31, డిసెంబర్ 2024, మంగళవారం

అనుకూలవతి


 అనుకూలం విమలాంగీం కులజాం కుశలాం సుశీలసంపన్నామ్ |

పంచలకారాం భార్యాం పురుషః పుణ్యోదయాల్లభతే ||

: అనుకూలవతి, విమలాంగియూ, ఉత్తమ కులజాతయైనది, కుశల బుద్ధి కలది,శీలవతియైనది(సత్ప్రవర్తన కలది) మొదలగు ఐదు లకారముల కలిగిన స్త్రీ భార్యగా 

పురుషుని పుణ్యం వల్ల లభిస్తుంది అని భావం

⚜ *శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 548*


⚜ *కేరళ  : కన్నూర్* 


⚜ *శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ ఆలయం*



💠 ఇది 108 శ్రీవైష్ణవ దివ్య దేశాలలో 64వ దివ్యదేశము.

శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ ఆలయం కేరళలోని చెంగన్నూర్‌లోని 5 పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది


💠 శ్రీ ఇమాయవరప్ప పెరుమాళ్ దేవాలయం మహాభారత ఇతిహాసానికి సంబంధించినది కాబట్టి, విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణునికి అంకితం చేయబడిందని నమ్ముతారు. 


🌀 *స్థలపురాణం* 🌀


💠 ఈ దివ్యదేశము ఉన్న స్థలము

 " తిరుచిత్రారు " అని పిలువబడుచున్నది . 

భస్మాసురుని చరిత్రము సుపరిచితమే కదా ! 


💠 పద్మాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి మెప్పించెను . 

శివుడు ప్రత్యక్ష మిచ్చి వరము కోరుకొనుమనగా , తాను ఎవరి తలపై చేయి ఉంచునో అతడు భస్మమై పోవునట్లు వరమీయ వలయునని కోరినంత , శివుడు చేయునది లేక అట్లే వరమిచ్చెను .

 అందుచేతనే ఆ పద్మాసురునికి భస్మాసురుడు అని పేరు వచ్చినది .


💠 వరము పొందిన ఆ అసురుడు పరమశివుని తలపైననే చేయి ఉంచి పరీక్షించబోయెను . 

శివుడు ఉపాయము తోచక పరుగెత్త నారంభించెను . 

అంతట శ్రీమహావిష్ణువు శివుని అవస్థ తెలుసుకొని చతుర్దశ భువన మోహనమైన తన మోహినీ రూపమున ఆ అసురుని కంటబడునట్లు పోయెను . 


💠 పద్మాసురుడు మోహిని రూప లావణ్యములను చూచి , సర్వమును మరచి , తనను వరించి తనతో సుఖింపుము అని మోహినిని కోరెను . మోహిని రూపమున ఉన్న విష్ణువు అట్లే అని అంగీకరించి , తనతో సుఖము పొందుటకై ముందు సుగంధమునిచ్చు తైలమును ఆపాదమస్తకము మర్దించుకొని అభ్యంగస్నానము చేసిరావలయునని కోరగా , మహా ఆనందముతో ఆ అసురుడు తైలమును తలపై మర్దించుకొనుటకై చేయి ఉంచు కొనినంతనే భస్మమై పోయెను . 

 

💠 ఈ పురాణమును మరియొక విధముగా కూడ చెప్పుదురు . మోహిని , అసురుడు తనతో సుఖించుటకు ముందు తన వలెనే నాట్యముచేయ వలయునని కోరి , 

ఆ నాట్యములో తన్మయుడైన సమయమున తలపై చేయి ఉంచుకొనునట్లు చేయగా అసురుడు భస్మమై పోయెను . 

ఏది ఏమయినను శివుని రక్షించుటకై శ్రీమహావిష్ణువు తన మోహిని అవతారము గ్రహించిన తరుణమున ఆ రూపమును చూచి మతిచంచలుడైన శివుడు పరవశుడై అయ్యప్పస్వామి జన్మమునకు కారణ భూతుడయ్యెను . 


💠 ఆ విధముగా పద్మాసురుని వధ నిమిత్తమై శ్రీమన్నారాయణుడు పరమేశ్వరునికి ప్రత్యక్షము నిచ్చిన స్థలమిది . 

 

💠 పురాణాల ప్రకారం, పాండవ యువరాజులు, పరీక్షిత్తును హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత తీర్థయాత్రకు బయలుదేరారు. 

పంబా నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు , ప్రతి ఒక్కరు కృష్ణుడి యొక్కవిగ్రహం ఏర్పాటు చేసినట్లు నమ్ముతారు; 


💠 యుధిష్ఠిరునిచే త్రిచిట్టట్ మహావిష్ణు దేవాలయం , 

భీమునిచే పులియూర్ మహావిష్ణు దేవాలయం , 

అర్జునుడిచే అరన్ముల పార్థసారథి దేవాలయం , 

నకులచే తిరువన్వండూర్ మహావిష్ణు దేవాలయం మరియు సహదేవునిచే త్రికోడితానం మహావిష్ణు దేవాలయం . 


💠 మహాభారత యుద్ధమున పాండవ అగ్రజుడైన యుధిష్ఠిరుడు ( ధర్మరాజు ) ఎల్లప్పుడు సత్యవర్తనుడు , ధర్మమును ఆచరించు వాడు అయి కూడ సమయావసరమున అశ్వత్థామ చనిపోయెనని బిగ్గరగా అరచెను . 

నిజముగా అశ్వత్థామ అను ఒక ఏనుగు హతమైనది . 

ఆ విధముగా ధర్మరాజు పలికినది నిజమే కాని ఉద్దేశ్యము వేరుగా నుండినది . 


💠 అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. అది నమ్మి , ధర్మరాజు అసత్యములు చెప్పడు అను నమ్మిక వలన , తన కుమారుడు మరణించెనని దుఃఖముతో  ద్రోణుడు అస్త్రములను వదలి వెంటనే చనిపోయెను . 

ధర్మరాజు అశ్వత్థామ అను పేరుగల ఏనుగు చనిపోయి తన ఉచ్చారణాను సారము సత్యమునే వచించినను , ఉద్దేశ్యము వేరొకటి కావున , తనను అపరాధిగానే భావించుకొని పరిహారార్థమై ఈ దివ్యదేశమున పెరుమాళ్ ను పూజించి , గొప్ప ధ్యానము చేసి , పెరుమాళ్ కు గొప్ప మందిరమును నిర్మించెను . 


💠 ఆ విధముగా ఈ దివ్యదేశము మహాభారత యుద్ధమునకు ముందే వెలసినది అని తెలియు చున్నది .


💠 శివుడు మరియు శ్రీమన్నారాయణన్ సమానమని వివరించడానికి, ఈ స్థలంలో చాలా పెద్ద శివాలయం కూడా ఉంది. 


💠 పశ్చాత్తాపం, గందరగోళం మరియు వారు చేసిన తప్పుడు పనుల గురించి ఆలోచిస్తూ మనశ్శాంతిని కోరుకునే వారు ఈ దేవాలయానికి వచ్చి భగవంతుడిని పూజించి, మనశ్శాంతి మరియు ప్రశాంతతను పొందవచ్చు. ఇవే కాకుండా, భక్తులు భయాన్ని వదిలించుకోవడానికి, రోగాల నుండి విముక్తి పొందడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మరియు అడ్డంకులను తొలగించడానికి పూజ కోసం కూడా ఆలయానికి వస్తారు. 

ఈ ఆలయంలో భక్తులకు పాలను సమర్పిస్తారు.



💠 రోడ్డు మార్గంలో- 

జాతీయ రహదారి NH 47 నగరం గుండా వెళుతుంది, కోయంబత్తూర్, ఎర్నాకులం, త్రిస్సూర్, కొల్లాం, త్రివేండ్రం మొదలైన ఇతర ప్రధాన నగరాలకు నగరాన్ని కలుపుతుంది. 

రాష్ట్రం అన్ని ఇతర ప్రధాన నగరాల నుండి నగరాన్ని కలుపుతూ KSRTC బస్సులను నడుపుతుంది.

భగవంతుని మార్గాన్ని,

 🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼


ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.

అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు. అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు. వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది. పిల్లలు దాహంతో అలమటిస్తున్నారు, అతని వద్ద  ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకపోయింది. చివరి ప్రత్యామ్నాయంగా దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ! దయచేసి ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే ", అని వేడుకున్నాడు.

వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోనిఉన్న ఒక ఋషి ని చూశాడు. ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు. ఆ ఋషి, ‘ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో, ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు’, అని అతనికి తెలియజేశాడు.

ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.

అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు, దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు. అతను తిరిగి వస్తున్నప్పుడు, మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.

అతను మూడవసారి నీరు తీసుకుని కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై, అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు. వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను. దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.

దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.

ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను."

ఋషి ఇలా అన్నాడు, " మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!."

ఆ వ్యక్తి ఆసక్తిగా, "ఎలా మహానుభావా?" అని అడిగాడు.

దానికి ఋషి, "నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా, నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరిఉండేది. ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు." అని ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.

ఆ వ్యక్తి తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.

మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి మార్గదర్శనం చేయాలి

ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే.


🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼

Panchang


 

చిదంబరం - కుంచితపాదం

 *చిదంబరం - కుంచితపాదం*


 పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును). చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము. స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు. థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు. ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు. స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!

ALERT....ALERT....*

 🛑🛑🛑🛑🛑🛑🛑🛑

*ALERT....ALERT....*

*కొత్త సంవత్సరం అని శుభాకాంక్షలు చెప్పక పోతే కొంపలు మునిగి పోవు. ఏ ఉపద్రవాలు వచ్చేయవు. ఒక్క సైబర్ దెబ్బకు మీరు కేర్... కేర్.... మని ఏడ్వాల్సి రావచ్చు. పొంచి ఉన్న ప్రమాదం.*


 అందరూ వాట్స్ అప్ లేదా మేసేజ్ లతో ఈ సంవత్సరం వీడుకోలు, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పంపాలని ఉత్సాహం లో ఉంటారు.

దీన్నే సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందని హెచ్చరికలు జారి చేస్తున్నారు.మిమ్మల్ని ఎలా అయిన బురిడీ కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ కొత్త సంవత్సరం లో మోసపోయిన మొదటి వ్యక్తి మీరే కావచ్చు. అలా కాకుండా ఉండాలి అంటే.....

👺1.పొరపాటున కూడా ఎవ్వరూ వెబ్ సైట్ ల నుండి గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసుకోకండి.


👺2.మీ పేరు తో గ్రీటింగ్స్ ,లేదా మీ ఫోటో తో గ్రీటింగ్స్ తయారు చేస్తాం అనే వాటిని నమ్మి మొబైల్ లో లేదా కంప్యూటర్ లో ఎటువంటి వెబ్సైట్ లలో లాగ్ ఇన్ అవ్వకండి.యాప్ లను డౌన్ లోడ్ చేసుకోకండి. మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో మైక్,గ్యాలరి,స్టోరేజ్ కెమెరా,జీపీఎస్ ఇలా మనకు తెలియకుండానే వాటిని వినియోగించుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చేస్తాం.ఇవ్వాలి అక్కడితో ఇక సైబర్ నేరగాళ్ల ఇష్టం. (ఏది మంచిదో ,ఏది చెడ్డదో నిర్ణయం తీసుకోగలిగే తెలివి తేటలు మనకు ఉండవు.తెలిసే లోగా మొత్తం గోవిందా అవ్వవచ్చు)

👺3.మీకు వచ్చిన ఏ గ్రీటింగ్స్ ,లింక్ లు పొరపాటున కూడా ఓపెన్ చెయ్యవద్దు.

👺4.మీకు తెలియని నెంబర్ ఏదైనా , ఏ పేరుతో వచ్చిన అది అధారైజ్డ్ అంటూ SBI, ఆంధ్రాబ్యాంక్,ఇలా దేని పేరు తో వచ్చినా, లేదా మీ స్నేహితుడు మీ కుటుంబ సభ్యులు అంటూ మేసేజ్ వచ్చినా దాన్ని ఓపెన్ చెయ్యకండి.దాన్ని సెలెక్ట్ చేసి మొత్తం చాట్ నే డిలీట్ చేసేయండి.apk మీకు తెలియకుండా డౌన్ లోడ్ అవుతోంది.దాని పని అది చేస్తుంది.

👺5.మీ స్నేహితుడు,లేదా మీకు తెలిసిన వాళ్ళు అది ఎవ్వరైనా మీకు ఏదో పంపినట్టు వాట్స్ అప్ నుండి లేదా టెక్స్ట్ మేసేజ్ రూపం లో కానీ మేసేజ్ లు గ్రీటింగ్స్ అంటూ రావచ్చు. మీరు హడావిడి లో లేదా తెలియక అది ఓపెన్ చేస్తే అంతే మీ మొబైల్ లేదా కంప్యూటర్ హకర్ చేతుల్లోకి వెళ్లిపోవచ్చు.

👺6.మీరు ఎవ్వరికీ అయిన శుభాకాంక్షలు తెలుపాలి అంటే మొబైల్ లో కాల్ చేసి చెప్పండి.మీకు ఎవ్వరైనా చేస్తే అలాగే కాల్ లో శుభాకాంక్షలు తెలుపండి.

👺7.మీకు శుభాకాంక్షలు తెలిపేది ఎవ్వరైనా సరే వీడియో కాల్ వస్తే అనుమనించాల్సిందే!. వీడియో కాల్ ఆన్సర్ చేసేముందు మీ మొబైల్ కెమెరా ను వేలి తో మూసివేయ్యండి.తరువాత కాల్ లిఫ్ట్ చెయ్యండి.నమ్మకం గా అది మీ వాళ్లే అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే కెమెరా లెన్స్ పై చెయ్యిని తీయండి.

*భద్రత కోసం తెలియపరచబడింది*

🛑🛑🛑🛑🛑🛑🛑🛑

బలమును పెంచు సిద్ధ ఔషధయోగాలు

 శరీర బలమును పెంచు సిద్ధ ఔషధయోగాలు -


 *  నేలగుమ్ముడు చూర్ణము , ఆవు వెన్న , పంచదార కలిపి తినుచున్న బలము కలుగును.


 *  తాజా వెన్నను ఉదయమే తినుచున్న మంచిబలం కలుగును.


 *  ప్రతినిత్యం ఉదయం పూట నల్లనువ్వులు తిని చల్లని నీరు తాగుచున్న అవయవములకు మంచిబలం కలుగును.


 *  తాజా ఆవువెన్న , చక్కెర కలిపి తినుచున్న శరీరముకు మంచిబలం కలుగును.


 *  పెద్దపల్లేరు కాయలను ఆవుపాలతో 4 సార్లు ఉడికించి ఎండబెట్టి చూర్ణం చేసి పూటకు పావుతులము చొప్పున చక్కెరతో కొంతకాలం భుజించిన మంచిబలం కలుగును.


 *  మర్రిపండులోని గింజలు సేవించుచున్న బలం కలుగును.


 *  రావిగింజల చూర్ణం , పంచదార కలిపి సేవించుచున్న బలం కలుగును.


 *  పాలలో అతిమధురం చూర్ణం కలిపి తాగుచున్న శరీరానికి మంచి బలం కలుగును.


 *  రాత్రిపూట నీటిలో 4 ఖర్జూరాలు నానబెట్టి ఉదయాన్నే పిసికి ఆ నీటిని తాగుచున్న శరీరబలం పెరుగును .


 *  ద్రాక్షా లేదా కిస్మిస్ పండ్లు రాత్రంతా నీటిలో నానవేసి ఉదయాన్నే పిసికి తాగుచున్న శరీరానికి మంచిబలం వచ్చును.


 *  గొబ్బిగింజలు నీటిలో నానవేసి ఉదయాన్నే చక్కర కలిపి లోపలికి తీసుకొనుచున్న శరీర బలం పెరుగును .


         పైన చెప్పిన యోగాలన్నీ మనిషి శరీరం బలహీనత వల్ల శుష్కించిపోయినప్పుడు ఈ యోగాలలో మీకు సులభముగా ఉన్నదానిని ఆచరించి పోయిన శరీరబలమును తిరిగి పొందవచ్చును.



గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

మంగళవారం*🍁 *🌹31, డిసెంబర్, 2024🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

      *🍁మంగళవారం*🍁

 *🌹31, డిసెంబర్, 2024🌹*

      *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - శుక్లపక్షం*


*తిథి : పాడ్యమి* రా 03.21 వరకు ఉపరి *విదియ*

*వారం :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం : పూర్వాషాడ* రా 12.03 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*


*యోగం  : ధృవ* సా 06.59 వరకు ఉపరి *వ్యాఘాత(

*కరణం : కింస్తుఘ్న* సా 03.42 *బవ* రా 03.21 ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు*

*మ 12.00 - 01.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *రా 07.14 - 08.51*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.33*


*వర్జ్యం : ఉ 09.36 - 11.12*

*దుర్ముహూర్తం : ఉ 08.50 - 09.34 రా 10.54 - 11.45*

*రాహు కాలం : మ 02.58 - 04.22*

గుళికకాళం : *మ 12.11 - 01.34*

యమగండం : *ఉ 09.23 - 10.47*

సూర్యరాశి : *ధనుస్సు*

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.36*

సూర్యాస్తమయం :*సా 05.46*

*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.36 - 08.50*

సంగవ కాలం   :*08.50 - 11.04*

మధ్యాహ్న కాలం :*11.04 - 01.18*

అపరాహ్న కాలం : *మ 01.18 - 03.32*


*ఆబ్ధికం తిధి : పుష్య శుద్ధ పాడ్యమి*

సాయంకాలం  :  *సా 03.32 - 05.46*

ప్రదోష కాలం   :  *సా 05.46 - 08.20*

రాత్రి కాలం : *రా 08.20 - 11.45*

నిశీధి కాలం       :*రా 11.45 - 12.37*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.53 - 05.45*

_____________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    *🍁జై హనుమాన్🍁*


*ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం*

*చిరమిహ నిఖిలాన్భోగాన్భుక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి*



            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

     

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*  

<><><><><><><><><><><><><>  


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శాంతి మంత్రం

 ✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

           శాంతి మంత్రం

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*ఓం సహనావవతు | సహనౌ భునక్తు | సహవీర్యం కరవావహై!* 


*తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై ||*


*ఓం శాంతిః శాంతిః శాంతిః॥*


*ఇది కఠోపనిషత్తు యొక్క శాంతి మంత్రం. గురు శిష్యులు ఇద్దరూ కలిసి విద్యారంభ సమయంలో చదివే మంత్రం.  ఏ దోషాలు, విఘ్నాలు లేకుండా విద్యాభ్యాసన పూర్తవ్వాలని చేసే ప్రార్ధన. చాలామంది సహనా+భవతు అని చదువుతారు, కానీ అది సహన+అవతు.*


సహనౌ = మన ఇద్దరినీ; 

అవతు = రక్షించు గాక; 

సహనౌ = మన ఇద్దరినీ; 

భునక్తు = పోషించు గాక: 

సహ - కలిసి: 

వీర్యం = ఊర్జాశక్తితో; 

కరవావహై = పరిశ్రమిద్దాం గాక; అధీతం = స్వాధ్యాయం; 

నౌ = మనకు; 

తేజస్వి = తేజోవంతం; 

అస్తు = అగుగాక; 

మా విద్విషావహై = ద్వేషించుకొనకుండా ఉందుము గాక!!


*గురుశిష్యులైన మన ఇద్దరిని ఆ పరబ్రహ్మ రక్షించుగాకా! ఇద్దరినీ పోషించుగాకా! ఇద్దరమూ ఊర్జాశక్తితో పరిశ్రమిద్దాం గాకా! మన స్వాధ్యాయము (నేర్చుకునే విద్య) ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాకా! ఎన్నడు మనమిద్దరం పరస్పరం ద్వేషించుకొనకుండా ఉండెదము గాక..*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వే జనాః సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్ !!!*


*తత్సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!!*


*ఓం నమః శివాయ!!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️

(*సంకలనం : భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

☸️☸️☸️☸️☸️☸️☸️

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(ఆరవ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*మనువడు పరీక్షిత్తుని చూసి ధర్మరాజు ఉప్పొంగిపోయాడు. ఆ సందర్భంగా అనేక దానధర్మాలు చేశాడు. జోస్యులను రప్పించి, పరీక్షితుని జాతకాన్ని పరీక్షించి చెప్పమన్నాడు. పరీక్షించి వారిలా చెప్పారు. ‘‘పరీక్షిత్తు పరమ భాగవతోత్తముడు అవుతాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందుతాడు.’’ ధర్మరాజు ఆ మాటలకి ఎంతగానో ఆనందించాడు.‘ ‘ఇంకా వినండి మహారాజా! ఈ పరీక్షిత్తు ప్రహ్లాదునిలా మహా భక్తుడై మీ వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు తెస్తాడు. ఇక్ష్వాకులా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. శ్రీరాముడిలా పుణ్య పురుషుడవుతాడు. శిబిచక్రవర్తిలా మహాదాత అవుతాడు. పరాక్రమంలో సాటిలేని వాడయి, అనేక అశ్వమేధాలు చేస్తాడు. శుకయోగితో తత్త్వోపదేశం పొంది, గంగానదిలో దేహాన్ని త్యజించి, చివరికి విష్ణుపదం చేరుకుంటాడు.’’ అన్నారు జోస్యులు.*


*వారు చెప్పినట్టుగానే, ధర్మరాజు అనంతరం, పరీక్షిత్తు హస్తినాపురానికి రాజయ్యాడు. సమస్త భూమండలాన్నీ అనేక సంవత్సరాలు పాలించాడు. జగత్ప్రసిద్ధుడయ్యాడు. పరీక్షిత్తు భార్య ఉత్తరుని కుమార్తె ఇరావతి. వారికి జనమేజయుడు సహా నలుగురు కుమారులు జన్మించారు.*


*ద్వాపరయుగం ముగిసిపోయింది. కలియుగం ప్రవేశించింది. తన రాజ్యంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలుసుకున్నాడు పరీక్షిత్తు. అతన్ని నిలువరించేందుకు చతురంగ బలాలతో, శస్త్రాస్త్రాలు పూని బయల్దేరాడు. అవక్ర విక్రమంతో భద్రాశ్వకేతుమాల భారతోత్తర కురుకింపురుషాది వర్షాలన్నీ జయించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. హరి భక్తులకు అపరిమితంగా దానధర్మాలు చేశాడు. భగవద్భక్తితో రాజ్యపాలన చేస్తూ పూర్వీకుల కథలు వినసాగాడు. రోజులు గడుస్తున్నాయి.*


*ధర్మదేవత వృషభరూపం ధరించింది. ఒంటికాలిపై తిరగసాగింది. భూమాత గోవు రూపం ధరించింది. దూడను పోగొట్టుకున్నదానిలా దుఃఖించసాగింది. రెండూ కలుసుకున్నాయి ఓ రోజు. ఏడుస్తున్న గోవుని చూసి వృషభం అడిగిందిలా.‘ ‘ఎందుకు ఏడుస్తున్నావు?’’*


*‘‘ఏం చెప్పమంటావు? శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ వియోగాన్ని భరించలేకుండా ఉన్నాను. ఈ బాధ చాలదన్నట్టుగా ఇప్పుడు కలి ప్రవేశించింది.’’ అన్నది గోవు.*


*అవునవునన్నట్టుగా తలూచింది వృషభం. గోవును బాధగా చూసింది.‘ ‘అయినా నీకు తెలియనిది ఏముంది ధర్మమూర్తీ? మూడు పాదాలు పోగొట్టుకున్నావు. ఒంటి పాదం మీద నడుస్తున్నావు. ఎంత బాధ పడుతున్నావో! లోకంలో అవినీతి, అధర్మం పెచ్చు పెరిగిపోయాయి. ఇక దిక్కెవరు మనకి? అందుకే ఈ కన్నీరు.’’ అంది గోవు.*


*అప్పుడు ఆ రెండూ కురుక్షేత్ర ప్రాంతంలో సరస్వతినదీ తీరాన నిలిచి ఉన్నాయి. పరీక్షిన్మహారాజు అటుగా రాసాగాడు. వస్తున్న అతనికి ఓ దృశ్యం కనిపించింది. అబ్రాహ్మణుడొకడు, రాజులా వేషం వేసుకుని, కొరడా పట్టుకుని కొడుతూ, నిలిచి ఉన్న గోవునీ, వృషభాన్నీ కాళ్ళతో తంతున్నాడు. వృషభం చాలా తెల్లగా ఉంది. దానికి ఒకటే కాలు. అబ్రాహ్మణుడు హింసకి అది తట్టుకోలేక ఒంటి కాలితో పడుతూ లేస్తూ ఉన్నది. భయంతో మలమూత్రాలు విసర్జిస్తూంది. గోవు కూడా అతని హింసను భరించలేక ‘అంబా’ అని గగ్గోలు పెడుతూ కన్నీరు కారుస్తూంది.ఆ దృశ్యాన్ని తట్టుకోలేకపోయాడు పరీక్షన్మహారాజు.*


*పరుగున వచ్చాడక్కడికి.‘‘పాపాత్ముడా! ఎవడ్రా నువ్వు? చూస్తే రాజులా ఉన్నావు. చేసే పనేమో మూగజీవాల్ని హింసిస్తున్నావు. నిన్ను క్షమించ కూడదు. నీకు చావు తప్పదు.’’ అన్నాడు పరీక్షిన్మహారాజు. తెల్లగా వెలుగులీనుతున్న వృషభాన్ని చూశాడు. సాలోచనగా అన్నాడిలా.‘‘వృషభరాజా! ఎవరు నువ్వు? నిజం చెప్పు. నాకేమో నువ్వు వృషభరూపాన్ని ధరించిన ధర్మదేవతలా ఉన్నావు. మూడు కాళ్ళు ఎలా పోగొట్టుకున్నావు. ఒంటికాలి మీద ఈ కుంటి నడక ఎందుకు ప్రాప్తించింది? నిన్నిలా చేసింది ఎవరు? ఈ అబ్రాహ్మణుడా? చెప్పు, వెంటనే ఇతన్ని హత మారుస్తాను.’’ ‘‘మహారాజా! ధర్మాధర్మ విచక్షణ చేయగల మహనీయుడవు నువ్వు. నాకీ కష్టాన్ని కలిగించిందెవరో నీకు తెలియదా? తెలియకపోతే తెలుసుకో, తెలుసుకుని ఏం చేయాలో కూడా నువ్వే నిర్ణయించుకో.’’ అన్నది వృషభం.*


*ఆలోచించాడు పరీక్షిత్తు. సర్వం తెలుసుకోగలిగాడు. అనుమానం లేదు, ధర్మదేవతే ఈ వృషభం అనుకున్నాడు.*


*ధర్మదేవతకు నాలుగు పాదాలు. అవి: ఒకటి తపస్సు, రెండు శౌచం, మూడు దయ, నాలుగు సత్యం. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. త్రేతాయుగంలో మూడుపాదాలతో నడిచింది. ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడిచి, ఇప్పుడీ కలియుగంలో మూడు కాళ్ళు పోగొట్టుకుని, సత్యం అనే ఒంటికాలితో కుంటుతోంది. ఆ కాలుని కూడా తెగ నరికేందుకు ప్రయత్నిస్తున్నాడు కలిపురుషుడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయా స్వామి

 శ్రీ దత్త ప్రసాదం - 17 – మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయా స్వామి వారి మందిరాన్ని దర్శించుకున్న వ్యాసాశ్రమంలో శ్రీ స్వామివారి సహాధ్యాయి


2004 వసంవత్సరం మహాశివరాత్రి మరో పదిరోజులు ఉన్నదనగా...నేనూ మా సిబ్బంది మహాశివరాత్రి కి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించుకుంటూ ఉన్నాము..మధ్యాహ్నం నైవేద్యం హారతి కాగానే అర్చకస్వాములు మందిరం తలుపులు మూసేసి భోజనానికి వెళ్లిపోయారు..నేనొక్కడినే మందిరం లో కూర్చుని వున్నాను..ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు ఒకరు లోపలికి వచ్చారు..

బావి వద్దకు వెళ్లి, బకెట్ తో నీళ్లు తోడుకొని..కొన్ని నీళ్లు దోసిలి లోకి తీసుకొని నెత్తిన చల్లుకున్నారు..మరికొన్ని నీళ్లతో కాళ్ళు కడుక్కున్నారు..అక్కడినుంచి నేరుగా ప్రధాన మంటపం లోకి వచ్చి, శ్రీ స్వామివారి సమాధి గదికి ఎదురుగా నిలుచున్నారు..వారిని గమనిస్తూ ఉన్న నేను..వారి వద్దకు వెళ్లి..

"స్వామీ..ఇలా తిరిగి రండి..ఈ గర్భాలయపు మంటపం లో కూర్చోండి..అర్చకులను పిలిపిస్తాను..శ్రీ స్వామివారి మందిరం తలుపులు తీస్తారు..మీరు స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు.." అన్నాను..


నా వైపు సాలోచనగా చూసి..తలవూపి..నా వెనుకే వచ్చి..సమాధి మందిరపు మంటపం లో నిలుచున్నారు..అర్చకస్వామి ని పిలువమని మనిషి చేత చెప్పి పంపించి.."స్వామీ మీరెక్కడినుంచి వస్తున్నారు.."? అని అడిగాను.."హృషీకేష్ నుంచి"..అన్నారు..ఆయన వాలకం చూస్తుంటే ముభావంగా వున్నారు..ఏ ప్రశ్న అడిగినా ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నారు..చివరగా "భోజనం చేసారా..ఇక్కడ ఏర్పాటు చేయమంటారా?.." అన్నాను.."ఈరోజు మేము ఆహారం తీసుకోము..మీ భాషలో చెప్పాలంటే..ఉపవాసం.." అన్నారు..ఇక నేను ప్రశ్నలు వేయదల్చుకోలేదు..కొద్దిసేపటికే పూజారి గారు వచ్చి, శ్రీ స్వామివారి సమాధి మందిరపు తలుపులు తీశారు."మీరు వెళ్లి సమాధి దర్శనం చేసుకోండి.." అన్నాను..


దానికి అంగీకారంగా తలవూపి..సమాధి మందిరం గడప ఇవతల నిలబడి నమస్కారం చేసుకున్నారు..ముందుకు వంగి ఆ గడపకూ నమస్కారం చేశారు..మెల్లిగా కుడిపాదం లోపలికి పెట్టి..సమాధి వద్దకు వెళ్లారు..నేను ప్రక్కకు వచ్చేసాను..సమాధి వద్ద సుమారు పదిహేను నిమిషాల పాటు వున్నారు..


సమాధి దర్శనం చేసుకొని ఇవతలికి వచ్చి..మళ్లీ గడప దగ్గర నిలబడి మరొక్కసారి నమస్కారం చేసుకొని..నా దగ్గరకు వచ్చి..ప్రక్కనే ఉన్న చాపమీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..కొద్దిగా అవతల వైపు నేను కూర్చున్నాను..నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు.."నువ్వూ...?" అంటూ సందేహంగా అడిగారు..

నా పేరు చెప్పి..నేను శ్రీధరరావు ప్రభావతి గార్ల కుమారుడిని..అని చెప్పాను..ప్రస్తుతం ఈ మందిరం నిర్వహణ చూస్తున్నాను అనికూడా చెప్పాను..


అలాగా అన్నట్లు తలవూపి..నా దగ్గరగా జరిగి, నా ప్రక్కనే కూర్చుని.."ఈ స్వామివారు, నేనూ వ్యాసాశ్రమం లో ఒకే సమయం లో ఉన్నాము..సాధనా పద్ధతుల గురించి..మోక్షప్రాప్తి గురించి..అక్కడ మాకు బోధ జరిగేది..ఈయన చాలా చురుకుగా ఉండేవారు..గురువుగారు చేసిన బోధ లోని మర్మాలను ఇట్టే పసికట్టేవాడు..మళ్లీ మాకందరికీ విపులంగా చెప్పేవాడు..చక్కటి కంఠస్వరం..మా కందరికీ ఆశ్చర్యం గా ఉండేది..ఎటువంటి విషయమైనా ఒక్కసారి వింటే చాలు..తిరిగి యధాతధంగా అప్పచెప్పేవాడు..ఒకానొక సందర్భం లో ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా నియమిస్తే బాగుండునని మేమందరమూ తలపోసాము..ఆ మాటే చెప్పాము కూడా..ససేమిరా వద్దన్నాడు.."నేను ఆశ్రమ నిర్వహణ చేయను..చేయలేను..నాకు అతి త్వరగా మోక్షం కావాలి..నా సాధన అంతా అందుకొరకే"..అని తేల్చి చెప్పేసాడు..మహానుభావుడు..తన లక్ష్యం ఏమిటో చక్కగా తెలిసిన వాడు..అందుకనుగుణంగా తన జీవితాన్ని మలచుకున్నాడు.." అన్నారు..


"స్వామీ మీ పేరేమిటి..? ప్రస్తుతం మీరెక్కడ వుంటున్నారు..? స్వామివారి గురించి మరింత వివరంగా చెప్పగలరా..? " అన్నాను.."నేను ప్రస్తుతం హృషీకేశ్ లో ఒక ఆశ్రమం లో ఉంటున్నాను..వ్యాసాశ్రమం లో ఈ స్వామివారు గడిపింది చాలా కొద్దికాలమే..బహుశా రెండేళ్ల కాలం కాబోలు..మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో ఒకటి రెండుసార్లు కలిశాను..సిద్ధిపొందిన తరువాత ఒక్కసారి వచ్చి వెళ్ళాను..మళ్లీ ఇదే రావడం..ఈ స్వామివారికి కొంతకాలం సహాధ్యాయిగా ఉన్నానని ఒక తృప్తి ఉంది..మాలాంటి వారికి మార్గదర్శనం చేసాడు..సాధకుడి నడవడిక ఎలా ఉండాలో ఆచరించి చూపాడు..మళ్లీ ప్రాప్తం ఉంటే..మరోసారి వస్తాను..సాయంత్రం దాకా ఇక్కడ ధ్యానం చేసుకొని..రాత్రికి ఇక్కడే బస చేసి..రేపుదయం బయలుదేరి వెళ్లిపోతాను.." అన్నారు..వారికి అవసరమైన ఏర్పాట్లు చేసాను..తెల్లవారి మళ్లీ ఒకసారి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..వెళ్లిపోయారు..


స్వామివారి గురించి వారు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయాయి..


సర్వం..

దత్తకృప! 

రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్


(మందిర వివరముల కొరకు :

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)


----

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632


----

అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

 🙏అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి🙏..

ఉపమా కాళిదాసస్య

భారవే రర్థగౌరవం!

దండినః పదలాలిత్యం

మాఘే సంతి త్రయోగుణాః

పదలాలిత్యం అనేది దండి నుండి వచ్చిన గొప్ప కావ్య లక్షణం 

జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యాభిదాభవత కవీ ఇతి తతో వ్యాసే కవయస్త్వవి దండిని 

ప్రపంచం పుట్టాక వాల్మీకి కవి (ఏక వచనము)గా పేరు తెచ్చుకున్నాడు.వ్యాసుడు వచ్చాక కవీ (ద్వితీయ వచనము) అని, తరువాత దండితో కలిసి కవులు (బహు వచనము) అని పిలవటం జరిగింది. 

దండి రచించన రచనలు:

దశకుమారచరితము - కథా రూపంలో ఉన్న గద్య పద్యం.కావ్యదర్శ - లక్షణ గ్రంథము అవంతిసుందరికథ - ఒక గద్య పద్యం

ఛన్దోవిచితిః   కళాపరిచ్చేదము

ద్విసంధాన కావ్యము  వాతమందిరము.

వాటిలో మూడు చాలా ప్రసిద్ధమైనవి - దశకుమారచరితం, కావ్యదర్శము,, అవంతీసుందరికథ...

అవంతీసుందరి కథ ప్రకారం,  దామోదరుని నలుగురు కుమారులలో చిన్నవాడు వీరదత్తుడు, అతని కుమారుడు దండి. అతని తల్లి గౌరి. దామోదరుడు భారవరుడికి సన్నిహిత మిత్రుడని చెబుతారు. ఇతను కంచి రాజు, విష్ణు సింహం విష్ణువర్ధనుని సభా పండితుడు. దామోదర కుమారుడైన వీరేశ్వర దత్త కూడా సింఘా, విష్ణువుల కుమారుడైన మహేంద్రవర్మన్ సభలో పండితుడు. అదేవిధంగా, అతని కుమారుడు దండి మహేంద్రవర్మన్, అతని కుమారుడు నరసింహవర్మన్, అతని కుమారుడు రాజవర్మన్ సభకు అధ్యక్షుడిగా ఉన్నారు. నరసింహవర్మన్ పాలన కాలం సుమారు 747-782 AD. అదేవిధంగా అవంతీసుందరి కథలో తెలుపబడింది.ఇందులో వర్ణించబడిన కాదంబరి వర్ణన బాణుడు వర్ణించిన కాదంబరి వర్ణనను పోలి ఉంటుందని దీన్నిబట్టి తెలుస్తోంది. 715 సా.శ.లో బాణుడు దైవికం చెందాడని అంటారు.

దండి యొక్క సరళమైన భాష, ఇది రాజభవన గుణాలతో సమృద్ధిగా ఉన్నందున, ఇతను బాణడు తరువాత కాలం వాడని అనుకుంటారు. దండి సంస్కృత సాహిత్యంలో ఆరాధ్య కవి అని చెప్పబడింది -

కవితా కళా ప్రావీణ్యానికి మూడు ప్రధానమైన హేతువులుండాలని తొలిసారిగా ‘భామహుడు’ అనే ఆలంకారికుడు పేర్కొన్నారు. వీటినే కావ్య హేతువులు, కావ్య సామగ్రి, సాధన సామగ్రి పేర్లతో పిలుస్తారు.

1) ప్రతిభ

2) వ్యుత్పత్తి

3) అభ్యాసం అనేవి భామహుడు పేర్కొన్న కావ్య హేతువులు.ఈ మూడు లక్షణాలు సంపూర్ణంగా కలవాడు దండి మహాకవి 

దండి: ‘కావ్యాదర్శం’లో ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కావ్యమ్’.. మనోహరమైన అర్థంతో కూడిన పదాల సమూహమే కావ్యమన్నాడు. అందుకు అనుగుణంగా వ్రాసిన కావ్యం దశకుమార చరిత్ర. 

దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు ముందే దండి జీవించి ఉన్నడని అంటారు .దండం చేతిలో ఉన్న వాడిని దండి అంటారని మనకు తెలుసు .ముగ్గురు దండి లున్నారని మరో కధనం .దండి అనేది అసలు పేరుకాక పోవచ్చు .అయిదవ శతాబ్దికి చెందినా‘’సేతు బంధ ‘’కావ్యం లో కావ్యాదర్శాన్ని గురించి ఉంది కనుక అయిదు ఆరు శతాబ్దాల మధ్యకాలమే దండి జీవించిన కాలం అని గట్టిగా చెబుతున్నారు .

 ఈతడు దక్షిణాదికి చెందిన వ్యక్తి అని మాత్రమే తెలిసింది.

దండి యొక్క సరళమైన భాష, ఇది రాజభవన గుణాలతో సమృద్ధిగా ఉన్నందున, ఇతను బాణడు తరువాత కాలం వాడని అనుకుంటారు. దండి సంస్కృత సాహిత్యంలో ఆరాధ్య కవి అని చెప్పబడింది -

పదవ శతాబ్దము వరకు దశకుమార చరిత్రను ఎవరూ పేర్కొనక పోవటం విచిత్రమే .మరికొందరు కాళిదాసు సమకాలీనుడు అన్నారుకాని అది నమ్మ శక్యం కాని విషయమే .వచన కావ్యాలు ,అలంకార శాస్త్రమూ రాసి పేరుపొందాడు .సృజనకు మారుపేరుగా ఆయన వ్రాసిన ‘’దశ కుమార చరిత్ర ‘’నిలబడింది . దండి ని పదలాలిత్యానికి ఉదహరిస్తారు ‘’.కావ్యాదర్శం’’ అనే గొప్ప అలంకార శాస్త్రాన్నికవిత్వం గా సృష్టించాడు .ఇది మొదటి అలంకార శాస్త్రం గా గుర్తింపు పొందింది .తమిళ నాడులోని కాంచీపుర వాసి .భట్టి కావ్యాలకు ఈ అలంకార శాస్త్రం ప్రేరణ నిచ్చింది .ముప్ఫై ఆరు రకాల అలంకారాల గురించి చర్చించాడు .అలంకారాలు కావ్యానికి నిజమైన అలంకారాలని వాటి వలన శోభ కలుగుతుందని దండి భావన .సంక్లిష్ట సమాస రచన దండి ప్రత్యేకత .సుదీర్ఘ వాక్య విన్యాసం తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు .ఒక్కోసారి వాక్యం అరపేజీ దాకా ఉండేట్లు రాసిన సందర్భాలున్నాయి ..అనేక సంయుక్తపదాలను అలవోకగా వాడి నిండుదనాన్ని తెచ్చాడు .


దశ కుమార చరిత్రలో పది మంది యువరాజులు ప్రేమ ,రాజరిక అధికారం కోసం చేసే ప్రయత్నాల కధలుంటాయి .ఆ నాటి సమాజం లోని వివిధ అంశాలకు ప్రతి రూపంగా కమనీయమైన సంస్కృత వచన శైలితో దీనిని తీర్చిదిద్దాడు .సామాన్య జన జీవితాన్ని ప్రదర్శించాడు ఆ కధల్లో .ఇందులో పూర్వ పీఠిక ,దశ కుమార చరిత్ర ,ఉత్తర పీఠిక అని మూడు భాగాలున్నాయి .ముందే చెప్పినట్లు పదలాలిత్యానికి పట్టాభిషేకం చేశాడు దండి .అందుకే ‘’దండినః పదలాలిత్యం ‘’అంటారు.దండి 


దశకుమార చరిత్రం లో మొదటి రెండు అధ్యాయాల్లో ఉపోద్ఘాతంగ కధను చెప్పాడు. .ముసలి రాజు రాజహంస తన కుమారులు చాలాకాలం కనిపించక పోవటం తో ఒక మునీశ్వరుడిని అర్ధిస్తే, వాళ్లు పదహారేళ్ళ తర్వాత తిరిగి వస్తారని ఆయన సెలవి విచ్చాడు .అలాగే వారు చేరుకొని పెద్ద సైన్యం తో వచ్చి శత్రురాజు ‘’మనసార ‘’ను ఓడించి ,అనేక దేశాలను జయించి సుస్తిరం గా దేశసంచారం లో లభించిన విజ్ఞానంతో ప్రజారంజకం గా రాజ్య పాలన చేశారు .

ఆ మహాకవి వ్రాసిన దశకుమార చరిత్ర ప్రారంభ వాక్యాలు చూద్దాము. పదాలతో చేసిన విన్యాసం చూద్దాము.


బ్రహ్మాణ్డచ్ఛతదణ్ణఃశతధృతిభవనామ్భోరుహోనాలదణ్ణ: క్షోణీనౌకూపదణ్ణః క్షరదమర సరిత్పట్టికా కేతుడణ్ణ. జ్యోతిశ్చక్రాక్షదణ్ణస్త్రీభువనవిజయ సమ్భదండో బంఫ్రీదణ్ణః శ్రేయస్త్రి విక్రమ స్తే వితరతు విబుధ ద్వేషిణాం కాలదణ్ణః.


అస్తి సమస్తనగరీనిక పాయమాణా, శశ్వ దగణ్యపణ్య విస్తారితమణిగణాదివ స్తుజాత వ్యాఖ్యాతరత్నాకర మాహాత్యా మగధదేశ శేఖరీభూతా, పుష్పఫురీ నామ నగరీ తత్ర వీరభట పటలసలిలోత్తుఙ్గతుకఙ్గ తరఙ్గ కుజ్జరమకర భీషణ సకలరిపుగణ కటక జలనిధి మథన మన్దరాయమాణసముద్దణ్ణభుజదణ్ణ మణ్ణనః, పుర్వర పురాఙ్గణ వన విహరణ పరాయణ తరుణగణికాజన గీయమానయా –తిమానయా శరదిన్దు కున్ద ఘనసార నీహార హార మృణాళ మరాళ సురగజ నీరక్షీర గిరిశాట్టహాస కైలాస కాశ నీకాశ మూర్త్యా రచితదిగ స్తరాలవూర్త్యా భిత స్సుర భీతః, స్వర్ణోకశిఖరోరురుచిరరత్నరత్నాకరవేలామేఖలా వల యిత ధరణీరమణీసౌభాగ్యభోగభాగ్యవాస్, అనవరతయాగ...........


కేతన కవి తెలుగులోకి పద్య కావ్యం గా దశ కుమార చరిత్రను 1250లో అనువదించాడు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సంతోషదాయకంగా ఉంటుంది

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏 ❤️మంచి పని చేయాలనుకున్నప్పుడు వెంటనే చేసేయండి లేదంటే ఆ మంచిపని మరిచి పోయే ముప్పు ఉంది..మంచి ఆలోచనలు వెంటనే కార్య రూపంలోకి మార్చివేయాలి.. లేకుంటే ఆలోచనలు మనసు నుండి మారాలిపోతాయి❤️మధురమైన మనస్తత్వం కలిగిన ప్రియ మిత్రులారా ఇప్పడు కాకపొతే మరెప్పుడు ఉండదు.. రేపటి రోజుని ఎవరూ చూడగలరు.. మీరు ఏదయినా మంచి కార్యక్రమము చేయాలి అని అనుకుంటే ఈ రోజు కాదు, ఇప్పుడే అనుకున్న క్షణం చేసేయండి.. మరు క్షణం మనది కాదు❤️కఠినంగా ఉన్నదాన్ని సరళం గానూ, సరళంగా ఉన్నదాన్ని అలవాటు గానూ, అలవాటుగా ఉన్నదాన్ని ఆహ్లాదం గానూ తయారు చేసుకో...కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది..డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది..మనిషికి మనం ఇచ్చే విలువ మంచి స్నేహం ఏర్పడుతుంది..మంచి స్నేహం ఏర్పడితే జీవితం సంతోషదాయకంగా ఉంటుంది❤️❤️మీ అల్లం రాజు* భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ అండ్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరంబస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును* 🙏🙏🙏

Brahman marriage


 

తెలుగు భాష, సంస్కృతులకు

 telugukootami.org తెలుగు భాష, సంస్కృతులకు పూర్వ వైభవం తేవటానికి 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం  - ప్రతిపత్ - పూర్వాషాఢ -‌‌ భౌమ వాసరే* (31.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

యమలోకంబున శాంతి సౌఖ్యములు

 *యమలోకంబున శాంతి సౌఖ్యములు హృద్యంబౌచు దీపించెడిన్*

ఈ సమస్యకు నాపూరణ. 


*సహదేవుడు శకునితో* 


క్షమయే కావలెనంచు గోరెదవు శిక్షార్హుండవే, పాచికల్


శ్రమలేకుండగ వేసి మోసములనే క్షాళింతువే, వీరమున్


క్రమమౌ యుద్ధమె, గెల్చితీరవలెరా - కాదే వధింతున్ నినున్


యమలోకంబున శాంతి సౌఖ్యములు హృద్యంబౌచు దీపించెడిన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

పుష్యమాసం ప్రారంభం*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀నేటి నుండి…



         *పుష్యమాసం ప్రారంభం*

                ➖➖➖✍️

```

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.


ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. 


విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. 


ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్ధాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. 


శని ధర్మదర్శి! న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.


అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.  


పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.


అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి(సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.  


ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. 


పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.


ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. 


సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి,షట్తిలైకాదశి,కల్యాణైకాదశి అని పిలుస్తారు.


సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.


ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి, పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.


పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.


మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

⚜ శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం

 🕉 మన గుడి : నెం 975


⚜ కేరళ  : చెరుకున్ను, కన్నూర్


⚜ శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం 



💠 చెరుకున్నిలమ్మ ఆలయం అని కూడా పిలువబడే చెరుకున్ను అన్నపూర్ణేశ్వరి ఆలయం  కేరళలోని ఏకైక దుర్గా ఆలయం.  మలయాళంలో ‘అన్నం’ అంటే ‘ఆహారం’ మరియు ‘పూర్ణం’ (పూర్ణం) అంటే పూర్తి అని అర్థం.  

అన్నపూర్ణ అనే భావానికి అర్థం ఏమిటంటే, ప్రతి పేదవాడికి పరిమితి లేకుండా ఆహారం అందించేది.  విగ్రహం ఒక చేతిలో గరిటెతో ఉంటుంది.  బంగారు గరిటెతో అన్నపూర్ణ దేవత.


💠 చెరుకును అనే పేరు ఎలా వచ్చింది:

పేరుకు ఒక పౌరాణిక వెర్షన్ కూడా ఉంది, దీని ప్రకారం, భక్తులకు వండిన అన్నం (చోరు = వండిన అన్నం భోజనం మరియు కున్ను = కుప్ప/కొండ) ప్రసాదాలు (అన్న-ధనం) తో వడ్డిస్తారు మరియు అందుకే దీనిని ఉపయోగించారు.

 'చోరు-కున్ను' అని సంబోధించబడింది, ఇది సంవత్సరాలుగా సాధారణ వాడుకలో 'చెరుకున్ను'గా క్రమంగా రూపాంతరం చెందింది.

మరికొందరు చెరు అంటే చిన్నది లేదా చిన్నది అని, కున్ను అంటే చిన్న కొండ అని అంటున్నారు. 

ఈ ప్రదేశం చుట్టూ 5 చిన్న కొండలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతానికి చెరుకున్ను అనే పేరు వచ్చింది


🔆 స్థల పురాణం


💠 ఈ ఆలయం మొదట్లో వైష్ణవాలయం, ఈ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. తర్వాత అన్నపూర్ణేశ్వరి దేవిని ప్రతిష్టించిన చెరుకున్నిలమ్మ దేవత చేర్చబడింది.

 రెండు ప్రవేశ ద్వారం ఒకే పరిమాణం, ఆకారం మరియు ఒకే రకమైన రాళ్లతో తయారు చేయబడింది.

 ఆలయంలో దేవుడికి, దేవతలకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉందని దీన్నిబట్టి తెలుస్తోంది.


💠 పురాణం1:  

ఇది అధికారికంగా విష్ణు/కృష్ణ దేవాలయం, పురాణాల ప్రకారం పార్వతి/అన్నపూర్ణేశ్వరి తన ఇద్దరు సోదరీమణులు లేదా దేవి (కలరివతికల్ అమ్మ మరియు మడై కవైల్ అమ్మ) మరియు కృష్ణుడిని దర్శించడానికి విశ్వకర్మ నిర్మించిన బంగారు ఓడలో పడవ నడిపే వ్యక్తితో కలిసి కాశీ నుండి వచ్చారు. 

 ఆలయం, మరియు అజీ తీరం (ఆయిరం తెంగు) వద్ద దిగింది మరియు తిరిగి రాలేదు, కాబట్టి దేవిని  కాశీపురాతీశ్వరి అని కూడా అంటారు.  తరువాత కోలతిరి పాలక రాజు ఆమెను కొనసాగించాలని మరియు ప్రజలకు శ్రేయస్సు మరియు ఆనందంతో ఆశీర్వదించమని ప్రార్థించాడు.  

ఆమె అభ్యర్థనకు అంగీకరించింది.  


💠 అప్పటి నుండి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి స్వరూపాన్ని ధరించి చెరుకునులోని శ్రీకృష్ణ దేవాలయంలో స్థిరపడింది. ఆలయానికి అభిముఖంగా ఉండగా ఎడమవైపు కన్నాపురం గ్రామంగానూ, కృష్ణుడు కన్నాపురం గ్రామ పరిధిలోనూ ఉంటారని, అందుకే కన్నపురతప్పన్ అని, కుడివైపు చెరుకును గ్రామమని, అన్నపూర్ణ దేవిని చెరుక్కును గ్రామంగా పేర్కొంటారు.  

చెరుకున్నిల్ అమ్మ అని పిలుస్తారు.


💠 ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రతిరోజూ భక్తులకు ఉచిత భోజనం లేదా "అన్నదానం" అందించడం.  

కుల, మతాలకు అతీతంగా వందలాది మందికి ఆలయ ప్రాంగణంలో భోజనం వడ్డిస్తారు.


💠 ఈ ఆలయం ప్రస్తుతం మలబార్ దేవాసోం బోర్డు ఆధ్వర్యంలో ఉంది మరియు ఆలయ కమిటీచే నిర్వహించబడుతుంది. 

ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఇది ఒకే రకమైన రాతితో నిర్మించబడింది మరియు అన్నపూర్ణేశ్వరి మరియు కృష్ణన్ రెండింటి యొక్క శ్రీ కోవిల్ వాస్తు ప్రకారం ఒకే పరిమాణంలో ఉంది, ఇది దేవత మరియు దేవత ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఇవ్వబడిందని సూచిస్తుంది. 


💠 ఆలయ ప్రవేశం కృష్ణన్ శ్రీ కోవిల్ ముందు ఉంది మరియు అన్నపూర్ణేశ్వరి యొక్క శ్రీ కోవిల్‌కు నేరుగా ప్రవేశం లేకపోవడానికి కారణం, పురాతన కాలంలో, బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీలను నేరుగా చూడకూడదని నమ్ముతారు. (అంతర్జనం). 

అందుచేత శ్రీ కోవిల్ ఎదురుగా ఒక చిన్న కిటికీ ఉంది, దీని వలన ప్రజలు విగ్రహాన్ని బయట నుండి చూడవచ్చు.


💠 కేరళలోని రెండు అన్నపూర్ణేశ్వరి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. 

ఇది పాలిష్ చేసిన రాళ్లను ఉపయోగించి నిర్మించబడింది మరియు అవిల్ మరియు బేలం (చదునైన బియ్యం మరియు బెల్లం మిశ్రమం) ఉపయోగించి నిర్మించబడింది . 


💠 ఏప్రిల్‌లో జరిగే విషు విళక్కు ప్రధాన పండుగ.  ఇది ఒక వారం మొత్తం చెప్పుకోదగిన బాణాసంచా మరియు ఇతర రూప కళల ప్రదర్శనలతో జరుపుకుంటారు.  ఇది రాత్రంతా ఉల్లాసంగా ఉంటుంది.  


💠 ఆలయంలో జరుపుకునే ఇతర పండుగలు శివ రాత్రి, నవమి, ఏకాదశి మొదలైనవి.

మిథున మాసంలోని అవిట్టం నక్షత్రం రోజున భగవతి పుట్టినరోజు జరుపుకుంటారని కూడా చెబుతారు.


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -104*

 *తిరుమల సర్వస్వం -104*

*బంగారుబావి* 

వంటశాల మెట్లను ఆనుకొని, భూమి ఉపరితలం నుండి బంగారు తాపడం చేయబడి ఉన్న బావిని *"బంగారుబావి"* గా పిలుస్తారు. మహామణిమండపం నుండి బయటకు రాగానే, మన ఎదురుగా ఉన్న కటాంజనాలలో (లోహపు ఊచల పంజరం) దీనిని చూడవచ్చు. శ్రీవారి బోజనావసరాల నిమిత్తం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. అందువలన దీనికి *"శ్రీతీర్థం"* లేదా *"లక్ష్మీతీర్థం"* అనే నామాంతరాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఆ బావి శిథిలం చెందగా, తొండమాన్ చక్రవర్తిగా పునర్జన్మించిన రంగదాసు అనే శ్రీవారి భక్తుడు,, స్వామివారి ఆనతి మేరకు దీనిని పునరుద్ధరించాడు. శ్రీవారి అభిషేకానికి కావలసిన శుధోదకాన్ని వెయ్యేళ్ళ క్రితం వరకు పాపనాశన తీర్థం నుండి, ఆ తరువాత ఆకాశగంగాతీర్థం నుండి "తిరుమలనంబి" అనే భక్తుడు తీసుకు వచ్చేవారు. తరువాతి కాలంలో తిరుమలనంబి గురువుగారైన యామునాచార్యులవారు, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిచే నిర్మించబడిన తీర్థం స్వామివారి చెంతనే ఉండగా, వేరే తీర్థాలనుండి అభిషేకజలం తీసుకు రావాలసిన అవసరం లేదని భావించినప్పటినుండి, ఈ బంగారుబావి లోని పవిత్రజలాలను శ్రీవారి వంటకాలు, అభిషేక, అర్చనాదుల నిమిత్తం ఉపయోగిస్తున్నారు. ఈ బావిలోని నీరు "సుందరుడైన " స్వామివారికి ఉపయోగపడుతుంది కనుక దీనిని *"సుందరస్వామి కూపం"* లేదా *"సుందరబావి"* అని కూడా పిలుస్తారు. ఆ రోజుల్లో స్వామివారిని *"సుందరస్వామి"* గా కూడా కీర్తించేవారు. అయితే, శుక్రవార అభిషేకానికి మాత్రం ఆకాశగంగాతీర్థం నుండి మూడు బిందెల అభిషేకజలాన్ని "తోళప్పాచార్యులు" గా పిలువబడే తిరుమలనంబి వంశీయులు తెచ్చే సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. పూర్వకాలంలో ఈ బావి నుండి అమర్చిన రాతి కాలువ ద్వారా నీరు వంటశాల లోనికి నేరుగా చేరుకునేది. తరువాతికాలంలో నీటికుండలతో చేదటం ద్వారా, ప్రస్తుతం విద్యుత్ ద్వారా ఈ బావిలోని నీటిని తోడుతూ వంటలకు ఉపయోగిస్తున్నారు. వేలాది సంవత్సరాల క్రిత నిర్మించబడ్డ ఈ బావి ఇప్పటికీ పానయోగ్యమైన జలాన్ని ప్రసాదించటం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి మహాత్మ్యమే! ఈ మధ్యకాలంలో, కొండపై గుడి చుట్టూ అనేక నివాసగృహాలు రావడంతో నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉండటంవల్ల, సిమెంటు తాపడంతో ఆ అవకాశం లేకుండా చేసి పాపనాశన తీర్థంలోని నీటితో ఈ బావిని నింపుతున్నారు. 





*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

11-37-గీతా మకరందము

 11-37-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్

గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే | 

అనన్త దేవేశ జగన్నివాస 

త్వమక్షరం సదసత్తత్పరం యత్ || 

  

తా:- మహాత్మా! అనంతరూపా! దేవదేవా! జగదాశ్రయా! సత్, అసత్తులకు (స్థూలసూక్ష్మజగత్తుల రెండింటికిని) పరమైనట్టి అక్షర (నాశరహిత) పరబ్రహ్మ స్వరూపులు మీరే అయియున్నారు. బ్రహ్మదేవునకుగూడ ఆదికారణరూపులును, కనుకనే సర్వోత్కృష్టులు నగు మీకేల నమస్కరింపకుందురు? (వారి నమస్కారములకు మీరు తగుదురు అని భావము). 

  

వ్యాఖ్య:- ‘సదసత్తత్పరమ్’ - పరమాత్మ సత్, అసత్తులకు పరమైనవాడు. సత్ అనగా - స్థూలపదార్థము (లేక స్థూలజగత్తు). అసత్ అనగా సూక్ష్మపదార్థము, (లేక సూక్ష్మజగత్తు). ఆ రెండింటికిని పరమాత్మ విలక్షణమై పరమై వర్తించునని భావము. లేక ‘సత్’ అనగా మనస్సనియు, ‘అసత్’ అనగా దేహమనియు చెప్పవచ్చును. అపుడును ఇదియే అర్థమిచ్చును. స్థూలమగు భౌతికప్రపంచమైనను, సూక్ష్మమగు మనఃప్రపంచమైనను రెండును పరమార్థదృష్టిలో మిథ్యాభూతములే యగును. పరమాత్మయొకడే సత్యవస్తువు. కావుననే మిథ్యాభూతములగు ఆ దృశ్యజగత్తులకంటె ఆతడు పరమైనవాడని యిట పేర్కొనబడినది. 

    

ప్ర:- పరమాత్మ యెట్టివాడు?

ఉ:- (1) సర్వశ్రేష్ఠుడు (2) బ్రహ్మదేవునకున్ను ఆదికారణుడు (3) అనంతుడు (4) దేవతలకును ప్రభువు (5) జగదాశ్రయుడు (6) నాశరహితుడు (7) సదసత్తులకు పరమైనవాడు.

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*242 వ రోజు*

విరాటుడు, ఉపపాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకుని భీష్మునికి తోడుగా ఉన్న వారిపై లంఘించారు. భీష్ముడు ఏభై బాణాలతో అర్జునిని బాధించాడు. ఆ బాణములను లక్ష్య పెట్టక అర్జునుడు కౌరవ సేనలపై విజృంభించి వారిని తరిమి తరిమి కొట్టాడు. అర్జునుడు తన రధాన్ని కౌరవ సేనల మధ్యకు నడిపి వారిని విచక్షణా రహితంగా చీల్చి చెండాడాడు. రధికులను సారధూలను హయములను తెగ నరికాడు. అర్జునిని పరాక్రమానికి కౌరవ సేనలు భయపడ్డాయి. ఇది చూసిన దుర్యోధనుడు " అర్జునుడు మన సేనలను విచక్షణా రహితంగా చంపుతున్నాడు అతడిని ఎదుర్కొన గలిగిన కర్ణుని యుద్ధానికి రానివ్వక మీరూ ఇలా చూస్తూ ఊరు కోవడం ఏమన్నా బాగా ఉందా " అన్నాడు. భీష్ముడు " నా శాయ శక్తులా యుద్ధంచేస్తున్నా ఇలా అంటున్నాడేమిటి " అని అనుకుని అర్జునుని వైపు రథం మళ్ళించి వికర్ణుడు, అశ్వధ్ధామ వెంట రాగా అర్జునిపై ఒక్క సారిగా లంఘించి బాణ వర్షం కురిపించాడు. అర్జునునికి సాయంగా నకుల సహదేవులు, భీముడు, ధర్మరాజు వచ్చారు. అర్జునినికి గాంగేయునకు మధ్య పోరు లోకభీకరంగా జరిగింది. భీష్ముడు శ్రీకృష్ణుని గుండెలకు తాకేలా బాణప్రయోగం చేసాడు. అది శ్రీకృష్ణుని గుండెను చీల్చి రక్తం పైకి చిమ్మింది. అది చూసిన అర్జునుడు కోపంతో ఊగిపోతూ భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టడమే కాక అర్జునుని రథాన్ని శరములతో ముంచెత్తాడు. ఇలా ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుండగా మధ్యాహ్నం అయింది.


*పాంచాల సేనలు ద్రోణుల మధ్య సమరం*


మధ్యాహ్నసమయం వరకు యుద్ధం సాగిన పిదప ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ముందుకు రథాన్ని పోనిచ్చి ద్రోణుని తన నిశిత శరములతో నొప్పించాడు. ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుని సారథిని కొట్టి, తరువాత నాలుగు బణాలు వేసి అశ్వాలను చంపాడు. అతడి విల్లును నడిమికి విరిచి కేతనమును విరిచాడు అయినా ధృష్టద్యుమ్నుడు బెదరక అమిత కోపంతో ద్రోణుడిని ఎదిరించాడు. ద్రోణుని పైన శరపరంపర కురిపించాడు. ద్రోణాచార్యుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధృష్టద్యుమ్నునిపై శరపరంపర కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు వాటిని సర్ధవంతంగా ఎదుర్కొని ద్రోణిపై శరపరంపర కురిపించాడు. ఇలా ఇరువురి నడుమ భంయంకరమైన పోరు కొనసాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపై గదాయుధం ప్రయోగించాడు ద్రోణుడు దానిని పొడి చేసాడు. ధృష్టద్యుమ్నుడు బల్లెం విసిరాడు. ద్రోణుడు దానిని కూడా విరిచాడు. మరొక విల్లు తీసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణునిపైన శరపరంపర కురిపించాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని సారథిని, హయములను చంపి విల్లును విరిచాడు. ధృష్టద్యుమ్నుడు రథము దిగి గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుని పై విసిరాడు. ద్రోణుడు దానిని బాణములతో నుగ్గు చేసాడు. ధృష్టద్యుమ్నుడు కరవాలంతో విజంభించాడు. ఇలా ఇరువురి నడుమ ఘోర యుద్ధం కొనసాగింది. ద్రోణుని శరపరంపరకు ధృష్టద్యుమ్నుడు తట్టుకోలేక పోయాడు. ఇది చూసిన భీముడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ద్రోణునిపై ఏడు బాణములు వేసి ధృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసిన సుయోధనుడు కళింగ రాజుకు సైగ చేసి భీముని ఎదుర్కొనమని చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో॥ *స్వధీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణా|*

        *తపసశ్చ సుతప్తస్య తస్యాన్తో సుఖమేధతే||*


*తా|| "కష్టపడి నేర్చుకున్న విద్య, నేర్పుగా చేసిన యుద్ధం, శ్రద్ధాసక్తులతో జాగ్రత్తగా చేసిన పని, నియమనిష్టలతో చేసిన పూజ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి.... కనుక మంచి ఫలితం రావాలంటే ఎప్పుడూ, జాగ్రత్తగా, శ్రద్ధగా, పనిచేయాలి"*


✍️🌹🌷💐🙏

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం,డిసెంబరు31,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - శుక్ల పక్షం

తిథి:పాడ్యమి తె3.56 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:పూర్వాషాఢ రా1.04 వరకు

యోగం:ధృవం రా8.21 వరకు

కరణం:కింస్తుఘ్నం మ3.58 తదుపరి బవ తె3.56 వరకు

వర్జ్యం:ఉ10.20 - 11.58

దుర్ముహూర్తము:ఉ8.45 - 9.29

మరల రా10.44 - 11.36

అమృతకాలం:రా8.09 - 9.47

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్య రాశి: ధనుస్సు 

చంద్రరాశి: ధనుస్సు 

సూర్యోదయం:6.34

సూర్యాస్తమయం:5.32


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

 *మిట్టాపల్లి*

పదహారవ రోజు పాశురము*

 _*నేటి తిరుప్పావై పదహారవ రోజు పాశురము*_

 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*🌴పాశురం🌴*

 


     *నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ* 

    *కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్ఱుమ్ తోరణ*

    *వాశల్ కాప్పానే ! *మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్ ,*

    *ఆయర్ శిఱుమియరో ముక్కు , అఱైపఱై*

    *మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్ ,*

    *తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్ ,*

    *వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే , అమ్మా ! నీ ,*

    *నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.*

 


 *🌳భావం :🌳*



మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా ! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు *'పఱై'* అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.




 *☘️అవతారిక :☘️*




ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తియై యీ 16వ మాలికతో మూడవ దశ ప్రారంభమౌతుంది. నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి , అందరను వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి , వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి , అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానిని లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని' కదా ప్రతిజ్ఞ. దానినాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో , శూర్పణఖవలె పరాభవము నొందవలసిందేకదా ! అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండ పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా ! భగవంతుని చేరటానికి ముందు ఆచార్యు నాశ్రయించవలెను కదా ! నిరహంకారులై ఆచార్యునాశ్రయించినవారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతనిద్వారా శ్రీకృష్ణపరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు.


దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి , మొదట క్షేత్రపాలకుని దర్శించాలి. పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారినీ సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం వుంది. మనస్సునదుపులో వుంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది (పాశురంలో)         




*🌹16. వ మాలిక🌹*




*(ఖరహరప్రియ - ఏకతాళము)*



ప.. మా ప్రభుడౌ నందుని తిరు మాళగ రక్షించువాడ !

    సుప్రకాశ ధ్వజతోరణ ద్వారము గాచేటివాడ !

    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా !

    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా !


చ.. గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న

    అల్లన మ్రోగేటి వాద్య ముల్ల మలర నిత్తుననెను.

    చెల్లని మాటల నోటను మెల్లగ జెప్పగబోకుమ !

    నల్లనయ్య కృష్ణయ్యను మెల్లగ దర్శింపరాగ

    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా !

    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా !