మ.జపముం జేయ తలంచినన్ జనులు సంసార ప్రధానంపు భా
వపరోద్యోగపు చింతనన్ విడిచి దైవప్రార్థ నాసక్తితో
విపరీతమ్మగు శుష్క భావముల ప్రాప్తిన్ వీడ నేకాగ్రతన్
చపలమ్మౌ నిజ జీవితమ్మునకు ప్రాశస్త్యమ్ము చేకూరెడిన్౹౹ 69
మ.తపమున్ మోహ విముక్తి గూర్చుటకు సంధానింపగా మేలగున్
తపమే తాప వినాశ కారకమగున్ ధైర్యమ్ము గూర్చున్ సదా
జపమో తాప విమోచనాస్పదమునౌ సాఫల్య సన్మార్గమో
ఉపయోగింప తగున్ విచక్షణను సంయుక్తమ్ముగా విజ్ఞతన్౹౹ 70
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి