; నేఁడు = ఈవేళ; భీష్మునిన్ = భీష్ముని; చంపుదున్ = సంహరించెదను; నిన్నున్ = నిన్ను; కాతు = కాపాడుదును; విడువుము = వదులు; అర్జున = అర్జునా; అనుచున్ = అనుచూ; మత్ = నాయొక్క; విశిఖ = బాణముల; వృష్టిన్ = వానను; తెరలి = తప్పించుకొని; చనుదెంచు = వచ్చు; దేవుండు = దేవుడు; దిక్కు = శరణమగుగాక; నాకు = నాకు.

ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.

1-224-మ.మత్తేభ విక్రీడితము


తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న

ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్

మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్

జనులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.

తన = తన; కున్ = కు; భృత్యుఁడు = సేవకుడు; వీనిన్ = ఇతనిని; కాఁచుట = కాపాడుట; మహా = ముఖ్యమైన; ధర్మంబు = ధర్మము; ఒమ్ము = పొమ్ము; అంచున్ = అనుచు; అర్జున = అర్జునుని; సారథ్యము = రథసారథ్యము; పూని = చేపట్టి; పగ్గములు = పగ్గములను; చేన్ = చేతితో; చోద్యంబుగాన్ = ఆశ్చర్యకరముగ; బట్టుచున్ = పట్టుకొని; మునికోలన్ = ములుగఱ్ఱను; వడిన్ = త్రిప్పు వేగమును; పూని = కూడి ఉండి; ఘోటకములన్ = గుఱ్ఱములను; మోదించి = సంతోషపరచి; తాడించుచున్ = అదలించుచు; జనులన్ = ప్రజలను; మోహము = మోహము; ఒందన్ = పొంద; చేయు = చేయుచున్న; పరమ = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహముగలవానిని; ప్రశంసించెదన్ = స్తోత్రము చేసెదను.


1-225-క.కంద పద్యము


పలుకుల నగవుల నడపుల

నలుకల నవలోకనముల నాభీరవధూ

కులముల మనముల తాలిమి

కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.


పలుకులన్ = పలుకలతోను; నగవులన్ = చిరునవ్వులతోను; నడపులన్ = ప్రవర్తనలలోను; అలుకలన్ = అలుకలుతోను; అవలోకనములన్ = చూపులతోను; ఆభీర = గోపికా; వధూ = స్త్రీ; కులముల = సమూహముల; మనముల = మనసులలోని; తాలిమి = ఓర్పుల; కొలుకులు = బిగువులు, బంధములు; వదలించు = సడలించు; ఘనునిన్ = గొప్పవానిని; కొలిచెదన్ = పూజించెదను; మది = మనస్సు; లోన్ = లోపల.

తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.

1-226-ఆ.ఆటవెలది


మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా

మందిరమున యాగమండపమునఁ

జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది

దేవుఁ డమరు నాదు దృష్టియందు.

మునులు = మునులు; నృపులు = రాజులు; చూడ = చూస్తుండగ; మును = పూర్వము; ధర్మజుని = ధర్మరాజు యొక్క {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; సభా = సభదీర్చు; మందిరమున = భవనములో; యాగ = యజ్ఞముచేయు; మండపమునన్ = మండపములో; చిత్ర = చిత్రమైన; మహిమ = ప్రాభవము; తోడన్ = తో; చెలువొందు = అందాలొలికించు; జగత్ = విశ్వమునకు; ఆది = మూలపు; దేవుఁడు = దేవుడు; అమరున్ = కుదురుకొనుగాక; నాదు = నా యొక్క; దృష్టి = చూపుల; అందున్ = లోపల.

మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు.

1-227-మ.మత్తేభ విక్రీడితము


ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో

లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ

న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ

పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై."

ఒక = ఒకే; సూర్యుండు = సూర్యుడు; సమస్త = సమస్తమైన; జీవులు = జీవులు; కున్ = కును; తాన్ = తను; ఒక్కొక్కఁడు = ఒక్కొక్కడుగా; ఐ = అయి; తోఁచు = కనిపించు; పోలికన్ = విధముగ; ఏ = ఏ; దేవుండు = దేవుడు; సర్వ = సమస్తమైన; కాలము = కాలమునందు; మహా = గొప్ప; లీలన్ = లీలతో; నిజ = తననుండి; ఉత్పన్న = జనించిన; జన్య = జీవుల; కదంబంబుల = సమూహముల; హృత్ = హృదయ; సరోరుహములన్ = పద్మములలోను {సరోరుహము - సరసున పుట్టునది, పద్మము}; నానావిధ = అనేక రకములైన; ఆనూన = గొప్పవియైన; రూపకుఁడు = రూపముకలవాడు; ఐ = అయి; ఒప్పుచు = ఒప్పుతు; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; హరిన్ = హరిని {హరి - సంగవ్రాతములను హరించువాడు, విష్ణువు}; నేన్ = నేను; ప్రార్ఠింతు = పూజింతు; శుద్ధుండను = పరిశుద్ధుడను; ఐ = అయి.

ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."

1-228-వ.వచనము

అని యిట్లు మనోవాగ్దర్శనంబులం బరమాత్ముం డగు కృష్ణుని హృదయంబున నిలిపికొని, నిశ్వాసంబులు మాని, నిరుపాధికం బయిన వాసుదేవ బ్రహ్మంబు నందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబు లూరకయుండు తెఱంగున నుండిరి; దేవ మానవ వాదితంబులై దుందుభి నినాదంబులు మొరసె; సాధుజన కీర్తనంబులు మెఱసె; గుసుమ వర్షంబులు గురిసె; మృతుం డయిన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి ముహూర్త మాత్రంబు దుఃఖితుం డయ్యె; నంత నచ్చటి మునులు కృష్ణునిఁ తమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగు లగుచుం దదీయ దివ్యావతార నామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుం జనిరి; పిదప నయ్యుధిష్ఠిరుండు కృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీ సమేతుం డయిన ధృతరాష్ట్రు నొడంబఱచి తత్సమ్మతంబున వాసుదేవానుమోదితుండై పితృపైతామహంబైన రాజ్యంబుఁ గైకొని ధర్మమార్గంబునఁ బ్రజాపాలనంబు సేయుచుండె" నని చెప్పిన విని సూతునకు శౌనకుం డిట్లనియె.

అని = అని; ఇట్లు = ఈ విధముగ; మనస్ = మనసులోను; వాక్ = మాటలలోను; దర్శనంబులన్ = దర్శనములలోను; పరమ = పరమమైన; ఆత్ముండు = ఆత్మగలవాడు; అగు = అయిన; కృష్ణుని = కృష్ణుని {కృష్ణుడు - నల్లని వాడు}; హృదయంబున = మనసులో; నిలిపికొని = స్థిరపరచుకొని; నిశ్వాసంబులు = ఊపిరితీసుకొనుట; మాని = మానివేసి; నిరుపాధికంబు = హేతువుకు అతీతమగునది; అయిన = అయినట్టి; వాసుదేవ = ఆత్మలలో వసించే దైవమైన; బ్రహ్మంబు = బ్రహ్మ, వాసుదేవ బ్రహ్మ; అందున్ = లో; కలసిన = కలసిపోయిన; భీష్మునిన్ = భీష్ముని; చూచి = చూసి; సర్వ = సమస్త; జనులు = ప్రజానీకము; దివస = దినమునకు; అవసానంబున = అంతమున, సాయం సంధ్యలో; విహంగంబులు = పక్షులు; ఊరక = నిశ్శబ్దముగ; ఉండు = ఉండే; తెఱంగునన్ = విధమున; ఉండిరి = ఉన్నారు; దేవ = దేవతలచే; మానవ = మానవులచే; వాదితంబులు = మ్రోగింపబడుచున్నవి; ఐ = అయిన; దుందుభి = దుందుభుల; నినాదంబులు = శబ్దములు; మొరసెన్ = మ్రోగినవి; సాధుజన = సజ్జనులు చేసిన; కీర్తనంబులు = స్తుతులు; మెఱసె = ప్రకాశించినవి; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; కురిసె = వర్షించినవి; మృతుండు = చనిపోయినవాడు; అయిన = అయినట్టి; భీష్ముని = భీష్ముని; కిన్ = కి; ధర్మజుండు = ధర్మరాజు {ధర్మజుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు}; పరలోకక్రియలు = శ్రాద్ధకర్మలు {పరలోకక్రియలు - పరలోకగతులకై చేయు దహనాది కర్మలు}; చేయించి = చేయించి; ముహూర్త = ముహూర్త; మాత్రంబు = కాలము; దుఃఖితుండు = దుఃఖించిన వాడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; అచ్చటి = అక్కడ ఉన్న; మునులు = మునులు; కృష్ణునిన్ = హరిని; తమ = తమ యొక్క; హృదయంబులన్ = హృదయములలో; నిలిపికొని = స్థిరపరచుకొని; సంతుష్ట = సంతృప్తి చెందిన; అంతరంగులు = అంతరంగము గలవారు; అగుచున్ = అవుతూ; తదీయ = అతని యొక్క; దివ్య = దివ్యమైన; అవతార = అవతారములను; నామంబులు = నామములు; చేన్ = చేత; స్తుతియించి = ప్రార్థించి; స్వ = తమ యొక్క; ఆశ్రమంబులు = ఆశ్రమములు; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; పిదపన్ = ఆతరువాత; ఆ = ఆ; యుధిష్ఠిరుండు = ధర్మరాజు; కృష్ణ = కృష్ణునితో; సహితుండు = కూడుకొన్నవాడు; ఐ = అయి; గజపురంబున్ = హస్తినాపురము; కున్ = నకు; చని = వెళ్ళి; గాంధారీ = గాంధారితో; సమేతుండు = కూడినవాడు; అయిన = అయినట్టి; ధృతరాష్ట్రున్ = ధృతరాష్ట్రుని; ఒడంబఱచి = ఒప్పించి; తత్ = అతని; సమ్మతంబునన్ = ఒప్పుకోలుతో; వాసుదేవ = వసుదేవసుతుని, కృష్ణుని; అనుమోదితుండు = అనుమతిపొందినవాడు; ఐ = అయి; పితృ = తండ్రి నుండి వచ్చినదియు; పైతామహంబు = వంశపారంపర్యము {పైతామహము-తాతలకు సంబంధించినది - అనువంశికము}; ఐన = అయినట్టి; రాజ్యంబున్ = రాజ్యమును; కైకొని = స్వీకరించి; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గంబునన్ = విధముగ; ప్రజా = ప్రజలను; పాలనంబు = పరిపాలించుట; సేయుచుండెన్ = చేయుచుండెను; అని = అని; చెప్పిన = చెప్పగా; విని = ఆలకించి; సూతున = సూతున; కున్ = కు; శౌనకుండు = శౌనకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సుద్వారా, వాక్కులద్వారా, దృక్కులద్వారా శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో పదిలపరచుకొని; నిశ్వాసాన్ని నిరోధించి; నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమైయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లా మౌనం వహించారు; దేవలోకంలోను, మానవ లోకంలోను దుందుభులు ధ్వనించాయి; సాధుసంకీర్తనలు వినిపించాయి; పూలవానలు కురిశాయి; తనువు చాలించిన దేవనదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి; ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మును లందరు శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని; ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషితస్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్లాడు. అక్కడ గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో, శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించినవాడై ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు.” ఇలా చెప్పగానే శౌనకుడు సూతమహర్షిని ఇలా అడిగాడు.

1-229-ఆ.ఆటవెలది


"ధనము లపహరించి తనతోడఁ జెనకెడు

నాతతాయి జనుల నని వధించి

బంధు మరణ దుఃఖ భరమున ధర్మజుఁ

డెట్లు రాజ్యలక్ష్మినిచ్చగించె?"

ధనములు = ధనములను; అపహరించి = దొంగిలించి; తన = తన; తోడన్ = మీద; చెనకెడు = గొడవచేయువారు; ఆతతాయి = హత్యలు చేయువారైన; జనులన్ = మానవులను; అనిన్ = యుద్ధములో; వధించి = సంహరించి; బంధు = బంధువుల; మరణ = మరణమువలన కలిగెడు; దుఃఖ = బాధ యొక్క; భరమున = భారముతో; ధర్మజుఁడు = ధర్మరాజు; ఎట్లు = ఏవిధముగ; రాజ్యలక్ష్మిన్ = రాజ్యమును; ఇచ్చగించె = అంగీకరించెను.

తన సిరిసంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గపు ఆతతాయిలను (ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనము దోచుకొనే వాడు, నేల నపహరించేవాడు, ఇతరుల భార్యను చెరపట్టేవాడు వీరారుగురుని ఆతతాయి అంటారు) సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరు మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు.

1-230-వ.వచనము

అనిన సూతుం డిట్లనియె.

అనిన = అనగా; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

ఇలా అడిగిన శౌనకుడికి, సూతుడు ఇలా సమాధానం చెప్పాడు.

*శ్యామలా దండకం*

*శ్యామలా దండకం*

మాణిక్య వీణా ముఫలాలయంతీం 

మదాలసాం మంజుల వాగ్విలాసామ్ 

మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం 

మాతంగకన్యాం మనసా స్మరామి 


చతుర్భుజే చంద్రకళావతంసే 

కుచోన్నతే కుంకుమ రాగశోణే 

పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే 

నమస్తే జగదేకమాతః 


మాతా మరకత శ్యామా 

మాతంగీ మధు శాలినీ 

కుర్యాత్కటాక్షం కళ్యాణీ 

కదంబ వనవాసినీ 


జయ మాతంగ తనయే 

జయ నీలోత్పల ద్యుతే 

జయ సంగీత రసికే 

జయ లీలా శుకప్రియే 


జయ జనని 

సుధాసముద్రాంత రుద్యన్మణీద్వీప 

సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప 

కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే  

సాదరారబ్ధ సంగీత సంభావనా 

సంభ్రమాలోల నీపస్రగాబద్ధ 

చూలీసనాథత్రికే సానుమత్పుత్రికే 

శేఖరీ భూత శీతాంశురేఖా 

మయూఖావలీ బద్ధసుస్నిగ్ధ నీలాలకశ్రేణి 

శృంగారితే లోకసంభావితే 

కామలీలా ధనుస్సన్నిభభ్రూ 

లతాపుష్ప సందేహ కృచారు 

గోరోచనా పంకకేళీ లలామాభిరామే 

సురామే రమే 


సర్వ యంత్రాత్మికే 

సర్వ తంత్రాత్మికే

సర్వ మంత్రాత్మికే 

సర్వ ముద్రాత్మికే 

సర్వ శక్త్యాత్మికే 

సర్వ చక్రాత్మికే 

సర్వ వర్ణాత్మికే సర్వ రూపే, 

జగన్మాతృకే హే జగన్మాతృకే

పాహి మాం పాహి మాం పాహి పాహి


                    - కాళీదాస కృతం

          గానం - ఘంటసాల మాష్టారు

🌸 *సుభాషితమ్* 🌸

 🌸 *సుభాషితమ్* 🌸

శ్లో|| రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా

రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !


తా|| రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా, ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

రాహు దోషం

  రాహు దోషం - నివారణోపాయలు

   అన్ని గ్రహాలు రవి వలన అస్తంగతులైతే.. రవి చంద్రులను కూడా నిస్తేజులుగా చేయగల చండ ప్రచండుడు రాహువు. అందుకే ఈయన స్తోత్రంలో "చంద్రాదిత్య విమర్ధనం" అని మర్దించే శక్తీ రాహువుకు గలదని చెప్పబడింది. ప్రాణ శక్తీ కారకుడైన సూర్యుని, మనః శక్తీకి కారకుడైన చంద్రుని మర్ధించే శక్తి ఉంది. అందుకే రాహు మహా దశః బాగు లేనివారు పడే పాట్లు వర్ణనాతీతం.


పురాణా శాస్త్రాల ప్రకారం దక్షుని కూతురు సింహికకు కస్యపునికి రాహువు జన్మించాడు. పైటినసగోత్రజుడు పార్ధవా నామ సంవత్సర భద్రా పద పౌర్ణమి పూర్వభద్రా నక్షత్రామందు జన్మించాడు. మ్లేచ్చ స్వభావం కలిగినవాడు. సూర్యునికి నైరుతి దిశలో శూర్పకార మండలంలో సింహవాహునుడై, కరాళ వక్త్రంతో ఉప విష్ణుడై వుంటాడు.


కొత్త దాన్ని ఆవిష్కరించే స్వభావం రాహువుది. శరీరంలోకి ఫారిన్ మీటర్కానీ, మనుషులకు ఫారిన్ ప్రయాణం కానీ, వ్యక్తులతో పరిచయాలు గానీ, అలవాట్లతో అనుభూతులు కానీ కల్గించేవాడు రాహువు. ఈ గ్రహం గారడీ చేయించే శక్తి కలవాడు. అబద్ధాలు, అల్లకల్లోలాలు, కొత్త అలవాట్లు. కొత్త వేష భాషలు కలిగించడంలో సిద్దహస్త్తుడు. గ్రీకు పురాణ గాధల్లో డ్రాగన్ అనే రాకాసి బల్లి వంటి జంతువు తలగా రాహువును, తోకగా కేతువును ప్రతీకలుగ చిత్రీకరించారు. శని గ్రహం వలే రాహువు కర్మ గ్రహం. పూర్వ జన్మ కర్మల్ని అతి విడ్డురంగా అనుభవింప చేయగలడు. దుర్మార్గ స్వభావం కలవారు. అందలం ఎక్కడానికి సహస కార్యక్రమాలు చేపట్టి వారికీ చేయూత ఇవ్వడానికి రాహువు బాగా సహకరిస్తాడు.


అంతేకాదు రాహు మహా దశలో ఖచ్చితంగా పితృ కర్మలు చేయిస్తాడు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశఃకానీ, అంతర్ దశః కానీ జరుగుతున్నపుడు తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మలో ఒకరికి ఆయువు తీరుతుంది. రాహువుకు యోగాలు కల్గించడం ఉన్నా, అనుభవంలో అవయోగాలు ఎక్కువుగా కల్గిస్తాడు."రాహు మహా దశః పట్టిందిరా అనేది వాడుక. అల్పుల అందలం ఎక్కుట వల్ల ఏర్పడిందే. ఫారిన్ భాషలు, ఫారిన్ వస్తువులు ఫారిన్ జబ్బులు తెప్పించడంలో రాహువుదే ఆగ్రాతాంబూలం


రాహువు వల్ల ఏర్పడే పరిణామాలు

రాహువు వల్ల పలు పరిణామాలు ఏర్పడతాయి. రాజ్యాధికారం కల్పించుటలో , పదవిచ్యుతుని చేయుటలో రాహువు కారకుడు. వర్ణాంతర వివాహాలు చేసుకోనటలో కూడా ప్రభావం కలవాడు. కుట్రలు, పన్నాగాలు, ఎత్తు గడలు, కులద్రోయుట వంటి నీచ గుణాలు కలిగిస్తాడు. సాంప్రదాయాల సంస్కరణకు, మతబ్రస్థత్వాం పట్టిస్తాడు. తక్కువ స్థితిగల స్త్రీ సాంగత్యానికి పురిగొల్పుతాడు. సంకుచిత ఆలోచనలు కల్గిస్తాడు. వ్యసనపరులుగా, పోకిరిలుగా మార్చి దుష్ట్ట స్నేహాలను కల్గిస్తాడు. నైరుతి దిశలో కలిగే లాభ నష్టాలకు కారకుడు. పీడ కలలు, భయందోళనలు కలిగిస్తాడు. రహస్య స్టావరాల పనులు, రహస్య మంతనాలకు ప్రేరేపిస్తాడు. వన దుర్గ దేవి ఆరాధనతో రాహువు ప్రీతీ చెందుతాడు. ఉర్దూ, పర్షియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవడానికి కారకుడు అవుతాడు.


రాహువు కలిగించే బాధలు

రాహువు అనేక బాధలు కలిగిస్తాడు. కుటుంబంలో కల్లోలాలు సృష్టిస్తాడు. స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటించుట, ముర్ఖునిగా ప్రవర్తించుట, అధికార దుర్వినియోగం చేసి అల్లరి పలగుట, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల నష్టాలు, పొలిసు గూడచారి సంస్థల వల్ల బాధ కలుగును. కుటుంబంలో పెద్దవారికీ ఆకస్మిక మరణాలు, పిల్లలు తప్పిపోవుట లేదా ఎత్తుకు పోవుట, కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుపోవుట, మిలటరీ సంబంధ, బిల్డింగ్  కాంట్రాక్టు సంబంధ నష్టాలు, పాములు, తేల్లు, గేదెలు, విష జంతువుల వల్ల బాధలు కలిగిస్తాడు. విష గ్యాసులు, ఆమ్లాలు, వాతావరణ కాలుష్యం వల్ల ప్రమాదాలు, న్యూన్యత భావం, ఎక్కడికో పారి పోదామనే మానసిక ప్రవర్తన, జైలు వరకు తీసుకొని వెళ్ళుట చేయిస్తాడు.


చంద్రునితో కలిస్తే గొప్ప బుద్ధి చాంచల్యం గానీ పిచ్చి కానీ కల్గించవచ్చును. కుజుని తో కలిసి చెడిపోతే ఆకస్మిక ప్రమాదాలు, దెబ్బ లాటలు, గాయాలు కల్గిస్తాడు. రవితో కలిస్తే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బ తీస్తాడు. శని రాహువుల కలయిక త్రీవ్రమైన పరిస్తితిలకు దారి తీయవచ్చును. గురునితో కలిస్తే సద్భావన ఉన్నా, తప్పని పరిస్థితిలలో తప్పులు చేయిస్తాడు. ఎంత రహస్యంగా పనులు చేసినా బహిర్గాతం చేసి పరువు తీయిస్తాడు. రాహువు ఎంత యోగం కల్గించినా, ఎంతో కొంత అప్రదిష్ట చేయకుండా ఉండలేడు.


రాహువు కలిగించే అనారోగ్యాలు

రాహువు వాయుతత్వ కారకుడు కావడం వల్ల మనవ శరీరంలోని సమస్త వాయు సంబంద రోగాలను కల్గిస్తాడు. నొప్పి ఎక్కడుందో అక్కడ రాహువు ఉంటాడు. కడుపు, నాభి, మర్మాంగాల నొప్పులకు ప్రతీక. ఉచ్చ్వాస నిశ్వాసల్లోని గమన సిలత్వాన్ని కంట్రోలు చేసే శక్తీ రాహువుది. ఉరఃపంజర సంబంధ రోగాలను కలిగిస్తాడు. శుక్ర రాహువుల కలయికతో చర్మ సౌంధర్యాన్ని దెబ్బ తీస్తాడు. సమస్తమైన అంటు వ్యాధులకు రాహువు అధిపతి. టైఫాయిడ్, మలేరియా, మసూచి, ఇన్ ఫ్లూ,అనేక రకాల వైరస్ జ్వరాలకు రాహువు పెట్టింది పేరు. కన్య రాశిలో వుంటే అన్ని రకాల పురుగులను కడుపులో పెంచుతాడు. శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గించి.. బ్యాక్టిరియాను ఆహ్వానించడంలో రాహువు మొదటి వాడు. రాహువు స్టితి బట్టి పక్షవాతం, కీళ్ళవాతం, నడుము నొప్పి కలుగుతాయి


రాహు గ్రహ నివారణోపాయలు


మానవుని ఇంత ప్రభావం చూపే రాహు గ్రహ నివారణోపాయలు ఇప్పుడు తెలుసుకుందాం. రాహువుకు అధిదేవత పృద్వీ అని కొందరు, గౌ గోవులని కొందరు చెబుతారు. ప్రత్యదిదేవత సర్పములు, అధిప్రత్యది దేవతా సహితంగా పునశ్చరణ చేసి దార పోయుట వలన నివారణ కలుగును. రాహువుకు అధిష్టాన దేవత దుర్గా దేవి సప్తాసతి పారాయణం కానీ మంత్రం జపం కానీ, కవచం కానీ పునఃశ్చరణ చేయుట వలన నివారణ పొందవచ్చును. చిన్నమాస్తాదేవిని విధి విధానంగా పూజించడం వల్ల రాహు గ్రహం దుష్పరిమనాలను నివారించవచ్చును.


రాహు గ్రహ దోష నివారణకు శనివారం నాడు ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు పారుతున్న నీటిలోకి రోజుకోక కొబ్బరికాయ దార పోయుట వల్ల నివారణ కలుగును. పడుకొనే ముందు గదిలో నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, తెల్ల వారు జామున లేవగానే చూచుట వల్ల రాహు గ్రహ పీడ నివారణ కలుగును


రాహు దోషం తొలగాలంటే దీపారాధన కూడా చేయాలి. రాహు యంత్రాన్ని పుష్పాలతో అర్చించాలి. నల్ల దుస్తులు ధరించాలి. ఇంకా మినపప్పును దానం చేసి వేప నూనెతో దీపారాధన చేయడం ద్వారా రాహు దోషం తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది. రాహు భగవానునికి ఏదైనా ఒకరోజు అభిషేకం చేయించాలి. నలుపు వస్త్రాలు, గోమేధికం, బ్లూ లోటస్‌తో పూజ చేయించాలి. రాహు స్తుతి చేసి గరికతో యాగం నిర్వహించి.. మినపప్పు, మినపప్పు పొడి, అన్నం అగ్నికి ఆహుతి ఇవ్వండి. తర్వాత దీపారాధన చేయాలి...మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

బీబీ నాంచారి కధ

 బీబీ నాంచారి కధ 700 సంవత్సరాల నాటిది..ప్రక్షిప్తం/ఎమోషనల్ గా రాసుకున్న కధ....

బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. అసలు మాలిక్ కాఫర్ స్వతహాగా హిందువు..అయితే అల్లా ఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారిన తర్వాత అతను ముస్లీంగా మారాడని చెబుతారు. తన రాజ్యాన్ని విస్తరించే భాద్యతను అల్లా ఉద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ మీద ఉంచాడు.. ( ఈ మాలిక్ కాఫర్ బై సెక్సువల్.. గుజరాత్ కు చెందిన వాడు..ఖిల్జీకి సెక్స్ బానిసగా బహుమతినివ్వబడ్డవాడు.. వీడి దండయాత్ర గురించి దోపిడీ గురించి తిరుమల రంగ మండపంలో మొన్నటి వరకూ ఒక ఇత్తడి ఫలకం ఉండేది..ఏ అధికారికో వాడి పేరు చూడడం చిరాకు అనిపించి తీసివేసినట్టున్నారు..అప్పట్లో ఆ ఫలకం తీసివేయమని పోస్టులు కూడా పెట్టాం.. )..

దీంతో మాలిక్ కాఫర్ దక్షిణ భారత దేశం మీద దండయాత్ర గావించాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని వశపరుచుకొన్నాడు. ఆనాడు శ్రీరంగంలోని రంగనాథుడి ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతూ ఉండేది..అపార ధనరాశులతో ముస్లిం దోపిడీదారులను ఊరిస్తూ ఉండేది..

ఆలయం మీద దాడిచేసి అక్కడి బంగారం, వెండి, వజ్రాలతో పాటు పంచలోహాలతో తయారుచేసిన ఉత్సవమూర్తిని కూడా మాలిక్ కాఫర్ కొల్లగొట్టి తనతో పాటు ఢిల్లీకి తీసుకువెళ్లాడు..

ఢిల్లీకి చేరుకున్న తర్వాత మాలిక్ కాఫర్ తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సురతాని రంగనాథుడి విగ్రహం పట్ల ఆకర్షితురాలవుతుంది..

ఆ విగ్రహం తనకు ఇవ్వాల్సిందిగా కోరుతుంది. కూతురు కోరికను కాదనలేక మాలిక్ కాఫర్ ఆ విగ్రహాన్ని సురతానికి అందజేస్తాడు. ఇక ప్రతి రోజూ ఆ విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం ఊయల ఊపడం చేసేది..

అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి చేయసాగింది. అంతేకాకుండా భక్తి పారవశ్యంలో తనను తాను ఆ రంగడికి భార్యగా భావిస్తూ వచ్చింది..

మనసావాచా కర్మణా రంగడికి తన మనస్సును అర్పించుకొని..రంగడు తప్ప తనను ఎవరూ తాకరాదనే మానసిక స్తితికి వెళ్లింది..

రంగనాథుని ఉత్సవ విగ్రహం లేని శ్రీరంగం వెలవెల పోయింది. దీంతో రంగనాథుడి భక్తులు ఆచార్యుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి మాలిక్ కాఫర్ ను కలిసారు..

రంగనాథుడిని వెదుక్కొంటూ ఢిల్లీ వచ్చిన ఆ అర్చకులను చూసిన మాలిక్ కాఫర్ మనసు కరిగి పోయింది. దీంతో సంతోషంగా ఆ పంచలోహ విగ్రహాన్ని తిరిగి వారికి ఇవ్వడానికి అంగీకరించాడు..

అయితే అప్పటికే రంగనాథుడి మీద మనసుపడిన సురతాని గురించి విన్న అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని తీసుకుని శ్రీరంగం బయలుదేరారు..

ఉదయం లేచిన సురతానికి రంగనాథుడి పంచలోహ విగ్రహం కనబడలేదు. దీంతో ఆ విగ్రహాన్ని వెదుక్కొంటూ ఆమె శ్రీరంగం చేరుకొంది. ఈ క్రమంలో తన తండ్రిమాటను కూడా లెక్కచేయలేదు..

శ్రీరంగం చేరుకొని అక్కడే స్వామివారిని సేవిస్తూ జీవిత చరమాంకంలో ఆయనలో ఐక్యమయ్యిందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో వారి నిలువెత్తు రూపాన్ని మనం చూడవచ్చు.

మరికొందరు ఆ విగ్రహం శ్రీరంగం లోని రంగనాథుడిది కాదని కర్నాటకలోని మేల్కోటే లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు..దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. మరికొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు..

కలియుగంలో వేంకటేశ్వరుడిని తోడుగా నిలుచేందుకు ఆమె సురతాని రూపంలో జన్మించిందని చెబుతారు. ఆమె తిరుపతిని చేరుకొని అటు పై భగవంతునిలో లీనమైపోయిందని నమ్ముతారు..

అందువల్లే తిరుపతిలో మనం ఇప్పటికీ బీబీనాంచారమ్మ విగ్రహాన్ని చూడవచ్చు. ఏది ఏమైనా ఆమె ఒక ముస్లీం స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు అలాగే మాలిక్ కాఫర్ కూతురు అనేది కూడా వివాదం లేనిదే..

అందుకే తమిళంలో బీబీనాంచారమ్మను తుళుక్క నాచియార్ అని అంటారు. అంటే తురుష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలా మంది ముస్లీంలు సైతం వేంకటేశ్వరుడి సతిగా భావిస్తారు..

కడపలో కూడా ఏటా ఒకరోజు ముస్లిం సోదరీమణులు వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది..

బీబీ నాంచారి గారు ఒక భక్తి పారవశ్యాలతో తనను తాను అర్పించుకున్న మహభక్తురాలు..దాంట్లో సందేహం లేదు వారికి పాదాభివందనం..

దీన్ని ఇంతవరకే చూడాలి..నిజంగా రంగడు లేదా వెంకన్న భౌతికంగా వివాహం చేసుకోలేదు అన్న విషయాన్ని గమనించాలి..

వారిని ఉదాహరణగా చూపుతూ అందరికీ ఇదే గాటన కట్టివేయలేము..నిజంగా భక్తి ఉంటే ఎవరూ ఆపలేరు..గురువాయూర్ కృష్ణుడు కావాలనుకుంటే జేసుదాసు గారినే రప్పించుకున్నారు 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అన్నీ పరీక్షలు పూర్తి అయిన తర్వాత మాత్రమే అదీ దేవదేవుడి లీల.. ..

సాక్షాత్తు వెంకన్న అష్టదళ పాదపద్మారాదనకు కావలసిన సువర్ణ పుష్పాలు గుంటూరు కు చెందిన ఒక ముస్లిం భక్తుడు ఇచ్చారు..

నిజమైన భక్తి భావంతో ఎవరైనా రావొచ్చు..దానికోసం సంతకమే కాదు వారు పొర్లుదండాలు పెట్టడానికి సైతం సిద్దంగా ఉంటారు..

నియమాలు పెట్టినప్పుడు తప్పనిసరిగా పాటించాలి..తప్పదు..దీంట్లో పెద్దా చిన్నా లేదు..అగౌరవం లేదూ..కించపరచడమూ లేదు..

అడ్డంపడుతున్నదల్లా అహంకారమే..స్వస్తి..

( నెట్ లో వివిధ సోర్స్ ల ఆధారంగా..చిన్నప్పుడు చదివిన కధలు ఆధారంగా )..

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-10

  **దశిక రాము**

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-10

#


🕉️ శ్లోకం 04


**సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః**


**భూతాది ర్నిధి రవ్యయః|**


**సంభవో భావనో భర్తా**


**ప్రభవః ప్రభురీశ్వరః||**


25. సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.

26. శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.

27. శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.

28. స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.

29. భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములనుసృష్టించిన వాడు.

30. నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.

31. సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.

32. భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.

33. భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.

34. ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.

35. ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడా భోగ మోక్షములోసగు సమర్ధుడు.

36. ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

6.సర్వమతడె మరియు శర్వుడు దానెగాశస్తకరుడు మరియు స్థాణువతడె


సకల భూతములకు సరియైన మూలము


వందనాలు హరికి వంద వేలు !!


[అర్థాలు: సర్వ ... సర్వము, శర్వ ... హరించు, శస్త కరుడు అనగా శుభంకరుడు అనగా శివుడే, స్థాణువు ... దేనికీ చలించనివాడు,భూతాది ... భూతాలకు మూలము.


భావము: బ్రహ్మాది దేవతలు మొదలు సకల చరాచర జీవకోటి తానే అయినవాడు, సకల దోషాలను శమింపజేసేవాడు, శుభంకరుడూ అయిన శివుడు కూడా శ్రీహరియే. దేనికీ చలించనివాడు అనగా కాలాతీతుడు, సకల భూతాలకూ ఆధారము, మూలమూ తానే అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]


7. నిఖిల జగతి కతడు నిధియె వ్యయముగాడు


యుగయుగాలు తానె యుద్భవించు


భావనొకటి యున్న భర్తయై గాచును


వందనాలు హరికి వంద వేలు !!


[అర్థాలు: నిధి రవ్యయ ... వ్యయము కాని నిధి, సంభవో ... సంభవామి యుగే యుగే, భావన ... భావము చేతనే, భర్త ... భరించువాడు.


భావము: పునరపి జననం, పునరపి మరణం సాధారణ ప్రాణకోటికే గాని శ్రీహరికి కాదు గదా. కనుక ఆయన మన పుణ్య కార్యాలన్నిటికీ తరగని నిధియై ప్రళయానంతరం తదనుగుణమైన సృష్టి చేస్తూ ఉంటాడు. అలాగే అవసరం అనుకున్నపుడు తనకు తానుగానే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ప్రాణకోటి తన ఉనికిని గుర్తిస్తూ తనకై ప్రార్థనలు చేసీ చేయగానే ఆ భావ మాత్రముననే రంగంలోకి దిగి భారం వహించి కాపాడుతుంటాడు. కనుకనే అట్టి యా శ్రీహరికి శత సహస్ర వందనాలు.]


8. సాధు జనులకెపుడు సంరక్షగా తాను


ప్రభల నిచ్చుటకును ప్రభవ మందు


ప్రభువు లక్షణమెగ పాలించ లాలించ


వందనాలు హరికి వంద వేలు !!


[అర్థాలు: ప్రభవ ... పుట్టుక, ప్రభు ... పాలకుడు, ఈశ్వర ... ఆలించి పాలించువాడు(రాజులేదా తండ్రి), ప్రభలు ... వెలుగులు.


భావము: సాధు జనుల రక్షణకై వెలుగులు ప్రసరించే అనగా జ్ఞాన జ్యోతులను అందించే నిమిత్తం తనకు తానుగానే అవతరించువాడు, పాలన, పోషణ వంటి బరువు బాధ్యతలను నిర్వర్తించువాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]


**ఓం నమో నారాయణాయ** 🙏🙏


**ధర్మో రక్షతి రక్షితః**