20, సెప్టెంబర్ 2021, సోమవారం

జీవితమంతా సంఘర్షణే

జీవితమంతా సంఘర్షణే 

మానవ జీవితంలో ఏది ఈజీ కాదు ప్రతిదీ సంఘర్షణతో కూడుకున్నది. పుట్టకముందు 9 నెలలు తల్లి గర్భంలో గర్భస్థ శిశువు 9 నెలల సంఘర్షణ చేస్తే కానీ జననం కాదు ఆ సంఘర్షణలో విఫలమైతే జ్ణానానికన్నా ముందే మరణం సంక్రమిస్తుంది. జన్మించిన తోలి రోజునుంచి సంఘర్షణ మొదలౌతుంది శైశవ దశ గురుతు ఉండకపోవచ్చు కానీ మనకన్నా మనఇంట్లో పెద్దవారు మనం శైశవదశలో పడిన సంఘర్షణల చెపుతారు. 5 సంవస్తసరాల వయసునుంచి మనకు జ్ఞాపకం ఉండవచ్చు కానీ మనం వెనకకు తిరిగి చూసుకుంటే ప్రతి రోజు ఒక సంఘర్షణ కానీ మనం దానిని ఆలా చూడము. 

నీటిలో ఈతకొట్టే వాడిని చూసి ఒడ్డున వున్నవాడు అది చాలాతేలిక అని అనుకోవచ్చు. కానీ నీటిలోదిగితే కానీ ఆ విద్యలోని కష్టం శ్రమ, సంఘర్షణ తెలుస్తాయి. శ్రీ కృష్ణ భగవానుల వారు అందరిని దృష్టిలో ఉంచుకొని గీతను మనకు అందించారు. గీత ఒక చదవదగిన పుస్తకమని నేననుకోను.  అది కేవలం జీవితాంతం ఆకళింపు చేసుకొని, అనుసరించి ఆచరించవలసిన జ్ఞ్యాన బాండాగారంగా  నేను భావిస్తాము.  ఎన్ని శాస్త్రాలు చదివిన ఎన్ని గ్రంధాలు చదివిన అందులోని విషయం పరిజ్ఞానాన్ని అర్ధంచేసుకుని ఆకళింపు చేసికొనక పొతే జీవితానికి సార్ధకత లేదు. ఈ విషయంలో భాస్కర శతక కారుడు చెప్పింది చూడండి 

ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్

దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే

ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే?

తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!

నాలుక గాక తెడ్డేరుణఁగునే భాస్కర 

శతకకారుడు మనకు చాలా చక్కగా వివరించారు. ఎడ్డెమనుస్యుడు గొప్పవారితో కలిసి వుండినాకూడా వారి సత్ప్రవర్తనలు తెలుసుకొనలేరు. ఎందుకంటె కూరలో కలిసి తిరిగినను తెడ్డు (చెంచా) దాని రుచి తెలుసుకోలేదు అని అర్ధము. 

విద్య నేర్చుకునే వానికి కష్టసుఖాలవివక్షత ఉండకూడదు.  కష్టమైన సరే నేను విద్య నేర్వాలనే పట్టుదల ఉండాలి అప్పుడే విద్యాబ్యాసం అకుంఠితంగా జరుగుతుంది. "విద్యాతురాణాం సుఖం నిద్రా" అని కదా అన్నారు.  సామాన్యమైన భౌతికమైన విద్యలు నేర్వటానికి అంత కష్టం అయినప్పుడు.  బ్రహ్మ విద్య నేర్వటానికి యెంత కష్టం పడాలి అన్నది అర్ధం చేసుకోవాలి. 

ఈ పృద్విమీద విద్యార్ధి నేర్చుకునే విద్యను పరిశీలిస్తే మనకు మూడు విషయాలు బోధపడతాయి. 1) అధ్యాపకుడు అంటే విద్యను బోధించేవారు. 2) విద్యార్థి అంటే విద్యను అభ్యసించేవారు. 3) విద్య అంటే జ్ఞ్యానం పొందవలసిన విషయం. 

బ్రహ్మ విద్యలో మనము పరిశీలిస్తే అక్కడ ఈ మూడు విషయాల స్పష్టత ఉండదు.  ఎందుకంటె అక్కడ విద్య అంటే విద్యార్థికి బిన్నంగా వున్నది కాదు.  కాబట్టి బ్రహ్మ విద్య పొందటం సాధారణ విషయం కాదు. మన మునులు, మహర్షులు వేలసంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి వారు బ్రహ్మ జ్ఞానాన్ని పొందారు. మనం ఈ జన్మలో ప్రారంభిస్తే ఈ జన్మలో బ్రహ్మ జ్ఞానులం అవుతామని నమ్మకం లేదు.  అయినా జ్ఞాన జిజ్ఞాసువులమై ప్రారంభిస్తే మనం జ్ఞానమార్గంలో కొంతవరకు వెళ్లగలము. మరల తరువాత జన్మలో మరలా మనసాధన కొనసాగించవచ్చు. అందుకు ప్రమాణంగా భగవత్గీతలో క్రింది శ్లోకాన్ని పరికించండి. 

Dhyan yoga ధ్యాన యోగం చాప్టర్ -6, శ్లోకం 44.  

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సః
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ||

యోగభ్రష్టుడు తన ప్రయత్నం లేకుండానే పూర్వజన్మ అభ్యాసం చేత యోగం వైపుకిమరల్చ బడతాడు. యోగం మీద ఆసక్తి కలగగానే వేదాలలో చెప్పిన సకామ కర్మానుష్ట ఫలాన్ని దాటేస్తాడు.

గతజన్మలో యోగభ్రష్టుడైన వాడు అంటే యోగాబ్యాసాన్ని ప్రారంభించి ఫలితాన్ని పొందక మధ్యలో మరణించిన యోగి తరువాతి జన్మలో తానూ ఎక్కడ ఆపివేసినడో అక్కడినుండి మరల యోగాబ్యాసాన్ని కొనసాగిస్తాడు అని భగవానులు పేర్కొన్నారు. నేను అది చేయలేను, ఇది చేయలేను అని అనుకోని మన ప్రయత్నాన్ని కేవలం చదవటం, తెలుసుకొంటాం  వరకు మాత్రమే  కాకుండా ద్రుష్టి అబ్యాసం వైపు మరల్చాలి.  అబ్యాసం అనేది కేవలం ఒక రోజులోనో, లేక ఒక ఏడులోనో సిద్దించదు అయినా దిగులు పడక అభ్యసన్ని కొనసాగించాలి. ఎన్నో ఆటంకాలు వస్తూవుంటాయి. నీవు యోగివ, ఋషివా, నీలాంటివారిని ఎందరినో చూసాను అని ఎంతోమంది మనకు నిరాశని కలిగించవచ్చు కూడా. మనకు ఉపనిషత్తులో మూడు విధాల అవరోధాలు పేర్కొన్నారు అవి  ఆద్యాత్మికం, అధిదైవికము, ఆధిభౌతికం అంటే ఒకటి ఆద్యాత్మికం అనగా మన శరీరం మన యోగాబ్యాసానికి సహకరించక పోవటం అంటే శారీరక అనారోగ్యం, ఆకలి, బద్దకము మొదలైనవి. ఇక రెండవది అధిదైవికము అంటే ప్రక్రుతి శక్తులవలన కలిగే ఆటంకాలు అవి వర్షాలు, ఉరుములు, పిడుగులు, ఇతర ప్రకృతి బీబత్సవాలు.  ఇక మూడవది ఆధిభౌతికం అనగా మనచుట్టూ వున్న భౌతిక శక్తుల వలన కలిగే ఆటంకాలు ఉదాహరణ మీరు ధ్యానం చేద్దామనుకునే సమయానికి మీ ప్రక్క గుడిలో రికార్డులు పెడతారనుకోండి మీరు వెళ్లి నేను ధ్యానం చేసుకోవాలంటే మేము కూడా దేముడి పాటలే కదా పెట్టింది అంటారు.  అప్పుడు మీరు వానికి దేముడిగూర్చి వివరించలేరు. ఇకపోతే ఆ ప్రక్కన ఎవరో పెద్ద సౌండుతో టివి లేక రికార్డులు పెట్టారనుకోండి. లేదా కుక్కలు పీట్లడుకుంటున్నాయనుకోండి. ఇలాంటివి అనేకం మనకు బౌతికంగా తారసపడతాయి. ఈ మూడు ఆటంకాలమీద మనకు ఏమాత్రం పట్టు ఉండదు.  విధిగా మనం వాటికి వశం కావలసిందే. 

ధ్యానం ఎప్పుడు చేయాలి. 

బ్రాహ్మీముహూర్తంలో అంటే సూర్యోదయానికన్నా 90 నిముషాలముందు కాలంలో నిద్ర లేవాలి. 


To be continue


కామెంట్‌లు లేవు: