1) సత్ప్రవర్తన అనే సముద్రాన్ని దాటడానికి సత్యం ఓడ వ లె తోడ్పడుతుంది.
2) క్షమా గుణం కలిగిన వారిని అసమర్ధులుగా పలువురు భావిస్తుంటారు. వ్యక్తిత్వానికి మరింత అందాన్ని, శోభను కలిగించేది క్షమా గుణమే.
3) ఎక్కడా ఎప్పుడూ పరుష వాక్కులు పలుకక పోవడం , పాపపు పనులు చేయక పోవడం ఈ రెండు లక్షణాల చేత పురుషుడు ఉ త్త ముడిగా మన్నన లం దుకుంటాడు.
4) సమర్థుడు అయి ఉండీ శాంతం వహించే వాడు, బీద వాడయినప్పటికీ తనకు ఉన్నంతలో ఇచ్చే వాడు పుణ్యాత్ముడు .
5) న్యాయ బద్ధంగా సంపాదించిన డబ్బును అనర్హులకు ఇవ్వడం, అర్హులకు ఇవ్వక పోవడం వల్ల రెండు విధాలా కీడు జరుగుతుంది.
6) స్త్రీ, జూదము, మద్యపానం, వేట, పరుషంగా కఠినంగా నిందాపూర్వకంగా మాట్లాడడం, అతి క్రూరంగా దందించడం, వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అనే ఈ ఏ డు విషయాల పట్ల అతిగా ఆసక్తి చూపడం అ నర్థ దాయకం. వీటిని సప్త వ్యసనాలుగా పెద్దలు పేర్కొన్నారు.
.7) తన హోదాకు తగిన వస్త్రాలను ధరించడం, తనను తానే కీర్తించుకోకుండా ఉండడం, చేసిన దానం గురించి బాధ పడకుండా ఉండడం, బ్రతుకు గడిచే మార్గం లేకపోయినా పెడ దారులు పట్టకుండా ఉండడం ఇవి మానవునికి మేలు చేస్తాయి. సత్ప్రవర్తన గా భావించ బడతాయి.
8). స్నేహమూ, మాట,బలం, వివాదం, వివాహం, యుద్ధం తనతో సమానులైన వారితోనే తగిన వవుతాయి. తమ కంటే అధికులతో కానీ అల్పులతో కానీ వాటిని కలిగి ఉండడం తగిన పని కాదు. అంటే తమ తమ స్థాయికి తగిన వారితోనే వాటిని కలిగి ఉండాలని భావం.
( ఇది ఉద్యోగ పర్వం లోని విదుర నీతి )
( సే కరణ ,: ఎం. వీ.ఎస్ శాస్త్రి ధర్మా చార్య, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఒంగోలు 9948409528)
*****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి