శ్రీ ప్రుద్వీశ్వరాలయం నడకుదురు
కృష్ణా జిల్లా చల్లపల్లికి దగ్గరున్న నడకుదురు లో కృష్ణానదీ తీరం లో శ్రీ ప్రుద్వీశ్వరాలయం బహు ప్రాచీనాలయం ద్వాపర యుగం నాటికే ఇక్కడ పరమేశ్వరుడు ప్రుద్వీశ్వరుడిగాస్వయంభు గా వెలిశాడు .
స్పటిక లింగం గా కనిపించి భ్రూమధ్యమం బొటన వ్రేలు పట్టే రంధ్రం లింగానికి ఉండటం ప్రత్యేకత .ఇక్కడ నరకాసురుడు ‘’ద్విముఖుడు ‘’అనే బ్రాహ్మణుడిని సంహరింఛి ,పాప పరిహారం కోసం ఈ ప్రుద్వీశ్వరునికి పూజలు చేశాడు
ఒకప్పుడు చాలా ఎత్తుగా ఉండే ఆలయం ఇప్పుడు కొంత భూమిలోకి దిగిపోయింది . ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం .అమ్మవారు బాలా త్రిపుర సుందరి ..ఒకప్పుడు దీనికి ‘’నరకోత్తారక క్షేత్రం ‘’అని పేరు అదే నడకుదురు అయింది.
శ్రీకృష్ణుడు సత్యభామా సమేతం గా నరకాసురుడిని సంహరించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నారాయనులను పూజించాడు .దేవ వనం నుంచి ‘’పాటలీ వృక్షాలు ‘’తెచ్చి నడకుడురులో నాటాడు .శ్రీకృష్ణుని చేత పూజ లండదుకొన్న లక్ష్మీనారాయణ విగ్రహాలు ఇక్కడి ‘’కార్తీక వనం లో ఉన్న గుడి ‘’లో చూడవచ్చు .
పాటలీ వ్రుక్షాలున్న ఏకైక క్షేత్రం నడకుదురు.
ఈ వృక్షాలను వేరొక చోట పాతితే బతకలేదు. కార్తీకం లో పాటలీ వృక్షాలు పూస్తాయి. పాటలీ పుష్పాలతోనే స్వామికి పూజ చేస్తారు .లలితాదేవినామాలలో ‘’పాటలీ కుసుమ ప్రియే ‘’అనేది ఉన్నది .సంతానం లేనివారు ప్రుద్వీశ్వర లింగ దర్శనం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం .
వందలాది ఉసిరి చేట్లున్నవనం ఉంది. ఇందులో కార్తీక వనభోజనాలు చేస్తారు .అరుదైన పాటలీ వృక్షాలు, సంతానాన్నిచ్చే ప్రుద్వీశ్వరుడు ,ఆమ్ల వనం ఇక్కడి ప్రత్యేకతలు.
పూర్తి సేకరణ.
****************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి