12, డిసెంబర్ 2024, గురువారం

ఆవు మీద వ్యాసం

 ఆవు మీద వ్యాసం:


అనగనగా ఒక చదువుకునే ఉత్తమ విద్యార్థి వున్నాడు. అతను పాఠశాలలో చదువుతున్నాడు. చిన్నవాడే కానీ అతనికి ఉండాల్సిన దానికన్నా తెలివితేటలూ ఎక్కువగా వున్నాయి. కొన్నిసందరాలలో మనకు తెలివి ఎక్కువైతే ఏమవుతుందో చెప్పటానికి ప్రయత్నం.

 తెలుగు మాస్టారు గారు పిల్లలకు వివిధ విషయాంశాలతో పాటు వ్యాస రచనకు సమందించిన విషయాలను కూడా పేర్కొన్నారు ఉదా .  ఆవు, బడి, విమానం, రైలు, మొదలగునవి. అయితే మన ఆదర్శ విద్యార్థి వాటినన్నిటిని ఒక్కసారి చూసిన తరువాత  ఆవు తనకు నచ్చింది కాబట్టి దానిని ఎంపిక చేసుకొని దాన్ని చక్కగా చదివి గుర్తుపెట్టుకున్నాడు. మనసులో పరీక్షకు వెళ్లే ముందు తన ఇష్ట దైవాన్ని పరి పరి విధాలుగా ప్రార్ధించాడు కారణం తన పరీక్షలో వ్యాసం కేవలం ఆవు మాత్రమే రావాలి. 


కానీ మన విద్యార్థి మోర దేముడు ఆలకించ నట్లున్నాడు ఆ పరీక్షా పేపర్లో వ్యాసానికి సంబందించిన ప్రశ్న ఒకటి కాదు రెండు వచ్చాయి. అందులో ఒక్కటికూడా ఆవు లేదు అవి ఒకటి విమానం, రెండు రైలు. అరె చచ్చిందిరా గొర్రె అని మనస్సులో అనుకున్నాడు మన మహానుభావుడు అదికూడా ఆ రెండు ప్రశ్నలు తప్పనిసరి. ఇప్పుడు ఏమిచేయాలి, ఇప్పుడు ఏమిచేయాలి ఇదే సమస్య మెదడంతా తిరుగుతున్నది. మన విద్యార్థి ఓటమిని ఒప్పుకునే రకం కాదు ఎట్లాగయినా ఆ రెండు ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి అదికూడా మంచిగా అని నిర్ణయించుకున్నాడు. అతను ఆ రెండు వ్యాసాలు ఎలా వ్రాశాడో చూద్దాం. 


1) విమానం: విమానం అనగానే తానూ విమానం శబ్దం విని ఆకాశంలో పోయే విమానం గుర్తుకు వచ్చింది. వెంటనే వ్రాయటం మొదలు పెట్టాడు.విమానం చాలా పెద్దగా ఉంటుంది. దానిలో చాలామంది ప్రయాణించ వచ్చు. అది గాలిలో ఎగురుతుంది. అంతమటుకు చక్కగా వ్రాసాడు. ఇక ఆ పైన పెన్ను నడవటంలేదు. ఒక్కనిమిషం అటు ఇటు చూసాడు ఎవరి పేపరు వాళ్ళు వ్రాసుకుంటున్నారు. మాస్టారు తననే చూసాడు రామా రావు సిట్రియేట్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమి చేయాలి. మనసులో పరిపరి ఆలోచనలు ఎట్లాగైనా ప్రశ్నకు సమాధానం వ్రాయాలి అంతేకాదు ఇంకోటి అదే రైలు గూర్చి కూడా వ్రాయాలి. దేముడా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతావు. దేముడిమీద కొంత సేపు భక్తి, కొంత సేపు తనకు అనుకూలించనందుకు కోపం. సమయం అయిపోతూవుంది.  ఇంతలో ఇవ్వన్నీ తరువాత చూసుకోవచ్చు ముందు ఈ గండం గడవటం ఎట్లారా భగవంతుడా. ఇక ఆగలేదు అప్పుడు సమయస్పూర్తి చూపించాడు మన రామారావు.పెన్ను పట్టుకొని చక చకా వ్రాయటం మొదలు పెట్టాడు. అది చూసిన మాస్టారుకుడా మన రామా రావు ఇందాక పాపం సమాధానం కోసం ఆలోచించాడులే అని అనుకున్నారు. ఇంతకూ మన రామా రావు వ్రాసింది ఏమిటి చుడండి.

విమానం గాలిలో ఎగురుతుంది దగ్గర ఆగాడు ఇప్పుడు దాని తరువాత విమానానికి కిటికీలు ఉంటాయి,  ఆ కిటికీలనుండి చుస్తే క్రింద పచ్చిక బయళ్లు ఉంటాయి. అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుంది.  ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. సాగుతూనే వున్నది ఒక్కసారి ఫై నుండి క్రిందికి పేజీ చూసాడు తనను తానె నమ్మలేక పోయాడు పేజీ మొత్తం నిండింది అరె నేను చాలా పెద్ద వ్యాసం వ్రాసాను అని తనను తానె పొగుడుకున్నకు. ఈ పరీక్షల్లో మొదటి ర్యాంకు నాకు రావటం ఖాయం అని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇక్కడితో కథ అయిపోలేదు ఇంకా రెండో వ్యాసం అదే రైలు వ్యాసం వ్రాయాలి అది యెట్లా వ్రాశాడో చూద్దాం.

ఇప్పుడు రామారావు మోహంలో ఎంతో దైర్యం, ఆత్మా విస్వాసం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఈ పిల్లవాడికి తెలియని ప్రశ్న ఏది లేదు అని అందరు అనుకునేలా వుంది అతని ముఖ వర్చస్సు. ఇక రైలు వ్యాసం ఇలా సాగింది.

రైల్వే స్టేషనులో రేలు వచ్చి ఆగుతుంది వెంటనే అందరు రైలు ఎక్కుతారు అది చుకు చుకు అని బయలుదేరుతుంది. రైలుకి రెండువైపులా కిటికీలు ఉంటాయి. (భగవంతుడా రైలుకి కూడా  కిటికీలు పెట్టి నన్ను రక్షించావు అని మనసులో అనుకున్నాడు) ఆ కిటికీలలోనుంచి బయటకు చుస్తే పచ్చిక బయళ్లు ఉంటాయి. అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుంది.  ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. ఇలా సాగుతూనే వున్నది మన రామారావు జవాబు పత్రం మీద వ్యాసం. ఎట్టకేలకు రామారావు రెండు వ్యాసాలను తన సమయస్ఫూర్తితో సంపూర్ణంగా వ్రాసినట్లు ఆనందపడ్డాడు. ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ప్రతి సాధకుడు కూడా ఈ కధలోని రామారావు లాగానే ప్రవర్తించాలి అది యెట్లా అంటే తానూ తన మనస్సు, బుద్ది ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని మీదనే లగ్నాత చెంది ఉండాలి ఏరకంగా అయితే రామారావు మనస్సు పూర్తిగా ఆవుతో జత చేయపడి తానూ వ్రాసే ప్రతి వ్యాసాన్ని ఆవుతో కలిపాడా అదే విధంగా మన మనస్సు బాహ్యంగా ఏ ఏ విషయాలమీద ఉన్నాకూడా చివరకు అది పరమేశ్వరునిమీదకు మాత్రమే మళ్ళాలి. ఆలా మనం మన మనస్సుకు శిక్షణ ఇస్తే తప్పకుండ ఇస్తే నిత్యము పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులము అవుతాము తత్వారా మోక్ష మార్గము మనకు సుగమం అవుతుంది. కాబట్టి సడక మిత్రమా ఈ విధంగా జీవనాన్ని గడుపుతే మోక్షార్థులము కాగలము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 116*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


 నేటితో శ్రీ కాళహస్తీశ్వర *శతకము పూర్తి అయినది* ...

.

  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే*

*కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే*

*వింతల్మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల గానప్పుడే*

*చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!!!*


         *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 116*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఇంకా పండ్లు ఊడిపోకమునుపే, శరీరములో సత్త్వము ఉన్నపుడే, స్త్రీలు ముదిమివల్ల తమను అసహ్యించుకోక మునుపే, (అనగా అన్నిపనులు చేయుటకు శక్తి నశింపకముందే) ముదిమి మీదపడక ముందే, తనువులో వింతలు ( క్రొత్త రోగములుచేత శరీరములో చాల మార్పులు రాకముందే) పుట్టకముందే నీపాదపద్మములను ధ్యానించి తరించు మార్గము నన్వేషింపవలెను. ముదుసలితనము వచ్చిన తరువాత ఏ పని చేయుదమన్నను శరీరము సహకరించదు గావున ముందే జాగ్రత్తగలవాడై మానవుడు ప్రవర్తింపవలెను. శ్రీకాళహస్తీశ్వరా!*


✍️🌷🌹🌺🙏

శ్రీ మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 957


⚜ కేరళ : చెంగన్నూర్  : అలెప్పి


⚜ శ్రీ మహాదేవ ఆలయం



💠 చెంగన్నూర్ మహాదేవర్ ఆలయం

 అల్లప్పుజ జిల్లాలో ఉన్న పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 


💠 ఇది వృత్తాకార గర్భగుడితో విశాలమైన ఆలయ సముదాయం.

ఈ క్షేత్రం మహాదేవ దేవాలయంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, శివుడు మరియు పార్వతి దేవికి సమానమైన ప్రాముఖ్యత ఉంది.


💠 ఈ ఆలయంలో శివుడు మరియు పార్వతి దేవి ప్రధాన పాత్రలు. ఇతర దేవాలయాల నుండి భిన్నంగా ఈ  ఆలయంలో రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 

శివుడు తూర్పు ముఖంగా, 

దేవి పశ్చిమాభిముఖంగా ఉన్నారు. 


💠 ప్రధాన మందిరం శంఖు ఆకారపు రాగి పూతతో ఉంటుంది. దేవి యొక్క ప్రధాన విగ్రహం ఐదు లోహాల మిశ్రమంతో (పంచలోహం) తయారు చేయబడింది . శివలింగం, అర్ధనారీశ్వర చిత్రంతో కూడిన బంగారు పలకతో కప్పబడి ఉంటుంది.


💠 ఆలయం ముందు ఉన్న ముఖమండపం మరియు ఈ ఆలయంలోని ఇతర మండపాలు అద్భుతమైన చెక్కతో నిండి ఉన్నాయి.


💠 ఈ ఆలయం యొక్క ఆసక్తికరమైన నమ్మకం మరియు పండుగ త్రిపుతరట్టు , ఇది సంతానోత్పత్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. 


💠 ఈ ఆలయంలో, శివుడు మరియు పార్వతి దేవి సగం పురుషుడు-సగం స్త్రీ 'అర్ధనారీశ్వర' రూపాన్ని తీసుకుంటారు. 

ఈ ఆలయ నిర్మాణం మరియు ప్రారంభానికి సంబంధించి వివిధ పురాణగాథలు ఉన్నాయి.


💠 పరశురాముడు ప్రతిష్ఠించిన 108 క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మరికొందరు పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని 'పెరుంథాచన్' తన అధిపతుల ఆదేశం మేరకు నిర్మించాడు. 

ఈ ఆలయం ఒకప్పుడు అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది మరియు తరువాత, ట్రావెన్‌కోర్ రాజులు దీనిని పునర్నిర్మించారు, తంజావూరు నుండి నిపుణులైన మేస్త్రీలు మరియు వడ్రంగుల సేవలను చేర్చుకున్నారు. మూడు-అంచెల ముఖ భాగం సాంప్రదాయ కేరళ నిర్మాణ శైలిలో ఉంది. మంటల నుండి బయటపడిన పురాతన ఆలయ గర్భగుడి ఇప్పుడు కొత్త నిర్మాణంలో భాగం.


💠 ఈ ఆలయం పార్వతీ దేవి యొక్క ఋతుస్రావంతో ముడిపడి ఉంది. 

అమ్మవారి వస్త్రంపై రుతుస్రావం గుర్తు కనిపించినప్పుడు నాలుగు రోజుల ప్రత్యేకమైన పండుగను జరుపుకుంటారు.

అందుకే ఈ ఆలయాన్ని శక్తి పీఠంగా కూడా పరిగణిస్తారు .


💠 అమ్మవారి ఋతుచక్రం ప్రారంభంలో పండుగ ప్రారంభమవుతుంది. 

ఆ తర్వాత మూడు రోజుల పాటు గర్భగుడి మూసివేయబడుతుంది. నాల్గవ రోజున, దేవతను అభ్యంగన స్నానం కోసం వేడుకగా నదికి తీసుకువెళతారు. 

ఆచారం తర్వాత, దేవతను ఆడ ఏనుగు వెనుకకు తీసుకువెళతారు. 

ఈ సమయంలో శివుని విగ్రహాన్ని కూడా భక్తుల తోడుతో, ఆచారానికి సంబంధించిన కథనాలతో ఊరేగింపుగా తీసుకువస్తారు.


💠 రుతుక్రమంలో ఉన్న స్త్రీలను ఏడు రోజుల పాటు ఆలయాల నుండి బహిష్కరించే ప్రదేశంలో, అటువంటి ఆచారానికి అదనపు ప్రాముఖ్యత ఉంది.

 'త్రిప్పుతు ఆరాట్' అని పిలువబడే ఈ పండుగ సందర్భంగా వేలాది మంది ఆలయానికి తరలివస్తారు మరియు దేవత నుండి ఆశీర్వాదం కోరుకుంటారు. 

ఈ పర్వదినాన మనస్పూర్తిగా ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.


💠 ఉత్సవాల సమయంలో, 12 రోజుల పాటు 'హరిద్ర పుష్పాంజలి', అమ్మవారికి ఇష్టమైనదిగా భావించే ఒక రకమైన పుష్ప నైవేద్యాన్ని భక్తులు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు.


💠 ఇక్కడ మరొక ప్రసిద్ధ ఆచారం 'ధను' మాసం 'తిరువాతిర' రోజున ప్రారంభమై 'మక్రమ్' మాసంలో అదే రోజున ముగుస్తుంది 28 రోజుల పాటు జరిగే పండుగ. 

ఈ సమయంలో, గర్భగుడి భక్తుల కోసం తెల్లవారుజామున 3:30 నుండి 11:30 వరకు తెరవబడుతుంది. ఇది మళ్ళీ మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల మధ్య తెరవబడుతుంది.


💠 ఆలయంలో ప్రతిరోజూ 5 పూజలు జరుగుతాయి, శివుడికి మూడు సారబాలీలు మరియు భద్రకాళికి మూడు పూజలు జరుగుతాయి. తాజమోన్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తాంత్రిక పూజలు చేస్తారు. 


💠 చెంగన్నూరు మహాదేవ ఆలయ పరిసరాల్లో తిరువల్లలోని శ్రీ వల్లభ ఆలయంతో సహా 6 ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. 

శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ అరన్ముల పార్థసారథి ఆలయం కూడా ఇక్కడికి చాలా దూరంలో లేదు. 

ఆలయ సముదాయం లోపల మరియు వెలుపల గణేశుడు , దక్షిణామూర్తి , సుబ్రహ్మణ్యుడు , శాస్తా , కృష్ణుడు , నీలగ్రీవుడు , స్థలిశుడు , హనుమంతుడు , గంగ మరియు నాగదేవతలకు ఆలయాలు ఉన్నాయి .


💠 శబరిమల చెంగనూర్ నుండి 50 కిలోమీటర్ల పరిధిలో ఉంది. 

చెంగన్నూర్ మహాదేవ దేవాలయం కేరళలోని అలప్పుజా జిల్లాలో చెంగన్నూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది.

 

రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -85*

 *తిరుమల సర్వస్వం -85* 

*శ్రీ భగవద్రామానుజాచార్యులు-2*

రామాయణ పారాయణం ఇలా కొనసాగుతున్న తరుణంలో, ఒకసారి తిరుమలనంబి తాను ఉభయ సంధ్యలలో మాత్రమే శ్రీవారిని దర్శించుకో గలుగుతున్నానని, అలిపిరిలో ఉండిపోవడం వల్ల మధ్యాహ్న సమయంలో శ్రీవారి దర్శనభాగ్యం కలగడం లేదని వాపోయారు. భక్తుని యొక్క ఆర్తిని అర్థం చేసుకున్న శ్రీనివాసుడు, రామాయణ ఉపదేశం జరుగుతున్న ప్రదేశం లోనే తన పాదపద్మాలు ప్రత్యక్షమయ్యేట్లు చేశారు. అప్పటినుండి అపరాహ్ణసమయంలో కూడా, రామాయణ ప్రసంగం మధ్యలో తిరుమలనంబి, రామానుజులు వార్లు శ్రీవారి పాదదర్శనం చేసుకుంటూ ఉండేవారు. అలిపిరి నడక మార్గం ప్రారంభంలో ఈనాడు మనం *"శ్రీవారి పాదమండపం"* గా చెప్పుకునే దేవాలయంలో విరాజిల్లుతున్న పాదపద్మాలు అవే. ఆ దేవాలయాన్ని సందర్శించుకునే భక్తులను శ్రీవారి లోహపాదుకలతో అర్చకులు ఆశీర్వదించే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 

*త్రోవభాష్యకార్లనన్నిథి* 

రామానుజుల కలం నుంచి వెలువడిన ఆణిముత్యాలలో, *శ్రీభాష్యం* విశిష్టమైంది. అందువల్లనే రామానుజులవారు *"భాష్యకారులుగా"* ప్రసిద్ధికెక్కారు. వైష్ణవాలయాలన్నింటిలో, *"భాష్యకార్లసన్నిధి"* యందు కొలువై ఉండే రామానుజులవారిని మనం దర్శించుకోవచ్చు.

 ఒకసారి రామానుజులవారు తిరుమల క్షేత్రానికి పయనమై తన పాదాలతో వేంకటాచలాన్ని అపవిత్రం చేయడానికి మనస్కరించక, మార్గ మధ్యలో ఉన్న వేంకటాద్రిగా భావింపబడే మోకాళ్ళపర్వతాన్ని తన మోకాళ్ళతో అధిరోహించ సాగారు. మోకాలి చిప్పలు గాయ పడడంతో, మోకాళ్ళపర్వతం మధ్యభాగంలో కొంత సేపు విశ్రమించారు. విషయాన్ని తెలుసుకున్న అనంతాళ్వార్, తిరుమలనంబి, కొండపై నుండి కొంత దూరం దిగి వచ్చి, రామానుజుల వారి కెదురేగి, స్వామివారి ప్రసాదం అయిన మామిడి పండ్లను రామానుజులకు సమర్పించారు. వారు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించగా, క్రిందపడిన ఉచ్ఛిష్టం (ఫలాలను తినగా మిగిలన టెంకలు) మొలకెత్తి కొన్నాళ్లకు పెద్దవయ్యాయి. తరువాతి కాలంలో, ఆ పవిత్రస్థలంలో ఓ మందిర నిర్మాణం జరిగి, అందులో భగవద్రామానుజుల మూర్తి ప్రతిష్ఠించబడింది. ఆ ఆలయాన్ని, తిరుపతి-తిరుమల "త్రోవలో" ఉన్న కారణం చేత, *"త్రోవభాష్యకార్లసన్నిధిగా"* పిలుస్తారు. అలిపిరి నడకమార్గంలో, దాదాపు మూడొంతులు ప్రయాణం చేసిన తర్వాత వచ్చే "మోకాళ్ళపర్వతం" మధ్యభాగంలో ఈ ఆలయాన్ని నేడు కూడా చూసి తరించవచ్చు. ]

*తిరుమల క్షేత్ర ఆగమనం* 

మోకాళ్ళపర్వతం మెట్లన్నీ మోకాళ్ళపై అధిరోహించి తిరుమల చేరుకున్న రామానుజాచార్యులు, తదనంతర కాలంలో ఆలయాభివృద్ధికి అవిరళ కృషిచేశారు. శ్రీకృష్ణరాయలు ఆలయాన్ని భౌతికంగా అభివృద్ధి చేస్తే, అంతకు ఐదు శతాబ్దాల క్రితమే రామానుజులు శ్రీవారి ఆనందనిలయానికి ఆధ్యాత్మిక సొబగులు చేకూర్చి, నిర్జనారణ్యంలా ఉండే దేవాలయ పరిసరాల్ని ఆవాసయోగ్యంగా అభివృద్ధి పరచి, ఆలయనిర్వహణను, వైదిక కైంకర్యాలను క్రమబద్ధీకరించి, భక్తుల కొంగుబంగారమైన శ్రీవారి ఆలయాన్ని భద్రంగా భావితరాల కందించారు. 

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*223 వ రోజు*

ధృతరాష్టుని చూసి " దేవా! వారి మాటలను బట్టి భీష్ముడు శిఖండి వంతు, ద్రోణుడు దుష్టద్యుమ్నుని వంతు, దుర్యోధనుడు అతని తమ్ములు భీముని వంతు మీలోని యువకులు అభిమన్యుని వంతు, అశ్వత్థామ, కర్ణుడు, సైంధవుడు మొదలగు మహా వీరులు అర్జునుని వంతు కృతవర్మ సాత్యకి వంతు సోమదత్తుడు చేకితానుడు అనే యాదవ రాజు వంతు శకుని నకుల సహదేవుల వంతు, శల్యుని ధర్మరాజు సంహరిస్తాడు . ఇక మీరే ఆలోచించీ నిర్ణయించండి " అన్నాడు. అదివిన్న ధృతరాష్టుడు " అయ్యో ఇక నాకు దిక్కెవరు? ధర్మరాజు శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లెక్క చేయక పోవడం నా కర్మ. ఇక చెప్పకు అలా జరగాలంటే అలా జరుగుతుంది " అన్నాడు. అలా దుఃఖిస్తున్న తండ్రిని చూసి సుయోధనుడు " తండ్రీ మేము పాండవులు ఒకే చోట పుట్టి పెరిగాము కదా మా కంటే పాండవులు బలవంతులు ఎలా అయ్యారు? నువ్వు ఎప్పుడూ వారిని పొగుడు తుంటావు ఈ రాజ్యం మాది మాకు దక్కాలని భగవంతుడు నిర్ణయించారు. బాధపడ వద్దు " అన్నాడు. ధృతరాష్టుడు " సంజయా! చూసావా నా కొడుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడు తున్నారు. పాండవుల వైపు వారిని ఎవరు రెచ్చ కొడుతున్నారు? " అన్నాడు. సంజయుడు " దేవా! దుష్టధ్యుమ్నుడు పాండవులలో అగ్నిని రెచ్చ కొడుతుంటాడు. తాను ఒక్కడే కౌరవ సైన్యాన్ని హతమారుస్తాను అంటాడు. ధర్మరాజు "నువ్వు అన్నంత పని చేస్తావు అంటాడు " అప్పుడు దుష్టధ్యున్ముడు నన్ను చూసి మహేశ్వరుడు, ఇంద్రుని అనుగ్రహం పొందిన మా అర్జునునితో సరి పోలు వారు కౌరవ సేనలో ఎవరున్నారు? ధర్మరాజును శరణు వేడి బ్రతకమని సుయోధనునికి చెప్పు " అన్నాడు. అది విన్న ధృతరాష్టుడు " కుమారా నీకు సగం రాజ్యం చాలదా? ధర్మరాజుకు సగరాజ్యం ఇచ్చి హాయిగా బ్రతకవచ్చు కదా పెద్దల మాటలు నీకు ఎందుకు వినవు? శకుని, కర్ణుల మాటలు ఎందుకు వింటావు " అన్నాడు.ఆమాటలకు కోపించిన దుర్యోధనుడు " నామాటలు ద్రోణుడు, భీష్మాదులు అంగీకరించడం లేదు. నేను ధర్మరాజుకు సూది మొన ఓపినంత భూమి కూడా ఇవ్వను కర్ణుడు, దుశ్శాసనాదుల సహాయంతో యుద్ధం చేసి పాండవులను గెలుచుట నిశ్చయం. ఇదే నా నిర్ణయం " అన్నాడు. ధృతరాష్టుడు " కుమారా ! నా మాట విని యుద్ధం మాను. భీముడు యుద్ధ రంగంలో నిన్ను నీ సైన్యాన్ని చీల్చి చెండాడు తున్నప్పుడైనా నా మాట వింటావా? అర్జునుడు ఛంఢ ప్రఛంఢుడై సైన్యాన్ని దునుమాడుతున్నప్పుడైనా నామాట వింటావా? నీది కేవలం మానవ శక్తి పాండవులది దైవ శక్తి అర్జునుడు అగ్ని దేవుని వలన అక్షయ తుణీరాన్నీ పొందాడు. వాయు దేవుడు, ఇంద్రుడు, యముడు, అశ్వినీ దేవతలు వారిని కాపాడు తుంటారు. కనుక వారిని చంపడం భీష్మునికి వీలు కాదు. దేవతలకు వీలు కాని రాక్షసులను అర్జునుడు చంపాడు, కనుక అతడు దేవతలను మించిన వాడు. అర్జునుడు ఒకేసారి ఒకే వేగంతో అయుదువందల బాణాలు వేయగలడు కనుక శాంతి ఒక్కటే ప్రస్తుత కర్తవ్యం " అన్నాడు. సుయోధనుడు " తండ్రీ ! రాగద్వేషాలకు అతీతులైన దేవతలు వారికి ఎలా సాయం వస్తారు. వారు పక్షపాత బుద్ధి వహిస్తే వారికి దైవత్వం ఎలా సిద్ధిస్తుంది? పాండవులకు దేవతల సాయం ఉంటే అరణ్యాలలో ఎందుకు కష్ట పడతారు? ఆత్మస్తుతి క్షమార్హం కాదు కాని నాకు కోపం వస్తే పాండవులను దేవతలు రక్షించరు. బ్రద్దలయ్యే భూగిరి శిఖరాలను నేను మంత్ర శక్తితో ఆపగలను.రాళ్లవానను గాలిని అందరూ చూస్తుండగా శమింప చేయగలను. నీళ్ళను స్తంభింపజేసి వాటిమీద రధాలను సైనికులను నడిపించ గలను. దేవ దానవ శక్తులు నాకు ఉన్నాయి. ధర్మతనయుడు అతని తమ్ములు, కుమారులు వాసుదేవాది యాదవులు, కేకయ, పాండ్య, మగధ, చైద్య, ప్రముఖ వీరులు నా బారిన పడి అణగారి పోవడం మీరు వింటారు. వారి తేజస్సు, శౌర్యము నాకు సాటి రావు, పితామహ, ద్రోణ, అశ్వథామ, కృపులకు తెలిసిన సమస్త అస్త్రాలు నాకు తెలుసు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

దేవిదేవతలు సంబంధ 55 పుస్తకాలు

 దేవిదేవతలు  సంబంధ 55  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

అయ్యప్ప స్వామి చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-1


హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం www.freegurukul.org/g/DeviDevatalu-2


కావ్య గణపతి అష్టోత్తరం www.freegurukul.org/g/DeviDevatalu-3


హనుమచ్చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-4


గణపతి www.freegurukul.org/g/DeviDevatalu-5


గ్రామ దేవతలు www.freegurukul.org/g/DeviDevatalu-6


లలితాంబికా లీలావినోదములు www.freegurukul.org/g/DeviDevatalu-7


వేంకటాచల మహత్యము- నిత్య పారాయణ గ్రంధము www.freegurukul.org/g/DeviDevatalu-8


గ్రామ దేవతలు www.freegurukul.org/g/DeviDevatalu-9


వేంకటేశ్వర మహత్యం www.freegurukul.org/g/DeviDevatalu-10


బోయకొండ గంగాభవాని చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-11


శివతాండవం www.freegurukul.org/g/DeviDevatalu-12


భస్మోద్దూళిత విగ్రహాయ www.freegurukul.org/g/DeviDevatalu-13


శ్రీకృష్ణావతార తత్త్వము-1 నుంచి 14 www.freegurukul.org/g/DeviDevatalu-14


కృష్ణ లీలామృతము-2 www.freegurukul.org/g/DeviDevatalu-15


కృష్ణ పరమాత్మ జాతకము www.freegurukul.org/g/DeviDevatalu-16


నారాయణీయము www.freegurukul.org/g/DeviDevatalu-17


శ్రీ కృష్ణ గార్హస్త్యము www.freegurukul.org/g/DeviDevatalu-18


గోమాత-జగన్మాత www.freegurukul.org/g/DeviDevatalu-19


కన్యకా పరమేశ్వరి పురాణము www.freegurukul.org/g/DeviDevatalu-20


గణేశుని రహశ్యము www.freegurukul.org/g/DeviDevatalu-21


భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం www.freegurukul.org/g/DeviDevatalu-22


అవతార తత్వ వివేచన www.freegurukul.org/g/DeviDevatalu-23


శివాంజనేయము www.freegurukul.org/g/DeviDevatalu-24


గుణరత్న కోశ ప్రభంధము www.freegurukul.org/g/DeviDevatalu-25


దేవి కథాసుధ www.freegurukul.org/g/DeviDevatalu-26


శ్రీవేంకటేశ్వర లీలలు-భక్తుల అనుభవాలు www.freegurukul.org/g/DeviDevatalu-27


బాలానంద జై వీర హనుమాన్ www.freegurukul.org/g/DeviDevatalu-28


బాలల హనుమంతుడు www.freegurukul.org/g/DeviDevatalu-29


పార్వతీ కల్యాణం www.freegurukul.org/g/DeviDevatalu-30


హనుమద్భాగవతము-పూర్వార్ధము www.freegurukul.org/g/DeviDevatalu-31


వేదమాత గాయత్రి www.freegurukul.org/g/DeviDevatalu-32


కనకదుర్గా వైభవము www.freegurukul.org/g/DeviDevatalu-33


భజే శ్రీనివాసం-27 నక్షత్రాల శ్రీనివాస దివ్యవైభవం www.freegurukul.org/g/DeviDevatalu-34


అంకమ్మ కథలు www.freegurukul.org/g/DeviDevatalu-35


సుందర మారుతి www.freegurukul.org/g/DeviDevatalu-36


హనుమచ్చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-37


వేంకటేశ్వర వైభవము-శ్రీ వేంకటేశ్వర మహత్యము www.freegurukul.org/g/DeviDevatalu-38


హనుమచ్చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-39


శివ లీలా తరంగిణి www.freegurukul.org/g/DeviDevatalu-40


వెంకటపతి ఆటవెలదులు www.freegurukul.org/g/DeviDevatalu-41


సర్వరూప శ్రీనివాసం www.freegurukul.org/g/DeviDevatalu-42


బాలానంద బొమ్మల వేంకటేశ్వర లీలలు www.freegurukul.org/g/DeviDevatalu-43


విశ్వమాత సీత www.freegurukul.org/g/DeviDevatalu-44


శ్రీ గోదాదేవి జీవిత చరిత్రము www.freegurukul.org/g/DeviDevatalu-45


కృష్ణ చరిత్రము www.freegurukul.org/g/DeviDevatalu-46


సతీ దేవి www.freegurukul.org/g/DeviDevatalu-47


పార్వతీ పరమేశ్వర కళ్యాణ వైభవం www.freegurukul.org/g/DeviDevatalu-48


యుగపురుషుడు శ్రీకృష్ణుడు www.freegurukul.org/g/DeviDevatalu-49


శ్రీనివాసుని దివ్యకథ www.freegurukul.org/g/DeviDevatalu-50


హనుమాన్ అవతార లీలా రహస్యము www.freegurukul.org/g/DeviDevatalu-51


తెలుగు సాహిత్యంలో హనుమంతుని కథ - పాత్ర చిత్రణ www.freegurukul.org/g/DeviDevatalu-52


శ్రీ రామ కర్ణామృతము www.freegurukul.org/g/DeviDevatalu-53


రామ కృష్ణ లీలాతరంగిణి www.freegurukul.org/g/DeviDevatalu-54


వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-55


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

భగవద్గీత సంబంద 68 పుస్తకాలు




*భగవద్గీత సంబంద 68 పుస్తకాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో*

                  ➖➖➖✍️



భగవద్గీత సరళ తెలుగులో   http://bit.ly/Gita_1

భగవద్గీత   http://bit.ly/Gita_2

భగవద్గీత-భగవాన్ ఉవాచ  http://bit.ly/Gita__3

భగవద్గీత   http://bit.ly/Gita_4

యథార్ధ గీత   http://bit.ly/Gita_5

శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం-1,2   http://bit.ly/Gita_6

భగవద్గీత(మలయాళ స్వామి అనువాదం)   http://bit.ly/Gita_7

గీతా సంహిత   http://bit.ly/Gita_8

భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నం   http://bit.ly/Gita_9

గీతామృతం   http://bit.ly/Gita_10

గీతా ప్రవచనములు   http://bit.ly/Gita_11

జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గము   http://bit.ly/Gita_12

గీతా సంగ్రహము   http://bit.ly/Gita_13

గీతోపన్యాసములు   http://bit.ly/Gita_14

గీతా ముచ్చట్లు   http://bit.ly/Gita_15

గీతా భోధామృతము   http://bit.ly/Gita_16

గీతా ప్రతిభ   http://bit.ly/Gita_17

భగవద్గీతా పరిచయము   http://bit.ly/Gita_18

భగవద్గీతా ప్రవేశము   http://bit.ly/Gita_19

గీతా వ్యాసములు-2   http://bit.ly/Gita_20

గీతామృత సార సంగ్రహము   http://bit.ly/Gita_21

స్థిత ప్రజ్ఞుడు - భక్తుడు   http://bit.ly/Gita_22

గీతా వచనము   http://bit.ly/Gita_23

భగవద్గీత -అర్జున విషాద,సాంఖ్య యోగం-వచన   http://bit.ly/Gita_24

గీతారహస్యము   http://bit.ly/Gita_25

గీతోపదేశతత్త్వము-1   http://bit.ly/Gita_26

శ్రీ కృష్ణుని గీతావాణి   http://bit.ly/Gita_27

గీతామూలం   http://bit.ly/Gita_28

భగవద్గీత భాష్యార్క ప్రకాశికానువాదము   http://bit.ly/Gita_29

భగవద్గీతా మననము   http://bit.ly/Gita_30

గీతా సామ్యవాద సిద్ధాంతం   http://bit.ly/Gita_31

మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు   http://bit.ly/Gita_32

నిత్య జీవితంలో భగవద్గీత   http://bit.ly/Gita_33

గీతా హృదయము-జ్ఞానయోగం   http://bit.ly/Gita_34

ప్రశ్నోత్తరీప్రవచన గీత   http://bit.ly/Gita_35

గీతా శాస్త్రం   http://bit.ly/Gita_36

గీతా తత్త్వవివేచనీ   http://bit.ly/Gita_37

భగవద్గీత టీకా తాత్పర్య సహిత   http://bit.ly/Gita_38

శ్రీగీతారాధన   http://bit.ly/Gita_39

శ్రీమద్బగవద్గీత-1,2,3   http://bit.ly/Gita_40

జ్ఞానేశ్వరి-2,3   http://bit.ly/Gita_41

నీలకంఠీయ భగవద్గీతా భాష్యము   http://bit.ly/Gita_42

గీతా యోగము   http://bit.ly/Gita_43

గీతా భావార్ధ చంద్రిక   http://bit.ly/Gita_44

భగవద్గీత విజ్ఞానదీపిక   http://bit.ly/Gita_45

శ్రీ భగవద్గీత - గీతార్ధ దీపికా సహితము   http://bit.ly/Gita_46

గీతామృతము   http://bit.ly/Gita_47

వాసు దేవః సర్వం   http://bit.ly/Gita_48

గీతా మాధుర్యం   http://bit.ly/Gita_49

గీతా వచనము   http://bit.ly/Gita_50

గీతా మహత్యం   http://bit.ly/Gita_51

గీతా మాధుర్యము   http://bit.ly/Gita_52

రెండు గీతలు భగవద్గీత-ఉత్తరగీత   http://bit.ly/Gita_53

స్వస్వరూప సంధానము   http://bit.ly/Gita_54

శత పత్రము-గీతా శాస్త్రము   http://bit.ly/Gita_55

అనాసక్తి యోగం   http://bit.ly/Gita_56

అమృతవాహిని-1 నుంచి 6 భాగాలు   http://bit.ly/Gita_57

మదాంధ్ర భగవద్గీత-2   http://bit.ly/Gita_58

భగవద్గీత-పారాయణ   http://bit.ly/Gita_59

ఆంధ్రీకృత భగవద్గీత   http://bit.ly/Gita__60

మద్భగవద్గీతా మననము-పారాయణ   http://bit.ly/Gita_61

భగవద్గీత - ఆంధ్ర పద్యానువాదము   http://bit.ly/Gita_62

భగవద్గీత(పద్య)   http://bit.ly/Gita_63

భగవద్గీత - గీతికలలో   http://bit.ly/Gita_64

భగవద్గీత - పద్య కావ్యము   http://bit.ly/Gita_65

భగవద్గీత - గేయ మాల   http://bit.ly/Gita_66

భగవద్గీత - గేయ కృతి   http://bit.ly/Gita_67

భగవద్గీత - బుర్రకథ    http://bit.ly/Gita_68


భగవద్గీత పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి :pray:.


మరింత సమాచారం కోసం:

Website:  www.freegurukul.org

Facebook:  www.fb.com/free gurukul 

*భగవత్గీతలో 

పరిశీలించవలసిన అంశములు


*సంక్షిప్తంగా 

ప్రశ్నలు-సమాధానాల రూపంలో


1).జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం? 

- జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం జీవన రహస్యం తెలుసుకొనుట, ఏదైతే జనన మరణాల బంధనం ఉందో దాని నుండి ముక్తిని పొందుట అది తెలుసుకోవడమే ముఖ్యం మరియు మోక్షమునకు మార్గము. 


 2).జనన మరణ బంధం యొక్క ముక్తి ఎవరు? 

 -ఏదైతే జన్మ స్వయం ఆత్మను తెలుసుకొనెనో ఆదే ఆ జనన మరణ ముక్తి. 


 3).ఈ విశ్వమున మానవులకు సుఖము మరియు దుఃఖము ఎందులకు? 

- స్వార్థము, భయము లాలాచము దు:ఖమునకు మూలకారణం. 


4).పరమాత్మ దుఃఖమును ఎందుకు సృష్టించాడు? -పరమాత్ము ప్రపంచాన్ని సృష్టించాడు, మానవులు తమ ఆలోచన వ్యవహారముల వలన సుఖదుఃఖాలను తనంతట తానే సృష్టించుకున్నారు. 


5).పరమాత్మ ఏమిటి ఎవరు అతని రూపం  స్త్రీనా లేక పురుషుడా? 

-కారణం లేకుండా కరణం ఉండదు ఈ కారణం యొక్క అస్తిత్వం ప్రమాణము నీవు ఉన్నావు అది ఉన్నది ఆ ఆధ్యాత్మిక కారణంతోనే పరమాత్మ పుడుతుంది. 


6).సౌఖ్యం అంటే ఏమిటి? -ప్రతి కార్యవ్యవహారమునకు పరిమాణం ఉంటుంది ఆ పరిమాణం మంచిది అవ్వచ్చు కీడు కలిగించేది కూడా ఆవ వచ్చును ఆ పరిమాణమే సౌభాగ్యం అని చెప్పవచ్చు, నేటి ప్రయత్నం రేపటి సౌభాగ్యం అని అనవచ్చును. 


7). ఈ విశ్వమున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? 

- ప్రతి దినం వేలాది, లక్షలాది మంది ప్రజలు మరణిస్తూ ఉంటారు, ఆ మరణాలు అందరూ చూస్తూనే ఉంటారు, అయినప్పటికీ కూడా అనంత కాలం వరకు జీవించాలని కోరిక ఉంటుంది ఇదియే ఆశ్చర్యకరమైన విషయం.


8). ఏ విషయమును హరింప చేసుకుంటే మనుష్యుడు ధనికుడు అవుతాడు? 

-లోభము.


9).జీవితాన్ని సుఖమయం చేసే మార్గం ఏమిటి?

 - మంచి స్వభావము కలిగి ఉండటం జీవితం సుఖమయంనకు మంచి మార్గం. 


10).ఏ విషయం కోల్పోతే మనిషి దుఃఖము లేకుండా ఉంటాడు? 

క్రోధము( కోపము)


 11). ఈ విశ్వమున ధర్మాన్ని మించిన పెద్ద విషయం ఏమిటి? 

- దయ, కరుణ, జాలి. 


12). ఏ విషయమును ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు?

 -మోసం, దగా 


13).ఏ విషయము ఎదుటి వ్యక్తి దగ్గర తీసుకోకూడదు? 

- గౌరవం,ఏదైనా పురస్కారము, మరియు పొగడ్త


14). ఈ విశ్వంనందు ఏ విషయంలో సకల జీవుల నుండి కొంత లబ్ది పొంద వచ్చును? 

-అశాశ్వతమైన అజ్ఞానము వీడి శాశ్వతమైన పరిజ్ఞానం పొందుట. 


 15).ఈ ప్రపంచంలో ఓడిపోనటువంటిది? 

-సత్యం, ధర్మం. 


16).ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటిది, వ్యాపించునటువంటి విషయం? -అబద్ధము మరియు అసత్యం. 


17).ఏదైనా ఇచ్చింది మరిచిపోవడం అంటే ఏమిటి? -పరోపకారం.


18.ఈ విశ్వంలో అత్యంత కీడు కలిగించే విషయం ఏమిటి? -మోహము,. 


19).ఈ ప్రపంచంలో బంగారు కల? 

-జీవితంను సాపల్యం చేసుకోవడం.


20).ఈ ప్రపంచంలో పరివర్తనం చెందని విషయం ఏమిటి?

-ఇచ్చిన మాట.


 21).ఈ విషయమును తమంతట తమకు అర్థం కానిది, అర్థం చేసుకో లేనిది? -తనలో ఉన్న మూర్ఖత్వం.


22).ఈ ప్రపంచంలో  నష్టం లేనిది, నాశనం లేనిది?

 -ఆత్మ మరియు జ్ఞానము. 


23).ఈ ప్రపంచంలో కోల్పోతే తిరిగి రానిది?

 -సమయము.


 కాలాన్ని  నీవు నిర్లక్ష్యం చేస్తే, కాలం కూడా నిన్ను నిర్లక్ష్యం చేస్తుంది. 


 నీవు చేస్తున్న నిర్లక్ష్యం శత్రువు కన్నా ఎక్కువగా కీడు చేస్తుంది. 


లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క 'భగవద్గీత' కు మాత్రమే ఉంది.*


1) ఏమిటా విశిష్టత..?


అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది.

ఆ మహానుభావులు  లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని 'జయంతి' గా జరుపుకుంటారు.

అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల 'గీతాజయంతి' ని జరుపుకుంటారు.

ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.


2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?


సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..

కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..

ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ  భగవద్గీత ఉదయించింది.


3) ఏముంటుంది ఈ భగవద్గీత లో..?


ఏది తెలిస్తే మానవుడికి  ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో...

ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..

ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..

అదే ఉంటుంది.


నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.

నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు.

నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.


4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?


భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..

గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.

భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని   కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.


5)భగవద్గీత  శాస్త్రీయ గ్రంధమా..?


ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..

భగవద్గీత ని మొదటిసారి  చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు  అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..


6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే  ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..

ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు...?


కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.

విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.


బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం ..చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి.


వారు కొన్ని  వందల సంవత్సరాల పాటు  భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..

ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా  కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని  కృష్ణభక్తులుగా మార్చారు..


"ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం."

భగవద్గీతను ఎందుకు పఠించాలి?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే…భగవద్గీత అనగా….భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు. 


లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు. 


గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.

మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. పరమ పావనమైన గీతాజయంతి. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకొని సర్వ జగత్తుకూ ఉపదేశించినటువంటి బ్రహ్మవిద్యా శాస్త్రం భగవద్గీత. అది ఈరోజున ఉపదేశించారు అని సంప్రదాయం చెప్తూన్నది. దాని ప్రకారంగా ఈ పవిత్రమైన ఏకాదశిని గీతాజయంతి అని వ్యవహరించడం జరుగుతున్నది. మానవజీవితంలో ప్రతి దశలోనూ ప్రతి సమస్యకీ పరిష్కారం చెప్పగలిగే గ్రంథం భగవద్గీత. ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తిస్తే మనం ఈ జీవితాన్ని సార్థక పరచుకోగలం? చిట్టచివరికి జీవన పరమార్థమైన కైవల్యాన్ని పొందగలమో చెప్తున్న గ్రంథమిది.

ముందుగా "అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే" అని మొదలౌతుంది. అశోచ్యానన్వ శోచస్త్వం అంటే దుఃఖించ గూడని వాటి కోసం దుఃఖించకు అని మొదలు పెడుతున్నది. అంటే ఆనందంగా ఉండు, దుఃఖపడకు అనేది ప్రధమ వాక్యం కృష్ణ బోధలో. మళ్ళీ చిట్టచివరికి 

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ! 

అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః!! 

అన్నాడు. దుఃఖపడకు అనేది చివరి వాక్యం. మొదట దేని గురించి దుఃఖ పడకూదదో దాని గురించి దుఃఖపడకు అని. చిట్టచివరికి దుఃఖపడకు, శోకించకు అని చెప్తున్నాడు. అంటే గీతయొక్క పరమార్థం శోకనాశనం, దుఃఖనాశనం. సృష్టిలో ఎవరైనా కోరుకొనేది అదే. దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అటువంటి పరమానందం అంటే ఏమిటో తెలియజేస్తూ అజ్ఞాన జనితమైన సర్వ శోకాలనీ నశింప చేయడం కోసమే భగవద్గీత పుట్టింది. అందుకే మొదటి వాక్యం చివరి వాక్యం రెండూ కూడా మనలో ఉన్నటువంటి సర్వ దోషాలనీ దుఃఖాలనీ పోగొట్టి పరమానంద జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యమని తేటపరుస్తున్నది. 

మార్గ శిర శుద్ధ ఏకాదశినాడు కురుక్షేత్ర సమర ప్రాంగణంలో యదుకుల కృష్ణుడు కురుకుల అర్జునునికి సకల వేదసారమైన ఉపనిషత్ రూపమైన గీతను బోధించాడన్నది తరతరాల విశ్వాసం. భగవంతుడు బోధించిన గీత భగవద్గీత. అందువల్ల మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి.

భగవత్గీత ని వివిధ భాషల్లో కి అనువాదం చేసినది ఎవరు?? 


పోస్ట్ చివరి దాకా చదవండి మీకోక షాక్ తగులుతుంది


భగవత్గీత ని ఉర్దూ లోకి అనువదించిన వ్యక్తి 

మొహమ్మద్ మెహరుల్లా (హిందూ ధర్మం స్వీకరించారు)


అరబిక్ లోకి అనువదించిన వ్యక్తి ఈ.ఎల్.ప్యాచ్ కమండో(ఇస్కాన్ లో చేరిపోయారు)


ఇంగ్లీష్ లోకి అనువదించిన వ్యక్తి

చార్లెస్ విల్కినోస్

"సనాతన ధర్మం ఒక్కటే ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వగలదు" అని అన్నారు


బ్రెజిల్ లోకి అనువాదం  చేసిన వ్యక్తి

బ్రాకెట్స్ లోవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు హృదయనంద గోస్వామి( హోవార్డ్ జె. రేనిస్క్) అలానే నలుగురు భక్తులతో కలిసి చేసాడు

మహాకాళ దాస( లిమా మరికొ పొమ్బో)

లోకసాక్షి దాస (లుకో వలేర)

ఆరాధ్య దాస(కార్లోస్ ఫెర్నాండెస్ అమరో)

ఈశ్వర దాస(ఎనియస్ గువెర్రియో)

రష్యన్ లోకి అనువదించిన వ్యక్తి నోవికోవ్(కృష్ణ భక్తుడు ఐపోయాడు)


ఇప్పుడు ప్రపంచంలో వేరు వేరు భాషల్లోకి చేసిన వారి పేర్లు తెలుసుకుందాం


హీబ్రు లోకి అనువాదం చేసినవారు (ఈయన ఇశ్రాయేలీయుడు) బేజాషుటోన్ లీ ఫనా


జర్మన్ లోకి అనువాదించిన వ్యక్తి

ఫిడెరిక్ మేయర్


పర్షియన్ లోకి అనువదించిన వ్యక్తి

 దారా షికోహ్


చైనీస్ లోకి అనువాదం చేసిన వారు

జెన్ కెము,జోవ గువోహ్వ ఇద్దరితో జి బిజూహాంగ్

అలానే హువాంగ్ బావోషేంగ్ తో మరో నలుగురు

గువో లియాంగన్,లీ నాన్,జి వెయిజన్,డ్యూయన్ కీన్గ్ ఒక కమిటీ లాగా ఏర్పడి అనువాదం చేశారు


స్పానిష్ లోకి అనువాదం చేసిన వారు హార్మోన్డ్స్ వర్త్, రైడర్&కో


జనపనీస్ లోకి అనువాదం చేసిన వ్యక్తి

సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ ఒక జపనీస్ మహిళ ని వివాహం చేసుకుని ఆ భాష లోకి అనువాదం చేశారు


లాటిన్ లోకి అనువాదం చేసిన వ్యక్తి

ఆగస్టు విల్హేమ్ 


ఫ్రెంచ్ లోకి అనువాదం చేసినది 

పర్రాడ్


గ్రీకు లోకి అనువాదం చేసినది 

జార్జ్ కె. టైపాల్ దాస్


ఇప్పటి వరకు మన భగవత్గీత ని 230 భాషల్లో మేధావులు అనువదించారు వాళ్ళల్లో


58 బెంగాలీ

44 ఇంగ్లీష్ 

12 జెర్మన్

4 రష్యన్

4 ఫ్రెంచ్

13 స్పానిష్

5 అరబిక్

3 ఉర్దూ అలానే మరెన్నో భాషల లోకి అనువాదాలు ఉన్నాయి


చివరి ట్విస్ట్ 


ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఖురాన్ ని 

బెంగాలీ లోకి అనువదించినది గిరీష్ చంద్రసేన్....కానీ ఆయన ముస్లిం అవ్వలేదు హిందూ గానే కొనసాగుతున్నారు 😜😝

హిందూ ధర్మ చక్రం

*ఓం శ్రీ కృష్ణ పరమాత్మయే నమ:

Telegram:  http://t.me/freegurukul



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 *

ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం..

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం..*


*(ముప్పై ఆరవ రోజు)*


శ్రీ స్వామివారు ప్రతిరోజూ చెపుతున్న ఉపదేశాలకు.. ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధరరావు ప్రభావతి గార్లు..ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యేవరకూ శ్రీ స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు..కానీ దైవ సంకల్పం వేరొక విధంగా ఉంటుందని వారికి తెలిసిరాలేదు..


శ్రీ స్వామివారు..ఆ దంపతుల ఇంటికొచ్చిన ఇరువైఒకటో రోజు సాయంత్రం నుంచీ రాత్రి పొద్దుపోయేదాకా వివిధ అంశాలమీద ఉపదేశం చేసి, తన బసకు వెళ్లిపోయారు..ఆ సంగతులే ముచ్చటించుకుంటూ...శ్రీధరరావు దంపతులు నిద్రకుపక్రమించారు..


 అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి , "అమ్మా!..అమ్మా!.." అన్న పిలుపు వినబడింది..ముందు కలలో ఏదన్నా ఆలాపన లాగా వచ్చిందేమో అని భ్రమ పడిన ప్రభావతి గారికి..మరలా అదే పిలుపు కొంచెం గట్టిగా.."అమ్మా!..తలుపు తియ్యండి.." అంటూ వినపడింది..ఈలోపల శ్రీధరరావు గారూ ఈ అలికిడికి లేచారు..ముందుగా తేరుకున్న శ్రీధరరావు గారు ఒక్క ఉదుటున లేచి తలుపు తీసారు..అవతలి గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లిగా లేచి వరండాలోకి వచ్చారు..


ఎదురుగ్గా శ్రీ స్వామివారు..వరండా లో వ్రేలాడుతున్న  లాంతరు తాలూకు వెలుతురులో..తేజోపుంజం లాగా  నిలుచుని వున్నారు..స్వచ్ఛమైన నవ్వు ముఖంతో చూస్తూ వున్నారు..


"ఏం నాయనా?..ఏమైనా కావాలా?.."అన్నారు ప్రభావతిగారు..


"అమ్మా!..ఈశ్వరాజ్ఞ అయింది..ఇక ఇక్కడ వుండనమ్మా..త్వరగా బండి సిద్ధం చేయండి..నేను ఆ ఆశ్రమ స్థలానికి వెళ్లిపోవాలి..అక్కడే వుంటాను!.." అన్నారు శ్రీ స్వామివారు అదే చిరునవ్వుతో..


శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..


"అదేమిటి స్వామీ..అక్కడ కేవలం స్థలం చదును చేసారే గానీ..కనీసం పునాదులు కూడా తీయలేదు..గోడలు కట్టి, పై కప్పు పడితే గదా మీరు ఉండడానికి అనువుగా ఉండేది..ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది?..ఈ చలి కాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు?.." అన్నారు శ్రీధరరావు గారు ఆతృతగా..


"నాయనా!..ఇప్పుడేం తొందర వచ్చిందని ఈ నిర్ణయం?..మందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ ఇక్కడే ఉండొచ్చు కదా?.." అన్నారు ప్రభావతి గారు ఆందోళనగా..


"లేదమ్మా..ఇక ఆలస్యం చేయకూడదు..అది ఈశ్వరాజ్ఞ తల్లీ..నేను ఆ ఆజ్ఞ ను మీరి పోకూడదు!..ఇప్పుడే వెళ్లిపోవాలి..మీకు బండి సిద్ధం చేయడం కుదరదంటే.. నేను నడచి వెళ్లిపోతాను..నడక నాకు అలవాటే కదమ్మా.." అన్నారు శ్రీ స్వామివారు..


"కనీసం రేపు సాయంత్రం వరకూ వుండండి.. అక్కడ చిన్న పాక లాగా వేయిస్తాను..చుట్టూరా తాటాకు దడి లాగా ఏర్పాటుచేయిస్తాను..కొద్దిగా ఓపిక పట్టండి.."అన్నారు శ్రీధరరావు గారు..నిజానికి ఆయనకు లోలోపల కొద్దిగా చిరాకుగా ఉంది..అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారమేమిటని ఆయన ఆలోచన!..


"శ్రీధరరావు గారూ..నేనిప్పుడు వెళ్లిపోవాలి..వెళతాను కూడా..మీరనుకునే ఆ పాక ఏదో రేపుదయం వేయించండి.." ఈసారి శ్రీ స్వామివారి కంఠం లో ఒక విధమైన తీవ్రత వినిపించింది..


ప్రభావతి గారు ఇక ఉండబట్టలేకపోయారు..స్ర్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది ఆవిడ స్వరం లో..

"నాయనా!..మేము చేస్తున్న ఉపచారాలలో నీ కేదైనా లోటు కనిపించిందా?..అపచారం ఏదైనా జరిగిందా?..లేక అజ్ఞానం తో అడగరాని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా?..మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో..నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా?..ఒక్కపూట కూడా వుండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయనా!..నా మనసుకు కష్టంగా ఉంది!.." అన్నారు..


"ఎంత పిచ్చి తల్లివమ్మా నువ్వు!.." అన్నారు శ్రీ స్వామివారు..ఆ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలువారుతున్నది..  "మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యమూ లేదు..నాకు అపచారమూ జరుగలేదు..అపవిత్రత అన్న మాటే లేదు!..నేను చెపుతున్నది ఈశ్వరాజ్ఞ గురించి..నేను మాలకొండ నుంచి ఇక్కడకు బయలుదేరే సమయంలో..అక్కడే కొద్దికాలం  వుండమన్నారు..కుదరదన్నాను..ఎందుకు?.. అదికూడా ఆరోజు ఆ ఈశ్వరుడి ఆదేశానుసారమే.. ఈరోజు మీ ఇంట్లో వుండమంటున్నారు.. ఈరోజు కూడా ఉండలేను..వుండబోను..ఇది కూడా ఈశ్వరుడి ఆదేశమే!..గృహస్తుల వద్ద ఎక్కువ కాలం మా లాంటి యోగులు ఉండరాదు..ఉండము కూడా..అది నియమం!..నన్ను వెళ్లనివ్వండి.." అన్నారు..


శ్రీ స్వామివారి వివరణ..ఫకీరు మాన్యం లో బస..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*అనాది ఆచారానికి వివరణ..*


*(ముప్పై ఐదవ రోజు)*


ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని  చెపుతూ శ్రీ స్వామివారు..


"తల్లీ ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా..ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది..అది చెపుతాను శ్రద్ధగా వినండి..ఇందాక మీరు అపవిత్రం అన్నారు గదా..అది ఎందువల్ల వచ్చింది?..మల మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా.. ఈ బహిష్టు సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది కాబట్టి..అప్పుడు ఆ స్ర్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక..ఎక్కువ విశ్రాంతి కలుగ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని పెట్టారు..అలాగే.. ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం..దైవారాధన గదిలోకి..అదేనమ్మా పూజా గృహం లోకి ప్రవేశించడం నిషేధించారు..ఆ మూడురోజులూ పిల్లలకు భర్తకు దూరంగా వుండమని కూడా చెప్పారు..ఆ మలినమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాటు చేశారు..పసిపాపలను, దైవాన్ని అపవిత్రం చేయగూడదనే ఆ నియమం పెట్టారు..శిరస్సు ద్వారా..నోటి ద్వారా..చెవి, ముక్కు, కళ్ల ద్వారా ప్రాణం పోయిందనుకో..అది ఊర్ధ్వ లోకాల ద్వారా పోయినట్లు..నాభి క్రింద రంధ్రాల ద్వారా ప్రాణం పోతే..అది అధో లోకాల ద్వారా వెళ్లిందని అర్ధం.."


"అమ్మా!..ఒక విషయం గుర్తుపెట్టుకో..భగవన్నామోచ్చారణ అనేది అగ్ని లాటిది..అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి..అలా చేయగా చేయగా..ఆ అగ్ని మన మనసునూ..శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి..ఏ మలినమూ అంటకుండా చేస్తుంది..ఆ భగవన్నామోచ్చారణానికి ఒక ప్రదేశం..ఒక బహిష్టు..ఒక అపవిత్రత అనేవి లేవు గాక లేవు!..అందుచేతే సద్గురువులు కోటి జపం..నామకోటి వ్రాయడం లాంటి నియమాలు పెట్టి..ఆ భగవంతుడి నామోచ్చారణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు.."


"ఇప్పుడర్ధమైందా తల్లీ!..నీవు నీ సాధారణ పనులు చూసుకో..నాకు ఆహారం ఎవరిచేతనైనా ఇప్పించు..నేను స్వీకరిస్తాను..నిరంతర నామోచ్చారణ అనే సూర్యడు వెలుగుతుండగా..ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా?..నీ మానసిక జపం నీవు చేసుకుంటూ వుండు!..ఇక పూజ గదిలోకి నీవు ఎలాగూ వెళ్లవు.. ఇందుకోసం నేను మాలకొండ వెళ్ళవలసిన అగత్యం లేదు..శ్రీధరరావు గారూ మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.." అన్నారు..


శ్రీ స్వామివారి వివరణతో ఆ ముగ్గురికీ సందేహాలు తొలగిపోయాయి..శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్లి..ధ్యానం చేసుకోసాగారు.. శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద..వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి..


బొగ్గవరపు చిన మీరాశెట్టి గారి దంపతులు కూడా..వారం లో మూడురోజుల పాటు..శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగుచేయించే పనిలో మొగలిచెర్ల వచ్చి పోతున్నారు...ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయించడం పూర్తి అయింది.. 


అది నవంబరు నెల చివరి రోజులు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చి రమారమి ఇరవై రోజులు దాటిపోయాయి..చలి కూడా బాగా పెరిగింది..అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుఝామున లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు..వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజూ ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉన్నది..శ్రీ స్వామివారి బోధ పూర్తి అయిన తరువాత..ప్రభావతి శ్రీధరరావు గార్లు..శ్రీ స్వామివారు చెప్పిన విషయాల గురించి తర్కించుకోవటం అలవాటుగా మారింది..


శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు..తమ పూర్వపుణ్యం కొద్దీ..ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగుపెట్టాడనీ..ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యేవరకూ ఇక్కడే బస చేస్తారు కనుక..మరిన్ని మహాద్భుత విషయాలను తెలుసుకొని తరించవచ్చనీ..భావించారాదంపతులు..


కానీ...


దైవ లీలలు మరోలా ఉంటాయి..


శ్రీ స్వామివారు ఆశ్రమ స్థలానికి తరలి వెళ్లడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

సమస్య పూరణ.

 *పాండవు లెంచినారు శిశుపాలునిc బొందగ నగ్రపూజకున్*

ఈ సమస్యకు నాపూరణ. 


ఖండన జేయుచున్ వదరు  గౌరవ హీనుడు  దుష్టబుద్ధిగా


పాండవు లెంచినారు శిశుపాలునిc - బొందగ నగ్రపూజకున్


దండము బెట్టి సాదరము  దామము వేసిరి పాదపూజచే


మండనుడైన మాధవుని మాన్యునిగా మహనీయ భావమున్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

*🙏జై శ్రీమన్నారాయణ🙏* 12.12.2024,గురువారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం -హేమంత ఋతువు మార్గశిర మాసం - శుక్ల పక్షం తిథి:ద్వాదశి రా8.26 వరకు వారం:బృహస్పతివాసరే (గురువారం) నక్షత్రం:అశ్విని ఉ8.23 వరకు యోగం:పరిఘము మ2.42 వరకు కరణం:బవ ఉ9.35 వరకు తదుపరి బాలువ రా8.26 వరకు వర్జ్యం:సా5.20 - 6.50 దుర్ముహూర్తము:ఉ10.03 - 10.47 మరల మ2.27 - 3.11 అమృతకాలం:రా2.18 - 3.48 రాహుకాలం:మ1.30 - 3.00 యమగండ /కేతుకాలం:ఉ6.00 - 7.30 సూర్యరాశి:వృశ్చికం చంద్రరాశి: మేషం సూర్యోదయం:6.24 సూర్యాస్తమయం:5.23 ఎవరిలో ఏ మంచి దాగి ఉందో తెలియదు. అది బయటకు వచ్చి లోక కల్యాణానికి ఉపయోగపడాలి. ప్రతి మనిషి ఈ లోకానికి ఏదో ఒక మంచి చేసి నిష్క్రమించాలి. అందుకతడు చెయ్యాల్సిందల్లా పని మొదలు పెట్టడమే. 'భయపడి పని మొదలు పెట్టనివాడు అధముడు. మధ్యలో వదిలేసేవాడు మధ్యముడు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లి ఫలితం పొందేవాడు ధీరుడు, ఉత్తముడు' అన్నాడు. భర్తృహరి. బతుకుతెరువు కోసం చేసేది వృత్తి. మానసికానందానికి చేసేది ప్రవృత్తి. వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించేవారి జీవితం అత్యద్భుతం. 'పనిచేయనివాడు ఇంటికి దొంగ' అని సామెత. అలాంటి పనిదొంగలు దేవుడికి నచ్చరు. 'కార్యం పురుషకారే లక్ష్యం సంపద్యతే' అంటాడు చాణక్యుడు. అంటే మన వంతు ప్రయత్నం సరిగ్గా చేస్తే కార్యస్వరూపం స్పష్టమవుతుంది. అప్పుడు దాన్ని సాధించడం సులువవుతుంది. పురుషకారమనువర్తతే దైవమ్' అన్నదీ చాణక్యుడి మాటే ప్రయత్నించే (పనిచేసే) వాడి వెంటే దేవుడు ఉంటాడని అర్థం...

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

M

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయనం -హేమంత ఋతువు

మార్గశిర మాసం - శుక్ల పక్షం

తిథి:ద్వాదశి రా8.26 వరకు

వారం:బృహస్పతివాసరే (గురువారం)

నక్షత్రం:అశ్విని ఉ8.23 వరకు

యోగం:పరిఘము మ2.42 వరకు

కరణం:బవ ఉ9.35 వరకు

తదుపరి బాలువ రా8.26 వరకు

వర్జ్యం:సా5.20 - 6.50

దుర్ముహూర్తము:ఉ10.03 - 10.47

మరల మ2.27 - 3.11

అమృతకాలం:రా2.18 - 3.48

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ /కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి: మేషం

సూర్యోదయం:6.24

సూర్యాస్తమయం:5.23


ఎవరిలో ఏ మంచి దాగి ఉందో తెలియదు. అది బయటకు వచ్చి లోక కల్యాణానికి ఉపయోగపడాలి. ప్రతి మనిషి ఈ లోకానికి ఏదో ఒక మంచి చేసి నిష్క్రమించాలి. అందుకతడు చెయ్యాల్సిందల్లా పని మొదలు పెట్టడమే. 'భయపడి పని మొదలు పెట్టనివాడు అధముడు. మధ్యలో వదిలేసేవాడు మధ్యముడు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లి ఫలితం పొందేవాడు ధీరుడు, ఉత్తముడు' అన్నాడు. భర్తృహరి. బతుకుతెరువు కోసం చేసేది వృత్తి. మానసికానందానికి చేసేది ప్రవృత్తి. వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించేవారి జీవితం అత్యద్భుతం.


'పనిచేయనివాడు ఇంటికి దొంగ' అని సామెత. అలాంటి పనిదొంగలు దేవుడికి నచ్చరు. 'కార్యం పురుషకారే లక్ష్యం సంపద్యతే' అంటాడు చాణక్యుడు. అంటే మన వంతు ప్రయత్నం సరిగ్గా చేస్తే కార్యస్వరూపం స్పష్టమవుతుంది. అప్పుడు దాన్ని సాధించడం సులువవుతుంది. పురుషకారమనువర్తతే దైవమ్' అన్నదీ చాణక్యుడి మాటే ప్రయత్నించే (పనిచేసే) వాడి వెంటే దేవుడు ఉంటాడని అర్థం...

జపముం జేయ

 మ.జపముం జేయ తలంచినన్ జనులు సంసార ప్రధానంపు భా

వపరోద్యోగపు చింతనన్ విడిచి దైవప్రార్థ నాసక్తితో

విపరీతమ్మగు శుష్క భావముల ప్రాప్తిన్ వీడ నేకాగ్రతన్ 

చపలమ్మౌ నిజ జీవితమ్మునకు ప్రాశస్త్యమ్ము చేకూరెడిన్౹౹ 69


మ.తపమున్ మోహ విముక్తి గూర్చుటకు సంధానింపగా మేలగున్

తపమే తాప వినాశ కారకమగున్ ధైర్యమ్ము గూర్చున్ సదా

జపమో తాప విమోచనాస్పదమునౌ సాఫల్య సన్మార్గమో

ఉపయోగింప తగున్ విచక్షణను సంయుక్తమ్ముగా విజ్ఞతన్౹౹ 70

నిర్ణయాలు

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏 🌹మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు.. కుదుటపడిన మనసు మంచి ఆలోచనలకు నెలవవుతుంది.. మనిషి సక్రమ మార్గంలో సంచరించేందుకు సహకరిస్తుంది🌹నన్ను నేను నమ్ముకున్న ప్రతీ సారి విజయం నన్నే వారించేది.. ఒకరిపై ఆధారపడిన ప్రతీ సారి నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది.. చివరికి నాకు అర్దమైంది ఏమిటంటే స్వశక్తికి మించిన ఆస్తి లేదని🌹ఒక పని యొక్క సంక్లిష్టత లేదా కష్టం వలన మీరు ప్రయత్నించకుండా ఆపొద్దు..మీరు ప్రయత్నిస్తూనే ఉంటే ఆ పని దాని కదే సులభంగా సరళంగా మారుతుంది..ఒక కార్యం చేపడితే కష్టాలు తీయిరుపోతాయి అని తెలిసినా చాలా మంది మొదలు పెట్టరు..ఒకవేళ మొదలు పెట్టినా మధ్యలో ఆపేస్తారు..నూటికి ఒక్కరో ఇద్దరో ఆఖరి వరకూ కష్టపడి విజేతలు అవుతారు🌹జీవితంలోని బాధలు మనకు గుణపాఠం నేర్పుతాయి.. మరియు ఆ పాఠాలే మనలోని మార్పుకు కారణమవుతాయి..తనలో ఉన్న శక్తిని యుక్తిని సృజనాత్మక మైన కార్యాలలో వినియోగించు వారిని ఆధరణియులు ఆదర్శవంతులుగా సమాజం స్వీకరిస్తుంది🌹🌹మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593 9182075510* 🙏🙏🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హెమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - అశ్వనీ -‌‌ గురు వాసరే* (12.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*