18, డిసెంబర్ 2020, శుక్రవారం

అతిమూత్రవ్యాధి నివారణా యోగాలు -

 అతిమూత్రవ్యాధి నివారణా యోగాలు -


 * తంగేడు చెట్టు సమూలం తెచ్చి ఎండించి చూర్ణం చేసి దానికి సమముగా పంచదార కలిపి పూటకు రెండున్నర గ్రాముల చొప్పున సేవించుచున్న అతిమూత్ర వ్యాధి నివారణ అగును.


 * వెల్లుల్లి రేఖలు రెండుపూటలా తినవలెను . మొదటిరోజున ఒక రేఖ , రెండొవరోజున రెండు రేఖలు ఈ విధముగా పదిరోజులు క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోతూ తినవలెను .


 * నేరేడు గింజలను నీడలో ఎండించి మెత్తటి చూర్ణం చేసి నిత్యం అయిదు గ్రాముల చొప్పున నీటితో కలిపి సేవించుచున్న అతిమూత్ర వ్యాధి హరించును .


 * మర్రిచెక్క రసము కాని కషాయం కాని సేవించుచున్న అతిమూత్ర వ్యాధి తగ్గును.


 * మేడిచెక్క కషాయం కాని రసము కాని సేవించిన అతిమూత్ర వ్యాధి తగ్గును.


 * తంగేడు పువ్వులను నీడలో ఎండించి చూర్ణం చేసి ఉదయం , సాయంత్రం 5 గ్రాముల చూర్ణాన్ని నీటితో కలిపి తాగవలెను.


 * మర్రిపండ్లలోని గింజలను తీసుకుని నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును నీటిలో కలిపి తీసుకొనుచున్న 40 రోజులలో అతిమూత్ర వ్యాధి హరించును .


 * రావిచెట్టు పైన బెరడు నీడన ఎండించి చూర్ణం చేసుకుని రెండున్నర గ్రాముల చూర్ణమునకు తేనె , పంచదార కలిపి ముద్దలా చేసి ఉదయం , సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను.


 * అత్తిపత్తి ఆకు అనగా ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు ఈ ఆకు పది గ్రాములు , పాతబెల్లం కలిపి నూరి కుంకుడు గింజ అంత మాత్రలు చేసుకొని ఉదయం , మధ్యాన్నం , సాయంత్రం మూడుపూటలా తీసికొనవలెను.


     పైనచెప్పిన యోగాలలో మీకు అనువైన యోగాన్ని ఏదో ఒకటి తీసుకుని ప్రయత్నించండి.


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

తిరుప్పావై నాల్గవ పాశురము*

 🌹💐🌷🌾🥀🌸🌷💐

*తిరుప్పావై నాల్గవ పాశురము*


ఆళిమళై క్కణ్ణ! ఒన్రునీకై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగన్దుకొడు ఆర్తేళి ముదల్వ నురువం బోల్ మెయ్ కరుత్తు పాళియన్టోళుడైపట్పనాబన్కైయిల్ ఆళిపోల్ మిన్ని వలమ్బురిపోల్ నినరదిరన్దు తాళాదే శార్జ్ఞ ముదైత్త శరమళై పోల్ వాళ వులగినిల్ పేయదిడాయ్ నాఙ్గళుమ్ మార్ గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్



పర్జన్యదేవ! పాలింప రావా

సంద్రమ్ముపై వ్రాలి సలిలములు త్రావి ఆడి దేవుని వోలె ఆతసీదేహుడవై ఆకసము పైకెక్కి గర్జించుమా! సుందర బాహు అరవిందనాభు హస్తాన చక్రమ్ము వలె మెరసి, శంఖమ్ము వలె ఉరిమి శార్జ నిర్ముక్త శర పరంపరగా లోకమ్ము హర్షింప వర్షమ్ము కురియుమా!

మార్గశిర స్నానమ్ము చేసి తరించెదము జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము


              M.s.s.k

శ్రీగురు_దక్షిణామూర్తి

 #శ్రీగురు_దక్షిణామూర్తి


దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు 

ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. 

మరో కాలు పైకి మడిచి ఉంటుంది.

చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. 

ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.


బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన 

సనక, సనందన, సనాతన, సనత్కుమారులు 

బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. 

అయినా వారికి అంతుపట్టలేదు. 

వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. 


అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా 

ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. 

ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. 


ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.

ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే..

జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, 

కేవలం అనుభవించదగినది అని. 

గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. 

అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో 

విస్తృతంగా వర్ణించారు.


శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. 

దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. 

దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. 

అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి. 

దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే 

ఆ రూపమే దక్షిణామూర్తి.


మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. 

ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. 

దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. 


విష్ణు, 

బ్రహ్మ, 

సూర్య, 

స్కంద, 

ఇంద్ర 

తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.


మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.


ఆ రూపాలు వరుసగా..!💐

శుద్ధ దక్షిణామూర్తి, 

మేధా దక్షిణామూర్తి, 

విద్యా దక్షిణామూర్తి, 

లక్ష్మీ దక్షిణామూర్తి, 

వాగీశ్వర దక్షిణామూర్తి, 

వటమూల నివాస దక్షిణామూర్తి, 

సాంబ దక్షిణామూర్తి¸

హంస దక్షిణామూర్తి, 

లకుట దక్షిణామూర్తి, 

చిదంబర దక్షిణామూర్తి, 

వీర దక్షిణామూర్తి, 

వీరభద్ర దక్షిణామూర్తి¸ 

కీర్తి దక్షిణామూర్తి, 

బ్రహ్మ దక్షిణామూర్తి¸ 

శక్తి దక్షిణామూర్తి, 

సిద్ధ దక్షిణామూర్తి.


ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. 


భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, 

చంద్రకళాధరుడు, 

జ్ఞానముద్ర, 

అక్షమాల, 

వీణ, 

పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. 

తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.


పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. 

సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. 

మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను 

సొంతం చేసుకుంటారు.


చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,

సంపద(ధనము) దగ్గర నుండి, 

పెద్దలకు మోక్షము వరకు, 

దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం 

అయి ఉంటాడు.


ఓం శ్రీ గురు దక్షిణామూర్తియే నమః..!


⭐️⭐️⭐️సర్వంశివసంకల్పం  ⭐️⭐️⭐️

సంస్కృతం దేవభాష

 సంస్కృతం దేవభాష. అత్యంత ప్రాచీన భాష.దాని చరిత్ర ,మూలాలు, పరిణామం తెలియదు కానీ.... సంస్కృతం మూలాలే లాటిన్,ఇంగ్లీష్ లలో ఉన్నాయనేది కొన్ని పదాలు చూస్తే తెలుస్తుంది.(వెల్దండ రఘుమారెడ్డి పరిశోధన నుండి).


Sanskrit            English


1.లప్                  lip


2.దంత               dent


3.నాసిక              nose


4.బ్రాత                brother


5.మాత              mother


6.సూనుః            son


7.దుహిత           daughter


8.నక్తం                night


9.లఘు              light


10.వాహక         vehicle


11.వహతి         weight


12.తరు             tree


13.హోమ          home


14.మూషి         mouse


15.మృత          mortal


16.గ్రాసము       grass


17.బంధ           bond


18.నవ             new


19.మధ్య         mid


20.ఉపరి          upper


21.అదః           under


22.హోరా         hour


23.పథ్            path


24.క్రూర          cruel


25.ఉక్షా          ox


26.గౌ             cow


27.సర్ప         serpent


28.వమితం   vomit


29.ఇతర       other


30.పరమానంత permanant


31.న             no


32.అ +హం     I am


33.ఇతి         it


34.తత్        that


35.సా          she


36.సః           he


37.వయం    we


38.తే           they


39.అస్        is


40.యూయం    you


41.మానవ        man


42.అంగార        anger


43.జ్ఞా               know


44.అగ్రిమకులచర

      Agriculture


45.దామ           dam


46.స్థాన్             station


47.దానం          donation


48.సంత్           saint


49.దివ్య            divine


50.అగ్ని            ignite


51.వాక్కు         vocal


52.వస్             bus


53.సర             car


54.సర్వేక్షణ      survey


55.షష్టి             sixty


56.శత పర శత  cent per cent


57.ధీక్షపాల    discipline


58.శూర్పనఖ   sharp nails


59.దశ              deci


60.నవ             nona


61.అష్ట             octa


62.సప్త              septa


63.షష్ఠ             hexa, hepta


64.పంచ           penta


65.త్రయం         three, trio


66.ద్వయం,ద్వి   dual, dia


67.అస్థిక             osteo


68.చర్మ                derma


69.పాదచారి         pedestrian


70.కృష్ణ                Christna


71.  గోళం             globe


72.దత్త                  debt


73.విధవ               widow


74.పరిమితి           perimeter   


75.భ్రూ                brow


76.తార              star


77.అంతర          inter


78.అంత్            end


79.స్విస్టం           sweet


80.సీవతి            sewing


81.తిథి               date


82.క్రమేల            camel


83.పురోగం         programme


84.చోష్             juice


85.ప్రచార         preacher


86.మనస్తర్       minister


87.సంపన్న       champion


88.అర్కొదది  arctic ocean


89.అతులాంతకోదది. Atlantic ocean


90.ప్రశంతోదది  Pacific ocean 


91.అస్త్రాలయ్  Australia


92.అంధమానవ ద్వీపం Andaman 


93.హిందూ ఆసియా  Indonesia


94.ఋషీయా  Russia


95.కాశ్యపసముద్రము  Kaspean sea.


96.ఆముస్తారదామ  Amsterdam


97.అగ్నిఖండ్,అంగళ గ్రంధి  England


98.బ్రహ్మాంగ దామ  Bermingham


99.మరీచిక  Mauritius


100.లాస్యంజలి LosAngels.

ఇండియా

 .. *నెస్లే ఇండియా* మంచిది. ఎందుకంటే, దాని వోనర్ ఎవరో మనకు తెలీదు.

.. *ప్రాక్టర్ & గ్యాంబుల్* మంచిది. ఎందుకంటే, దాని వోనరు  మనకు తెలీదు

.. *కోక కోలా, పెప్సీ* మంచివి. ఎందుకంటే, వాటి వోనర్లూ  మనకు తెలీదు.

.. *వోడ ఫోన్* మంచిది. ఎందుకంటే దాని సేటు కూడా  మనకు తెలీదు.

.. *వివో, శామ్‌సంగ్, నోకియా, ఒప్పో*, అన్నీ మంచివే. ఎందుకంటే వాటి వోనర్లు ఎవరూ మనకు తెలీదు.


అన్నీ ఫారిన్ కంపెనీలు. మల్టీ నేషనల్స్ బాబూ!  


 - *ముఖేష్ అంబానీ*... దొంగ!

 - *గౌతమ్ అదానీ*... దొంగ!

 - *టాటా*... దొంగ!

 - *మహీంద్ర*... దొంగ!

 - *రామ్‌దేవ్ బాబా*... పెద్ద  దొంగ! 

 

 - కొత్త పార్లమెంటు కాంట్రాక్ట్ టాటా కు ఎందుకు ఇచ్చారు? 

 - సోలార్ కాంట్రాక్టులు అయితే గియితే చైనా కి దక్కాలి గానీ, అదానీకి ఎలా ఇస్తారు??


వీళ్లంతా మనాళ్లు. *మనాళ్లను గొప్ప వాళ్లు అంటారేంటి? ఒప్పుకోము.*

*మన వాళ్లు అంతా దొంగలే!!* 

ఎలాగో మేనేజ్ చేసి కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు.


--- * --- * --- * --- * ---


*ఏమైనా అర్ధం అవుతోందా?* 


ఇదొక మానసిక పరిస్థితి. అంత త్వరగా అర్ధం కాదు. యేళ్ల తరబడి మన బుర్రల్లోకి ఇంజెక్ట్ చేయ బడిన బానిస మనస్తత్వం.


అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.


*మన బుర్రల్లోంచి "ఆత్మ గౌరవం" అనే మాట ని తీసెయ్యడానికి లెఫ్త్ లిబరల్స్ పడ్డ కష్టాలు మామూలు వా!*


"అసలు కరోనా అంటే ఏమనుకున్నారు? మన దగ్గర లక్షల మంది చావాల్సిందే.." 

"అబ్బే, మన దగ్గర పీపీయీ కిట్లు తయారు కావండీ..."

"ఎన్ 95 మాస్కులంటే యేమనుకున్నారు అసలు! అవన్నీ చైనా లోనో అమెరికా లోనో తయారవ్వాలి"

"అబ్బే, మన వాళ్ల ప్రాడక్ట్స్ క్వాలిటీ ఉండవండీ.." 

"సీరం ఇన్స్టిట్యూట్ కి బిల్ గేట్స్ 300 మిలియన్ డాలర్లు ఇచ్చాడంట. సీరం ఇన్స్టిట్యూట్ వోనర్ మోడీ దోస్తు. ఆ(.. ఇప్పుడు అర్ధం అయ్యింది. మోడీ మొన్న అందుకే వెళ్లి ఉంటాడు పుణె కి"


ఇలాంటి బానిస మనస్తత్వాన్ని పెంచి పోషించే వ్యవస్థను అర్థం చేసుకోవాలి. 


*అందుకే మన ఊహల్లోకి కూడా రాదు...*


 - అదార్ పూనావాలా కరోనా కి వ్యాక్సిన్ తయారు చెయ్య గలడని 

 - మహీంద్రా వెంటిలేటర్లు తయారు చెయ్య గలడని..

 - టాటా ట్రక్కులే కాదు - ట్యాంకులూ, ఏరో ప్లేన్ లూ తయారు చేయ గలడని 

 - అంబానీ 5జీ లాంచ్ చేయ గలడని

 - ఎల్ & టీ సబ్ మెరైన్ లు తయారు చేయ గలదని

 - మన హెలి కాప్టర్లు, ఏరో ప్లేన్ లు మనమే తయారు చేసుకో గలం అని..

 - మన ట్యాంకులు, మన రాడార్లు, తుపాకులు, బులెట్ ఫ్రూఫ్ జాకెట్లు, అన్నీ మనమే తయారు చేసుకో గలం అని.. 


భారత్ ఇకపై నిస్సహాయ దేశం కాదు.

ఇది కొత్త భారతం.

ఇది సమస్యలను పోస్ట్ పోన్ చెయ్యదు. 

ధైర్యం గా ఎదుర్కుంటుంది. 

విపత్తులను కూడా అవకాశాలుగా మార్చుకుంటుంది.


ఇది ఆత్మ గౌరవ భారత్. 

ఇది ఆత్మ నిర్భర భారత్.

(సెల్ఫ్ రెలయంట్) 


విశ్లేషణలు చేసే వారు చేస్తూనే ఉంటారు.. 

డప్పులు కొట్టే వారు కొడుతూనే ఉంటారు..

ఆజాదీ నినాదాలు ఇచ్చే వారు ఇస్తూనే ఉంటారు..

తుక్డే తుక్డే గ్యాంగ్ ధ్వంస రచనలు చేస్తూనే ఉంటుంది..


*కానీ ఈ కొత్త భారత్ ఆగదు!* 

*తన జైత్రయాత్ర ఆపదు!!*

సంస్కృతం లో వృక్షాల పేర్లు కొన్ని ..

 సంస్కృతం లో వృక్షాల పేర్లు కొన్ని ..


కదంబ: = కడిమి

ఆమలక: = ఉసిరి

విష్ణుక్రాంతా = విష్ణు క్రాంత

బృహజ్జం బీర: = దబ్బ

మధూక: = ఇప్ప

అరిష్ట: = కుంకుడు

ఆమ్ర = మామిడి

నింబ: = వేప

పలాశ: = మోదుగ

పర్కటీ = జువ్వి

చించా = చింత

అశ్వధ్ధ: = రావి

అర్జున: = మద్ది

అర్క: = జిల్లేడు

భృంగరాజ: = గుంట గలగర

శమీ = జువ్వి

జంబూ = నేరేడు

శల్మలీ = బూరుగ

లతా = తీగ

స్కంధ: బోదె

శాఖా = కొమ్మ

మాచీ = మాచికాయ

కపిత్త: = వెలగ

గుల్మ: = పొద

నికుంజ: = పొదరిల్లు

కాండ: = కాండము

శిఫా = ఊడ

కింజల్క: = పుప్పొడి

వట: = మర్రి

వరాటక: = విత్తనాల కోశము

దూర్వా = గరిక

కుస: = దర్భ

తృణం = గడ్డి

ఘాస: = పచ్చి గడ్డి

వేణు: = వెదురు

బదరీ = రేగు

అపామార్గ: = ఉత్తరేణి

వృంతం = తొడిమె

దళం = రేకు

అంకుర: = మొలక

బీజం = విత్తనం

తాల: = తాడి

బర్బర: = తుమ్మ.

సంస్కృతంలో పక్షుల పేర్లు

 సంస్కృతంలో పక్షుల పేర్లు


పక్షిణ: - పక్షులు

శుక:  - చిలుక

బక: - కొంగ

కాదంబ: - బాతు

ఉష్ట్రః - ఒంటె

ఖడ్గీ - ఖడ్గ మృగము

చిత్రక: - చిరుతపులి

చిత్రోష్ట్ర: - జిరాఫీ

భల్లూక: - భల్లూకము, ఎలుగుబంటి

కుక్కుట: - కోడి

కాక: - కాకి

కోకిల: - కోకిల

మశక: - దోమ

ద్విరేఫ: - తుమ్మెద

గృధ్ర: - గ్రద్ద

హంస: - హంస

మూషక: - ఎలుక

మధుమక్షికా - తేనెటీగ

జతుకా - గబ్బిలము

కపోత: - పావురం

గరుడ: - గరుడుడు

మక్షికా - ఈగ

మధుకోశ: - తేనెతుట్టె

పిపీలిక - చీమ

పుత్తిక: - రెక్కల చీమ

చిత్ర పతంగ: - సీతాకోకచిలుక

శ్యేన: - డేగ

దావాఘాట: - వడ్రంగి పిట్ట

చతక: - పిచ్చుక

మయూర: - నెమలి

ఉలూక: - గుడ్లగూబ.


// శ్రీ టేకుమళ్ళ

వెంకటప్పయ్య//

సంస్కృతంలో పుష్పాల పేర్లు.

 సంస్కృతంలో పుష్పాల పేర్లు.


1.సేవంతికా = చామంతి

2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు

3.మాలతీ = మాలతీ

4.వకులం = పొగడ

5.కమలం = తామర

6.జపా = మందార

7.జాతీ = జాజి

8.నవమల్లికా = విరజాజి

9.పాటలం = గులాబీ

10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి

11.కురవకం = గోరింట

12.ప్రతాపన: = తెల్లమందారం

13.శిరీషం = దిరిశెన పువ్వు.

14.ఉత్పలం = కలువపువ్వు

15.అంభోజం = తామర

16.సితాంభోజం = తెల్ల తామర

17.కుశేశయం = నూరు వరహాలు

18.కరవీరం = గన్నేరు

19.నలినం = లిల్లీ

20.శేఫాలికా = వావిలి

21.పున్నగం = పొన్న పువ్వు

22.అంబష్టం = అడివి మల్లె

23.జాతీ సుమం = సన్న జాజి

24.గుచ్చ పుష్పం = బంతి

25.కేతకీ = మొగలి

26.కర్ణికారం = కొండ గోగు

27.కోవిదారం = దేవకాంచనము

28.స్థలపద్మం = మెట్ట తామర

29.బంధూకం = మంకెన

30.కురంటకం = పచ్చ గోరింట

31.పీత కరవీరం = పచ్చ గన్నేరు

32.గుచ్చ మందారం = ముద్ద మందారం

33.చంపకం = సంపెంగ

34.కుందం = మల్లె

35.పుష్ప మంజరీ = పూలవెన్ను.

గుణవంతుడుండిన

 🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కులములోన నొకడు గుణవంతుడుండిన

గులము వెలయు వాని గుణము వలన

వెలయు వనములోన మలయజంబున్నట్లు

విశ్వదాభిరామ వినుర వేమ

తా:-అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నచో అడవి అంతయూ సువాసనతో నిండిపోవును. అట్లే వంశములో ఒక్క సద్గుణవంతుడు పుట్టినచో వాని వలన ఆ వంశమంతయూ కీర్తి ప్రతిష్టలు పొందును. ఈ విషయమే చిన్న మార్పు తో వేదమునందున్నది. ఎట్లనగా - - "అడవిలో ఒక సుగంధము గల పూలచెట్టు ఉన్నచో అడవి అంతయూ పరిమళించును. అట్లే పుణ్రకర్మములు చేయువాని కీర్తి గూడ లోకములో వ్యాపించును.


13.పూజకన్ననెంచ,బుద్ధి ప్రథానంబు

మాట కన్ననెంచ మనసుద్రుఢము

కులము కన్న మిగుల గుణము ప్రధానంబు

విశ్వదాభిరామ వినుర వేమ

తా:- చేసెడి పూజకన్నను, ఎందుకు చేయుచున్నామో తెలిసిన బుద్ధి ముఖ్యమైనది. ఆడిన మాట కన్నను మాట నిలబెట్టుకొనవలెనన్న మనసు ముఖ్యము. ఆ విధముగానే ఏ కులము లో బుట్టినాడను విషయం కంటే వానికి గల సద్గుణమును ప్రధానంగా చూడవలెను.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

చెవి యొక్క ఆత్మ కథ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 *👂చెవి యొక్క ఆత్మ కథ👂* 


ఒక సారి తప్పక చదవండి. 

మనసులో గిలిగింతలు కలుగుతాయి. ☺


నేను చెవిని.👂

మేము  ఇద్దరము. 👂👂 ఇద్దరము  కవలలము. కానీ  మా దురదృష్టమేమిటంటే,  ఇప్పటి వరకు మేము

ఒకరినొకరు  చూసుకోలేదు .

ఏ శాపమో తెలియదు  మేము వ్యతిరేక దిశలో అంటుకుని పంపించబడ్డాము.  మా బాధ ఇంత మాత్రమే, మా బాధ్యత కేవలము వినడము మాత్రమే. 

తిట్లు గానీ లేదా చప్పట్లు, మంచి లేదా చెడు అన్నీ మేము వింటాము.  క్రమ క్రమంగా మమ్మల్ని ఒక ఆధారంగా ( మేకు ) భావించారు.  కళ్ళ జోడు బరువును మాపై  పెడుతున్నారు.  ఫ్రేమ్ యొక్క కాడలను మా పై మోపుతారు. ఈ నొప్పిని మేము భరించాలా?  ఎందుకు?    కళ్ళ జోడు సంబంధము నేత్రాలకు చెందినది.  మరి 

మరి మమ్మల్ని మధ్య లోకి లాగడం లో సంగతేమిటి?

మేము మాట్లాడము, అయితే ఏమైంది, వినగలము కదా! 

ప్రతిచోట మాట్లాడే వారే ఎందుకు ముందుంటారు?

  

బాల్యంలో చదువుకునేటప్పుడు ఎవరికైనా మెదడు పని 

చేయకపోతే మాస్టరు గారు మమ్మల్నే మెలేస్తారు. 

 

యవనంలో పురుషులు, మహిళలు అందరూ అందమైన జూకాలు,

కమ్మలు, లోలకులు మొదలైనవి చేయించుకొని  మాపైననే వేలాడదీస్తారు. 

రంద్రాలు చేయడం మాకైతే, పొగడ్తలు మాత్రము  ముఖానికి. 


ఇంకా అలంకరణ చూడండి! కండ్లకు కాటుక, ముఖానికి  క్రీములు, పెదవులకు లిపిస్టిక్, మరి ఇప్పటి వరకు మేము ఏమైనా అడిగామా చెప్పండి? 


ఎప్పుడైనా ఏ కవి అయినా కూడా ఏ శాయర్ అయినా చెవుల గురించి ప్రశంసిస్తే పొగిడితే చెప్పండి.  వారి దృష్టిలో కండ్లు, పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము. 

మేము ఏదో మృత్యుభారము లాగా మగిలిపోయిన రెండు పూరీల మాదిరిగా లేపి ముఖానికి ప్రక్కల అతికించబడినాము. 

కొన్ని సార్లు వెంట్రుకలు కత్తిరింపులో మాపై కూడా గాట్లు పడతాయి.   డెటాల్ పూసి శాంతపరుస్తారు. 

 

విషయాలు చాలా ఉన్నాయి,  ఎవరితో చెప్పుకోవాలి? 

బాధలు పంచుకుంటే మనసు తేలిక అవుతుందని అంటారు.

కండ్ల తో చెప్పకుంటే అవి కన్నీరు కారుస్తాయి, ముక్కు తో చెప్పుకుంటే అది చీదరిస్తుంది.  నోటితో చెప్పకుంటే అది అయ్యో  అయ్యో అని రోదిస్తుంది.  ఇంకా చెప్పాలంటే పండితుల వారి జంధ్యము, టైలర్ మాస్టర్ యొక్క పెన్సిల్, 

మేస్త్రీ యొక్క మిగిలిపోయిన గుట్కా పొట్లము, మొబైల్ ఫోన్ యొక్క ఇయర్ ఫోన్స్, వీటన్నింటిని మేమే సంభాళించాలి. 

   

ఇంకా ప్రస్తుత పరిస్థితులలో ఈ క్రొత్త క్రొత్త మాస్కుల జంఝాటము కూడా 

మేమే భరించవలసి వస్తుంది. 

చెవులు కాదు  పక్కా మేకులు లాగా ఉన్నాము  మేము.  ఇంకా ఏమైనా తగిలించాలి, వ్రేలాడదీయాలనుకుంటే తీసుక రండి.  మేము ఇద్దరము సోదరులము సిద్ధంగా ఉన్నాము. 


కొంచం  నవ్వుతూ ఉండండి, 

ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి. 

😃😃😃😃😃

హరిఓమ్, జై శ్రీరామ్. 

సేకరణ: వాట్సాప్ సందేశం.

విశ్వం వేద వివరణ

 విశ్వం వేద వివరణ. ఋగ్వేదం విశ్వం గురించి దాని గరిమనాభి అక్షాంశాల గురించి అనంతమైన రేడియేషన్ గల ఎలక్టాన్సు ఆవహించి యున్నవని మనకు తెలియుచున్నది. అయిన చలనము వలన దీని శక్తి అనంతమగుచూ పరిమితికి లోబడి చలనం వలన ప్రకృతిని సమతుల్యతలో కాపాడు చున్నది. దీనివలననే మానవ మనుగడ. దీనికి మన పాత్ర ఏమిటి. ప్రకృతిని కాపాడుట. అది దైవత్వం. లేనిచో విశ్వ నాశనం. శూన్యంలో భూమి వివరించుట అనగా చలన మా. అనంతమైన శక్తి ఏఆధారంలేకుండా చలన గతి ఎలాఏర్ుడినదో వపురుషసూక్తవివపణయే. యిది అంతయు శాస్త్రీయ ధృకపధమే తప్ప మరేమీ కాదు. మనకు తెలియక లేదనుట. యిది యే అజ్ఞానం. అసత్యమైనది ఏదీ లేదు. ఎందుకనగా సత్యం తెలియదు కనుక

సూర్య శక్తి తత్వ ఙ్ఞానాన్ని సత్యం. పూర్ణశక్తితోను ఏగికలదో అది తెలియుట సత్య దర్శనం. చాలా సూక్మమైనది. సత్యం. సత్యం వదా. పూర్ణ వ్యాప్తము సతతం అనగా పూర్ణ శక్తి ఎల్లప్పుడు కలిగియున్నది. అ సత్యానికి కొలత కలదు. సత్యం మునకు కొలత లేదు. భార్య శక్తి సత్యం మ  ౦  శక్తి పూర్ణ మని అది చైతన్యం వలన మాత్రమే దాని వునికి భూ ప్రకాశించు జీవ తత్వం. భూమి శూన్యంలో తిరుగుట సత్యం అది అనేక కిరణ లక్షణములు కలిగి అక్షాంశ శక్తి కలదని దాని కర్త నామ, రూప, లింగ బోధను లేనిదని ప్రకృతి వలన మాత్రమే దానిని సత్య దర్శనం చేయవచ్చును. అనంతమైన ఙ్ఞానాన్ని శోధన వలననే ప్రత్యక్షానుభూతి తప్ప వేరు మార్గం లేదు.

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

5వ అధ్యాయము 

కర్మ సన్న్యాస యోగము


భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ ।

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ।। 29 ।।


భోక్తారం — భోక్త; యజ్ఞ — యజ్ఞములు; తపసాం — తపస్సులు; సర్వ-లోక — సమస్త లోకముల యొక్క; మహేశ్వరమ్ — సర్వోన్నత ప్రభువు; సు-హృదం — నిస్వార్ధ మిత్రుడు; సర్వ — సమస్త; భూతానాం — ప్రాణుల యొక్క; జ్ఞాత్వా — తెలుసుకొన్న పిదప; మాం — నన్ను (శ్రీ కృష్ణ పరమాత్మ); శాంతిం — శాంతి; ఋచ్ఛతి — పొందును.


భావము 5.29: సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప, నా భక్తుడు శాంతిని పొందును.


వివరణ: 

ఇంతకు క్రితం రెండు శ్లోకాలలో వివరించబడ్డ సన్యాస సాధన, ఆత్మ-జ్ఞానానికి దారి తీయవచ్చు. కానీ, బ్రహ్మ- జ్ఞానము పొందాలంటే, భగవంతుని కృప ఉండాలి, అది భక్తి ద్వారా వస్తుంది. 'సర్వలోక మహేశ్వరం' అంటే “సమస్త జగత్తులకూ ప్రభువు” (Sovereign Lord of all the worlds), మరియు, 'సుహృదం సర్వ భూతానాం' అంటే "సమస్త ప్రాణులకు మంచి చేసే శ్రేయోభిలాషి." ఈ విధంగా, సన్యాస మార్గం కూడా - అన్ని తపస్సులకు, నియమ నిష్ఠలకు భగవంతుడే భోక్త అన్న జ్ఞానంతో - ఈశ్వర శరణాగతి ద్వారానే పరిపూర్ణత పొందుతుంది అని ఉద్ఘాటిస్తున్నాడు. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ దీనిని చాలా చక్కగా వివరించారు:


హరి కా వియోగీ జీవ గోవింద రాధే, సాంచో యొగ్ సోఇ జో హరి సే మిలాదే

(రాధా గోవింద గీతము)


"అనాది నుండి జీవాత్మ, భగవంతుని నుండి విడిపోయి ఉంది. జీవాత్మ ను పరమాత్మ తో ఏకం చేసేదే నిజమైన యోగం." కాబట్టి, భక్తి కలపకుండా, ఏ ఒక్క యోగ విధానం కూడా సంపూర్ణం అవ్వదు.


తన "భగవంతుని గీత" లో శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక సాధన కున్న అన్ని నిఖార్సయిన మార్గాలను అద్భుతంగా పొందుపరిచాడు, కానీ ప్రతిసారీ, లక్ష్యం సాధించటానికి, భక్తి అనేది ఈ అన్ని మార్గాలలో కూడా అవసరం అని చెప్పి వాటికి పరిపూర్ణత తెస్తాడు. ఉదాహరణకి, ఈ రకమైన విశదీకరణ పద్దతిని, 6.46-47, 8.22, 11.53-54, 18.54-55 మొదలుగు శ్లోకాలలో ఉపయోగించాడు. ఇక్కడ కూడా, శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయ విషయాన్ని భక్తి యొక్క ఆవశ్యకతని తెలియచేయటం తో ముగిస్తున్నాడు.

వారము-తిధి-ఫలితాలు

 -వారము-తిధి-ఫలితాలు-


దగ్ధయోగాలు :- తిథీ వారం కలిస్తే వచ్చే మొత్తం కనక పదమూడు ఐతే అది దగ్ధ యోగం అంటారు.  పిరికి, భ్రష్టత్వం, ఉద్రేకం, ఉద్వేగం, ఇతరులకు భాద కలిగించునట్లు చేయుట, మానసిక వ్యద, వ్యాదులు, పనులలో అంతారాయాలు మొదలగునవి కలిగిస్తాయి దగ్ధ యోగాలు.


దగ్ధ యోగాలు కలిగించేవి 


షష్టీ 6 +7 శనివారం

సప్తమీ 7 + 6 శుక్రవారం

అష్టమీ 8 +5 గురువారం

నవమి 9 + 4 బుధవారం

దశమీ 10 +3 మంగళవారం

ఏకాదశి 11+2 సోమవారం

ద్వాదశి 12+1 ఆదివారం


పైన తెలిపిన రోజులలో ఏ పని మొదలుపెట్టినా జరగదని భావం.

 షష్టి నాడు మొదలెట్టిన పని కలహంతో ముగుస్తుంది.

 అష్టమినాటి పని కష్టాన్ని మిగులుస్తుంది,

 నవమినాటి పని వ్యయప్రయాసలకే కారణం.


చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి తిథులను వదిలేస్తాం గనక వీటితో వచ్చే దగ్ధయోగాలను పట్టించుకోం. ఇక దశమి మంగళవారం, ఏకాదశి సోమవారాలే మనల్ని ఇబ్బంది పెట్టేవి. తిధి, వారాలు కలిసి దోషప్రదమైన దగ్ధయోగాన్నిస్తాయి. నిత్యమూ చేసే పనులకి పంచాంగం చూడక్కరలేదు.ఇవి అత్యంత ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఆచరించాల్సి ఉంటుంది.


షష్టి నాడు వచ్చే శనివారం,

సప్తమి నాడు వచ్చే శుక్రవారం,

అష్టమి నాడు వచ్చే గురువారం,

నవమి నాడు వచ్చే బుధవారం,

దశమి నాడు వచ్చే మంగళవారం,

ఏకాదశి నాడు వచ్చే సోమవారం,

ద్వాదశి నాడు వచ్చే ఆదివారం ,


ఇలా వచ్చినప్పుడు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు. వీటిని దగ్ధయోగాలు అంటారు. పనుల కోసం


 *ఏ తిథి మంచిది,ఏ తిథి మంచిది కాదు*


*తిధులు వాటి ఫలితాలు:-*


పాడ్యమి - మధ్యాహ్నం తర్వాత జయమవుతాయి, శుభం.

విదియ - ఏపని చేసిన సంతోషాన్ని ఇస్తుంది.

తదియ - సౌక్యం, కార్య సిద్ధి.

చవితి - మధ్యాహ్నం తర్వాత జయమవుతాయి.

పంచమి - ధన ప్రాప్తం, శుభయోగం.

షష్టి - కలహం, రాత్రికి శుభం.

సప్తమి - సౌకర్యం.

అష్టమి -కష్టం.

నవమి - వ్యయ ప్రయాసలు.

దశమి - విజయ ప్రాప్తి.

ఏకదశి - సామాన్య ఫలితములు.

ద్వాదశి - భోజన అనంతరం జయం.

త్రయోదశి -జయం.

చతుర్దశి -రాత్రి కి శుభం.

పౌర్ణమి - సకల శుభకరం.

..............................

సుభాషితం

 🙏🌹🌹*నేటి సుభాషితం* 🌹🌹🙏


*మన ఏవ జగత్సర్వం!*

*మన ఏవ మహ రిపుః!*

*మన ఏవ హి సంసారో!*

*మన ఏవ జగత్త్రయమ్!!*


ఈ మనస్సే సర్వజగత్తున్నూ; మనసే పరమశత్రువు; అదియే సంసారహేతువు; అదే మూడు లోకములూ కూడను అగుచున్నది. మనస్సును స్వాధీనము గావించుకొనుచో జగములన్నీ స్వాధీనమై ఉండును.


మనోనిగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీలేదన్నమాట.ఎంత సాధన చేసి అయినా మనస్సును నిగ్రహించే ప్రయత్నం మనమందరం చేయాలి.


🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏

వచనకవితకు

 *వచనకవితకు సంస్కృతాంధ్రమూలాలు - 3*


*కాదంబరి గద్యకావ్యంలో ఉత్కలికా గద్యం*

కాదంబరి గద్యకావ్యంలోని సమాసగుంఫితమైన గద్యానికి ఇది ఒక ఉదాహరణ.


*తాత! చంద్రాపీడ! విదితవేదితవ్యస్యాऽధీతసర్వశాస్త్రస్య తే నాల్పమప్యుపదేష్టవ్యమస్తి.* 

నాయనా! చంద్రాపీడ! తెలిసికోవలసినదంతయూ తెలిసి కొన్న వాడవు నువ్వు. అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడవు. నీకు ఇంకనూ ఉపదేశించవలసినదేదియూ లేదు.


*కేవలం చ నిసర్గత ఏవాऽభానుభేద్యమరత్నాలోకచ్ఛేద్యమప్రదీపప్రభాపనేయమతిగహనం తమో యౌవనప్రభవమ్.* 

కేవలము స్వభావము చేతనే దీపప్రభలచేత కాని, రత్నకాంతులచేతకాని,  సూర్యునిచేతకాని, తొలగింపబడలేని అతి గహనమైనది *యౌవనము వలన మనిషికి కలిగే చీకటి*.

*అపరిణామోపశమో దారుణో లక్ష్మీమదః.*

పరిణామము తరువాత కూడా ఉపశమనము లేని అతిదారుణమైనది *లక్ష్మీ మదము*. (అనగా సంపదలవల్ల కలిగే మదము). *కష్టమనంజనవర్త్తిసాధ్యమపరమైశ్వర్యతిమిరాంధత్వమ్.*

ఏ విధమైన కాటుగమందులచేతనూ ఎంత కష్టపడినా నివారింప శక్యము కానిది *ఐశ్వర్యపు చీకటి వల్ల కలిగే గుడ్డితనము*. 


*అశిశిరోపచారహార్య్యోऽతితీవ్రో దర్పదాహజ్వరోష్మా.*

ఎటువంటి శీతలోపచారములవల్లనూ తగ్గనంత అతి తీవ్రమైనది *దర్పాగ్ని వలన ఏర్పడిన జ్వరము యొక్క వేడి*.


*సతతమమూలమంత్రగమ్యో విషమో విషయవిషాస్వాదమోహః*. 

ఎప్పటికీ ఏ మంత్రములవల్లనూ తగ్గనిది

*ప్రాపంచికవిషయములనూ ఆస్వాదించడం వల్ల ఏర్పడిన మోహము*.

*నిత్యమస్నానశౌచబధ్యో రాగమలావలేపః.*

ఎటువంటి స్నానాది శౌచవిధులచేతనూ తొలగింప శక్యము కానిది  *రాగమలము* (రాగము = అహంకారము+మమకారము)


*అజస్రమక్షపావసానప్రబోధా ఘోరా చ రాజ్యసుఖసన్నిపాతనిద్రా భవతీతి, విస్తరేణాభిధీయసే*.

ఎప్పటికీ రాత్రి గడిచి తెల్లవారినా మెలకువ రాని అతిఘోరమైనది *రాజ్యసుఖవశమున ఏర్పడిన సన్నిపాతనిద్ర* ... ఈ విషయములు నీకు తెలియవలెను అని ఇప్పుడు చెప్పబడుచున్నది. 

*గర్భేశ్వరత్వమభినవయౌవనత్వమప్రతిమరూపత్వమమానుషశక్తిత్వం చేతి మహతీయం ఖల్వనర్థపరంపరా సర్వా.*

*పుట్టుకతోనే వచ్చిన రాచరికపు అధికారం, నవయౌవనత్వము, సాటిలేని అందమైన రూపము, అమానుషమైన శక్తులు*... ఇవన్నీ గొప్ప అనర్థపరంపరలో భాగములు.

