*🙏జై శ్రీమన్నారాయణ🙏*
M
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
మార్గశిర మాసం - శుక్ల పక్షం
తిథి:ద్వాదశి రా8.26 వరకు
వారం:బృహస్పతివాసరే (గురువారం)
నక్షత్రం:అశ్విని ఉ8.23 వరకు
యోగం:పరిఘము మ2.42 వరకు
కరణం:బవ ఉ9.35 వరకు
తదుపరి బాలువ రా8.26 వరకు
వర్జ్యం:సా5.20 - 6.50
దుర్ముహూర్తము:ఉ10.03 - 10.47
మరల మ2.27 - 3.11
అమృతకాలం:రా2.18 - 3.48
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ /కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:6.24
సూర్యాస్తమయం:5.23
ఎవరిలో ఏ మంచి దాగి ఉందో తెలియదు. అది బయటకు వచ్చి లోక కల్యాణానికి ఉపయోగపడాలి. ప్రతి మనిషి ఈ లోకానికి ఏదో ఒక మంచి చేసి నిష్క్రమించాలి. అందుకతడు చెయ్యాల్సిందల్లా పని మొదలు పెట్టడమే. 'భయపడి పని మొదలు పెట్టనివాడు అధముడు. మధ్యలో వదిలేసేవాడు మధ్యముడు. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లి ఫలితం పొందేవాడు ధీరుడు, ఉత్తముడు' అన్నాడు. భర్తృహరి. బతుకుతెరువు కోసం చేసేది వృత్తి. మానసికానందానికి చేసేది ప్రవృత్తి. వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించేవారి జీవితం అత్యద్భుతం.
'పనిచేయనివాడు ఇంటికి దొంగ' అని సామెత. అలాంటి పనిదొంగలు దేవుడికి నచ్చరు. 'కార్యం పురుషకారే లక్ష్యం సంపద్యతే' అంటాడు చాణక్యుడు. అంటే మన వంతు ప్రయత్నం సరిగ్గా చేస్తే కార్యస్వరూపం స్పష్టమవుతుంది. అప్పుడు దాన్ని సాధించడం సులువవుతుంది. పురుషకారమనువర్తతే దైవమ్' అన్నదీ చాణక్యుడి మాటే ప్రయత్నించే (పనిచేసే) వాడి వెంటే దేవుడు ఉంటాడని అర్థం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి