15, ఏప్రిల్ 2025, మంగళవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷శుక్రవారం 11 ఏప్రిల్ 2025🪷*


            *రామాయణం*

ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది.


       *వాల్మీకి రామాయణం*

              *5 వ భాగం*

                    

*తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ।*

*నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు॥*

*గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ ।*

*ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ॥*

```

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కరింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి,చైత్రమాసంలో, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. 

అదే సమయంలో కైకేయకి పుష్యమి నక్షత్రంలో, మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.

తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మ గారు దేవతలతో ఒక సభ తీర్చారు.... “శ్రీమహా విష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు, రావణసంహారంలో రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి” అని చెప్పారు. 


దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.


అప్పుడు బ్రహ్మ “ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి” అని అన్నారు. 


ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతో నీలుడు జన్మించాడు, వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.```


*అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్।*

*జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం॥*

*సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా।*

*వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా॥*``` 


రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటే అగ్ని బీజం, మ అంటే అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మం) కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని, శత్రువులను(అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.


తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.


అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు… “నా పిల్లలకి 12సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. 

వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. “మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను” అని దశరథుడు అన్నాడు.


అప్పుడు విశ్వామిత్రుడు “దశరథ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా, దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా, మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా?” అని పలు కుశల ప్రశ్నలు వేసి, “నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి” అన్నాడు.```


*స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం।*

*కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి॥*```


“నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా,మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను,” అని విశ్వామిత్రుడు అన్నాడు. 


ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.```


*ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః।*

*న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః॥*```


మెల్లగా తేరుకొన్న దశరథుడు, “ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు, కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటే, రాముడితో నేను కూడా వస్తాను.” అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.


“రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు!” అని విశ్వామిత్రుడు అడిగాడు.


అప్పుడు దశరథుడు “లేక లేక పుట్టిన నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు” అన్నాడు. 


ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, “చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు!” అని వెళ్ళిపోతున్నాడు. 


వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు… “ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా..?```


*ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ।*

*ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం॥*```


“ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు,శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర-శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ, ఎందుకు అడ్డుపడతావు?” అని అన్నాడు.


దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి “రాముడిని తీసుకురా” అని కౌసల్యతో చెప్పాడు. 


రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. 


స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. 


సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. 


దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతో… “నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి.” అని విశ్వామిత్రుడితో చెప్పాడు. 


“విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి” అని రాముడితో చెప్పి సాగనంపాడు. 


అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు.```


*రేపు... 6వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

.

సుందోపసుందులు కథ🙏

 🙏సుందోపసుందులు కథ🙏

   అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు లక్షాగృహంలో ఉండగా కౌరవులు లక్షాగృహాన్ని (లక్క ఇంటిని) తగులబెట్టారు. అది చూసి పాండవులు అయిదుగురూ ద్రౌపదితో సహా ఆ ఇంటిలోనే కాలి బూడిదై పోయారని ప్రజలు అనుకున్నారు.

   కాని, పాండవులు కాలి బూడిదవడం నిజం కాదు. వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు. స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని పడగొట్టి ద్రౌపదిని తీసుకుని వెళ్ళినవాడు బ్రాహ్మణ కుమారుడు కాదు. బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవ మధ్యముడు అర్జునుడే.

   తల్లి మాటని జవదాటని అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదిని పెళ్ళిచేసుకుని పాండవ పట్టమహిషిని చేశారు. ఈ విషయం నెమ్మది నెమ్మదిగా ప్రజలకి తెలిసింది.

   కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడి వరకూ ఈ విషయం వెళ్ళింది. ఎంతో సంతోషంతో విదురుణ్ణి పంపించి పాండవుల్ని, పట్టమహిషి పాంచాలిని, తల్లి కుంతీదేవితో సహా తన రాజ్యానికి రప్పించుకున్నాడు.

   వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇచ్చి ఆదరించాడు. దేవశిల్పి విశ్వకర్మని రప్పించి అలకాపురంలో అందమైన ఒక భవనాన్ని కట్టించాడు. ఇంద్రప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు ధర్మపరంగా రాజ్యపాలన చేస్తున్నారు.

   ఒకరోజు నారదమహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు నారదమహర్షిని ఆదరంగా లోపలికి తీసుకుని వెళ్ళి ఆసనం మీద కూర్చోబెట్టి భక్తితో పూజచేశాడు. నారదుడు వాళ్ళని ఆశీర్వదించి“ “ధర్మరాజా! మీకు ఒక కథ చెప్తాను. నువ్వు, నీ తమ్ముళ్ళు ద్రౌపదితో సహా ఇక్కడ కూర్చుని వినండి!” అన్నాడు.

   “ సుందోపసుందులు అనే అన్నదమ్ములు ఒక పడతి కారణంగా ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని జీవితాన్నే పోగొట్టుకున్న కథ. దీన్ని వినడం మీకు చాలా అవసరం. పూర్వం దితికి హిరణ్యకశిపుడు అనే పేరుగల కొడుకు ఉండేవాడు. అతడి వంశంలో పుట్టిన నికుంభుడి కొడుకులే సుందోపసుందులు.

   ఒకసారి అన్నదమ్ములు సుందోపసుందులు అలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. బాగా తపస్సు చేసి తమ కోరికలన్నీ తీర్చుకోవాలి అనుకున్నారు. వింధ్య పర్వతాలు ఉన్న చోటికి వెళ్ళి బ్రహ్మని గురించి తపస్సు చెయ్యడం ప్రారంభించారు. ఎండాకాలంలో నిప్పుల్లో కూర్చుని, వర్షాకాలం, శీతకాలం నీళ్ళల్లో కూర్చుని ఏదీ తినకుండా దీక్షగా తపస్సు చేస్తున్నారు.

  వాళ్ళు చేస్తున్న తపస్సు తీవ్రతకి వేడి పెరిగిపోయి ఆకాశమంతా నల్లగా పొగ కప్పేసింది. దాన్ని చూసి లోకాలన్నీ భయంతో వణికి పోయాయి. దేవతలు బ్రహ్మ దగ్గరికి పరుగెత్తి సుందోపసుందులు చేస్తున్న తపస్సు వల్ల చాలా అనర్ధాలు కలుగుతున్నాయని చెప్పారు.

  దేవతల భయాన్నిఅర్ధం చేసుకుని వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు భయపడకండి అని ధైర్యం చెప్పి పంపించాడు బ్రహ్మ.

   ఆలస్యం చెయ్యకుండా వెంటనే దేవతల భయాన్ని పోగొట్టాలనుకున్నాడు. సుందోపసుందులకి ప్రత్యక్షమయ్యి “నాయనలారా! మీరు దేనికోసం ఇంత దీక్షగా తపస్సు చేస్తున్నారు?” అని అడిగాడు.

   సుందోపసుందులు బ్రహ్మగార్ని చూసి ఆనందంతో రెండు చేతులు జోడించి “అయ్యా బ్రహ్మగారూ! మా కోరికలు మీరు తీరుస్తాను అంటేనే మీకు చెప్తాము!” అన్నారు.

   వాళ్ళ మాటలు విని బ్రహ్మగారు వీళ్ళకి ఉన్నది ఒక కోరిక కాదన్నమాట! ఇప్పుడు వాళ్ళు కోరుకున్నది ఇవ్వకపోతే మళ్ళీ తపస్సు మొదలెడతారు. దేవతలు మళ్ళీ భయంతో నా దగ్గరకి వచ్చేస్తారు. ముందు వీళ్ళ కోరికల్ని తెలుసుకుందాం అని మనస్సులో అనుకుని “ ఏం కావాలో అడగండి నాయనా! నేను వచ్చిందే అందుకు కదా!” అన్నాడు.

   సుందోపసుందులు అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. వెంటనే ”మహనుభావా! మా రూపాలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మార్చకోగలగాలి. ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి అనుకోగానే వెళ్ళిపో గలగాలి. మాయలు మొత్తం మాకు తెలియాలి. ఎవరి వల్లా కూడా మాకు చావు ఉండకూడదు. అసలు చావే ఉండకూడదు!” అని చాలా వినయంగా అడిగారు.

   బ్రహ్మ వాళ్ళు అడిగిన కోరికల వరుసని విన్నాడు. “నాయనా! మీరు అడిగినవన్నీ ఇస్తున్నాను. కాని ఆ ఒక్కటీ మాత్రం ఇవ్వను. చావులేని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ వరం తప్ప మిగిలినవన్నీ ఇస్తున్నాను” అని చెప్పి ఎందుకయినా మంచిదని వెంటనే అంతర్ధాన మయ్యాడు.

   వరాలు పొందిన ఆనందంతోను, గర్వంతోను రాక్షసులయిన సుందోపసుందులు తమ ప్రతాపం చూపించడం మొదలు పెట్టారు. దేవతల నగరాలన్నీ పడగొట్టారు. భూలోకంలో ఉన్న మహర్షుల్ని బాధపెట్టారు. బ్రాహ్మణులు చేసుకునే యాగాలన్నింటికీ అడ్డుపడ్డారు. సింహం, పులి, ఏనుగు వంటి అడవి జంతువులుగా మారి ఆశ్రమాల్లోకి వెళ్ళి మునుల్ని భయపెట్టారు.

   కౄరంగా ప్రవర్తిస్తున్న సుందోపసుందుల ప్రవర్తనకి భయపడి దేవతలు, మహర్షులు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి పరుగెత్తారు. “బ్రహ్మదేవా! సుందోపసుందులకి మీరు ఇచ్చిన వరాలు ఏమిటో మాకు తెలియదు కాని, వాళ్ళు పెట్టే బాధల్ని మేం భరించలేక పోతున్నాం” అన్నారు బాధగా.

  వాళ్ళు చెప్పింది విని బ్రహ్మ బాగా ఆలోచించారు. ఈ రాక్షసులు ఎవరితోను చావు ఉండకూడదని వరం తీసుకున్నారు. వీళ్లని వదిలించుకోవాలంటే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చావాలి. అంతకంటే వేరే మార్గం లేదు అనుకున్నాడు.

   వెంటనే విశ్వకర్మని రప్పించాడు. అందమైన ఒక స్త్రీని సృష్టించమన్నాడు. రూపక్రియకళా విశారదుడైన విశ్వకర్మ ఇంతకు ముందు ఎవరికీ లేనంత సౌదర్యంతో ఒక స్త్రీని దేవతా రూపంతో సృష్టించి, ఆమెకి ’తిలోత్తమ’ అని పేరు కూడా పెట్టాడు.

   ఇంద్రుడు మొదలైన దేవతలతోను మహర్షులతోను కలిసి కూర్చున్న బ్రహ్మకి నమస్కారం చేసి “నేను చెయ్యవలసిన పని ఏమిటి?” అని వినయంగా అడిగింది తిలోత్తమ.

   అపురూపమైన సౌందర్యంతో వెలిగిపోతున్న తిలోత్తమని చూసి బ్రహ్మ“తిలోత్తమా! వింధ్య పర్వత ప్రాంతంలో సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళిద్దరు పరమ దుర్మార్గులు. ఎవరితోను చావు లేకుండా వరం తీసుకున్నారు. వాళ్ళు బ్రతికి ఉంటే మిగిలిన వాళ్ళందరు చచ్చిపోతారు. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చచ్చి పోయేలా చెయ్యాలి” అని చెప్పాడు.

   దేవసభకి ప్రదక్షిణం చేసి, దేవతలందరు తన సౌందర్యాన్ని పొగుడుతుంటే వయ్యారంగా బయల్దేరి భూలోకం చేరుకుంది తిలోత్తమ.

  వింధ్యాచలం చేరుకుని ఆ చుట్టుపక్క ప్రదేశాల్లో సుందోపసుందుల్ని వెతుక్కుంటూ తిరుగుతోంది. చివరికి సుందోపసుందులు అమెను చూశారు. అన్నదమ్ములు ఇద్దరూ చాలా సఖ్యంగా ఉండేవాళ్ళు. ఒకే చోట ఉండి, ఒక మంచం మీదే పడుక్కుని, ఒకే పళ్ళెంలో భోజనం చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. అంత సఖ్యంగా ఉన్న అన్నదమ్ములు తిలోత్తమ కనిపించగానే అమె అందానికి ముగ్ధులై ఇద్దరూ ఒకేసారి ఆమెను ఇష్టపడ్డారు.

   తిలోత్తమని చూడగానే ఒకడు ఈ అందలరాశి నా హృదయేశ్వరి అన్నాడు. రెండో వాడు కాదు ఈమె నా ప్రాణేశ్వరి అన్నాడు. ఇద్దరూ వేగంగా వెళ్ళి ఆమె రెండు చేతులూ చెరొకళ్ళూ పట్టుకుని లాగుతూ నేను పెళ్ళి చేసుకుంటాను అంటే కాదు నేనే చేసుకుంటాను అని వాదించుకున్నారు.

   తిలోత్తమ మరింత అందంగా నవ్వుతూ “నేను ఒక్కర్తిని, మీరు ఇద్దరు. నన్నెల్లా పెళ్ళిచేసుకుంటారు?” అని కొంటెగా అడిగింది.

   వాళ్ళిద్దరు ఒకళ్ళ మొహం మరొకళ్ళు చూసుకున్నారు. అంతలోనే తిలోత్తమ “ మీరిద్దరూ యుద్ధం చెయ్యండి మీలో ఎవరు గెలుస్తారో వాళ్ళని నేను పెళ్ళి చేసుకుంటాను” అంది.

   ప్రేమమత్తులో ఉన్న వాళ్ళిద్దరికీ అమె చెప్పింది నచ్చింది. గెలిస్తే అమెని పెళ్ళి చేసుకోవచ్చు కదా అనుకున్నారు. కాని, ఈ యుద్ధం వల్ల తమ ఇద్దరి మధ్య అంతవరకు ఉన్న ప్రేమ, స్నేహం, బంధుత్వం అన్నీ పోతాయి అనే విషయం వాళ్ళకి తట్టలేదు.

   ఇద్దరి మధ్య పోరు మొదలయింది. పట్టుదలతో ఒకళ్ళ నొకళ్ళు కొట్టుకుని చివరికి ఇద్దరూ చచ్చిపోయారు. ఇప్పటి వరకు మీ అయిదుగురి మధ్య ఉన్న స్నేహ సంబంధాలు ద్రౌపది కారణంగా పోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసమే ఈ కథ చెప్పాను “ అన్నాడు నారదుడు.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆత్మీయులు

 సంతానవాహిన్యపి మానుషాణాం

దుఃఖాని సంబంధి వియోగజాని|

దృష్టేజనే ప్రేయసి దుఃసహాని స్రోతః సహసైరివ సమ్ప్లవన్తే||




ఆత్మీయులు (దగ్గరి బంధువుల) ఎడబాటు వల్ల కలిగే దుఃఖం, మనం మళ్ళీ ప్రియమైన వారిని చూసినప్పుడు వెయ్యి పాయలుగా అడ్డంకులు లేకుండా ప్రవహిస్తుంది.

రామాయణంలో స్త్రీ వైశిష్ట్యం

 రామాయణంలో స్త్రీ వైశిష్ట్యం  


రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే... విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు...‘‘నా అన్న రావణుడు కూడా మహానుభావుడు. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేసాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు. నేనే చంపించేసాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడీ? అన్నయ్యా! చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళదగ్గర పెడదామంటే ఏడీ? చంపించేసాను.’’ అని తలచుకుని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. ‘‘నా అన్న వాలి.


ఎదుటివారి బలం సగం లాగగలడు. అప్రమేయ పరాక్రమవంతుడు. నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేసాను. నాకు అన్న లేడు.. నేనిలా చెప్పులు తొడగలేను. నేనిలా కౌగిలించుకోలేను. అన్నయ్యా! అని చెయ్యివ్వలేను... అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి’’ అని వేదనా భరితుడయినాడు. 


రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం.. కానీ ఆ గొప్ప వాళ్ళదికాదు. అలా బతకగలిగారంటే.. వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి... బతకడానికి అవకాశమిచ్చిన వారు – శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు.


‘‘మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు... అంటే మీ నాన్న దశరథ మహారాజుగారు వరమడిగారు, వెడుతున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది.. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం..?’’ అని లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా! అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు.. అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్తకన్నా నాకేం కావాలి ?’’ అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు.


ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం శీలవైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు పదిమంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది.

కంచి పరమాచార్య వైభవం.232

 *కంచి పరమాచార్య వైభవం.232* 


*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం* 

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

 


*🌹అంబాసిడర్ కారు - ఫియట్ కారు🌹* 


గోవిందపురం శ్రీ నటరాజ అయ్యర్ పరమాచార్య స్వామివారి అనుగ్రహానికి, కరుణకు పాత్రులు. జి ఆర్ ఎన్ బిల్డర్స్ పేరుతో జనాలకు నిర్మాణ సేవలను అందించేవారు. మహాస్వామి వారిపై అచంచలమైన భక్తితో శ్రీమఠానికి ఎంతగానో సేవ చేశారు. స్వామివారు శ్రీశైలంలో ఉన్నప్పుడు తన స్నేహితునితో కలిసి ఒక అంబాసిడర్ కారులో దర్శనానికి వెళ్లారు. 

స్వామివారిని దర్శించుకుని, తిరిగివెళ్లడానికి అనుమతి తీసుకుని చెన్నైకు వస్తుండగా; కారు ఫ్యాను బెల్టు తెగిపోయి కారు ఆగిపోయింది. తెలియని ప్రదేశంలో ఇలా జరగడంతో కాస్త కంగారు పడ్డారు. ఏమి చెయ్యాలో తోచక నిదానంగా దగ్గర్లోనే ఉన్న పెట్రోలు బాంకు దాకా వచ్చి కారును ఆపారు.

మహాస్వామి వారి వద్ద నుండి ప్రసాదం తీసుకుని స్వామివారి అనుమతితోనే బయలుదేరినా ఈ అర్ధరాత్రిలో ఎందుకు ఇలా జరిగిందా అని ఇద్దరూ ఆలోచిస్తున్నారు. ఇలా జరిగేలాగా ఉంటే ఎందుకు స్వామివారు మేము వెళ్లడానికి అనుమతిచ్చారు? భక్తితో స్వామివారిని ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఆ పెట్రోలు బంకుకి ఒక ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్నవారు పెట్రోలు పొయ్యమని బాంకు సిబ్బందిని అడిగారు. ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉన్నారని వీరిని అడిగారు. కారు బెల్టు తెగిపోవడంతో కారు నడపడానికి కుదరక ఇక్కడున్నామని నటరాజ అయ్యర్ చెప్పాడు. 

దాంతో ఆ ఫియట్ కారు వ్యక్తి తను ఎప్పుడు కారులో బయటకు వెళ్ళినా ముందుజాగ్రత్తగా అవసరమైన కొన్ని కారు వీడిభాగాలను వెంట తెచ్చుకుంటానని, తనవద్ద ఉన్న బెల్టును తీసుకుని క్షేమంగా ఇంటికి చేరమని చెప్పాడు. నటరాజ అయ్యర్ కు ఆశ్చర్యం కలిగింది. అంత రాత్రిలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి, కారు ఫ్యాను బెల్టు ఇచ్చి సహాయం చెయ్యడం కేవలం పరమాచార్య స్వామివారి కృప అని హృదయం ద్రవించింది. మనస్సులోనే స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

ఇందులో మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆ అజ్ఞాత వ్యక్తి ఫియట్ కారులో వచ్చాడు. దూరప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తన కారుకు సంబంధించిన విడిభాగాలనే పెట్టుకుంటాడు. కానీ ఆ ఫ్యాను బెల్టు మాత్రం తన ఫియట్ కారుది కాకుండా అంబాసిడర్ కారుది తెచ్చుకున్నాడు. ఎందుకు ఆ తప్పు చేశాడు? అతను తప్పు చేయలేదు. నటరాజ అయ్యర్ ని కాపాడడానికి మహాస్వామి వారు చేసిన దివ్యలీల ఇది. ఇలాంటి లీలలు చేసి భక్తులను కాపాడడం మహాస్వామి వారి సిద్ధులకు తార్కాణం.


 *--- పరంథమన్ వి. నారాయణన్, “పరమాచార్యర్” నుండి* 



 *#Kanchiparamacharya vaibhavam* *#కంచిపరమాచార్యవైభవం*

అభినవ నటకులు!

 శీర్షిక..అభినవ నటకులు!


నాటకం బూటకం నిండిన 

మాయా లోకంలో 

ఎవరిని నమ్మాలి? 

ఇంటా బయటా అభినయ వీరులు 

వంచించే మాటల్తో సవారీ చేస్తూ..


పెదవులపై నవ్వులు 

ద్వేషం మోసం గుండెల్లో రగిలిస్తూ 

మాటల మాధుర్యంతో గారడీ చేస్తూ 

వెనుక గోతులు తీస్తూ 

తేనె పూసిన కత్తులు 

గుచ్చేస్తారు గుండెల్లో గునపాలు..


స్వార్ధం నిండిన కుళ్ళూ కుతంత్రాలతో 

నిజాలను కప్పేస్తూ 

అబద్ధాలను మెప్పిస్తూ 

దగా దోపిడీ చేస్తూ 

కోట్లకు కోట్లు దండుకుంటున్నారు 

ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో చెవిలో పువ్వులు పెట్టేస్తూ..


డబ్బున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా

మూగేస్తారు..బంధాల లంకె బిందెలతో 

నష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మొహం చాటేస్తారు

పాతేస్తారు నిను..నీ కర్మకు నీవే బాధ్యుడవంటూ 

కాటికి తోలేస్తారు నూకలు చెల్లాయంటూ..


బుస కొట్టే నాగులు 

సమయం చూసి కాటేస్తారు అసూయా ద్వేషంతో

మేక వన్నె పులులు 

జగన్నాటక సూత్రధారులు 

నమ్మిస్తారు జగమే మాయంటూ 

అభినవ అభినయ వంచనతో 

నీవెవరంటూ? నిను నీవే ప్రశ్నించుకొనే 

మాయల మత్తులో చిత్తవుతూ..

ంంంంంంంంంంంంంంం

ఇది నా స్వీయ కవిత

తెలుగు సామెతలు.

 మరుగున పడుతున్న కొన్ని 56 తెలుగు సామెతలు.

మీ కోసం ఒక్కసారి చదవండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు

శంకర విజయాలు-11*

 *#శంకర విజయాలు-11*


ఆది శంకరాచార్యుల జయంతి - 2 May , 2025


*శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు సనాతన ధర్మం లేదు*


1) ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని 

2) శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు

3) ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. 

4) అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటారు. 

5) అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. 

6) అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతారు. 

7) ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు - శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు

8) అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు - మొత్తం మనీషా పంచకంగా పేరొందాయి. 

9) అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని 

10) శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. 


సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు


*హర హర శంకర !!  జయ జయ శంకర !!*

కారుని జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వ రీతులన్*

 *కారుని జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వ రీతులన్*

ఈ సమస్యకు నా పూరణ. 


*అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి తో* 


చేరితి ద్వారకా పురికి చెప్పితి నీదగు ప్రేమభావమున్


కోరితి నిన్ను చేకొనగ కూరిమి రమ్మని విన్నవించితిన్


భూరి గుణోత్తముండతడె పూర్ణుని కృష్ణుని దివ్య మోహనా


కారుని జూచి మ్రొక్క శుభకామన లిచ్చె నపూర్వ రీతులన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

తిరుఉత్తర కోసమాంగై

 తమిళనాడులో రామేశ్వరం నుండి 75 కి.మి. దూరంలో "తిరుఉత్తర కోసమాంగై" అని ఊరు ఉంది. మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి సొంత ఊరు ఇది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్తగా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు. ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇక్కడ శివుడు శివలింగరూపంలో, మరకతరూపంలో, స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజ రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పుడూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. అలాగే ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు. భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ముద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా రామేశ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయం దర్శనం చేసుకోండి.🌹🙏🌹

అనుక్షణం శివ నామమే*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

   *అనుక్షణం శివ నామమే*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అనుక్షణం శివ నామమే*

*అనుచు శివుని కానరే..।*

*ఘనుడు శంకరుడు*

*మనల కరుణ జూచి ఏలగా ...।*


*నమః సోమాయ శివాయ*

*నమో మహా దేవాయ।*

*అమిత పరవశమున*

*ఇటుల హరుని తలచి పలుకరే ..।*


*నమః సాంబాయ భవాయ ..* 

*నమో రుద్రమూర్తయే ।*

*నమిత శిరస్సుల శంభుని*

*నామములను మురియరే ..।*


*నమో నమః పశుపతయే*

*నమః పినాక పాణయే।*

*ఉమా సహిత శంభు దేవుని*

*ఉల్లము లో తలవరే ।*


*నమ ఉగ్రాయ హరయా ..*

*నమః శశి కిరీటాయ ।*

*సమయమెల్ల షణ్ముకనుతుని*

*సంస్మరించి తరించరే।*


*అనుక్షణం శివ నామమే*

*అనుచు శివుని కానరే..।*

*ఘనుడు శంకరుడు*

*మనల కరుణ జూచి ఏలగా ...।*


🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(105వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*అక్రూరుడితో బలరామకృష్ణుల ప్రయాణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*అక్రూరుడు రథాన్ని సిద్ధం చేశాడు. బలరామకృష్ణులను ఆహ్వానించాడు. వారొచ్చి, రథాన్ని అధిరోహించారు. అధిరోహించి, పక్కపక్కన కూర్చున్న ఆ ఇద్దరూ బుధ, శుక్రుల వలె మహాతేజస్సుతో వెలిగిపోసాగారు. అక్రూరుడు సారథి అయి, రథాన్ని ముందుకు పోనిచ్చాడు. నందుడు మొదలయిన యాదవ ప్రముఖులు అతన్ని అనుసరించారు. రథాలు మెల్లగా నడుస్తున్నాయి. బలరామకృష్ణులు మధురకు ప్రయాణ మయ్యారని తెలిసి, గోపికలు పరుగు పరుగున వచ్చారక్కడకి. ప్రయాణిస్తున్న రథానికి అడ్డుగా నిలిచారు. కన్నీరు పెట్టుకుని, కన్నయ్యను చూశారు. నిన్ను వదలి క్షణం కూడా ఉండలేమన్నారు. వద్దువద్దన్నట్టుగా కూలబడ్డారు. వారిని సముదాయించడం ఎవరి వల్లా కాలేదు.*


*‘‘నిన్ను చూడకుండా నిముషం కూడా ఉండలేం. నీతోపాటు మమ్మల్ని కూడా తీసుకునిపో కృష్ణా’’ ప్రార్థించారు గోపికలు. రథం దిగిరమ్మనట్టుగా అతని చేయిపట్టుకున్నారు.*


*సున్నితంగా విదలించుకున్నాడు కృష్ణుడు. ‘‘త్వరలో వచ్చేస్తాను. మధురకు నా దేహమే ప్రయాణిస్తోంది. నా మనసు ఇక్కడే ఈ వ్రేపల్లెలోనే ఉంది.’’ అన్నాడు. పేరు పేరునా గోపికలను బుజ్జగించి, బయల్దేరాడు.*


*అంతలో యశోద, రోహిణి వచ్చారక్కడకి. బలరామకృష్ణుల నొసట తిలకాలు దిద్ది, హారతులిచ్చారు. పిల్లలకు ఏ ఆపదా రాకూడదని దేవుళ్ళను ప్రార్థించారు. వారిని ముద్దిడి దీవెనలిచ్చారు. అంతా ఊరి సరిహద్దుల దాకా వచ్చి, బలరామకృష్ణులను సాగనంపి, వెను తిరిగారు. రథం వేగం పుంజుకుంది. అక్రూరుడు రథాన్ని వాయువేగంతో నడపసాగాడు. మధ్యాహ్నం వేళకు యమునాతీరం చేరుకున్నారంతా. దాహం తీర్చుకోదలచి, బలరామకృష్ణుల సహా యమునలోకి దిగారు. కాళ్ళూ చేతులూ కడుక్కున్నారు. దోసిటపట్టి నీరు తాగి దాహం తీర్చుకున్నారు. కాస్సేపు నదీతీరాన చెట్లనీడల్లో విశ్రమించి, సేదదీరారు. బలరామకృష్ణుల్ని రథం మీద కూర్చోబెట్టి, తానూ దాహం తీర్చుకునేందుకు యమునలోకి దిగాడు అక్రూరుడు.*


*నీరు దోసిట పట్టి తీయబోతున్నంతలో బలరామకృష్ణులు నీళ్ళలో కనిపించారు. రథంలో కూర్చున్న బలరామకృష్ణులు నీళ్ళలోకి ఎప్పుడొచ్చారా? అని ఆశ్చర్యపోయాడు అక్రూరుడు.*


*తల తిప్పి, తీరాన ఉన్న రథం కేసి చూశాడు. రథం మీద బలరామకృష్ణులు కూర్చుని కనిపించారు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించారిద్దరూ. మరి నీళ్ళలో ఉన్నదెవరు? నీటిలోకి తేరిపార చూశాడు అక్రూరుడు. నీటిలో కూడా బలరామకృష్ణులు ఉన్నారు. నిజరూపాలతో కనిపించసాగారు.*


*శ్రీదేవిసహా శ్రీమహావిష్ణువు శేషపాన్పుపై పవళించి కనిపించాడు. సమస్త దేవతలూ, మునులూ విష్ణువును పరివేష్టించి ఉన్నారు. వేదసూక్తాలతో స్తోత్రాలు చేస్తున్నారతన్ని. మహావిష్ణువుని చూసిన మరుక్షణం అక్రూరుని ఆనందానికి అంతులేకుండాపోయింది. పులకించిపోయాడతను. భవబంధాలనుండి విముక్తి లభించినట్టుగా సంతోషించాడు. మహాయోగులకు కూడా అందని బ్రహ్మజ్ఞానం, ఆత్మచైతన్యం కలిగాయి అతనికి. పరతత్త్వం బోధపడింది. మరింతగా భగవంతునిపై భక్తి కుదిరింది. అంతా జన్మజన్మల పుణ్యఫలం అనుకున్నాడు అక్రూరుడు. చేతులు జోడించి నమస్కరించాడు. గద్గదంగా శ్రీహరిని స్తోత్రం చేశాడు. అక్రూరుణ్ణి అనుగ్రహించాడు కృష్ణుడు. తాను శ్రీమహావిష్ణువునని తెలియజేసేందుకే అలా కనిపించాడతనికి.*


*జపతపాలు లేవు. నియమనిష్టలు లేవు. కేవలం భక్తితత్పరతే...అక్రూరుని భక్తితత్పరతే భగవంతుని సాక్షాత్కారానికి కారణమయింది.*


*భగవదనుగ్రహం పొంది, దాహాన్ని తీర్చుకుని వచ్చాడు అక్రూరుడు. రథాన్ని అధిరోహించాడు. ముందుకుపోనిచ్చాడు. రథం నడుస్తోంటే అతని దగ్గరగా వచ్చి అడిగాడు కృష్ణుడు.*


*‘‘నదిలో నీకేమయినా కనిపించిందా అక్రూరా?’’*


*‘‘కనిపించింది కృష్ణా! సర్వం శ్రీహరిమయం అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు.’’ అన్నాడు అక్రూరుడు.*


*వారలా మాట్లాడుకుంటూ మధురాపురం పొలిమేరలకు చేరుకున్నారు. అప్పటికి సూర్యాస్తమయం అయింది. ఓ ఉద్యానవనం ముందు రథాన్ని నిలిపాడు అక్రూరుడు. అప్పటికే అక్కడకి చేరుకున్న నందుడు మొదలయిన యాదవప్రముఖులంతా బలరామకృష్ణులను చుట్టుముట్టారు. అన్నతో సహా రథాన్ని దిగాడు కృష్ణుడు.‘‘అక్రూరా! ఈ రాత్రి ఇక్కడే ఈ ఉద్యానవనంలో విడిది చేస్తాం. రేపు పట్టణంలోకి ప్రవేశిస్తాం. మీరిక వెళ్ళొచ్చు.’’ చెప్పాడు.*


*‘‘నిన్ను విడచి వెళ్ళలేను కృష్ణా! నువ్వు లేకుండా మధురాపురంలో అడుగుపెట్టలేను. నేను నీ భక్తుణ్ణి. ఈ రాత్రి నా ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించు. దయచేసి నన్ను కరుణించు.’’ ప్రార్థించాడు అక్రూరుడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈశ్వర పాదధ్యానం ఎల్లప్పుడూ తమ మనస్సునందు ఉండుగాక అని శంకరులు ఈ శ్లోకం లో చెప్పారు.*


*శ్లోకం : 74*


*ఆశాపాశ క్లేశ దుర్వాసనాది*

   

*భేదోద్యుక్తై ర్దివ్య గంధై రమందైః*

   

*ఆశాశాటీకస్య పాదారవిందం*

   

*చేతః పేటీం వాసితాం మేతనోతు "!!*



*తాత్పర్యము :-*


*ఆశాపాశములు,   మనోదేహ క్లేశములు దుష్ట సంస్కారములు మొదలగువానిని భేదించుటకు సిద్ధములైన  (సమర్థములైన) అమోఘములూ, దివ్యములూ అయిన సువాసనలచే దిగంబరుడైన శివుని యొక్క పాదమనెడి పద్మము నా చిత్తము అనే పెట్టెను సువాసనగల దానిగా చేయును గాక !*


*వివరణ :-*


*శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించు కున్నారు.*


*"ಓ ఈశ్వరా ! నామనస్సనే పెట్టెలో చాలా భయంకరమైన దుష్ట వాసనలున్నాయి. అందులో మొదటిది ఆశాపాశము. అంటే ఆశ అనే పాశం. పాశమంటే త్రాడు. ఆ ఆశ అనేత్రాడు నామెడకు ఉరిలా బిగుసుకుపోయి, ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతే కాకుండా దానికితోడుగా క్లేశాలూ బాధిస్తున్నాయి.*


*ఆ క్లేశాలు ఐదు:-*


*పంచక్లేశాలలో  మొదటిది "అవిద్య ". నా స్వరూపమేమిటో నాకు తెలియక పోవడమే అవిద్య. (అవిద్యా _స్వరూప + అజ్ఞానం.*


*రెండవది "అస్మిత". అస్మి అంటే ఉన్నాను అని అనుకోవడమే దాని లక్షణం. పుట్టడం క్షణక్షణానికీ మార్పు పొందడం, చివరికి నశించడం అనే స్థితులతో, తుస్సుమనే  తోలుతిత్తియే నేను అని భావించడం. అంటే దేహాభిమానం.*


*మూడవది  "రాగం". విషం వంటి విషయం మీద అనగా  శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైన దాని మీద అనురక్తిని   "రాగం " అంటారు.   (ఇష్టవిషయే అనురక్తిః _ రాగః)*


*నాలుగవది   "ద్వేషం " ఇష్టం కాని విషయాలను అసహ్యించు కోవడం (అనిష్టవిషయే అప్రీతిఃద్వేషః)*


*ఐదవది  "అభినివేశం " . పనికిమాలిన పనులపై కర్తవ్య బుద్ధి పెట్టుకోవడం, "అభినివేశం". (వ్యర్థేషు కర్మసు కర్తవ్యత్వాగ్రహః అభినివేశః ).*


*పైనచెప్పిన ఆ ఆశా,ఈ పంచ క్లేశాలూ నాహృదయంలో చేరి కుళ్ళు కంపు కొడుతున్నాయి. ఇంకా ఇటువంటివిచాలా వున్నాయి.  వాటిని దూరంగా తోలివేయాలి.*


*హృదయ పేటికలో ఎంత దట్టంగా ఆశాపాశ క్లేశములు అనే దుర్వాసనలు నిండియున్నా శివపాదపద్మ పరిమళాలు వాటిని క్షాళనం చేసి హృదయపేటికను పరిమళభరితంగా చెయ్యగలవని శంకరులు సూచించారు.*


*ఉదయాద్రిపై సూర్య కిరణాలు పడగానే, చిమ్మ చీకట్లు పటాపంచలవుతాయి. అలాగే హృదయంలో భగవంతుని పాదములు నిలువగానే పాశములవంటి ఆశలూ పాపసంస్కారములూ,క్లేశములూ వాటంతట ఆవియే పటాపంచలవుతాయని గ్రహించాలి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

గొప్ప మనసు*

 *గొప్ప మనసు* _*

    ❤️‍🔥🫀❤️

       *నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది. పని చురుకుగానే సాగుతున్నది.*


       *ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే "పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను."ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు".. అన్నాడు.*


     *అంతలో ఒక వ్యక్తి వచ్చాడు.నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య.*


*పొరుగూరు నుంచి కుటుంబం తో వచ్చాను.*


*వారం నుండి పని కోసం తిరుగుతున్నాను.*


*ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయచూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.*


         *అక్కడే ఉన్న మేస్త్రి " నీవెవరివో తెలీకుండా... నీపనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. *వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.*

     

    *అతను నా వైపు జాలిగా చూస్తూ"  ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయచూపండి" అని ప్రాధేయ పడ్డాడు.*


      *నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ... కన్నుల్లో ఆకలి కనిపించింది.*


     *మేస్త్రితో " తెలిసిన పనే అంటున్నాడుగా!*

*ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను.*

 *మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం" అన్నాడు.*


     *అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు. మధ్య మధ్యలో అతని వంక చూసాను. కష్టపడి పనిచేయడం గమనించాను. "పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది" అని మనసులో సంతోషించాను.*


         *మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు.*


*రాజయ్య వంక చూసాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను.*


        *మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని  ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను.*

 

 *రాజయ్య మాత్రంమంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు.*


        *అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది.* *మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు.*


        *రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. "నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి" అన్నాను.*


    *"నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ  దయవల్ల ఈ పూట గడుస్తుంది" అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను.*


        *అతను బయలు దేరిపోయాడు. ఎందుకో తెలీదు... రాజయ్య వంకే చూడసాగాను. వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురు పడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటి పోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు.*

*అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి.*


      *రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థం అయిపోయింది. ఈపూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు....*

 

*అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది.*


      *"ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు" ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది.*


         *బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ" చాలా రుచిగా ఉంటాయి. మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు" అన్నాడు.*


     *రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయసాగాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ" ఈ పని ఇంటి దగ్గర చేయి. లేకపోతే ఎగిరి పోతాయి".. అన్నాడు.*


      *రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు.*

 

*స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడ సాగాడు.*


*ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి.*


      *రాజయ్య చేసినపనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు.*


*ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా.*


     *"ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?" అన్నాడు.*


       *"డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు" అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవినపడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు.*


*అతని ఆకలి... ఎదురుచూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధ పడింది.*

    *అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి... రాజయ్యతో అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్టకూటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!"*


*అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు.*


*రాజయ్య అతన్ని వారిస్తూ" డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు" అని ముందుకు కదిలాడు.*

       *కొంచెం సేపు అలానే ఉండిపోయాను.*

*తరువాత బైక్ స్టార్ట్ చేసి... రాజయ్య దగ్గరకు పోనిచ్చి "ఎక్కు" అన్నాను.*

*"వద్దు అయ్యగారూ!" అన్నాడు." మరేం ఫర్లేదు. నేనూ అటేవెళ్తున్నాను" అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను.*

     *ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.*

     *"అదేంటి  అయ్యగారూ!మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం" అన్నాడు రాజయ్య.*

    *"డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు. మనసున్న వాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది. రేపు పనిలోకి వచ్చేయి!" అనిబైక్ స్టార్ట్ చేసాను.*

    *బైక్  డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది.*

   *నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు!!*

~~~~~~~~~~~~~~~~~~

*_{మంచి సందేశం ఉన్న ఈ కథను చదివాక, మీతోపాటు ఇంకా కొందరికి కూడా పంపించాను. మీకు నచ్చితే మీరూ మరికొందరికి షేర్ చేయండి. అదీ మరి ఆనందం అంటే..... —-🙏🙏🙏🙏🙏🙏

చరణము సోకినట్టిశిల

 శు భో ద యం 🙏


చరణము సోకినట్టిశిల జవ్వని యౌటొకవింత,సు

స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ

స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ

ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ పాద స్పర్శ మాత్రమున శిల స్త్రీ రూపు దాల్చి అహల్య అయినది. శిలా పర్వతములు సముద్రముపై స్థిరముగ తేలినవె. ఇట్టి వింతలు జరుగగా నీ స్మరణ చేసినవారికి సద్గతికల్గుటలోవింతయేమున్నది?స్వామీ!🙏🙏🌷🌷🌷🌷👌🌷👌🌷🌷🌷🌷👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రకృష్ణా!యదుభూషణా

 శ్రకృష్ణా!యదుభూషణా!నరసఖా!శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశ దహనా! 

లోకేశ్వరా!దేవతానీకబ్రాహ్మణ 

గోగణార్తిదహనా!

నిర్వాణసంధాయకా!

నీకున్మ్రొక్కెద,ద్రుంపవే భవలతల్ నిత్యాను కంపానిధీ!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మంగళవారం 15 ఏప్రిల్ 2025🍁* *రామాయణం*

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🍁మంగళవారం 15 ఏప్రిల్ 2025🍁*

          *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన  

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


     *వాల్మీకి రామాయణం*

             *9 వ  భాగం*

                   

```

ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. 


అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు…  “పూర్వం కృత(సత్య) యుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు, దైత్యులు ఎంతో సఖ్యతగా, ధార్మికంగా జీవించేవారు. 

అలా కొంత కాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీర సాగరాన్ని మధిస్తే అందులోనుంచి అమృతం పుడుతుంది, అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు, కావున ఆ సాగర మధనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. 

అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొతాన్ని నాశనం చెయ్యసాగింది. 

అప్పుడా దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్లి ఆయనను రక్షించమని ప్రార్ధించారు. శంకరుడు బయటకి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చినదాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేలగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు, ఆయన మెడలో ఉన్న పిల్ల పాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు.


సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. 

అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతోపాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు.


అప్పుడాయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపు పై పెట్టుకొని పైకి తెచ్చారు.


అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులోంచి నురగలు వచ్చాయి, ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్లమంది వచ్చారు.```


*అప్సు నిర్మథనాత్ ఏవ రసాత్ తస్మాత్ వర స్త్రియః |*

*ఉత్పేతుః మనుజ శ్రేష్ఠ తస్మాత్ అప్సరసో అభవన్ ||*

*షష్టిః కోట్యో అభవన్ తాసాం అప్సరాణాం సువర్చసాం |*

*అసంఖ్యేయాః తు కాకుత్స్థ యాః తాసాం పరిచారికాః ||*```


అలా వచ్చిన అందమైన అప్సరసలని, దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవ వేశ్యలు అయ్యారు.


తరువాత అందులోనుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు, రాక్షసులు ఆ సురారసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. 

ఆ వారుణిని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు.


తరువాత వచ్చిన ఉచ్చైఃశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు, అలానే కౌస్తుభాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించారు. తరవాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు, చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు.


కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది.. “నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, దీనికంతటికి దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి” అని కశ్యపుడిని అడిగింది.


“అయితే నువ్వు సౌచంగా(భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం) ఒక 1000 సంవత్సరాలు ఉండగలిగితే, నీకు ఈ లోకాలని శాసించగల, ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడు” అని కశ్యపుడు అన్నాడు.


దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, “నేను నీకు సేవ చేస్తాను అమ్మా” అన్నాడు.


దితి సరే అనడంతో రోజూ ఫలాలు తీసుకోచ్చేవాడు, రోజూ తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.


*రేపు...10వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

మంగళవారం🍁* *🌹15, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

 *🌹15, ఏప్రిల్, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి      : విదియ* ఉ 10.55 వరకు ఉపరి *తదియ*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : విశాఖ* రా 03.10 వరకు ఉపరి *అనూరాధ*


*యోగం  : సిద్ధి* రా 11.33 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం   : గరజి* ఉ 10.55 *వణజి* రా 12.07 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 11.00 సా 03.00 - 06.00*

అమృత కాలం  : *సా 05.17 - 07.05*

అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.33*


*వర్జ్యం          : ఉ 06.31 - 08.19*

*దుర్ముహూర్తం  : ఉ 08.22 - 09.12 రా 10.58 - 11.44*

*రాహు కాలం   : మ 03.15 - 04.49*

గుళికకాళం      : *మ 12.07 - 01.41*

యమగండం     : *ఉ 09.00 - 10.34*

సూర్యరాశి : *మేషం* 

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.52* 

సూర్యాస్తమయం :*సా 06.23*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.52 - 08.22*

సంగవకాలం         :*08.22 - 10.52*

మధ్యాహ్న కాలం    :     *10.52 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర బహుళ తదియ*

సాయంకాలం        :  *సా 03.53 - 06.23*

ప్రదోష కాలం         :  *సా 06.23 - 08.41*

రాత్రి కాలం         :  *రా 08.41 - 11.44*

నిశీధి కాలం          :*రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.06*

------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*


*సంసార కూప మతిమజ్జన మోహితస్య॥*

*భుజానిఖేద పరిహార పరావదార ॥*

*లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥*

*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

యాపిల్ తినడం వలన

 యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు - 

    

యాపిల్ లో మంచి విటమిన్స్ ఉన్నాయి . ఒక యాపిల్ లో ఒక మిల్లీగ్రాము ఇనుము. పద్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ , పది మిల్లీగ్రాముల కాల్షియం మరియు A విటమిన్ కూడా ఉన్నది. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. 

 

* యాపిల్ రక్తక్షీణతని నివారిస్తుంది. రక్తక్షీణత కలవారు రోజుకి మూడు యాపిల్స్ తీసుకొవడం చాలా మంచిది.


 *  మలబద్దకం నివారణ అవుతుంది. శరీరంకి కావలసినంత బలం ని ఇస్తుంది.


 *  రక్త,బంక విరేచనాలు అవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకొవడం వలన అందులో ఉండే పిండిపదార్ధాలు విరేచనాలు లొని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరేచనాలు తగ్గుతాయి . యాపిల్ ముక్కలని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది. 


 *  చంటిపిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు ఒక చెంచా యాపిల్ జ్యూస్ ఇవ్వడం వలన విరేచనాలు కట్టుకుంటాయి.

 

*  యాపిల్ జ్యూస్ లో యాలుకలు , తేనే కూడా కలుపుకుని తీసుకుంటూ ఉంటే కడుపులో మంట ప్రేగుల్లో పూత , అజీర్తి , గ్యాస్ట్రబుల్ , పుల్లనితేపులు , గుండెల్లో మంట నివారించబడును. 

 

*  యాపిల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన మరియు పొటాషియం ఎక్కువుగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయవ్యాధులు , మూత్రపిండాల వ్యాధులు నివారించబడతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు రోజు యాపిల్ జ్యూస్ తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి . 

 

*  తరచుగా యాపిల్ తింటూ ఉంటే తరచుగా వచ్చే జ్వరాలు అరికడతాయి.

 

*  పక్షవాతం , నాడీసంబంధ వ్యాధులు కలవారికి మెదడు వ్యాధులు కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది . 


 *  రోజు యాపిల్ జ్యూస్ సేవించడం వలన కడుపులో మంట, మూత్రంలో మంట ఉండదు.


 *  కామెర్ల వ్యాధి సోకినప్పుడు వీలయినంత ఎక్కువ యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్ ని సంరక్షిస్తుంది.

 

*  యాపిల్ కి కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. జలుబు , దగ్గు , ఆయాసం వీటిని నివారిస్తుంది. 

 

*  యాపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది . నీరసాన్ని , అలసటని రానివ్వదు.


 *  యాపిల్ ముక్కలుగా కోసి ఉడికించి రోజు తింటూ ఉంటే బొల్లిమచ్చలు నివారణ అవుతాయి. శరీరం కాంతివంతం అవుతుంది. 


 *  యాపిల్ చెట్టు యొక్క వ్రేళ్ళ రసాన్ని తాగితే కడుపులో ఏలికపాములు నివారణ అగును.

 

  గమనిక  - 

       షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం యాపిల్ తీసుకోరాదు .



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక  -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

.       నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

.      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

.      ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

.   ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

.        కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

.    అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

.               9885030034

పుట్టగానే చేయవలసిన పని

 పసిపిల్లలు పుట్టగానే చేయవలసిన పని మరియు పుట్టగానే ఏడవని బిడ్డలకు ప్రాణం పోసే విధానం - 

  

•. పసిపిల్లలు పుట్టగానే చేయవలిసిన పని  - 

      

సహజమయిన కాన్పు జరిగినప్పుడు తల్లికి చీకట్లు కమ్మినట్లుగా ఉండి తన ఒళ్లు తనకే తెలియనట్లుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆమెకి గట్టిగా నడుము బిగించి కట్టి వెల్లికిలా పడుకొపెట్టి ఉంచాలి. పక్కన సహాయకులుగా ఉన్నవారు బిడ్డని జాగ్రత్తగా ఎత్తుకొని గోరువెచ్చటి నీరుతో శుభ్రంగా కడిగి స్నానం చేయించి మెత్తని పొడి గుడ్డల్లో పడుకోపెట్టాలి. పక్కన ఉన్నవారు తమ చేతులకు నిప్పుసెగని కాచుకొని ఆ చేతులను బిడ్డ శిరస్సు , కడుపు భాగాలకు వేడి కలిగేలా చేయాలి . తరువాత ఆ చేయి శుభ్రంగా కడుక్కొని చూపుడు వ్రేలితో అతి కొద్ది ఆముదాన్ని తీసుకుని బిడ్డకు నాకించాలి.

  

• పుట్టగానే ఏడవని బిడ్డకు ప్రాణం పోసే విధానం  -

     

      కొన్ని సమయాలలో బిడ్డ పుట్టగానే ఏడవకుండా ఉండటం జరుగును. అట్టి సమయాలలో గాబరా పడకుండా మావిత్రాడు ని సవరిస్తూ ఉండాలి. దానివలన ఆ మావిత్రాడు లొని ప్రాణవాయువు బిడ్డ గర్భములొకి చేరి వెంటనే శరీరానికి చైతన్యం కలిగి అంటే ప్రాణం చేరి బిడ్డ కదులుతూ ఏడుస్తుంది. ఇంకా బిడ్డని అటుఇటు కదిలించి వేడివేడి చేతులతో తాకుట వలన బిడ్డ తుంటి పైన మెల్లగా సుతారంగా తట్టుట వలన ప్రాణం శరీరంలోకి ప్రవేశించి బిడ్డ ఏడుస్తుంది . 

        

.           ఒకవేళ బిడ్డ ఎడవకపోతే పైన చెప్పిన పనులు చేసిన తరువాత బిడ్డ క్షేమంగా సజీవంగా ఉందని తెలిసిన తరువాతే బొడ్డు కోయాలి. పదిపదిహేను నిమిషాల పాటు పైన చెప్పినట్టుగా చేస్తూ ఉంటే నిర్జీవంగా ఉన్న బిడ్డలో ప్రాణం వస్తుంది. ఆముదం తడిపిన వ్రేలు బిడ్డ నోటిలో పెట్టడం వలన కూడా బిడ్డలో ప్రాణం చేరి ఉలిక్కిపడి ఏడుస్తుంది . మావిత్రాడులో ప్రాణ నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ప్రాణం బిడ్డ శరీరంలో చేరి బిడ్డకు చైతన్యం కలిగి ఏడ్చే వరకు మావిత్రాడుని కదిలిస్తూ ఉండాలే కాని ఎట్టి పరిస్థితులలో మావిత్రాడు కోయడం కాని , ముడి వేయడం కాని చేయకూడదు .

           

.           వైద్యులు , పురుడు పోసే మంత్రసానులు ఈ విషయాన్ని తప్పక గుర్తు ఉంచుకోవాలి . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక  -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

.       నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

.      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

.      ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

.   ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

.        కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

.    అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

.               9885030034

తెలుగుదనం



తెలుగుదనం

గొప్ప చిత్రకళా ప్రదర్శనం నడుస్తోంది.  సజీవంగా నిలబడి ఉందా అనిపించేంత అందమైన పడుచుపిల్ల బొమ్మను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడొకాయన.  ఆ పిల్ల ఒంటిమీద బట్టలు లేవు.   పచ్చని ఆకులు మాత్రం కప్పుకొంది.   చూసి చూసి ఆయన భార్య, 'ఏం స్వామీ! శిశిరం వస్తేగాని అక్కడినుంచి కదిలిరారా ఏమిటి?' అని ప్రశ్నించింది.   చిన్నతనంలో మనం 'శిశిరంలో చెట్లు ఆకులు రాల్చును...'   అని పెద్ద బాలశిక్షలో చదువుకున్నది గుర్తొస్తే, ఆమె ప్రశ్నలో చమత్కారం అర్థమై, ఎక్కడో గుండె లోతుల్లోంచి ఆనందం ఉబికి వస్తుంది.  


రాముడి బొడ్డు కోస్తుంటే బ్రహ్మదేవుడు ఉలిక్కిపడ్డాడని రాశారు విశ్వనాథ!   రాముడు మహావిష్ణువు అవతారం.   విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు కాబట్టి, పునాదులు కదులుతుంటే బ్రహ్మ కంగారుపడ్డాడని అందులో ధ్వని.   ఇది తెలిసేసరికి మనసులో కలిగే ఒకానొక అపురూపమైన స్పందన పేరే ఆనందం. రసజ్ఞత దానికి మూలం.  సాహిత్య అధ్యయనం వల్ల కలిగే పరమ ప్రయోజనమది.  


సాహిత్యం మనిషిని సహృదయుణ్ని చేస్తుంది.   జీవితానికి రంగులద్దుతుంది. వూహలకు రెక్కలు తొడుగుతుంది.   భావుకతను పెంచుతుంది.   చదువులూ డిగ్రీలూ చేయలేని పని మనిషిని రసజ్ఞుణ్ని చేయడం.   అది సాహిత్యంవల్ల సాధ్యపడుతుంది.  


 'చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకం...'  అనేశాడు భాస్కర శతకకారుడు.   రసజ్ఞత అలవడకపోతే మనిషి తన జీవితంలో ఎన్నోరుచులు కోల్పోతాడు.  అందుకే  '...లే జవరాలు చెక్కుమీటిన వస వల్చు బాలకుడు డెందమునం కలగంగ నేర్చునే...?'  అని నిలదీశాడు శ్రీనాథుడు.    సాహిత్యంలో మజా ఎంత గొప్పదో, అది అనుభవించినవాడికే తెలుస్తుంది. 


సాగరమథనంలో అమృతం పుట్టినట్లు, సాహిత్య మథనంలో మాధుర్యం పుట్టి మనిషికి జీవించిన క్షణాలను మిగిలిస్తుంది.


ప్రాచీనం కావచ్చు,   ఆధునికం కావచ్చు.   రచన గొప్పదనం సహృదయ పాఠకుడికి అది కలిగించే అనుభవ విశేషాన్ని బట్టి ఉంటుంది.   ఆ అనుభవం పాఠకుడిలో ఎన్నో ప్రవృత్తులకు కారణమవుతుంది.  


రామాయణాది ప్రాచీన కావ్యాల అధ్యయనం మనిషిని మంచి యోగ్యుడిగా చేస్తుంది.   ఆధునిక రచన కన్యాశుల్కం చదవడం పూర్తయ్యేసరికి మనలోపలి గిరీశాన్ని మనం గుర్తించగలుగుతాం.   అదీ సాహిత్య ప్రయోజనం!  


పాలకడలిని చిలికినప్పుడు పుట్టుకొచ్చిన కాలకూట విషాన్ని జనహితం కోరి, మింగేయవయ్యా అని భర్తకు అనుమతి ఇచ్చింది సర్వమంగళ . '...మంగళ సూత్రమ్ము నెంత మది నమ్మినదో...'  అన్నాడు పోతన్న.   ఆ భావం ఇంకితే బండరాయి వంటి గుండెకాయ సైతం కరిగి నీరవుతుంది. 


నీకవితాకన్య చాలా సొగసుగా ఉంది అన్నవారే  '... మీదే కులము? అన్న ప్రశ్న వెలయించి, చివుక్కున లేచి పోవుచో బాకున క్రుమ్మినట్లగును...'  అని కవి మనసు విలవిల్లాడిందని తెలిస్తే మనకీ గుండె కలుక్కుమంటుంది. ' 


' హృదయ సంబంధి' సాహిత్యం మనిషిలో కలిగించే సంస్కారాలకు ఇవి ఉదాహరణలు.   మనిషితనానికి చిహ్నాలు.  


వేసవికాలంలో ఒకోసారి పెద్దగా సుడిగాలి రేగి, పొడవైన గుండ్రని దుమ్ము చక్రాలు ఏర్పడతాయి కదా! ఆ ఆకారాన్ని బట్టి కాబోలు,  వాటిని  'ఎగిరే బావులు'  అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు.   నూతులు ఎగరడమేమిటయ్యా అంటే తమలోని నీళ్ళను నీ వేడి పూర్తిగా పీల్చేసింది మొర్రో అని సూర్యుడికి విన్నవించుకోవడానికి అవి ఆకాశంలోకి లేచాయి అన్నాడు.   బుద్ధితో ఆలోచించి గ్రహిస్తే  ఆహాఁ అనిపించే ఊహ అది.   బాలరాముడు ఓంకారంలా ఉన్నాడు చూడండి అన్నారు విశ్వనాథ.  బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాలుణ్ని వూహించుకుని, ఆ భంగిమను తెలుగు 'ఓం' అక్షరంతో పోల్చిచూస్తే ఆ దర్శనం మనకీ లభిస్తుంది.   ఇది 'బుద్ధిసంబంధి'  సాహిత్యం తీరు.


'నన్నయ తిక్కనలు ప్రయోగించినంత గొప్పగా శబ్దాన్ని ఏ తెలుగు కవీ ప్రయోగించలేదు... మహారాజుకు నన్నయ గురువు... పెద్దన సార్వభౌముని ప్రాణస్నేహితుడు... శ్రీనాథుడు కవుల కవి... వేమన రెక్క ముడవని, భరత పక్షి, కాలాలు దాటి ఇంకా ఎగిరివస్తూనే ఉంది...'  ఆయా కవుల జీవధాతువును పట్టిచ్చే ఈ విశ్లేషణ కృష్ణశాస్త్రిది. ఇది బుద్ధిగతమైన వివేచన.   బుద్ధిసూక్ష్మతకు సూచన.  


తిరువళ్ళిక్కేన్‌ దేవాలయం ఏనుగుకు రోజూలాగే ప్రసాదాన్ని అందించాడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి.   ఆ రోజెందుకోగాని ఏనుగు తన తొండంతో భారతిని ఎత్తికొట్టింది.   ఆయన మరణించిన రోజున మరో ప్రముఖ కవి వాలి విలపిస్తూ  'తమిళ చెరుకుగడను తిరువళ్ళిక్కేన్‌ ఏనుగు మింగేసింది'  అన్నాడు.   కృష్ణశాస్త్రి మరణించారని తెలిసి శ్రీశ్రీ  'అద్దం బద్దలైంది... రోదసి రోదించింది... షెల్లీ మళ్ళీ మరణించాడు... వసంతం వాడిపోయింది'  అన్నాడు. ఇది గుండెల్లోంచి పొంగే స్పందన.   రసజ్ఞతకు సూచన.


 'ఎయ్యది హృద్యము? అపూర్వం బెయ్యది?'  అని అడిగి వూరుకోలేదు మనవాళ్ళు. అంటే హృదయ సంబంధి, బుద్ధి సంబంధితో సరిపెట్టుకోలేదు.  '...ఎద్దాని వినిన ఎరుక సమగ్రమగు?'  అనీ ప్రశ్నించారు.   ఎరుక కలగడం సాహిత్యం తాలూకు పరమ ప్రయోజనం!  


భారతీయ సాహిత్య అధ్యయనం గొప్ప ఉదాత్త లక్ష్యాలతో కూడుకున్నది.   నన్నయ్య వెలుగుతో, తిక్కన్న తెలుగుతో, పోతన్న ఎలుగుతో... కనీస పరిచయం లేకుండా 'నేను తెలుగువాణ్ని'  అని ఎవరైనా ఎలా చెప్పుకోగలరు?  


అశోకవనంలో సీతాదేవిలా ఉంది ప్రస్తుతం తెలుగు భాష!   ప్రాచీన భాష హోదాతో రాజయోగం అమరింది.   చెర విముక్తికి దారి దొరికింది.   పఠన యోగాన్ని కూడా మనం పట్టిస్తే అగ్నిపునీత అయి లక్ష్యాన్ని చేరుకుంటుంది.   తెలుగు భాష ఘనతను వివిధ కోణాల్లోంచి గ్రహించి అటు కవులూ, ఇటు భావుకులూ దాని వైభవాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కృషిచేస్తే అదే పదివేలు!


( *వెంకటరత్నం గారు 'తెలుగు సాహిత్యం' గ్రూప్ లో పది సంవత్సరాల కింద చేసిన పోస్ట్ కి కాపీ పేస్టు*)

జీవితాము నాలుగు అక్షరాలే

 🙏🕉️శ్రీమాత్రేనమః శుభోదయం🕉️🙏             🔥 *జీవితాము నాలుగు అక్షరాలే కానీ అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ..శరీరం అనిత్యమని, సంపద శాశ్వతం కాదని, మృత్యువు ఎల్లప్పుడూ చె్రువనే ఉంటుందని గ్రహీంచక దేనికోసమో వెతుకులాట*🔥ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు.. కానీ దాని స్వంత తుప్పు దానిని నాశనం చేస్తుంది.. అలాగే ఒక వ్యక్తిని ఇతరులు ఎవరూ అంత తొందరగా నాశనం చేయలేరు.. కానీ అతని సొంత చెడు ఆలోచనలు మరియు అత్యాశ ఆ పని చెయగలదు🔥జీవితం మరియు సమయం ఇద్దరు మంచి ఉపాధ్యాయులు.. సమయం సరిగ్గా ఉపయోగించుకోవాలని జీవితం మనకు బోదిస్తుంది.. సమయం నేర్పుతుంది, జీవితం యొక్క విలువ ఏమిటని🔥🔥మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ ‌ బ్యాంకు ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

దాశరధీ శతకం

 🙏దాశరధీ శతకం లోనిపద్యరాజము 🙏

భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో

దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా

డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే

దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

ఈ పద్యం రామదాసు గా ప్రసిధ్ధి చెందియన కంచెర్ల గొపన్న రాసిన దాశరధీ శతకం లోనిది.


అర్ధం:- యుద్ధం చెయ్యడం లో ప్రసిద్ధి గాంచిన వాడు, భక్తజన భాందవుడు, కోదండం తొ ఉజ్వల భాణతూణీరాలు వేయ గల భుజ బలసంపదగల రాముడి ని మించిన వేరే దేవుడు లేడని ఢం ఢఢం ఢం ఢం ఆని ఢంకా భజాయించి భుమండలమంతా వినబడేలా మదించిన ఏనుగు మీదకెక్కి చాటుతాను అని అర్ధం.

ఈ పద్యం ఉత్పలమాల అయినప్పటికీ 5 పాదాలుండటం వలన ఉత్పలమాలిక అయింది. దాశరధీ శతకం లో ఇలాంటి ఐదేసి పాదాలు పద్యాలు ఇంకా 5 ఉన్నాయి. ఈ పద్యం లో రాముడి లాంటి రెండొ దెవుడు లేడు అంటే అంటే శివుడో, వినాయకుడొకాదు. అది తెలుసుకోవాలంటే ఆనాటి సామాజిక రాజకీయ పరిస్తితులు తెలుసుకోవాలి.


మహామ్మదీయులు భారతదేశం లొ ప్రవేశించి వేల దేవాలయాలు నాశనం చేసారు. విగ్రహాలను ధ్వంస్వం చేసి అపవిత్రం చేసి పనికి రాకుండా చేసారు. చివరకి శ్రీరంగం లోని విగ్రహాన్ని కాపాడుకోవడం కోసం తిరుపతికి తీసుకొని వెళ్ళారు. 7000 వేల ఏళ్ళ చరిత్ర గల శ్రీకూర్మం కోవెలను కాపాడడం కొసం దాని మీద మట్టి దిబ్బలుపోసి 200 ఏళ్ళు ఉంచేశారు. ఇవి కొన్ని మాత్రమే, పూర్తిగా ధ్వంస్వం అయిపొయిన ఆలయాలు మరెన్నో.


సనాతన ధర్మానికి మూలాలు దెవాలయాలు. మన సనాతన ధర్మం వేల ఏళ్ళగా నిత్యనూతనం గా నిలబడటాని కారణం, వేదాలు వెద విద్య నశించకుండా ఉండటానికి కారణం దేవాలయాలు. అటువంటి దేవాలయల మీద మన సంస్కృతి మీద దాడిజరిగింది. దక్షిణాదిన శ్రీకృష్ణ దేవరాయలు తరువాత పెద్ద ఆలయాలు కట్టించె రాజులు కరువైనారు. ఉన్నవాళ్ళు వారి రాజ్యం కాపాడుకొవడం కోసం మహమ్మదీయులకి వశమై పోవడమో లేక వారి చేతులో ఓడిపొవడమో జరిగేది. హిందువులమీద జరగరాని అక్రుత్యాలన్ని జరిగేవి. బెదిరించి, బలవంతంగా మతమార్పుడులు బహిరంగంగా జరిగేవి.


మరోపక్క ఈస్టిండియా కంపెని కాలూనుతున్న రొజులు. సామ దాన ఉపాయలతొ కిరస్తాన మత మార్పిళ్ళు జరుగుతుండేవి.


ఆటువంటి కాలం లో మన సనాతన ధర్మన్ని నిలబెట్టడానికి నైజాం కాలం లొ గొపన్న కట్టించిన ఆలయం భద్రాచల రామాలయం. దీనికిగాను ఆయనకి కారాగార శిక్ష వేసారు. చివరకు రాముడే దిగివచ్చి అయనను విడిపించాడు. ఆయన రాసిన కీర్తనలు అమృత తుల్యాలు. తరతరాలుగా పాడుతునే ఉన్నారు.


సాహితీ రాజ్యానికి రాజు, సంగీత రాజ్యానికి రారాజు, భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి, విపత్క పరిస్తితులలొ సనాతన భారతీయ ధర్మాని నిలబెట్టిన మరో మహా మనీషి కంచెర్ల గొపరాజు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సుభాషితమ్

 🪷 //శుభోదయమ్ సుభాషితమ్// 🪷

                    

॥శ్లోకం॥

> *య: ప్రీణయే త్సు చరితై: పితరం స పుత్రో*

> *య ద్భర్తురేవ హిత మిచ్ఛతి త త్కళత్రమ్ |*

> *త న్మిత్ర మాపది సుఖే చ సమక్రియం య*

> *దేత త్రయం జగతి పుణ్యకృతో లభంతే ॥*

------------------------

`నా అనువాదపద్యం`


ఉ॥

ఎవ్వడు తండ్రి సంతసిల నిమ్ముగ సత్క్రియలందు వర్తిలున్ 

ఎవ్వతె మేలుఁ గోరి హృదయేశుని నిత్యము భక్తిగొల్చెడిన్ 

ఎవ్వడు ఛత్రమౌచుఁ దన దిష్టసఖున్ హితవర్తియై గనున్ 

నొవ్వని పుత్రుడౌ నువిద నోర్పగు మిత్రుడగుం గ్రమంబునన్ 

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  - ద్వితీయ - విశాఖ -‌‌ భౌమ వాసరే* (15.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పిప్పలాదుడు

 Pippalada Story :ఉపనిషత్తును రచించిన మహా జ్ఞాని పిప్పలాదుడు. తన తపస్సుతో మానవులకు జన్మించిన 5 సంవత్సరాల వరకు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి. పిప్పలాదుని చరిత్ర ఒక్కసారి చదివితే జీవితంలో శని బాధలు, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అసలు ఇంతకీ ఎవరీ పిప్పలాదుడు? ఆయన చరిత్ర ఏమిటి? అనే విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.


ఎవరీ పిప్పలాదుడు!

జన్మించిన 5 సంవత్సరాల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు పిప్పలాదుని జన్మ వృత్తాంతం తెలుసుకుందాం. మహా దాన కర్ణుడిగా పేరొంది ఇంద్రుని వజ్రాయుధాన్ని తన ఎముకలను ఇచ్చిన గొప్ప మహర్షి దధీచి. ఆయన మరణానంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు, ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా దధీచి మహర్షి, ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంద్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. చుట్టూతా అంధకారం, ఏమీ కనిపించకపోవడం, ఎవరూ లేకపోవడం వల్ల ఆ పిల్లవాడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత కాలంలో రావి ఆకులు, పండ్లు తింటూ పెరిగి పెద్దయ్యాడు.


పిల్లవాని వివరాలు తెలుసుకున్న నారదుడు

ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తూ రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి "ఎవరు నువ్వు? అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు "అదే నాకు తెలీడం లేదు. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది" అని అంటాడు.


దివ్యదృష్టితో బాలుని వృత్తాంతం

ఆ బాలుని మాటలకు నారదుడు తన దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఈ బాలుడు సామాన్యుడు కాదని, గొప్ప దాత మహర్షి దధీచి కొడుకు అని గ్రహించి బాలునితో తన తండ్రి వృత్తాంతాన్ని వివరించాడు.


తండ్రి మరణం గురించి తెలుసుకున్న బాలుడు

నారదుని ద్వారా తన తన తండ్రి దధీచి మహర్షి వృత్తాంతాన్ని తెలుసుకున్న ఆ బాలుడు తన తండ్రి 31 ఏళ్లకే ఎందుకు చనిపోయాడని నారదుని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు దధీచి మహర్షికి శనిదేవుని మహాదశ ఉన్నందున అకాల మరణం సంభవించిందని తెలిపాడు. అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టానికి కారణమేమిటని అడుగగా అందుకు కూడా శనిదేవుని మహాదశయే అని నారదుడు చెబుతాడు.


బాలునికి నామకరణం

నారదుడు బాలునికి అన్ని విషయాలు చెప్పి రావి చెట్టు ఆకులు, పండ్లు తిని జీవించాడు కాబట్టి అతనికి పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. సంస్కృతంలో రావి చెట్టును పిప్పల వృక్షం అంటారు. నారదుడు పిప్పలాదునికి దీక్ష ఇచ్చి, తపస్సు చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.



పిప్పలాదుని కఠోర తపస్సు

ఆ తరువాత పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మాదేవుడు పిప్పలాదుని వరం కోరుకోమని అడుగగా, దేనినైనా దహించే శక్తిని తన కళ్ళకు ఇవ్వమని వరం కోరుకుంటాడు. బ్రహ్మ తధాస్తు అంటాడు. ఇక ఆనాటి నుంచి పిప్పలాదుడు తన కంటిచూపుతో అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు. తన తండ్రి మరణానికి, తన దుస్థితికి కారణమైన శని దేవుని కూడా అలాగే చూడగా శరీరం కూడా దహించుకుపోసాగింది. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.


బ్రహ్మను ఆశ్రయించిన సూర్యుడు

తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి సూర్యుడు రక్షించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచి పెట్టమని అడుగగా, అందుకు పిప్పలాదుడు ఒప్పుకోడు. అప్పుడు బ్రహ్మదేవుడు పిప్పలాదునికి శని దేవుని విడిచి పెడితే రెండు వరాలను ఇస్తానని చెబుతాడు.


రెండు వరాలు కోరుకున్న పిప్పలాదుడు

బ్రహ్మ మాటలకు పిప్పలాదుడు సంతోషించి రెండు వరాలు అడిగాడు. మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదని, తద్వారా తనలా మరెవ్వరూ అనాథ కాకూడదని కోరుకున్నాడు.


రెండో వరంగా అనాథ అయిన తనకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టుకు సూర్యోదయానికి ముందు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదని రెండవ వరం కోరుకున్నాడు.


మందగమనుడిగా శని

బ్రహ్మ దేవుడు 'తథాస్తు' అని రెండు వరాలు అనుగ్రహించగా అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు అగ్ని వేడిమికి దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శనికి మందగమనుడు అంటే మెల్లగా నడిచే వాడని పేరు వచ్చింది. అగ్ని కారణంగా నల్లగా మారిన శనికి నల్లని వస్త్రాలు సమర్పించడం ద్వారా ప్రీతి చెందుతాడు. ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఆశ్రయమిచ్చిన రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే.


ఈ పిప్పలాదుని చరిత్రను ప్రతి శనివారం చదువుకోవడం వలన శని దోషాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. శుభం భూయాత్!