*అవినయానామేకైకమప్యేషామాయతనమ్, కిముత సమవాయః.*

*అవినయమునకు వీటిలో ఏ ఒక్కటైనా చాలు. నాలుగూ కలిసి ఒకేచోట ఉంటే? చెప్పవలసింది ఏమున్నది?*


సంస్కృత కాదంబరీ గద్యకావ్యములో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో. ఎన్నెన్నో. ఇలాగే ఈ కావ్యములో సరళచూర్ణగద్యసందర్భములూ ఎన్నో ఉన్నాయి. 

నిడివి భయముతో ఉదాహరించుట లేదు. ఇవన్నీ వచనరూపములే. ఈగద్యకావ్యములలోని గద్యమును చదివే విధానమూ ఉన్నది. 

 వీటిని బట్టియే *గద్యం కవీనాం నికషం వదన్తి* (గద్యరచన కవికి గీటురాయి) అనే ఆధారవాక్యం వచ్చింది.

అలాగే సంస్కృత రూపకములలోనూ కేవలమారూపకసందర్భమునకు మాత్రమే చెందినవి కాక సార్వకాలిక అన్వయముకలిగిన వాక్యములు పదే పదే కనిపించును.

ముందు ముందు మరిన్ని ఉదాహరణములను గమనించగలరు.

ధార్మికగీత - 113*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 113*

                                       *****

       *శ్లో:- మృత్పిండమేకం బహుభాoడరూపం ౹*

              *సౌవర్ణ మేకం బహు భూషణాని ౹*   

               *గోక్షీర మేకం బహు ధేను జాతం ౹*

               *ఏకః పరాత్మా బహు దేహవర్తీ  ౹౹*

                                        *****

*భా:- లోకంలో వివిధ ఆకారాలు, రంగులు, సాంద్రతలలో మట్టి పాత్రలు కన బడుతున్నా, వాటి నిర్మాణంలో వాడే "మట్టి" అనే పదార్థం ఒకటే. అందాన్ని రెట్టింపుతో ఇనుమడింప జేసే నగలు లెక్కకు మిక్కిలిగా, కంటికి ఇంపుగా, సొంపుగా ఉన్నా,  వాటి తయారీలో వాడబడే "బంగారం" మాత్రం ఒకటే.  సమీకృత ఆహార మైన పాల నిచ్చే గోమాతలు వివిధ రంగులు, ఆకృతులకు చెందిన వైనా  "ఆవు పాలు" మాత్రం ఒకటే. అలాగే  దేహధారులు ఎందరున్నా  వాటిలో ఉన్న "ఆత్మ " అనేది ఒకటే. దేవుడు ఒక్కడే. సృష్టికార్యంలో ఉంటే "బ్రహ్మ" అని; పోషణ కార్యంలో  ఉంటే "విష్ణువు" అని; లయం చేసే కార్యంలో ఉంటే "శివుడు" అని అంటున్నాము గదా! బల్బు, ఫ్యాను,టివి,ఫ్రిజ్, సెల్ చేసే పనులు వేరైనా వాటికి కావలసిన ఇంధనం విద్యుత్తే గదా!  ప్రతి దేహంలో ఆత్మ రూపంలో భగవాను డున్నాడు. "సర్వ ప్రాణుల యందు ఆత్మ రూపములో ఉన్న నన్ను చూడగలిగినవాడు;  అలాగే సకల ప్రాణికోటిని నా యందు  అంతర్గతముగా ఆత్మ రూపంలో చూడగలిగినవాడును నాకు నిజమైన భక్తుడ"ని గీత చెప్పుచున్నది. కాన అందరు ఆత్మ స్వరూపులే అన్న భావనలో ఉండాలి. సర్వ జీవ పురస్కారము, తిరస్కారము భగవంతునికే  చెందుతాయి. అందుకనే "ఆత్మవత్ సర్వభూతాని" అని చెప్పబడుచున్నది. ప్రార్థనలో "భూతదయాం విస్తారయ!- తారయ సంసార సాగరతః " అని, "నితాంతాపార భూత దయయును- తాపస మందార! నాకు దయ చేయ గదే! అని ప్రామాణికంగా చెప్పబడు చున్నది. ఆత్యాత్మిక చింతనతో జ్ఞాన సంపన్నులై, మానవాళి  ఆత్మ సాక్షాత్కారమునకు నిరంతర సాధన చేయాలని సారాంశము,*.

                                   *****

                   *సమర్పణ   :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీగురు_దక్షిణామూర్తి

 #శ్రీగురు_దక్షిణామూర్తి


దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు 

ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. 

మరో కాలు పైకి మడిచి ఉంటుంది.

చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. 

ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.


బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన 

సనక, సనందన, సనాతన, సనత్కుమారులు 

బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. 

అయినా వారికి అంతుపట్టలేదు. 

వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. 


అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా 

ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. 

ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. 


ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.

ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే..

జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, 

కేవలం అనుభవించదగినది అని. 

గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. 

అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో 

విస్తృతంగా వర్ణించారు.


శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. 

దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. 

దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. 

అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి. 

దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే 

ఆ రూపమే దక్షిణామూర్తి.


మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. 

ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. 

దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. 


విష్ణు, 

బ్రహ్మ, 

సూర్య, 

స్కంద, 

ఇంద్ర 

తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.


మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.


ఆ రూపాలు వరుసగా..!💐

శుద్ధ దక్షిణామూర్తి, 

మేధా దక్షిణామూర్తి, 

విద్యా దక్షిణామూర్తి, 

లక్ష్మీ దక్షిణామూర్తి, 

వాగీశ్వర దక్షిణామూర్తి, 

వటమూల నివాస దక్షిణామూర్తి, 

సాంబ దక్షిణామూర్తి¸

హంస దక్షిణామూర్తి, 

లకుట దక్షిణామూర్తి, 

చిదంబర దక్షిణామూర్తి, 

వీర దక్షిణామూర్తి, 

వీరభద్ర దక్షిణామూర్తి¸ 

కీర్తి దక్షిణామూర్తి, 

బ్రహ్మ దక్షిణామూర్తి¸ 

శక్తి దక్షిణామూర్తి, 

సిద్ధ దక్షిణామూర్తి.


ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. 


భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, 

చంద్రకళాధరుడు, 

జ్ఞానముద్ర, 

అక్షమాల, 

వీణ, 

పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. 

తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.


పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. 

సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. 

మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను 

సొంతం చేసుకుంటారు.


చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,

సంపద(ధనము) దగ్గర నుండి, 

పెద్దలకు మోక్షము వరకు, 

దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం 

అయి ఉంటాడు.


ఓం శ్రీ గురు దక్షిణామూర్తియే నమః..!


⭐️⭐️⭐️సర్వంశివసంకల్పం ⭐️⭐️⭐️

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 41

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 41  / Sri Devi Mahatyam - Durga Saptasati - 41 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 11*

*🌻. నారాయణీ స్తుతి - 5 🌻*


38–39. దేవతలు పలికిరి : "ఓ సర్వేశ్వరీ! ఇప్పటి వలే నీవు ముల్లోకాల దుఃఖాలన్నింటినీ శమింపజేయాలి, మా శత్రువులనందరినీ నాశనం చేయాలి.”


40–41. దేవి పలికెను : వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ యుగంలో మరో ఇరువురు మహాసురులు శుంభనిశుంభ నామాలతో ఉద్భవిస్తారు.


42. ఆ కాలంలో నందగోపుని ఇంట, యశోదా గర్భాన పుట్టి వింధ్యాద్రిపై నివసిస్తూ, వారిని ఇరువురిని నేను పరిమారుస్తాను.


43. మళ్ళీ భూతలంలో అతి రౌద్రాకారంతో జన్మించి, విప్రచిత్తి వంశీయులైన దానవులను నేను చంపుతాను.


44. విప్రచిత్తివంశీయులైన ఆ భయంకర మహాసురులను భక్షించినప్పుడు నా పళ్ళు దానిమ్మ పూవుల వలే రక్తవర్ణం అవుతాయి.


45. అందుచేత స్వర్గలోకంలో దేవతలు, భూలోకంలో మానవులు, నన్ను స్తుతించేడప్పుడు 'రక్తదంతిక' అనే పేరు వాడతారు.


46. మళ్ళీ నూరు సంవత్సరాలు వర్షం కురవడం చేత నీటి లేమి వల్ల పరితపించే భూమిపై నేను మునిజన స్తోత్రఫలంగా పుడతాను. కాని స్త్రీ గర్భం నుండి కాదు.


47. అంతట ఆ మునులను నేను వంద కన్నులతో చూస్తాను. మానవులు నన్ను ఆ పిదప 'శతాక్షి' అని కీర్తిస్తారు. 


సశేషం....

🌹 🌹 🌹 🌹

మాధవ నామ సంస్మరణ

 మాధవ నామ సంస్మరణ మాధవ దేవుని దివ్యగాథలున్

మాధవుమాన్యలీలలును మాధవు భక్త జనానురాగమున్

మాధవుబోధనంబులును మార్గశిరం బనుమాసమందునన్

సాధనచేయగా దగిన చక్కని సాధు పథంబని పెద్దలందురే!


వసుధే మానసమందు భక్తి యుతయై భావించుచున్ మాధవున్

వసురూపంబున పూయుపూవుల సుశోభన్ బంతి చేమంతులన్

అసమానంబగు సేవలన్ సలుపుచున్ ఆహ్లాదంబుగా గొల్చుచున్

ససి సౌఖ్యంబున మార్గ శీర్షమున విశ్వ స్తుత్యమై యొప్పుగా.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

రవివర్ణనమ్

 .

             ॥ రవివర్ణనమ్ ‌॥


-99- శ్లోకము :


యోనిః సామ్నాం విధాతా మధురిపురజితో ధూర్జటిః శంకరోఽసౌ


మృత్యుః కాలోఽలకాయాఃపతిరపి ధనదః పావకో జాతవేదాః


ఇత్థం సంజ్ఞా డబిత్థాది పదమృత భుజాం యా యదృచ్ఛాప్రవృత్తా-


స్తాసామేవాభిధేయోఽనుగత గుణగుణైర్యః స సూర్యోఽవతాద్వః ॥



-99- చంపకమాల :


అటు విధి సామయోని , 

మధుహంత యజయ్యుడు , 

శంకరుండు ధూ


ర్జటి , ధనదుండహో యలకరాజల

మృత్యువు కాలుఁడంచు బే


ళ్లెటు శిఖి జాతవేదుఁడని యిందఱియందు డవిత్థుడట్లు న


మ్మటు రవిఁగాన సార్థక

గుణాహ్వయుడా యినుడేలు

మిమ్ములన్‌✋️🤚



టీకా : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలదేవతా

   స్వరూపుడుగా చెప్పుచున్నారు..]


అటు = (ఒక విషయమో వ్యక్తినో సూచించు అన్వయ వాచకము..) 

ఆ విధముగా ,  విధి = బ్రహ్మ , 

సామ(..వేద మంత్రములకు ) ,

యోని = ఉత్పత్తికారణము ..

మధు(..అను రాక్షసుని) , హంత = ౘంపినవాడు - విష్ణువు , 

(య)అ జయ్యుడు = జయింప శక్యము కానివాడు ..

శంకరుండు , ధూర్ + జటి = విస్తారమైన

జటలు గలవాడు ..

ధనదుండు = ధనమును యిచ్చువాడు - కుబేరుడు ,  అహో ! = ప్రశంసా వాచకము ,  (య)అలక = (కుబేరుని నగరము..) అలకాపురము నకు , రాజు ..

+ అల = అక్కడ ( సూచక వాచకము ) ,

మృత్యువు , కాలుఁడు = యమధర్మరాజు , 

+ అంచు = అనుచు , (బే)పేళ్లు = 

పేరు లు ,  + ఎటు(..లనో) ,  శిఖి = అగ్ని , [ అగ్ని - అపౌరుషేయాలైన వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక జాతవేదుడు ..]

జాతవేదుఁడు , + అని , యిందఱి యందు , డవిత్థుడు = కఱ్ఱలతో చేయబడిన మృగాకారము (- అనగా గుణములేవియు  లేనిది .. అటులనే పైదెల్పినవన్నియు వారి వారి సంకేత నామములే..)  + అట్లు = వలె , 

నమ్ము + అటు = నమ్ము విధముగా .. 

రవిఁ , గా(..వు)న ,  

సార్థకగుణాహ్వయుడు = తన గుణముల రీత్యా యిందరు దేవతల పనులు తానొక్కడే చేయగలవాడు ,  + ఆ ,  (యి)ఇనుడు = సూర్యుడు , + [ఏలు] ,

మిమ్ములన్‌ ,  ఏలు = రక్షించును గాక..✋️🤚



భావము : 


[ ఇందు కవి గారు 

   సూర్యభగవానుని సకలదేవతా

   స్వరూపుడుగా చెప్పుచున్నారు..]


అటు బ్రహ్మ సామములకు ఉత్పత్తికారణము ..

మధుహంత - విష్ణువు  

అజయ్యుడు..

శంకరుండు ధూర్జటి ..

ధనమును యిచ్చువాడు - కుబేరుడు అహో ! అలకాపురమునకు రాజు ..

అల మృత్యువు యమధర్మరాజు 

అనుచు  పేరులు ఎటులనో అటులే 

అగ్ని జాతవేదుఁడు అని ..

యిందఱి యందు డవిత్థుడువలెనని నమ్ము విధము గావున.. 

రవి సార్థకగుణాహ్వయుడు - 

ఆ సూర్యుడు మిమ్ములను రక్షించును గాక..✋️🤚