21, ఆగస్టు 2020, శుక్రవారం

ఇది సత్యం* 🌷


                   🌷🌷🌷
        "సిరీ! ఒక సారి ఇలా రా" వేడి నీటి స్నానం తో సేద తీరి, perfume వేసుకుంటున్న శిరీష ని పిలిచాడు ప్రభాస్ లాప్టాప్ లొ పని చేసుకుంటూ.
 "ఒక్క నిమిషం" జడలో మల్లెపూదండ తురుముకుంటూ వచ్చింది .
"అబ్బబ్బ! ఈ పిల్లలు ఒకపట్టాన పడుకోరు కదా! పెద్దవాడిి కి కథలు కావాలి. చిన్నోడు  అయితే నా వొళ్ళో పడుకోబెట్టుకొని జోకొట్ట మంటాడు.  ఇద్దరూ పడుకునే సరికి ఇంత లేట్ అయింది. ఎప్పటి కి పెద్ద వాళ్ళు అవుతారో ఏమో"! 

పిల్లలు ఇద్దరినీ వాళ్ళ రూం లో నిద్రపుచ్చి, తలుపులు వేసి వచ్చెసరికి రోజూ ఇదే టైమ్ అవుతుంది.

"ఆ, చెప్పండి.  ఏంటో పిలిచారు కదా! వచ్చి పక్కనే కూర్చుంది.

     ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి,హాల్ కి మరో పక్కగా ఉన్న బెడ్రూం దగ్గర  ఆగాడు.
దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచాడు.  పక్క పక్కనే ఉన్న రెండు బెడ్స్ మీద ఆదమరిచి నిద్రపోతున్నారు వయసు మళ్ళిన దంపతులు ఒకరిచేతిలో మరొకరు చెయ్యి వేసుకుని.
ఏదో అనబోతున్న శిరీష ని హుష్ అంటూ సైగ చేసి, నిశబ్దం గా తలుపులు మూశాడు ప్రభాస్.  విషయం ఏమిటో అర్థం కాక మౌనంగా భర్తతో కలిసి తమ బెడ్రూంలో కి వచ్చింది.

       "చూసావుగా శిరీ! వాళ్ళు ఎలా పడుకున్నారో వొళ్ళు తెలియకుండా!  confusing గా చూసింది అతనివైపు.

      "మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడట? ఎక్కడ ఉంటాడట. మీ అమ్మగారు ఏమంటున్నారు"?  ఏ భావం మొహం లో కనబడ నీయకుండా అడిగాడు.

    ఉలిక్కి పడింది శిరీష, 'తాను పిల్లల రూంలో కూర్చుని, అమ్మతో ఫోన్లో మాట్లాడింది విన్నాడన్నమాట.

'అమ్మ తమ్ముడుకి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని, వాడిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తూ ఉన్నామని చెప్పింది. అప్పుడు తాను ఏమన్నదీ?! "మా ఇంట్లోనే ఉంటాడు లేమ్మా! రూం అడ్జస్ట్ చేస్తాలే!  మా ఇంటి కొత్త దంపతుల్ని హాల్ లో కి షిఫ్ట్ చేస్తాలే! అయినా ఇంత వయసు వచ్చినా ఒకరి మీద ఇంకోళ్లు చేయ్యేసుకొని పడుకుంటారు. చూడటానికి మాకే సిగ్గు వేస్తుంది.  హాల్ లో అలా పడుకుంటే అసహ్యం గా ఉంటుందని ఆలోచిస్తున్నా! సరే ఏదో చెప్పి వాళ్ళని హాల్ లో పడుకో బెడితే వాళ్ళే సర్దుకుంటారు.  సర్దుకోక ఏమి చేస్తారు?  ఎక్కడికీ పోతారు? అలా ఉండలేమంటే ఇక వాళ్ళ ఇష్టం.  ఎక్కడికైనా పోనీ"
తను మాట్లాడింది అంతా అతను విన్నాడని అర్ధం కాగానే కొంచెం గాభరాగా అనిపించినా, మాట్లాడకుండా తల దించుకుంది.

       "శిరీ! ఎక్కడో మా వూళ్ళోఉన్న తాతల నాటి ఇల్లు అమ్మించి, ఇక్కడ మూడు బెడ్రూం ల ఫ్లాట్ కొనుక్కునే దాకా సతాయించావు.  సరే! వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండవలసిన వారే కదా, అని వాళ్లకి ఇష్టం లేకున్నా అక్కడ ఇల్లు అమ్మించి ఇక్కడికి తీసుకు వచ్చాను."

   "మనం ఇక్కడ అద్దెలు కట్టుకోలేమని, సొంత ఇంట్లో ఉంటే మనకి ఖర్చు కలిసి వస్తుంది అని వాళ్లు వొప్పుకున్నారు.  వచ్చినప్పటి నుండి మనకు చాకిరీ చేయటంలోనే మునిగిపోయారు వోపిక లేకున్నా!  నువ్వు, నేను పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లి ఏ రాత్రో వచ్చేదాకా, పిల్లలని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు.

     వాళ్ళ కి వేరేగా వండి, తినిపించి,ఆడించి, పగలంతా వాళ్ళ, అల్లరి భరించి, సాయంత్రం మనం వచ్చే సరికి పులుకడిగిన ముత్యాల్లా తయారు చేసి మనకు అందించాలంటే వాళ్ళు ఎంత శ్రమపడుతున్నారో గమనించావా ఎప్పుడైనా! ఒక్క రోజైనా హాస్పిటల్ కి తీసుకెళ్లే  అవసరం రానీయకుండా అమ్మ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతూ ఉందో తెలుసుకున్నావా?
పూట పూటకీ రుచిగా, వేడిగా వండి అమ్మ వడ్డిస్తుంటే, కడుపు నిండా తినటమే తప్ప ఒక్క రోజైనా ఆమెకి సహాయం చేసావా?
నాన్న యీ వయసు లో కూడా ఇల్లు శుభ్రం గా ఉంచటానికి, పిల్లల్ని శుభ్రం గా ఉంచటానికి ఎంత సహాయం చేస్తున్నారో తెలుసా?
ఆదివారం రాగానే, నీకు ఏవో ప్రోగ్రామ్స్ అంటావు.  ఒక వారం ఛారిటీ కలెక్షన్స్, ఇంకో సారి కిట్టిపార్టీ, ఒకవారం పిల్లలతో outing, ఒక వారం రెస్ట్.  అయినా అమ్మ ఒక్క రోజు కూడా విసుక్కోలేదు. పైగా" పోనీలే! వారమంతా ఆఫీస్ పని కదా!  ఒక్కరోజు దానికి ఇష్టం అయినట్టు ఉండనీ"!  అంటుంది.
తెల్లవారుజామున లేచి ,అన్ని పనులు చేసి అలిసి పోయిన అమ్మకి రెస్ట్ తీసుకో వాలనీ, పడుకోవాలని అనిపించదా చెప్పు!  ఈ వయసులో కూడా కష్టం అనుకోకుండా ఇంత పని చేసే అమ్మకి, రాత్రి అయ్యేసరికి విపరీతమైన కాళ్లనొప్పి, నడుం నొప్పితో బాధ పడుతుంటే నాన్న ఆమె  కి ointment రాసి, కాపడం పెడితే, పాదాలకు మసాజ్ చేస్తుంటే, అది నీకు వేరే విధంగా అనిపించిందా?
80 ఏళ్ల నాన్నకి రాత్రి పూట చాలా సార్లు బాత్రూమ్ కి వెళ్ళవలసి వస్తుంది.  నిద్ర మత్తులో ఒక్కోసారి తూలి పడిపోతుంటారు.  అమ్మకి ఆయన గురించే భయం.  తను నిద్రలో ఉండి ఆయన్ని సరిగా చూసుకోలేక పోతానని అనుమానం.  అందుకే ఆయన చెయ్యి పట్టుకుని పడుకుంటుంది.  ఆయనతో పాటు మెళకువ రావటానికి. అది నీకు శృంగారం గా కనిపిస్తున్నదా?
వయసు మళ్ళిన ఇద్దరికీ ఎవరు ముందు తమను విడిచి వెళ్లి పోతారో అని లోలోపల భయం.  దానికి తోడు మనకి కూడా మాటడటానికే సమయం  ఉండదు.  అందుకే వాళ్ళిద్దరూ అలా ఒకరికి ఒకరు తోడూనీడగా ఉంటారు.  అది కూడా నీకు తప్పు గా ఉంది.

     మీ తమ్ముడికి రూం ఇవ్వడం కోసం వారిని ఇబ్బంది పెట్టవద్దు.  అతడి హాస్టల్ ఖర్చు మనం ఇద్దాము.
మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసుకు వస్తాము.  మనకు కూడా అలాంటి స్థితి వస్తే ఎలా ఉంటుందో వూహించుకో!
"వార్థక్యం తప్పేది కాదు, తప్పూ కాదు.  వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అవి తీర్చక పోతే నేను ఉన్నది ఎందుకు?  దండగ కదా!"
"ఇంకోసారి వాళ్ళని అవమానించేలా మాట్లాడితే నేను వోప్పు కోను." ఖచ్చితంగా చెప్పి బెడ్ మీదికి చేరుకున్నాడు ప్రభాస్.
*******************

జీవన విధానం,

*"జీవన విధానం, జీవన సత్యాన్ని తెలుసుకునే వీలు కల్పిస్తుందా !?"*

ఒక పిల్లి పిల్ల ఏ పని లేకపోయినా అలమరలు, బీరువాలు ఎక్కి తిరిగి జారి పడుతుంది. కాసేపటికి మరో పిల్లిపిల్ల దాన్నే అనుసరిస్తూ వెళ్ళి అదేరకంగా జారి పడుతుంది. మనం కూడా మన తాత ముత్తాతలు ఏదీ సాధించలేదని తెలిసి కూడా అదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నాం. కానీ జీవన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. మనం ఈ సృష్టి మాయకు లోనుకాకుండా ఉండాలంటే సత్యం అర్ధంకావాలి. ఈ సత్యం గమనింపుతోనే అవగాహనలోకి వస్తుంది. అందుకు మన మనసు సామర్ధ్యాన్ని బట్టి జపతపాలు చేయటం ద్వారానో, లేక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరైన పద్ధతిలో గమనించి అర్ధం చేసుకోవటం ద్వారానో అది సాధ్యం అవుతుంది !

శివభావంతో చూస్తే ప్రతి పనీ పూజతో సమానమే !
******************

మట్టివినాయకుడినే

మట్టివినాయకుడినే పూజించడం ఎందుకు?*

          ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కధల్లో కనిపిస్తుంది. మట్టిగణపతిని పూజించడానికి పురాణప్రాశస్త్యం కూడా ఉంది.

           అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దాం. 

          గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు.

 "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?" 
          "మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి.

పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు.

 విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి.

ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం.
          ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు).

మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది.

 అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు.

సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు.

          విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు.

నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు. 

          మట్టి గణపతులనే ఆరాధించడమే
          మన సంప్రదాయం.
          మట్టి గణపతులనే పూజించండి. 
          ఓం గం గణపతయే నమః
*******************

ఏమి కావాలి నీకు*

 *ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది.  అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి* *మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం?*

 *సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.*

 *దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.*

 *షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.*

 *ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "*

 *పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.*
 *ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు* *భూతం ప్రత్యక్షం అయ్యింది."ఏమి కావాలి నీకు? అని అడిగింది* .

 *తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు* *చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.*

 *భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.*

 *నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.*

 *ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.*
 *వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.*

 *ఏమి కావాలి నీకు అని అడిగింది.*

 *పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు.  కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.*

 *ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా ?*

 *పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.*

 *తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.*

 *భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.*

 *ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.*

 *పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.*

 *కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది* *చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు.భూతం అలసిపోయిస్థంభం ప్రక్కన నిద్రపోతోంది.*

 *తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.*

*ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.*

 *ఈ కధ మనది.*
 *ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?*

 *మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది.ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని* .

 *ఆ వృద్ధ సన్యాసి (మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం*  " *మంత్రం" (దైవ నామ స్మరణ)*
 *ఎక్కడం దిగడం మంత్రం జపం.జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన)*
 *అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా* *విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం* *సాధ్యపడుతుంది.*

 *అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.*

 *అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ* *ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.*

 *మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే* *నిర్మించిబడిన మహ గొప్ప మాయ యంత్రం. అంతే కాక*
 *దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా*
 *మహోజ్వల జ్యోతి రూపం.*
 *మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.*

 *ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.*
 *ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.*
******************

బిక్కవోలు గణపయ్య

బిక్కవోలు గణపయ్యకు ఒక్కసారి చెప్తే చాలు.ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు. క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాటినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు,దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు.
*****************

పోత‌న త‌ల‌పులో... ...(26)

ఆర్త‌త్రాణ ప‌రాయ‌ణుడైన‌
భువ‌న మోహ‌న‌రూపుడి ,
 ఆత్మ‌స్వ‌రూప త‌త్త్వాన్ని,
 లీలావిలాసాన్ని ,
తేట‌తెల్లంచేసే ప‌ద్యం....

                       ****
భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం
తవిధింజేయు మునుంగఁడందు; బహుభూతవ్రాతమం దాత్మతం
త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్
దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.
                     *****

ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు.

    🏵️పోత‌న ప‌ద్యం🏵️
🏵️స‌ర్వ‌జ‌న ముక్తిప్ర‌దం🏵️

మహాలక్ష్మి ధ్యాన శ్లోకం*

*పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం*
 *పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామ హర్నిశమ్*
 *పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం*
 *వరదాభయ హస్తాడ్యాం ధ్యాయే చ్చంద్ర సహొదరీమ్*
 *ఇచ్చా రూపాం భగవత స్సచ్చిదానంద రూపిణీం*
 *సర్వజ్ఞాం సర్వజననీ, విష్ణువక్ష స్త్ఫాలాలయామ్*     
 *దయాళుమనిశం ధ్యాయేత్ సుఖసిద్ధ స్వరూపిణీమ్*


*పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం*
🌺 పద్మముల వంటి నేత్రములు కలిగినది; పద్మనాభునికి ప్రియమైనది; పద్మమునందు కూర్చున్నది; పద్మమువలె వికసించినటువంటి సుందర వదనం కలిగినది;

*పద్మహస్తాం*
పద్మముల వంటి చేతులు కలిగినది; జ్ఞానాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడానికై పైనున్న రెండు చేతులలో రెండు పద్మములు పట్టుకొని ఉన్నది; కోరినవన్నీ ఇస్తాను అని చెప్పడానికై క్రింది రెండు చేతులతో వరదముద్ర,  జ్ఞానాన్ని, అభయాన్ని ఇస్తాను అని  చెప్పడానికై అభయముద్రలతో ఉన్నది;  పద్మము అంటేనే ఐశ్వర్యము, జ్ఞానము, ఆనందము. లౌకిక సుఖములు ఇస్తాను చెప్పడానికి వరద హస్తము, అలౌకికమైన జ్ఞానము, మోక్షము ఇస్తాను చెప్పడానికి అభయ హస్తము. అభయ వరద ముద్రలతోను, రెండు పద్మముల తోనూ ఉన్న నాలుగు చేతులతో ఉన్న తల్లి,

*పూర్ణేందు బింబవదనాం*
నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది,

*రత్నాభరణభూషితాం*
శిరస్సు మొదలుకొని పాదముల వరకు అన్ని రకాల రత్నాభరణములను అలంకరించుకున్నది,

*చంద్ర సహోదరీం*
క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు చంద్రునితో పాటు పుట్టింది. చంద్ర సహోదరీం అనే మాటలో విశేషం ఏమిటంటే చంద్రునికి ఉన్నటువంటి ఆహ్లాద లక్షణము, ప్రసన్నతా లక్షణము అమ్మవారి వద్ద ఉన్నది అని చెప్పడం. మరొక ప్రత్యేకత సహస్రారంలో ఉన్నటువంటి చంద్రబింబ స్వరూపిణి అని చెప్పడం.

 *ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానంద రూపిణీం*
భగవానుడైన నారాయణుని యొక్క ఇచ్ఛా శక్తి స్వరూపిణి. సచ్చిదానంద రూపిణి అయిన తల్లి.

*సర్వజ్ఞాం*
అన్నీ తెలిసిన తల్లి;

*సర్వ జననీం*
సర్వ జగత్తుకూ తల్లి; 

*విష్ణు వక్షస్థలాలయామ్*
నారాయణుని వక్ష స్థలంలో ఉన్నది,

*దయాళుః*
దయ గలిగిన తల్లి;

 *అనిశం ధ్యాయేత్*
ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను.


*సుఖ సిద్ధి స్వరూపిణీం* 
ఆనందము, సిద్ధి(కార్య సిద్ధి, మోక్షము) ఈ రెండింటి యొక్క రూపమే మహాలక్ష్మి.

*సేకరణ*

మంచిమాట

*_రావణుడుతో ఉన్న విభీషణుడు చెడిపోయాడా?_*
*_రాముడుతో ఉన్న కైకేయి బాగుపడిందా?_*
*_మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు ఎలా ఉన్నామన్నదే ముఖ్యం..!_*
*_యుద్ధం వస్తే కాని,_*
*_అంగ బలం బయట పడదు..._*
*_ఆత్మాభిమానం భంగ పడితే కాని,_*
*_బుద్ధి బలం బయట పడదు..._*
*_జీవితంలో నిలబడాలంటే శరీర బలం కాదు,_*
*_మానసిక బలం చాలా అవసరం.!_*

*_జీవితం గొప్పగా ఉండాలని ఆలోచిస్తారు కానీ,_*
*_జీవితం కన్నా వ్యక్తిత్వం గొప్పగా ఉండాలని ఆలోచించరు...✓_*
*_వ్యక్తిత్వం గొప్పగా ఉంటే,_*
*_జీవితం గొప్పగా ఉంటుంది.._*
*_మానసికంగా ఎదగలేన్నప్పుడు,_*
*_శారీరకంగా ఎంత ఎదిగితే మాత్రం ఏం ప్రయోజనం?_*
*_అడివిలో దున్నలా మంచి చెడు ఆలోచించే కనీస విచక్షణ జ్ణానం కూడ ఉఃడదు...!_*
*_తిట్టేవాడికి దగ్గరగ ఉన్నా ఫరవాలేదు గాని,_*
*_పొగిడే వాడికి మాత్రం దూరంగా ఉండండి.._*

*_🌺శుభోదయం🌸_*
🌻🌻🌻🌻🌻
*_✡సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*
*_🕉లోకాసమస్తా_* *_సుఖినోభవంతు_* 
*_☸శుభమ్ భుయాత్,_*
*_శుభమస్తు._*         
🌻🌻🌻🌻🌻
*_....✍️ మీ స్వామి_*
**************

మనసు అంటే ఏమిటి ? ఆ మనసును నాశనం చేయడం ఎలా ?🙄


ఎవరండి ఈవిడ మనసును నాశనం చెయమంటుంది .  ముందు ఈవిడ అడ్రస్ కనుక్కోండి అంటారేమో ???😢

ప్రతి ఒక్కరూ నా మనసు బాలేదు . నా మనసు ఇలా ....అలా ....అంటూ ఉంటారు . అసలు ఈ మనసు అంటే ఏమిటి ?🤔

మనకు నిరంతరం వచ్చే ఆలోచనలు సంకల్పాలే మనసు . మనసు అనేది ఒక అవయవయం కాదు .
ఒక వస్తువూ కాదు ,
నిరంతరం కదులుతూ ఉన్న ఆలోచనలే మనసు . ఇది దేహాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది . మర్రి చెట్టుపై భేతాళుడు లా ఎప్పుడు సందేహాలే . క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు . ఏంటీ మనసు అంటే జస్ట్ ఆలోచనలా .😱

 అవును ఇది ఒక్కటి చాలు మనిషిని నిదుర పోనివ్వదు . ప్రపంచ దేశాల సమస్యలు అన్నీ దీనికే . పక్కింటి పంకజాక్షి నుండి పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాలు వరకు ఒకే ఆలోచనలు  పోనీ ఈ ఆలోచనలు తో ఏదైనా సాధిస్తావా అంటే అది లేదు .
(దీన్ని నీకు అనుకూలంగా మలచుకుంటే అద్బుతాలు నీ ముంగిటే ఉంటాయి )..🌷

అసలు ఈ మనసు అనేది ఉన్నదా ?  ‘’ ఉంటే  ఈ మనసు  శాశ్వతమా అంటే  కాదు . ( ఏదైనా వస్తువు ఉన్నది అంటే అది అన్నీ కాలాలలో ఉండాలి(సత్) అసలు ఎప్పుడు ఏకాలంలో లేనిది అసత్’’ అంటే నేను మొలకువగా (జాగృదా) ఉన్నాను మనసు ఉన్నది . నిద్ర పోతున్నా (స్వప్నా ) అక్కడా మనసు ఉన్నది . దీర్ఘ నిద్ర  అంటే సుషుప్తి ఈ అవస్థలో మనసు లేదు .అసత్ కాదు సత్ కాదు . శాశ్వతం కాదు అలా అని ఆశాశ్వతం కాదు ఈ రెండు కానీ వాటిని వేదాంత భాషలో మిధ్యా అంటారు .😱

అన్నింటిని భ్రమింప చేస్తుంది .. “ అదేనండీ ఓ రచయిత గారు చెప్పరుగా ‘’ కోర్కెల ఎడ నీవు ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే ? అంటూ .. మనిషిని సునామిలా  గందర గోళం చేస్తుంది , ఎండమావులే గోదారి గలగలలు అంటుంది ..

మరి నేను సత్యం తెలుసుకోవడం ఎలా ? 🤔
చిమ్మ చీకటిలో (అజ్ఞానం ) ప్రయాణం చేస్తున్నాను . ఓ పెద్ద పాము ను చూసి పాము ..పాము అని అరిచి కేకలు పెట్టి హార్ట్ బిటింగ్ పెరిపోయి వారు వీరు వచ్చి పంచాయితీ చేసి ఓ దీపం ( జ్ఞానం ) తెచ్చారు . అది తాడు అని తేల్చేశారు  .. హమ్మయ్య తాడేనా ఎంత రిలాక్స్ గా ఉన్నది .  😊ఇక్కడ తాడు సత్ ‘ పాము మిధ్య , ఈ భ్రమాత్మకమైన మనసుకు ఆధారం ఎవరు అంటే సత్యం అయిన తాడే . తాడు లేకపోతే పాము అనే భ్రమ పడే అవకాశం లేదు.

మరి మనసును అదుపులో పెట్టడం ఎలా ? పూజా , సత్సాంగత్యం , జపం , ధ్యానం , వీటితో మనసును నీ అదుపులో తెచ్చుకుంటావు ..” యామండి ఏమి అనుకోకండి ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకే కానీ బయటకు రాగానే  ఆలోచనలు ఈగలు మూసినట్లు ముసురుతున్నాయండి .

 హిమాలయాల్లో ఉన్నా ‘’ అయ్యో వాడు ధ్యానం ఎక్కువసేపు చేస్తున్నట్లు ఉన్నాడు , వాడి దగ్గరకు విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు , వాడికి ఉన్న పేరు నాకు రావడం లేదు .నన్ను ఎవరు గుర్తించడం లేదే .  😪ఓ ఆశ్రమం కడదాం అంటే డబ్బులు లేవు 🙄‘’ ఇది సంగతి అక్కడ శాంతి లేదు .. మరి దీనికి మార్గం ‘’ ఒకే ఒక్క మార్గం మనో నాశనం “” అంటే ఆత్మ విచారణ ‘’…………

అంటే రాజుగా నాటకం వేశాను , నాటకం అయిపోగానే ఒక్కోటి తీసేసి ‘’ పక్కన పెట్టేస్తే నేను మాత్రమే మిగులుతుంది .
అంటే నేను ఎవరినిని ? దేహాన్నా , మనసునా ., బుద్దినా , పంచెద్రీయాలా , అహంకారమా , పంచ కోశాలునా , ద్వేషాన్నా రాగాన్నా మొహాన్నా ,పుణ్యాని నా పాపానినా ?మంత్రాన్నా తీర్థాన్నా ? (నిర్వాణ షట్కం )
కాదు ఈదేదీ నేను కాదు “’ అంతే ఈ సత్యం ఎరుక అయిక క్షణం మనో నాశనమే “
ఆక్షణమే నువ్వు మహాయోగివి. నా స్వస్వరూపం ఇది అని తెలిసాక ఇంకేముంది .
ఆలోచనలు లేవు కోరికలు లేవు ముక్తస్దితి ..

The death of the mind is the birth of a sage. (మనోనాశనం జరిగింది అంటే అతడు మహనీయుడైన యోగి )
*******************

శ్రీనృసింహ శతకము

శ్రీనృసింహాష్టోత్తర శత నామాంచిత శ్రీ యాదాద్రి శ్రీనృసింహ శతకమునందలి 104వ పద్యము.

104. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
మత్తహంసినీ వృత్త గర్భ సీసము.

ఎన్ని కను మురారి! నిన్నే విభుఁడుగా ను - తింతు,  రా, మదిలోన శాంతి నిల్ప.

సాకఁగను పరాకు నీకేల ప్రవరుండ! - కావఁగా కష్టమా కామితప్రద!

పుణ్యులును, నరోత్తముల్ జీవనము నీవె - యందురే, వినవేమి? సుందరాంగ!

రాక్షసారి! పరాత్పరా! నీవె ప్రభవంబుఁ - గొల్పరా! తీర్చరా కోరికలను.

గీ. మత్తహంసిని గర్భ సన్మహిత సీస

సచ్చిదానంద విగ్రహా! సన్నుతులయ!

భక్త జన పోష! భవశోష! పాపనాశ!

శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

104వ సీస గర్భస్థ మత్తహంసినీ వృత్తము

(జ త స జ గ .. యతి 7)
 
మురారి! నిన్నే విభుఁడుగా నుతింతురా.

పరాకు నీకేల ప్రవరుండ! కావఁగా.

నరోత్తముల్ జీవనము నీవె యందురే!

పరాత్పరా! నీవె ప్రభవంబుఁ గొల్పరా!

ఈ పద్యమును హృద్యముగా ఆలపించిన బ్రహ్మశ్రీ ఏల్చూరి రామబ్రహ్మానందరావు గారికి ధన్యవాదములు.

సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.

"అన్న ప్రదాత సూర్య భగవానుడు"



సూర్యారాధన సకల శుభాలను ప్రసాదిస్తుంది. జీవజాలం మనుగడకు సూర్యుడే ఆధారం. సూర్యుడు లేకుంటే ప్రపంచం అంధకారంలో మునిగిపోతుంది. ఋతువు లుండవు.రాత్రి పగలు ఉండవు. భూమి మొత్తం మంచుముద్దగా  మారిపోతుంది. .నీరు ఆవిరై మేఘ రూపం ధరించి వర్షంగా కురి సి పంటలు పండే అవకాశం ఉండదు. తాగేందుకు చుక్క.నీరు లభించదు.  గ్రహాలు గతులు తప్పుతాయి. జీవం నశించి పోతుంది.
జీవజాలం మనుగడకు సూర్యుడే ఆధారం అని గ్రహించిన పెద్దలు సూర్యారాధన కు శ్రీకారం చుట్టారు. భగవంతుని అవతారంగా శ్రీ సూర్య నారాయణనునిగా సూర్యుని అర్చించడం..స్తుతించడం ప్రారంభించారు.
సూర్యుని మహిమను ధౌమ్య మహర్షి మహాభారత కథ లో ధర్మరాజుకు తెలియ చెప్పాడు.
 పూర్వ  కాలంలో జీవ రాశి  ఆవిర్భవించిన తొలి నాళ్లలో ఆహారం లభించక ప్రాణులు అలమ టిస్తుండటం చూసి మనసు కరిగిన వాడై సూర్య భగవానుడు ఉత్తర దిక్కుగా పయనించి భూ సారాన్ని గ్రహించి.. దక్షిణ దిక్కుగా పయనించి మేఘ రూపుడై వర్షించి ధాన్యపు విత్తనాలను చంద్రునిలోని అమృతాంశ   చేత వృద్ధి చెందేలా చేసి మానవులతో పాటు ఇతర ప్రాణులకు ఆహారం లభించేలా.. జీవించేలా చేశాడు.
 నహుషుడు, కార్తవీర్యుడు మున్నగు చక్రవర్తులు ఆహారం సూర్యుని అనుగ్రహ ఫలమని గ్రహించిన వారై సూర్యుని ఆరాధించి తరించారు. సమస్త శుభాలను పొందారు.
. కావున ఓ ధర్మ రాజా! నీవు కూడా సూర్యుని ఆరాధించి తరింప వలసినది అంటూ ధౌమ్య మహర్షి ధర్మరాజుకు ఉపదేశించాడు.

 ఆధారం:
మహా భారతం అరణ్య  పర్వం 1  వ ఆశ్వాసం పద్య సంఖ్య  38-39.

 ( సేకరణ...
ఎం వి ఎస్ శాస్త్రి ఒంగోలు 9948409528))
*********************

*మనుచరిత్ర --1*

ఒక సమాజం తన ఉనికిని చాటుకోవడానికి  తను ఈ సృష్టిలో ప్రత్యేకంగా కనపడటానికి ముఖ్యమైన
ఆధారం, ఆయువుపట్టు లాంటివి
భాషా, సాహిత్యాలు. ఒక భాషలో సాహిత్యం లేకపోతే ఆ భాష ఎక్కువకాలం
బతకదు. సాహిత్యమంటే,
ఆ భాషలో ఉన్న రచనలు.
కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు,
నవలలు,
నాటకాలు, వ్యాసాలు,
చలచిత్ర గేయాలు వీటిని ఏ భాషలో రాస్తే వాటిని
ఆ భాషా సాహిత్యం  అంటారు.
పది కాలాల పాటు నిలబడే భావితరాలు చదువుకునే సాహిత్యాన్ని సృష్టించిన కవులు అనేకులు తెలుగు సాహిత్య రంగంలో ఉన్నారు.
వారి గురించి పరిచయం చేయడమే
ఈ పోస్టింగ్ లోని ప్రధాన ఉద్దేశ్యం.
*ఆంధ్ర కవితా పితామహుడు గా పేరుపొందిన కవి *అల్లసాని పెద్దన్న* వీరు రచించిన మనుచరిత్ర ప్రబంధం ఎంతోమంది తరువాతి కవులకు దారి చూపించింది.

*ప్రస్తుత తరానికి  భవిష్యత్ తరాలకు*
ఆ సాహితీవేత్తల రచనలను
తెలియడం కోసం*  *చదువుకున్న* *పెద్దలకు  మరొక్కసారి* 
*ఆ మధురిమను ఆస్వాదింపచేయటం కోసం*,


*మనుచరిత్ర* *ప్రబంధపరిచయం*
అల్లసానిపెద్దనకవి రచన....

మనము ఆంధ్రులము. తెలుగు వారము. రెండును ఒకటే. రెండువేలఏండ్లుగా  మన జాతి పేరు ప్రతిష్టలు గడించినది. ఆ పూర్వము తెలియదుగానీ 1000 ఏళ్ళ క్రింద రాజమహేంద్రవరములో, రాజరాజనరేంద్రుడు వారి క్రింద నన్నయ్య భట్టు మన భాషలో మొట్టమొదట తెలుగు భారతం వ్రాసెను.  ఆయన మొట్టమొదటి కవి. తరువాత తిక్కన, ఎర్రాప్రగడ, నాచన సోమన్న, శ్రీనాథుడు, పోతన, మొదలైన మహాకవులు మన భాషలో పుట్టి మహా గ్రంధములు వ్రాసినారు. ఒక జాతి గొప్ప జాతి అనగా తక్కిన లక్షణాలతో పాటు ఆ భాషలో గొప్ప కావ్యాలు కూడా ఉంటవి. మనకు కూడా ఉన్నవి. ఇట్లా ఉండగా హంపీ విజయనగరములో  శ్రీకృష్ణదేవరాయలు అన్న ప్రభువు రాజ్యం చేసినాడు. ఆయన కాలం లోనూ ఆయన తర్వాత తెలుగులో మరీ గొప్ప కావ్యాలు బయలుదేరినవి. ఆ కావ్యాల మూలంగా మన జాతి యొక్క గౌరవంఎంతో  పెరిగింది.
 *అష్టదిగ్గజాలు* కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో
అష్ట దిగ్గజాలైన కవులు ఉండేవారు. గజము అనగా ఏనుగు. దిగ్గజములు అనగా దిక్కునందు ఉండెడి.ఏనుగు.
మన పురాణాలలో ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఏనుగులు ఉండి అవి ఈ
భూమిని మోయుచున్నవని కథ ఉన్నది. క్రింద ఆదిశేషువు మోయుచున్నాడు. ఎనిమిది దిక్కులందు ఈ ఏనుగులు   మోయుచున్నవి. అనగా భూమిని భరించు చున్నవి అని అర్థము. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఎనమండుగురు కవులు ఉండేవారు. వారికి అష్టదిగ్గజములు అని పేరు. దిగ్గజములు సరే వీరు దిగ్గజములు ఏమిటి?
ఆ దిగ్గజములు ధాత్రిని భరించుచున్నట్లుగా ఈ దిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయలవారి యొక్క సభ యొక్క మర్యాదను, ప్రతిష్టను,భరించెడివారన్నమాట. సభలోమంత్రులుందురు,
సేనా నాయకులుందురు, మహోద్యోగులుందురు.
అంత మంది ఉండగా ఎనమండగురు కవుల ఎనిమిది దిక్కుల కూర్చుండబెట్టి వీరు దిగ్గజములనుటలో  అర్థమేమి?
అనగా  ఆమంత్రులందరికంటే ఆ సేనాపతులు అందరికంటే నిజముగా శ్రీకృష్ణదేవరాయల
వారి కీర్తిని శాశ్వతముగా
నిలబెట్టెడివారు
ఈ కవులు అనిఅర్థం.  పూర్వకాలంలో కవులన్నచో, అంతటి గౌరవం. వారు కూడా అంతటి గొప్ప వారు. ఎనిమిది దిక్కులలో ప్రధానమైన దిక్కు తూర్పు. ఆదిక్కు నందున  ఏనుగులకు  గౌరవం. అట్లే శ్రీకృష్ణదేవరాయల
వారి ఆస్థానములో ఉన్నఎనమండుగురు లో *అల్లసాని పెద్దన్న* గారు  అనేకవి ఉండెడివాడు. ఆయన తూర్పుదిక్కున ఏనుగు వంటి వాడు. ఆయన *మనుచరిత్ర* మనే  గ్రంథము వ్రాసినాడు. దానిని శ్రీకృష్ణదేవరాయల
వారికి అంకితం ఇచ్చినాడు. ఇప్పటికి నాలుగు ఐదు వందలఏళ్ళ క్రింద జరిగిన సంగతి ఇది. ఇప్పటికీ ఆ గ్రంథమునకు ప్రతిష్ఠ తగ్గలేదు......
*********************

మహా భారత మహితోక్తి..


1) సత్ప్రవర్తన అనే సముద్రాన్ని దాటడానికి సత్యం ఓడ వ లె తోడ్పడుతుంది.
2) క్షమా గుణం కలిగిన వారిని అసమర్ధులుగా పలువురు భావిస్తుంటారు. వ్యక్తిత్వానికి మరింత అందాన్ని, శోభను కలిగించేది క్షమా గుణమే.
3) ఎక్కడా ఎప్పుడూ పరుష వాక్కులు పలుకక పోవడం , పాపపు పనులు చేయక పోవడం ఈ రెండు లక్షణాల చేత పురుషుడు ఉ త్త ముడిగా మన్నన లం దుకుంటాడు.
4) సమర్థుడు అయి ఉండీ శాంతం వహించే వాడు, బీద వాడయినప్పటికీ తనకు ఉన్నంతలో ఇచ్చే వాడు పుణ్యాత్ముడు .
5) న్యాయ బద్ధంగా సంపాదించిన డబ్బును అనర్హులకు ఇవ్వడం, అర్హులకు ఇవ్వక పోవడం వల్ల రెండు విధాలా కీడు జరుగుతుంది.
6) స్త్రీ, జూదము, మద్యపానం, వేట, పరుషంగా కఠినంగా నిందాపూర్వకంగా మాట్లాడడం, అతి క్రూరంగా దందించడం, వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అనే ఈ ఏ డు విషయాల పట్ల అతిగా ఆసక్తి చూపడం అ నర్థ దాయకం. వీటిని సప్త వ్యసనాలుగా పెద్దలు పేర్కొన్నారు.
.7) తన హోదాకు తగిన వస్త్రాలను ధరించడం, తనను తానే కీర్తించుకోకుండా ఉండడం, చేసిన దానం గురించి బాధ పడకుండా ఉండడం, బ్రతుకు గడిచే మార్గం లేకపోయినా పెడ దారులు పట్టకుండా ఉండడం ఇవి మానవునికి మేలు చేస్తాయి.  సత్ప్రవర్తన గా భావించ బడతాయి.
8). స్నేహమూ, మాట,బలం, వివాదం, వివాహం, యుద్ధం తనతో సమానులైన వారితోనే తగిన వవుతాయి. తమ కంటే అధికులతో కానీ అల్పులతో కానీ వాటిని కలిగి ఉండడం తగిన పని కాదు. అంటే తమ తమ స్థాయికి తగిన వారితోనే వాటిని కలిగి ఉండాలని భావం.
( ఇది ఉద్యోగ పర్వం లోని విదుర నీతి )
( సే కరణ ,: ఎం. వీ.ఎస్ శాస్త్రి ధర్మా చార్య, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఒంగోలు 9948409528)
*****************

బలరామ జయంతి

బలరామ జయంతి గురించి:
శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడు  విష్ణువు యొక్క 8 వ అవతారంగా పూజిస్తారు. బలరామ జననానికి  బలరాముడి జయంతిగా జరుపుకుంటారు.
విష్ణువు పడుకున్న పాము ఆదిశేష అవతారంగా కూడా బలరాముడిని పూజిస్తారు. బలదేవుడు, బలభద్ర, హలయుధుడు బలరాముడి పేర్లు.

ఉత్తర భారతదేశంలో, బలరామ జయంతిని హాల్ సాష్టి మరియు లాలాహి చాత్ అని కూడా పిలుస్తారు. గుజరాత్‌లో ఈ రోజును రంధన్ చాత్ అని పిలుస్తారు మరియు బ్రజ్ ప్రాంతంలో దీనిని బాలదేవ ఛత్ అనే పేరుతో పిలుస్తారు.
లార్డ్ బలరాముని యొక్క కొన్ని నిర్దిష్ట కాలక్షేపాలు
1) బలరాముడు రాక్షసుడిని చంపాడు
2) బలరాముడు ప్రలంబసురుడిని చంపుతాడు
3) బలరాముడు కృష్ణుడిచే కీర్తింపబడ్డాడు
4) యమునా దేవి బలరాంకు దారి ఇవ్వనప్పుడు ఆమెను శిక్షించారు
5) కౌరవులు సంబాను స్వాధీనం చేసుకున్నప్పుడు శిక్షించారు
6) బలరాముడు రేవతిని వివాహం చేసుకున్నాడు
7) దుర్యోధనుడిని మోసపూరితంగా చంపినందుకు బలరాముడు భీముడిపై కోపంగా ఉన్నాడు, కాని శ్రీ కృష్ణుడిని ప్రసన్నం చేసుకున్నాడు.
8) వ్యాస్‌దేవ్‌ను సరిగా ప్రాతినిధ్యం వహించనందుకు రోమహర్షనను చంపడం
************************

రామాయణమ్. 37

నా రాముడంటే మీకెందుకంత ఇష్టం ? దశరధుడు తన మంత్రి,సామంత,పురోహితులను అడిగాడు!
నిర్ణయం తీసుకునే ముందు!
..
రాముడు కనపడగానే
వారి మాటలు మరొక్కసారి ఆయన మనసులో ప్రత్యక్షమై మనసును ఆనందంతో నింపివేసినవి .
.
నారాముడు సర్వలోక మనోహరుడు!
.
రామునిగురించి సభలో వ్యక్తమయిన అభిప్రాయాలు ఇవి !.
.
ప్రజాసుఖత్వే చన్ద్రస్య ..సుఖముకలిగించుటలో చంద్రసమానుడు
.
వసుధాయా క్షమాగుణైః.. ఓర్పు మొదలైన గుణములలో పృధ్వీసమానుడు.
.
బుధ్యాబృహస్పతేత్తుల్యో...బుద్ధిలో దేవగురువు బృహస్పతి సమానుడు
.
వీర్యే సాక్షాచ్ఛచీపతే.. పరాక్రమంలో సాక్షాత్తూ దేవేంద్రడే!
.
ధర్మజ్ఞః ..ధర్మములెరిగినవాడు
.
సత్యసన్ధశ్చ..సత్య ప్రతిజ్ఞకలవాడు
.
శీలవాన్.. శీలవంతుడు
.
అనసూయకః.. అసూయలేనివాడు
.
క్షాన్తః.. ఓర్పుకలవాడు
.
సాన్త్వయితః.. కష్టాలలో ఉన్నవారిని ఓదార్చువాడు
.
శ్లక్ష్ణః.. మృదుస్వభావి
.
కృతజ్ఞః.. ఎవరైనా మేలు చేస్తే మరువని వాడు
.
విజితేన్ద్రియః..ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనేవాడు.
.
రాముడికి కోపం కలిగినా అనుగ్రహము కలిగినా అవి వ్యర్ధములుగావు .
.
చంపదగినవానిని చంపితీరుతాడు ,చంపతగని వారి విషయములో అసలు కోపము వహించడు!
.
ఎవడినైతే అనుగ్రహించాడో వాడు ఈ లోకంలో అందరికన్నా ఐశ్వర్యవంతుడవుతాడు!
.
రామమ్ ఇన్దీవరశ్యామమ్ సర్వశత్రు నిబర్హణమ్....నల్లకలువవలే ఉండే రాముడు శత్రుసంహారకుడు!
.
అసలిన్నెందుకు! లోకంలోని శ్రేష్టమైన గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి అని అడిగితే అందరి చూపుడు వేలు రాముడివైపు తిరుగుతుందట!
.
ఇన్ని ఆలోచనలు మదిలో తిరుగుతూ వున్న దశరధమహారాజు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు " రామవర్మాహం అహంభో అభివాదయే" అన్న రాముని మాటలతో!.
.
రామా ! పుష్యమీ నక్షత్రగడియలలో నిన్ను యౌవరాజ్యపట్టాభిషిక్తుడిని గావింప నిశ్చయించాను !
.
రామా ! నీవు ఇకనుండి ఇంకా జాగ్రత్తగా మెలగవలె !
.
నీవు ఇంకా వినయవంతుడవై ఎల్లప్పుడును ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని కామము వలన కలిగే వ్యసనములకు ,, క్రోధము వలన కలిగే వ్యసనములకు దూరంగా ఉండు,
.
 ధాన్యాగారాలను ,ఆయుధాగారాలనూ ఎల్లప్పుడూ చక్కగా నింపి ఉంచు.
.
ప్రజలను,అమాత్యులను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచు! .
.
 అని హితవు పలికాడు దశరధమహారాజు
.
ఇంత సంతోషకరమైన వార్తను కౌసల్యా దేవి కి చేరవేశారు రాముని మిత్రులు..
.
N.B
.
మన స్మృతులు ఈ విధంగా చెపుతున్నాయి
.
కామము వలన కలిగే వ్యసనములు..పది..అవి
.
వేట , జూదము ,పగటినిద్ర ,పరుల దోషాలు వినడం చెప్పడం  ,
పరస్త్రీ సంభోగము  ,తాగుడు ,నృత్యము ,గీతము ,వాద్యము , పనీపాటలేకుండ దేశసంచారము చేయడం ఇవ్వన్నీ వ్యసనాలే .
BE MERRY BE HAPPY CULTURE ..
.
ఇక కోపం వలన కలిగే వ్యసనాలు
.
చాడీలు చెప్పడం complaining mentality
సత్పురుషులను బంధించడం ,బాధించడం
ద్రోహము, ఈర్ష్య ,అసూయ ,ప్రక్కవాడి డబ్బు కాజేయడం ,వాక్పారుష్యమ్ అనగా ఊరకే ఎదుటివాడిని తిట్టిపోయడం  , దండపారుష్యమ్ అనగా ఎదుటివాడిని కొట్టటం.
.
వీటన్నిటికీ దూరంగా ఉండమని హితవు పలుకుతున్నాడు దశరధుడు !
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
****************
.

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

శ్రీమాత్రేనమః*
*70వ నామ మంత్రము*

*ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః*

*కిరిచక్రము* అను రథము నధిరోహించిన దండనాథ (వారాహి) అను దేవిచే సేవింపబడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకులకు అఖండమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపద నిచ్చి, జీవనయానంలో సుఖసంతోషములు, ఆధ్యాత్మిక జ్ఞానమార్గంలో బ్రహ్మానందమును ఆ తల్లి ప్రసాదించి తరింపజేయును.

కిరి అనగా వరాహము. కిరిచక్రరథమును అధిష్టించిన దేవత వారాహి.  కిరిచక్రరథము వరాహరూపంలో ఉండి వరాహములచే లాగబడుతుంది. ఈ రథమునధిష్టించిన వారాహి చేతిలో దండమును ధరించి ఉంటుంది. అందుకే వారాహిని దండనాథా అని కూడా అంటారు "కిరిచక్రరథారూఢా *దండనాథా* " అనగా కిరిచక్రరథమునధిరోహించిన దండనాథా (అను దేవత) పురస్కృతా అనగా సేవింపబడు లేదా పూజింపబడు. కిరిచక్రరథమునధిరోహించిన దండనాథ (వారాహి) యను దేవతచే సేవింపబడునది (పూజింపబడు జగన్మాత) యని ఈ నామ మంత్రములోని భావము.

కిరిచక్రరథమునకు ఐదు పర్వములు (ఆవరణలు) గలవు. ఈ ఆవరణలను అంతస్తులు అందురు. *కిరిచక్రరథేంద్రస్య పంచపర్వసమాశ్రయాః| దేవతాశ్చ శృణుప్రాజ్ఞ నామాని శృణుత్వాంజయః॥॥*

ఈ కిరిచక్రరథమునందు గల పర్వములందు (అంతస్తు లందు) వివిధ దేవతలు ఆయుధాలు ధరించి ఉందురు.

ఐదవ ఆవరణమునందు నల్లగా, వరాహమునకు ఉండే కోరలు వంటివి గలిగి *దండినీ* అని చెప్పబడే వారాహీ దేవత ఉంటుంది. కిరిచక్రరథ సేనకు పండ్రెండుమంది సేనానులు గలరు. వారు 1) పంచమి, 2) దండనాథా, 3) సంకేతా, 4) సమయేశ్వరీ, 5) సమయసంకేతా, 6) వారాహీ, 7) పోత్రిణీ, 8) శివా, 9) వార్తాళీ, 10) మహాసేనాని, 11) ఆజ్ఞా చక్రేశ్వరీ, 12) అలిందినీ. ఈ వారాహీ దేవతయే అమ్మవారికి ప్రధాన సేనాని. ఈ వారాహి దేవతకు ఉపాసనకూడా కలదు. కాశీ క్షేత్రంలో వారాహీ మందిరం గలదు. ఈ వారాహీ దేవతకు బీజాక్షరం *హూం* మనలో పోట్లాడే స్వభావంగలది ఈ వారాహి. అందుకే మనం ఎవరిపైనైనా కోపం వస్తే *హుం* కరించుతాము. అనుకోకుండానే మన గొంతుకనుండి   *హూం* అను బీజాక్షరం వచ్చిందికదా! అంటే మనలో కోప స్వభావంగల దేవత అయిన *వారాహి* ఉందికదా!

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

.నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
***********************

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*బలిచక్రవర్తి స్వర్గమును జయించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.10 (పదియవ శ్లోకము)*

*తుల్యైశ్వర్యబలశ్రీభిః స్వయూథైర్దైత్యయూథపైః|*

*పిబద్భిరివ ఖం దృగ్భిర్దహద్భిః పరిధీనివ॥6869॥*

బలిచక్రవర్తితోగూడి, అతనితో సమానమైన ఐశ్వర్య బలవైభవములు గల దైత్యసేనాపతులు తమ తమ సైన్యములను దీసికొని బయలుదేరిరి. వారు ఆకాశమును త్రాగివేయుచున్నట్లును, క్రోధముతో నిండిన నేత్రములతో దిక్కులను భస్మము చేయుచున్నట్లును ఒప్పుచుండిరి.

*15.11 (పదకొండవ శ్లోకము)*

*వృతో వికర్షన్ మహతీమాసురీం ధ్వజినీం విభుః|*

*యయావింద్రపురీం స్వృద్ధాం కంపయన్నివ రోదసీ॥6870॥*

బలిచక్రవర్తి మిగుల బలీయమైన తన సేనను తీసికొని వారిని యుద్ధోన్ముఖులుగా చేయుచు ముందుకు నడపెను. పిదప సకలైశ్వర్ర సంపన్నమగు ఇంద్రుని రాజధానియైన అమరావతిపై దండెత్తెను. ఆ సేనల పాదఘట్టనలకు ఆకాశము, అంతరిక్షము కంపించుచుండెను.

*15.12 (పండ్రెండవ శ్లోకము)*

*రమ్యాముపవనోద్యానైః శ్రీమద్భిర్నందనాదిభిః|*

*కూజద్విహంగమిథునైర్గాయన్మత్తమధువ్రతైః॥6871॥*

*15.13 (పదమూడవ శ్లోకము)*

*ప్రవాలఫలపుష్పోరుభారశాఖామరద్రుమైః|*

*హంససారసచక్రాహ్వకారండవకులాకులాః|*

*నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాః సురసేవితాః॥6872॥*

దేవతల రాజధానియైన అమరావతి సుందరమైన నందనోద్యానములతోను, ఉపవనములతోడను విలసిల్లు చుండెను. వాటియందలి పక్షుల జంటల కూజితములు వినసొంపుగా నుండెను. మత్తిల్లిన తుమ్మెదలు ఝంకారములు సలుపు చుండెను. కల్పవృక్షముల శాఖలు చిగురుటాకులతో, ఫలపుష్పములతో శోభిల్లుచుండెను. అచటి సరోవరముల యందు హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు, కొంగలు గుంపులు గుంపులుగా చేరి విహరించుచుండెను. ఆ జలాశయములయందు దేవభామినులు జలక్రీడలు సలుపుచుండిరి.

*15.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఆకాశగంగయా దేవ్యా వృతాం పరిఖభూతయా|*

*ప్రాకారేణాగ్నివర్ణేన సాట్టాలేనోన్నతేన చ॥6873॥*

దివ్యమైన ఆకాశగంగ అగడ్తవలె ఆ అమరావతికి నలువైపుల పరివృతమై యుండెను. ఆ పురము చుట్టును బంగారముతో నిర్మితమైన  ఎత్తైన కోట బురుజులుగలవు. వాటియందు అచ్చటచ్చట అట్టాలకములు (మేడపై గదులు) విరాజిల్లుచుండెను.

*15.15 (పదునైదవ శ్లోకము)*

*రుక్మపట్టకపాటైశ్చ ద్వారైః స్ఫటికగోపురైః|*

*జుష్టాం విభక్తప్రపథాం విశ్వకర్మవినిర్మితాం॥6874॥*

ఆ నగరము నందలి ద్వారములు బంగారు పట్టీలతో విలసిల్లుచుండెను. గోపురములు స్ఫటికములతో నిర్మితములు. విశ్వకర్మచే తీర్చిదిద్దబడిన రాజమార్గములు విశాలములు, దర్శనీయములు.

*15.16 (పదహారవ శ్లోకము)*

*సభాచత్వరరథ్యాఢ్యాం విమానైర్న్యర్బుదైర్వృతాం|*

*శృంగాటకైర్మణిమయైర్వజ్రవిద్రుమవేదిభిః॥6875॥*

ఆ నగర సభాస్థానములు, ముంగిళ్ళు రథమార్గములతో శోభాయమానములై యుండెను. పరికోట విమానములు, కూడళ్ళు మణులచే పొదగబడి విరాజిల్లు చుండెను. వేదికలు వజ్ర, వైఢూర్య ఖచితములై యుండెను.

*15.17 (పదిహేడవ శ్లోకము)*

*యత్ర నిత్యవయోరూపాః శ్యామా విరజవాససః|*

*భ్రాజంతే రూపవన్నార్యో హ్యర్చిర్భిరివ వహ్నయః॥6876॥*
అచటి స్త్రీలు సర్వదా యౌవనముతో విరాజిల్లుచుండిరి. ఆ సుందరీమణులు వస్త్రాభరణములను ధరించి అగ్నిశిఖలవలె వెలుగుచుండిరి.

*15.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*సురస్త్రీకేశవిభ్రష్టనవసౌగంధికస్రజామ్|*

*యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః॥6877॥*

ఆ దేవాంగనల కొప్పులనుండి జారిపడిన నూతన సౌగంధిక పుష్పమాలల పరిమళములను వహించిన మందమారుతములు మార్గములను గుబాళింపుజేయుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*****************

**దశిక రాము**

**నారాయణీయము**

 ప్రథమ స్కంధము - 1వ దశకము 

భగవన్మహిమానువర్ణనం
1-1-శ్లో.
సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం।
అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్||

భావం - పరిపూర్ణమయిన ఆనందాన్ని కలిగించేది, పోలికలేనిది, కాలాతీతమైనది, పరిమితిలేనిది, బంధములతో సంబంధము లేనిది, వేలకొలది వేదాలచే ప్రకాశవంతమైనది, భౌతికదృష్టికి అస్పష్టమైనది,
పురుషార్ధ ప్రధానమైన మోక్షాన్ని ప్రసాదించేది ఐన బ్రహ్మతత్వము సాక్షాత్తు శ్రీకృష్ణుని రూపంలో భక్తజనులను అనుగ్రహించుటకు, గురవాయూరులో అవతరించినది.

1-2- శ్లో.
ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధిశమేవాశ్రయామః||

భావము - దుర్లభమయిన బ్రహ్మ తత్వము శ్రీకృష్ణుని రూపమున అతి చేరువలో గురవాయూరు పురమున అవతరించినది. త్రికరణశుద్ధిగా నిన్ను అర్చించి ఆనందమును పొందక ఇతర దేవతలను ఆశ్రయించుట నిష్ప్రయోజనము. కృష్ణా! ఇహపరమయిన సకలపీడలను నివారించుటకు, ఆత్మభూతుడవగు నిన్ను మాత్రమే ఆశ్రయించెదము.

వ్యాఖ్య -  త్రికరణశుద్ధుడు,   ఆత్మభూతుడు, పురుషార్ధము, బ్రహ్మతత్వం, కాలాతీతం, బంధాలు లేనిది ఇత్యాది గుణాలతో శ్రీకృష్ణ స్తుతిని  శ్లోకాలలో చూశాము.  ఇన్ని కళలు నింపుకున్న స్వామి కనకనే ఆయనని పెంచిన యశోద కూడా ఎదురుగా తన ముందే బాల రూపంలో తచ్చాడుతున్నా  అందీ అందనివాడు గానే కీర్తించింది.

కృష్ణ పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ, సందర్భాన్నిబట్టి పరమాత్మ అనేక నామరూపాల్లో అలరారుతుంటాడు. ఉన్నాడని నమ్మేవారికి ఉన్నట్లుండేవాడు, లేడనేవారి మనోభావాలకు విఘాతం కలగకుండా వారినీ కాపాడేవాడు. రెండూ ఆయనే కాబట్టే ద్వైదీభావాత్మకుడు.

సత్వ-రజస్‌-తమస్‌ అనే మూడు గుణాలున్నవారినీ వారికి తగినట్లు అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని చూపేవాడు. కాబట్టి త్రిగుణాత్మకుడు. నాలుగు దిక్కులా నిండి ఉన్నవాడు. నాలుగు వేదాలూ ప్రస్తుతించేవాడు. సమయాన్ని, భక్తుల మనోభావాల్ని బట్టి ప్రవర్తించేవాడు. అందువల్ల చతురుడు. పంచభూతాల్లో ఆత్మస్వరూపంగా ఉంటూ వాటిని నియంత్రించేవాడు. కనుక, పంచభూతాత్మకుడు. అరిషడ్వర్గాలకు అతీతుడు. అవతారాన్ని బట్టి సప్తఋషుల మన్ననలు సైతం అందుకునేవాడు.

 ఇలా ఆ పరమాత్మ ఒక్కడే అయినా అనేక రూపుడు. ‘ఏకం సత్‌ బహవో వదంతి విప్రాః’ (బ్రహ్మపదార్థం ఒక్కటే అయినప్పటికీ అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా కనిపిస్తుంది) అని వేదాంతులు చెప్పడానికి కారణం అదే. ఆయన జీవులందరి సంరక్షణార్థం అందరికీ చేరువలో, చెంతనే ఉంటాడు. కానీ ఎవరూ అంత సులభంగా గుర్తించలేరు. చేరుకోలేరు. యోగులైనా, భక్తులైనా పొందలేని ఆయన సాక్షాత్కారాన్ని అమాయకులు, అతి సామాన్యులు అత్యంత సులభంగా పొందగలుగు తున్నారు. దానికి కారణం వారి భక్తి తత్పరత.

పరమాత్మ గురించి, ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించేవారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది.

‘దాహార్తి తీర్చుకునేందుకు నీరు, క్షుద్బాధ తీరడానికి ఆహారం, శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి... ఇలా సృష్టిలో ప్రతి అంశానికీ ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే ఆధ్యాత్మిక (గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన), ఆదిభౌతిక (ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం), ఆదిదైవిక (దైవ సంబంధమైన) కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి. ఆ మార్గమే భగవదన్వేషణ, ఆరాధన. ఇదే తప్ప అన్య మార్గం లేదు.

ఆ పరమాత్ముని మనసా (తలంపుతో), వాచా (వాగ్రూపంలో), కర్మణా (ఆయనకే చేస్తున్నాననే భావనతో తోటివారికి సేవ చేయడం రూపంలో) కొలిచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు, మనోనిగ్రహపరులు, పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు. ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.

1..యోగాభ్యాసంతో ఆత్మదర్శనం చేసిన యోగులకు ఆత్మ స్వరూపుడు.

2. వేదాల్లో చెప్పినట్లు కర్మల చేత ఆరాధించినవారికి కామిత ఫలదాత.

3. స్మృతుల (పురాణాల)లో చెప్పిన విధంగా ధర్మాచరణ రూపంలో ఆరాధించినవారికి ధార్మిక ఫలప్రదాత.

4. ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా ఉపాసనాత్మక జ్ఞానం కలిగినవారికి ఆ రూపంగా మోక్షాన్ని ఒసగేవాడు.

ఇలా ఎవరు ఏ మార్గాన తలచినా అది మనస్ఫూర్తిగా చేసినదై ఉండాలి. అలా తమ తమ ధర్మాలు తప్పకుండా నడుచుకుంటూ, సమభావంతో ఉంటూ ఆయన్నే నమ్మి జీవించేవారు- సూర్యుడి రాకతో పెనుచీకటి అంతరించిన విధంగా అన్ని బంధాల నుంచీ విముక్తులు అవుతారు.

ఇంతాచేసి అందరికీ అందినట్లనిపించినా ఎవరికీ అందనంత దూరంలోనే ఉంటాడు. ఈ విషయాన్ని, దానికి కారణాన్ని గురించి ఆయనే స్వయంగా ఒక సందర్భంలో గోపికలతో ఇలా చెప్పాడు.

‘నన్ను సేవించే వారికందరికీ కావలసినవన్నీ ఇస్తాను. సేవించనివారినీ అలాగే ఆదరిస్తాను. అవసరాన్ని బట్టి అంశ, అనుప్రవేశ, ప్రవృత్తి-నివృత్తి రూపాల్లో దర్శనమిస్తాను. అంతేకానీ, నా పూర్ణ
రూపాన్ని ప్రత్యక్షంగా చూపను. అందుకే అందరికీ అందినవాడిలా అనిపించినా ఎవరికీ అందనివాణ్ని’ అని. ఆ మాటలకు తగినట్లే విష్ణురూపుడైన ఆ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ గోపాలకులు పొందారు. కల్మషం లేనివారి స్వచ్ఛమైన మనోభావాలు, ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు.

అదే భావాన్ని ఈ శ్లోకంలో భట్తతిరి వారు చిలికించారు.

  స్వస్తి.సేకరణ

*ధర్మము-సంస్కృతి*
****************

కాలమానం

తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం
3 నిమేశాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్ట
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం
17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం
పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

భాగవతాదారితం 🕉️🕉️

అందరికీ తెలియాల్సిన విషయం తప్పకుండా షేర్ చేయగలరు 🙏🙏
********************

ఆహారం🌷🌷

                                         
👏అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.

మనలోని జీవశక్తి ని పెంపొందించేది అన్నం. 
           
 అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి
వడ్డిస్తున్నారన్న
విషయం కూడా చాలా
ముఖ్యమైనది.

🥀🌹అందు వలననే పూర్వకాలంలో  మడి, ఆచారాల విషయంలో
 ఖచ్చితంగా వుండేవారు.

🌹🌿మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన
దోషాలు నిమిడివున్నాయి.
🥬అర్ధ దోషం ,.                                       🌻 నిమిత్త దోషం.                 
🌺స్ధాన దోషం,                      🌷గుణ దోషం ,             
🌹సంస్కార దోషం.  ఈ ఐదు
దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

🌸 *అర్ధ దోషం:*

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు . భోజనం చేసి ,
సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలో నే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది ,
ఆ మూటలో నుండి
కొంచెం డబ్బు తీసుకుని
తన సంచీలో దాచేశాడు.
తరువాత శిష్యుని వద్ద
 సెలవు తీసుకుని, తిరిగి
తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.
మరునాడు పూజా సమయంలో తను చేసిన
పనికి సిగ్గుతో పశ్చాత్తాపం
చెందాడా సాధువు.
తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే
తనకా దుర్బుధ్ధి కలిగిందని
రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు
అర్ధం చేసుకున్నాడు.
వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు.
 శిష్యుడిని   ఎలాటి వృత్తి ద్వారా డబ్బు
సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని,
"నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు. "అని తలవంచుకొన్నాడు.
ఈ విధంగా సన్మార్గంలో
సంపాదించని డబ్బు తో
కొన్న పదార్థాలతో , తయారు చేసిన  ఆహారం
భుజించడమే అర్ధ దోషం.
మనం న్యాయం గా సంపాదించిన దాని
తోనే ఆహారం తయారు
చేసుకుని , భుజించడం
ముఖ్యం.

*🌸నిమిత్త దోషం🌸*

 మనం తినే ఆహారాన్ని
వండేవారు కూడా మంచి మనసు కలవారైవుఇంటికి
వారు సత్యశీలత కలిగి
దయ, ప్రేమ కల
మంచి స్వభావము కలిగిన వారిగా వుండాలి.
వండిన  ఆహారాన్ని క్రిమికీటకాలు , పక్షులు జంతువులు తాక కూడదు.
ఆహారం మీద దుమ్ము,
శిరోజాలు  వంటివి పడ కూడదు.

🌹🥀అపరి శుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది.
దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి
దుష్ట గుణాలు అవతలివారికి  కలుగుతాయి.

🌺 భీష్మాచార్యుల వారు కురు క్షేత్ర యుధ్ధం లో
బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య
మీద  ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు.
వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

🍁🌾అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది.ఇప్పుడు ఇంత వివేకం గా ఆలోచిస్తున్న భీష్ముడు
ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ,ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.
🌸🌿ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు
దుర్యోధనుని, ప్రాపకంలో 
వారిచ్చిన ఆహారం భుజిస్తూ  వచ్చాను.
నా స్వీయ బుధ్ధిని ఆ
ఆ ఆహారం  తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా
బయటికి పోయి, నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.
నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను.
అన్నాడు భీష్ముడు.

🌻🌿చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన  మనిషిలోని మంచి
గుణములు నశించి
'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.
*🌸స్ధాన దోషం*
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో,
అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి.
వంట చేసే సమయంలో
అనవసరమైన చర్చలు
వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.
యుధ్ధరంగానికి , కోర్టులు ,రచ్చబండలు వున్న చోట్లలో వండిన
వంటలు అంత మంచివి కావు.

🥬🥀దుర్యోధనుడు  ఒకసారి
యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు.
కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును
నిరాకరించి, విదురుని
ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని
చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు
చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొట్రుపాటు పడిఅరటి పండుతొక్క  ఒలిచి,
పండు యివ్వడానికి బదులుగా తొక్కని  అందించింది.కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో
భుజించాడు.
ఇది చూసిన విదురుడు
భార్య వైపు కోపంగా చూశాడు.

కృష్ణుడు,  " విదురా!  నేను ఆప్యాయత తో కూడిన ప్రేమకోసమే ఎదురుచూస్తున్నాను.
నిజమైన శ్రధ్ధాభక్తులతో యిచ్చినది అది
కాయైనా ,  పండైనా, ఆకైనా,  నీరైనా, ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను.' అని
అన్నాడు.

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో
వడ్డించాలి.

*🌻గుణ దోషం :*

మనం వండే ఆహారం
సాత్విక ఆహారంగా వుండాలి.
సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని
కలిగిస్తుంది. రజోగుణం
కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. తామస ఆహారం👏👏👏

        🌷సర్వేజనాః సుఖినోభవంతు🌷
******************

చమత్కార పద్యం*

ఒక బ్రాహ్మణుడు ఒక ధనికుని ఇంటికి వెళ్ళాడు. ఆ ధనికుడు సంపదతో పాటు సంస్కారం వున్నవాడు. ఆ బ్రాహ్మడికి కడుపునిండా షడ్రసోపేతమైన భోజనం పెట్టి, 
చక్కని పట్టు వస్త్రాలను యిచ్చి ఘనంగా సత్కరించాడు.

ఇంకేముంది కడుపునిండి, 
సత్కారం జరిగే సరికి ఆశీర్వచన శ్లోకం తన్నుకుంటూ వచ్చింది.

విహంగో వాహనం యేషా౦, త్రికంచధరపాణయః
పాసాల సహితా దేవాః సదాతిష్ఠన్తు తే గృహే

పక్షులు వాహనాలుగా కలవారూ, త్రికములను ధరించిన వారునూ, పాసాలతో నిండిన వారునూ, అగు దేవతలు మీ యింట ఎప్పుడూ వుందురు గాక!

ఇదేమి ఆశీర్వచనమండీ
అంటారేమో ఒక్క క్షణం ఆలోచించండి మరి.


వి అంటే పక్షి, హం అంటే హంస, గో అంటే ఎద్దు, పక్షి వాహనంగా కలవాడు విష్ణువు,
హంస వాహనుడు బ్రహ్మ, ఎద్దు వాగాహనం గలవాడు శివుడు,
 అంటే...

 బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ముగ్గురూ త్రికంచ,త్రికం ను ధరించినవారు.

త్రి అంటే త్రిశూలం, కం అంటే శంఖము, చ అంటే చక్రములను ధరించినవారు
త్రిమూర్తులు కదా!

త్రిశూల ధారి శివుడు, శంఖ ధారి బ్రహ్మ, సుదర్శన ధారి విష్ణువు

ఈ ముగ్గురూ పాసములతో కూడిన దేవతలు పా అంటే పార్వతి, స అంటే సరస్వతి,ల
అంటే లక్ష్మీ దేవి . పార్వతి,సరస్వతి,లక్ష్మీదేవి తో కూడిన దేవుళ్ళు మీ యింట ఎల్లప్పుడూ వుందురుగాక! అని అర్థం.

సరస్వతి,లక్ష్మీ పార్వతులనడంలో విద్యలు, ఐశ్వర్యములు, సౌభాగ్యములు మీ యింట వుండాలి అని అర్థం. శంఖ ,చక్ర త్రిశూలములు ధరించిన వారు అనడం వలన శత్రు బాధలు,రాక్షస బాధలు మీకు వుండవు అని భావము.

 త్రిమూర్తులు వారి భార్యలతో మీ ఇంట వుందురు గాక!అనటం తో సర్వ సౌఖ్యాలు,
విద్యలతో పాటు ,శాశ్వతమైన
పరంధామము మీకు లభించుగాక! అని చమత్కారమైన ఆశీర్వాదము

----చమత్కార శతం పుస్తకము నుండి..
*****************

- పాలవెల్లి ఎందుకు కడుతారు!!


వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడుతారు!!

వినాయకచవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి.



- ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.



- గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా! ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము.



- గణపతి అంతే గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు.



- పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట.



- ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది.



 - గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు.... పండగ అంగరంగవైభవంగా సాగిపోయినట్లే! పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.🙏
*************************

*ఆత్మ దర్శనం* 💥

*మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం*
 *చెయ్యలెము.*

 *మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది.  అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం.*

 *మన మనసు మనకు ఆలోచననూ, విచక్షణనూ, కోరికలనూ, అవగాహననూ, విమర్శనాత్మక దృష్టినీ,*

 *న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ, ఎన్నింటినో ఇచ్చింది. దానివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం!*

 *భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం మనసు.*

 *ఆయన తన మనసును*

 *ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు. మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి* *ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది.*

 *ద్యానం, మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది. దాని నియంత్రణలో ఉంచుకోలేక పోతే అది మనలని వినాశనం వైపు నడిపిస్తుంది.*

 *ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు. ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు.*

 *మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం. జీవిత లక్ష్యాలను సాధించగలం. దాని మానాన దానిని వదిలేస్తే*
( *శిక్షణ లేని మనసు ) అది మన వినాశనానికి హేతువులైన దురాశ, పగ, ప్రతీకారం, కామం, క్రోధం, గర్వం,* *అహంభావం ,  ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది.*

 *మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి. అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి* . *మాయను అతిక్రమిస్తే ఆనందమనే భవనంలో హాయిగా విహారం చేయవచ్చును. ఇంత కధ నడిపించిన ఆ ఓక రూపాయి ఏమిటో కాదు, మనం చేసుకున్న పుణ్యం.*

 *జగన్నాటకం అనే సంత లోకి వచ్చిన ఈ జీవుడు ఆ దేవుడిని చేరుకునేలోపే మేల్కొంటే నిత్యానంద స్వరూపుడి దివ్య దర్శన భాగ్యం మనకు కలగతుంది.*
 *సర్వేజనా సుఖినోభవంతు.*💥

 *సే;వేముల*
**************

వినాయక పూజ

ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను (బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసినది) అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఒషధీయ విలువలున్న పత్రాలు.

ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ప్రతి ఇంటా యథావిధి గణపతిని పత్రాలతో పూజించి ఆయనకు ప్రీతికరంగా ఉండ్రాళ్ళు, కుడుములు, వెలగ, అరటి, కొబ్బరి మొదలైన ఫలాలు నివేదించాలి.

పాలవెల్లి అలంకరణమే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగ, కమల మొదలైన పళ్ళు, కాయలు పాలవెల్లి నుండి వ్రేలాడదీసి, మామిడి తోరణాలు, చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి సర్వసస్యాధిదేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని పూజిస్తారు. ఈస్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయి. వెంటనే దయ చూపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు.
********************

పత్రాలు ప్రధానమైనవి.

*వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.*

అయితే ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

*1. మాచీ పత్రం:* మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.

*2. దూర్వా పత్రం:* దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

*3. అపామార్గ పత్రం:* తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

*4. బృహతీ పత్రం:* దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

*5. దుత్తూర పత్రం:* దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

*6. తులసీ పత్రం:* హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

*7. బిల్వ పత్రం:* బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.

*8. బదరీ పత్రం:* బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.

*9. చూత పత్రం:* చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.

*10. కరవీర పత్రం:* దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

*11. మరువక పత్రం:* దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

*12. శమీ పత్రం:* జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

*13. విష్ణుక్రాంత పత్రం:* ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

*14. సింధువార పత్రం:* సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

*15. అశ్వత్థ పత్రం:* రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.

*16. దాడిమీ పత్రం:* దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

*17. జాజి పత్రం:* ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.

*18. అర్జున పత్రం:* మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.

*19. దేవదారు పత్రం:* దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

*20. గండలీ పత్రం:* దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.

*21. అర్క పత్రం:* జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.

*ఓం గం గణపతయే నమః*
******************

మాధుర్ మహాగనాపతి ఆలయం, కేరళ

ఆశ్చర్యపోనవసరం లేదు, నిజం ఏమిటంటే గోడపై ఉన్న విగ్రహం సొంతంగా పెరగడం ప్రారంభించి ప్రసిద్ధ గణపతి ఆలయంగా మారింది
   మాధుర్ మహాగనాపతి ఆలయం, కేరళ
 
శివ-పార్వతి నందన్ గణపతి గురించి మనమందరం చాలా కథలు చదివి విన్నాం. కానీ ఇక్కడ మనం వాటికి భిన్నంగా ఉన్న ఆలయం గురించి మాట్లాడుతున్నాము. ఈ ఆలయంలో  విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు, కానీ ఇక్కడ అది గోడ నుండి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక ఆలయం

ఈ ఆలయం మధురవాహిని ఒడ్డున ఉంది

మాధుర్ ఆలయం యొక్క పురాణాలు
మాధుర్ ఆలయం మొదట శివాలయం మరియు అతను ఈ ఆలయానికి ప్రధాన భగవాన్ శివుడు  మాత్రమే. పురాణాల ప్రకారం, స్వయంగా వ్యక్తమయ్యే శివలింగాన్ని 'మాధారు' అనే వృద్ధ మహిళ కనుగొంది. అందువల్ల ఈ ఆలయం మాధుర్ ఆలయంగా ప్రసిద్ది చెందింది.

మరో పురాణం మాధుర్ ఆలయంలోని గణేశ విగ్రహం గురించి. ఒక చిన్న బ్రాహ్మణ కుర్రాడు ఆలయ గోడపై ఒక చిన్న గణేశ చిత్రాన్ని చెక్కాడని చెబుతారు. తరువాత, అది పెరిగి గణేశుడి పెద్ద విగ్రహంగా మారింది. బాలుడు అతన్ని బొడ్డజ్జా లేదా బొడ్డ గణేశ అని పిలవడం ప్రారంభించాడు. తరువాత, ఈ విగ్రహానికి మదనాంతేశ్వర సిద్ధి వినాయక అని పేరు పెట్టారు
అప్పుడు గణపతి పరిమాణం పెరగడం ప్రారంభమైంది

మాధుర్ మహాగణపతి ఆలయం కేరళలోని కాసరగోడ్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మొగ్రాల్ అనగా మధువాహని నది ప్రవహిస్తుంది.

ఆలయ గర్భగుడి గోడపై చేసిన గణపతి ఆకారం క్రమంగా దాని పరిమాణాన్ని పెంచడం ప్రారంభించిందని చెబుతారు. క్రమంగా  చాలా పెద్దదిగా పెరిగింది. అప్పటి నుండి, ఈ ఆలయం గణేశుడి ప్రత్యేక ఆలయంగా ప్రసిద్ది చెందింది.

ఆలయ చెరువు ఔషధ లక్షణాలతో నిండి ఉంది

మాధుర్ ఆలయ చరిత్ర
చరిత్రలో ఒక రికార్డు టిప్పు సుల్తాన్ కాసరగోడ్ మరియు మాధుర్ ఆలయంపై దాడి గురించి మాట్లాడుతుంది. స్థానిక చరిత్ర ప్రకారం టిప్పు సుల్తాన్ మాధుర్ ఆలయాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆలయ ప్రవాహం (మధువహిని) దగ్గర ఉండగా, నీళ్ళు తాగాడు, అకస్మాత్తుగా ఆలయానికి నష్టం జరగకుండా తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.

మాధుర్ ఆలయంలో శివ మరియు గణేశుడి మందిరం ఉంది. ఇది 'గజా ప్రిస్టా' (ఏనుగు వెనుకభాగాన్ని పోలి ఉంటుంది) శైలిలో నిర్మించిన మూడు అంచెల భవనం. అందమైన నిర్మాణం ఈ ప్రదేశానికి చాలా మందిని ఆకర్షిస్తుంది. ఇక్కడ గణేశుడికి ప్రార్థనలు చేసేటప్పుడు ప్రసిద్ధ స్థానిక వంటకం 'అప్పా' అందిస్తారు. 'మూడప్పం' - (గణేశుడు 'అప్పా' ధరించి) 

శివుడు ప్రధాన దేవత అయినప్పటికీ, ఈ ప్రదేశం గణేశ ఆలయానికి ప్రసిద్ధి చెందింది
గణపతిని పూజించడం వల్ల బుధవారం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసు

 గణేశుడి విగ్రహం తీపి బియ్యం, నెయ్యి మిశ్రమంతో కప్పబడి ఉంటుంది.
   * కాసర్‌గోడ్‌ నుంచి ఆలయం 7 కి.మీ. దూరంలో ఉంది.

* కాసర్‌గోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధూర్‌కు వివిధ వాహనాల ద్వారా చేరుకునే సౌలభ్యముంది.

* మంగళూరు విమానాశ్రయం ఇక్కడ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి ఆలయానికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

ఓం గం గణపతయే నమః
*********************

వరాహ జయంతి*

భగవంతుడు దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు అవసరమైనప్పుడు లోకంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలా అవతరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన అవతారాలు పది. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అనే పేర్లతో దశావతారాలు ప్రాచీన గ్రంథాల్లో కనబడుతున్నాయి.

దశావతారాల్లో మూడోదైన వరాహావతారం హిరణ్యాక్షుడి చెర నుంచి భూమిని రక్షించడానికి సంభవించిందని పురాణేతిహాసాలు వివరిస్తున్నాయి. పూర్వం దితి కుమారుడు, హిరణ్యకశిపుడి సోదరుడు అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు అహంకారంతో చెలరేగిపోయి భూమిని పాతాళానికి తోసివేశాడు. తన అన్నను చంపిన విష్ణువు అంటే ఇతడికి ద్వేషం. ఆ కారణంగా విష్ణువును వధించాలని వైకుంఠానికి వెళ్తూ ఉండగా, దారిలో నారదుడు ఎదురయ్యాడు. విష్ణువు ఇప్పుడు వైకుంఠంలో లేడని, యజ్ఞవరాహ రూపంలో పాతాళంలో ఉన్నాడని నారదుడు హిరణ్యాక్షుడికి చెప్పాడు. అప్పుడు హిరణ్యాక్షుడు విష్ణువును వెదుకుతూ పాతాళానికి వెళ్లాడు. అక్కడ వరాహరూపంలో ఉన్న విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడు. వరాహరూపంలో ఉన్న విష్ణువు తన వాడి అయిన కోరలతో కుమ్ముతూ ఆ దుష్టరాక్షసుణ్ని వధించాడు. అనంతరం పాతాళంలో పడివున్న భూమిని తన పంటికొసపై ఉద్ధరించి, పైకి తెచ్చి కాపాడాడు. భూదేవికి హిరణ్యాక్షుడి పీడ తొలగిపోయింది. దేవతలు సంతోషించారు. భూలోకవాసులు ఆనందించారు. వరాహమూర్తి అనుగ్రహంతో స్వాయంభూ వసువు భూలోకాన్ని ధర్మబద్ధంగా పాలించాడు. జగత్కల్యాణం కోసం మహావిష్ణువు వరాహరూపంలో అవతరించిన ఈ పవిత్ర దినాన ‘వరాహ జయంతి’ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆచారంగా మారింది. ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్లపక్ష తృతీయనాడు వరాహక్షేత్రాల్లో వైభవంగా వరాహ జయంతిని నిర్వహించడం, భక్తులు ఒక పర్వదినంగా పూజలు చేయడం పరిపాటి. కొందరు చైత్రబహుళ త్రయోదశినాడు వరాహజయంతిని నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లోని ఆచారాలను, సంప్రదాయాలనూ అనుసరించి ఈ వైవిద్యం ఉంటుంది.

వరాహావతార వైశిష్ట్యాన్ని తెలిపే వరాహ పురాణంలో కలియుగార్చావతారుడైన శ్రీ వేంకటేశ్వరుడికి తిరుమలలో నివాసస్థలం ఇచ్చింది వరాహస్వామేనన్న ప్రశస్తి ఉంది. అందుకే నేటికీ తిరుమలను వరాహక్షేత్రం అని పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వరుణ్ని దర్శించుకోవడానికి ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలనే నియమం కూడా ఉంది. స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన వరాహస్వామి ఆలయం తిరుమలకు వెళ్లే యాత్రికులకు ప్రథమ పూజ్యస్థానం.

కోరలతో నేలను తవ్వుకుంటూ వెళ్లే వరాహం మానవుడికి కృషీవలత్వాన్ని బోధిస్తోంది. నేలను తవ్వి, సాగుచేసి, రత్నాల వంటి పంటలు పండించాలని చెబుతోంది. అవసరమైతే పంటికోరలపై భూమిని మోసినట్లు, భారాన్ని మోయాలని ప్రబోధిస్తోంది. ఆపదలో మునిగిపోయినవారిని లోతుల్లోకి వెళ్లి రక్షించాలని మార్గదర్శనం చేస్తోంది. మహిమ గల వరాహస్వామి ఎందరికో ఆరాధ్య దైవమై ఈ భూమండలంలోని అనేక క్షేత్రాలలో కొలువుదీరి ఉన్నాడు. వరాహస్మరణం సకల పాపహరమే కాకుండా, విశ్వకల్యాణకారకం కూడా!
***********************