24, జులై 2022, ఆదివారం

అనుమానం

 *దివ్యశ్రీనారాయణీయమ్* 

************************

*"అనుమానం పెనుభూతం" శ్రీకృష్ణుడు రాయబారం వహించడానికి హస్తినాపురం వెళ్లాడు. ముందుగా సభలో అందరికీ నమస్కరించి, అశ్వత్థామను సభ బయటకు పిల్చుకుని వెళ్లాడు. క్షేమ సమాచారం ముచ్చటించిన తర్వాత తనచేతి ఉంగరాన్ని కిందికి జారవిడిచాడు. దుర్యోధనుడు ఇదంతా ఒకకంట గమనిస్తూనే ఉన్నాడు. ఉంగరం పడిపోయిందని అశ్వత్థామ కిందికి వంగి తీసివ్వబోగా కృష్ణుడు గమనించనట్టు నటించి ఆకాశం వైపు చూపిస్తూ ఏదో మాట్లాడటం మొదలు పెట్టాడు. కృష్ణుడేం చూపిస్తున్నాడో.. అర్థం కాక అశ్వత్థామ కూడా ఆకాశం వైపు చూసి మాట్లాడుతూ, వేలికి ఉంగరం తొడిగాడు. ఇదంతా గమనించిన దుర్యోధనుడు, మరోలా అర్ధం చేసుకుని 17 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామను ఒక్కరోజూ సర్వ సైన్యాధిపతిగా నియమించ కుండా చేశాడు. యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేలపై పడ్డాడు. అప్పుడు అశ్వత్థామ సుయోధనా! నేను చిరంజీవిని. పైగా శస్త్రాస్త్రాలలో అర్జునుడితో సమానమైన వాణ్ణి. నన్ను సైన్యాధిపతిని చేసి ఉంటే పాండవులనందరినీ హతమార్చేవాణ్ణి. నీకీ దుస్థితి కలిగేది కాదు' అంటూ విలపించాడు. దుర్యోధనుడు 'కానీ నువ్వు రాయబారం నాడు శ్రీకృష్ణుడికి నింగీ నేలా సాక్షిగా పాండవుల విజయానికే సహాయపడతానని మాట ఇచ్చావు కదా! అందుకే నిన్ను దూరం పెట్టాను' అన్నాడు. అది విన్న అశ్వత్థామ విరక్తిగా నవ్వి 'విధి వైపరీత్యం దుర్యోధనా! ఇది ఆ జగన్నాటక సూత్రధారి పన్నాగం. నీకు నా మీద కలిగిన అనుమానమే నీ ఓటమికి కారణమైంది' అంటూ ఆనాడు జరిగిందేమిటో వివరించాడు.* *కనుక అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలి. అంతేగానీ లోలోపలే రగిలిపోతే నష్టం తప్పదు. అనుమానం పెనుభూతమని రుజువు చేసే ఘటన ఇది.*

జీవన సాఫల్యానికి కావలసిన

 సైకిలు పెడలు - సంప్రదాయాలు 


(పరమాచార్యులవారు చెబుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం)


ఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది.


ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు, బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిభకు కావలసిన మార్కులకంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్నివందలరెట్లు ఎక్కువగా ఉంటుంది.


ఇలా జరుతుండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఏ విశేష కారణమూ కనిపించటంలేదు. ఆచారాలూ, అనుష్టానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకూ ఇతరుల పిల్లలకూ ఏమీ తేడా ఉండట్లేదు. పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లలకంటే ఇతరులే బాగా ఉంటున్నారు. మరి బ్రాహణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ కనపచటానికి మూలకారణం ఏదయ్యుంటుంది ? మనం దాన్ని కనుగొనాలి.


భగవంతుడు పక్షపాతి కాడు. బ్రాహ్మణులు ఆచారాలూ, అనుష్టానాల విషయంలో ఇతరులకన్నా వేరు కాకపోయినా, కొన్ని విషయాలలో ఇతరులకన్నా దిగదుడుపే అయినా, భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు ?

పూర్వీకులు సైకిలు త్రొక్కడం చేత. 


మనకు మూడుతరాల క్రితం జీవించిన మన పూర్వీకులు, జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందటానికి అవసరమైనదానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అనే సైకిలు త్రొక్కారు. ఈరోజు మనం ఏ కర్మానుష్టానమూ లేకుండా కేవలం హ్యాండిలు పట్టుకుని వారి (మన పూర్వీకుల) మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాము.


వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు నిద్రలేచేవారు. మనం సాధారణంగా సూర్యోదయం తరువాతే నిద్ర లేస్తాం. వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది. మన కాలంలో సకాల సంధ్యావందనం చేసే వాడిని వెతకవలసి వస్తోంది.


వారి కాలంలో ఉదయ సాయంకాలాలలో జనులు సంధ్యావందనములకై గుమికూడేవారు. మన కాలంలో ప్రొద్దున్న ఒక క్లబ్బులోనూ సాయంత్రం వేరే క్లబ్బులోనూ గుమికూడతాము. ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము. ఆత్మశక్తిని కోల్పోయి, ఆత్మను బలహీనం చేస్తాము.


ఈ భూమిలోని ఇతర మతస్తులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం, కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్ధ్యాలతో, అకారణంగా మన వద్దనుండి మొత్తం రాజ్యం లాగివేసుకున్నారు.

బుక్కరాయల గురువైన విద్యారణ్యస్వామి, శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు, కర్మానుష్టానపరులు, భగవదనుభవం అయినవారు. వారు మన ధర్మాన్ని పాడుచేసిన విదేశీయుల కరాళనృత్యాన్ని నాశనంచేసి, మన ధార్మికమైన రాజ్యాన్ని పునః స్థాపించారు.


నాగరికతా ? జంతుప్రవర్తనా ? 


మనకు మూడుతరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోనివారు లేరు. మట్టి, నీటిపాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. మనం నాగరీకులమయ్యాము. మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదలివేశాము. మనం జంతువులమయ్యాము. ఇది మన నాగరీకత.


ప్రథమ ఆచారమైన శౌచం వదలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా, బూడిదలో (అగ్నికి బదులు) హోమంచేయటంతో సమానం.


మూడుతరాల క్రితం వారు త్రొక్కిన ఫలం ఎంతవరకూ ఉంటుంది ? త్రొక్కకుండా ఉన్న సైకిలు ఎంత దూరం పరిగెడుతుంది ? వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది. మా చిన్నప్పుడు బ్రాహ్మణుల పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళల్లో కనిపించుటలేదు. అలాగే చదివే సామర్థ్యమూనూ.


కాబట్టి, తరువాతి తరాల వారు భగవదనుగ్రహమూ, బ్రహ్మ తేజస్సూ, మేధాశక్తీ కోల్పోకుండా ఉండాలంటే, మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే, మనం "ధర్మశాస్త్ర సైకిలు" లోని "కర్మానుష్టాన చక్రమును", "ప్రవర్తన పెడలు" త్రొక్కడం ద్వారా త్రిప్పుతూ ఉండాలి.


--- “జగద్గురుబోధలు”,

మృత్యుంజయ హోమం

 మృత్యువు - మృత్యుంజయ హోమం


“మృత్యుంజయ హోమం ఏమి చెయ్యాల్సిన పనిలేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు” మహాస్వామివారు నోటి నుండి వచ్చిన మాటలు. అవును ఖచ్చితంగా ఇంకో వందేళ్ళు బ్రతుకుతాడు అతను.


పరమాచార్య స్వామివారు నేరూర్ సదాశివ బ్రహ్మేంద్రుల అధిష్టానం దర్శనానికి వెళ్ళారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారంటే మహాస్వామి వారికి చాలా భక్తి, గౌరవం. కేవలం వారి పేరు వింటేనే చాలు స్వామివారు పొంగిపోయేవారు. వారి కళ్ళు ఆర్ద్రతతో నిండిపోయేవి.


మహాస్వామివారు అధిష్టానం ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు, స్వామివారి సేవకులు మహాస్వామి వారికి కొద్ది దూరంలో నిలబడ్డారు. శ్రీమఠం సాంప్రదాయం ప్రకారం, స్వామివారు అధిష్టానం ముందు జపం చేసుకుంటుండగా ఎవరూ చూడరాదు. అది మహాస్వామి వారు మనవాతీతమైన విశ్వంలోని శక్తిని సర్వ మానవాళి క్షేమం కొరకు ధ్యానించే సమయం. అది కూడా మనలాంటి వారి మంచి కోసమే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వంద వ్యాట్ల శక్తిని చూసే మన నేత్రాలు లక్ష వ్యాట్ల శక్తిని చూసి తట్టుకోగలవా?


అప్పుడే పరమాచార్య స్వామివారి భక్తుడు రంగస్వామి అక్కడకు వచ్చారు. “నేను వెంటనే పరమాచార్య స్వామివారిని దర్శించుకొని, ప్రసాదం తీసుకోవాలి” అని అక్కడున్న సేవకులతో చెప్పారు. వారు వెంటనే, “స్వామీ, మహాస్వామి వారు అధిష్టానం లోపల కూర్చొని తలుపులు మూసి ఉండగా ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరూ స్వామివారిని దర్శించకూడదు. స్వామివారి ధ్యానం ముగిసిన తరువాత మొదట మిరే దర్శనం చేసుకుందురు గాని. ఇప్పుడు కాదు” అని నిలువరించారు.


రంగస్వామి మామూలుగా ఇలా చెప్తే వినేరకం కాదు. చాలా మొండి వాడు. కాని వారి సమాధాంనంతో కాస్త మెత్తపడినట్టే కనిపించాడు. ఇంతలో సేవకులందరూ మాటల్లో పడ్డారు. ఇదే అదనుగా భావించి, రంగస్వామి క్షణాల్లో అధిష్టానం లోపలికి వెళ్ళాడు. అక్కడున్న వారందరూ అతని చర్యకు కలవరపడ్డారు.


సరిగ్గా అప్పుడే అధిష్టానం నుండి ఎప్పుడూ వినని మహాస్వామివారి స్వరం వినబడింది. “మృత్యుంజయ జప హోమం ఏమి చెయ్యాల్సిన పనిలేదు. మృత్యువు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు” అని.


రంగస్వామి వెంటనే అధిష్టానం బయటకు వచ్చేసాడు. శిష్యులందరూ అతణ్ణి చుట్టుముట్టారు. జరిగిన విషయం అంతా చెప్పాడు. “రంగస్వామి దగ్గరి బంధువులొకరికి ఎక్కువగా ఛాతినొప్పి రావడంతో నలభై ఎనిమిది గంటలు గడిచే దాకా ఏమి చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. వెంటనే మృత్యుంజయ హోమం చెయ్యాల్సిందిగా జ్యోతిష్కులు చెప్పారు.


రంగస్వామి మిత్రులొకరు వెంటనే పరమాచార్య స్వామీ వారిని దర్శించి ప్రసాదం తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. మరొక ముసలావిడ స్వామివారు నేరూర్ దగ్గర ఉన్నారని, తాము దర్శనం చేసుకుని వచ్చామని, స్వామివారు అన్నీ చూసుకుంటారని చెప్పడంతో, పరుగుపరుగున మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు రంగస్వామి”


అతని అదృష్టానికి స్వామివారే అతనితో స్వయంగా మాట్లాడి ఆశీర్వదించి పంపారు. రంగస్వామి ఇంటికి చేరగానే అతని బంధువు మంచంపై కూర్చొని చక్కగా నవ్వుతున్నాడు.


“అవును. అతను ఖచ్చితంగా ఇంకొక వందేళ్ళు బ్రతుకుతాడు”


--- రాయవరం శ్రీ బాలు, శ్రీమఠం. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

ప్రాణులు శ్రేష్ఠములు

 భూతానాం ప్రాణినః శ్రేష్ఠా : ప్రాణినాం బుద్ధిజీవినః |

బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠా నరేషు బ్రాహ్మణాః స్మృతాః || (1 - 96)


భూతములలో ప్రాణులు శ్రేష్ఠములు. ప్రాణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠమైనవి. బుద్ధిమంతులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు.


నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడటం బ్రాహ్మణుల సహజ లక్ష్యణం మరియు 

సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం.


మన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన *ఎందరో  మహానుభావులు అందరికి వందనాలు*. 🙏🙏


యస్. చంద్రకాంతరావు 

              న్యాయవాది

ప్రశాంతి హిల్స్, మీర్‌పేట్.

తల్లి కొరకు

 *తల్లి కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి*


*విచిత్ర సంఘటన*


*సౌదీ రియాద్ హై కోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది. జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు. అన్న వయస్సు 80 సం. రాలు తమ్ముని వయస్సు 70 సం. రాలు. బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది. ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు.* *వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువగా లేవు. కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన అన్న వద్ద తల్లి ( 110 సం. రాలు. ) గత 40 సం. రాలుగా ఉంటుంది*. *ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు. తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లి ని తన వద్ద పంప మని* *సంవత్సరాల తర బడి ప్రాధేయ పడ్డా కూడా తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడి గా అడిగాడు ఇద్దరూ కూడా తల్లి తన వద్దనే ఉండాలని పట్టు బడ్డారు.* *తుదకు తల్లిని స్టేచర్ లో కోర్టులో హాజరు పర్చారు. జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని. తల్లి తన ఇద్దరు* *కుమారులు సమానమే. ఆమె ఏమీ చెప్పలేదు మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచ లేను అంది.*

*జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కూలి పోయాడు. ఇదీ ప్రేమ అంటే.*

*ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించ లేక కొట్టి చంపడమో, లేక వృద్ధాశ్రమం లో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము, కానీ ఇటువంటి కేసు వినలేదు. తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు. అందుకే తన పిల్లలకు చిన్నప్పటి నుండి ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించి నట్లు బోధించాలి.*

             🙏🙏🙏


👌👍...సేకరణ

భగవంతుడి ఉనికి

 శ్లోకం:☝️

  *న కాష్టే విద్యతే దేవో*

*న పాషాణే న మృణ్మయే l*

  *భావే హి విద్యతే దేవ-*

*స్తస్మాద్భావో హి కారణం ll*

    - చాణక్య నీతి


భావం: భగవంతుడి ఉనికిని చెక్కలోనో రాయిలోనో మట్టిముద్దలోనో వెతకడం వ్యర్ధం. భక్తుని యొక్క భావంలోని దివ్యత్వమే ఆయా మూర్తులలో  మూర్తీభవిస్తుంది. మన మనోభావనలే అన్నిటికి కారణం.