18, డిసెంబర్ 2020, శుక్రవారం

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 41

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 41  / Sri Devi Mahatyam - Durga Saptasati - 41 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 11*

*🌻. నారాయణీ స్తుతి - 5 🌻*


38–39. దేవతలు పలికిరి : "ఓ సర్వేశ్వరీ! ఇప్పటి వలే నీవు ముల్లోకాల దుఃఖాలన్నింటినీ శమింపజేయాలి, మా శత్రువులనందరినీ నాశనం చేయాలి.”


40–41. దేవి పలికెను : వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ యుగంలో మరో ఇరువురు మహాసురులు శుంభనిశుంభ నామాలతో ఉద్భవిస్తారు.


42. ఆ కాలంలో నందగోపుని ఇంట, యశోదా గర్భాన పుట్టి వింధ్యాద్రిపై నివసిస్తూ, వారిని ఇరువురిని నేను పరిమారుస్తాను.


43. మళ్ళీ భూతలంలో అతి రౌద్రాకారంతో జన్మించి, విప్రచిత్తి వంశీయులైన దానవులను నేను చంపుతాను.


44. విప్రచిత్తివంశీయులైన ఆ భయంకర మహాసురులను భక్షించినప్పుడు నా పళ్ళు దానిమ్మ పూవుల వలే రక్తవర్ణం అవుతాయి.


45. అందుచేత స్వర్గలోకంలో దేవతలు, భూలోకంలో మానవులు, నన్ను స్తుతించేడప్పుడు 'రక్తదంతిక' అనే పేరు వాడతారు.


46. మళ్ళీ నూరు సంవత్సరాలు వర్షం కురవడం చేత నీటి లేమి వల్ల పరితపించే భూమిపై నేను మునిజన స్తోత్రఫలంగా పుడతాను. కాని స్త్రీ గర్భం నుండి కాదు.


47. అంతట ఆ మునులను నేను వంద కన్నులతో చూస్తాను. మానవులు నన్ను ఆ పిదప 'శతాక్షి' అని కీర్తిస్తారు. 


సశేషం....

🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: