21, ఆగస్టు 2020, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

శ్రీమాత్రేనమః*
*70వ నామ మంత్రము*

*ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః*

*కిరిచక్రము* అను రథము నధిరోహించిన దండనాథ (వారాహి) అను దేవిచే సేవింపబడు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకులకు అఖండమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపద నిచ్చి, జీవనయానంలో సుఖసంతోషములు, ఆధ్యాత్మిక జ్ఞానమార్గంలో బ్రహ్మానందమును ఆ తల్లి ప్రసాదించి తరింపజేయును.

కిరి అనగా వరాహము. కిరిచక్రరథమును అధిష్టించిన దేవత వారాహి.  కిరిచక్రరథము వరాహరూపంలో ఉండి వరాహములచే లాగబడుతుంది. ఈ రథమునధిష్టించిన వారాహి చేతిలో దండమును ధరించి ఉంటుంది. అందుకే వారాహిని దండనాథా అని కూడా అంటారు "కిరిచక్రరథారూఢా *దండనాథా* " అనగా కిరిచక్రరథమునధిరోహించిన దండనాథా (అను దేవత) పురస్కృతా అనగా సేవింపబడు లేదా పూజింపబడు. కిరిచక్రరథమునధిరోహించిన దండనాథ (వారాహి) యను దేవతచే సేవింపబడునది (పూజింపబడు జగన్మాత) యని ఈ నామ మంత్రములోని భావము.

కిరిచక్రరథమునకు ఐదు పర్వములు (ఆవరణలు) గలవు. ఈ ఆవరణలను అంతస్తులు అందురు. *కిరిచక్రరథేంద్రస్య పంచపర్వసమాశ్రయాః| దేవతాశ్చ శృణుప్రాజ్ఞ నామాని శృణుత్వాంజయః॥॥*

ఈ కిరిచక్రరథమునందు గల పర్వములందు (అంతస్తు లందు) వివిధ దేవతలు ఆయుధాలు ధరించి ఉందురు.

ఐదవ ఆవరణమునందు నల్లగా, వరాహమునకు ఉండే కోరలు వంటివి గలిగి *దండినీ* అని చెప్పబడే వారాహీ దేవత ఉంటుంది. కిరిచక్రరథ సేనకు పండ్రెండుమంది సేనానులు గలరు. వారు 1) పంచమి, 2) దండనాథా, 3) సంకేతా, 4) సమయేశ్వరీ, 5) సమయసంకేతా, 6) వారాహీ, 7) పోత్రిణీ, 8) శివా, 9) వార్తాళీ, 10) మహాసేనాని, 11) ఆజ్ఞా చక్రేశ్వరీ, 12) అలిందినీ. ఈ వారాహీ దేవతయే అమ్మవారికి ప్రధాన సేనాని. ఈ వారాహి దేవతకు ఉపాసనకూడా కలదు. కాశీ క్షేత్రంలో వారాహీ మందిరం గలదు. ఈ వారాహీ దేవతకు బీజాక్షరం *హూం* మనలో పోట్లాడే స్వభావంగలది ఈ వారాహి. అందుకే మనం ఎవరిపైనైనా కోపం వస్తే *హుం* కరించుతాము. అనుకోకుండానే మన గొంతుకనుండి   *హూం* అను బీజాక్షరం వచ్చిందికదా! అంటే మనలో కోప స్వభావంగల దేవత అయిన *వారాహి* ఉందికదా!

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

.నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
***********************

కామెంట్‌లు లేవు: