23, మే 2024, గురువారం

Panchaag


 

⚜ శ్రీ విష్ణుమూర్తి ఆలయం

 🕉 మన గుడి : నెం 826


⚜ కర్నాటక  :- కులై - మెంగళూరు


⚜ శ్రీ విష్ణుమూర్తి ఆలయం



💠 ఈ మధ్య వచ్చిన " కాంతారా " అనే కన్నడ సినిమా చూడని సినిమా ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు.... ఆ చిత్రంలో చూపించినట్టు "  భూతకోలా" అనే ఆధ్యాత్మిక నృత్య భంగిమకి మూలస్థానం లాంటి ఆలయమే కర్ణాటక తులునాడులో మంగళూరు ప్రాంతంలో  కులై విష్ణుమూర్తి ఆలయం


💠 మంగళూరు నిజానికి సాంస్కృతికంగా గొప్పది! దేవాలయాలు, మసీదులు, చర్చిల భూమి, ఇది ప్రతి మతాన్ని తన మడతలలో ఇముడ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. 

ఇది సెక్యులరిజానికి ప్రతిరూపం. 

అటువంటి అందమైన ఆలయానికి ఉదాహరణ మంగళూరు శ్రీ విష్ణుమూర్తి ఆలయం. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన హిందూ తీర్థయాత్ర, ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు తరచూ వస్తుంటారు. 

ఇటీవల, ఈ ప్రదేశం కాంతారా అనే చలనచిత్రం కారణంగా  దేశం నలుమూలల నుండి ఆధ్యాత్మిక పర్యాటకుల ప్రవాహాన్ని చూస్తుంది


💠 మణిపాల్ నుండి మంగళూరు వెళ్లేటప్పుడు ఈ ఆలయంలోని స్వాగత గోపురం కనిపిస్తుంది.  కుళాయి విష్ణుమూర్తి మరియు దుర్గ యొక్క రెండు ఆలయాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి మరియు వరుసగా తూర్పు మరియు పడమర వైపు ఉన్నాయి.  ఇది చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.


💠 కులాయి తుళునాడులో చాలా పురాతనమైన దేవాలయం.  ఇది మంగళూరు నగర శివార్లలో ఉన్న ఒక చిన్న ప్రాంతం మరియు ఇప్పుడు నగర పరిధిలో విలీనం చేయబడింది.  ఇది సూరత్‌కల్‌కు దగ్గరగా మంగళూరు - ఉడిపి హైవేపై ఉంది.  

ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణుమూర్తి, 


💠 ప్రధాన దేవత విగ్రహాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారా ఆలయ ప్రాచీనతను అంచనా వేయవచ్చు.  

ఎటువంటి శాస్త్రీయ పరిశీలన లేకుండా, విగ్రహం కనీసం కొన్ని వందల సంవత్సరాల నాటిదని స్పష్టమవుతుంది.  నిజమైన తుళునాడు శైలిలో, ఆలయంలో గణపతి విగ్రహం కూడా ఉంది.  అదనంగా, ఆలయంలో చాలా ఆకర్షణీయమైన మరియు పూజ్యమైన నాగ విగ్రహం ఉంది.


💠 ఆలయంలోని ప్రధాన భూతం పంజుర్లి, ఇది ఆలయం యొక్క ఆగ్నేయ మూలలో దాని స్వంత "గుడి"ని కలిగి ఉంది.  

ఈ ఆలయంలో ఆకర్షణీయమైన "పుష్కరణి" లేదా చెరువు మరియు భూత కోలాలు నిర్వహించడానికి ప్రత్యేక విభాగం కూడా ఉంది.


💠 స్థానిక పురావస్తు శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు వెంకట్రమణ హెబ్బార్ 1911 ప్రాంతంలో అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న మందిరాన్ని కనుగొన్నారు. 

ఈ ఆలయం పదే పదే పునర్నిర్మించబడింది


💠 చరిత్రకారుల ప్రకారం, ఈ ఆలయంలోని విష్ణువు యొక్క మూలవిగ్రహం 11వ శతాబ్దానికి చెందినది.అతను కృష్ణ శీలపై చెక్కబడ్డాడు.  దురదృష్టవశాత్తూ, ఆలయానికి సంబంధించిన సరైన డాక్యుమెంట్ చరిత్ర అందుబాటులో లేదు.


💠 అసలు ఈ ఆలయం శిథిలావస్థలో ఉందని చెబుతారు.  శ్రీ వెంకట్రమణ హెబ్బార్ తన కుమారుడితో కలిసి స్థానిక దాతల సహాయంతో దేవత కోసం ఒక గర్భగుడిని నిర్మించారు.  అప్పటి నుంచి నిత్య పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.


💠 ఇక్కడ మనం విష్ణుమూర్తి యొక్క ప్రధాన తీర్థ మండపాన్ని మరియు వినాయకుడు, సుబ్రమణ్య (నాగ) యొక్క ఉపగ్రహాన్ని కనుగొంటాము. బలిపీఠం, ద్వజస్తంభం, ఒలగమండపం కూడా ఆలయ ఆవరణలో కనిపిస్తాయి.  ఆలయ ఆవరణలో అన్నప్ప పంజుర్లి యొక్క గర్భగుడి కూడా మనకు కనిపిస్తుంది.


💠 ఈ మందిరంలో పూజించబడే విష్ణు మూర్తి ఒక పీఠంపై నిలబడి నాలుగు చేతులతో ఉంటాడు. నాలుగు చేతులు శంక, చక్ర, గధ మరియు పద్మాలను కలిగి ఉంటాయి.


💠 ఆలయం వార్షికోత్సవాలు, రథయాత్ర , గణేష్ చతుర్థి మరియు దైవ నేమోత్సవాలను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటుంది.

గతంలో ఒకరోజు వార్షిక ఉత్సవం మరియు నేమోస్తవ నిర్వహించేవారు. 

మాసంలో ఒకరోజు పుష్ప అలంకార పూజ మరియు లేత కొబ్బరికాయతో అభిషేకం , మహాగణపతి అప్పడ పూజలు నిర్వహిస్తున్నారు.

 

💠 1968లో ఒకరోజు వార్షిక పండుగను వివిధ సేవా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో 5 రోజుల పండుగగా జరుపుకోవడం ప్రారంభించారు. 

ప్రస్తుతం ఈ పండుగ మీన మాస శుద్ధ చతుర్ధశి నాడు ప్రారంభమవుతుంది. 

ఉత్సవం ద్వజారోహణంతో ప్రారంభమై 4వ రోజు రథోస్తవం, 5వ రోజు మధ్యాహ్నం చూర్ణూస్తవ, మహా అన్నసంతర్పణ, అదే రోజు రాత్రి నాగ దర్శనం, శ్రీ అన్నప్ప పంజుర్లీ నేమోస్తవ, అవభృతోత్సవంతో ముగుస్తుంది.


💠 మంగళూరు రైల్వే స్టేషన్ ఆలయానికి చాలా సమీపంలో ఉంది. మీరు గుడి పేరు చెబితే చాలు ఆటో మిమ్మల్ని గుడికి చేరవేస్తుంది.

జ్ఞాపకాల దొంతర

 *A sweet memorable things in our life*... 


రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మనది .

ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ. 

SSC పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం మనది .

అద్దెకి బుక్స్ (నవలలు ) తెచ్చుకున్న తరం మనది.

సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది.

గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు తొక్కేవాళ్లు ఆ రోజుల్లో.

డ్రాయింగ్ రూమ్ లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు.

చేబదుళ్లకి కాదేదీ అనర్హం.

పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా, బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ. 


అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు.

రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి, డ్యూయెట్లూ.

పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి.

మధ్యతరగతి మందహాసం కాదు. పగలబడి నవ్వేది.

ఇంటి ముందుకు

కోతులాడించేవాడు, పాములాడించేవాడు, గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు, చిలక జోస్యం చెప్పేవాడు, వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు.

మేకప్పులు అంటే తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు.

గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు.

మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు.

బస్టాండ్ లో చెవి గులిమిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ.

ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ.

వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు.

మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే.

 "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఇయర్ పిన్లు, రబ్బర్ గాజులు, రిబ్బన్లహో". అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు. వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం". అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా, ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు. గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి. కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం. పరుపులేకుతాం. గిన్నెలకి సొట్టలు తీస్తాం. బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం. అరువు మీద చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు. ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ, ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ సరేసరి. మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు...సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..

రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది. భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది. రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!

అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం..తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం....ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు!!

ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు.... 

ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న గుర్తులు.

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

వీధిలో పిల్లల అల్లరి లేదు

తాతలు ఇచ్చే చిల్లర లేదు

ఏడు పెంకులు ఏమైపోయే

ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మనమే అదృష్టవంతులమ్*!           

1960-70 లో పుట్టిన మనం ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మన తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం భట్టిపంతులు బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మన లో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *అర్ద రూపాయి ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు మనం అందరం 

✌🏻55- 60సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకున్న వాళ్ళమే.   

*మనకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

 🤝🤝**అందుకే వీలయినప్పుడల్లా కలుసుకుందాం.🤝

ఏమంటారు ఫ్రెండ్స్** 


ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బా

ల్యాన్ని మనమే చూసుకున్నట్టు ఉంది కదా .

🙏🏻ఓపిక తో చదివినందుకు ధన్యవాదములు 🙏🏻

Best wishes

భక్తులకు విజ్ఞప్తి

 *🙏భక్తులకు విజ్ఞప్తి🙏*                                                                   *శ్రీ రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం మరియు శ్రీ శృంగేరీ శంకర మఠం- ఖమ్మం లో భక్తులకు శ్రీ శారదా అమ్మ వారి అన్న ప్రసాద వితరణ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గం ల నుండి 1గం వరకు ఈ నెల 17 వ తేదీ నుండి ప్రారంభించ బడినది అన్నప్రసాదము  స్వీకరించ దలచిన భక్తులు ఆ రోజున ఉదయం గం 8-30 ని. లోపు  ఆలయం క్లర్క్ శ్రీమతి కృష్ణవేణి గారి (ఫోన్ నెం63002 14391) వద్ద పేరు, గోత్రము, చిరునామా నమోదు చేయించు కోవాలి. ప్రస్తుతం 15 మంది భక్తులకు ఈ ప్రసాద వితరణ జరుగుతున్నది. భక్తుల ప్రోత్సాహం మేరకు ఈ సంఖ్య పెంచవచ్చు.ఈ సత్కార్యం లో  భక్తులు అందరూ విరివిగా విరాళం అందించి సంపూర్ణ భాగస్వామ్యులు కావలసింది గా మనవి.*                                                                                     *ట్రస్టు అధ్యక్షులు & సభ్యులు-            *ధర్మాధికారి*

Digital Library link

 ```IIT Kharagpur has created National Digital Library for students for all subjects.  Below is the link``` :


          _*ndl.iitkgp.ac.in.*_


It contains 4 crore 6O lakh books.  Please share this information to students to know & avail of this priceless facility for academic knowledge.

గుణం నిర్ణయించబడుతుంది."

 🙏🏻శుభోదయం🕉️Goodmorning 🙏🏻


       ***************

🍁మహనీయుని మాట🍁

       ***************


"జేబులో చేతులు పెట్టుకుని దర్జాగా నిచ్చెన ఎక్కాలంటే కుదరదు.

ఏ శ్రమ చేయకుండా విజయం సాధించాలి అనుకుంటే సాధ్యపడదు."


        *************

🍃నేటి మంచి మాట🍃

        *************


"బియ్యపు గింజ 

పాలల్లో కలిస్తే పాయసం,

ఎసరులో కలిస్తే అన్నం,

పసుపుతో కలిస్తే అక్షతలుగా మారుతుంది.అలాగే

నలుగురిలో మన ప్రవర్తనను బట్టి మన గుణం నిర్ణయించబడుతుంది."


🌹🌹🌹🌾🌾🌾🌾🌹🌹🌹

🌾🌾🌾🌹🌹🌹🌹🌾🌾🌾

Photo











 

విరాళాలు

 విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

9848647145

భగవద్గీత నేర్చుకుందాం

 *రండి భగవద్గీత నేర్చుకుందాం* 📖

*ఉచిత ఆన్‌లైన్ తరగతులు 👩‍🏫👩‍💻*

         

శుభారంభం - శుక్రవారం, 7 జూన్ 2024

సాయంకాలం *7* గం॥ల నుండి 

తరగతుల ఆరంభం - 

సోమవారం 10 జూన్ 2024

నుండి మీరు ఎంచుకున్న సమయంలో


స్థాయి 1️⃣ - 33 వ బ్యాచ్ 


🌻 *20 రోజుల్లో 2 అధ్యాయాలు* శుద్ధ సంస్కృత ఉచ్చారణ తో చదవడం నేర్చుకుందాం. 

🌻 పఠన పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి *"గీతా గుంజన్"* ఈ-ప్రశస్తి పత్రం ఇవ్వబడును. 

🌻 భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకొనుటకు తరువాత 3 స్థాయిలకు (3 Levels) ప్రవేశం ఉచితం.

🌻 వారానికి 5 రోజులు, ప్రతి రోజు కేవలం 40 నిమిషాలు మాత్రమే

🌻 మీ సౌలభ్యం 21 టైమ్ స్లాటల నుండి ఎంపిక చేసుకోవచ్చు (ఉదయం 4:00 గం॥ నుండి రాత్రి 2:00 గం॥ వరకు IST)

🌻 గీత తరగతులు 13 భాషల్లో అందుబాటులో ఉన్నాయి (हिंदी, English, मराठी, ગુજરાતી, తెలుగు, தமிழ், ಕನ್ನಡ, മലയാളം, বাংলা, ଓଡିଆ, नेपाली, অসমীয়া, सिंधी)

🌿 *ప్రత్యేకం:* నిత్య దైనందిన జీవితంలో భగవద్గీతను ఆచరించుటకు, చాలా సులభమైన మరియు ఆసక్తికరమైన వారాంతపు (శనివారం-ఆదివారం) గీత అర్థ వివేచనము 


*మీ మొబైల్ నుండి ఫారము పురించండి, వెంటనే WhatsApp సమూహంలో చేరండి*

joingeeta.com 


*🌸 || గీత చదవండి, చదివించండి, జీవితంలో   అన్వయించండి || 🌸* 


ప్రచార విభాగము

*లర్న్ గీతా, గీతా పరివార్*🚩

పిడికిట తలంబ్రాల

 ---ఓం నమో వేంకటేశాయ---

         పిడికిట తలంబ్రాల 

 

అన్నమయ్య రాసినన్ని పెళ్ళిపాటలు మరే వాగ్గేయకారుడు రాయలేదు.ఆ కాలం నాటి పెళ్ళిళ్ళలోని ఆచార వ్యవహారాలు, పెళ్ళితంతు,పెళ్ళిపీటల మీద వధూవరుల దొంగ చూపులు,ముసిముసి నవ్వులు,ముచ్చటలు అన్నీ అక్షర బద్దం చేశాడు అన్నమయ్య!

అన్నమయ్య పెళ్ళి పాటలలో తొలి తాంబూలం 'పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు' పాటకే ఇవ్వాలి.


పెళ్ళి మాటలు ,నిశ్చయ తాంబూలం, పెళ్ళికి వచ్చిన పెద్దలు వేసే అక్షతలతో సహితం వదలకుండా రాసాడు అన్నమయ్య! పెళ్ళికి వచ్చిన వారందరూ ఎంతో ముచ్చటగా చూసే సన్నివేశం తలంబ్రాలు.వధూవరులిద్దరూ వారి జీవితాలలో అడుగు పెట్టేముందు ఆ ఇద్దరిలో సహజంగా ఉండే బెరుకు పోగొట్టేటందుకు జరిపించే ప్రక్రియే అక్షతారోపణము.దీనినే వాడుకలో 'తలంబ్రాలు' అని పిలుస్తాము.శాస్త్రం ఈ తలంబ్రాల విశిష్టతను వర్ణించింది.

అన్నమయ్య ఆ విశిష్టతను కాసేపు పక్కన పెట్టి అప్పటి వధువు మానసిక స్థితిని వర్ణిస్తున్నాడు.


'పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత

పెడమరలి నవ్వీనె పెండ్లికూతురు '


పెళ్ళి పీటల మీద

కూర్చున్నప్పటినుండీ సిగ్గుతో తలదించుకుని కూర్చున్న పెళ్ళికూతురు తలంబ్రాలు పోసుకునే వేళకు మాత్రం ముఖాన్ని పక్కకు తిప్పుకుని దోరగా నవ్వుకుంటోందట!తన మగనితో తొలి సాన్నిహిత్యమిది.మగడు తాను ఎదురెదురుగా మధ్యలో అడ్డుతెరలేకుండా

కూర్చుని ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ సన్నిహితంగా మెలిగే తొలి అవకాశం! ఎద-తనువు పులకిస్తుంటే తన పురుషుడిని  దగ్గరగా చూడబోతున్నాననే ఆతురత.పులకింతలు దొంతరలై తరుముకొస్తుంటే అవి కేరింతల వెల్లువలవుతాయేమో అనే ఆతురతతో కొద్దిగా పక్కగా తిరిగి నవ్వుకుంటోందట తల్లి.


'పేరుకల జవరాలే పెండ్లికూతురు పెద్ద

పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు 

పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు

పేరుపుచ్చ సిగ్గుపడీ పెండ్లికూతురు'


ఇక్కడ పెళ్ళి కూతురు ఆ దేశపు మహారాజు కూతురు.ఆమె ఎంతో పేరున్న పడతి.ఆమే ఓ పులుకడిగిన ముత్యం! దానికి తోడు పెద్ద పేరుల(పేరు అంటే ముత్యము అని అర్ధముంది) దండలను మెడనిండా ధరించింది.ఇంకా తలంబ్రాలను చేతికివ్వలేదు. మధ్యమధ్యలో పేరంటాళ్ళు నీమెగుడి పేరేమిటమ్మా అని మేలమాడుతున్నారట. మగనిపేరు చెప్పటానికి సిగ్గు పడుతోందట తల్లి!


'పెట్టెనే పెద్ద తురుము పెండ్లికూతురు నేడె

పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు '


సాధారణంగా పెళ్ళిళ్ళలలో మహిళలు ఎక్కువగా చీరలు మారుస్తుంటారని అంటుంటాం. పెళ్ళికూతురు తన పెట్టెలో ఉన్న చీరలన్నీ కట్టేసిందట!

అంటే అన్నమయ్యనాటికే ఈ అలవాటు ఉందన్నమాట!!

ఆ పెళ్ళికూతురు ఎక్కడుంది?


'గట్టిగ వేంకటపతి కౌగిటను వడి

వెట్టిన నిధానమైన పెండ్లికూతురు '


ఈ పెండ్లికూతురు వేంకటపతి కౌగిట ఒదిగిన నిధి అట.

అమ్మ ఎవరన్నది ఒక్క మాటలో తేల్చేశాడు! వేంకటేశుని హృదయంలో నెలవైన సంపదల మూలమైన లక్ష్మీదేవే ఈ తల్లి అని చెప్పాడు.

ఆతల్లి చేతనున్న తలంబ్రాల ను శరస్సున ధరించిన శ్రీనివాసుడు మనలనందరను రక్షించు గాక!!!


రేపు మరో సంకీర్తనంతో .........  

మీ... రెడ్డప్ప ధవేజి

యమదూత - భూలోకం

 *యమదూత - భూలోకం* 

                 ➖➖➖✍️

   


*యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు.* 


 *భూలోకానికి వచ్చాడు ఆ దూత.* 


 *ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది.* 


 *అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు.* 


 *ఆ తల్లిని కూడా  చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు.* 


 *అదే విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు.* 


 *యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు.*

 *తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు*  *యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు.* 


 *’తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా?’ “అన్నం లేదు ఏమీ లేదు వెళ్ళు!” అంటుంది.* 


*యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి “సరే లోపలి రా వచ్చి బోంచేయి!” అంటది.* 


 *అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు. అప్పుడు అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది.* 


 *ఆ దర్జీ “నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు!” అంటాడు.* 


*అలా ఐదేళ్లు గడిచాక ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది.* 


*ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు.* 


 *కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది.* 


 *అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత.* 


 *మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది.* 


 *మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో  వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చితీసుకుంటానని చెప్పి వెళ్తాడు* 


 *యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు. అది చూసిన ఆ దర్జీ “అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమి చెప్పాలి?” అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి “అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివ్వ”మని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు* 


*అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత. పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ “అయ్యా మీరెవరు? మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు. మీరు నవ్వినప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి!”  అన్నాడు.* 


 *జరిగిన విషయం చెప్పి* 

 **మొదటి సారి..* 

 *మీ భార్య అన్నం లేదు అని చెప్పింది.* 

 *అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది.* 

 *మళ్ళీ బోంచేయిఅని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది* 

 *అప్పుడు తెలిసింది..అభిప్రాయాలు మారుతాయి అని!* 


 **రెండవ సారి..* 

 *ఆ పిల్లవాడి  తల్లి ప్రాణాలను తీయమన్నపుడు ఆలోచించి వదిలేసాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తన బిడ్డతో  సమానంగా చూసే వ్యక్తి కి దగ్గర చేసాడు.*

 *అప్పుడు అర్థం అయింది… దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండా భర్తీ చేస్తాడు అని!* 


 **ఇక మూడోసారి..* 

 *అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను. కానీ అతను ఇరవై ఏళ్లవరకూ చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు.* 

 *మనం శాశ్వతం కాదు!* 

 *ఏ క్షణాన ఎవరూ పోతామో తెలియదు! ఎంత కాలం ఉంటామో తెలియదు!! కానీ నమ్మకం!!!*

 *ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు. అక్రమంగా సంపాదించి చేర్చేస్తుంటారు. * 

 *ఆశతో బతికేస్తుంటారు! అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను।” అని చెప్పి వెళ్లిపోతాడు..*✍️

         ..సేకరణ. మానస సరోవరం .

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

_బుద్ధ పూర్ణిమ_

 *_బుద్ధ పూర్ణిమ_*


*బుద్ధుని జీవితంలో ప్రాముఖ్యత వహించిన వైశాఖ పౌర్ణమి*


ఆలోచనాపరులు , మానవ జాతి నాయకులు , జంతు జాలం , వృక్ష జాతి , ఖనిజ సంపద...ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో మహా వైశాఖిగా , తదుపరి కాలంలో ఇది బుద్ధ పూర్ణిమగానూ ప్రసిద్ధిగాంచింది.

 

వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. 

ఈరోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. 

గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది.

మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది.


బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. 

కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. 

మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. 

వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. 

తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.


గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది.

బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు.

 దీనిని గమనించి బేతవన విహారదాత అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. 

అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు.


శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. 

తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. 

అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు.

 గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు...

అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు.


వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ

ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది.

బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది.

ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు.

హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది.


రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. 

రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు.


నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి,

అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. 

దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. 

అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే *‘వట సావిత్రి’* మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం ఛాయవే అని అంటారు.


               *_🍁శుభమస్తు.🍁_*

 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

వేణుగానం

 వేణుగానం!


"ఏది మరొక్కసారి,హృదయేశ్వర!,గుండెలు పుల్కరింపఁగా/

ఊదగదోయి!ఊదగదవోయి!సుధామయ యుష్మదీయ వే /

ణూదయ రాగడోలికల నూయలలూగుచు విస్మృతిలో విలీనమై /

పోదును; నాదుక్రొవ్వలపుపువ్వుల ముగ్ధపరీమళమ్ముతో;


కరణామయి-ఉదయశ్రీ-

జంధ్యాలపాపయ్యశాస్త్రి.


        ఈపద్యంవింటే రాధికయేగాదు మనంగూడా తన్మయులమైపోతాం.శాస్త్రిగారి కవితాశక్తియలాంటిది!

         హే హృదయేశ్వరా! కృష్ణా! మరోసారి వేణువూదవా! మరోసారి,ఆఁహః కాదుకాదు మరోసారి,బృందావనిలోనీవు వేణువూదుతుంటే,ఆవలపుగానంలో నాతనువూ మనసూ మరచి తన్మయస్ధితిలోలీనమై, నాతొలివలపుల తీయనియూహలు మదిలో నూగుచుండగా,నీకోసంఈ రాధపరవసిపోతుంది.నీకోసం పలవరిస్తుంది.

మరొక్కసారి వేణువు నూదవయ్యా!కృష్ణా! నాకోసం,కాదుకాదు, మనకోసం;

          ఇదీ ఈపద్యంలోని రాధపిలుపు.శాస్త్రిగారి పద్యంలో వలపు రవంతైనా మీకు అందించగలిగానా నాజన్మధన్యమే!

                             స్వస్తి!🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హైందవ జాతి

 హిందవజాతి మనుగడకు హైందవ జాతి మహోన్నతికి పాటుపడుతున్న శ్రమిస్తున్న హిందూ బంధువులందరకి  

నమో వాకాలు నమః సుమాంజలులు. 

         భాగ్యనగరం లో ప్రతి రోజు ఎక్కడచూసినా మన మహిళా తల్లులు స్త్రీలు (కుమారీలు వివాహితులు, మరియు. చిన్న అమ్మాయిలు ) లో కన్పిస్తున్న వేషధారణ అలంకరణ లు చూస్తుంటే. తలదించుకుని మౌనము గా భాధ పడాల్సివస్తున్నది .. 

కారణము ముఖమున బొట్టు పెట్టు కోవటం అదో పెద్ద నేరము గా భాధ పడుతున్నారు. 

 యిక వస్త్రధారణ. వర్ణించటానికి వీలు లేని విధముగా ధరిస్తున్నారు .

       యిది అధునాతన నాగరిత అని భావిస్తున్నారో లేదా యింట్లో చెప్పేవారు కరువవుతున్నారో అర్థం కాని పరిస్థితి.

       చాలామంది ని నేను చాలా ప్రదేశాలలో అమ్మ మీరు హిందువులేనా అని అడుగుతూ వారిని క్రొద్ది గా భాధిస్తున్న సంఘటనలు ఎన్నో. 

 చాలామందిని చేతులెత్తి నమస్కరిస్థానిక మార్లు. మన సంస్కృతిని కాపాడండి అని ప్రార్థిస్తుంటాను. 

 మేము బొట్టు పెట్టుకున్నాము పోయింది అని కొందరు 

మేము యిలా డ్రెసె. వేసుకోకపోతే మా పని చేసే యజమానులు మమ్మలను తిడతారు ఉద్యోగం లో నుంచి తీసేస్తారు అని చెబుతుంటారు .మరి నిజం పై. వాడికీ తెలియాలి .

అయినా నా ప్రయత్నాన్ని మానుకోనూ.

 యింట్లో వున్న తల్లులందరికి వినయ పూర్వక ప్రణామాలు చేస్తూ

మీ అందరినీ. కోరేది ఏమి టంటే 

     మీ చిన్న పెద్ద పిల్లలకు (అమ్మాయిలకు ) మన సంస్కారం నేర్పండి. మొహాన కనుబొమ్మల మధ్య కుంకుమ బొట్టు ఆ పైన వారికి యిష్టం వచ్చిన బొట్టు పెట్టుకొమ్మనంది .

అలాగే వస్త్ర ధారణ ఎదుటివారిని రెచ్చ గొట్టే విధం కాకుండా భారతీయత 

దేశ పవిత్ర నూకాపాడే విధముగా వస్త్రము లను ధరించ మని చెప్పండి .

నేర్పండి .

  ( యీ విధము గా తెలియ జేస్తున్నందులకు ఎవ్వారి మనస్సు లను నొప్పిస్తే క్షంతవ్యడను .)

   న్యాయ వృత్తి లో నేను రోజు చూస్తున్న కేసులు ముఖ్యము గా 

హిందూ స్త్రీలు వివాహ సమస్యలలో  

చాలా మంది (వర్ణ సంక్రమణ )

అనగా. తొందరపడి నమ్మి మోసపోయాము అని. భాధ పడుతున్న స్త్రీ లలో ముస్లిం కుటుంబం లో నీ పురుషులను వివాహం చేసుకుని అనేక చెప్పలేనిభాదల తో న్యాయ స్థానాలు 

చేరుతున్నారు. 

అలాగే యువకులు తొందరపాటు తో 

 S.T S.C కేసులలో చిక్కి నలిగి పోతున్నారు .

దయచేసి అందరూ తల్లి తండ్రులు భావితరాల పిల్లల భవిష్యత్ లకు చక్కని త్రోవ చూపి దేశానికి సంఘానికి

మేలు చేసే వారి గాతయారు చేయవలసినది గా మనసారా

ప్రార్థిస్తూ .

సర్వే జనా సుఖినోభవంతు . 

జై జై మాత. భారత్ మాత. 

(అందరూ అనుకునే సామెత/ మాట ).        

 కొ డుకు దుండగు డయితే తండ్రి తప్పు కూతురు చెడితే లేదా సంఘ ద్రోహి అయితే తల్లి తప్పు ) .

అయినా భగవంతుని దయ వల్ల యింకా ఎంతో మంది పవిత్ర మైన అమ్మల దయ చేత. మన సంస్కారం ఏమాత్రమూ చెడకుండా మన దేశ. పవిత్రతను కాపాడ బడుతున్నది .

ఆతల్లులందరి కి అనేక నమస్కారము లతో 

ఓం నమః శివాయ.




 

యింట్లో

చివరి సందేశం

 *🌹🌹 పరమాత్మ చివరి సందేశం 🌹🌹*


            *ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు...*


                *శ్రీ కృష్ణుడు బలరాముడితో "అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి" అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్యసఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.*


              *ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి "కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి" అన్నాడు.*


              *అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.*


               *ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.*


               *దీని తర్వాత ఇంక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.*


           *“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.*


                 *కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరుతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.*


              *ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.*


               *కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెలచేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.*


                *కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.*


                *అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.*


              *ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదముకొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.*


                *మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.*


            *ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.*


                *ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.*


             *కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.*


            *ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.*


            *కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.*


              *కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరునియందు భేదమును చూస్తారు.*


             *కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. "ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో"*


             *కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను,ఉంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా. ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, ఇంద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.*


            *ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం ...*


           *ఈ సందేశం మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.*

వైశాఖ పురాణం - 15 16

: వైశాఖ పురాణం - 15


15వ అధ్యాయము - అశూన్య శయనవ్రతము


నారదమహర్షి అంబరీషమహారాజుతో నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు "మునివర్యా! మన్మధుని భార్య రతిదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగువానిని గూడ చెప్పగోరుదునని యడిగెను.


అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగ ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థజీవనమును గడిపి సర్వసంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును?


శ్రావణమాసమున శుద్దవిదియయందీ వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతము నాచరించువారు నాలుగు మాసములును హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణదినమున లక్ష్మీసమేతుడగు శ్రీమహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు/వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణమాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజింపవలెను.


తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమెతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము అను మాసములందు శ్రీహరిని/రుక్మిణీ సహితముగ యెఱ్ఱని పుష్పములతో పూజింపవలయును. భూదేవసహితుడు సనందనాదిముని సంస్తుతుడు పరిసుద్దుడగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విదియ యందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయును.


మార్గశిరము మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదిమాస చతుష్టయమున పూజ, హోమము భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను, శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగనే దానమీయవలెను. శ్రీకృష్ణప్రతిమను మార్గశీర్షాదిమాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తిగ వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.


లక్ష్మ్యా అశూన్యశయనం యధా తవజనార్ధన


శయ్యామమా ప్యశూన్యా స్యాద్దావేనానేవ కేశవ


అని దానమంత్రమును చెప్పి దానముచేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము స్వామీ! జనార్దనా నీ శయ్య లక్ష్మీసహితమై యున్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై యీ శయ్యాదానముచేనుండుగాక.


ఈ వ్రతమును, భార్యలేని పురుషుడును, విధవాస్త్రీయును, దంపతులును యెవరైనను చేసికొనవచ్చును. శ్రుతదేవమహారాజా! నేను నీకీ వ్రతమును పూర్తిగ వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన యనుగ్రహమునంది జనులందరును ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై యుందురు. కావున యధాశక్తిగ భక్తి శ్రద్దలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా! నీవడిగిన అశూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలయును? అని శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజుతో ననెను.


శ్రుతకీర్తి మహారాజు మహామునీ! వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను.


వైశాఖపురాణం 15వ అధ్యాయం సమాప్తం.


ఓం నమో నారాయణాయ *వైశాఖ_పురాణం__16_వ_అధ్యాయము*


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


*యముని_పరాజయము*


అప్పుడు నారద మహర్షి యమలోకము నకు వెళ్లెను. యమలోక స్థితిని జూచెను.. యమధర్మరాజా..! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుట మాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను.


 నారద మహర్షీ..! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖ వ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలననో, దండన భయముననో తప్పక వైశాఖ మాస వ్రతమును, ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణు లోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవరును లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానువలె నుంటిని. నాకు యిట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును.. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసిన దేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.


యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమ దండమును ధరించి భీకరులగు యేబది కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజు నెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తి హీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.


అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును, దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనముల గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రము నిట్లు స్తుతించెను.


సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ

త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా

త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||

నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః

తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||


అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును, విషాదమును పొందెను.


అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చి యుండెను. మూర్తములు, అమూర్తములు నగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపము కల, ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖ దుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వ రజ స్తమో గుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.


ఇట్టి దేవతలున్న కొలువు లోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోని వారు క్షణమైన తీరిక యుండని యితడిక్కడి కెందులకు వచ్చెను. తల వంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోని వారు విస్మయ పడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాప పుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలో నున్న భూతములు, దేవతలు ఆశ్చర్య పడుచుండగా యమధర్మరాజు బ్రహ్మ పాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను.. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవము నందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టి వేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.


దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాప పరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా యని సభలోని వారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పని నిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము..? నీవెందులకు వచ్చితివి..? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయము లేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మరాజు 'అయ్యో' అని అతి దీనముగ బలికెను.


#వైశాఖ_పురాణం పదహారవ అధ్యాయము సంపూర్ణము...

శరభుడి జయంతి

 🎻🌹🙏నేడు శరభుడి జయంతి

పరమశివుడి మరో అవతారం శరభుడు...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿ఇది సాధారణంగా చాలామందికి తెలీదు.  శివుడి భీకర శక్తివంతమైన రూపం.చాలా మందికి సాధారణంగా తెలీని పరమశివుని మరో అవతారం శరభుడు. 


🌸ఇది విశ్వాన్ని రక్షించ డానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపంగా భావిస్తారు. 

ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోప రూపమైన , సగం మానవుడు సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు.


🌿విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని తనకి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుడుని రాక్షసుడైన , తండ్రి అయిన హిరణ్యకశిపుడి నుంచి రక్షించడానికి నృసింహ అవతారం ఎత్తాడు. 


🌸అతన్ని చంపిన నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు, అదేపనిగా గాండ్రిస్తూ , ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. 


🌿దీని వల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి , ఇతర దేవతలు, అధిదేవతలు మహాదేవుడి సాయం కోరగా , ఆయన శరభుడి అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుడిని శాంతింపచేసి , మామూలు విష్ణురూపంలోకి మార్చాలని నిర్ణయించాడు.


🌷శరభుడిగా శివుడి రూపలక్షణాలు🌷


🌸శివుడి అవతారమైన శరభుడు మానవుడు, జంతువు మరియు పక్షి కలగలసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్ళంతా పొక్కులు కల రూపం. 

అనేక చేతులు, పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలాగా ఉంటాడు. 


🌿అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది. 

తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్ లాగా కన్పిస్తుంది, శరీరానికి వెనకవైపు విచ్చుకుని ఉండే పెద్ద రెక్కలు మరియు పొడవైన తోక వీపుపై ఉంటాయి. 


🌸నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు, పటిష్టమైన పంజాలు ఆ రూప ముఖ్య ఆయుధాలు. 

ఉరుములాంటి గొంతు ప్రతిద్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేము.

మూడు కళ్ళు నిప్పు కణితులవలె మండుతూ ఉంటాయి. 


🌿పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి , కన్పిస్తాయి కూడా, మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుసకొట్టే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది.


🌷పరమశివుని శరభావతారం కథ🌷


🌿మొదటగా శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుడిని శాంతించ మని కోరాడు. 

కానీ నరసింహుడు మాట వినిపించుకోలేదు. 

అందుకని ఆకారంలో , శక్తిలో నరసింహుడిని మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తాల్సి వచ్చింది.


🌸శరభుడు తన పొడవైన తోకతో నరసింహుడిని ఎత్తి పడేయబోయాడు...

నరసింహుడికి విషయం అర్థమై శరభుడిని క్షమించమని ప్రార్థించాడు...


🌿ఇది పరమశివుడికి నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్ని ఇక బాధించలేదు, శివుడి ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలసి శరభేశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు,  


🌸అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుడిని మామూలుగా మార్చింది, ఈ శివుడి అవతారాన్ని శరభేశ్వరుడిగా కొలుస్తారు.


🌿శివాలయాల్లో గర్భగుడికి ముందు రెండు శరభేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్టించడం కూడా చూడవచ్చు..స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


ఓం నమః శివాయ నమః 🪷🙏🪷

భక్తి ముక్తి శైలు భవాని 🙏😊🪈🍊🍊🌸

దుఃఖాన్ని ఇస్తుందని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *బహవః సమ్ప్రదృశ్యన్తే తుల్యనక్షత్రమఙ్గళాః*।

     *కర్మణాం ప్రాక్ కృతానాం వై ఇహ సిద్ధిః ప్రదృశ్యతే*॥


తా𝕝𝕝 లోకంలో చాలామంది జనులు ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు.... వారికి జాతకర్మాది సంస్కారాలు సమానంగానే జరుగుతాయి.... కానీ? వారికి పూర్వజన్మలో చేసిన పుణ్యపాపకర్మలను అనుసరించి ఫలప్రాప్తి కలుగును".


   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝 

*అర్థమనర్థం భావయ నిత్యం*

*నాస్తితతః సుఖలేశః సత్యం* ౹

*పుత్రాదపి ధన భాజాం భీతిః*

*సర్వత్రైషా విహితా రీతిః* ॥29॥


భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. *ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే*.

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ శంకర జయంతి ప్రత్యేకం 

          ( ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


                                 భాగం 10/10


9. మహావాక్య చతుష్టయము

      (నాలుగు మహా వాక్యాలు) 


      నాలుగు వేదాలకి సంబంధించి, నాలుగు ఉపనిషత్తులనూ కలుపుకొని, అద్వైతానికి సంబంధించి, నాలుగు మహావాక్యాలు శంకరభగవత్పాదులు వెలికి తీశారు. అవి 



1."ప్రజ్ఞానం బ్రహ్మ" 

     {ఋగ్వేదము, ఐతరేయోపనిషత్తు, లక్షణ(విధి) వాక్యము} 

    దీని భావము 

    "సర్వమును తెలియు ప్రజ్ఞయే బ్రహ్మము" 


వివరణ 


అ) పురుషుడు ఏ చైతన్యముతోనైతే, 

  - చూచుటకు యోగ్యమైన ఈ రూపాదికమును చూచుచున్నాడో, 

  - శబ్దములను వినుచున్నాడో, 

  - గంధమును ఆఘ్రాణించుచున్నాడో, 

  - శబ్ద సమూహమును ఉచ్చరించుచు వ్యవహరించుచున్నాడో, 

  - రుచులను ఎఱుగుచున్నాడో, 

      ఆ చైతన్యమే "ప్రజ్ఞానము" అని చెప్పబడుచున్నది. 


"యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ I 

  స్వాద్వస్వాదూ విజానాతి తత్ప్రజ్ఞానముదీరితమ్ ॥" 


ఆ) బ్రహ్మదేవునియందును, 

      దేవేంద్రాది దేవతలయందును, 

      మనుష్యులందును, 

      అశ్వము గోవు మొదలగువానియందునుగల ఒక్కటియగు చైతన్యమే బ్రహ్మమవుతుంది. 

     ఆ కారణాలవల్ల నా దేహమందు గల ప్రజ్ఞానము కూడా బ్రహ్మమే అవుతుంది. 


"చతుర్ముఖేన్ద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు I 

 చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి॥" 



2."అహం బ్రహ్మాఽస్మి" 

     { యజుర్వేదము, బృహదారణ్యకోపనిషత్తు, అనుభవ వాక్యము} 

     దీని భావము 

  "నేను బ్రహ్మమైతిని" 


వివరణ 


అ) పరిచ్ఛిన్నత్వములేని పరమాత్మ ఈ మాయాకల్పితమైన జగత్తునందు, 

     జ్ఞానసంపాదమునకు యోగ్యమైనట్టి వేదాంత శ్రవణాద్యనుష్ఠానవంతమగు ఈ మనుష్య శరీరమందు 

     బుద్ధికి సాక్షిగా నిర్వికారముగా ప్రకాశించుచుండి, (లక్షణావృత్తిచేత) "అహం" అనెడి పదంచే "నేను" అని చెప్పబడుచున్నాడు. 


"పరిపూర్ణః పరాత్మాఽస్మిన్ దేహే విద్యాధికారిణి I 

 బుద్ధేస్సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే॥" 


ఆ) స్వాభావికముగా అపరిచ్ఛిన్నుడగు పూర్వోక్తపరమాత్మ ఈ మహావాక్యమందు బ్రహ్మమనెడి పదముచేత లక్షణావృత్తిచే చెప్పబడుచున్నాడు. 

    "అస్మి" "ఇతి" అనే పదం ఏకత్వాన్ని(జీవ బ్రహ్మైక్యాన్ని) తెలిపేదవుతుంది. 

     అందుచేత నేను బ్రహ్మమునే అగుచున్నాను. 


"స్వతః పూర్ణః పరాత్మాఽత్ర బ్రహ్మశబ్దేన వర్ణితః I 

 అస్మీత్యైక్యపరామర్శస్తేన బ్రహ్మ భవామ్యహమ్ ॥" 



3."తత్త్వమసి" 

    {సామవేదము, ఛాందోగ్యోపనిషత్తు, ఉపదేశవాక్యము} 

    దీని భావము 

    "నీవు ఆ పరబ్రహ్మము అయితివి" 


వివరము 


అ) సృష్టికి పూర్వము నామరూపములు లేనిదియు, 

     రెండవది లేనట్టిదియు, 

     ఏకమునగు ఏ సద్వస్తువు ప్రతిపాదింపబడి యున్నదో, 

      ఆ సద్వస్తువునకు ఇప్పుడును(సృష్ట్యుత్తరకా మందును) విచారదృష్టిచే అట్టి స్వభావమే "సత్" (అది) అనే పదముచేత, (లక్షణావృత్తిచే) చెప్పబడుచున్నది. 


"ఏకమేవాద్వితీయం సన్నామరూపవివర్జితమ్ I 

 సృష్టేః పురాఽధునాఽప్యస్య తాదృక్త్వం తదితీర్యతే॥" 


ఆ) ముముక్షువుయొక్క స్థూలాది శరీరత్రయమునకంటె విలక్షణమగు సద్వస్తువు ఈ మహావాక్యమునందు "నీవు" అనే శబ్దంచేత చెప్పబడుతోంది. 

      "ఐతి"వనెడి పదముచేత ఐక్యము కనబడుతోంది. 

       ఆ "తత్త్వం" పదార్థాలయొక్క ఏకత్వము ముముక్షువులచే అనుభవింపబడునుగాక! 


"శ్రోతుర్దేహేన్ద్రియాతీతం వస్త్వత్ర త్వం పదేరితమమ్ i 

 ఏకతా గ్రాహ్యతేఽసీతి తదైక్యమనుభూయతామ్ ॥" 



4."అయమాత్మా బ్రహ్మ" 

    {అథర్వణవేదము, మాండూక్యోపనిషత్తు, సాక్షాత్కార వాక్యము} 

దీని భావము 

"ఈ జీవాత్మయే పరబ్రహ్మము" 


వివరణ 


అ) "అయం" = "ఈ" అనే పదంచేత ఆత్మకు స్వప్రకాశత్వము అపరోక్షత్వము యుక్తిపూర్వముగ చెప్పబడింది. 

      అహంకారము మొదలు స్థూలదేహము వరకూ గల ప్రపంచంకంటె (అధిష్ఠాన సాక్షిత్వములచేత) వేరుగా ఉండడంచేత అయ్యది "ప్రత్యగాత్మ" అని చెప్పబడుతోంది. 


"స్వప్రకాశాపరోక్షత్వమయమిత్యుక్తితో మతమ్ I 

 అహంకారాది దేహాన్తాత్ప్రత్యగాత్మేతి గీయతె" 


ఆ) కనబడుచుండే సకల జగత్తునకు అధిష్ఠానరూపము బ్రహ్మ శబ్దంచేత చెప్పబడుతోంది. 

     ఆ బ్రహ్మము స్వయం ప్రకాశమానుడగు ప్రత్యగాత్మయే స్వరూపంగా గలది అవుతుంది. 

  (అనగా ప్రత్యగాత్మయే బ్రహ్మమనడం) 


"దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్త్వమీర్యతే I 

 బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకమ్ ॥ 


   *శంకరజయంతి సందర్భంగా, 

    పది రోజులుగా మనం తెలుసుకొంటున్న విషయాలు, దీనితో పూర్తయ్యాయి. 

    

          జయజయ శంకర హరహర శంకర 


                     =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం  -‌ పూర్ణిమ  -  విశాఖ -‌‌ గురు వాసరే* (23.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|భజగోవిందమ్|¦¦|-_* ॐ卐 💎



శ్లో𝕝𝕝 *అర్థమనర్థం భావయ నిత్యం నాస్తితతః సుఖలేశః సత్యం* |

 *పుత్రాదపి ధన భాజాం భీతి: సర్వత్రైషా విహితా రీతి*: 29


*భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే*. 


 ✍️🪷🌷🙏

*అష్ట దిక్కుల ప్రాధాన్యత

 @ ఓం శ్రీ మాత్రే నమః @


          *అష్ట దిక్కుల ప్రాధాన్యత!*


*మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని 'అష్ట దిక్కులు' అంటాము. వాటిని పాలించే వారిని 'దిక్పాలకులు' అంటారు.


*దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను 'దిక్కులు' అంటారు.


*విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.


*1) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము 'అమరావతి.' ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అధికారుల బాధలు ఉంటాయి.


*2) ఆగ్నేయ మూల: ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం, అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంబదించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.


*3) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను 'దండపాణి' అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.


*4) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం.


*5) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.


*6) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి.


*7) ఉత్తరము: ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి.


*8)ఈశాన్య మూల: ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము(ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది. ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి.


*ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు.

దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడిపించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.


        🚩సర్వేజనాః సుఖినోభవంతు.. 🚩

డొనెషన్లు

 డొనెషన్లు


మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

పూజింపబడువాడు

 శ్లోకం:☝️ఈశాన ధ్యానం

*ఈశానం సకలారాధ్యం*

 *వన్దే సమ్పత్సమృద్ధిదమ్ ।*

*యస్య చాసీద్ధరిశ్శాస్త్రం*

 *బ్రహ్మా భవతి సారథిః ॥*

 - వేదపాదస్తవః


భావం: అందరిచేత పూజింపబడువాడు, ఐశ్వర్యమును, శ్రేయస్సును ప్రసాదించువాడు, శ్రీహరి ఆయుధం (నారాయణాస్త్రం)గా గలవాడు, మరియు బ్రహ్మ రథసారథిగా గలవాడు - అయిన ఈశాన స్వామికి నా ప్రణామాలు.🙏

పంచాంగం 23.05.2024 Thursday.

 ఈ రోజు పంచాంగం 23.05.2024 Thursday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల పక్ష: పౌర్ణమి తిధి బృహస్పతి వాసర: విశాఖ నక్షత్రం పరిఘ యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పౌర్ణమి రాత్రి 07:18వరకు.

విశాఖ పగలు 09:12 వరకు.

సూర్యోదయం : 05:46

సూర్యాస్తమయం : 06:40


వర్జ్యం : మధ్యాహ్నం 01:21 నుండి 03:01 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:04 నుండి 10:56 వరకు తిరిగి మధ్యాహ్నం 03:14 నుండి 04:05 వరకు.


అమృతఘడియలు : రాత్రి 11:19 నుండి 12:59 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.23.05.2024

బృహస్పతివాసరే( గురువారము)

*********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే పౌర్ణిమాశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే శుక్ల పక్షే పౌర్ణిమాశ్యాం. 

బృహస్పతివాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.30

సూ.అ.6.22

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

పూర్ణిమ సా.6.40 వరకు. 

బృహస్పతివాసరే

నక్షత్రం విశాఖ ఉ. 8.50 వరకు. 

అమృతం రా.11.04 ల 12.46 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 9.48 ల 10.39 వరకు.

దుర్ముహూర్తం మ.2.57 ల 3.48 వరకు

వర్జ్యం ప.1.01 ల 2.43 వరకు. 

యోగం పరిఘ ప.12.09 వరకు.  

కరణం భద్ర ఉ. 6.11 వరకు. 

కరణం బవ సా. 6.40 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ.9.00ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు.   

***********   

పుణ్యతిధి వైశాఖ శుధ్ధ పూర్ణిమ. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

హోటళ్లలో

 *ఈ హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. ఇక అంతే సంగతులు!*


హైదరాబాద్: లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. 


ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


అయితే హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు


ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు విడుదల చేసిన ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు


- క్రీమ్ స్టోన్ 

-⁠ న్యాచురల్స్ ఐస్ క్రీమ్ 

- కరాచీ బేకరీ 

- కేఎఫ్‌సీ 

- రోస్టరీ కాఫీ హౌస్ 

- రాయలసీమ రుచులు 

- షా గౌస్ 

- కామత్ హోటల్ 

- 36 డౌన్ టౌన్ బ్రూ పబ్ 

- మాకౌ కిచెన్ అండ్ బార్ 

- ఎయిర్ లైవ్

- టాకో బెల్ 

- అహా దక్షిణ్

- సిజ్జిలింగ్ జో 

- ఖాన్ సాబ్ 

- హోటల్ సుఖ్ సాగర్ 

- జంబో కింగ్ బర్గర్స్

- రత్నదీప్ స్టోర్

- కృతుంగ

- రెస్ట్ ఓ బార్