20, సెప్టెంబర్ 2021, సోమవారం

జీవితమంతా సంఘర్షణే

జీవితమంతా సంఘర్షణే 

మానవ జీవితంలో ఏది ఈజీ కాదు ప్రతిదీ సంఘర్షణతో కూడుకున్నది. పుట్టకముందు 9 నెలలు తల్లి గర్భంలో గర్భస్థ శిశువు 9 నెలల సంఘర్షణ చేస్తే కానీ జననం కాదు ఆ సంఘర్షణలో విఫలమైతే జ్ణానానికన్నా ముందే మరణం సంక్రమిస్తుంది. జన్మించిన తోలి రోజునుంచి సంఘర్షణ మొదలౌతుంది శైశవ దశ గురుతు ఉండకపోవచ్చు కానీ మనకన్నా మనఇంట్లో పెద్దవారు మనం శైశవదశలో పడిన సంఘర్షణల చెపుతారు. 5 సంవస్తసరాల వయసునుంచి మనకు జ్ఞాపకం ఉండవచ్చు కానీ మనం వెనకకు తిరిగి చూసుకుంటే ప్రతి రోజు ఒక సంఘర్షణ కానీ మనం దానిని ఆలా చూడము. 

నీటిలో ఈతకొట్టే వాడిని చూసి ఒడ్డున వున్నవాడు అది చాలాతేలిక అని అనుకోవచ్చు. కానీ నీటిలోదిగితే కానీ ఆ విద్యలోని కష్టం శ్రమ, సంఘర్షణ తెలుస్తాయి. శ్రీ కృష్ణ భగవానుల వారు అందరిని దృష్టిలో ఉంచుకొని గీతను మనకు అందించారు. గీత ఒక చదవదగిన పుస్తకమని నేననుకోను.  అది కేవలం జీవితాంతం ఆకళింపు చేసుకొని, అనుసరించి ఆచరించవలసిన జ్ఞ్యాన బాండాగారంగా  నేను భావిస్తాము.  ఎన్ని శాస్త్రాలు చదివిన ఎన్ని గ్రంధాలు చదివిన అందులోని విషయం పరిజ్ఞానాన్ని అర్ధంచేసుకుని ఆకళింపు చేసికొనక పొతే జీవితానికి సార్ధకత లేదు. ఈ విషయంలో భాస్కర శతక కారుడు చెప్పింది చూడండి 

ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్

దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే

ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే?

తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!

నాలుక గాక తెడ్డేరుణఁగునే భాస్కర 

శతకకారుడు మనకు చాలా చక్కగా వివరించారు. ఎడ్డెమనుస్యుడు గొప్పవారితో కలిసి వుండినాకూడా వారి సత్ప్రవర్తనలు తెలుసుకొనలేరు. ఎందుకంటె కూరలో కలిసి తిరిగినను తెడ్డు (చెంచా) దాని రుచి తెలుసుకోలేదు అని అర్ధము. 

విద్య నేర్చుకునే వానికి కష్టసుఖాలవివక్షత ఉండకూడదు.  కష్టమైన సరే నేను విద్య నేర్వాలనే పట్టుదల ఉండాలి అప్పుడే విద్యాబ్యాసం అకుంఠితంగా జరుగుతుంది. "విద్యాతురాణాం సుఖం నిద్రా" అని కదా అన్నారు.  సామాన్యమైన భౌతికమైన విద్యలు నేర్వటానికి అంత కష్టం అయినప్పుడు.  బ్రహ్మ విద్య నేర్వటానికి యెంత కష్టం పడాలి అన్నది అర్ధం చేసుకోవాలి. 

ఈ పృద్విమీద విద్యార్ధి నేర్చుకునే విద్యను పరిశీలిస్తే మనకు మూడు విషయాలు బోధపడతాయి. 1) అధ్యాపకుడు అంటే విద్యను బోధించేవారు. 2) విద్యార్థి అంటే విద్యను అభ్యసించేవారు. 3) విద్య అంటే జ్ఞ్యానం పొందవలసిన విషయం. 

బ్రహ్మ విద్యలో మనము పరిశీలిస్తే అక్కడ ఈ మూడు విషయాల స్పష్టత ఉండదు.  ఎందుకంటె అక్కడ విద్య అంటే విద్యార్థికి బిన్నంగా వున్నది కాదు.  కాబట్టి బ్రహ్మ విద్య పొందటం సాధారణ విషయం కాదు. మన మునులు, మహర్షులు వేలసంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి వారు బ్రహ్మ జ్ఞానాన్ని పొందారు. మనం ఈ జన్మలో ప్రారంభిస్తే ఈ జన్మలో బ్రహ్మ జ్ఞానులం అవుతామని నమ్మకం లేదు.  అయినా జ్ఞాన జిజ్ఞాసువులమై ప్రారంభిస్తే మనం జ్ఞానమార్గంలో కొంతవరకు వెళ్లగలము. మరల తరువాత జన్మలో మరలా మనసాధన కొనసాగించవచ్చు. అందుకు ప్రమాణంగా భగవత్గీతలో క్రింది శ్లోకాన్ని పరికించండి. 

Dhyan yoga ధ్యాన యోగం చాప్టర్ -6, శ్లోకం 44.  

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సః
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ||

యోగభ్రష్టుడు తన ప్రయత్నం లేకుండానే పూర్వజన్మ అభ్యాసం చేత యోగం వైపుకిమరల్చ బడతాడు. యోగం మీద ఆసక్తి కలగగానే వేదాలలో చెప్పిన సకామ కర్మానుష్ట ఫలాన్ని దాటేస్తాడు.

గతజన్మలో యోగభ్రష్టుడైన వాడు అంటే యోగాబ్యాసాన్ని ప్రారంభించి ఫలితాన్ని పొందక మధ్యలో మరణించిన యోగి తరువాతి జన్మలో తానూ ఎక్కడ ఆపివేసినడో అక్కడినుండి మరల యోగాబ్యాసాన్ని కొనసాగిస్తాడు అని భగవానులు పేర్కొన్నారు. నేను అది చేయలేను, ఇది చేయలేను అని అనుకోని మన ప్రయత్నాన్ని కేవలం చదవటం, తెలుసుకొంటాం  వరకు మాత్రమే  కాకుండా ద్రుష్టి అబ్యాసం వైపు మరల్చాలి.  అబ్యాసం అనేది కేవలం ఒక రోజులోనో, లేక ఒక ఏడులోనో సిద్దించదు అయినా దిగులు పడక అభ్యసన్ని కొనసాగించాలి. ఎన్నో ఆటంకాలు వస్తూవుంటాయి. నీవు యోగివ, ఋషివా, నీలాంటివారిని ఎందరినో చూసాను అని ఎంతోమంది మనకు నిరాశని కలిగించవచ్చు కూడా. మనకు ఉపనిషత్తులో మూడు విధాల అవరోధాలు పేర్కొన్నారు అవి  ఆద్యాత్మికం, అధిదైవికము, ఆధిభౌతికం అంటే ఒకటి ఆద్యాత్మికం అనగా మన శరీరం మన యోగాబ్యాసానికి సహకరించక పోవటం అంటే శారీరక అనారోగ్యం, ఆకలి, బద్దకము మొదలైనవి. ఇక రెండవది అధిదైవికము అంటే ప్రక్రుతి శక్తులవలన కలిగే ఆటంకాలు అవి వర్షాలు, ఉరుములు, పిడుగులు, ఇతర ప్రకృతి బీబత్సవాలు.  ఇక మూడవది ఆధిభౌతికం అనగా మనచుట్టూ వున్న భౌతిక శక్తుల వలన కలిగే ఆటంకాలు ఉదాహరణ మీరు ధ్యానం చేద్దామనుకునే సమయానికి మీ ప్రక్క గుడిలో రికార్డులు పెడతారనుకోండి మీరు వెళ్లి నేను ధ్యానం చేసుకోవాలంటే మేము కూడా దేముడి పాటలే కదా పెట్టింది అంటారు.  అప్పుడు మీరు వానికి దేముడిగూర్చి వివరించలేరు. ఇకపోతే ఆ ప్రక్కన ఎవరో పెద్ద సౌండుతో టివి లేక రికార్డులు పెట్టారనుకోండి. లేదా కుక్కలు పీట్లడుకుంటున్నాయనుకోండి. ఇలాంటివి అనేకం మనకు బౌతికంగా తారసపడతాయి. ఈ మూడు ఆటంకాలమీద మనకు ఏమాత్రం పట్టు ఉండదు.  విధిగా మనం వాటికి వశం కావలసిందే. 

ధ్యానం ఎప్పుడు చేయాలి. 

బ్రాహ్మీముహూర్తంలో అంటే సూర్యోదయానికన్నా 90 నిముషాలముందు కాలంలో నిద్ర లేవాలి. 


To be continue


Simple exercise


 

అమానుషమైన వివక్ష

 🚩🚩🚩🚩🍁🍁

*_మన రాజ్యాంగంలోని 28, 29, 30 అధికరణాలు తీసివేయడం గానీ, మార్చడం గానీ చేయవలసిన సమయం ఆసన్నమైంది._*


*_ఈ అధికరణాలు హిందువుల పట్ల భరించరాని అమానుషమైన వివక్ష చూపుతోంది. ప్రతి హిందువు ఈ అధికరణాన్ని చదివి అర్థం చేసుకోవలసిన అవసరం వుంది._*


*_ఈ అధికరణం హిందువుల కాళ్ళు, చేతులు కట్టేస్తోంది._*

*_ఈ అధికరణాల ప్రకారం…._*

*_….మైనారిటీలు చేసినంత యథేచ్ఛగా హిందువులు విద్యా సంస్థలు పెట్టి నడిపేందుకు లేదు._* *_హిందూ విద్యా సంస్థలలో భగవద్గీత, రామాయణం లాంటి సబ్జెక్టులు చెప్పేందుకు లేదు._*


*_అదే మైనారిటీలు బైబిలు, ఖురాను వారి విద్యా సంస్థలలో చెప్పొచ్చు._*

*_….హిందూ ధార్మిక సంస్థలపైనా, దేవాలయాల పైనా పెత్తనం ప్రభుత్వానిదే._* 


*_అదే మైనారిటీల విషయంలో చర్చిల పైనా, మసీదుల పైనా ప్రభుత్వ పెత్తనం చెల్లదు._*

*_….ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద పన్ను వేస్తుంది. మైనారిటీల మత సంస్థలకు, చర్చిలకు, మసీదులకు ఆర్ధిక వనరులు సమకూరుస్తుంది._*


*_అదే ఆర్ధిక సహాయం మన వేద సంస్కృత పాఠశాలలకు లేదు._*

*_హిందువులంతా ఏకమై ఈ వివక్షను ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి._* *_ప్రపంచంలో మెజారిటీ ప్రజలను వివక్షకు గురిచేసి మైనారిటీలకు పట్టంగట్టే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేది మన దేశం మాత్రమే. ఈ దరిద్రమైన ఆంక్షలు పెట్టి హిందువులను నిలువునా దోచుకున్నారు పాలకులు._*

*_ప్రపంచంలో మన దేశమే విచిత్రమైన సెక్యూలర్ దేశం. ఇక్కడ...._*


*_1. ప్రభుత్వ పాఠశాలల్లో ఖురాను, బైబిలు బోధించ వచ్చు. అదే వేదాలు, భగవద్గీత, రామాయణం చెప్పమంటే మత తత్వం అంటారు._*


*_2. అమర్నాథ్ యాత్రకు పోవాలంటే పన్ను కట్టాలి. మక్కాకు పోయేవాళ్లకు సబ్సిడీ._*


*_3. కలకత్తా యూనివర్సిటీలో ముస్లిములకు ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేకమైన హాస్టళ్లు. హిందువులకు అలాంటి వసతి లేదు._*


*_4. ముస్లిం అమ్మాయిలకు బోర్డు ఎగ్జామ్ పాసైతే స్కాలర్షిప్. హిందూ అమ్మాయిలకు లేదు._*


*_5. ప్రాధమిక విద్యలో ముస్లిములు 50% మార్కులు తెచ్చుకుంటే ఆర్ధిక సహాయం. అదే హిందువులు 95% మార్కులు తెచ్చుకున్నా లేదు._*


*_6. ముస్లిములకు వడ్డీ లేని రుణాలు. హిందువులకు లేదు._*


*_7. దేవాలయాల నుంచి వచ్చిన రాబడి ప్రభుత్వానికే. మసీదులు, చర్చిల నుంచి ప్రభుత్వానికి పైసా రాదు._*


*_8. కుక్కలు, పిల్లుల విషయంలో శ్రద్ధ చూపితే జంతు ప్రేమికుడు. అదే గోమాతల విషయంలో మత ఛాదస్తము అంటారు._*


*_9. నడి వీధిలో పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాక్స్వాతంత్రం. భారత్ మాతాకు జై అంటే మత ఛాదస్తము._*


*_10. MF హుస్సేన్ సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రీకరిస్తే అది గొప్ప కళ, దుర్గా మాతను సెక్స్ వర్కర్ అని కమ్మీలు అంటే సెక్యూలర్. అదే ఇతర మతాలను గెలికి చూడండి._*


*_11. పాస్టర్లకూ, ఇమాములకు జీతాలు. తర_* *_తరాలుగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న హిందూ_* *_అర్చక వర్గానికి అమరావతి కథలలో చెప్పినట్లు తులసీ తాంబూలమే._*

*_ఇది మన దేశం. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి._*


 *_సోషల్ మీడియాలో ఉద్యమానికి శ్రీకారం చుడదాం._*


*_రండి! కదలి రండి! మిత్రులారా ఇది పూర్తిగా చదివి..బిక్కర మొహం వేసుకోక షేర్ చేయండి.._*


*_మీ అమూల్యమైన సలహా వ్రాయండి.._*


*_ధర్మో రక్షతి రక్షితః_*

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

హిందువులు జంతువుల ఎడల ఎందుకు భేదభావము తో వ్యవహరిస్తారు?

 శోభా డే పేరు మీరు వినేవుంటారు.ఒక ప్రఖ్యాత రచయిత్రి గా భావించబడే ఒక వ్యక్తి. వారి మాట

*మాంసం మాంసమే అవుతుంది*. *అది ఆవుదైనా మేకదైనా లేక ఏ ఇతర జంతువుదైనా*...

కానీ హిందువులు జంతువుల ఎడల ఎందుకు భేదభావము తో వ్యవహరిస్తారు? మేకని చంపు కానీ ఆవుని చంపకూడదని చెప్పడం ఆత్మవంచన, మూర్ఖత్వమే కదా...?


*జవాబు*

శోభా డే గారు మీరు చాలా చక్కగా చెప్పారు. .ఆన్న అయినా, భర్త అయినా ,తండ్రి అయినా, కొడుకు ఆయినా మగవాడు మగవాడే కదా.

కానీ మీరు వీళ్ళందరి తో వేరు వేరు గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? 

సంతానం కోసం భర్త అవసరమా?

భర్త తో ప్రవర్తించినట్లు తండ్రి,ఆన్న,కొడుకు తో కూడా ప్రవర్తించ వచ్చు కదా?

ఇది మీ మూర్ఖత్వం కాదా? మోసం చేసుకోవడం కాదా?


*జవాబు 2*


మీరు ఇంట్లో మీ భర్త కి పిల్లలకి కాఫీ రూపం లోనో మరో విధంగా గానో ఆవు లేదా గేదె పాలనో ఇస్తువుంటారు కాదా? కానీ కుక్క పాలతో కాఫీ టీ తయారుచేసి ఇవ్వగలరా?

ఎందుకంటే ఏ జంతువుదైనప్పటికి *పాలు పాలే కదా*?

మరి ఇది మూర్ఖత్వం కాదా? ఆత్మవంచన కాదా?


ఇక్కడ విషయం మాంసానికి సంబంధించినది కాదు. విశ్వాసానికి మనోభావాలకు సంబంధించినది.

ఆన్న ,భర్త,కొడుకు, కూతురు,అమ్మ,చెల్లి సంబంధాలు మన మనోభావాలు విశ్వాసాల ఆధారంగా వుంటాయి అంతే కానీ కేవలం వాళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య సంబంధాల రీతిన ఉండవు.


ఆవిధంగానే ఆవు మేక లేక ఇతర జంతువుల విషయం లోనూ మన విశ్వాసం, మనోభావాల ప్రకారం వ్యవహరిస్తాము.


*జవాబు 3*


మంచి పాలు ఏ జంతువు నుండి లభిస్తాయి? అని ఒక ఇంగ్లిష్. వాడు స్వామి వివేకానందుని అడిగాడు.


గేదె పాలే శ్రేష్ఠం- వివేకానందుని జవాబు

ఇంగ్లీష్ వాడు,- కానీ మీరు ఆవుని సర్వ శ్రేష్ఠమైనది గా భావిస్తారు కదా? కాదా?


స్వామి- కానీ మీరు పాల గురించి అడిగారు. అమృతం గురించి కాదు.

రెండో విషయం జంతువు గురించి అడిగారు. కానీ ఆవు మా తల్లి. జంతువు కాదు.


*ఇదే సందర్భంగా ఒక చిన్న ప్రశ్న*

పులి ని రక్షించు అన్నవాడు సమాజ సేవకుడవుతాడు

కుక్కల్ని రక్షించు అన్నవాడు పశు ప్రేమికుడవుతాడు

కానీ ఆవు నీ రక్షించు అన్నవాడు *మతోన్మాది* ఎందుకు అవుతాడు?


దీనికి జవాబు ఎవరిదగ్గరైనా వుంటే దయచేసి చెప్పండి

తర్పణం

 తర్పణం💐💐💐


ఈరోజు చాలా విలువైన ఇటువంటి మెసేజ్ పెడుతున్నాను అందరమూ తెలుసుకుందాము ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....


""తృప్తినిచ్చే అర్పణం తర్పణం "".....అంటారు.


1. తర్పణం అంటే ఏమిటి ?

పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.


2. తర్పణము ఎన్నిరకాలు ?

తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.


ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.


2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.


3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.


4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.


మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.


3. తర్పణాలు ఎందుకు వదులుతాము ?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.


4. ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.


2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .


3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.


4. ఆవు నేతితో తర్పణము చేస్తే, …….సుఖము


5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ……. సర్వ సిద్ధి


6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే …….. శత్రు నాశనము


5. తర్పణం ఎలా వదలాలి ?

కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.


(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?


మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


 భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


*పితృదేవతలకు.... ఆకలా...?*


అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*


*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*


అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.


మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...


పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..


*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*


అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.


*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*


సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.


క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.


భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.


చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.


ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

verbal-fight

 *Just for Fun*

**************************************


A verbal-fight between husband and wife (both are M.A. in English literature). Instead of shouting, abusing or physical force...they exchange poems to each other.😀*


             *WIFE*

_I wrote your name on sand,_

_it got washed..._

_I wrote your name in air,_

_it was blown away..._

_Then, I wrote your name in my heart & got a Heart Attack!_

🙄


          *HUSBAND*

_God saw me hungry,_

_he created pizza._

_He saw me thirsty,_

_he created Pepsi._

_He saw me in the dark,_

_he created light._

_He saw me without problems, he created YOU!_😏


                 *WIFE*

_Twinkle twinkle little star._

_You should know what you are._

_And once you know what you are,_

_Mental hospital is not so far!_🤨 


             *HUSBAND*

_The rain makes all things beautiful._

_The grass and flowers too. _

_If rain makes all things beautiful,_

_Why doesn't it rain on you?_🙄


               *WIFE* 

_Roses are red; Violets are blue;_

_Monkeys like you should be kept in zoo._😠

                               

            *Husband*

_Don't feel so angry_

_you will find me there too_

_Not in a cage but laughing at you!_

🥴😜😊😂🤣😜

హిందూ పండుగలపైనేనా

 *మీ వ్యతిరేకత *మీ వ్యతిరేకత హిందూ పండుగలపైనేనా? - పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం*


*ప్రభుత్వం ఇతర మతాల కోసం కోట్లాది రూపాయల డబ్బును వ్యయం చేస్తున్నప్పుడు మీరెందుకు నోరు విప్పలేదు?*


*హిందూ పండుగలప్పుడు మాత్రమే మీకు హఠాత్తుగా ప్రజా ప్రయోజనాలు గుర్తుకొస్తాయా?*


*రావణదహనం, వినాయక చవితి అయిపాయాయి. ఇక మీ తదుపరి లక్ష్యం దేవీ నవరాత్రులను ఆపటమేనా? - పిటిషనర్ కు కోర్టు సూటి ప్రశ్న*


*చవకబారు ప్రచారం కోసం, హిందూ పండుగల శోభకి విఘాతం కలిగించాలనే దురుద్దేశ్యంతోనూ హిందూ పండుగలకు వ్యతిరేకంగా పదే పదే కోర్టులో పిటిషన్లు వేస్తున్న ఓ సామాజిక కార్యకర్తపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దురుద్దేశంతో కూడిన ఇలాంటి పిటిషన్ల వల్ల మత సామరస్యానికి విఘాతం ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.*


*పిటిషనర్ జనార్ధన్ మూన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ భూషణ్ గవాయి, జస్టిస్ వినయ్ దేశపాండేల ద్విసభ్య బెంచ్.... ప్రభుత్వం దీక్షా భూమి, తాజా బాగ్ ల ఆధునీకరణ కోసం, డ్రాగన్ ప్యాలెస్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని పిటిషనర్ ని ప్రశ్నించింది. కేవలం హిందూ పండుగలప్పుడే మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న సంగతి అకస్మాత్తుగా గుర్తొస్తుందా? అని పిటిషనర్ ని సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ తన పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలిసిందిగా కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ కు కోర్టు భారీ జరిమానాను కూడా విధించడం గమనార్హం.*


*జనార్ధన్ మూన్ సారథ్యం వహిస్తున్న ‘నాగిరి హక్కా సంరక్షణ మంచ్’ గతంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిషేదించవలసిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేయడం గమనార్హం. ఆనాడు కోర్టు పిటిషనర్ కు 25 వేల రూపాయల భారీ జరిమానాను కూడా కోర్టు విధించింది.*


*వినాయక చవితి గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలలో దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షని, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించిన లోకమాన్య తిలక్ గౌరవార్ధం..... అత్యున్నతంగా అలంకరించబడిన గణేష్ మండపాలకు, పర్యావరణ హితకరంగా ఉన్న గణేష్ మండపాలకు, భేటీ బచావో బేటి పడావో, అక్షరాస్యత, నీటి పొదుపు తదితర అంశాలపై ప్రేరణ కలిగించేలా ఉన్న గణేష్ మండపాలకు ప్రభుత్వం బహుమతులు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పిటిషనర్ కోర్టులో సవాలు చేశారు. పిటిషనర్ పదే పదే హిందూ పండుగలనే లక్ష్యంగా చేసుకుని కోర్టులను ఆశ్రయించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.*


*పిటిషనర్ రాజ్యాంగాన్ని చదివి సెక్యులరిజం పదానికి ఉన్న అసలైన అర్థాన్ని తెలుసుకోవాలని కూడా కోర్టు సూచించింది. రావణ దహనం అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది ఇక మీ తర్వాతి లక్ష్యం ఏమిటి? నవరాత్రి ఉత్సవాలను ఆపడమేనా? అని కోర్టు పిటిషనర్ ని తీవ్రంగా ప్రశ్నించింది. కేవలం చౌకబారు ప్రచారం కోసమే పిటిషనర్ పదేపదే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పేరు అశ్విన్ ఇంగొలే.*? - పిటిషనర్ పై హైకోర్టు ఆగ్రహం*


*ప్రభుత్వం ఇతర మతాల కోసం కోట్లాది రూపాయల డబ్బును వ్యయం చేస్తున్నప్పుడు మీరెందుకు నోరు విప్పలేదు?*


*హిందూ పండుగలప్పుడు మాత్రమే మీకు హఠాత్తుగా ప్రజా ప్రయోజనాలు గుర్తుకొస్తాయా?*


*రావణదహనం, వినాయక చవితి అయిపాయాయి. ఇక మీ తదుపరి లక్ష్యం దేవీ నవరాత్రులను ఆపటమేనా? - పిటిషనర్ కు కోర్టు సూటి ప్రశ్న*


*చవకబారు ప్రచారం కోసం, హిందూ పండుగల శోభకి విఘాతం కలిగించాలనే దురుద్దేశ్యంతోనూ హిందూ పండుగలకు వ్యతిరేకంగా పదే పదే కోర్టులో పిటిషన్లు వేస్తున్న ఓ సామాజిక కార్యకర్తపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దురుద్దేశంతో కూడిన ఇలాంటి పిటిషన్ల వల్ల మత సామరస్యానికి విఘాతం ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.*


*పిటిషనర్ జనార్ధన్ మూన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ భూషణ్ గవాయి, జస్టిస్ వినయ్ దేశపాండేల ద్విసభ్య బెంచ్.... ప్రభుత్వం దీక్షా భూమి, తాజా బాగ్ ల ఆధునీకరణ కోసం, డ్రాగన్ ప్యాలెస్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని పిటిషనర్ ని ప్రశ్నించింది. కేవలం హిందూ పండుగలప్పుడే మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న సంగతి అకస్మాత్తుగా గుర్తొస్తుందా? అని పిటిషనర్ ని సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ తన పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలిసిందిగా కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ కు కోర్టు భారీ జరిమానాను కూడా విధించడం గమనార్హం.*


*జనార్ధన్ మూన్ సారథ్యం వహిస్తున్న ‘నాగిరి హక్కా సంరక్షణ మంచ్’ గతంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిషేదించవలసిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేయడం గమనార్హం. ఆనాడు కోర్టు పిటిషనర్ కు 25 వేల రూపాయల భారీ జరిమానాను కూడా కోర్టు విధించింది.*


*వినాయక చవితి గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలలో దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షని, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించిన లోకమాన్య తిలక్ గౌరవార్ధం..... అత్యున్నతంగా అలంకరించబడిన గణేష్ మండపాలకు, పర్యావరణ హితకరంగా ఉన్న గణేష్ మండపాలకు, భేటీ బచావో బేటి పడావో, అక్షరాస్యత, నీటి పొదుపు తదితర అంశాలపై ప్రేరణ కలిగించేలా ఉన్న గణేష్ మండపాలకు ప్రభుత్వం బహుమతులు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పిటిషనర్ కోర్టులో సవాలు చేశారు. పిటిషనర్ పదే పదే హిందూ పండుగలనే లక్ష్యంగా చేసుకుని కోర్టులను ఆశ్రయించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.*


*పిటిషనర్ రాజ్యాంగాన్ని చదివి సెక్యులరిజం పదానికి ఉన్న అసలైన అర్థాన్ని తెలుసుకోవాలని కూడా కోర్టు సూచించింది. రావణ దహనం అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది ఇక మీ తర్వాతి లక్ష్యం ఏమిటి? నవరాత్రి ఉత్సవాలను ఆపడమేనా? అని కోర్టు పిటిషనర్ ని తీవ్రంగా ప్రశ్నించింది. కేవలం చౌకబారు ప్రచారం కోసమే పిటిషనర్ పదేపదే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పేరు అశ్విన్ ఇంగొలే.*

సంస్కృత భాష

 


"పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మము"

@@@@@@@@@@


"సంస్కృత భాష

సంస్కృతము - దేవనాగరి".


◆ సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. 


◆ సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. 


◆ సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది.

భారతదేశానికి చెందిన ప్రాచీన భాష, భారతదేశ 23 ఆధికారిక భాషలలో ఒకటి. సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. 


◆ నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. 


◆ ఆధునిక భారతదేశంలో సంస్కృతం వాడుక క్రమేపి తగ్గినా కూడా ఇప్పటికీ ఏడు గ్రామాలలో సంస్కృతమే మాట్లాడతారు. ఆ గ్రామాలు, కర్ణాటక లోని మత్తూరు, హోసహల్లి, మధ్యప్రదేశ్ లోని జిరి, మొహద్ మరియు బాఘువర్ గ్రామాలు, ఒరిస్సా లోని ససనా గ్రామం, రాజస్థాన్ లోని గనోడా గ్రామం.


◆ మత్తూరు, కర్ణాటక, షిమోగా జిల్లా లోని గ్రామం. శివమొగ్గ పట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ఊరి జనాభా 5,000 మందిలో అత్యధికులు సంస్కృత భాషను ఎక్కువ ఉపయోగిస్తుండటం వలన ఈ గ్రామం సంస్కృత గ్రామంగా గుర్తింపు పొందింది.


◆ ఈ ఊరి వారికి ఇతర భాషలు వచ్చినా సంస్కృతంలో మాట్లాడటానికే మొగ్గు చూపిస్తారు. ఇక్కడి స్కూళ్లలో ప్రతి పాఠ్యాంశమూ సంస్కృతంలోనే బోధిస్తారు. అలాగని అక్కడి వాళ్లందరికీ సంస్కృతం తప్ప మరొక భాష రాదేమో, వారికి నాగరికత తెలియదేమో అనుకోటానికి వీల్లేదు. 


◆ ఎందుకంటే అనేక మంది యువకులు ఈ గ్రామంలో సంస్కృతంలో పాఠాలు చదివి, ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారు. ఇక్కడి ముస్లిములు కూడా సంస్కృతమే మాట్లాడతారు. దాదాపు 500 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇదే పరంపర కొనసాగుతుంది..


◆ మత్తూరులో రామాలయం, శివాలయం, సోమేశ్వరాలయం, లక్ష్మీకేశవాలయం ఉన్నాయి..


◆ మత్తూరుకు కవల గ్రామం లాంటి హొసహళ్ళికి కూడా మత్తూరు లక్షణాలు ఉన్నాయి. హొసహళ్ళి తుంగ నదికి ఆవలి ఒడ్డున ఉంది.ఈ రెండు గ్రామాలనూ జంటగా ప్రస్తావిస్తూంటారు.


◆ మత్తూరు, హొసహళ్ళి రెండు గ్రామాల ప్రజలు గమక కళా ప్రక్రియను అనుసరిస్తారు. ఈ రెండు గ్రామాలు దక్షిణ భారతదేశంలో రోజువారీ వ్యవహారంలో సంస్కృతం మాట్లాడే అరుదైన గ్రామాలు. 


◆ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా జర్మనీ , నార్వే , ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో క్రమేపి సంస్కృత భాష యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది..మన నవ భారతంలో కూడా పిల్లలు తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకుని మన పూర్వీకులు మనకు అందజేసిన అపారమైన విజ్ఞానాన్ని , మేధా సంపత్తిని అందిపుచ్చుకోవాలి..

మహాలయ పక్షం

 🙏🙏🙏🙏🙏

ఎప్పటి నుండి మహాలయ పక్షం ప్రారంభం,మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది?


మహాలయ పక్షం 20 సెప్టెంబర్నుంచి ప్రారంభమైఅక్టోబర్ 6 మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ , *నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’. అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. 


భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.


తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య నైనా చేసి తీరాలి. 


దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. 


ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.


స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా *‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’* అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. 


కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.


ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. 


ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

 *_మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ?_*


🕉🕉🕉🕉🕉🕉

మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


20 సెప్టెంబర్నుంచి ప్రారంభమైఅక్టోబర్ 6 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


*పితృదేవతలకు.... ఆకలా...?*


అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*


*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*


అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వా


రి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.


మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... 


పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..


*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*


అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.


*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*


సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.


క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.


భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.


చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.


ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

 _*ఈరోజునుండి మహాలయ పక్షం ప్రారంభం (ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఏమి లభిస్తుంది)*_


🕉🕉🕉🕉🕉🕉

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం

ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు , తమ వంశాభివృద్ధి జరుగును . వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.


భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము , కృష్ణపక్షం పితృపదము , అదే మహాలయ పక్షము. మహాలయమంటే - *మహాన్ అలయః , మహాన్‌లయః మహల్ అలం యాతీతివా* అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము , పితృదేవతల యందు మనస్సు లీనమగుట , పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట , అని అర్థములు. అమావాస్య అంతరార్థం: *‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం.* చంద్రుడు , సూర్యుడిలో చేరి , సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు. 


భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.


మహాలయ పక్ష ప్రారంభం /ఈరోజు నుండి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవ


తలు పూజలకు ఉద్దేశించినవి. 

పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని , తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. 

జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. 


భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర , పౌత్రుల దగ్గరకు వస్తారు 

ప్రతి మాసంలోను అమావాస్య , పితరుల పుణ్య తిథి గా భావించబడినా , మహాలయ అమావాస్య కు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. 

ఆదర పూర్వకం గా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు , విద్య , ధనం , సంతానం , సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది , కాని ఈ మహాలయపక్షం లో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. 

మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లబిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా , గురువుల ద్వారా తెలుసుకోన్నది.


1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.


2. విధియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.


3. తదియ లో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.


4. చవితి రోజు శ్రార్ధము పెడితే పగ వారు(శత్రువులు)లేకుండా చేయును.


5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగచేయును.


6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనియులుగా చేయును.


7. సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును.


8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.


9. నవమి మంచి భార్యను సమ కూర్చిను. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతు రాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.


10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.


11. ఏకాదశి రోజున సకల వేదా , విద్యా పారంగతులను చేయును.


12. ద్వాదశి రోజున స్వర్ణములను , స్వర్ణ ఆభరణములను సమ కూర్చును.


13. త్రయోదశి రోజు న సత్సంతానాన్ని , మేధస్సును , పశు , పుష్టి , సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.


14. చతుర్దశి తిది రోజు న వస్త్రం లేక్ అగ్ని(ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.


15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును


16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చును.


ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే , పితృ పక్షం లో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు , అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశం లో నిల్చొని అపరాన్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకం లో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.


బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. 


ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. 


ఈ స్తోత్రాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధం నాడు, లేదా ప్రతి రోజు ఉదయం, పుట్టినరోజు నాడు తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో, వారికి దుర్లభమైనది అంటూ ఏదీ ఉండదు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.


బ్రహ్మ ఉవాచ:


౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!

సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!


ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.


౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!

సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!


సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 


౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!

సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!


సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.


౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!

సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!


ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.


౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!

మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!


ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 


౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!

అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!


ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము

ఫలశ్రుతి:

ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!

ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 

న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 

నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 

సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 

పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!

🙏🙏🙏🙏🙏

శ్రీమద్భాగవతము

 *19.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2266(౨౨౬౬)*


*10.1-1385-*


*క. వారిజభవ రుద్రాదులు*

*భూరికుసుమవృష్టిఁ గురిసి పొగడిరి కృష్ణున్*

*భేరులు మ్రోసెను నిర్జర*

*నారులు దివి నాడి రధిక నటనముల నృపా!* 🌺



*_భావము: ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మ, పరమేశ్వరుడు మొదలగు వారు పుష్పవర్షము కురిపించి శ్రీకృష్ణుని కీర్తించారు. దేవతలు భేరీలు మ్రోగించారు. దేవతాస్త్రీలు ఆకాశములో విశేష నృత్యరీతులలో నాట్యము చేశారు._* 🙏 


                                                                                                                                                                                                         *_Meaning: Sri Sage Suka told King Parikshit: ”Brahma and Parama Siva sang in praise of Sri Krishna. From the sky, celestial beings showered flowers, sounded trumpets and celestial women danced there in a variety of dance forms.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

going to find a lawyer

 The Engineer in Hell!


An Engineer dies but lands in Hell.

He’s talking with Satan & says, “What a terrible place! It’s very hot, dark, smoky”

Satan says, “Well, what did you expect? this IS Hell!”

The engineer says “Do you have a compressor, some tubing, and wire?

Satan says, “Yeah, we might have some of that stuff around, I’ll check and see what I can find for you.”

Satan finds the stuff & the engineer starts designing improvements. After a while, Hell has air conditioning, iced water, good lighting, flush toilets & escalators. The engineer is a pretty popular!

One day God calls and tells Satan, “Say, we had a mix-up. I was checking records & discovered that by error an engineer got sent down to you. He should have come to Heaven. All engineers go to Heaven. You need to transfer him up here.”

Satan says, "Why, things are going great. We've now got air conditioning, iced water, flush toilets, great lighting, and escalators, and there's no telling what this engineer is going to come up with next. We like him! We’re going to keep him.”

God is horrified. "That's clearly a mistake! He should never have gone down there in the first place! Send him up here immediately!"

Satan says, "No way! I really like having an engineer on the staff. I'm keeping him.”

God says, “Send him back up here or I'll sue you!”

Satan laughs, “Yeah, right, Good luck on that. Where are you going to find a lawyer?!" 😃

ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం

 *🕉️ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా🕉️*




🌹శివుడు , విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంత విశిష్టత ఏంటో 

మీకు తెలుసా.........?🌹


🌷అయితే ఒక్కసారి దీనిని చదవండి.🌷


దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.


కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది.


క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.


పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.


🌹హరిహరాదుల క్షేత్రం..🌹


శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.


పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.


చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో 

ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.


కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.


పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. .


వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసెందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.


జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన

శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

🙏🏻

కృష్ణార్పణం

 *🥀గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం' అనటం కాదు. ఇంట్లో ఉన్నదానిని, నోట్లోకి పోయేదానిని కూడా అనగలగాలి🥀*




 చాల చాలా చక్కని విశ్లేషణ.   

*కృష్ణసందేశం !!*

కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!! కృష్ణా!!

*కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది.*

*ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.*

*శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే!!*

ఓం దేవకీ గర్భసంజాతాయ నమః !!

ఓం యశోదేక్షణ లాలితాయ నమః !!

*కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -*

అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ

రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం

ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే

అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద!!

*కృష్ణనామమహత్యం* :-

సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 

కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీ పోవడానికి (అంటే మనసు కష్టం అని భావించదు ) అవి ఆలా కర్మ పరిసమాప్తం ఐపోతాయ్ అన్నమాట.

*మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!!*

నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప!

ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్!!

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః!

జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్!!

*కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.*

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా!

యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః!!

కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు!!

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ రామ హరే!

ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 

నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే!!

*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే!! అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామ మంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు.*

*కృష్ణవిగ్రహముఇస్తున్నసందేశం* :-

దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే -

*1. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీఅననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ!!*

*గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది!!*

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః!

పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్!!

*యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు!!*

*బీష్మపితామహుడు* :-

ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో

దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః!

దశాశ్వమేధీ పునరితి జన్మ 

కృష్ణప్రణామీ న పునర్భవాయ!!

*శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు!!*

*శత్రుచ్చేదైకమన్త్రం*

సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం!

సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః! సంఘనిర్యాణమన్త్రమ్!!

సర్వైశ్వర్యైకమన్త్రం! వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం!

*జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం!! (ముకుందమాలా)*

సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి*

*"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము"!!*

*హరే కృష్ణ*🥀

పారాయణ శ్లోకాలు

 🦚🌼🦚🌼🦚🌼🦚

🦚🌼🦚🌼🦚🌼🦚




*🌼నిత్య పారాయణ శ్లోకాలు🌼*




*మనలో చాలామందికి తెలియని నిత్య పారాయణ శ్లోకాలు మీ కోసం* 👇

 

 *ప్రభాత శ్లోకం* 🌷


కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !

కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!


 *ప్రభాత భూమి శ్లోకం* 🌷


సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !

విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!

 

 *సూర్యోదయ శ్లోకం* 🌷


బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!

 

 *స్నాన శ్లోకం* 🌷


గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

 

 *భస్మ ధారణ శ్లోకం* 🌷


శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !

లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

 

 *భోజనపూర్వ శ్లోకం* 🌷


బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!

 

అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !

ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!

 

త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !

గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

 

 *భోజనానంతర శ్లోకం* 🌷


అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !

ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!


 *సంధ్యా దీప దర్శన శ్లోకం* 🌷


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!

 

 *నిద్రా శ్లోకం* 🌷


రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !

శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!


 *కార్య ప్రారంభ శ్లోకం* 🌷


వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !

నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

 

 *హనుమ స్తోత్రం* 🌷


మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!

 

బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !

అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

 

 *శ్రీరామ స్తోత్రం* 🌷


శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే 

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 

 

 *గణేశ స్తోత్రం* 🌷


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!

అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !

అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!

 

 *శివ స్తోత్రం 🌷* 


త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !

ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!

 

 *గురు శ్లోకం* 🌷


గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !

గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!

 

 *సరస్వతీ శ్లోకం* 🌷


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!


యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !

సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

 

 *లక్ష్మీ శ్లోకం* 🌷


లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !

త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!


 *వెంకటేశ్వర శ్లోకం* 🌷 


శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !

శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

 

 *దేవీ శ్లోకమ్* 🌷


సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే !

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

 

 *దక్షినామూర్తి శ్లోకం* 🌷


గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

 

 *అపరాధ క్షమాపణ స్తోత్రం* 🌷


అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !

దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

 

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ 

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

 

కాయేన వాచా మనసేంద్రియైర్వా 

బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !

కరోమి యద్యత్సకలం పరస్మై 

నారాయణాయేతి సమర్పయామి !! 

 

 *విశేష మంత్రాలు* 🌷


 *పంచాక్షరి* - ఓం నమశ్శివాయ


 *అష్టాక్షరి* - ఓం నమో నారాయణాయ 


 *ద్వాదశాక్షరి* - ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌼

అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?

 🦚💥🦚💥🦚💥🦚

🦚💥🦚💥🦚💥🦚




*💥అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?💥*



మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి. కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి. దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది. అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.


ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.


ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.


ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.


అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.


🙏🏻

మోదీ కాదు (కర్మ) యోగి

 మోదీ కాదు (కర్మ) యోగి!


మోదీ అనగానే అందరూ ఓ గుజరాతీ అనో, హిందూత్వవాది అనో, చాయ్ వాలా అనో, ఆరెస్సెస్ స్వయం సేవక్ అనో, రాజకీయ నాయకుడనో, ముఖ్యమంత్రనో, ప్రధాని అనో... ఇలా తమకు తోచింది భావిస్తుంటారు! ఆయనంటే పడని వారు ఇంకా బోలెడు విధాలుగా భ్రమించి భయపడుతుంటారు! కానీ, నిజంగా మోదీ ఎవరు? 

మోదీ ఒక కర్మ యోగి! తన కోసం తాను సన్యాసిగా మారి పరివ్రాజకుడైపోదామనుకున్న అవధూత... ఇవాళ్ల మన కోసం... కర్మ యోగిగా మారి నిత్యం కష్టపడుతోన్న దైవం పంపిన దూత! ఆయన ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. భార్యని పట్టించుకోలేదు. ఇలాంటి మాటలే మీడియా వాగుతుంది కానీ... ఇంటి నుంచి బయలుదేరిన ఆ సత్యాన్వేషి తరువా ఏం చేశాడు? ఇది తెలిసి కూడా చెప్పదు! 

మీడియా చెప్పని మోదీ పరివ్రాజక జీవితం ఏంటంటే... ఇల్లు వదిలి బయలుదేరిన నరేంద్రుడు దేశమంతా తిరిగాడు. ఆరెస్సెస్ ప్రచారక్ గా కాదు. కేవలం ఒక సత్యాన్ని అన్వేషించే సనాతన ఆత్మ స్వరూపిగా! అలా తిరిగి తిరిగి ఆయన చివరకు మోక్షం కోరే అందరూ చేరే కేంద్రానికే చేరాడు! హిమాలయాలకు!

హిమాలయాల్లో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిన మోదీ మానస సరోవరం కూడా సందర్శించారు. మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించి ( పర్వత శిఖరాగ్రం అధిరోహించలేదు. ) తిరిగొచ్చారు. స్వరాష్ట్రంలోని రాజ్ కోట్ కు వచ్చాక రామకృష్ణ మఠం చేరుకుని అక్కడి స్వామీజీ... ఆత్మస్థానందజీ మహారాజ్ ను ఆశ్రయించారు. తనకు సన్యాస దీక్ష ప్రసాదించమని అభ్యర్థిచారు. కానీ, అక్కడే విచిత్రం జరిగింది! రామకృష్ణ మఠం స్వామీజీ నరేంద్రుడికి సన్యాసం ఇవ్వలేదు! ఆయన తన స్వంత మోక్షం కోసం కాక జాతి విముక్తి కోసం కృషి చేయాల్సి వుందని నచ్చజెప్పి తిరిగి పంపారు! ఆ రోజు నుంచీ మోదీ యోగికి బదులు కర్మ యోగి అయ్యారు! సన్యాసి కాని సన్యాసి అయ్యారు!

ఇల్లు వదలటం, హిమాలయ యాత్ర, స్వామీజీని ఆశ్రయించటం... వీటి తరువాత అప్పుడు మొదలైంది ఆరెస్సెస్ స్వయం సేవక్ శకం! ఆరెస్సెస్ ఆఫీసులో గది శుభ్రం చేయటం, టీ పెట్టడం లాంటి చిరు పనులతో మొదలైన మోదీ జీవితం ప్రచారక్ గా ఉజ్వలమైంది! ఆయన మీద ఎన్నో బాధ్యతలు పెట్టిన సంఘ్ ని ఆయన ఏనాడూ నిరాశపరచలేదు! అడుగడుగునా తన సత్తాతో ఆశ్చర్యపరిచారు! అందుకే, ఆరెస్సెస్ మోదీ అనే తమ అణ్వయుధాన్ని బీజేపికి బహూకరించింది. పార్టీ కార్యకలాపాల్లో తలమునకలైన మోదీ ఏమేం చేశారో అంతా బహిరంగమే! ఇవాళ్ల గుజరాత్ బీజేపీ సర్వ విధాలా అజేయంగా వుండటానికి ఆయన పాత్ర కూడా కీలకం! అందుకే, గుజరాత్ సీఎం పీఠం ఆయనను అనివార్యంగా వరించేసింది!

మోదీ... ముఖ్యమంత్రి నుంచీ ప్రధాని ఎలా అయ్యాడో... ఇంకా చాలా మందికి తెలిసిన ప్రస్థానం! అసలు ఒక్క రోజు, ఒక్క గంట కూడా ప్రతిపక్షంలో వుండకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలటం... కేవలం రాజకీయ చాతుర్యమేనా? కానేకాదు... మోదీ వెనుక ఆధ్యాత్మిక శక్తే... ఆయనను , మిగతా మరుగుజ్జు స్వార్థ రాజకీయ నేతల్ని వేరు చేసేది!

ఒక పరీక్షిత్తు, ఒక విక్రమాదిత్యుడు, ఒక చంద్రగుప్తుడు, ఒక శాతవాహనుడు, ఒక పుష్యమిత్ర శుంగుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక నరేంద్ర దామోదర్ దాస్ మోదీ!. మోదీ యోగీ స్థాయిని చేరుకోవడానికి ఈ లుచ్చరాజకీయ నాయకులు ఎవ్వరు ఆయన నీడనుకూడ చేరుకోలేరు. ఆయన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తీసుకున్న దృడసంకల్పాన్ని చూసి దొంగలంతాబెంబేలెత్తి పోతున్నారు.

అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి

 #కథ #Story. #कहानी। 


"మొన్నామధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను..! నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా వున్నారు."


"ఏంటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏంటి విశేషం" అడిగాను. 


"మా అమ్మాయి సుధ తెల్సుగా సుధ. దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు. 

అందుకని.. దిష్టి తీయడం.. స్వీట్ తినిపించడం.. "అంటూ చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో వున్న మేము సుధకి కనిపించము. లోపలికి వెళ్ళిపోయింది. 


సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను. వెలిగి పోతోంది. 


క్షణం తర్వాత లోపల్నించి మాటలు వినబడుతున్నాయి.

" తొలి జీతం కదా. నాన్న గారికి ఇవ్వమ్మా" 


"ఇవ్వను" తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినబడింది. 


అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బ్ లా మాడిపోయి వుంది. నేను అక్కడ వుండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది. 


" తప్పే.. అలా అనకూడదు.. నీ సంతోషం చూడాలని నువ్వు

ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు.వెళ్ళు.. వెళ్ళి జీతం ఇచ్చిరా పో" 


"ఏంటమ్మా.. ఒకసారి చెప్తే అర్ధం కాదా.. నేను ఇవ్వను. 

ఆ టేబుల్ మీద పెడతా.. వచ్చి తీసుకోమను." 


ఈ సంభాషణ వింటున్న మా వాడు తలొంచుకుని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్ళు నిలిచాయేమో చీకట్లో నాకు కనబడలేదు. చెంప ఛెళ్ళుమన్న శబ్దం.


"అమ్మా"


"ఛీ..ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు" ఏడుపు దాచుకోలేకపోతోంది తల్లి.


" అమ్మా.. ఎంతసేపూ.. నీ వైపునుండి ఆలోచించడమేనా.. నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా…" 

"చెప్పేడు .." 

"అమ్మా.. చిన్నప్పట్నించీ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు.. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర్నించి ఇవాళ పొద్దున్న

ఆఫీసుకి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారీ నాన్న చేయి పైన నా చేయి కిందా వుండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చేయి కిందా నా చేయి పైనా వుంటుందమ్మా.. అది నాకిష్టం లేదు. నాన్న చేయి ఎప్పుడూ పైనే వుండాలమ్మా. అందుకే ఇవ్వనంటున్నానమ్మా" అంటూ భోరుమని ఏడ్చింది సుధ. 


అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో " అమ్మా సుధా.. నా తల్లీ " అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు. 


అని చెప్పి మనోడి వంక చూశాను. కళ్ళనిండా నీళ్ళు. తుడుచుకోవడంతో కూడా మరిచి పోయి చూస్తున్నాడు. 


"దీని వల్ల నీకేం అర్ధం అయింది. మనకన్నా వయసులో పెద్ద వారికి మన చేయి పైన వుండేలా ఇవ్వకూడదు. దోసిలిలో పట్టుకుని వారిని తీసుకోమనాలి. అంతేకాదు దేవుడికి పువ్వులు, పత్రి లాంటివి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి. అది మన సంస్కృతి. మన సంప్రదాయం. 


🙏ॐ శాంతి ॐ శాంతి 🙏