1, ఆగస్టు 2020, శనివారం

కేశవ నామాలు-గణిత భూమిక.



విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి.
వాటిని కేశవనామాలంటారు.
ఇవి 24 మాత్రమే ఎందుకు ఉన్నాయి?
వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా
సంబంధం వున్నదా?

ఈ 24 కు గణిత పరమైన భూమిక ఏమిటి..
విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.
అంటే నాలుగు చేతులు గలవాడని కదా?
ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను
ధరించి మనకు దర్శనమిస్తాడు.

నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా
24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి.
ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

1.కేశవ నామాలలో మొదటి నామం..కేశవ.
కేశవ రూపంలో కుడివైపు ఉన్న రెండు చేతులతో
పద్మము, శంఖము..ధరించి ఎడమ వైపు ఉన్న
రెండు చేతులతో..గద, చక్రం ధరించి ఉంటాడు.

2.విష్ణువు యొక్క మరొక నామము..మాధవ.
ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో
గద,చక్రం ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో
పద్మము,శంఖము ధరించి ఉంటాడు.

3.మధుసూధన రూపంలో..
కుడివైపు చేతులతో చక్రం, శంఖము..మరియు ఎడమవైపు చేతులతో గద,పద్మము ధరించి ఉంటాడు.

ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు (పక్షానికొకసారి)
పౌర్ణమికి, అమావాస్య కు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో ప్రస్తారాలు(permutations) అంటాం.
అనగా 4 వస్తువులను 4! (4 factorial) విధాలుగా అమర్చవచ్చు.

4! = 4×3×2×1=24
శంఖాన్ని 'శ' తోను,
చక్రాన్ని 'చ' తోను,
గదను 'గ' తోను,
పద్మాన్ని ' ప'తోను సూచిస్తే,
ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.

1) శచగప..కేశవ
2) శచపగ,..నారాయణ
3) శపచగ..మాధవ
4) శపగచ..గోవింద
5)శగచప..విష్ణు
6)శగపచ..మధుసూధన
7)చపగశ...త్రివిక్రమ
8)చపశగ..వామన
9)చగపశ..శ్రీధర
10)చగశప..హృషీకేశ
11)చశగప..పద్మనాభ
12)చశపగ..దామోదర
13)గపశచ..సంకర్షణ
14)గపచశ..వాసుదేవ
15)గచశప..అనిరుధ్ధ
16)గచపశ..ప్రద్యుమ్న
17)గశపచ..పురుషోత్తమ
18)గశచప..అధోక్షజ
19)పచగశ..నారసింహ
20)పతశగ..అచ్యుత
21)పశగచ..జనార్ధన
22)పశచగ..ఉపేంద్ర
23)పగశచ..హరి
24)పగచశ..శ్రీకృష్ణ
[పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]

ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 24 పక్షాలు అంటే 12 నెలలు
అనగా  ఒక సంవత్సరం పడుతుంది.ఓం శనైచ్చరాయనమః

సంతోషం ఏ సంతలో దొరుకుతుంది?

నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. దేశంలో   చాలా  రోజులపాటు తెగ తిరిగాడు. 

చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు.

 ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు.

 నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది.

తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది. 

ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు.

కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన.

‘ఓస్‌ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు. ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?...’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు.

పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ... వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు.

‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన.

ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు.

 ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు. 

అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. 

ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన.

‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు.

‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే..... నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన.

ఏమి జరిగినా మన మంచి కే అని అనుకోవడము అలవాటు చేసుకోవాలి.అప్పుడే హాయిగా, సుఖంగా వుండగలవు, లేదంటే బాధ, వ్యధల తో జీవితం ముగిసిపోతుంది.

ఇందుకు చిన్న ఉదాహరణ చెపుతాను విను.

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.

అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.

 ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.

ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. 

తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.......
తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  

తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. 

అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. 

ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.

ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు.

ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి. అప్పుడే నిజమైన సంతోషం మన సొంతం అవుతుంది.

రాత్రి అయ్యింది, అంతా చీకటిగా ఉంది ఏమీ కనిపించడం లేదు అని నిరాశ చెందకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది నమ్మకం ఉండాలి. ఏందకంటే ఇది ప్రతి రోజు జరిగేదే అని నీకు చాలా రోజులు గా అనుభవ పూర్వకంగా తేలుసు.
సంతోషం కూడా అలాగే వస్తుంది అని నమ్మకం వుండాలి. అలా కాకుండా రాత్రి, అయిన వెంటనే తెల్లవార లేదు అని బాధ పడకూడదు.

ఎందుకంటే దానికి 12 గంటల సమయం పడుతుంది అలాగే నీకు ఎదురైనా కష్టాలు కానీ, బాధలు కానీ పోవడానికి కొంత సమయం పడుతుంది అయితే చివరికి మాత్రం ఖచ్చితంగా నీకు మంచి జరిగి తీరుతుంది అనే నమ్మకంతో జీవిత గమనాన్ని కొనసాగించాలి.

తెల్లవారే వరకు నిద్ర పోవాలి అలాగే కష్టాలు తీరే వరకు భగవాన్ నామస్మరణ చేయాలి
***********************

“శ్రీ” కారం

ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?

“శ్రీ”  లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.
“శ్రియ మిచ్దేద్దు  తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.
మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.
నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.
ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ మతమందైననూ, ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

మంచి విచారం

మనలోనీ ఆందోళనకు కారణం, బాధలకు,కోపానికి కారణం అంతా మనవల్లే  జరుగుతుందనే అహంకారం. దీనికి కారణం భగవంతుని పట్ల మనకు విశ్వాసం లేకపోవడమే ! ,

భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం మరిచిపోతామో అప్పుడు మనల్ని అన్ని ఆందోళనలు ఆవరిస్తాయి...

భగవంతునిపట్ల విశ్వాసం గలవాడు ధన్యుడు. అలాంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనూ భీతిల్లాడు.

ఏది జరిగిన భగవదేచ్ఛతోనే జరుగుతుందని భావిస్తాడు. అలాంటి వ్యక్తిలో భయానికి, ఆందోళనకు, కోపానికి తావెక్కడిది.....?

మనం దేనికోసం ఆందోళన చెందాలి.. ? భగవంతుణ్ణి దర్శించలేకపోయామన్న ఆందోళన మంచిది. ప్రాపంచిక విషయాల్లో ఆందోళన ఎందుకు వస్తుంది....?

మనకు ఏది మంచిదో దాన్ని భగవంతుడు మనకు అనువ్రహిస్తాడనే విశ్వాసం ఉంటే ఇక ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

మన హృదయం భగవంతునికోసం పరితపించాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమైనట్లులేక్క !.

ఈ భావన మనలో లేనంతవరకూ భయాందోళనలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

నేను భగవంతుణ్ణి సదా స్మరిస్తున్నాను. నన్ను ఈ కామక్రోధములు ఎమ్ చేయగలవు..? అనే దృఢవిశ్వాసం కలిగివుండాలి.


✡సర్వేజనాః సుఖినోభవంతు.🙏

     _🕉 జై యోగేశ్వర్ _🕉
*************************

బ్రాహ్మణ వాదం వెనుక ఉన్న వాస్తవం

 పుట్టుకతో ప్రతీ మనిషి శుద్రుడే. వారి వారి సంస్కారము చేత వర్ణాలు ఏర్పడ్డాయి. ఇది బాగా తెలుసుకోవలసింది. ఎవరో బూతులు తిట్టే విధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.
ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.
వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..
★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.
★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.
★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.
★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.
★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.
★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.
★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.
★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.
★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.
★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.
★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.
★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.
★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.
★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.
★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.
★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.
★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.
★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.
★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.
★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి  సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.
బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.
మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు..
 కొంతమంది అత్యుత్సాహంతో పెట్టిన పోస్టులకు సమాధానంగా ఈ పోస్టింగ్ పెట్టాను  తప్ప.. మీకు ఎవరికి తెలీదు అని కాదు. తెలిసినా చాలామంది బ్రాహ్మణులను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవాలు చెప్పాలన్న తపన తప్ప   నేను వితండవాదం చెయ్యడానికి పోస్ట్ పెట్టలేదు. తప్పయితే  శాస్త్రీయంగా వివరించే పని చేయండి.
నమస్కారాలతో
  పుట్టుకతో ప్రతీ మనిషి శుద్రుడే. వారి వారి సంస్కారము చేత వర్ణాలు ఏర్పడ్డాయి. ఇది బాగా తెలుసుకోవలసింది. ఎవరో బూతులు తిట్టే విధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.
ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.
వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..
★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.
★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.
★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.
★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.
★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.
★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.
★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.
★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.
★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.
★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.
★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.
★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.
★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.
★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.
★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.
★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.
★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.
★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.
★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.
★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.
★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి  సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.
బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.
మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు..
 కొంతమంది అత్యుత్సాహంతో పెట్టిన పోస్టులకు సమాధానంగా ఈ పోస్టింగ్ పెట్టాను  తప్ప.. మీకు ఎవరికి తెలీదు అని కాదు. తెలిసినా చాలామంది బ్రాహ్మణులను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవాలు చెప్పాలన్న తపన తప్ప   నేను వితండవాదం చెయ్యడానికి పోస్ట్ పెట్టలేదు. తప్పయితే  శాస్త్రీయంగా వివరించే పని చేయండి.
నమస్కారాలతో 

సంస్కృతభాష_ప్రపంచాన్నితనవైపు_తిప్పుకుంటోంది

ఇది మీకు తెలుసా?? మనం మర్చిపోయిన మన దేవబాష కి ప్రపంచం పట్టం కట్టింది

®️అబ్బో ...... సంస్కృతానికి ఇంత వుందా మాకే తెలియలేదు
 ®️సంస్కృతభాష_ప్రపంచాన్నితనవైపు_తిప్పుకుంటోంది

®️సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.

®️1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే

®️2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.

®️3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.

®️4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.

®️5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.

®️6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.

®️7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.

®️8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.

®️9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.

®️10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.

®️11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.

®️12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.

®️13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.

®️14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే.

®️15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు.

®️16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో (  కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో  సంస్కృతబోధన జరుగుతోంది.®️👆

దైవభక్తి భక్తి

ఓం నమో నారాయణాయ

ఎక్కడో పుట్టిన ఒక విషక్రిమి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చూస్తుంటే మానవాళిని మహామృత్యువు తరుముకొస్తోందా అన్నట్లు ఉందీ సమస్య. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఇప్పుడు అందరూ జపించవలసిన మంత్రం
"ఓం నమో నారాయణాయ"

అధికసంఖ్యలో జనులు భక్తితో దైవాన్ని వేడుకుంటే మేలు కలుగుతుంది. ఇంట్లో ఉంటూనే మనమంతా ఎంత ఎక్కువగా జపిస్తే, నష్టాన్ని అంతగా నివారించవచ్చు. శేషశయనుడు, గరుడ వాహనుడైన శ్రీమన్నారాయణుడు ఈ సమయంలో ఈ విషక్రిమి బాధను నివారించగలడు, కష్టం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించగలడు.

చాలామంది శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. అందులో సాక్షాత్తు భగవానుడే ఒక మాట చెప్పాడు.
ఆర్థావిషణ్ణా శ్శిధిలాశ్చ భీతా: ఘోరేషుచ వ్యాధిషు వర్త మానా:
సంకీర్త్య నారాయణ శబ్ధమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు
ఆందోళనతో ఉన్నా, దుఃఖితుడైనా, పూర్తిగా పతనమైనా, భయపడుతున్నా, ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నా, చెడు సమయం నడుస్తున్నా"నారాయణ నారాయణ " అనే సంకీర్తన చేతనే అతడు దుఃఖం నుంచి విముక్తుడై సుఖం పొందుతాడు. ఇది సాక్షాత్తు పరమాత్మ చెప్పిన మాట. నారాయణుడు స్థితి కర్త. లోకరక్షణ ఆయన బాధ్యత. ఇప్పుడు పరిస్థితులను అనుసరించి 'నారాయణ' మంత్ర జపం నష్టాన్ని నివారిస్తుంది. ఈ సమయంలో ఏ మంత్రాలు ఉపదేశం లేనివాళ్ళంతా 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రం ఎంత వీలైతే ఎంత జపించవచ్చు.

భగవానుడే స్వయంగా చెప్పిన "ఓం నమో నారాయణాయ" అనే మంత్ర జపం సర్వోత్తమం. ప్రత్యేక కాలం లేదు, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, మీరు ఏ పని చేస్తున్నా మనస్సులో జపిస్తూనే చేస్తూనే ఉండండి. పరిస్థితులు చక్కబడాలి, అందరూ రక్షించబడాలి, అకాలమృత్యువు తొలగాలని సంకల్పించండి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దీనికి ఉపదేశం కూడా అవసరంలేదు. అందరూ 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రం చేయవచ్చు. కావల్సింది భక్తి, దాంతో పాటు లోకానికి మేలు జరగాలనే తలంపు. లోకంలో మనం కూడా ఒక భాగం. కేవలం మనం బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి, అప్పుడే మనమూ బాగుంటాము.

ప్రహ్లాదుడు చెబుతాడు -
పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత
శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా!!

- త్రాగుతూ, తింటూ, మాట్లాడుతూ, పరిహస్తూ, నిద్రిస్తున్నా లేదా నిద్రకు ఉపక్రమిస్తూ, తిరుగుతూ, ఎల్లప్పుడూ ఆ శ్రీ మన్నారాయణుని పాదాల మీదనే మనస్సు నిలిపి, ఆయన స్మరణ చేయవచ్చని చెప్పారు. కనుక సమయం సరిపోదని చెప్పకండి, మౌనంగా ఈ మంత్రజపం చేయండి.

ఓం నమో నారాయణాయ

శనగలను నానబెట్టిననీటి ఔషధ గుణాలు

శనగలను నానబెట్టిన నీటిని పారబోస్తున్నారా..? 

శనగలు.వీటిని మనం వంటల్లో ఎక్కువగా వేస్తాం.వీటితో కూరలు చేస్తారు, గుగ్గిళ్లలా చేసుకుని తింటారు.పలు పిండి వంటలు చేస్తారు.
 ఈ 10 విషయాలు చూస్తే ఇంకెప్పటికీ ఆ పని చేయరు.!
ఇంకా ఎన్నో ఆహారాల్లో శనగలను వేస్తారు.అయితే ఎలా వేసినా శనగలను ముందుగా కొన్ని గంటల పాటు నానబెట్టాకే ఆహార పదార్థాల్లో వేస్తారు. అయితే శనగలను నానబెట్టాక వాటిని తీసి ఆ నీటిని మాత్రం పారబోస్తారు.కానీ అలా చేయకూడదు.ఎందుకంటే శనగలను నానబెట్టిన నీరు కూడా మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.శనగలను నానబెట్టిన నీటిని తాగితే అందులో ఉండే ఐరన్ శరీరానికి అందుతుంది.దీంతో రక్తం బాగా పెరగడమే కాదు, శరీరానికి శక్తి బాగా అందుతుంది.నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి దూరమవుతాయి.రోజంతా యాక్టివ్గా ఉండవచ్చు.ఎంత పనిచేసినా అలసట రాదు.

 2.ఈ నీటిని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దీంతో అధిక బరువు తగ్గుతారు.గుండె సమస్యలు రావు.రక్త సరఫరా మెరుగు పడుతుంది.రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.బీపీ కంట్రోల్ అవుతుంది.

3.వ్యాయామం చేసే వారికి ఈ నీరు చాలా మంచిది. కండరాలు త్వరగా పెరుగుతాయి.కొత్త కణజాలం నిర్మాణమవుతుంది.మజిల్స్ బిల్డ్ అవుతాయి.శారీరక దృఢత్వం ఏర్పడుతుంది.

4.శనగలను నానబెట్టిన నీరు మధుమేహం ఉన్న వారికి ఔషధమనే చెప్పవచ్చు.ఈ నీటిని తాగితే వారి రక్తంలో ఉన్న షుగర్ స్థాయిలు తగ్గుతాయి.డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

5.ఫైబర్ ఎక్కువగా అందడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.తద్వారా కొవ్వు కరుగుతుంది.పొట్టు చుట్టూ ఉండే కొవ్వు పోయి స్లిమ్గా అవుతారు.అధిక బరువు తగ్గుతారు.

6.మెదడు పనితీరు మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మెదడు యాక్టివ్గా, చురుగ్గా పనిచేస్తుంది.చదువుకునే వారికి ఎంతో మంచి డ్రింక్గా ఉపయోగపడుతుంది.చదువుల్లో విద్యార్థులు రాణిస్తారు.

7.చర్మ సమస్యలు పోతాయి.చర్మంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు ఉండవు.చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

8.శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు పోతాయి.వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

9.దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు.దంతాలు దృఢంగా మారుతాయి.నోటి దుర్వాసన పోతుంది.చిగుళ్లు దృఢంగా ఉంటాయి.

10.శనగలను నానబెట్టిన నీటిని తాగితే క్యాన్సర్ కణాలు నాశనమవుతాయి.ఆ కణాలు పెరగవు.క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కునే ఔ

శ్రీ కపోతేశ్వర దేవాలయం –చేజెర్ల

 గుంటూరు జిల్లా నకరికల్లు మండలం లో నరసరావుపేటకు 30కి.మీ దూరం కో ఉన్న చేజర్ల గ్రామం లో పురాతన శ్రీ కపోతేశ్వరాలయం ఉంది .దాన శీలం లో ప్రసిద్ధు డైన శిబి చక్రవర్తి ఇక్కడ లింగ రూపం లో వెలసిన పవిత్ర క్షేత్రం .కాశ్మీరప్రభువైన శిబి చక్రవర్తి  పెద్ద తమ్ముడు ‘’మేఘాడంబురుడు’’,రెండవ తమ్ముడు ‘’జీమూత వాహనుడు ‘’తీర్ధ యాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి ,ఇక్కడి పర్వత గుహలో తపస్సు చేస్తూ దేహాలు చాలించి లింగాకారు లైవెలిశారు .ఈ విషయం తెలిసిన శిబి తానూ కూడా సోదరులలాగే ముక్తి పొందాలని చేజెర్ల చేరాడు .ఇక్కడ నూరు యాగాలు చేశాడు.

శిబి దానశీలతను పరీక్షించాలని దేవతలు భావించిబ్రహ్మ ,శివుడు  పావురం ,కిరాత రూపాలుధరించి శిబిని చేరారు .కిరాత బాణానికి కాలికి దెబ్బతగిలిన కపోతం శిబిని చేరి శరణు కోరింది  .అభయమిచ్చాడు శిబి చక్ర వర్తి .ఇంతలో కిరాతుడు వచ్చి తాను  వేటాడిన పావురం తనదే నని దాన్ని తనకివ్వాలని పేచీపెట్టాడు .శరణు కోరిందాన్ని ఇవ్వలేనని పావురం బరువుతో సమానమైన తన శరీర మాంసాన్ని దానికి బదులుగాకోసి ఇస్తానన్నాడు శిబి .సరేనన్నాడు కిరాతుడు .ఒక త్రాసు తెప్పించి ఒక వైపు పావురాన్ని పెట్టి ,మరో వైపు తన శరీరం నుండి కోసిన మాంస ఖండాలను పెట్టి తూచాడు .యెంత మాంసమైనా పావురం బరువుకు సరి తూగలేదు .

ఇదేదో దైవ మాయ అనిపించింది .చివరికి తన తల నరికి త్రాసు లో పెట్ట బోయాడు
.అప్పుడు శివ ,బ్రాహ్మలు త్యక్షమై అతడ్ని పరీక్షించ టానికి చేసిన ప్రయత్నం ఇది అని వివరించి శిబి దాన శీలతకు మెచ్చి వరం కోరుకొమ్మన్నారు .తాను  శివలింగాకృతి దాల్చే యోగం ప్రసాది౦చ మన్నాడు శిభి .సరేనన్నారు. కపోతాన్ని రక్షించి శివుని మెప్పించి లింగాకృతి దాల్చిన శివుడుక పోతేశ్వరుడైనాడు .దీనికి దాఖలాలుగా  లింగం పైకత్తి గాట్లు  కనిపిస్తాయి . .శిబి దేహం నుండి తీసిన మాంసానికి ఇవి ఆనవాళ్ళు .లింగం పైభాగాన రెండువైపులా రెండు బిలాలు కనిపిస్తాయి .కుడి రంధ్రం లో ఒక బిందెడు నీరు పడుతుంది .ఎడమ వైపు బిలం లో యెంత నీరు పోసినా నిండక పోవటం ఆశ్చర్య మేస్తుంది .అభిషేక జాలం ఇందులోనుండి ఎక్కడికో ప్రవహించి వెళ్ళిపోతుంది ,ఇక్కడి నందీశ్వరుడు కపోతేశ్వరలి౦గా న్ని కుడి కంటితో వీక్షిస్తున్నట్లు   ఉండటం సాధారణానికి భిన్నంగా ఉంటుంది .ఇదొక వింత .

గ్రామానికి వాయవ్యం లో కపోతేశ్వరాలయం తూర్పు ముఖం గా  ఉంది .ఆలయం చతుర్భుజాకారం తో విశాలమైన ఆవరణ లో ఉంది .ఆవరణ చుట్టూ రెండు ప్రాకారాలున్నాయి .అన్ని దిశల్లో దేవతామూర్తులకు చిన్న చిన్న మందిరాలున్నాయి .9అడుగుల ఎత్తున ఉన్న సహస్ర లింగాకార మూర్తి విశేషం  ఆకర్షణ  ,నైరుతిలో సప్త మాత్రుకల దేవాలయం ఉంది. మల్లికా పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేస్తారు .ప్రవేశ గోపురానికి ఎదురుగా చిన్నమండపం ధ్వజ స్థంభం ఉన్నాయి .రెండు రాతి పలకలపై ఒక్కొక్కదానిమీద వెయ్యేసి లింగాలు ఉండటం మరో ప్రత్యేకత .పాలరాతి ఫలకం పై పద్మ హస్తుడైన సూర్య భగవానుడు దర్శన మిస్తాడు .గర్భ గృహానికి రెండు వైపులా,మూడేసి రాతి స్తంభాలపై రాతి దూలాల కప్పు ఉంది. చదరపు వేదికపైన ఉన్న కపోతేశ్వర లింగం తలలేని శిబి చక్రవర్తి శరీరాకృతి గా అనిపిస్తుంది

శ్రీ కృష్ణ దేవరాయలు రెండు శిలా శాసనాలు ఇక్కడ వేయించాడు .రాయలు కొండవీడును జయించి వచ్చి స్వామికి 360 ఎకరాలభూమిని దానం ఇచ్చిన శాసనం ఉంది .మంత్రులు   తిమ్మరుసు,కొండ మరుసయ్య పేర్లమీద తిమ్మ సముద్రం ,కొండసముద్రం అనే రెండు చెరువులున్నాయి .నిత్యార్చనలు విశేషార్చనలు జరుగుతూనే ఉంటాయి .దసరా కార్తీక మాసాలలో ఏకాదశీ పర్వ దినాలలో శివరాత్రికి సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జ్వాలా తోరణాలతో ఆలయం శోభాయమానం గా ఉంటుంది .స్వామి వారల ఊరేగింపు ఉంటుంది .

ఆలయం గజ పృష్ట ఆకారం(ఏనుగు వెనుక భాగం ) లో ఉండటంఒక ప్రత్యేకత .విమానం పావురం గూడు ఆకారం లో ఉండటం మరో విశేషం . కపోతేశ్వరునిపై పొన్నూరు సంస్క్రుతకళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రీ గారు ‘’కపోతేశ్వర శతకం ‘’రాశారు
పూర్తి సేకరణ.

గురువు సలహా ఫలం....

చంపారణ్య ప్రాంతంలో హిరణ్యపురం అనే చిన్న రాజ్యం. దాని రాజు భాస్కరవర్మ. అతడి పాలనా చాతుర్యం వల్ల  ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఆ రాజ్యం శత్రుదుర్భేద్యం ఏమీ కాదుగానీ.. ఆ రాజ్యం చుట్టూ ఉన్న రాజులందరితో భాస్కరవర్మ స్నేహభావంతో ఉండటం వల్ల వారూ అలాగే ఉండేవారు. భాస్కరునికి తమ రాజ్యపు పురాతన సంస్కృతీ సంప్రదాయాలంటే ఎంతో శ్రద్ధ. అతని ప్రజలకూ అంతే. గొప్ప పర్యాటక క్షేత్రంగా ప్రసిద్ధిచెందిన హిరణ్యపురంలో ఉన్న అతిపురాతన దేవాలయాలకు అన్ని రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి దర్శించుకునేవారు. దీనివల్ల ఆ రాజ్య ఆదాయం బాగా పెరిగింది. హిరణ్యపురానికి ఉత్తరాన ఉన్న ఒక మిత్రరాజ్యానికి అవతల మహాకిరాత రాజ్యం ఉంది. అక్కడ ఉన్నరాజుకి, ప్రజలకూ కూడా పొరుగు రాజ్యాల మీద పడి దోచుకుతినడమే అలవాటు. పేరుకు రాజరికం అయినా.. అక్కడి ప్రజలు రాజు మాట వినరు.
అందరికీ తెలిసిన విద్య ఒక్కటే. దోచుకుతినడం. దాచుకు తినడం తెలియదు. అంతేగాక పక్కరాజ్యాల్లో కృత్రిమమైన ఈతిబాధలను సృష్టించడం  కూడా వాళ్లకు తెలిసిన విద్యలలో ఒకటి. హిరణ్యపురం సంపన్నరాజ్యం అవటం వల్ల వారు దానిమీద కన్ను వేశారు. ముందుగా ఒక పథకం ప్రకారం తమకు హిరణ్యపురానికి మధ్యన ఉన్న చిన్న రాజ్యాన్ని కబళించడానికి ఒక పన్నాగం పన్ని.. లక్షలాది మిడతలను .  ఆ రాజ్యం మీదకు వదిలారు. పంటలన్నీ  నాశనమైపోతున్న తరుణంలో ఆ మిత్రరాజ్యపు రాజు భాస్కరునికి వర్తమానం పంపాడు. భాస్కరునికి కిరాతకుల పన్నాగం అర్థమైంది. వెంటనే రాజగురువు దగ్గరకు సలహా కోసం వెళ్లాడు. రాజగురువు ఒక్కనిముషం ఆలోచించి.. ‘‘అతివృష్టి, అనావృష్టి, మిడతలు, ఎలుకలు, పక్షులు, పొరుగున ఉండే దుష్టరాజులు.. ఈ ఆరు కారణాల వల్ల ఏర్పడే కష్టాలకు ఈతి బాధలని పేరు. ఈ కష్టాలలో ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క విధమైన పరిష్కారం ఉన్నది.  మిడతల సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మీ చుట్టుపక్కల రాజ్యాల వారందరితో సంప్రదించి నే చెప్పినట్టు చెయ్యండి’’ అని ఒక ఉపాయం చెప్పాడు. దాని ప్రకారం రాజులందరినీ కూడగట్టిన భాస్కరుడు.. ‘‘మనం మన రాజ్యాల చుట్టూ, పంటపొలాల చుట్టూ తగినంతదూరంలో కంచెలను వేసి  జ్వాలాతోరణాలను వెలిగించాలి. ఇలా ఒక వారం రోజులు చెయ్యండి. అలాగే జ్వాలామాలినీ దేవిని ఉపాసించండి’ అని చెప్పాడు. రాజులందరూ భాస్కరుడు చెప్పిన విధంగా చేశారు. ఆ రాజ్యాల వైపు వచ్చిన మిడతలన్నీ ఆ జ్వాలాతోరణాల్లో పడి దగ్ధమయ్యాయి. అనూహ్యంగా పగటి సమయాలలో పంటచేలల్లోకి లెక్కలేనన్ని తొండలు వచ్చి ఒక్క మిడుతను కూడా మిగలనివ్వకుండా మింగేశాయి. ఆ తరువాత భాస్కరుడు మిత్రరాజులందరినీ కూడగట్టుకుని కిరాతదేశం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని జయించాడు.

రాజగురువుకు జరిగింది విన్నవించి.. ‘‘ఆ తొండలు ఎక్కడినుంచి వచ్చాయి?’’ అని అడిగాడు. ‘‘మిడతలకు శత్రువులు అగ్ని, తొండలు.  మీరందరూ జపించిన జ్వాలామాలినీ మంత్రప్రభావమది.  అది కేవలం భౌతికమైన రక్షణను ఇవ్వడమే కాదు. మిడతల దండులాగా మనిషిని ముసురుకునే కోరికలను పారద్రోలి ఆధ్యాత్మిక వికాసాన్ని సాధించడానికి కూడా జ్వాలామాలినీ ఉపాసన ఉపకరిస్తుంది’’ అని చెపాడు. గురువుకు నమస్కరించి నగరం వైపుకు బయల్దేరాడు రాజు. మనం నమ్మిన దైవచింతన చేసుకుంటే మనో బలం పెరుగుతుంది. మిడతల దండువలే ఆవరించే కోరికలు జ్ఞానాగ్ని వల్ల దహింపబడతాయి. వాటివల్ల మనలోని ఆటవికతత్వం అంతరిస్తుంది.

**************************

సుఖసంతోషాలు,



నిరాశా వ్యాకులతలనే ద్వంద్వాలతో మన హృదయాన్ని కలతచెందనీయరాదు.

శారీరక శక్తులు కేంద్రీకరించబడి, ఏకాగ్రమైనప్పుడే ఒక వ్యక్తి ఉత్తమంగా ప్రయత్నించగలడు.

కానీ మనస్సు కేంద్రీకరింపబడకుండా శరీరం నిలకడ పొందదు.

 శరీరం గురించి ఆలోచించడం ద్వారా శరీరాన్ని నియంత్రించలేం.

ఉన్నతమైన విషయాలను ఆలోచించడం ద్వారా,
వాటిని శరీరానికి సమస్వయించడం ద్వారా మాత్రమే శరీరాన్ని నియంత్రించగలం.

మనశ్శరీరాల రెంటినీ ఈ పద్దతి ద్వారా ఏకం చేసి సమస్థితిని పొందవచ్చు.

 మనం జనసమూహంలో ఉన్నప్పుడూ,
ఒంటరిగా ఉన్నప్పుడూ,
అన్ని వేళలా ఈ సమత్వస్థితిని సాధన చేయాలి.

మనం అన్ని సమయాల్లోను పవిత్రత మరియు ప్రశాంత మనస్సును కలిగి ఉండాలి.

*శ్రీకృష్ణార్పణమస్తు*

పోత‌న త‌ల‌పులో-- (6)

నా,నేను అన్న భావ‌న‌ను వ‌దిలి, భాగ‌వ‌త‌ర‌చ‌న‌లో అడుగ‌డుగునా
స‌ర్వ‌స‌మ‌ర్ఫ‌ణ భావ‌న‌ను  ప‌లికించి తెలుగు జాతిని మేల్కొలిపిన మ‌హిత‌మూర్తి పోత‌న‌...

                                ***
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ! మేల్
పట్టున్ నా కగుమమ్మ, నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

                             ****

త‌ల్లీ, సరస్వతీదేవి! నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను;  రెల్లుపొద‌లో పుట్టిన కుమార‌స్వామిని కాను ; పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను (అంత‌టి గొప్ప వాడిని కాను);
కానీ త‌ల్లీ ! ఈ భాగవత రచన కు సంక‌ల్పించాను. నాకు త‌గినంత శ‌క్తిని ప్ర‌సాదించుత‌ల్లీ! బ్రాహ్మ‌ణీ
 దయామయీ!
  స‌ర్వం నీవై న‌డిపించుత‌ల్లీ , భారం అంతా నీదే, అని ద‌యామ‌యిపై భారం వేసి క‌లం క‌దిలించాడు పోత‌న‌. అంత‌టి భ‌క్తి క‌ల‌వాడు క‌నుకే అమ్మ ఆయ‌న చేత భాగ‌వతంలో 9 వేల కు పై బ‌డిన పద్యాల‌ను అల‌వోక‌గా ప‌లికించింది.

🏵️పోత‌నను స్మ‌రిద్దాం- తెలుగువారిగా త‌రిద్దాం🏵

శ్యామలా దండకం

ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||

వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||

స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||

దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః || —

నేడు ఉద్ధాం సింగ్ బలిదాన దినం

13-4-1919 నాటి సాయంత్రం జలియన్వాలా బాగ్ లో ఒక 14 సం. పిల్లవాడు, బ్రిటీష్ తూటాలకు బలై మరణించిన శవాలగుట్టలనుంచి ఒక్కొక్క శవాన్నీ బలం ఉపయోగించి లాగి పక్కకు పెట్టి బయటకు పంపడానికి సహకరిస్తున్నాడు.
వైశాఖీ పర్వదినాన బ్రిటీష్ దుర్మార్గపాలనకు నిరసనగా, అక్కడ సమావేశమైన షుమారు 20,000 మందిపైన 18-20 నిమిషాలపాటు నిరాటంకంగా తుపాకీగుండ్లవర్షం కురిపించాడు దుర్మార్గుడు జనరల్ డయ్యర్.

తూటాలకు బలైనవారు 2000 మందికి పైగా ఉంటారు. తప్పించుకోనిపోవటానికి వీలులేక గోడ నుంచి కిందపడి కొందరు, అక్కడ ఉన్న బావిలోకి దూకి కొందరు, తొక్కిసలాటలో కొందరు వెరసి మరో వేయిమందికి పైగా అసువులుబాశారు. చావగా మిగిలిన క్షతగాతృలను రోడ్లవెంట మోచేతులపైన నడిపించి, రహదారులను రక్తరంజితం చేసిన రాక్షసుడు డయ్యర్.

దీనికి ప్రత్యక్ష సాక్షిగా నిలచిన ఆ 14 స. సిమ్హకిషోరమే ఉద్ధాం సింగ్. ఆ యువకుని హృదయంలో ప్రతీకార జ్వాల ప్రజ్వరిల్లింది. డయ్యర్ ను మట్టి కరిపించటమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు.

మెట్రిక్యులేషన్ చేశాడు. వడ్రంగిగా పనిచేశాడు. అప్పటికి డయ్యర్ లండన్ కి వెనితిరిగివెళ్ళాడు. ఉద్ధాం సింగ్ తాను సంపాదించిన డబ్బుతో లండన్ చేరాడు. డయ్యర్ ను కాల్చి చంపటం కోసం పిస్తోలు కొనటానికి అక్కడి హోటల్ లో పనిచేశాడు. డయ్యర్ ఇంటి చిరునామాను సంపాదించాడు. పిస్తోలుతో అతనిని ఇంటిలో చంపటానికి ఇష్టపడలేదు ఉద్ధాం సింగ్. అతనిని బహిరంగంగానే చంపటానికి పధకం రచించాడు.

1940 మార్చి 30 న లండన్ లో వాక్స్ టౌన్ హాల్ లో ఆప్ఘనిస్తాన్ కు సంబంధించిన ఒక ఉత్సవం జరిగింది. దానికి భారత్ ఉండి వచ్చిన ఆంగ్లపాలకులు లార్డ్ లామింగ్టన్, లార్డ్ జెక్లండర్, సర్టాయ్ గవర్నర్ లతో పాటు మైఖేల్ డయ్యర్ లు వక్తలుగా ఆహ్వానించబడ్డారు. దానికి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఆహ్వానించబడ్డారు.

ఉద్ధాం సింగ్ దానికి లాయర్ వేషంలో బయలుదేరివెళ్ళాడు. న్యాయశాస్త్రగ్రంధంలోని పేజీలను తొలగించి అందులో పిస్తోలు ఉంచుకోని మీటింగ్ లోకి ప్రవేసించాడు.  వేదికపైనున్న వక్తలు తామెలా భారతీయులను అణగద్రొక్కినదీ వివరించారు. బిరుదులతో సత్కారాలు అందుకున్నారు. డయ్యర్ వంతువచ్చింది.

క్రింద కూర్చున్న ఉద్ధాం సింగ్ ఒక్కసారిగా లేళ్ళ గుంపు మీదకురికిన సింహం లాగా డయ్యర్ ముందుకురికి పిస్తోలుతో సూటిగా గుండెల్లోకి కాల్చి అంతమొందించాడు. నిశ్చేష్టులై, వణుకుతున్న వారిమధ్య ధీరుడుగా నిలచాడు. జలియన్ వాలాబాగ్ అమరుల ఆత్మలకు రక్త తర్పణ లర్పించిన ఉద్ధాం సింగ్ ప్రసన్నవదనంతో అక్కడి బ్రిటీష్ పోలీస్ కి స్వయంగా లొంగిపోయాడు.

తనను న్యాయస్థానానికి తీసుకెళ్ళినప్పుడు న్యాయమూర్తి, ఉద్ధాం సింగ్ ను ప్రశ్నించాడు. డైయ్యరు చంపిన తరువాత నువ్వు కావాలంటే తప్పించుకుపోవచ్చు. అయినా నువ్వు అందుకు ప్రయత్నించకపోవటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. అందుకు  ఉద్ధాం సింగ్ ఇలా అన్నాడు. “నేను పారిపోవడమంటే తెలియని వీరుడుని, భారతదేశంలో మేము తూటాలకు ఛాతీ చూపించి ఎదుర్కుంటామేగానీ వెనుతిరిగి పారిపోతూ తూటాలకు బలికావడం మా చరిత్రలో లేదు, నేను పుట్టిన పుణ్యభూమిలో వెన్ను చూపి పారిపోవడం అన్నది తెలియదు. పిరికిపందలే అలా చేస్తారు" అన్నాడు.

న్యాయమూర్తి మరొక మాట అన్నాడు.  "ఉద్ధాం సింగ్ నీవు పారిపోయి భారతదేశానికి చేరుకుంటే నీవంటి వారిని ఎంతో మందిని తయారుచేయగలిగే వాడివికదా"అని.
ఈ మాటలకు  ఉద్ధాం సింగ్ మీరు అందుకు చింతించనవసరం లేదు. మీరు ఏ రోజైతే నన్ను ఉరికంభం ఎక్కిస్తారో అదే రోజు భారతదేశంలో కొన్ని వేల మంది  ఉద్ధాం సింగ్లు పుట్టుకొస్తారు. అందుకే నేను పారిపోను. నేను పిరికివాడిని కాను నేను మీదేశంలో ఉరికంబం ఎక్కుతాను. ఆనందంగా ఉరికంబం ఎక్కుతాను. ఎందుకంటే నా జీవితంలో వెనుక వున్న ఏకైక లక్ష్యం నెరవేరింది.

జూలై 31, 1940 న చిరునవ్వుతో ఉరికంబమెక్కాడు ఉద్ధాం సింగ్.
అటువంటి పిరికి కండలేని ఉద్ధాంసింగ్ వంటి ఉద్యమవీరునికి జన్మభూమి అయిన భరతభూమ కృతజ్ఞతతో పులకరించిపోయింది.
************************

*స్వామి వివేకానంద సూక్తి*

*అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయునిగా చేసకోగలనని భావిస్తాడు. కానీ ఎన్నో సంవత్సరాలు కొట్టుమిట్టాడిన తరువాత స్వార్థాన్ని చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని, తన సౌఖ్యం తన చేతిలోనే ఉన్నదని ఇతరుల చేతిలో లేదనీ గ్రహిస్తాడు.*

*Swami Vivekananda's quote*

*The foolish man thinks he can make himself happy. But after many years of lingering he realizes that killing selfishness is the real comfort, that his comfort is in his own hands and not in the hands of others.*

*శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

రామాయణమ్ .. 17

ఒక్కసారిగా తన కూతుళ్ళందరకూ వికృత రూపం ప్రాప్తించినా కుశనాభుడు ఆందోళన చెందక వారి వివాహం గూర్చి మంత్రులతో ఆలోచన చేశాడు.
.
గొప్ప తపఃసంపన్నుడైన చూళికి సోమద అనే గంధర్వస్త్రీయందు జన్మించిన బ్రహ్మదత్తుడు తగిన వరుడు అని నిశ్చయించి ఆతనికిచ్చి పాణిగ్రహణము జరిపించాడు ! .
.
ఆతని కరస్పర్శ అందరు యువతుల వికృతరూపాన్ని పోగొట్టి తిరిగి నవయవ్వనసౌందర్యాన్ని ప్రసాదించింది!..
.
కన్యాదానము చేసిన పిమ్మట కుశనాభుడు పుత్రకామేష్టి చేశాడు ,అప్పుడు కుశుడు ,కుశనాభుతునితో పుత్రా నీకు తగినవాడు ,ధార్మికుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అంతర్ధానమవుతాడు.
.
అంత కుశనాభునకు గాధి అనే పేరుగల కుమారుడు జన్మించాడు!
.
ఆ గాధి యే మా నాయనగారు అని పలికి ,రామా,! ఇప్పటికే అర్థరాత్రి అయినది ,చెట్లు అన్నీ కూడ నిశ్చలంగా ఉన్నాయి,పక్షుల కదలిక ఏమాత్రమూ లేదు,మింటచుక్కలు మెరుస్తున్నాయి! చంద్రుడు పూర్తిగా ఆకాశంలోకి వచ్చి చల్లని కాంతితో ప్రాణులను ఆనందింప చేస్తున్నాడు ,రామా ఇక నిదురపోవయ్యా! అని పలికి మహర్షి తానుకూడా విశ్రమించాడు!
.
తెలతెలవారింది సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని మరల నడక సాగించారు!
అలా నడచి,నడచి గంగా తీరాన్ని చేరారు అందరూ!
.
ఆ గంగా నది శాంతగంభీరంగా ప్రవహిస్తున్నది ,పుణ్యజలాలతో ,హంస,సారస పక్షులతో  మనస్సుకు ఆహ్లాదాన్ని జనింపచేసే ఆ నదిని చూసి రాముడు ఆశ్చర్యంతో మునిని ప్రశ్నించాడు! గంగ మూడులోకాలను ఎట్లా ఆక్రమించింది? సముద్రంలో ఎలా ప్రవేశించింది తెలుసుకొన గోరుతున్నాను స్వామీ అని అడిగాడు!


(పాణి గ్రహణము అంటే చేతిని స్పర్శించటం ! స్పర్శ కలుగజేసే స్పందనలు అనేకము! స్త్రీ, పురుష విచక్షణ లేకుండా ఎంత మందితో పాణిగ్రహణం చేస్తున్నాం మనం ! మనం గొప్పగా చెప్పుకొనే సంస్కృతి ఉన్నట్లా గంగలో కలిసినట్లా?).
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

అశ్వినీ దేవతలు..!!ఎవరు?

అశ్వినీ దేవతలు..!!ఎవరు?విశిష్ఠతలు ఏమిటి?

అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు..
వీరు కవలలు. 
వీరిసోదరి ఉష. 
ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. 
ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి 
తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. 
వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. 
అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. 
ఆ రథం చాలా బృహత్తరమైనది. 
అది హిరణ్యంతో నిర్మించబడింది. 
ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతోత్యంత ఉత్సాహంతో ఉంటాయి. 
చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. 
సారధి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. 
ఆరథంలో ఓకవైపు ధనం 
మరొకవైపు తేనె, సోమరసం 
మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. 
రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. 

అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది. 
ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. 
ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. 
వీరి చేతిలో తేనె, సోమరసం మరియు మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు. 
వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. 
వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది. 
వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. 
ఈ దేవతలు దయార్ధ హృదయులు, 
ధర్మపరులు మరియు సత్యసంధులు. 
వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. 
వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. 
వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు 
కుడిచేతిలో అభయముద్ర 
ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం 
కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు 
ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ 
కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. 
ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు....

హవిర్భాగం పొందుట.
అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు. 
వృద్దుడైన చ్యవనమహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన సుకన్య భార్యగా లభించింది. 
సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చ్యవనమహర్షి ఆమెను సంతోషపెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది. 
అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్వినీ దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు. బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు..

ఋగ్వేదం.
అశ్వినీ దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి. 
కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను. 
మిథున రాశి లోని కేస్టర్‌, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి. 
అశ్వినిలు నాటి దేవ ప్రజాసమూహమునకు, 
అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా, 
ఓడలతో వ్యాపారము జేయువారుగా ఉండి 
ప్రజాసేవ చేయుచుండునట్లు ఋగ్వేదమున ఈ క్రింద దృష్టాంతరమున కన బడుచున్నది. 
వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి.

శయుడను ఋషియొక్క గోవుఈనలేని స్థితిలో నుండగా, వీరు దానిని ఈనినట్లు సాయపడిరి.
రేభుడు, నందనడని ఋషులను రాక్షసులు బడద్రోయగా వారిని రక్షించిరి.
ఇట్లే తుభ్యుడు, అంతకుడు అను వారలను గూడ రక్షించిరి.
పరావృజుడను ఋషికి కాళ్ళు పోగా నూతనముగ నిర్మించిరి.
ౠజాశ్వుడను వానికి అంధత్వమురాగా, 
నాతని కన్నులు బాగుచేసి దృష్టి వచ్చునట్లు చేసిరి.
ఖేలుని భార్యయగు విశ్వలాయువతికి యుద్ధమునందు కాళ్ళు విరిగిపోగా, 
లోహపు కాళ్ళు ఏర్పరిచిరి.
కణ్వపుత్రుడగు పృధుమహారాజునకు మంచి గుర్రములను ఇచ్చి పేరొందిరి.
అత్రి ఋషిని రక్కసులు గొంపోయి యొక యంత్రగృహమున బడవేసి వేధించుచుండగా, 
ఆతనిని చెరనుండి విడిపించిరి.
శయుడు, శర్యుడు, శర్యాతుడను వారలకు కావలసిన సాయములిచ్చిరి.
విమదుని భార్యను, భుజ్యుని, అద్రిగుని, ఋతస్తుపను, సుభరను, కుత్సుని, తుర్వీచిని, దభీతిని, ధ్వసంతిని, పురషంతిని, చ్యవనుని రక్షించిరి. 
అనగా వీరందరికిని వైద్యము చేసిరి అనుటయే. 
ఇందులో భుజ్యుడు సముద్రమున ఓడలో నుండి మునిగిపోవుచున్న పుడు వీరు కాపాడిరట. 
చ్యరనుకి నూత్న యవ్వనము వచ్చునట్లు చేసిరట.
కక్షివంతు డనువాని కూతురు ఘోషకు కుష్టురోగమును కుదుర్చిరి.
వృషదుని కుమారుడు చెవుడుచే బాధ పడుచుండగా, దానిని నయముచేసిరి.
కణ్వఋషి కన్నులు కానరాక ఉండగా బాగుచేసి దృష్టివచ్చునట్లు చేసిరి.
వేదుడను రాజును శత్రువులు యుద్ధమున బాధించునపుడు ఆతనిని రక్షించిరి.

ఈ దృష్టాంతములను బట్టి అశ్వినిలు శరీరధారులైన పూర్వకాలపు దేవజాతి అనబడు నరులలో పుట్టి పేరొందిన వారైనట్లు స్పష్టము.
కాని ఈ కార్యములు మొదట అశ్వినిలిరువురే చేసిరని అనజాలము. 
వారి సంతతి వారందరును కొన్నాళ్ళవరకు అశ్వినులనియే పిలువబడినట్లు గ్రహించినచో కాల వ్యత్యాసము లేకుండపోవును. 
ఎందువలన అనగా, పైన పేర్కొనిన వారందరును ఒకేకాలపు మానవులనుటకు వీలులేదు.
ఈ అశ్వనిలు మొదట కంచర గాడిదలపై ఎక్కి తిరుగుచుండిరట. 
తరువాత ఋభువు లను వడ్రంగులు వీరికొక రథమును చెక్కి బహూకరింపగా, దానిపై కూర్చొండి తిరుగుచుండిరి. ఈ రథమునకు క్రమముగా ఎడ్లు, గుర్రములు, మొసళ్ళు, కట్టినట్లు కొన్ని ఋక్కులలో ఉంది. 
సముద్రముపై ప్రయాణముచేసి తర్వాత రథమెక్కి ఆకాలపు ప్రజలకు సాయపడుటకై వీరు వచ్చుచున్నట్లు కొన్ని ఋక్కులలో ఉంది. 
అందువలన వీరు పలు దేశములు తిరుగుచుండిరైరి..!!

చిన్న సహాయం - చిన్న కధ


‘‘ రెండు కిలోల ఆశీర్వాద్ వీట్, రాగి పిండి ప్యాక్ చేయండి...’’ అని కిరాణా షాప్ లో  బిల్ పే చేయబోతుంటే... 
‘‘ అన్నా కిలో బియ్యం ఎంత...?’’ అని అడుగుతోంది ముక్కుకు చెంగు చుట్టుకున్న అమ్మాయి. పాతికేళ్లు ఉండచ్చు...కాళ్లకు చెప్పులు లేవు. చేతిలో చిన్న సంచి...
‘‘ నువ్వు కొనలేవులే ఎల్లమ్మా...’’ అని విసుక్కున్నాడు. షాపతను.
‘‘ ఎక్కడుంటావమ్మా...?’’ అని అడిగాను. 
‘‘ యూసఫ్ గూడ బస్తీలో అన్నా... పనిపోయింది.  పైసలు లేవు.. ఇరవై రూపాయలే ఉన్నయి... రెండు రోజుల నుండి బ్రెడ్ తింటున్నాం..’’ అన్నది. ఇంకా వివరాలు అడగాలని పించ లేదు.
‘‘ నీకేం కావాలో తీసుకోమ్మా...’’ అని షాపతను వైపు తిరిగి ఆమె బిల్లు కూడా నా దాంట్లో కలిపేయి.. అన్నాను.
‘‘ కిలో బియ్యం , కొంచెం కందిపప్పు చాలన్నా ..’’ అంది, ఆమె అమాయకంగా...
 ఉచితంగా తీసుకోవడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డువస్తున్నట్టు అనిపించింది.
‘‘ నెలకు సరిపడా సరుకులు తీసుకొని వెళ్లమ్మా... ఇపుడు నేను పైసలు ఇస్తా...నీకు పని దొరికినపుడు, నాకు తిరిగి ఇయ్యి... ఈ షాపుతనకి నా వివరాలు తెలుసు. ’’ అని ఆమెకు కావాల్సినవి ప్యాక్ చేయించి ఆటో ఎక్కించి పంపాక, 
‘‘ అమె మళ్లా ఇస్తాదంటారా సార్...?’’ అన్నాడు షాపతను.
 ‘‘ అమె ఇస్తుందా, లేదా వేరే సంగతి, మనం ఉచితంగా సాయం చేసినట్టు అమె ఫీల్ కాకూడదు. కష్ట జీవులకు ఆత్మాభిమానం ఎక్కువ. దానిని గౌరవించాలి.’’ అని, మొత్తం బిల్ పే చేశాను.
 షాపతను,  రెండువందలు తిరిగి ఇచ్చాడు!!
‘‘ మీరు అంత చేసినపుడు, నేను కూడా కొంత చేయాలి కదా...వ్యాపారంలో పడిపోయి, ఏదో మిస్ అవుతున్నట్టుంది సార్..ఇపుడు మనసుకు ఎంతో హాయిగా ఉంది..’’ అని నాకిష్టమైన లిమ్కా బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు

Subramanya Temple*

*Tiruchendur Lord Subramanya Temple*

Lord Muruga’s temples used to be in hills and mountains, Tiruchendur Temple is so special that it’s located at a sea shore. 

It is also one of the six major abodes of Subramanya aka Muruga. 

Tiruchendur is one of the largest and most powerful temples in India.  

It is situated at Tuticorin District, Tamilnadu ; about 60 km south-east of Tirunelveli, 40 km from Tuticorin and 75 km north-east of Kanyakumari.

The gushing tides of “Bay of Bengal” wash the foot of the temple. All the pilgrims cool off their foot or take bath in the sea before they enter into the temple. 

People do visit and take bath in another miracle water “Nazhi Kinaru”. It is a small well, pours crystal clear and sweet to taste water, which is just about 50 feet away from the sea.

As usual the darshan starts with lord Ganesha shrine inside the temple. Then you’ll get the glimpse of sanctum of lord Subramanya. 

Main God Sri Subramanya Swamy’s Idol is just about 2 feet height and he is so elegant and charming that devotee's eyes would wish to rest there forever.

You can also go and visit the Pancha Linga shrine (5 lingas), which is under a cave, right below the sanctum. People say that the lord Subramanya performed puja to the Pancha linga to overcome his anger after killing the demon Surapadman. 

Inside the cave, there’s a narrow opening to the sky thru’ which Lord Devendra also offers his prayers to Shiva. 

As it’s believed that the lord subramanya himself performing puja to the lingas, no one else is allowed to perform Puja here.

Next is the Utsava murthy - Shanmugar is just right next to the sanctum. The Shanmuga idol itself has a big history/story to trace behind. 

It’s believed that in the early 17th century AD, Shanmuga’s idol looted away by the Dutch government and was carried away in their ship. There was a sudden storm and the Dutch grew afraid and threw the idol into the sea. 

Vadamalaiyappa Pillai, an ardent devotee of Lord Muruga saw a vision of the idol's position in his dream. Immediately, he and several other devotees rushed to the spot where as foretold in the dream a lemon was floating and Garuda was flying over the spot. 

They dove into the sea and recovered the statue. We still can see the salty sea burns on the idol.

On the outer sanctum, there is a Maha Vishnu sannidhi (with a Ranganatha shrine curved on the sandal stone rock ). Then there is the Kalyana Ganapathi shrine. 

Outside the temple, you could visit the Valli cave temple, where Valli, one of the consorts of the Lord hid herself when Lord Ganesha took the form of an elephant and frightened her, to help Lord Subramanya during His romance with Valli.

Skanda Shasti is one of the grand celebrations here - corresponding to the six days of the war over the evil forces. 

Devotees undertake fasts, prayers and devotional singing to Lord Muruga and most of the devotees stay in the temples during these six days.

Dedicated prayer during the Skanda Shasti vratham would come true. 

This is truly one of the most powerful temples, any devotee would wish to visit at least once every year.

*Lord Subramanya shall shower His Blessings on everyone who reads this*.

******************************

*హోమగుండం*

విశ్వకల్యాణానికి, ఇష్టకామ్యాలు నెరవేర్చుకునేందుకు ఎందరో హోమాలు చేస్తారు. ఇవి ఆధ్యాత్మికంగా తృప్తిని ఇస్తాయి. వైజ్ఞానికంగా ఆరోగ్యాన్ని ప్రసాదించి వాతావరణంలోని కాలుష్యాలను నిర్మూలిస్తాయి.

ప్రశస్తమైన ఇటుకలు, శ్రేష్టమైన మట్టితో వృత్తాకారం, చతురం, త్రిభుజాకారాల్లో హోమగుండం నిర్మిస్తారు. హోమగుండాల నిర్మాణ ప్రక్రియ శాస్త్రబద్ధంగా ప్రత్యేక కొలతలతో ఉంటుంది. హోమ వేదికను శ్రద్ధగా అలంకరిస్తారు. ఆయా క్రతు నిర్వహణలదృష్ట్యా హోమగుండాలు తొమ్మిది, పద్దెనిమిది, ఇరవైఏడు, యాభై నాలుగు, నూటా ఎనిమిది... ఇంకా అధికంగానూ ఉంటాయి. ఈ నిర్మాణ ప్రక్రియలను మహాభారత యుద్ధంలోని వ్యూహనిర్మాణాలతో పోలుస్తారు. గణపతి, రుద్ర, చండీ, నవగ్రహహోమాలు ఇలా ఎన్నో దేవీదేవతల ప్రీత్యర్థం... వారి పేర్లతో జరుగుతుంటాయి.

అగ్నిని దైవంగా భావిస్తారు. దేవతలు అగ్నిముఖులని వేదం చెబుతుంది.

హోమగుండంలో సమిధలుగా రావి, మర్రి, చండ్ర, మేడి, జువ్వి వంటి వృక్షజాతుల కలపను, పుల్లలను వాడతారు. ఈ వృక్ష జాతుల్లో ఔషధీయ గుణాలు ఉన్నాయి. ఈ సమిధలను జ్వలింపజేసేందుకు అగ్ని మధనం జరుగుతుంది. శ్రేష్టమైన చేవ కలిగిన చండ్రకర్రముక్కల రాపిడితో అగ్ని సూక్తాన్ని పఠిస్తూ నిప్పును పుట్టించి, హోమాగ్నిని జ్వలింపజేస్తారు. దీన్ని ‘అరణి’ అంటారు. హోమగుండంలో ద్రవ్యాలను స్వాహా, స్వధా అన్న మంత్రస్వరాలతో అగ్ని సమర్పణగా వేస్తారు. ఈ ఆహుతులను మృగ ముద్రతో వేస్తారు. అంటే బొటనవేలు మధ్యవేలు, ఉంగరపు వేళ్లను ఒకటిగా చేసి హోమద్రవ్యాలను గుండంలో వేస్తారు.

పాయసం, పాలు, పెరుగు, చెరకు, అటుకులు, మారేడుకాయలు, ఆకులు, పూలు, నవధాన్యాలు, జిల్లేడు, తేనె, బియ్యం వంటి వాటిని హోమద్రవ్యాలుగా ఉపయోగిస్తారు.

ఆవు నెయ్యిని ప్రధానంగా స్రుక్‌, స్రువాలతో హోమగుండంలో వేస్తారు. స్రుక్‌ స్రువాలంటే చండ్రచెక్కతో చేసిన మూరెడు పొడవున్న గరిటెలు. ఆవు నెయ్యికి విషతుల్యమైన పదార్థాలను తొలగించే స్వభావం ఉంది. హోమధూమం మొక్కల్లో పత్రహరితాన్ని అధికం చేస్తుందని, పోషకవిలువలు అందిస్తుందని వేదవాఙ్మయ పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. ఆ ధూమంతో విషకీటకాలు, పురుగులు నశించి వాతావరణ శుద్ధి జరుగుతుంది.

హోమద్రవ్యాల్లోని మూలికల శక్తివల్ల వ్యాధుల ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. హోమంలో చివరి ఘట్టం పూర్ణాహుతి.

మన శక్తిసామర్థ్యాలు పరిమితమై ఉంటాయి. కానీ మనలో అంతర్గతంగా ఉండే ‘ఆత్మశక్తి’ అపరిమితంగా ఉంటుంది. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా, మనకు ఆధారంగా, సమీపంలోనే సహాయకారిగా ఒక అనంతశక్తి ఉందన్న విశ్వాసాన్ని అంతరంగం మనకు ఎరుక చేస్తూనే ఉంటుంది. దీన్ని సాధనా మార్గంలోకి తెచ్చుకునేందుకు హోమం ఒక దివ్యమైన ఉపకరణం.

మానవ జన్మకు మూలాధారం అగ్ని. అదే ప్రాణాధారం. ‘అగ్నిదేవా! హోమ సమయాల్లో మాచే ఆహ్వానం పొంది, హవిస్సులు స్వీకరించి మమ్ములను ఆనందింపజేస్తున్నావు. ఎంతో పవిత్రతను కల్పిస్తున్నావు. మాకు జ్ఞానాన్ని ప్రసాదించు చెడు నుంచి రక్షించు’ అంటుంది దుర్గాసూక్తమ్‌.

‘సమిధలు, హోమద్రవ్యాలు సమర్పిస్తున్నాను. ఇవి నా ఆత్మ సమర్పణగా స్వీకరించు. నాలో కాలుష్యాలను తొలగించు. సత్యప్రకాశాన్ని ప్రతిష్ఠాపన చేయి!’ అంటుంది మహానారాయణోపనిషత్తు.

మనిషి నిత్యాగ్నిహోత్రుడై భాసించాలి. అంతరంగ శుద్ధితో దైవస్వరూపుడిగా వెలుగొందాలి.
**********************

ఈ కధ ఎంత మంది విన్నారు...?

అనగనగా ఒక రాజు... ఆ రాజుకి 7 కొడుకులు...ఈ కధ ఎంత మంది విన్నారు...? ఎంత మందికి గుర్తుంది.?
అసలు ఈ కధ (పరమా)అర్ధం తెలుసా మీకు..?
కథ: అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు.
ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒకచేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమేటు అడ్డమొచ్చింది. గడ్డిమేటా... ఎందుకు అడ్డమొచ్చావ్... ఆవు మెయ్యలేదు. ఆవా ఎందుకు మెయ్యలేదు... కాపరి మేపలేదు. కాపరీ ... ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా...ఎందుకు అన్నంపెట్టలేదు... పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడా... ఎందుకు ఏడిచావు... చీమ కుట్టింది. చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది.
రాజుగారు అంటే మనిషి. ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు. వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట. 7 చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు (కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దు బారాగా ఖర్చుచేయుట). ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పారు . ఎండపెట్టము అంటే వ్యసనాల్ని జయించుట. సాథన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు. ఒకచేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలిన వాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అన్నారు . కామాన్ని జయించము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది. అయిననూ అదికూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తోలగుటయే కదా మోక్షము. చేప ఎండక పోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే గడ్డి మేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞా నము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నా నన్న భావన) తొలగుట కష్టము.
కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు. గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞా నము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడు తుంది. ఆవు ఎందుకు మేయలేదు అంటే కాపరి మేపలేదు. కాపరి అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది. "కృష్ణం వందే జగద్గురుం". జగద్గురువు శ్రీకృష్ణుడే. కాపరి ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, తీసుకొని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞలేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను. ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు. జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి భాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరి తపిం చటమే చీమ కుట్టి ఏడవటము. చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట. చివరకు అనురక్తి తొలగి సంసార బాథలనుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరిత పించును. కథ సారాంశము: సప్తథాతువులతో కూడిన మనిషి సాథన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించి ననూ 7వది అయిన కామముకు జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాథపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్న ప్పుడు మాత్రమే దైవా నుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును(#మోక్షం ) చేర్చును. కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది
*****************************

రాత్రి ఆహారం

రాత్రి ఆహారం తీసుకోవడం మనేయవచ్చా

*మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అంటే రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే  నియమనుసారం, సమయానికి ఆహారం తినకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోజుకి మూడుసార్లు ఆహారానికి మధ్య తగినంత సమయం ఉంటుంది. ఉదయం పలహారనికి, రాత్రి భోజనానికి మధ్య చాలా విరామ సమయము ఉంటుంది. రాత్రి భోజనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్ళీ ఆహారం తినడానికి ఇంకా ఎక్కువ సమయం అవుతుంది. కారణంగా శరీరం తన శక్తిని కోల్పోయి బలహీన పడుతుంది. శరీర క్రియావ్యవస్థ పనిచేయడానికి కావలసిన శక్తి తగినంతగా శరీరానికి అందదు. అంతక ముందు కాలంలో ఎక్కువగా తిని పెంచిన కొవ్వు చర్మంలో, కాలేయంలో, శరీరంలో ఇతరభాగాల్లో నిలవ ఉంటుంది. అది మనం ఆహారం ఏమి తిననప్పుడు కరిగి శరీరానికి తాత్కాలికముగా బలాన్ని చేకూరుస్తుంది. కానీ అది కూడా శరీరాన్ని బాగా అలసిపోయేలా చేస్తుంది. అదే పనిగా మళ్ళీ మళ్ళీ సమయానికి ఆహారం తీసుకొనకపోతే ఆరోగ్యం దెబ్బతిని వివిధ రోగాలకు దారి తీస్తుంది.*

*సర్వేజనా సుఖినో భవంతు.... మీ ఆకొండి రామ మూర్తి....
*******************

శ్రీ ప్రుద్వీశ్వరాలయం

శ్రీ ప్రుద్వీశ్వరాలయం నడకుదురు

కృష్ణా జిల్లా చల్లపల్లికి దగ్గరున్న నడకుదురు లో కృష్ణానదీ తీరం లో శ్రీ ప్రుద్వీశ్వరాలయం బహు ప్రాచీనాలయం ద్వాపర యుగం నాటికే ఇక్కడ పరమేశ్వరుడు ప్రుద్వీశ్వరుడిగాస్వయంభు గా  వెలిశాడు .

స్పటిక లింగం గా కనిపించి భ్రూమధ్యమం బొటన వ్రేలు పట్టే  రంధ్రం లింగానికి ఉండటం ప్రత్యేకత .ఇక్కడ నరకాసురుడు ‘’ద్విముఖుడు ‘’అనే బ్రాహ్మణుడిని సంహరింఛి ,పాప పరిహారం కోసం ఈ ప్రుద్వీశ్వరునికి పూజలు చేశాడు

ఒకప్పుడు చాలా ఎత్తుగా ఉండే ఆలయం ఇప్పుడు కొంత భూమిలోకి దిగిపోయింది . ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం .అమ్మవారు బాలా త్రిపుర సుందరి ..ఒకప్పుడు దీనికి ‘’నరకోత్తారక క్షేత్రం ‘’అని పేరు అదే నడకుదురు అయింది.

శ్రీకృష్ణుడు సత్యభామా సమేతం గా నరకాసురుడిని సంహరించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నారాయనులను పూజించాడు .దేవ వనం నుంచి ‘’పాటలీ వృక్షాలు ‘’తెచ్చి నడకుడురులో నాటాడు .శ్రీకృష్ణుని చేత పూజ లండదుకొన్న లక్ష్మీనారాయణ విగ్రహాలు ఇక్కడి ‘’కార్తీక వనం లో ఉన్న గుడి ‘’లో చూడవచ్చు .

పాటలీ వ్రుక్షాలున్న ఏకైక క్షేత్రం నడకుదురు.
ఈ వృక్షాలను వేరొక చోట పాతితే బతకలేదు. కార్తీకం లో పాటలీ వృక్షాలు పూస్తాయి. పాటలీ పుష్పాలతోనే స్వామికి పూజ చేస్తారు .లలితాదేవినామాలలో ‘’పాటలీ కుసుమ ప్రియే ‘’అనేది ఉన్నది .సంతానం లేనివారు ప్రుద్వీశ్వర లింగ దర్శనం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం .

వందలాది  ఉసిరి చేట్లున్నవనం ఉంది. ఇందులో కార్తీక  వనభోజనాలు చేస్తారు .అరుదైన పాటలీ వృక్షాలు, సంతానాన్నిచ్చే ప్రుద్వీశ్వరుడు ,ఆమ్ల వనం ఇక్కడి ప్రత్యేకతలు.
పూర్తి సేకరణ.
****************