12, మే 2024, ఆదివారం

అంతర్జాతీయ నర్సుల దినోత్సవo

 *మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలతో...*


నర్సుల సేవ


1) నర్సులెంతగానొ నాజూకుగనడిచి

సేవచేయుదురుగ సేదలేక

రొక్కమెంతనడుగు దుఃఖమే వారికి

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


2) ఆసుపత్రిలోనికడగు పెట్టినయంత

నర్సు గుచ్చు సూది నరమునకును

వరుస బెట్టి యిచ్చు నరముకింజక్షన్లు

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


3) బీపి మిషను దెచ్చి బీపీని చెక్ చేసి

పరగతాపమాని జ్వరము గొలిచి

రకరకముల జేయు రక్తపరీక్షలు

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


4) కష్టకాలమందు నష్టాలనోర్చుచు

నిష్ఠ తోడ చేయు నిష్టముగను

సిస్టరన్నతానె సేవకు మార్పేరు

జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల


*గోగులపాటి కృష్ణమోహన్*

కామెంట్‌లు లేవు: