22, ఏప్రిల్ 2022, శుక్రవారం

కోడిమాంసం సంపూర్ణ వివరణ

 కోడిమాంసం సంపూర్ణ వివరణ  - 


      కోడిని సంస్కృతము నందు కుక్కుటము అని పిలుస్తారు . ఇది జిగటగా , స్నిగ్దముగా ఉండును. ఉష్ణవీర్యముగా ఉండును. కంటికి హితముగా ఉండును. అనగా నేత్రసంబంధ సమస్యలతో ఇబ్బందిపడువారికి ఇది హితము కలిగించును. వీర్యవృద్ధిని కలిగించును. కఫోద్రేకము కలిగిచును . కోళ్ళలో ఆడకోడి , మగకోడి రెండు బేధములతో ఉండును. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కోడిని విష్కిర జంతువులలో ( అనగా కాలితో నేలను చిమ్మి అందుండు పురుగులు మొదలయిన వానిని తినేవి ) చేర్చడం జరిగింది . విష్కిర జంతువుల మాంసం సాధారణముగా శుక్రవృద్ధిని  కలిగించునదిగాను, కొంచం  వగరు , తీపి రుచులు కలదిగాను , చలువనిచ్చి , ఇంపుగా ఉండునదిగా వర్ణించబడినది. 


 

 *  కోడిపుంజు మాంస విశిష్టత  - 


        ఇది మిగుల శ్రేష్టమైనది . అందులోనూ కూతపెట్టని పుంజుమాంసం బలకరం . రక్తవృద్ధిని ఇచ్చి వాతవ్యాధులను , ఉదరశూల పోగొట్టును . సమశీతోష్ణత కలిగించును. ఏ కారణము చేతనైనను రక్తము తగ్గి కృశించి పోవువారికి సాధారణముగా వేడి శరీరతత్వము కానివారు కోడిమాంసం తినవచ్చు . ప్రాయపు పుంజుమాంసం అధిక బలకరము , దేహబుద్ధి పెంచును . వీర్యవృద్ధి కలిగించును. కాసరోగముచే కృశించువారికి ఇది హితము . వాతప్రకృతి కలవారికి అనుకూలత ఇచ్చును . ముదురుకోడిపుంజు మాంసం శరీరం నందు అమితముగా ఉష్ణమును పెంచును . ఉష్ణముతో వచ్చు శ్లేష్మముకూడా పెరుగును . దీనిని తీసుకోకపోవడము ఉత్తమం . దీనికి పులుసు విరుగుడు. 


 * కోడిపెట్ట మాంస విశిష్టత  - 


        ఇది స్నిగ్దముగా , హితముగా , రుచికరంగా , వాతశ్లేష్మ హరముగా ఉండును. గురుత్వము ఇచ్చును. వీర్యపటిమ , దేహబలము , రక్తవృద్ది ఇచ్చి కన్నులకు మేలు చేయును . కొడిపెట్ట మాంసం చక్కగా పక్వము కాకున్నచో విరుద్ధగుణములు ఇచ్చును. ముసలి పెట్ట మాంసం ఉదరవ్యాధులు , శూలలు మున్నగువానిని పోగొట్టును . వీటిలో పిల్లలమాంసం నీరసముతో ఉన్నవారికి హితము . ఇది విరేచనకారి . ముసలిపెట్ట మాంసం విరేచనబద్ధం , లేతకొడిపెట్ట మాంసం అత్యుష్ణము . ముదురుది శ్వాసకాసలను హెచ్చించును. దీనికి విరుగుడు పులుసు . 


         పైనచెప్పిన ఔషధ విలువలు అన్నియు దేశివాళి కోళ్లకు సంబంధించినవి . ఇప్పుడు మనకి లభ్యం అయ్యే బాయిలర్ కోళ్ళకి త్వరగా పెరగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వాటిని మనం ఆహారంగా తీసుకుంటున్నాము . అలా ఆ కృత్రిమ హర్మోన్స్ మనశరీరములోకి ప్రవేశించి విపరీత ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యముగా ఆడపిల్లలు సాధారణ వయస్సు కన్నా ముందే పుష్పవతులు ( Matured ) అవ్వడం జరుగుతుంది. పెద్దవారిలో హర్మోనల్  inbalance అవ్వడం జరుగుతుంది.  


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  .  మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కామెంట్‌లు లేవు: