22, ఏప్రిల్ 2022, శుక్రవారం

కోడిమాంసం సంపూర్ణ వివరణ

 కోడిమాంసం సంపూర్ణ వివరణ  - 


      కోడిని సంస్కృతము నందు కుక్కుటము అని పిలుస్తారు . ఇది జిగటగా , స్నిగ్దముగా ఉండును. ఉష్ణవీర్యముగా ఉండును. కంటికి హితముగా ఉండును. అనగా నేత్రసంబంధ సమస్యలతో ఇబ్బందిపడువారికి ఇది హితము కలిగించును. వీర్యవృద్ధిని కలిగించును. కఫోద్రేకము కలిగిచును . కోళ్ళలో ఆడకోడి , మగకోడి రెండు బేధములతో ఉండును. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కోడిని విష్కిర జంతువులలో ( అనగా కాలితో నేలను చిమ్మి అందుండు పురుగులు మొదలయిన వానిని తినేవి ) చేర్చడం జరిగింది . విష్కిర జంతువుల మాంసం సాధారణముగా శుక్రవృద్ధిని  కలిగించునదిగాను, కొంచం  వగరు , తీపి రుచులు కలదిగాను , చలువనిచ్చి , ఇంపుగా ఉండునదిగా వర్ణించబడినది. 


 

 *  కోడిపుంజు మాంస విశిష్టత  - 


        ఇది మిగుల శ్రేష్టమైనది . అందులోనూ కూతపెట్టని పుంజుమాంసం బలకరం . రక్తవృద్ధిని ఇచ్చి వాతవ్యాధులను , ఉదరశూల పోగొట్టును . సమశీతోష్ణత కలిగించును. ఏ కారణము చేతనైనను రక్తము తగ్గి కృశించి పోవువారికి సాధారణముగా వేడి శరీరతత్వము కానివారు కోడిమాంసం తినవచ్చు . ప్రాయపు పుంజుమాంసం అధిక బలకరము , దేహబుద్ధి పెంచును . వీర్యవృద్ధి కలిగించును. కాసరోగముచే కృశించువారికి ఇది హితము . వాతప్రకృతి కలవారికి అనుకూలత ఇచ్చును . ముదురుకోడిపుంజు మాంసం శరీరం నందు అమితముగా ఉష్ణమును పెంచును . ఉష్ణముతో వచ్చు శ్లేష్మముకూడా పెరుగును . దీనిని తీసుకోకపోవడము ఉత్తమం . దీనికి పులుసు విరుగుడు. 


 * కోడిపెట్ట మాంస విశిష్టత  - 


        ఇది స్నిగ్దముగా , హితముగా , రుచికరంగా , వాతశ్లేష్మ హరముగా ఉండును. గురుత్వము ఇచ్చును. వీర్యపటిమ , దేహబలము , రక్తవృద్ది ఇచ్చి కన్నులకు మేలు చేయును . కొడిపెట్ట మాంసం చక్కగా పక్వము కాకున్నచో విరుద్ధగుణములు ఇచ్చును. ముసలి పెట్ట మాంసం ఉదరవ్యాధులు , శూలలు మున్నగువానిని పోగొట్టును . వీటిలో పిల్లలమాంసం నీరసముతో ఉన్నవారికి హితము . ఇది విరేచనకారి . ముసలిపెట్ట మాంసం విరేచనబద్ధం , లేతకొడిపెట్ట మాంసం అత్యుష్ణము . ముదురుది శ్వాసకాసలను హెచ్చించును. దీనికి విరుగుడు పులుసు . 


         పైనచెప్పిన ఔషధ విలువలు అన్నియు దేశివాళి కోళ్లకు సంబంధించినవి . ఇప్పుడు మనకి లభ్యం అయ్యే బాయిలర్ కోళ్ళకి త్వరగా పెరగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వాటిని మనం ఆహారంగా తీసుకుంటున్నాము . అలా ఆ కృత్రిమ హర్మోన్స్ మనశరీరములోకి ప్రవేశించి విపరీత ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యముగా ఆడపిల్లలు సాధారణ వయస్సు కన్నా ముందే పుష్పవతులు ( Matured ) అవ్వడం జరుగుతుంది. పెద్దవారిలో హర్మోనల్  inbalance అవ్వడం జరుగుతుంది.  


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  .  మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

అమాయ‌క‌త్వంలోని ర‌హ‌స్యం

 ఈ మ‌ధ్య రిక్లైన‌ర్‌లో కాళ్లు చాపుకుని సినిమా చూస్తుంటే గ‌త‌మంతా గుర్తుకొచ్చింది.. మా ఊళ్ళో నేల 0.40 , బెంచి  0.75, కుర్చీ రూ.1.50 రూపాలయల రోజులవి. అ థియేట‌ర్ల ప్ర‌త్యేక‌త ఏమంటే టికెట్లు ఇస్తూనే వుంటారు. 


నేల ఫుల్‌గా నిండి ఒక‌రి భుజాల మీద ఇంకొక‌రు కూచున్నా బుకింగ్ ఆగ‌దు. లోప‌ల భీక‌ర యుద్ధాలు జ‌రుగుతున్నా గేట్ కీప‌ర్ చ‌లించ‌డు. బెంచ్ క్లాస్‌లో అయితే ఎగ‌స్ట్రా బెంచీలు, బాల్క‌నీలో ఇనుప కుర్చీలు వేస్తారు. నేల‌కి ఆ సౌక‌ర్యం లేదు. ఒక‌రి మీద ఇంకొక‌రు , ఎవ‌రి మీద ఎవ‌రు కూచున్నారో వాళ్ల‌కు కూడా తెలియ‌దు. కొంద‌రైతే స్క్రీన్ ముంద‌రున్న అరుగు మీద కూచుని కొండ‌ల్లా క‌నిపించే హీరో ముఖాన్ని చూసి జ‌డుసుకునే వాళ్లు. ఆడ‌వాళ్ల నేల‌క్లాస్‌లైతే కుళాయి నీళ్ల‌లా ధారాపాతంగా బూతులు, కొంద‌రైతే జుత్తు ప‌ట్టుకుని ఉండ‌ల్లా దొర్లేవాళ్లు. ఫ‌స్ట్ షోకి వ‌చ్చిన ఆడవాళ్లు సెకెండ్ షో వ‌ర‌కూ తిట్టుకునే వాళ్లు.


ఈ ఉత్పాతంలో సినిమా స్టార్ట్ అయ్యేది. ఊపిరాడ‌ని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగ‌రెట్లు ముట్టించి "బుస్‌"మ‌ని పొగ వ‌దిలేవాళ్లు. తాగిన వాళ్ల‌కి, తాగ‌ని వాళ్ల‌కి స‌మానంగా ద‌గ్గొచ్చేది. సినిమా మాంచి ర‌సప‌ట్టులో అంటే ఎన్టీఆర్ క‌త్తిని ముద్దు పెట్టుకుని ఒంటిచేత్తో తిప్పుతున్న‌ప్పుడు రెండు ఈల‌లు, ఆయ‌న డూప్ రెండు చేతుల‌తో తిప్పుతున్న‌ప్పుడు ప‌ది ఈలలు వినిపిస్తూ వుండ‌గా అంద‌రినీ తొక్కుతూ కొంద‌రు ప్ర‌వేశించేవాళ్లు.


"ఎవ‌రిక‌యా నిమ్మ‌సోడా" అని ఒకడు, "వేయించిన శ‌న‌క్కాయ‌లూ" అని ఇంకొక‌డు, "చ‌క్కిలం, చ‌క్కిలం" ఇలా రాగ‌యుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ల‌కి కుయ్యిమ‌ని సౌండ్‌తో సోడా, తుప్పు ప‌ట్టిన పావుతో శ‌న‌క్కాయ‌లు కొలిచి ఇచ్చేవారు. ఇంత ఇరుకులో కూడా ప‌ద్మ‌నాభం, రాజ‌బాబు వ‌స్తే జ‌నం ప‌కప‌క న‌వ్వేవాళ్లు. అంజ‌లిదేవిని చూసి ఏడ్చేవాళ్లు.


ఇక బెంచిల్లోకి వెళ్దాం. థియేట‌ర్ పుట్టిన‌పుడు కొన్ని వేల న‌ల్లులు బెంచిల్లోకి వ‌ల‌స వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల రాక కోసం ఎదురు చూస్తూ, వ‌చ్చిన వెంట‌నే కుటుంబ స‌మేతంగా దాడి చేస్తాయి. మొద‌టిసారి పిర్రకు కుట్టిన‌పుడు ఉలిక్కిప‌డ‌తాం. రెండోసారి ప‌డ‌తాం. త‌ర్వాత అల‌వాటు ప‌డ‌తాం. ఆ దుర‌ద‌కు త‌ట్టుకోలేక కొంద‌రు లేచి నిల‌బ‌డి గీరుకుంటారు. వెనుక ఉన్న వాళ్లు కూచోమ‌ని అరుస్తూ వుంటారు.


కొంద‌రు సీనియ‌ర్ ప్రేక్ష‌కులు ఉంటారు. వాళ్ల‌కి న‌ల్లుల‌తో అనుభ‌వంతో పాటు శాశ్వ‌త శ‌త్రుత్వం వుంటుంది. అందుక‌ని అగ్గిపుల్ల గీచి బెంచి సందుల్లో తిప్పుతారు. దీంతో ప్ర‌యోజ‌నం ఏమంటే కొన్ని న‌ల్లులు వీర‌మ‌ర‌ణం పొందుతాయి. అయితే క‌సి, ప‌గ‌, ప్ర‌తీకారంతో మిగిలిన‌వ‌న్నీ కుట్ట‌డం ప్రారంభిస్తాయి. ఈ కుట్ల‌కి ప్రేక్ష‌కులు బెంచీల మీద ఎగిరెగిరి ప‌డుతూ వుంటారు. ఈ క్లాస్‌లో కూడా పొగ ఉచితం. బీడీల కంపు త‌క్కువ‌, సిగ‌రెట్ల కంపు ఎక్కువ‌.


బాల్క‌నీలో కుర్చీలు ఉంటాయి. వాటి చ‌ర్మం చిరిగిపోయి లోప‌లున్న కొబ్బ‌రి పీచు, దూది పొట్ట‌పేగుల్లా క‌నిపిస్తూ వుంటాయి. కుర్చీల్లో పెద్ద‌గా న‌ల్లులుండ‌వు. కానీ మేకులుంటాయి. అవి మ‌న బ‌ట్ట‌ల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్ర‌త్త‌గా లేస్తే ప‌ర్‌మ‌ని సౌండ్. బాల్క‌నీలో ప్రొజ‌క్ట‌ర్ రూమ్ కూడా వుంటుంది. సోడాలు, శ‌న‌క్కాయ‌ల ట్రాఫిక్ పెరిగిన‌ప్పుడు వాళ్ల త‌ల‌కాయ‌లు స్క్రీన్ మీద క‌నిపిస్తూ వుంటాయి.


అన్ని క్లాస్‌ల్లోనూ ఫ్యాన్లు వుంటాయి. అయితే ఫ్యాన్ కింద సీటు సంపాయించ‌డం చాలా క‌ష్టం. సంపాయించినా అది స‌వ్యంగా తిరిగే ఫ్యాన్ అయి వుండ‌డం మ‌రీ క‌ష్టం. ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వ‌చ్చిన‌ట్టు గీక్ గీక్ అని అరుస్తూ వుంటాయి. అవి ఊడి మీద ప‌డ‌క‌పోవ‌డం మ‌న అదృష్టం.


ఇక్క‌డితో మ‌న క‌ష్టాలు ఆగ‌వు. క‌రెంట్ వాళ్ల ద‌య ఉండాలి. ఎన్టీఆర్ బుల్లీ అని హీరోయిన్‌తో శృంగారం చేస్తున్న‌ప్పుడు వాళ్ల‌కి న‌చ్చ‌దు. ప‌వ‌ర్‌క‌ట్‌. జ‌న‌మంతా పిచ్చెక్కిన‌ట్టు ఈల‌లేస్తారు. జ‌న‌రేట‌ర్లు లేని కాలం కాబ‌ట్టి క‌రెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. రాక‌పోతే పాస్‌లు ఇచ్చి పంపుతారు. మ‌రుస‌టి రోజు వ‌చ్చి చూడాలి.


రిలీజైన ఏడాదికి ఆంధ్ర దేశ‌మంతా ఆడిన త‌ర్వాత మాకు వ‌చ్చేది. పాత ప్రింట్లు కావ‌డంతో సినిమా అంతా గీత‌లు గీత‌లు వ‌చ్చి క‌ట్ అయ్యేది. ఇన్ని విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం.


ఇపుడు ఇన్ని సౌక‌ర్యాల మ‌ధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావ‌డం లేదు. అమాయ‌క‌త్వంలోని ర‌హ‌స్యం అదేనేమో!


తెలివి మీర‌డానికి మించిన శిక్ష ఇంకొక‌టి లేదు. - ఒక సినిమా ప్రేక్షకుడు

ప్రకృతి హితమే ప్రజాహితం

 హరిఃఓం   ,                           -                                               -                                                  -        ప్రకృతి హితమే ప్రజాహితం


సృష్టిలో మనిషి మాత్రమేకాక అతడి చుట్టూ విస్తారమైన ప్రకృతి ఉంది. ఈ ప్రకృతికి మనిషికి పరస్పరం సంబంధం ఉంది. 

         ఈ అనుబంధాన్ని విస్మరిస్తే మనిషికే ప్రమాదం.

         కాళిదాస మహాకవి 'అభిజ్ఞాన శాకున్తలమ్' నాటకంలో 'భరతవాక్యంగా' దుష్యంతునిచే పలికించిన వాక్యాలలో మొదటి వాక్యం. 

          "ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః" 'పాలకులు ప్రకృతి హితం కోసమే ప్రవర్తించాలి' అని ఈ వాక్యార్థం. ప్రపంచ దేశాలన్నీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పాలించేవారు కేవలం ప్రజల హితాన్నే కాదు, ప్రకృతి హితాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రకృతి హితం పైనే ప్రజాహితం ఆధారపడి ఉంది.

           అంతేగానీ ప్రకృతిని క్షోభపెడితే క్రమంగా అది మనిషి మనుగడనే దెబ్బతీస్తుందని మహర్షులు పలువిధాల బోధించారు. ప్రకృతిలో మనం అంతర్భాగం. అంతేగానీ ఆధిపత్యం వహించేవారం కాదు. ప్రకృతిని (జగన్మాతగా) మాతృ భావనతో ఆరాధించే సంప్రదాయం మనది.

            ఉదయాన్నే నిద్రలేస్తూనే- భూమికి నమస్కరించి పక్క దిగమన్నారు పూర్వీకులు.

           సముద్రవసనే దేవి! పర్వతస్తన మండలే 

          విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే||

          "అమ్మా! భూదేవి! సముద్రాన్నే వస్త్రంగా పర్వతాలను వక్షస్థలంగా కలిగిన తల్లీ! విశ్వవ్యాపకుడైన భగవంతుని శక్తివి నీవు! నా పాదాలతాకిడిని క్షమించుమమ్మా" అని ప్రార్థించి అడుగువేస్తాం. ప్రకృతితో ఇంత సున్నితమైన సంబంధాన్నీ ఆత్మీయతనీ అభివృద్ధి చేసుకున్న గొప్పనాగరికత మనది.

           ఉదయించే సూర్యతేజాన్ని జడపదార్థంగా కాక 'శక్తి ప్రదాత' అయిన భగవంతునిగా అర్చిస్తాం. ప్రవహించే నదులను దేవతామాతృకలుగా పూజించి, ఆ జలాలను పవిత్రంగా పానం చేస్తాం, అందులో స్నానం చేస్తాం.

          నలుగురూ వాడే తటాకాలను, నదులను బావులను ఏమాత్రమూ కలుషితం చేయవద్దని వేద మంత్రాలు శాసించాయి. 

           "న నిష్టీవనం కుర్యాత్ న మూత్రపురీషం కుర్యాత్" - నీటిలో ఉమ్మరాదు. మలమూత్రాలను విడువ రాదు... అది మహాపాతకం అని హెచ్చరించాయి. కానీ మనం పెడచెవిన పెడుతున్నాం. పవిత్రనదీ స్నానఘట్టాలలో అన్ని కాలుష్యాలనూ నింపుతున్నాం. దానికి తోడు పరిశ్రమలు విషతుల్యమైన నిలవల్ని వదులుతున్నాయి.

           వృక్షాలను కూడా దేవతలుగా ఆరాధించే పరంపర మనది. వృక్ష సూక్తాలు వేదవాఙ్మయంలో దర్శనమిస్తాయి. యజ్ఞానికి వాడే సమిధల్ని సైతం ఎండిన వాటినే వాడాలిగానీ, పచ్చిగా ఉన్న వాటిని ఖండించరాదని శాసించారు. పూజకి తులసీదళాలనీ, మారేడు దళాలనీ, పువ్వుల్నీ కోసేటపుడు కూడా కొన్ని నియమాలు చెప్పారు. ముందుగా వృక్షాన్ని నమస్కరించి, దేవతాప్రీతికై దళాలను, కుసుమాలను ప్రసాదించవలసిందిగా ప్రార్థించాలి. ఆపై గోరు తగలకుండా వేలి కొసలతో మాత్రమే వాటిని (కోయాలి) తీయాలి. 

          దళాలనైతే ఏకాదశి, పూర్ణిమ, శుక్రవారం, అమావాస్య వంటి తిథులలో దినాలలో కోయరాదు. ఆ కోసేటప్పుడు కూడా కొమ్మలు విరగకుండా ఏరు కోవాలి అంటూ చాలా పద్ధతుల్ని పెట్టారు. దీని ద్వారా కూడా ప్రకృతి పరిరక్షణలో ఎంతటి బాధ్యతను గుర్తుచేశారో గమనించాలి. మన అవసరార్థం ప్రకృతిని వినియోగించుకున్నా ఏమాత్రం నాశనం లేకుండా ఎంతో అనుబంధంతో వ్యవహరించడం ఈ సంస్కృతి ప్రత్యేకత.

          పంట పండించేముందు భూమినీ, పండిన తరువాత పంటనీ కూడా గౌరవిస్తాం. ప్రకృతిలో ప్రతి పదార్థాన్నీ ప్రాణవంతంగా చూసే దృష్టి ఇది. అంతేగానీ ప్రకృతిని జడపదార్థంగా భావించరాదు. అలాగే ప్రాణికోటిని ప్రేమించే స్వభావం.

        'శాకున్తలమ్'లో శకున్తల వృక్షాలను పెంచిన తీరు, కణ్వుడు అమ్మాయిని అత్తవారింటికి పంపుతూ వన దేవతలను నమస్కరించిన విధం గమనిస్తే అవి కేవలం కవితాకల్పనలుగా కాక, మనిషి బాధ్యతలను బోధిస్తాయి.

           రామాయణంలో శ్రీరాముడు, సీత జాడకోసం చెట్టునీ, పుట్టలనీ పలకరించడం, భాషించడం కనిపిస్తుంది. 

           సీతమ్మ గంగనీ, గోదావరినీ నమస్కరించి మొక్కులు సమర్పించుకుంటుంది. పురాణాల్లో వనదేవతల గురించి చెబుతారు. ఒక వృక్షాన్ని నరికితే వనదేవత ఆగ్రహిస్తుందని, అనవసరంగా వృక్షాలు నరకరాదని హెచ్చరించారు. తప్పనిసరై చెట్టుని నరకవలసివస్తే చాలా ప్రాయశ్చిత్తాలు చెప్పారు.

           వనదేవతలూ, జలదేవతలూ, భూదేవతలూ.... ఇలా ఆరాధించే మనవారి ఔన్నత్యాన్ని అర్థం చేసుకొంటే జోహరులర్పిస్తాం. ఆ ఈ లోతును గ్రహించకుండా వీటిని మూఢనమ్మకాల కింద జమకట్టడం ఒక మూఢత్వం. ప్రకృతితో కలిసి బతకడం, ఆత్మీయతాబంధం ఏర్పరచుకోవడం తద్వారా ప్రకృతికీ ఒక ఆత్మఉందనీ, ఆ ఆత్మ మన మనసును గమనించి ఒక తల్లిలా మనల్ని కాపాడుతుందని భావించడం అసలైన మానవత్వానికి నిదర్శనం.

           నేల పచ్చదనంలో, నీటి చల్లదనంలో భగవానుని కరుణని దర్శించిన ధర్మస్పృహలో ఎంత ఉదాత్తత ఉంది!

          ఈ వారసత్వాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే భారతీయ భావనావైభవం సాక్షాత్కరిస్తుంది. పాలకులు, ప్రజలు కూడా ప్రకృతి హితాన్ని పాటించినప్పుడు ఈ కరవు కాటకాలు అసలు తలెత్తుతాయా? ..........             🙏.....

గురివింద (గురిగింజ) లతో ప్రయోజనాలు

 *గురివింద (గురిగింజ) లతో ప్రయోజనాలు*


గురివింద గింజల(గురిగింజలు)తో బోలెడు ప్రయోజనాలున్నాయి. కానీ, వీటి గురించి చాలా మందికి తెలీదు. చేసేది ఏమీ లేకున్నా గొప్పలు చెప్పుకునే వాడిని గురివిందతో పోలుస్తారని మీకు తెలుసా.. వీటిని బంగారం కొలువడానికి కూడా ఉయోగిస్తారు. గురువిందను లక్ష్మీదేవీ స్వరూపంగా కూడా కొలుస్తారట. గురవిదంలో ఆకుపచ్చ, తెలుగు, పసుపు, నలుపు రకాల్లో దొరకుతాయి. ఇది సాధారణంగా బయట కనిపించదు. కానీ, ఈ తీగ ఆకులు, కాండంలో మంచి ఔషధ గుణాలున్నాయి. మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.


గురివింద ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందంటే..

ఆయుర్వేదంలో గురివింద గింజలను పూర్వం నుంచే వాడుతున్నారు. ఈ గింజల పై పొట్టు తీసి లోపల గుజ్జును నువ్వుల నూనె కలుపుకోవాలి. పేనుకొరుకుడు సమస్య ఉన్న వారు ఈ ఆయిల్ అక్కడ రాస్తే వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. ఈ గింజల పొడిని గంధంతో కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాసినా మెరుగైన ఫలితం ఉంటుంది. ఈ గింజల పొడితో ఇంట్లో పొగ వేస్తే దోమల సమస్య ఉండదు.

గురువింద చెట్టు ఆకులను మెత్తగా నూరుకుని రసం తీయాలి. దీనిని చెవిపోటు ఉన్నవారు రెండు చుక్కలు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఆకుల నుంచి తీసిన రసానికి చక్కెర కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. గురివింద ఆకులను తింటే బొంగురు గొంతు ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టొచ్చు.



 

అంతేకాకుండా, గురివింద ఆకుల రసాన్ని తీసి చర్మంపై తెల్ల మచ్చలు ఉన్న చోట రాయాలి. ఒక 15 నిమిషాలు ఎండలో ఉన్నాక స్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తే తెల్లమచ్చలు తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో కలుపుకుని బాగా మరిగించాలి.ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుని క్రమంగా తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా, ఒత్తుగా మారుతాయి.

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది

 జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది.

❂ కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.

❂ శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.

❂ ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.


కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.

❂ కరివేపాకు హైపర్గ్లైసీమిక్ డయాబెటిక్ రోగుల రక్త గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి.

❂ లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం అని తేలింది.

❂ కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.



శరీరంలో అధిక కొవ్వును తగ్గించే గుణం ఈ కరివేపాకులో ఉంది. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది. నిత్యం భోజనానికి ముందు కొన్ని కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. దీంతో అధిక బరువు సమస్యలు ఉండవు.


కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది.

❂ పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు.

❂ కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయి.

❂ నికోటినిక్ ఆమ్లంతోపాటు విటమిన్ C, విటమిన్ A, విటమిన్ B, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ ఉంటాయి.

అరుదైన వరం

 ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అరుదైన వరం. ఆ బాటలో అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరూ చేరుకోవాలనుకునే గమ్యస్థానం మోక్షం. భక్తిపథంలో సాగుతూ ముక్తిని పొందాలని ఆకాంక్షిస్తారు. అయితే, భగవత్‌ సాన్నిధ్యం పొందడం అనుకున్నంత తేలిక కాదు. ముక్తిపథం చేరుకోవడమంటే.. ఒక ఊళ్లో రైలు ఎక్కి మరొక ఊళ్లో దిగిపోవడం అంతకన్నా కాదు. కాలం కలిసి రాకపోతే, పక్కనే ఉన్న గ్రామానికి కూడా అనుకున్న సమయానికి చేరుకోలేం. దీనికితోడు మార్గంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడినా, కాని వ్యవహారంలో ఇరుక్కున్నా ప్రయాణం అక్కడితోనే ఆగిపోయే ప్రమాదం ఉన్నది. రెండు గ్రామాల మధ్య ప్రయాణమే ఇలా కష్టసాధ్యమైనప్పుడు, భగవంతుడి చరణాలు అందుకోవాలనే లక్ష్యంతో చేసే ప్రయాణం ఇంకెంత కఠినంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏ దోవలో వెళ్తున్నది, మార్గనిర్దేశనం చేస్తున్న వ్యక్తి, ప్రయాణికుడి మానసిక స్థితి ఇవన్నీ ఆ ప్రయాణాన్ని అనుక్షణం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మోక్షాన్ని కోరుకోవడం ఎంత తేలికో, దాన్ని చేరుకోవడం అంత కష్టం.

ఒకానొక గ్రామం శివారులో ఒక నరసింహస్వామి దేవాలయం ఉండేది. గ్రామానికి చెందిన ఒక ఆసామిని అనుకోకుండా అనేక కష్టాలు చుట్టుముట్టాయి. జీవితంపై విసుగు పుట్టింది. ఆలయ అర్చకుడి దగ్గరికి వచ్చి తన దీనస్థితి గురించి చెప్పుకొన్నాడు. ఏదైనా మంత్రం ఉపదేశిస్తే.. తన బతుకు బాగుపడుతుందని కోరాడు. అప్పుడు పురోహితుడు ‘నాయనా! మంత్రోపదేశంతో సరిపోదు. దానిని పద్ధతిగా సాధన చేయాలి. కఠిన నియమాలు పాటించాలి. ధార్మికంగా వ్యవహరించాలి’ అని చెప్పాడు. అన్నిటికీ ఒప్పుకోవడంతో.. ఆసామికి మంత్రాన్ని ఉపదేశించి ‘దీన్ని క్రమక్రమంగా సాధన చేయాలి.

అత్యుత్సాహం పనికిరాదు’ అని హితవు పలికాడు అర్చకుడు. అలాగే అన్నట్టు తలూపాడు ఆసామి. గుడి సమీపంలోని కొండపైకి ఎక్కి మంత్రం జపించడం మొదలుపెట్టాడు. నిద్రాహారాలు మాని కఠోరంగా తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడు. స్వామి భీకర రూపాన్ని చూసి తట్టుకోలేక తన పొట్టను తానే చీల్చుకొని ఆసామి కన్నుమూశాడు. విపరీత సాధన చేశాడు కానీ, మానసికంగా సిద్ధం కాలేకపోయాడు.

ఈ చిన్నకథలో అద్భుతమైన సందేశం ఉంది. శ్రద్ధ లేకుండా ఎన్ని గంటలు చదివినా ప్రయోజనం కలగదు. అలాగే, నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనిదే సాధన పరిపక్వం చెందదు. చాలామంది సాధకులు కుండలిని శక్తిని ప్రేరేపించడం ద్వారా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని త్వరగా అందుకోవచ్చని భావిస్తూ ఉంటారు. మిడిమిడి జ్ఞానంతో ఈ ప్రక్రియను అనుసరిస్తుంటారు. తమ సాధన ద్వారా శరీరంలోని షట్చక్రాల్లో ఒక్కోదాన్నీ ప్రేరేపిస్తూ ముందడుగు వేస్తుంటారు. అయితే, తీవ్ర సాధన వల్ల చక్రాలు ఉత్తేజితమవుతాయి కానీ, వాటిని నియంత్రించడం అందరికీ సాధ్యపడదు. బ్రహ్మరంధ్రంపై ఉండే సహస్రార చక్రాన్ని నియంత్రించలేకపోతే.. మతిస్థిమితం కోల్పోయే ప్రమాదమూ ఉన్నది. పుణ్యక్షేత్రాల్లో కొందరు సాధువులు పిచ్చిపట్టిన వారిలా కనిపించడం గమనిస్తుంటాం. వారిలో కొందరి పరిస్థితికి ఈ అపరిపక్వ సాధనే కారణంగా చెబుతారు.

‘సాధనాత్‌ సాధ్యతే సర్వం’ అన్నారు రుషులు. అయితే, ఆ సాధన చేసే విధానం ముఖ్యం. దానిని చేయించే గురువు అంతకన్నా ముఖ్యం. సరైన గురువు అనుగ్రహం లేకపోతే ఏ సాధనా పరిపక్వత చెందదు. శారీరక సమస్యలు, మానసిక దౌర్బల్యాలు, విషయ వాసనలు, చిత్త ప్రవృత్తులు ఇలా ఎన్నో సాధకుణ్ని కకావికలం చేస్తుంటాయి. పక్కదారి పట్టిస్తాయి. వీటిని జయించకుండా సాధన కొనసాగిస్తానంటే కుదరదు. ఇలాంటివారికి జన్మాంతర పుణ్యంతో దైవానుగ్రహం లభించినా.. దాన్ని సద్వినియోగం చేసుకునే నేర్పు కొరవడుతుంది. పసిబాలుడు అడుగులు వేసే క్రమంలో, అరుగులు దిగే సమయంలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. తల్లి చెంతనే ఉంటే.. ఆ పసివాడు పడిపోయే ప్రమాదం ఉండదు. అలాగే సద్గురువు మార్గనిర్దేశంలో కొనసాగిన సాధన పరిపక్వత సాధిస్తుంది. లేకపోతే అపరిపక్వంగానే మిగిలిపోతుంది.

వైకుంఠయాత్రకు

 శ్లోకం:☝️

*చితాం ప్రజ్వలితాం దృష్ట్వా*

    *వైద్యో విస్మయ మాగతః l*

*నాహం గతో న మే భ్రాతా*

    *కస్యేదం హస్తలాఘవం ll*


భావం: ఒక వైద్యుడు పొరుగూరి నుండి తిరిగి వస్తుండగా... ఎవరో మరణించిన వ్యక్తికి శ్మశానంలో చితి పేర్చి నిప్పంటించి వెళ్లారు. అప్పుడా దారిన వచ్చిన ఈ వైద్యునికంట పడింది ఆ దృశ్యం. వెంటనే ఇతనికి అనుమానం వచ్చింది. "వైద్యానికి నేను కాని నా సోదరుడు కాని వెళ్లలేదు కదా! ఇది ఎవరి హస్తవాసియై వుంటుంది?" అనగా "ఎవరి చేతి చలవ వల్ల ఈతడు చనిపోయాడు?" అని ఆశ్చర్యపడ్డాడని భావం.

ఈ లెక్కన సోదరులిద్దరూ వారి చేతి మాత్రతో ఎంతమందిని వైకుంఠయాత్రకు పంపారో కదా!

నిర్మల భక్తి*

 *నిర్మల భక్తి*.   



పూర్వం ఒక ఊరిలో అయోద్యుడు అనే బద్దకస్తుడు ఉండేవాడు. 


ఏపని చేసేవాడు. తినడం తిరగడం. ఇంతకుమించి ఏపని రాదు. పైగా అమాయకుడు. ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రయం చూసుకొని వెళ్ళమన్నారు.


 సరేనని ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు.


 ఓ ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు. ఆహా ఇక్కడ భోజనం బాగా దొరుకుతుందనుకుంటా బాగా లావుగా ఉన్నారు అనుకున్నాడు. 


ఇంతలో శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడుపూటల భోజనం దొరుకుతుంది అనుకోని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు. 


అయితే నాకు మూడుపూటల భోజనం కావాలి అన్నాడు అయోద్యుడు.  


నాయనా! చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమె ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు.


 కాదు గురువుగారు నేను ఆకలికి ఉండలేను అన్నాడు.


 సరే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అంటే సరేనన్నాడు.


ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా ఏకాదశి వచ్చింది.


 ఈరోజు ఉపవాసం ఉండాలి అన్నారు. 


అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారు ఉండలేను అన్నాడు శిష్యుడు. 


సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకి వెళ్లి వండుకుతిను. కావాలంటే సరంజామా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు. 


సరేనని సరంజామా తీసుకున్నాడు శిష్యుడు.


 నాయనా వండిన ఆహారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే నువ్వు తినాలి సరేనా అనగా అలాగే గురువుగారు అని వెళ్లి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి....


రాజా రామ్ ఆయియే, రఘురామ్ ఆయియే మేరా భూక్ లాగాయియే 


అంటూ పాడడం మొదలు పెట్టాడు.


 ఎంతకీ స్వామి రాడే.. (ఇతని ఉద్దేశ్యం లో స్వామివారే స్వయంగా వచ్చి తింటారని అనుకుని ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతటి అమాయకుడు. కపటం, కంఫ్యూషన్ లేదు మనస్సులో) 


 ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి "దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు. ఇక్కడ ఏముంది. కదిరి కుదరని వంట తప్ప" స్వామి అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావేమో ఈరోజు ఏకాదశి అక్కడ ఏమి ఉండదు. ఏమి పెట్టరు. ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు అని మళ్ళీ పాడడం మొదలు పెట్టాడు. 


ఇది కూడా అయిపోతుందని.. శ్రీరాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతాసమేతంగా వచ్చాడు.


శ్రీరాముడిని చూశాడు సంతోషించాడు. కానీ పక్కనే సీత ఉంది. సీత వంక ప్రసాదం వంక పదేపదే చూస్తూ ఉండగా.. మేము వచ్చాము సంతోషమేగా అంటే సీత వంక చూస్తూ ఆ ఆ సంతోషమే నాచేత ఏకాదశి ఉపవాసం చేయించాలనుకున్నట్లు ఉన్నారు. రండి కూర్చోండి అని ఇద్దరికి వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్లిపోయారు. 


మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం పప్పులు దినుసులు ఇచ్చారు. అప్పుడు.. గురువుగారు సరిపోవడం లేదండి. ఇద్దరొచ్చారు ఇంకాస్త కావాలి అంటే.. వీడికి సరిపోతున్నట్లు లేదు ఇంకో కేజీ ఇచ్చి పంపండి అన్నాడు. 


యధావిధిగా వెళ్లి వంట చేసి.. నైవేద్యం పెట్టి, తులసి పెట్టి.. మొన్న ఇద్దరు వచ్చారు కదా.. అందుకని


రాజారామ్ అయియే, సీతారాం ఆయియే మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అంటూ పాడాడు.


 ఈసారి సీతారాముల తో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడు వంక భోజనం వంక చూస్తూ ఉండగా.. శ్రీరాముడు.. మేము వచ్చాము సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక భోజనం వంక చూస్తూ ఆ సంతోషమే ఈ వారం కూడా ఉపవాసమే.. రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు . ముగ్గురు తిన్నారు వెళ్లారు. 


మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారితో ఇది సరిపోదండి మూడు వచ్చారు అన్నారు. వీడు రాత్రికూడా తింటున్నాడేమో అనుకోని మరో కేజీ ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. 


ఈసారి పాట మార్చి పాడాడు.. రాజారామ్ ఆయిఏ, సీతారాం అయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ 


ఈసారి సీతారాములు, లక్ష్మణుడు వచ్చారు. వీళ్ళతోపాటుగా హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము ఆనందమేగా ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక భోజనం వంక చూసి ఈ ఏకాదశి కూడా ఉపవాసమే.. రండి కూర్చోండి అని వడ్డించాడు. అందరూ కూర్చొని తృప్తిగా తినేసి వెళ్లిపోతూ ఉండగా స్వామి ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? అనగా శ్రీరాముడు నవ్వి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు..


మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు ఈసారి రవ్వ 10కిలో, బియ్యం పదికిలో, పచారి పదికిలో కావాలి అన్నాడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా వాడు అడిగింది. తరువాత చుద్దాం అన్నాడు. అలాగే గురువుగారి ఆజ్ఞప్రకారం అన్ని పది కిలోల చొప్పున ఇచ్చి పంపి గురువుగారి దగ్గరికి వచ్చారు శిష్యులు. వీడు అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు. ఎక్కడ అమ్ముతున్నాడు? ఏదుకాణంలో అమ్ముతున్నాడు. చుద్దాం పదండి అని గురువుగారిలో సహా అయోద్యుడి వెనుక బయలుదేరారు.


ఎప్పటిలానే అయోద్యుడు చెరువు దగ్గరకు వెళ్లి సామాను అంత అక్కడ పడేసి చెట్టుక్రింద కూర్చొని రాజారామ్ అయిఏ, సీతారాం ఆయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ, హనుమాన్ సాత్ ఆయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ.. అని పాట పాడాడు. ఈసారి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్,భరత శత్రుఘ్నులు, కౌశల్య సుమిత్ర కైకేయి సపరివారమంతా వచ్చేశారు.

 మేమొచ్చేశాం సంతోషమేగా.. ప్రసాదం ఏది ఎక్కడుంది? అని అడిగాడు శ్రీరాముడు.


 అప్పుడు అయోద్యుడు.. ఎప్పుడూ నేను వండితే మీరు తినేసి వెళ్లిపోతున్నారు. కొద్దిగా కూడా ఉంచడం లేదు. నాచేత నాలుగు ఏకాదశి ఉపవాసాలు చేయించారు. ఈసారి మీరే వండండి.. సామానంత అక్కడే ఉంది అన్నాడు. శ్రీరాముడు నవ్వి సరేనని.. శ్రీరాముడు కూరగాయలు తరుగుతూ ఉన్నాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకి వెళ్ళింది. లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు. ఇలా అందరూ తలా ఓపని చేస్తూ ఉండగా.. సీతమ్మ వంట వండుతుందని తెలుసుకొని దేవతలు, ఋషులు, గంధర్వులు వరసగా వస్తూ ఉంటారు. కోలాహలంగా తయారయింది ఆ ప్రదేశం అంతా.. 


ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి. అక్కడి సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి అయోద్యుడు చెట్టుకింద పడుకొని కనబడతాడు. వెంటనే గురువుగారు వచ్చి " అయోధ్యా! ఏంటి సామానంత అక్కడ పడేసి చెట్టుక్రింద పడుకున్నావ్" అనగానే.. అదేంటి గురువుగారు సీతారాములు, లక్ష్మణుడు హనుమంతుడు కౌశల్య సుమిత్ర కైకేయి అందరూ కలిసి వంట చేస్తున్నారుగా అంటే ఆశ్చర్యంతో ఎక్కడ నాకేం కనబడడం లేదు అన్నారు గురువుగారు.


అయోద్యుడు శ్రీరాముడిని చూసి మీరు మాగురువుగారికి కనబడడం లేదట కనిపించండి. లేదంటే నామీద సందేహం వస్తుంది అనగా శ్రీరాముడు అలానే అని సపరివారసమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు.


 గురువుగారు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా అయోద్యుడ్ని కౌగలించుకొని ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్న నాకు దర్శన భాగ్యం కలుగలేదు. నీవు  అమాయకంగా, నీమనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు. నీవల్ల మేము ధన్యులమయ్యాం అన్నాడు.. 


భగవంతుడు రాడేమో అని, పూజలు ఎలా చేయాలి ఎన్ని వత్తులు వేయాలి అంటూ, కొన్నాళ్ళు విపరీత భక్తితో, కొన్నాళ్ళు విరక్తితో, మరొకొన్నాళ్లు చిరాకుతో ఏదో ఇష్టం వచ్చినట్లు కంఫ్యూషన్ మైండ్ తో, గందరగోళంగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. చేయాలా వద్దా! ఎలా చేయాలి.. ఈరోజు పనులున్నాయి. ఈరోజు మనసు బాగోలేదు. ఇలా ఏదో వంకతో సాకుతో పూజలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఇలాంటివారికి జీవితాంతం గందరగోళం తప్ప భగవంతుడి సాక్షాత్కారం కలుగదు. పూజ గాని, జపం గాని, తపస్సు గాని, ధ్యానం యోగాదులు ఏదైనా సరే నిలకడ లేకుండా జీవితకాలం చేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సుతో చేస్తే తక్షణం పరమాత్ముడు దర్శనం ఇస్తాడు. ఏ మాత్రం సందేహం లేదు. 


అయోద్యుడు, భక్తకన్నప్ప, భక్తతుకారాం ఈ కోవకి చెందినవారే. ఏమి పెట్టినా, ఎలా పెట్టినా మారుమాట్లాడకుండా స్వచ్ఛమైన నిర్మలమైన భక్తికి వశమైపోయాడు పరంధాముడు.


జై శ్రీమన్నారాయణ🙏🏻


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️