12, మే 2024, ఆదివారం

Panchaag


 

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏

*13-05-2024 / సోమవారం / రాశిఫలాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ పరుస్తాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన కలుగుతుంది.

---------------------------------------

వృషభం


వ్యాపారపరంగా బాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

---------------------------------------

మిధునం


చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

కర్కాటకం


చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. 

---------------------------------------

సింహం


అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుండి ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

కన్య


కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

---------------------------------------

తుల


సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


పాత రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు.

---------------------------------------

ధనస్సు


అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో మరోసారి నిరాశ తప్పదు.

---------------------------------------

మకరం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేరు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

---------------------------------------

కుంభం


కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

---------------------------------------

మీనం


రాజకీయవర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

🍁 *శుభం భూయాత్* 🍀

తల్లి కి చేయదగిన కర్మ

 *2017*

*కం*

సన్యాసము సాధించియు

మాన్యంబగు మాతృకర్మ మరువని విధిగన్

ధన్యంబగు సందేశము

విన్యసమౌ(సుడౌ) శంకరసుధ(ధి) విమలము(విమలుడు) సుజనా.

*భావం*:-- ఓ సుజనా! సన్యాసం సాధించి కూడా అత్యంత గొప్పదైన తల్లి కి చేయదగిన కర్మ మరువరాని విధి(బాధ్యత) అనే గొప్ప సందేశం నిర్మితమై ఉన్న శంకరాచార్యుల వారి అమృతవాక్కులు విశేషమైనవి{అంత గొప్ప సందేశం ఇచ్చిన శంకరుడు (శంకరాచార్యులు) అనబడే విద్వాంసుడు (సుధి)} విశేషమైన వారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

భ భా భి భీ భు భూ....?

 X2.X2.A-6.2209b-8.130524-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *భ భా భి భీ భు భూ....?*

                  ➖➖➖✍️


*ధారానగరంలో ‘భుక్కుండుడు’ అనే ఓగజదొంగ వుండే వాడు. నగరంలో దొంగతనాలు చేసి చేసి వేరే రాజ్యానికి వెళ్లి పోయి మరీ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి మరీ దొంగతనాలు చేసేవాడు.* 


*కానీ వాడు ధనవంతుల ఇళ్ళలోనే దొంగతనం చేసే వాడు. ఆ సొమ్ములో చాలా భాగం బీదలకు పంచే వాడు. పైగా అంతో ఇంతో సంస్కృత పాండిత్యం వున్నవాడు కూడా.* 


*రాజ సైనికులు ఎంత ప్రయత్నించినా అతనిని పట్టుకొనలేకపోయే వారు.*


*ఒకసారి ఒకరింటికి కన్నం వేస్తూ దొరికి పోయాడు. భటులు వాడిని రాజ సభ లో ప్రవేశ పెట్టినారు., ఎన్నో సంవత్సరాలుగా దొంగతనాలు చేసిన భుక్కుండుడికి మరణ శిక్ష విధించాలి అని మంత్రి, యితర సభ్యులు రాజును కోరారు. తనకు రాజు మరణ శిక్ష వేస్తాడేమో నని వాడికి భయం వేసింది. యుక్తిగా ఈ శ్లోకం చెప్పాడు…*


*"భట్టిర్నష్టః, భారవి శ్చాపి నష్టః*

*భిక్షుర్నష్టః భీమసేనోపి నష్టః*

*భుక్కుండో హం భూపతిః త్వం రాజన్*

*భబ్భావళ్యామ్ అంతకః సం నివిష్టః*

 

అర్థము:-- *రాజా! నన్ను శిక్షించండి. కానీ నాకు ఒక్కటే భయం. మీరు గమనించారో లేదో భట్టి చనిపోయాడు, భారవి కవి కీర్తి శేషుడయ్యాడు, ఆ వెనకే భిక్షుకవి కూడా మరణించాడు, ఇటీవలే భీమకవి కూడా కాల ధర్మం చెందాడు, మరి నేను భుక్కుండుడిని. ఈ యమధర్మ రాజు 'భ' గుణింతాన్నే పట్టుకొని భట్టినీ, భారవిని, భిక్షు కవినీ, భీమ కవినీ తీసుకెళ్ళి పోయాడు. తర్వాత వాడిని నేను భుక్కుండుడిని. నన్ను తీసుకొని పొతే భ భా భి భీ భు తర్వాత భూపతివి నీవు, నీ పేరులో కూడా 'భ' కారం వుంది నా తర్వాత నీ వంతే నేమోనని, యింత మంచి రాజు మరణిస్తే ప్రజలకు గతి ఏమి? అని నేను భయ పడుతున్నాను. (పైన చెప్పిన కవులంతా భోజుడి ఆస్థానం లోని కవులే) అన్నాడు.*


*రాజ దండన పొందబోతూ కూడా ఇలా చమత్కారంగా శ్లోకం చెప్పడం రాజుకు నచ్చింది, నవ్వు వచ్చింది.* 


*నవ్వు ఆపుకుంటూ “సరే! భుక్కుండా ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను. అని వాడికి కావలిసి నంత ధనం యిచ్చి యిక ముందు దొంగతనాలు చేయ కుండా మంచిగా బ్రతుకు!” అని మందలించి వదిలేశాడు.*


*(భబ్భావళి అంటే 'భ' గుణింతం అంతక= యమ ధర్మరాజు, సంవిష్ట: అంటే దృష్టి పెట్టిన వాడు)* .   


*భలే బావుంది కదూ!*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

శంకరుని జీవిత విశేషాలు

 ఆది శంకరుని జీవిత విశేషాలు -


ఈ ప్రపంచములో అన్ని దేశాల సంస్కృతులకు మూలము ఆర్ష భూమియైన ఈ భారత దేశమే. మానవుడు పుట్టిన తొలినాళ్ళ నుండీ , కొండకోనల్లో తిరుగాడిన నాటి నుండీ సంస్కృతీ వికాసం పొందేవరకు సర్వం ఈ ఆర్షభూమిలో జరిగినవే . అట్టి భరత ఖండంలో కాలక్రమేణా కలిలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. ఆయన జీవిత కాలం మీద అనేక అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక పుస్తకాలలో మనం ఏడవ శతాబ్దానికి చెందినవారిగా మాత్రమే చదువుతున్నాము. శంకరుని కాలం గూర్చి టి ఎస్ నారాయణ్ శాస్త్రి గారు అనేక పరిశోధనలు చేసి రచించిన " ద ఏజ్ అఫ్ శంకర " అనే పుస్తకములో శంకరుని కాలం గూర్చి అనేక వివరాలతో బాటు పీఠాల వివరాలు .. వివిధ కాలాల్లో ఆయా పీఠాలు అధిష్టించిన పీఠాధిపతుల పేర్లు సర్వం అందులో వ్రాసియున్నారు. శంకరుని జీవిత కాల విశేషాలు మీ అందరికోసం ఇక్కడ.


శంకర భగవత్పాదులు కలి అబ్ది 2593 సంవత్సరం అనగా బిఫోర్ కామన్ ఎరా 509 లో పరశురామ క్షేత్రం అయిన నేటి కేరళలోని కాలడి గ్రామములో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతులకు వైశాఖ శుక్ల పంచమి నందన నామ సంవత్సరములో జన్మించి ఆ తల్లిదండ్రులకు ఆనంద కారకుడయ్యాడు.


అల్లారు ముద్దుగా పెరిగిన శంకరునికి అయిదవ యేట కలి అబ్ది 2598 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 504 లో ఉపనయనం చేసి విద్యాభ్యాసం చేయించారు . చిన్నతనం నుండే ఏక సంథాగ్రాహి అయిన శంకరుడు సర్వము ఇట్టే గ్రహించేవాడు . ఎనిమిదేళ్లు వచ్చేసరికి వేద వేదాంగాలు స్మృతులు , ఇతిహాసాలు, పురాణాలు అన్నింటి మీద శంకరునికి పట్టు ఏర్పడింది .


కలి అబ్ది 2601 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 501 లో శంకరుని తండ్రి శివగురువు శివసాయుజ్యం పొందారు. అప్పటికి శంకరుని వయస్సు ఎనిమిదేళ్లు. తండ్రికి సంస్కారాలు అవీ చేసాక శంకరుడు కొన్నాళ్ళు తల్లితోనే జీవించాడు .


తండ్రి మరణించాక ఏడాది గడవగానే శంకరుడు కలి అబ్ది 2602 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 500 లో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఫ్లవా నామ సంవత్సరములో తల్లి అనుమతితో సన్యాసం దీక్ష స్వీకరించాడు . సన్యాసం దీక్ష స్వీకరించిన శంకరుడు జ్ఞానార్థియై కాలి నడకన నర్మదా నదీ తీరములో ఉన్న గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం కలి అబ్ది 2603 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 499 లో చేసారు . అక్కడే క్రమ సన్యాసం చేసిన శంకరుడు నాలుగేళ్ళ పాటు వేదాంత శాస్త్రములో అక్కడ విద్యాభ్యాసం కలి అబ్ది 2605 వరకు అనగా బిఫోర్ కామన్ ఎరా 497 వరకు చేసారు .


వేదాంత శాస్త్రాధ్యయనం తరువాత శంకరుడు కాలి నడకన హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకొని బదరికాశ్రమములో ఉన్న గౌడపాదాచార్యులను కలసి ఆయనను పరమగురువుగా స్వీకరించారు . అక్కడ నాలుగేళ్ళ పాటు గౌడ పాదాచార్యుల శిష్యరికంలో సర్వమూ నేర్చారు. అప్పటికి గౌడ పాదాచార్యుల వయస్సు 120 సంవత్సరాలు. శ్రమ అన్నది  లేక అయన స్వయంగా అనేక మర్మాలు , సర్వ శాస్త్రాలు కలి అబ్ది 2605 నుండీ అనగా బిఫోర్ కామన్ ఎరా 497 నుండీ కలి అభ్ది 2609 వరకు అనగా 493 వరకు భోదించారు. బదరికాశ్రమములో శంకరుడు తన గురువు అయిన గౌడ పాదాచార్యుని శిష్యరికంలో తన గురువు గారి బోధనలు అయిన గౌడపాద కరికలు మీద భాష్యం వ్రాసారు. ఆ పిమ్మట ప్రస్థాన త్రయం మీద పదహారు భాష్యాలు వ్రాసారు.


శంకరుడు సన్యాసం దీక్ష వహించిన తరువాత ఆతని వెన్నంటి ఎపుడూ అనుసరించినవాడు విష్ణు శర్మ అనే సహాధ్యాయి .కాలడి నుండి ఆతను శంకరునితోనే నర్మదా తీరం, బదరికాశ్రమము అన్నింటా అతనే శంకరునితో ఉండేవారు. బదరికాశ్రమములో విష్ణు శర్మ కూడా సన్యాసం దీక్ష వహించాడు . అతడినే చిత్సుకాచార్య అని కూడా సంభోదించేవారు. శంకరుని జీవితములో జరిగిన వాటన్నింటికీ ప్రత్యక్ష సాక్షి ఈ చిత్సుకాచార్యులే. వీరే శంకర బృహత్విజయం అని శంకరుని జీవిత విశేషాలను ఆయన సాధించిన విజయాలను అందులో వ్రాసారు. కానీ ఆ గ్రంథం నేడు అలభ్యం.


పదహారేళ్ళ ప్రాయములో బదరికాశ్రమములో ఉన్న శంకరునికి తల్లి ఆర్యాంబ గుర్తుకు రాగా కాలడి బయలు దేరి వెళ్లారు. ఆర్యాంబ కలి అబ్ది 2608 అనగా బిఫోర్ కామన్ ఎరా 492 ఫ్లవంగ నామ సంవత్సరం లో జీవన్ముక్తి పొందారు. అదే సంవత్సరములో శంకరునికి వేదాంత విద్యను గఱపిన గోవింద భగత్పాదులు కూడా కార్తీక పౌర్ణమి నాడు విష్ణు సాయుజ్యం పొందారు .

ఆలోచనా విధానాలు

 

 ఆలోచనా విధానాలు 


ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కోవిధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తారు. కానీ అందరి ఆలోచనలు ఒక్కొక్క రీతిలో ఉంటాయి. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్బవించవచ్చు కూడా. ఒకమనిషి ఆలోచనా విధానం అతని మేధస్సుమీద ఆధారపడి ఉంటుంది. సమస్యను కూలంకుషంగా సత్వరం అర్ధం చేసుకొని వెనువెంటనే సరైన పరిష్కారం చెప్పటం అనేదానినికి సూక్ష్మగ్రాహ్యత సమయస్పూర్తి కావాలని పెద్దవారు చెపుతారు. ఒకే విధమైన నెలజీతం పొందుతున్న ఇద్దరు ఉద్యోగస్తుల జీవన విధానం ఒకే విధంగా వుండాలని లేదు ఒకరు అనేక అప్పులు చేస్తూ అనవసరమైన డాంబికాలు పోయి అనేక ఇక్కట్లు పడవచ్చు ఇంకొకరు తనకు వున్న వనరులను ఒక ప్రణాళికా బద్దంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తనకు మించిన ఖర్చులు చేస్తూ తగిన ఆదాయంలేక అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక కస్టాలు పడుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి గూర్చి నిత్యం మనం వార్తల్లో చదువుతున్నాము, చూస్తూన్నాము . వాటన్నిటికీ కారణం ఆలోచనా విధానం మాత్రమే. 


సరయిన నిర్ణయం తీసుకోవటం ఒకని మేధాశక్తికి నిదర్శనం. అంతే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో నిర్ణయం సరైనది అయినా కూడా సరైన సమయంలో తీసుకోక పోవటం అనేక కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు అనేక కారణాలవల్ల పేరుకొని ఉంటే తాను కొన్న ధరకాన్న తక్కువ ధరకు అమ్ముతారు, దానికి కారణం ఒకటి ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మచూస్తే అది అమ్మటానికి చాలాసమయం పట్టవచ్చు, రేండు ఎక్కువ సమయం వేచి చుస్తే ఆ సరకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు. అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక జనప్రదాన్యత వున్న సరకు మీద వెచ్చిస్తే దానిమీద ఎక్కువ లాభం రావచ్చు. ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గూర్చి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక లాభాన్ని కోల్పోతాడు. 


ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు. మేనేజరులు తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. 


సమయస్పూర్తి: సీతాపహరణ తరువాత సుగ్రీవుని రాజ్యంలోని వానరులను సీతాదేవిని వెతకటానికి నియమించారు ఆ వరువడిలోనే హనుమంతులవారిని కూడా నియమించారు. హనుమంతులవారు లంకకు చేరారు, సీతామాతను తెలుసుకున్నారు. నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది. వెంటనే వచ్చి సీతాదేవి జాడని శ్రీ రామచంద్రులకు తెలిపితే తన నియమిత కార్యం అయిపోయినట్లే కానీ సీతజాడతోటి హనుమంతులవారు ఊరుకోలేదు సీతాదేవిని రావణుడినుండి విడిపించుటకు శ్రీరాముడు యుద్ధం చేయవలసి ఉంటుంది. కాబాట్టి రావణాసురుని బలం అతని రాజ్య విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు రావణుని దర్శనం చేసుకోవాలి అది యెట్లా సాధ్యం తాను రాజప్రాసాదానికి వెళ్ళితే అక్కడి భటులు రావణాసురుని చూడనీయరు. అందుకే ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేశారు. నిరోధించటానికి వచ్చిన వీరులను ఓడించారు. అప్పుడు తప్పనిసరై హనుమంతులవారిపై బ్రహ్మస్త్రాన్ని ఇంద్రజిత్ ప్రయోగించి రావణుని సభకు తీసుకొని వెళతారు. ఇక మిగిలిన కధ మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం గమనించాలసింది హనుమంతులవారి ఆలోచనా విధానం సమయ స్ఫూర్తి. సమయ స్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపద నయినా సులభంగా దాట వచ్చు. 


జ్యోతిష్య శాస్త్రంలో ప్రావిణ్యం వున్న ఒక జ్యోతిష్కులవారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట అయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట " మీ వాళ్ళందరూ మీ ముందే చనిపోతారు" అది విన్న ఆ రాజుగారు కోపోద్రేకుడై అతనికి బహుమానాలు ఇవ్వటం అటుంచి మరణ శిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఈ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్య పండితులు రాజుగారి దర్శనం చేసుకున్నారు. రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా వున్నారు ఆ విషయం మన జ్యోతిస్యులవారికి తెలుసు ఆయన అత్యంత లౌక్యము చూపించి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి "మహారాజా మీరు అత్యంత మహార్జాతకులు మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలిస్తారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు జీవిస్తారు. ఏ కొద్దీ మందికో మీలాగా జాతకం ఉండదు" అని తెలిపారు. దానికి ప్రసన్నులైన మహారాజు నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు నీకు ఏమి కావాలో కోరుకో అని అన్నారు. మహారాజా నా శిష్యుడు తెలిసి తెలియని జ్ఞానంతో మీ వద్దకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధింపబడ్డాడు. దయచేసి అతనిని క్షమించి విడిపించవలసిందిగా ప్రార్ధించారు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిస్యుల శిక్షను రద్దుచేశారట. మన రెండవ జ్యోతిషేలవారు మొదటివారిని కలుసుకొని నీవెందుకు అలా చెప్పావు అని అడిగితె నేను చెప్పింది నిజంకాదా అని ప్రశ్నించారట. నీవు చెప్పింది నిజం నేను అదే చెప్పాను కానీ చెప్పే విధానం బట్టి మనము అనుగ్రహ, ఆగ్రహాలకు పాత్త్రులము అవుతాము అని అన్నారట. 


జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!

జిహ్వాగ్రే మిత్రబాంధవాః!

జిహ్వాగ్రే బంధనప్రాప్తిః!

జిహ్వాగ్రే మరణం ధృవం!!


అని అన్నారు కాబాట్టి మనం నోటిని జాగ్రత్తగా అంటే మాటలను సమయానుకూలంగా వాడాలని హితవు చెప్పి పంపారట. బుద్ది కర్మానుసారినే అనే నానుడి ఊరికే రాలేదేమో అనిపిస్తుంది. 


ఒక కేసువిషయంలో చాలా తీవ్రంగా ఒక లాయరుగారు వాదిస్తున్నారట ఆయన వాదనకు జడ్జిగారు కూడా ముగ్దులు అయ్యారట. ఇక వాదనను ముగించపోవగా ప్రక్కనే వున్నా జ్యునీయరు లాయరుగారు మన లాయరుగారి చెవిలో ఏదో చెప్పారట వెంటనే మన లాయరు గారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నేను చెప్పింది బహుశా డిఫెన్సు లాయరుగారు చెప్పవచ్చు కానీ అది ఎంతమాత్రమూ సబబుకాదు ఇప్పుడు నా వాదనను వినండి అని తానూ ముందు చెప్పిన వాదనకు వ్యతిరేకంగా చెప్పి జడ్జిగారిని మెప్పించి కేసు గెలిపించారట. ఇంతకూ ఆ జూనియరు లాయరు గారు చెవిలో చెప్పింది ఏమిటి అంటే అయ్యా మీరు మన క్లయెంటు గూర్చి కాకుండా అవతలి పార్టీకి సపోర్టుగా వాదిస్తున్నారు అని. ఆక్షణంలోనే సర్దుకొని తన వాదనను పూర్తిగా మార్చుకున్నారు సీనియర్ లాయరు గారు అదే సమయ స్ఫూర్తి అంటే. ఇవ్వన్నీ మనం తెలుసుకున్నవి, నిత్యం చూస్తూవున్నవి. ఇక అసలు విషయానికి వస్తే మానవుడు తన జీవిత లక్ష్యం అయిన మోక్ష సాధన చేయటానికి చక్కటి ఆలోచనా విధానం వుండాలి అంతేకాదు తనకు దైనందిక జీవితంలో ఎదురుపడే అనేక ఒడిదుడుకులను ఎదుర్కునే సమయస్ఫూర్తి కావలి. సాధకుని చూసి సామాన్యులు అనేక విధములుగా మాట్లాడవచ్చు అటువంటి మాటలకు, విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిత్యం తన లక్ష సాధనవైపు ద్రుష్టి సాగించి లక్ష్యాన్ని ఈ జన్మలోనే సాదించాలి. 


నాకు ఈ జన్మలోనే మోక్షం వస్తుందా అది ఎంతో దుర్లభం ఏదో దైవ జాసలో, నామ స్మరణతో కాలం గడుపుదాం అని చెప్పే అనేకులు మనకు తారసపడతారు. అంతే కాకుండా అయన సద్గురువు, ఈయన సద్గురువు అని చెప్పి మీ వద్ద వలసినంత ద్రవ్యాన్ని వసూలు చేసేవారు కూడా వుంటారు. కాబట్టి ఎవ్వరిని అనుసరించకుండా నీ సాధన నీవు కొనసాగించు. వారి మాటలను పరిగణలోకి తీసుకొన్నామంటే మన సాధనకు పూర్తిగా అవరోధం కలుగుతుంది. కాబట్టి మిత్రమా మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు అత్యంత కృషి, సాధన, అకుంఠిత దీక్ష ఉంటేనే సాధించగలం. ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది దీనిని ఇక్కడే,ఇప్పుడే సార్ధకట్చేసుకోవాలి. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః  


మీ భార్గవ శర్మ

అమ్మేకద మనదైవం

 *మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...*


అమ్మేకద మనదైవం

బమ్మయె గుండెగుడిని కొలువై నిలచు సదా

అమ్మేకద మనకఖిలము

అమ్మేప్రత్యక్ష దైవమగునిల  కృష్ణా!


*గోగులపాటి కృష్ణమోహన్*

మాతృ దినోత్సవo

 *మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో...*


అమ్మేకద మనదైవం

బమ్మయె గుండెగుడిని కొలువై నిలచు సదా

అమ్మేకద మనకఖిలము

అమ్మేప్రత్యక్ష దైవమగునిల  కృష్ణా!


*గోగులపాటి కృష్ణమోహన్*

అంతర్జాతీయ నర్సుల దినోత్సవo

 *మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలతో...*


నర్సుల సేవ


1) నర్సులెంతగానొ నాజూకుగనడిచి

సేవచేయుదురుగ సేదలేక

రొక్కమెంతనడుగు దుఃఖమే వారికి

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


2) ఆసుపత్రిలోనికడగు పెట్టినయంత

నర్సు గుచ్చు సూది నరమునకును

వరుస బెట్టి యిచ్చు నరముకింజక్షన్లు

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


3) బీపి మిషను దెచ్చి బీపీని చెక్ చేసి

పరగతాపమాని జ్వరము గొలిచి

రకరకముల జేయు రక్తపరీక్షలు

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


4) కష్టకాలమందు నష్టాలనోర్చుచు

నిష్ఠ తోడ చేయు నిష్టముగను

సిస్టరన్నతానె సేవకు మార్పేరు

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


*గోగులపాటి కృష్ణమోహన్*

_శ్రీ శాంకరచరితము

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 12/05/2024 - శ్రీ శంకర భగవత్పాద జయన్తీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*



*_శ్రీ శాంకరచరితము!_*


శ్లో𝕝𝕝 ఆర్యాంబా జఠరేజని ర్ద్విజసతీ దారిద్య్రనిర్మూలనమ్l

సన్యాసాశ్రయణం గురూపసదనం శ్రీ మండనాదేర్జయఃl

శిష్యౌఘగ్రహణం సుభాష్యవచనం 

సర్వజ్ఞ పీఠాశ్రయఃl

పీఠానాంరచనేతి సంగ్రహమయీ

సైషాకథాశాంకరీll


దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే

స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః


దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు.... 

(- శివరహస్యము నుండి).


కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః

శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా


శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు.... 

(కూర్మపురాణం నుండి)


అష్ట వర్షే చతుర్వేదీ

ద్వాదశే సర్వ శాస్త్రవిత్

షోడశే కృతవాన్ భాష్యం

ద్వాత్రింసే మునిరభ్యగాత్!!


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీ శఙ్కర భగవత్పాద జయన్తీ శుభాకాంక్షలు 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీ జగద్గురు శఙ్కరాచార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 జయ జయ శఙ్కర హర హర శఙ్కర 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీమతే శఙ్కరాచార్య నమః 𝕝𝕝 卐 𝕝𝕝_*

భారతీయ సంస్కృతి

 భారతీయ సంస్కృతి:పుణ్యక్షేత్రం, నాసిక్


1)సీతాగుహ...


ఇందులో శివలింగము ఉంటుంది. సీతారాము లు పూజలు చేశారని రావణాసురుడు సీతను ఇక్కడి నుండి అపహరించాడని చెబుతారు.


2) 63......


శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశము. ఇక్కడ మంచి జామకాయలు దొరుకుతాయి.


3) లోలా లోలా 6......


ఇక్కడ 5 మఱి చెట్లు ఉంటాయి. కాలారామ్ వంటి ప్రసిద్ధ దేవాలయాలు ఉంటాయి.


4)మినరల్ వస్తుప్రదర్శనశాల.... ఇది సిన్నారు లో ఉంది.ఇక్కడ రకరకాలు అయిన చిత్రవిచిత్రము అయిన రాళ్లను చూడవచ్చు.


ఇక జ్యోతిర్లింగముగా ఉన్న త్ర్యంబకేశ్వరుడు, గోదావరి పుట్టిన ప్రదేశము ప్రధానమైనవి.ఎటూ వాటిని చూస్తారు.


· నిష్ఠల

మతదానం మతదానం

 మతదానం మతదానం 

హిన్దుప్రజానాం రక్తదానం 

హిన్దుసంస్కృతేః రక్షాబన్ధనం 


హిన్దుస్థానం రక్షితుం 

మతదానం కుర్యామ 

హిన్దుసంస్కృతిం రక్షితుం 

మతదానం కుర్యామ 


మతదానం మతదానం 

హిన్దుప్రజానాం రక్తదానం 

హిన్దుసంస్కృతేః రక్షాబన్ధనం 


కులాని మతాని విస్మరేమ 

హిన్దుప్రజాః సంఘటయేమ 

సంస్కృతసమ్భాషణం వర్ధేమహి 

మతదానం కుర్యామ 


మతదానం మతదానం 

హిన్దుప్రజానాం రక్తదానం 

హిన్దుసంస్కృతేః రక్షాబన్ధనం 


మద్యపానస్య లోలుపాయ

బిర్యాణి ఆహారస్య లోలుపాయ 

ఉచితపథకాణాం లోలుపాయ 

ధనస్య లోలుపాయ 

మతదానం న కుర్యామ 


హిన్దువ్యవసాయం రక్షితుం 

విద్యావైద్యం చ వికాసయితుం 

మతదానం కుర్యామ 

సంస్కృతభాషాం 

జాతీయభాషాం కుర్యామ

అపర సామాజికవేత్త శంకరాచార్యులు...*

 *👉నేడు నీ నుదుటన బొట్టు ఉందంటే కారణం- శంకరులు..* 


 *👉నేటి నీ ధర్మ జ్ఞానానికి కారణం - జగద్గురువు శంకరులు..* 


 *👉నేడు నువ్ చేసే పూజా పద్ధతికి కారణం - శంకరభగవత్పాదులు..* 


 *👉నేడు హైందవం బతకడానికి కారణం - శంకరాచార్యులు..* 


 *👉బౌద్ధం, జైనం ముసుగులో హిందువులు సోమరులుగా అవ్వకపోవడానికి కారణం - శంకరులు...* 


 *👉బదరి లో నారాయణుల దర్శనం చేసుకుంటున్నావంటే కారణం - వారే....* 


 *👉శ్రీశైలం లో, కంచిలో, విజయవాడలో, మదురైలో జంతుబలులు లేకుండా సాత్విక దర్శనానికి కారణం - శంకరులు...* 


 *👉ఉత్కృష్టమైన భగవత్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రభాష్యములు మనకు అందడానికి కారణం శంకరులు...* 


 *👉హరిహర బేధమే కాదు మానవులలో కూడా బేధం లేదని మనీషా పంచకం ద్వారా చాటిన అపర సామాజికవేత్త శంకరాచార్యులు...* 


 *👉నాలుగు దిక్కులలో నాలుగు పీఠాలను స్థాపించి భారతదేశానికి ధర్మ దిశానిర్దేశం చేసిన మహోన్నత తేజోమూర్తి జగద్గురువు శంకరాచార్యులు..* 


 *👉జన్మించిన తేదీ తెలియకున్నా ప్రతినిత్యం తలుచుకోవాల్సిన భగవత్ స్వరూపులు శంకరభగవత్పాదులు...* 


 *👉అద్వైతమే సత్యం - అద్వైతమే నిత్యం అని చాటి ప్రపంచంలో తత్వజ్ఞానాన్ని అందించి జ్ఞానమే మోక్ష మార్గం. మరేదీ కాదు కాదు కాదు అని చెప్పి మోక్షమార్గానికి దారి చూపిన శంకరుల జన్మదినమ్ నేడు...* 


 *ఇట్టి సందర్భంగా అందరికి భూమండలపు ఏకైక జగద్గురువు శ్రీ శంకర భగవత్పాదుల జన్మదినపు శుభాకాంక్షలు...* 


 *👉దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః🪷🕉️🚩🙏*

ప్రయుక్త తెలుగు పద్యారాధనము

 *జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులవారి జన్మదినోత్సవ ప్రయుక్త తెలుగు పద్యారాధనము*


*సీసము*

వైదిక జీవన వైకల్యములనెల్ల

   సవరించ వివరించ సక్రమమున

పరమేశ్వరుండిల పరిపూర్ణ నరరూప

    శంకరాచార్యులై సంభవించి

వేదశాస్త్రములకు విధ్యుక్త భాష్యంబు

    విరచించి ప్రచురించి విధులు తెలుపు

జగతికి గురువైన శంకర జననము

   జనులకు పండువై జగము వెలుగు.

*తే.గీ*

గతులు తప్పిన వైదిక గతుల దిద్ది

విపులముగనిల నద్వైత విలువ దెలిపి

తరతరమ్ములు తరియించు తత్వమిడిన

శంకరాచార్యులు భరత సత్వసింధు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శంకర జయంతి

 


శ్రీభారత్ వీక్షకులకు శంకర జయంతి శుభాకాంక్షలు 🌹జగద్గురువైన ఆది శంకరాచార్యులు పుట్టిన దేశంలోనే మనమూ ఉన్నాం. కానీ ఆయన బోధనలను అర్థం చేసుకుంటున్నామా? ఆయన ప్రవచించిన సూత్రాలను పాటిస్తే ప్రతి ఒక్కరు ఒక్కో విజ్ఞాన ఖని అవుతారు.మన దేశం విజ్ఞాన సంపన్నమవుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అయిన ఎన్ అనంత కృష్ణ శర్మ గారు శంకరాద్వైతానికి ఎంత చక్కని వివరణ ఇచ్చారో వినండి. భజగోవింద స్తోత్రం చాలా మంది చదువుతూంటారు కానీ దాని పరమార్థం తెలియదు.ఆ అర్థాన్ని తెలుసుకోండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

అమ్మ

 🌻అమ్మ 🌻


సీ. నవమాసములుమోసి భవము నిచ్చెడి యమ్మ

             శిశువుకు ధరపైన సృష్టికర్త

     అమృతము నందించి యక్కున నిడుకొని

             లాలించి పాలించు రమ్యచరిత

     ఉలకని శిశువుకు పలుకులన్నేర్పించి

             మోదమున్ గూర్చెడి మొదటి గురువు

      సతతమ్ము శిశువుకై వెతలను తా నోర్చి

              బుజ్జి బొజ్జకు పాలు పోయు నెలత

 ఆ. అడుగు లేయు చుండ హస్తము న్నందించి

       పడక పట్టుకొనెడి ప్రాపు యమ్మ 

       అమ్మ తోడు లేక నన్నింట వెతలగున్ 

       నవని నన్నిటందు యమ్మ  మిన్న


సీ.  పెరిగిన సంతును మురిపంబు తోడను 

                 బుజ్జగించియు పంపు నొజ్జ కడకు 

       విద్యల నా సంతు వికసించు చుండంగ

                 పరవశంబున గాంచి మురిసిపోవు 

        ఆటల పాటల నారితేరుచు నుండ 

                  నానంద చిత్తాన మేను నిమురు 

        యుక్త వయస్సున నుద్వాహమగుచుండ 

                   మించిన ప్రేమతో మేలు కోరు 

 తే. తనరు చుండంగ  తన సంతు  తననుమించి

       యంతరంగమ్ము నందున యమ్మ మురియు 

       అమ్మ లేకున్న బ్రతుకంత యంధమయము 

       యవని నన్నింట నెంచంగ నమ్మ  మిన్న



క. కమ్మని ప్రేమను పంచగ 

    యిమ్మహి సృజయించె బ్రహ్మ యీప్సిత మొప్ప

    న్నమ్మను, సుగుణంబులలో 

    యమ్మకు మరి మించు వేల్పు యరయన్ గలదే !



 ఆ.  "తల్లి  దండ్రి  గురువు  దైవ" మంచు బుధులు 

        "అమ్మ" నుంచినార లాదియందు 

         భవము నిచ్చు తల్లి ప్రత్యక్ష దైవమ్ము 

         నరుల కైన దివిని సురల కైన 



సీ.  చిన్నవాడు ధ్రువుండు శ్రీమహావిష్ణుని

                దర్శనమును పొందె తల్లి వలన 

      తల్లి దాస్యము బాప తరలియు గరుడుండు 

                తెచ్చె నమృతమును దివము నుండి 

      తల్లి కోర్కెను దీర్చ తరలె శ్రీరాముండు 

                వర్షముల్ పదునాల్గు వనములకును 

      మాతకు వసతిగా మళ్ళించెను నదిని 

                శంకరాచార్యుండు సవినయముగ

తే. తల్లి ఋణమును దీర్చుట తనయులకును 

     బాధ్యతై యుండు నయ్యదే ప్రాప్త మరయ 

     మాతృమూర్తిని మించియు మమత జూపు 

     దైవమే లేదు తలచంగ ధరణి యందు.



 ఆ. 'జనని జన్మభూమి' స్వర్గంబు కంటెను 

       భవ్య మనుచు రామభద్రు డనియె

       జన్మ నిచ్చి నట్టి జననికి  మించిన 

       దైవ మొండు లేదు ధాత్రి యందు.



ఆ.  తనువు నిచ్చినట్టి జననికంటె నిలను 

       దైవ మెవరు లేరు తలచ మదిని 

       'మాతృసేవ' చేయు మనుజుండె మనుజుండు 

       కానివాడు మోక్షగామి కాడు


         🙏నమో మాతృదేవో భవ🙏


    ✍️గోపాలుని మధుసూదనరావు🙏

శంకర జయంతి

 శంకర జయంతి 

           (జగద్గురు సంస్మరణ )


సీ. భరతఖండమ్మున భార్గవభూమిలో 

                భవ్య 'కాలడి' వద్ద ప్రభవమొంది

     అతిపిన్న వయసులో నాగమంబుల నేర్చి

                పలుశాస్త్రప్రతిభల పరిఢవిల్లి 

     యున్నతంబైనట్టి సన్న్యాసదీక్షను 

                గైకొని యతులందు గణుతి కెక్కి

     'గోవిందభగవాను' గురువరేణ్యుల వద్ద 

                ఛాత్రత్వమును పొంది సన్నుతి గని

      భగవానుడగు 'వ్యాసు' పరమాదరముతోడ 

                వేదభాష్యమ్ములు వెలువరించి 

      అఖిల నిగమసార మధ్యయనము జేసి

                'అద్వైతమతము' ను నవని కిచ్చి

తే. పెక్కు సంస్కృతకావ్యముల్ పెక్కు స్తుతుల 

      జగతి కందించి నట్టి యా జగతి గురువు

     'శంకరాచార్యు' మది నెంచి సన్నుతించి 

      భక్తి నర్పింతు శతకోటి వందనములు.        


తే. అఖిలశంకల గజమున కంకుశంబు

      భువినియద్ద్వైతసిద్ధికి బోధగురువు 

      ధరణివెల్గొందు శ్రీజగద్గురువునకును 

      శంకరుడెయైన శంకరాచార్యునకును 

      భక్తి తోడుత నతుడనై ప్రణతు లిడుదు.

                    🙏🙏🙏


✍️గోపాలుని మధుసూదనరావు🙏

వాణీ వైభవం

 శు భో ద యం🙏


వాణీ వైభవం!


రమణీయాక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి

   వీణానులా/

పముచేతం గరగించి యందు నిజబింబం

   బొప్ప నచ్ఛామృత/

త్వము ఆత్మప్రతిపాదకత్వమును దద్వర్ణాళి

   యం డెల్ల బూ/

ర్ణము గావించిన వాణి తిర్మలమహారాయోక్తి

   బొల్చున్ కృపన్! వసు 1-4


అద్భుతమైన సరస్వతీ స్తుతి.

అమ్మ వీణ వాయిస్తున్నది. ఆ నాదము (అనులాపము) వల్ల ఆమె చేతిలో గల అక్షసరము లోని వర్ణములు కరిగినవి.


సరస్వతి అక్షమాల పట్టుకొనును. అక్షమాల స్ఫటికము(తెల్లని రాయి) చేత చేసిన తెల్లని పూసల దండ. అక్షమాల అనగా మరియొక అర్థము 'అ' నుండి 'క్ష' వరకు గల అక్షర సమూహము

ఈ పూసల ఆకృతిలోగల అక్షరములు (అక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి) వీణానాదములోని మాధుర్యమునకు కరిగినవి. ద్రవమైనవి. అవి స్ఫటికమునకు సంబంధించినవగుటచే తెల్లని పారదర్శకమైన ద్రవమైనవి.ఈ ద్రవమేమి? నాదమాధుర్యమున కరిగిన వర్ణములు. కరిగిన వర్ణముల అంతరమందు గల నాదసుధ. వెరసి సంగీతసాహిత్యముల మేళనము. ఇక్కడ ప్రత్యేకముగా సాహిత్యాంతర్గత సంగీతము. ఆద్రవములోనికి అమ్మ చూచినది. దేవి శుద్ధ ధవళ స్వరూపము దానిలో ప్రతిబింబించినది.అనగా సాహిత్యాంతగతసంగీత సమ్మేళనాకృతి సరస్వతి ఆత్మ స్వరూపమైనది. ఆశుద్ధస్వరూపము తన ప్రభువైన తిరుమలరాయని వాక్కులో వర్తించు గాక (బొల్చున్ కృపన్) అంటున్నాడు భట్టుమూర్తి.

భంగ్యంతరంగా తన కవిత్వమున సంగీత స్వరూపము సాహిత్యమునందున మమైకమై సరస్వతీస్వరూపముగనలరారునని సూచించుచున్నాడు.

ఆంధ్రసాహిత్యమున అందమైన సరస్వతీ స్తుతులలో ముందువరుసలో నిలుచు స్తుతి ఇది.


సాహిత్యార్ధము సూర్యగణపతుల వారు!

ఆధ్యాత్మాకార్ధం గురువు గారు శ్రీ చిర్రావూరు వారు


రమణీయాక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి

   వీణానులా/

పముచేతం గరగించి యందు నిజబింబం

   బొప్ప నచ్ఛామృత/

త్వము ఆత్మప్రతిపాదకత్వమును దద్వర్ణాళి

   యం డెల్ల బూ/

ర్ణము గావించిన వాణి తిర్మలమహారాయోక్తి

   బొల్చున్ కృపన్! వసు 1-4


అద్భుతమైన సరస్వతీ స్తుతి.

అమ్మ వీణ వాయిస్తున్నది. ఆ నాదము (అనులాపము) వల్ల ఆమె చేతిలో గల అక్షసరము లోని వర్ణములు కరిగినవి.


సరస్వతి అక్షమాల పట్టుకొనును. అక్షమాల స్ఫటికము(తెల్లని రాయి) చేత చేసిన తెల్లని పూసల దండ. అక్షమాల అనగా మరియొక అర్థము 'అ' నుండి 'క్ష' వరకు గల అక్షర సమూహము

ఈ పూసల ఆకృతిలోగల అక్షరములు (అక్షసరాకృతిం బొలుచు వర్ణశ్రేణి) వీణానాదములోని మాధుర్యమునకు కరిగినవి. ద్రవమైనవి. అవి స్ఫటికమునకు సంబంధించినవగుటచే తెల్లని పారదర్శకమైన ద్రవమైనవి.ఈ ద్రవమేమి? నాదమాధుర్యమున కరిగిన వర్ణములు. కరిగిన వర్ణముల అంతరమందు గల నాదసుధ. వెరసి సంగీతసాహిత్యముల మేళనము. ఇక్కడ ప్రత్యేకముగా సాహిత్యాంతర్గత సంగీతము. ఆద్రవములోనికి అమ్మ చూచినది. దేవి శుద్ధ ధవళ స్వరూపము దానిలో ప్రతిబింబించినది.అనగా సాహిత్యాంతగతసంగీత సమ్మేళనాకృతి సరస్వతి ఆత్మ స్వరూపమైనది. ఆశుద్ధస్వరూపము తన ప్రభువైన తిరుమలరాయని వాక్కులో వర్తించు గాక (బొల్చున్ కృపన్) అంటున్నాడు భట్టుమూర్తి.

భంగ్యంతరంగా తన కవిత్వమున సంగీత స్వరూపము సాహిత్యమునందున మమైకమై సరస్వతీస్వరూపముగనలరారునని సూచించుచున్నాడు.

ఆంధ్రసాహిత్యమున అందమైన సరస్వతీ స్తుతులలో ముందువరుసలో నిలుచు స్తుతి ఇది.🙏🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

విరాగికి సుఖం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝 *అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్*

       *సన్న్యస్త బాహ్యార్థ సుఖఃస్పృహస్సన్*|

       *సన్తం మహాన్తం సముపేత్య దేశికం*

       *తేనోపదిష్టార్థసమాహితాత్మ||*


      *ఆదిశంకరాచార్య - వివేకచూడామణి*


తా𝕝𝕝 బాహ్యంగా కనిపించే వస్తుమయ ప్రపంచపు అనిత్యత్వాన్ని తద్వారా కలిగే అశాంతిని గుర్తించిన విద్యావివేక సంపన్నుడైన సత్యాన్వేషి అంతరంగశాంతిని సమత్వాన్ని సాధించేందుకు కరుణామూర్తి అయిన సద్గురువును ఆశ్రయించి ఆయన వాక్కులనే తన జీవితంగా మలుచుకొని త్రికరణశుద్ధిగా జీవించాలి.


     👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝 

*సుర మందిర తరు మూలనివాసః*

*శయ్యా భూతలమజినం వాసః౹*

*సర్వ పరిగ్రహ భోగ త్యాగః*

*కస్యసుఖం న కరోతి విరాగః* ॥18॥


భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - *ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు*? 'తప్పక లభిస్తుంది'.

పరబ్రహ్మమును

 *అందరికీ జగద్గురువు ఆది శంకరచార్యల జయంతి శుభాకాంక్షలు*


*మా కురు ధన జన యౌవన గర్వం*

*హరతి నిమేషాత్కాలః సర్వం |*

*మాయామయమిదమఖిలం హిత్వా*

*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||*


*తాత్పర్యం:* ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము


*జై గురుదేవ దత్త*

శంకర జయంతి

 ॐ        శంకర జయంతి ప్రత్యేకం 


              శంకర జయంతి శుభాకాంక్షలు 

                     

                                   భాగం 1/10 


    సాక్షాత్తూ పరమశివుడు, భూమిపై శంకరులుగా అవతరించిన, పవిత్రమైన వైశాఖ శుక్ల పంచమి, ఈ రోజు. 

    మన దేశ స్వరూప స్వభావాలు రోజురోజుకీ మారిపోతున్న ఈ పరిస్థితులలో, 

    జగద్గురు ఆది శంకరులు చూపిన బాట అన్ని విషయాలలోనూ, ఎప్పటికీ అందరికీ అనుసరణీయం. 

    అది సర్వులూ వ్యక్తిగతంగానూ, సమాజపరంగానూ అవలంబించి, పరమేశ్వరుని తెలుసుకొని అనుభూతి పొందే  విధానం. 

    దానిలో, 

1. అవతారం - ఆవశ్యకత 

2. శంకరుల కాలం 

3. జాతీయ సమైగ్రత 

4. సాంఘిక దురాచారం - అస్పృశ్యత 

5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం 

6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు 

7. వివిధ స్తోత్రాలు 

8. అద్వైత సిద్ధాన్తమ్ 

9. మహావాక్య చతుష్టయము 

    (నాలుగు మహా వాక్యాలు) వంటి విషయాలపై, 

    ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయమై తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

    అవి పరిశీలిస్తే, 

    గత కాలమాన పరిస్థితులలో మాత్రమే కాక, 

    ఏ కాలంలో నైనా, 

    ఏ పరిస్థితులలోనైనా,  సర్వమానవాళి సుఖశాంతులతో జీవిస్తూ, 

    తమలోని దైవాన్ని గుర్తించి, తాము బ్రహ్మస్వరూపంగా మారి, 

    జీవన్ముక్తి పొందేవిధంగా ఆదిశంకరులు దేశాన్ని తీర్చిదిద్దారని అవగతమవుతుంది. 

    ఆ జగద్గురువులు అందించిన సామాజిక - సాంస్కృతిక - ధార్మిక  - ఆధ్యాత్మిక సంపదలను 

    కులమతాలకతీతంగా భారతీయులంతా గ్రహించి, ఆచరిస్తూ, వసుధైక కుటుంబంగా అందరినీ ఈ విధానంలోనికి తీసుకురావాలి. 

      తద్వారా ప్రపంచశాంతికి మార్గం సుగమం చేయవలసిన బాధ్యత - కర్మభూమిలో పుట్టిన మనందరిదీ! 

      దానికై కృషిచేస్తూ, ఆదిశంకరుల చేత పునరుద్ధరింపబడి, మనవరకూ పెద్దలు అందించిన వైదిక జ్ఞానసంపద తరువాతి తరాలకి అందిద్దాం. అదే జగద్గురువులకు మనం అందించే గురుదక్షిణ. 


        జయజయ శంకర  హరహర శంకర 


                    =x=x=x= 


    — రామాయణం శర్మగా పిలవబడే 

    బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ 

             భద్రాచలం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం  -‌ పంచమి  - ఆర్ద్ర -‌‌ భాను వాసరే* (12.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రాశిఫలాలు

 *12-05-2024  ఆదివారం /భాను వాసరః 

రాశిఫలాలు*

***********

*


మేషం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధనసహాయం అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

వృషభం

బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయట  వ్యవహారాలు కలిసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. కొని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

---------------------------------------

మిధునం

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి  ఉపశమనం కలుగుతుంది.  బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు  అందుతాయి.  వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు  శుభవార్త అందుతాయి.

---------------------------------------

కర్కాటకం

సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు  నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

---------------------------------------

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో  విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కన్య

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.  వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు.

---------------------------------------

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దూర  ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి  మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు.  నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

ధనస్సు

బంధుమిత్రుల నుండి ఆశించిన  సహాయం అందుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసం ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

మకరం

మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన  నిదానంగా పూర్తి చేస్తారు. సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

కుంభం

మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా  లాభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

మీనం

అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున  ఆనందంగా గడుపుతారు.  నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో  అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

****************


Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

వైశాఖ పురాణం - 3

 🌞 *ఆదివారం  మే 12, 2024*🌞


_*🚩వైశాఖ పురాణం - 3 వ అధ్యాయము🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వివిధ దానములు - వాని మహత్మ్యములు*


☘☘☘☘☘☘☘☘☘


నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.


అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు  సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును (పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక , మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును , పరుపును , దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును , సుఖవంతుడు , భోగవంతుడు , ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ , ఉన్ని , గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ , దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా ! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.


ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు , మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర , తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు , పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి , మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను , సుగంధద్రవ్యమును , కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు , ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.


సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము , నీడలోనున్న యిసుక తిన్నెలు , చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు , జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.


మార్గమున తోట , చెరువు , నూయి , మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి , చెరువు , తోట , విశ్రాంతి మండపము , చలివేంద్రము , పరులకుపయోగించు మంచి పనులు చేయుట , పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.


సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర , సజ్జన సాంగత్యము , జలదానము , అన్నదానము , అశ్వర్థరోపణము (రావి చెట్టును నాటుట)  పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు , పక్షులు , మృగములు , వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.


ఉత్తమములైన పోకచెక్కలు , కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును , సంపదను పొందును. నిశ్చయము , రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు , ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును , అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.


విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.


*వైశాఖపురాణం మూడవ అధ్యాయం  సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌞🍁🍁🌞🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*


🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

_మే 12, 2024_*

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

       *_మే 12, 2024_*  

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: మర్నాడు

*పంచమి* తె4.26

వారం: *భానువాసరే*

(ఆదివారం)

నక్షత్రం: *ఆర్ధ్ర* మ12.52

యోగం: *ధృతి* ఉ11.01

కరణం: *బవ* సా4.42

*బాలువ* తె4.26

వర్జ్యం: *రా1.18-2 58*

దుర్ముహూర్తము: *సా4.36-5.27*

అమృతకాలం: *లేదు*

రాహుకాలం: *సా4.30-6.00*

యమగండం: *మ12.00-1.30*

సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *5.33*

సూర్యాస్తమయం: *6.19*🔱 *శంకర జయంతి* 🔱

 🙏 *రామానుజ జయంతి* 🙏

లోకాః సమస్తాః* *సుఖినోభవంతు*

అమ్మ ప్రేమ

 *సృష్టి లో తియ్యనైనది,కమ్మనైనది, అమృత తుల్యమైనది,అమోఘ మైనది,అనిర్వచనీయమైనది,వర్ణించలేనిది, వెలకట్ట లేనిది....ప్రతి ఒక్క ప్రాణి కి లభించేది అమ్మ ప్రేమ* *మాత్రమే*.


అమ్మ అంటే ఒక పేరు కాదు,ఒక వ్యవస్థ,నీకు సర్వం నేర్పేది అమ్మే,నీకు రెక్కలు వచ్చే వరకు నిన్ను కంటికి రెప్పల కాపాడి తన ఒడిలో లాలించి,అమృతం పంచేది ఒక్క తల్లి మాత్రమే.


తల్లి మనస్సు తెలుసుకోవడం,సాగరం ఈదడం ఒకటే. తన బిడ్డ ఎంత పెద్దవాడైన *యశోదమ్మ లాంటి తల్లులకు చిన్ని కృష్ణయ్యే*


నలుగురు కుటుంబ సభ్యులు గల కుటుంబం లో ముగ్గురు కి మాత్రమే అన్నం వున్నప్పుడు,*నాకు ఆకలిగా లేదు అని చెప్పే దేవత అమ్మ*.


*అమ్మ అనే పదానికి ఖరీదు కట్టగల వారెవ్వరూ.*

అమ్మ తనం పొందడం ఒక వరం.

నీ కాలికి గాయమై రక్తమోడితే,అమ్మ కంట్లో రక్తం వుబుకుతుంది.


పాశ్చాత్య దేశస్థులు మే రెండవ ఆదివారం,*మదర్స్ డే* గా జరుపు కుంటున్నారు.


*భారతదేశం లాంటి సంప్రదాయ దేశాల్లో ప్రతి రోజు మదర్స్ డే నే. మనం తల్లి, దండ్రులను ప్రతి రోజు పూజించాలి.*


*తల్లులందరికి వందనం*....



*మూర్తి's కలం*......✒️

శంకరాచార్యులవారి

 *జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులవారి జన్మదినోత్సవ ప్రయుక్త తెలుగు పద్యారాధనము*


*సీసము*

వైదిక జీవన వైకల్యములనెల్ల

   సవరించ వివరించ సక్రమమున

పరమేశ్వరుండిల పరిపూర్ణ నరరూప

    శంకరాచార్యులై సంభవించి

వేదశాస్త్రములకు విధ్యుక్త భాష్యంబు

    విరచించి ప్రచురించి విధులు తెలుపు

జగతికి గురువైన శంకర జననము

   జనులకు పండువై జగము వెలుగు.

*తే.గీ*

గతులు తప్పిన వైదిక గతులెల్ల సరిజేసి

విపులముగనిల నద్వైత విలువ దెలిపి

తరతరమ్ములు తరియించు తత్వమిడిన

శంకరాచార్యులు భరత సత్వసింధు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

పనిని నెరవేర్చిన తర్వాత

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


   *_యస్య కృత్యం న జానన్తి*

 *మన్త్రం వా మన్త్రితం పరే౹*

 *కృతమ ఏవాస్య జానన్తి*

*స వై పణ్డిత ఉచ్యతే||_*


భావం: *ఒక పనిని నెరవేర్చిన తర్వాత వారి చర్యలు, ప్రవర్తన, గోప్యత మరియు ఆలోచనల గురించి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి తెలివైన వ్యక్తికి పర్యాయపదంగా ఉంటాడు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

ఆదివారం,మే12,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం,మే12,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - శుక్ల పక్షం

తిథి:పంచమి తె4.26 వరకు

వారం:ఆదివారం(భానువాసరే )

నక్షత్రం:ఆర్ధ్ర మ12.52 వరకు

యోగం:ధృతి ఉ11.01 వరకు

కరణం:బవ సా4.42 వరకు

తదుపరి బాలువ తె4.26 వరకు

వర్జ్యం:రా1.18 - 2 58

దుర్ముహూర్తము:సా4.36 - 5.27

అమృతకాలం:లేదు

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి: మేషం

చంద్రరాశి: మిథునం 

సూర్యోదయం:5.33

సూర్యాస్తమయం:6.17

*భగవద్రామానుజుల తిరునక్షత్రం*


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

రాశిఫలాలు

 *12-05-2024 ఆదివారం /భాను వాసరః 

రాశిఫలాలు*

***********

*


మేషం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధనసహాయం అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

వృషభం

బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయట వ్యవహారాలు కలిసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. కొని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

---------------------------------------

మిధునం

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్త అందుతాయి.

---------------------------------------

కర్కాటకం

సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

---------------------------------------

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కన్య

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు.

---------------------------------------

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

ధనస్సు

బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసం ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

మకరం

మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

కుంభం

మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

మీనం

అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

****************


Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 


రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 


9848647145

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.12.05.2024

ఆది వారం (భాను వాసరే) 

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే పంచమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  పంచమ్యాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.34

సూ.అ.6.19

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

పంచమి తె. 4.18 వరకు.

ఆది వారం. 

నక్షత్రం ఆర్ద్ర

మ. 12.51 వరకు. 

అమృతం లేదు

దుర్ముహూర్తం సా. 4.37 ల 5.28 వరకు. 

వర్జ్యం రా. 1.18 ల 2.58 వరకు. 

యోగం ధృతి ప. 11.04 వరకు.  

కరణం బవ సా. 4.15 వరకు. 

కరణం బాలవ తె. 4.18 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

*****************    

  పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర వైశాఖ   శుధ్ధ పంచమి

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