7, డిసెంబర్ 2020, సోమవారం

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



జటల , పశు , కళంక , కుటిలమై నటువంటి

            గంగ , హరిణి , శశి , భుజంగములను

శీర్ష , హస్తక , చూడ , శిష్టాంగములయందు

             దాల్చినాడ వీవు దయను జూపి

యట్టి లక్షణములు నరయ నాలో లేవె

            యుండినా నవి యటు లుండనిమ్ము

సర్వములను పొందు సర్వేశ్వరా ! నీవు

             పొందవేల నన్ను భూషణముగ ?

గరళకంఠ ! నీదు కరుణకు నోచనా ?

పాత్రు గాన నేను భక్త వరద !

దయను చూపుమయ్య తరుణేందుభూషణా !

చింత దీర్చి నన్ను స్వీకరించు.              69 #


ఆ వె

అతి సహర్ష మూర్తి యగణిత ఫలదాయి

సర్వలోక విభుడు శక్తి యుతుడు

చంద్రశేఖరుండు జగదాధినాథుండు

పార్వతీ ప్రభుండు పరమశివుడు

ఆ వె

అంతరంగమందు నట్టే బయలు నందు

సులభ సేవ్యుడైన శూలపాణి

నాదు హృదయమందు నయముగా కొలువుండె

సేవలందుకొనుచు స్థిరము గాను.          70 #



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: