8, మే 2026, శుక్రవారం

సగం పక్షి, సగం సింహం

 సగం పక్షి, సగం సింహం...ఇది మహాశివుని అవతారం......!!

విష్ణుమూర్తి దశావతారాల గురించి చాలామంది టకటకా చెప్పేస్తారు. కానీ మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ!


దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఓ ఘనమైన కథ ఉంది.


విష్ణుమూర్తి హిరణ్యకశిపుని సంహరించేందుకు నరసింహావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే! అయితే హిరణ్యకశిపుని సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారనే లేదట. ఆ ఉగ్రనారసింహుని క్రోధానికి లోకమంతా అల్లకల్లోలమైపోయింది. 


నరసింహుని నిలువరించకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు. అందుకోసం నరసింహుని నిలువరించమంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట.


అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర, భైరవులని పంపాడట. కానీ నారసింహుని ముందు ఆ రెండు అవతారాలూ నిలువలేకపోవడంతో శరభ అవతారాన్ని ధరించాడు శివుడు.


కొన్ని పురాణాల ప్రకారం శరభ, నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు జరిగింది. ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా. మరి కొన్ని పురాణాల ప్రకారం శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండభేరుండ పక్షిగా అవతరించాడు.


రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని దీటుగా ఎదుర్కొంటుంది. ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటములు తేలకపోవడంతో, రెండు అవతారాలూ యుద్ధాన్ని విరమించుకుంటాయి.


ఎవరి మధ్య యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురూ ఒక్కటే కాబట్టి శరభను విష్ణుమాయగా వర్ణించేవారు కూడా లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు, బుద్ధుని జాతక కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ జాతక కథల ప్రకారం శరభ బుద్ధుని పూర్వ అవతారాలలో ఒకటి!


శరభ రూపం దక్షిణాదిన, అందునా తమిళనాట ఉన్న శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించిన చోళులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది.


ఒక్కో చోట ఈ శరభ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే, మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ, దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది. శివుని శరభేశ్వరునిగానో, శరభేశ్వరమూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది.


ఇక తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ, దానిని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు అరుదు. అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తిచలేదని కాదు.


ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి. వీరశైవులు చేసే నృత్యాలలో శరభ, అశ్శరభ, దశ్శరభ అంటూ ఒళ్లు గగుర్పొడిచే అరుపులు వినిపిస్తాయి.


తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెబుతారు...

స్వస్తి.

కాంచీపురంలోని

 కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారి పురాణ చరిత్ర అత్యంత మహిమాన్వితమైనది. 


శక్తి పీఠం ఆవిర్భావం

దక్ష యజ్ఞం సమయంలో సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసినప్పుడు, శివుడు ఆమె మృతదేహాన్ని ధరించి తాండవం చేశాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా, ఆమె శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. సతీదేవి యొక్క నాభి భాగం కాంచీపురంలో పడిందని, అందుకే ఇది అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత ప్రధానమైన "నాభిస్థాన ఒడ్యాణ పీఠం" గా ప్రసిద్ధి చెందింది.


భండాసుర సంహారం

పురాణాల ప్రకారం, భండాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలను పొంది, దేవతలను వేధించసాగుతాడు. దేవతలందరూ కలిసి మహాశక్తిని వేడుకోగా, అమ్మవారు కాంచీపురంలోని "బిల ఆకాశం" నుండి ఆవిర్భవించింది. ఆమె అత్యంత పరాక్రమంతో భండాసురుని సంహరించి, లోకాలను కాపాడింది. ఈ విజయానికి సంకేతంగా ఆమె అక్కడ కొలువైందని భక్తుల నమ్మకం.


పార్వతీ దేవి తపస్సు - ఏకాంబేశ్వర ఆలయం. 

మరో పురాణం ప్రకారం, ఒకనాడు పార్వతీ దేవి వినోదం కోసం పరమశివుని కళ్లను మూస్తుంది. దీనివల్ల లోకమంతా చీకటిమయమవుతుంది. ఆ పాప పరిహారం కోసం పార్వతీ దేవి భూలోకానికి వచ్చి, కాంచీపురంలోని వేగవతీ నది తీరాన ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి తపస్సు ప్రారంభించింది.

తపస్సును పరీక్షించడానికి శివుడు వేగవతీ నదికి వరదలు వచ్చేలా చేస్తాడు. వరద ఉధృతికి మట్టి లింగం కరిగిపోతుందేమోనన్న భయంతో పార్వతీ దేవి ఆ లింగాన్ని గట్టిగా హత్తుకుంటుంది. అమ్మవారి భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు.


'ఏక' అంటే ఒకటి, 'ఆమ్ర' అంటే మామిడి. ఒకే ఒక్క మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి కాబట్టి ఈయనను ఏకాంబరేశ్వరుడు (ఏకామ్రనాథుడు) అని పిలుస్తారు. 


ప్రాంగణంలో సుమారు 3,500 ఏళ్ల నాటి పురాతన మామిడి చెట్టు ఉంది. దీనికి ఉన్న నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకు ప్రతీక అని, ఒక్కో కొమ్మ నుండి ఒక్కో రుచి గల మామిడి పండు వస్తుందని భక్తుల నమ్మకం. ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటైన పృథ్వీ (మట్టి) క్షేత్రం.


కామాక్షి దేవి విగ్రహ విశిష్టత

కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారి విగ్రహం అత్యంత శక్తివంతమైనది మరియు మంత్రశాస్త్ర రహస్యాలతో కూడుకున్నది. లలితా సహస్రనామాలలో వర్ణించిన విధంగా అమ్మవారి స్వరూపం ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. ఆమె విగ్రహానికి సంబంధించిన ఆధ్యాత్మిక వర్ణన కింద వివరించబడింది:


1. పద్మాసన భంగిమ

సాధారణంగా దేవీ విగ్రహాలు నిలబడి (స్థానక భంగిమ) ఉంటాయి. కానీ కామాక్షి అమ్మవారు ఇక్కడ పద్మాసనంలో కూర్చుని ఉంటారు. ఇది ఆమె యోగశక్తికి మరియు శాంత స్వభావానికి ప్రతీక. పరమశివుడిని పొందడానికి ఆమె చేసిన తపస్సును, ఆ తర్వాతి పరిపూర్ణ స్థితిని ఈ భంగిమ సూచిస్తుంది.


2. చతుర్భుజాలు (నాలుగు చేతులు)

అమ్మవారికి నాలుగు చేతులు ఉన్నాయి. ఆమె చేతుల్లో ఉన్న ఆయుధాలకు లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. 


పాశము (తాడు): అమ్మవారి ఎడమ చేతిలో ఉండే పాశం 'రాగ' (కోరిక లేదా అనురాగం) అనే శక్తికి ప్రతీక. ఇది భక్తులను అజ్ఞానం నుండి బయటకు లాగి తన వైపు తిప్పుకోవడాన్ని సూచిస్తుంది.


అంకుశము: కుడి చేతిలో ఉండే అంకుశం 'క్రోధ' (కోపం) అనే శక్తికి ప్రతీక. మనలోని దుర్గుణాలను నియంత్రించి, క్రమశిక్షణతో ఉంచడానికి ఇది సంకేతం.


చెరకు గడ (ధనుస్సు): ఎడమ చేతిలో ఉండే చెరకు గడ మనసు (మనోరూపం) కి ప్రతీక. చెరకు తీపి ఎలాగో, భక్తి మార్గం కూడా అంత తీయనిదని ఇది సూచిస్తుంది.


ఐదు పుష్ప బాణాలు: కుడి చేతిలో ఉండే ఐదు పూల బాణాలు మన ఐదు జ్ఞానేంద్రియాలను (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ) సూచిస్తాయి. ఈ ఇంద్రియాలను అమ్మవారి సేవలో వినియోగించాలని దీని అర్థం.


3. త్రినేత్రాలు (మూడు కళ్ళు)

కామాక్షి అంటే 'కా' (సరస్వతి), 'మా' (లక్ష్మి) తన రెండు కళ్ళుగా కలది అని అర్థం. మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నం. ఆమె చూపుతోనే భక్తుల కోరికలను నెరవేరుస్తుంది కాబట్టి ఆమెను 'కామదాయిని' అని కూడా అంటారు.


4. కిరీటం మరియు అలంకారం

అమ్మవారి శిరస్సుపై చంద్రకళ (అర్ధచంద్రుడు) ఉంటుంది. ఇది ఆమె అమృత స్వరూపిణి అని, లోకానికి వెలుగునిచ్చే జ్ఞానప్రదాత అని తెలియజేస్తుంది. విగ్రహం చుట్టూ ఉండే ప్రభావళి విశ్వవ్యాప్తమైన ఆమె శక్తిని దర్శింపజేస్తుంది.


5. శ్రీచక్రం

పూర్వం కామాక్షి అమ్మవారు అత్యంత ఉగ్రరూపంలో ఉండేవారని, దానివల్ల భక్తులు ఆమెను దర్శించుకోవడానికి భయపడేవారని చరిత్ర చెబుతోంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు కాంచీపురానికి వచ్చినప్పుడు, అమ్మవారి ఉగ్రకళలను శాంతింపజేయడానికి ఆమె ఎదుట శ్రీచక్రాన్ని (కామకోటి పీఠం) ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారు అత్యంత ప్రసన్న రూపిణిగా, భక్తుల కోర్కెలు తీర్చే 'కామదాయిని'గా దర్శనమిస్తున్నారు.


6. ముద్ర మరియు భావం

అమ్మవారి ముఖంలో మందహాసం, కళ్ళలో కరుణ కనిపిస్తాయి. ఆమె యోగ ముద్రలో ఉన్నప్పటికీ, భక్తుల మొర ఆలకించే తల్లిగా అత్యంత ఆకర్షణీయంగా, దివ్య తేజస్సుతో వెలిగిపోతుంటారు.


ఈ విగ్రహ వర్ణన కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదు; ఇది సాధకుడికి తన ఇంద్రియాలను, మనసును ఎలా నియంత్రించుకోవాలో నేర్పే ఒక ఆధ్యాత్మిక సందేశం.

ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

జన్మలు 3 రకాలు..!

  అసలు జన్మలు 3 రకాలు..!

01) దేవజన్మ 02) మానవజన్మ 03) జంతుజన్మ.


జన్మలు ఎలా వస్తాయి? వాటి ప్రత్యేకతలేమిటి? 

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు.


అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు.


అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు.


అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి,ఆ కర్మఫలాలు క్షయంకాగానే...


“క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నట్లుఈ మర్త్యలోకాన్ని... మానవ లోకాన్ని చేరుకోవలసిందే! మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే!🌿ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ.


ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు.


ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు.


కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జంతుజన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.


కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు!ఇక పుణ్యపాప కర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.🌿పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది.


ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు.


84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను..“జంతూనాం నరజన్మ దుర్లభం” అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది.


ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి...స్వస్తి..

జ్యోతిష్య శాస్త్ర రీత్యా దంపతులు

🙏🙏#జోతిష్యంలో 

 జ్యోతిష్య శాస్త్ర రీత్యా దంపతులు విడిపోవడం లేదా విడాకులు తీసుకోవడం

పై సమగ్ర విశ్లేషణ🙏✍️💯


వైవాహిక దంపతుల మధ్య విడిపోవడం లేదా విడాకులు అను సంధర్భాలు రావడం ఇప్పటి కాలములో చాలా సహజంగా మారిపోయింది. వివాహం చేసుకోడానికి పట్టే సమయం విడాకులు తీసుకోవడానికి పట్టడం లేదు. సామాజిక పరంగా విడాకులకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ కేవలం జ్యోతిష్య శాస్త్ర రీత్యా మాత్రమే చర్చించాలి. జ్యోతిష్యునిగా నాకు ఉన్న అనుభవములో వివాహం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఆలస్య వివాహం చేసుకొని కనీసం ఒక సంవత్సరం నిండక ముందే దంపతులు ఇద్దరు విడిపోవడం గాని లేదా విడాకుల నిర్ణయానికి గాని వస్తున్నారు.   


జాతక రీత్యా దంపతులు విడిపోవుటకు లేదా విడాకులు తీసుకునేందుకు గల కారణాలు ఏవి?✍️


విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్న దంపతులకు సహజ కారణములు కొన్ని నా అనుభవములో తెలిసినవి మీకు వివరిస్తున్నాను.


దంపతుల మధ్య శృంగార బంధం సరిగా సాగకపోవడం లేదా దంపతులలో ఒకరికి శృంగార సామర్థ్యం లేకపోవటం.

జాతకములో ద్వికళత్ర యోగం (రెండు వివాహములు) ఉండటం.

పెళ్ళికి ముందు వేరొకరితో ఉన్న ప్రేమ వ్యవహారమును ఇంకొకరితో పెళ్లి అయిన తరువాత కూడా కొనసాగించడం.

వివాహం అయ్యి చాలా కాలం అయినా పిల్లలు లేకపోవటం.

కొత్త బంధం ఏర్పడిన తరువాత, మొదటి బంధమును నిర్లక్ష్యము చేయటం.

వివాహము అయిన తరువాత చాలా కాలం పాటు అనారోగ్యంగా ఉండటం.

వివాహం తరువాత పేదరికం ఎదురవటం.

వివాహేతర సంబంధములు ఏర్పడటం


విడాకులు-జ్యోతిష్య కారణాలు:✍️


ఇక జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉన్న కారణాలు తెలుసుకుందాం:


విడాకులకు లేదా దంపతులు విడిపోవుటకు గల కారణమైన ముఖ్య గ్రహములు “రవి,కుజుడు,రాహువు,శని,కేతువు” ఇక భావాల విషయానికి వస్తే అష్టమ భావం,అధిపతి మరియు ద్వాదశ భావం, అధిపతి.


దంపతులు విడిపోవటానికి ‘రవి’ ఏ విధంగా కారకుడు అవుతాడు?✍️


రవికి సహజంగా వేడి తత్వము ఉంటుంది. జాతకములో ఏ విధంగా అయినా రవి సప్తమ భావముకు సంబంధం ఏర్పడినా వైవాహిక జీవితములో చాలా సమస్యలు వస్తాయి. రవి నీచపడినా లేదా శత్రు స్థానములో ఉన్నా మరియు సప్తమ భావానికి సంబంధం ఉంటే జాతకులకు వైవాహిక జీవితములో సమస్యలు ఏర్పడతాయి. ఆధిపత్యం చూపించటానికి, అధికారం చెలాయించటానికి రవి కారకుడు అవుతాడు. కావున ఈ దంపతుల మధ్య సమస్య ముందు అహముతో మొదలవుతుంది. రవి లగ్నములో గాని సప్తమములో గానీ ఉంటే జాతకునికి విడాకులకు దారి తీస్తుంది.


         రవి ఒకవేళ నీచ, శత్రు స్థానములలో లేకుండా కేవలం లగ్న లేదా సప్తమ భావములో ఉంటే దంపతులు ఇద్దరు ఒకరికొకరు దూషించుకుంటూ, చెడు మాటలతో తిట్టుకోవడం, పోట్లాడుకోవటం లాంటివి జరుగుతాయి కానీ విడాకులు తీసుకోరు. అదే ఒకవేళ రవి శుక్రుడితో కలసి 2వ భావములో గాని లేదా 4వ భావములో గాని లేదా సప్తమ భావములో గాని లేదా నవమ భావములో గాని ఉన్నట్లైతే విడాకులు కచ్చితంగా జాతకుని జీవితములో జరుగుతుంది.


దంపతులు విడిపోవటానికి ’కుజుడు’ ఏ విధంగా కారకుడు అవుతాడు?✍️


జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు 2వ భావములో, 4వ భావములో, 7వ భావములో, 8వ భావములో, 12వ భావములో ఉంటే “కుజదోషము” అని చెబుతారు. కుజుడు తీవ్రమైన గొడవలకు, వివాదాలకు, శారీరక హింసకు కారకుడు అవుతాడు. కాబట్టి కుజుడు వైవాహిక సంబంధిత భావాలలో అంటే ముఖ్యంగా లగ్నలో లేదా 7వ భావములో కుజుడు ఉంటే , జాతకుడి కుటుంబములో తీవ్రమైన గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు అధికంగా ఉంటాయి.


         ఒకవేళ కుజుడు 7వ భావముకు మాత్రమే సంబంధము ఉంటే అప్పుడు గొడవలు, కొట్లాటలు కుటుంబము మొత్తములో కాకుండా కేవలం భార్య, భర్తల మధ్య మాత్రమే ఉంటాయి.


         స్త్రీ జన్మకుండలిలో పైన వివరించిన భావాలతో పాటుగా 3వ భావం మరియు 11వ భావం లేదా ఆయా అధిపతులు నీచపడితే “ఆ స్త్రీకి అత్తామామల నుండి శారీరక మరియు మానసిక హింస, ఒత్తిడి” ఏర్పడతాయి.


        విడాకులు కలుగడానికి ముఖ్య కారకుడు కుజుడు , అంతేకాకుండా జీవితములో సగ భాగం కోర్టు కేసులకే అంకితం అయిపోతుంది.


         జాతకుడికి కుజుడు వలన రాజయోగము కలిగి, ఎలాంటి పాప గ్రహ దృష్టి లేనపుడు జాతకుడి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడచిపోతుంది.


దంపతులు విడిపోవటానికి ‘శని’ ఏ విధంగా కారకుడు అవుతాడు?✍️


దంపతులకు విడాకులు కలుగుటకు ఈ శని గ్రహం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శని వైవాహిక స్థానాలకు ముఖ్యమైన లగ్నం లేదా సప్తమ భావాలలో ఉండినట్లైతే జాతకుడు ఎంతో గోప్యమైన లక్షణమును కలిగి ఉంటాడు. అంతేకాకుండా భాగస్వామిని నిత్యం అనుమానిస్తూ ఉంటాడు.


         ఒక వ్యక్తి యొక్క వైవాహిక స్థానానికి మరియు శనికి సంబంధము ఉంటే, ఆ వ్యక్తికి వైవాహిక జీవితములో ఎప్పటికీ సంతృప్తి కలుగదు. శని మందగమనుడు. కాబట్టి శని కలిగించే ప్రభావాలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి జాతకులు విషయాలను ఎంతోకాలం పాటు గోప్యంగా తమలో తాము ఉంచుకుంటారు. ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినపుడు అకస్మాత్తుగా ఆ విషయములు బయట పెడతారు. కారణంగా జీవితములో కోలుకోలేని దెబ్బతింటారు. ఒక్కోసారి శని దంపతులను శాశ్వతంగా దూరము చేస్తాడు. చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా ,విడిగా ఉంటారు. దంపతుల మధ్య అపర్థాలు చెలరేగటం, గొడవలు కలగటం, వివాదాలు, చివరగా విడాకులు వీటన్నిటికి శని కారకుడు అవుతాడు. నపుంసకత్వానికి, పుత్రుడు కలుగకపోవడానికి శని కూడా కారకుడు అవుతాడు. ఒక్కోసారి ఈ లక్షణాలు కూడా విడాకులకు దారి తీస్తాయి.


దంపతులు విడిపోవటానికి ‘రాహువు’ ఏ విధంగా కారకుడు అవుతాడు ?✍️


వైవాహిక స్థానాలకు, రాహువుకు సంబంధము ఉంటే విడాకులు కలుగుతాయి. విడదీయటములో రాహువు ముఖ్య కారకుడు అవుతాడు. ముఖ్యంగా 7వ భావ రాహువు వలన జాతకుడు లేదా జాతకురాలు ఒకే స్త్రీ లేదా పురుషునితో శారీరక ఆనందము లభించక, ఇతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రకమైన జాతకులు ఎంతో కాలం ఒకరితోనే జీవించరు. వీరికి జీవిత భాగస్వాములు మారుతూనే ఉండాలి. రాహువు జాతకుడిని ఇతరులను గేలి చేసే స్వభామును కలుగచేస్తాడు.


         నా అనుభవములో విడాకులు కలిగిన వారిలో జతకములో రాహువు వలన విడాకులు కలిగినవారిలో ముఖ్య కారణం శారీరక సమస్యగా తెలిసింది. ఇంకొన్నిటిలో వివాహేతర సంబంధాల వలన కూడా విడాకులు జరిగాయి.


దంపతులు విడిపోవటానికి ‘కేతువు’ ఏ విధంగా కారకుడు అవుతాడు?✍️


కేతువు దేనినైనా సరే బూడిదగా మార్చే స్వభావము గలవాడు. ఐహిక సంబంధాలకు మనలను దూరం చేసేందుకు కేతువు తోడ్పడతాడు. కేతువు 7వ భావములో ఉంటే జాతకుడికి వైవాహిక జీవితము పై ఆసక్తి చూపించకుండా ఈ కేతువు చేస్తాడు. కుటుంబ జీవితం అంటే జాతకుడికి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ వివాహేతర సంబంధములు గాని లేదా వివాహానికి ముందే ఉన్న ప్రేమ వ్యవహారమును కొనసాగించడం గాని చేస్తూ ఉంటారు.


అదే ఒకవేళ కేతువు శుక్రుడితో కలసి వైవాహిక స్థానములో ఉంటే దగ్గరి బంధువులతోగాని లేదా స్నేహితులతో గాని రహస్యమైన ప్రేమ వ్యవహారములు నడుపుతారు.


         ఏది ఏమైనా సరే కేతువు వైవాహిక స్థానానికి సంబంధం ఉంటే, జాతకుడు తన భార్య/భర్త నుండి పూర్తిగా విడిగా ఉంటారు. కేవలం భవిష్యత్తు తరము కోసం గాని లేదా వంశానికి వారసుల కోసం గాని వివాహానికి అనుమతిస్తారు. ఈ లాంటి జాతకులు తమకు బిడ్డ పుట్టే సమయానికి తన భార్య/భర్తతో విడిపోయి ఉంటారు. 


కేతువు వలన జాతకులు విడిపోయే సందర్భాలు ఉన్నాయి గాని, విడాకులు తీసుకునే సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు.


రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములు శత్రు స్థనాలలో గాని లేదా నీచ స్థానాలలో గాని ఉండినట్లైతే , దంపతులు విడిపోవడం జరుగుతుంది.

రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములు మరియు వాటి స్థానాలు చెడు దృష్టికి గురి అయి ఉంటే దంపతులకు విడాకులు కచ్చితంగా కలుగుతాయి.

ఒకవేళ రవి,కుజ,శని,రాహు,కేతు గ్రహములలో మంచి శుభగ్రహ దృష్టి పడితే దంపతులకు విడాకులు కలిగిన తరువాత మళ్ళీ కలసి జీవిస్తారు.

సప్తమాధిపతి 6వ భావములో ఎలాంటి శుభ గ్రహ దృష్టి లేకుండా ఉంటే జాతకులకు విడాకులు కలుగుతాయి.

శని,రాహువులు కలసి లేదా ఏదో ఒక్క గ్రహం అయినా లగ్నములో ఉంటూ, తీవ్రమైన చెడు గ్రహ దృష్టి పడితే దంపతులు విడిపోవడం జరుగుతుంది .అయితే ఈ గ్రహస్తితి ఉన్నవారికి మళ్ళీ తన జీవిత భాగస్వామితో కలవడం అనేది జరుగదు. కొన్నిసార్లు విడాకుల కొరకు చట్టపరమైన హింసాలను భరించాల్సి ఉంటుంది.

సప్తమాధిపతి వక్ర స్థితిలో ఉన్నా లేదా అస్తంగత్వం చెందినా (రవితో కలసినా) లేదా నీచపడినా దంపతులు విడిపోవాల్సి ఉంటుంది.


ఈ విధంగా ఎన్నో గ్రహములు, వాటి స్థానములు, వాటి అధిపతుల స్థానములు ఎన్నో దంపతుల మధ్య విబేధాలకు, విడకులకు, విడిపోవడానికి కారణభూతం అవుతున్నాయి. అయితే జన్మకుండలి పూర్తి విశ్లేషణ చేయనిదే ఎలాంటి నిర్ణయం చేయకూడదు.


ఇక పరిష్కారం విషయానికి వస్తే జన్మకుండలిలో ఏ గ్రహము వలన జాతకుడు పీడింపబడుతున్నాడో , ఆ గ్రహముకు సంబంధించిన జప,దాన,

హోమములు సరైన పరిష్కారములు అని తెలుపటలో సందేహమే లేదు.(ఇది నా ఉద్దేశం అనుభవం మాత్రమే)

‎🙏🙏🙏🙏🙏🙏🙏✍️

‎ఓం ప్రాం ప్రీం ప్రౌo సః..

‎ఓం శనైశ్చరాయనమః

‎🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️

‎మీ.చాగంటి కనకయ్య.

‎శ్రీ చాగంటి అస్ట్రోవిషన్.

‎(జ్యోతిష పరిష్కార నిలయం)

‎PH:-8374625255..

‎🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️

‎ఓం ఖ్రాం ఖ్రీమ్ ఖ్రీమ్ ఖ్రీమ్ సః

‎శనీయే నమః

‎🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️.

చేయకూడని కొన్ని

  చేయకూడని కొన్ని విషయాలు గమనింద్దాం..!! 

భార్యలు

1. భర్తను గురించి ఎప్పుడు నలుగురిలో మాట్లాడకుండటం. మీ భర్తలో మీకే తెలిసిన భలహీనతలు ఉండొచ్చు వాటి గురించి మూడో వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేయకండి. చాల మంది స్త్రీలకు కుటుంభంలో చిన్న విషయం జరిగినా వెంటనే తల్లికో , తోబుట్టువుకో చెప్పుకుంటారు. అది అంతటితో ఆగితే సరి కాని వాళ్ళు సమయం చూసుకొని మీ భర్త దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తారు. అది ప్రయివేట్ గా మాట్లాడితే సరి కాని కొద్ది మంది అందరి ముందు మాట్లాడి రచ్చ రచ్చ చేయడమో లేదా హేళన చేయడమో చేస్తే ఆయన పరువు పోతుంది..! 


2.ఆయన పరువే కదా పోనియ్ అని అనుకోకండి. ఆయన పరువు పొతే ఆయనతో పాటు మీది కూడా పోతుంది అన్న విషయం గుర్తుంచుకోండి..! 


3. ఎప్పుడు మీరు అది గుర్తు పెట్టు కోరు ఇది గుర్తు పెట్టుకోరు అని పదే పదే నిందించకండి. తన పనులతో పాటు ఇంటి విషయాలు కూడా చూడాలంటే కుదరకపోవచ్చు. గృహ సంభంద భాద్యతలలో పడి మర్చిపోవచ్చు అర్ధం చేసుకోండి..! 


4. మీ అవసరం కోసం, మీ కోరికల చిట్టా తెరవడానికి శృంగారాన్ని వాడకండి. మీ మీద ఏహ్య భావం కలిగే అవకాశం ఉంది..! 


5. మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎవరు సరిదిద్దుతారా అని ఏ వ్యక్తి గురించో , పుస్తకం గురించో వెతక్కండి. వాటివల్ల ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. మీకు ఆ విషయమై పశ్చాతాపం ఉంటే మీరే ముందు క్షమాపణ చెప్పండి. మీ తప్పు కాక మీ సహచారుడిదే తప్పైతే ఆయనకు ఏమి జరిగింది ఎలా జరిగిందో ఒక ఉత్తరం రాయండి..! 


6. ఎక్కువ మంది భార్యలు భర్తలను తిట్టేది డబ్బు విషయం దగ్గరే. తిట్టి కసురుకునే కన్నా అతనితో కూర్చోండి అతనికి తెలియకుండా ఒక నెల ఒక డ్రాఫ్ట్ తయారు చేసి చూపించి మీ మార్గంలో అయితే మీరేమి చేసేవారో చెప్పి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి..! 


7. మీ ఇద్దరు మాట్లాడుకునేప్పుడో , లేదా బయట వారు అంటే మీ స్నేహితులో చుట్టాలో ఇంటికి వచ్చినప్పుడు అతని మాటలు కూడా మీరే మాట్లాడకండి. మీ భర్తను కూడా మాట్లాడనీయండి. అతని నోరు మీరయ్యే పరిస్థితి కలిగితే బయటివారి ముందు అతను చులకన అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది..! 


8.మీరు మైండ్ రీడర్ లాగా ప్రవర్తించకండి. తను చెప్పాలనుకున్నది మీరనుకున్నది కాదేమో. మీరే ముందు మైండ్ రీడర్ లాగా గెస్ కొడుతూ మాట్లాడితే ఆయనకు మీతో పంచుకోవాలి అని అనిపించిన విషయం కూడా చెప్పాలని పించదు..! 


9. మీ భర్తే కాదు , ఏ మనిషి కూడా మైండ్ రీడర్ కాదు. మీకు ఏదైనా కావాల్సివచ్చిన , ఏదైనా చెప్పాలనుకున్న పంచుకోండి. అతడు ఇలా చేస్తాడో లేదో చూద్దాం అని మీతో మీరే పోటి పెట్టుకోకండి. మనుషులు భవిష్యత్తును తెలుసుకునే దేవతలు కారు..! 


10. ఎప్పుడైనా బయటి విషయాలు ఒత్తిడి వల్ల మీ భర్త చాలా కోపంగా ఉంటే అతన్ని కదిలించకండి. అతను నిమ్మలించే వరకు అతన్ని అలా వదిలేయండి. లేదంటే ఆ కోపం మీపై చూపించేస్తే మీరు హర్ట్ అవుతారు..! 


11. మీ భర్త బంధువుల గురించిన తప్పుడు మాటలు , వాళ్ళపై లేనిపోనివి చెప్పకండి మీ మీద నమ్మకం పోయే ప్రమాదముంది..! 


12. ఒక మంచి పని గురించి ఆలోచిస్తూ మీ సలహా అడిగినప్పుడు మీరిలా కాదు ఇలా చేయండి అని మీకు తెలిసిన విషయమైతే మీ నేర్పు ప్రదర్శించి అతన్ని నొప్పించకండి. మంచి స్నేహితురాలిలా మెత్తగా తెలుసుకునేలా చెప్పండి..!

వృద్ధులకు ప్రాణసంకటం

 వృద్ధులకు ప్రాణసంకటం *పొలమారడం* తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడమే కాకుండా, అంతర్గత అవయవాల పనితీరులో కూడా అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా 60-70 ఏళ్లు దాటిన వారు ప్రధానంగా రెండు విషయాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: 

ఒకటి పడకుండా చూసుకోవడం, రెండు పొలమారకుండా (Choking) జాగ్రత్తపడడం. వృద్ధులలో గొంతు మరియు మింగడానికి సహకరించే కండరాలు బలహీనపడటం వల్ల ఆహారం లేదా నీరు శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల *ఆస్పిరేషన్ నిమోనియా* వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు రావచ్చు, కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో, వైద్య నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు:

*1)నీరు తాగేటప్పుడు ఏకాగ్రత అవసరం:* వయసు పైబడిన వారు నీరు తాగేటప్పుడు మరే ఇతర పనులు చేయకూడదు. నడవడం, మాట్లాడటం లేదా టీవీ చూడటం వంటివి ఆపి, కేవలం నీరు తాగడంపైనే దృష్టి పెట్టాలి. చాలా నెమ్మదిగా, చిన్న చిన్న గుక్కలు మాత్రమే తాగాలి. 

*2)తల వంచి నీళ్లు తాగడం* 

*(Chin-Tuck Method):* నీళ్లు మింగేటప్పుడు తల కొంచెం కిందకు వంచడం వల్ల శ్వాసనాళం మూసుకుపోయి, ఆహారం లేదా నీరు నేరుగా అన్నవాహికలోకి వెళ్తుంది. నీళ్లు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం మంచిది. అలాగే, మింగే సమయంలో తల పైకి ఎత్తకుండా, గడ్డాన్ని ఛాతి వైపు కొంచెం కిందకు వంచి (Chin-down position) మింగాలి. ఇలా చేయడం వల్ల శ్వాసనాళం మూసుకుని, నీరు నేరుగా అన్నవాహికలోకి వెళ్తుంది. ఇది పొలమారకుండా (Choking) కాపాడుతుంది.

*3)పలచని ద్రవాల కంటే చిక్కటివి మేలు:* పలచగా ఉండే సూప్‌ల కంటే చిక్కటి సూప్‌లు తీసుకోవడం సురక్షితం. పలచని ద్రవాలు వేగంగా గొంతులోకి జారిపోయి, నియంత్రణ తప్పి శ్వాసనాళంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చిక్కటి పదార్థాలు నెమ్మదిగా కదులుతాయి కాబట్టి మింగడానికి సులభంగా ఉంటాయి. అందుకే సూప్ వంటి వాటిని కొంచెం చిక్కగా తీసుకోవడం సురక్షితం.

*4)ఆహారం మరియు పానీయాలు కలపవద్దు:* నోటిలో ఆహారం నములుతున్నప్పుడు లేదా ఆహారం ఇంకా నోట్లోనే ఉన్నప్పుడు నీళ్లు తాగకూడదు. ఘన పదార్థం, ద్రవ పదార్థం ఒకేసారి మింగడం వల్ల పొలమారే అవకాశం 80% పెరుగుతుంది.

*5)భోజన సమయంలో నిశ్శబ్దం:* నోటిలో ఆహారం ఉన్నప్పుడు మాట్లాడటం లేదా తల అటు ఇటు తిప్పడం ప్రమాదకరం. వృద్ధులకు కండరాల సమన్వయం తక్కువగా ఉంటుంది కాబట్టి, చిన్నపాటి అజాగ్రత్త కూడా శ్వాస ఆడకుండా చేయవచ్చు.

*6)దగ్గు వస్తే అశ్రద్ధ చేయకండి:* పొలమారి దగ్గు వచ్చినప్పుడు వెంటనే కంగారు పడకుండా, గాలి పీల్చుకోవడానికి ప్రయత్నించాలి. పక్కన ఉన్న వారు వారి వీపుపై నెమ్మదిగా చరచడం సహాయపడుతుంది. అలాగే నీరు తాగినప్పుడు లేదా ఆహారం తీసుకున్నప్పుడు ముఖం ఎర్రబడటం, విపరీతంగా దగ్గు రావడం జరిగితే అది ప్రమాద సంకేతం. ఇలా జరిగినప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. తరచుగా ఇలా జరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే వృద్ధాప్యంలో మింగడం కష్టమయ్యే పరిస్థితిని వైద్య పరిభాషలో *డిస్ఫేజియా* (Dysphagia) అంటారు. 

*ఈ సందర్భంగా తీసుకోవాల్సిన మరికొన్ని సూచనలు:* పొడి ఆహారం వద్దు. మరీ పొడిగా ఉండే బిస్కెట్లు లేదా బ్రెడ్ వంటివి గొంతులో అడ్డుపడే అవకాశం ఉంది. వాటిని పాలు లేదా టీలో నానేసి తీసుకోవడం మంచిది.

భోజనం తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం 30 నిమిషాల పాటు కూర్చోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది మరియు వెనక్కి తన్నే (Reflux) ప్రమాదం తగ్గుతుంది. వృద్ధుల పట్ల ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల *ఆస్పిరేషన్ నిమోనియా* (Aspiration Pneumonia) వంటి ప్రమాదకర పరిస్థితుల నుండి వారిని కాపాడవచ్చు. నివారణే మేలు అనే సామెత వృద్ధుల విషయంలో అక్షర సత్యం. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన పెద్దవారిని పెద్ద ప్రమాదాల నుండి కాపాడతాయి. ఈ సమాచారాన్ని మీ కుటుంబసభ్యులకు మరియు స్నేహితులకు పంచుతూ, వారి ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలి. 

డా.వెలగపూడిఉమామహేశ్వరరావు, మాజీ రిజిస్ట్రార్, 

ఆంధ్ర విశ్వవిద్యాలయం, 

మేనేజింగ్ ట్రస్టీ, 

లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నం. +919849162699

సుభాషితమ్

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


        శ్లో𝕝𝕝 *ఇన్ద్రియాణి చ సంయమ్య*

                 *బకవత్‌ పణ్డితో నరః |*

                 *దేశకాల బలం జ్ఞాత్వా*

                 *సర్వకార్యాణి సాధయేత్‌ ||* 


తా𝕝𝕝 *బుద్ధిమంతుడైన మనుష్యుడు కొంగవలె నేకాగ్రచిత్తుడై యింద్రియములను వశమునందుంచుకొని, దేశమును, కాలమును, తన బలమును తెలిసికొని సమస్త కార్యములను సాధింపవలెను...*

 

✍️🪷💐🌹🙏

*శ్రీ రుద్రం

 🌻🌻🌻🌻🌻🌻


🙏🌺 *శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు ఫలితాలు* 🌺🙏


🌺 01. *ఓం నమః శివాయ* - 


*మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి*


🌺 02 *ఓం నమో భగవతే రుద్రాయ* -


*బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి* 


🌺 03. *ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః* - 


*శరణాగతికీ , సర్వ శుభాలకీ* 


🌺 04. *త్రయంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్* 


 *- ఆయుర్దాయం కోసం* 


🌺 05 *ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి*  


*మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి హర హర మహాదేవ్.*


 *ఓం నమః శివాయః* 

*హరహర మహాదేవ శంభో శంకర* 


*ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ*

*త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ*

*కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ*

*సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

ఈ తాత్కాలిక భౌతిక ప్రపంచం పుట్టుక, వృద్ధాప్యం, వ్యాధి మరియు మరణం యొక్క బాధలతో నిండి ఉంది కాబట్టి, సహజంగానే అత్యున్నత పరిపూర్ణతను సాధించి, కృష్ణలోకమైన గోలోక వృందావనాన్ని పొందేవాడు తిరిగి రావాలని కోరుకోడు. 


అత్యున్నత గ్రహం వేద సాహిత్యంలో అవ్యక్త మరియు అక్షరం మరియు పరమ గతి అని వర్ణించబడింది; 

మరో మాటలో చెప్పాలంటే, ఆ లోకము మన భౌతిక దృష్టికి మించినది, మరియు అది వివరించలేనిది, కానీ అది మహాత్ములకు గమ్యస్థానం, అత్యున్నత లక్ష్యం. 


మహాత్ములు సాక్షాత్కరించిన భక్తుల నుండి అతీంద్రియ సందేశాలను స్వీకరిస్తారు మరియు క్రమంగా కృష్ణ చైతన్యంలో భక్తి సేవను అభివృద్ధి చెందుతారు మరియు అతీంద్రియ సేవలో లీనమైపోతారు, వారు ఇకపై భౌతిక లోకాలలో ఎరకమైన ఔన్నత్యాన్ని కోరుకోరు, లేదా వారు ఏ ఆధ్యాత్మిక గ్రహానికి బదిలీ చేయబడాలని కూడా కోరుకోరు. 

వారికి కృష్ణుడు మరియు కృష్ణుడి సాంగత్యం మాత్రమే కావాలి, మరేమీ లేదు. 

అదే జీవితంలో అత్యున్నతమైన పరిపూర్ణత. 


ఈ శ్లోకం ప్రత్యేకంగా శ్రీకృష్ణుని వ్యక్తిగత భక్తులను ప్రస్తావిస్తుంది. 

కృష్ణ చైతన్యంలో ఉన్న ఈ భక్తులు జీవితంలో అత్యున్నత పరిపూర్ణతను సాధిస్తారు. 

మరో మాటలో చెప్పాలంటే, వారు ఉన్నతమైన ఆత్మలు.


(భగవద్గీత అధ్యాయం.8)

వచనం.15


హరే కృష్ణ

సదా మీ శ్రేయోభిలాషి

శివుడు ఉండమని అడిగినా

  శివుడు ఉండమని అడిగినా ఆదిశంకరులు ఎందుకు ఉండలేదు రెండు రోజులు:


శంకరాచార్యులు " శివానందలహరి " చేస్తూ ఒక అద్భుత శ్లోకంతో శివుణ్ణి ప్రార్ధిస్తారు:


అశనం గరళం ఫణీ కలాపో

వసనం చర్మచ వాహనం మహోక్షః

మమ దాస్యసి కిం కిమస్తి శంభో

తవ పాదాంబుజ భక్తిమేవ దేహి "


ఓరోజు శంకరాచార్యులవారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్ధన చేసుకోవాలనిపించింది. కైలాసానికి చేరుకున్నారు. శివుడు పరమానందపడిపోయి " రావోయ్, ఎన్నాళ్ళకి వచ్చావు, కూర్చో " అన్నారు. 10 ని.లు అవగానే తను తిరిగి వెడతానన్నారు శంకరులు. " అదేమిటోయ్ రాకరాక వచ్చావు, రెండు రోజులు ఉండి వెడుదువుగాని " అన్నారు శివుడు.


అప్పుడు శంకరులు పై శ్లోకాన్ని చెబుతారు.


మనం వేరే ఊరిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళామనుకోండి. ఇంట్లోకి ఆహ్వానించి సామాను ప్రక్కరూములో పెట్టుకో అంటాడు. లుంగీ ఇచ్చి కట్టుకోమని కాఫీ ఇస్తాడు. స్నానంచేసి రమ్మని టిఫిన్ పెడతాడు. తన స్కూటర్ మీదో కారుమీదో ఊరంతా చూపిస్తాడు. వెళ్ళేటప్పుడు ఏదో చిన్న జ్ఞాపిక ఇచ్చి సాగనంపుతాడు.


ఇదే విషయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా శివుడితో ఏమన్నారో చూద్దాం.


నువ్వు ఉండేదే శ్మశానంలో కనుక నన్నుకూడా ఓ ప్రక్కన సర్దుకోమంటావు. నువ్వు త్రాగేదే గరళం కనుక నాకు కూడా కొంచెం అదే త్రాగమని ఇస్తావు. నువ్వుకట్టుకునేదే జంతుచర్మం కనుక ఓ చిన్నముక్క నాకు కూడా ఇస్తావు కట్టుకోమని. నువ్వు తిరిగేదే ఎద్దుమీద కనుక దానిమీద ఎక్కించుకునే అటూ ఇటూ త్రిప్పుతావు నన్ను. నువ్వు ధరించేవే నాగుపాములు కనుక నేను వేళ్ళేటప్పుడు ఓ చిన్నపాముని జ్ఞాపికగా ఇస్తావు. " ఇవన్నీ భరించడం నావల్ల అవదు కానీ నీపాదాలను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి అనుగ్రహించు స్వామీ " అని వేడుకున్నారు అనుకోవాలి.


ఎంత అద్భుతంగా ఉంది శంకరుల వేడికోలు..

సమస్యాపూరణం

 సమస్యాపూరణం.


"దొరకును సిరులున్ యశమ్ము దుర్వ్యసనములన్.'


ఒరుల హితముకై బ్రతుకగ,

దొరకును సిరులున్ యశమ్ము,- దుర్వసనములన్

బొరపాటున దరిజూడక,

వరలగ సాగించు జన్మ వర్ధిలునెపుడున్ .


{2}. సమస్య. "దొరకును కీర్తిసంపదలు దుర్వ్యసనమ్ముల వీడకున్నచో'.


గురువుల జ్ఞానమార్గమున కూరిమి సాగగ జీవనంబునన్,

బరిణతి గాంచవచ్చు నవభారత జాగృతి సేవసేయగా

దొరకును కీర్తిసంపదలు,- దుర్వ్యసనమ్మ్ముల వీడకున్నచో,

కొఱవిని బట్టి తా దలను గోకికొనెండు విధమ్మె యౌ గనన్‌..


సురభి శంకరశర్మ.

తద్దినం ఎందుకు ?

  సైన్స్ : తద్దినం ఎందుకు ?


 మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం... ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.

కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పర మాయలో పడుతున్నారు.  మన తరువాత ఎప్పుడో వచ్చిన  మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||

దివ్యశక్తి ని పొందాలంటే ?ఎలా

 *దివ్యశక్తి ని పొందాలంటే ?ఎలా??...* 


ఈరోజుల్లో చాలా మంది భక్తులు దేవుడు ఎక్కడ వున్నాడు, దేవుడు వుంటే నాకు ఇది జరగాలి, అది జరగాలి అని చాలా చాలా మాటలు చెబుతుంటారు, ఇంకొందరు తిడుతూ శాపనార్థాలు పెడుతుంటారు ... !!1..


అసలు ఆ భగవంతుడే లేకుంటే !!...

పూవు లోని పరిమళములు, గ్రుడ్డులోని పిట్ట, 

చెఱకులోని తీపి, 

మిరప లోని కారము, 

వేప లోని చేదు..

. ఇవన్నీ ఎక్కడనుండి ప్రారంభ మయ్యాయి? 


వీటిని అర్థం చేసుకోవడానికే మానవునికి సాధ్యం కావట్లేదు, కానీ ఇవన్నీ దైవసృష్టి లోని విచిత్ర ములే! 


మానవుడు దైవాన్ని గుర్తించడం కోసం ఈ రకమైన సృష్టి ఏర్పడింది. 


ఎత్తైన పర్వతాలు,

 నదీ ప్రవాహాలు,

 ఉప్పొంగే సముద్రాలలో ఎంతటి అందమున్నది! 

ఇవన్నీ దైవము యొక్క పరమాద్భుత మైన సౌందర్యము నకు ప్రతీకలు. 


దైవము యొక్క సౌందర్యము ను వర్ణింప ఎవరికీ సాధ్యము కాదు. 

అలాగే ...

దైవము యొక్క శక్తి సామర్థ్యము లను గుర్తింప వీలుకాదు. 

అల్ప బుద్ధి గలవారు అనంతమైన దైవ స్వరూపాన్ని ఏరీతిగా అర్ధము చేసుకోగలరు? 


దైవత్వమును పొందాలంటే, తగిన అర్హతను మనము పొందాలి. 

ఉపనిషత్తుల సారమిదే!! ...

రాముడా, 

కృష్ణుడా, ?

గోవిందుడా? 

నారాయణుడా?  

అసలు ఆ దివ్య శక్తి కి రూపమే లేదు. 

అందులో పరిపూర్ణ మైన జ్ఞానము, ఆనందము తప్ప అన్యములేదు. 


స్థిరమైన భక్తి, నిర్మల త్వము, నిస్వార్థ మును సాధించాలి అప్పుడే దివ్య శక్తి గోచర మౌతుంది. 


            *_శుభమస్తు_*

🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

పంచాంగము



 

Mantra - 33

 Mantra - 33 ARUNAM 4 anuvaakam


నిన్నటి మంత్రంలో ‘శరత్కాలపు ఆకాశంలా నీ మనస్సును నిర్మలం చేసుకున్నప్పుడు, కదిలే వాయువులోనూ, కదలిక లేని ఆత్మను దర్శించగలవు’ అన్న సందేశం తరువాత, ఈ క్రింది మంత్రం లో ప్రకృతి శక్తులను, ముఖ్యంగా మరుద్గణాలను (వాయు దేవతలను) అత్యంత శక్తివంతమైన యుద్ధ వీరులతో పోలుస్తూ వర్ణించే అద్భుతమైన ఘట్టం కనిపిస్తుంది.


“అముతో జేతుమిషుముఖమివ। 

సన్నద్ధాస్సహ దదృశే హ |

అపధ్వస్తైర్వస్తివర్ణైరివ |

విశిఖాసః కపర్దినః॥”


“అముతో జేతుమిషుముఖమివ" - అక్కడి నుండి (ఆకాశం నుండి) విజయం సాధించడానికి సిద్ధంగా వదులబడిన బాణం అంచు వలె.

ఇక్కడ వాయువు లేదా మేఘాల కదలిక ఎంత వేగంగా, ఎంతటి గురితో ఉందో వివరించడానికి 'ఇషుముఖం' (బాణం అంచు) అనే ఉపమానాన్ని వాడారు.


"సన్నద్ధాస్సహ దదృశే హ” - వారందరూ కలిసి యుద్ధానికి సన్నద్ధులైన వీరుల్లా కనిపిస్తున్నారు. 

అంటే ప్రకృతిలోని శక్తులు ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంలా ఏకధాటిగా కదులుతున్నాయని అర్థం.


“అపధ్వస్తైర్వస్తివర్ణైరివ” - ధూళి వల్ల లేదా అలసట వల్ల వివర్ణమైన (రంగు తగ్గిన) వస్త్రాలు ధరించిన వారి వలె.

ఇది ఆకాశంలోని మేఘాల బూడిద రంగును లేదా గాలి వల్ల రేగిన ధూళి రంగును సూచిస్తుంది.


“విశిఖాసః కపర్దినః” - జుట్టు విరబోసుకున్న వారు (విశిఖాసః) మరియు జటలు ధరించిన వారు (కపర్దినః). వేగంగా వీచే గాలికి మేఘాలు చెల్లాచెదురుగా, జటల్లా కనిపిస్తాయి. ఇది వాయువు యొక్క ఉగ్రరూపాన్ని, రుద్రుని అంశను ప్రతిబింబిస్తుంది.


వేదమంత్ర దృష్ట ఆకాశంలో కదిలే మేఘాలను, వీచే గాలులను చూసి, అవి అసుర శక్తులపై పోరాటానికి వెళ్తున్న దేవతా సైన్యంలా ఉన్నాయని ఊహించడం (Metaphor) ఇక్కడి విశేషం.


మరుత్తులు రుద్రుని కుమారులు. తండ్రి లాగే వీరు కూడా జటలు (కపర్దము) ధరించి, శత్రు భయంకరులుగా ఉంటారని పురాణోక్తి. ఆ గంభీరత ఈ మంత్రంలో కనిపిస్తుంది.


"విశిఖాసః" వంటి పదాలు వైదిక సంస్కృతంలోని ప్రత్యేక రూపాలు (Vedic Nominative Plural). ఇవి లౌకిక సంస్కృతంలో "విశిఖాః" అని మారుతాయి. వేద పారాయణంలో ఈ శబ్దాలు మంత్రానికి ఒక ప్రత్యేకమైన శబ్ద గాంభీర్యాన్ని ఇస్తాయి.


అరుణప్రశ్నలో సూర్యుడిని ఆరాధించే క్రమంలో, ఆయన ప్రేరణతో ప్రకృతిలో కలిగే ఈ చలనం, జీవరాశిని ఏ విధంగా రక్షిస్తుందో ఈ మంత్రాలు వివరిస్తాయి. ఈ మంత్ర పఠనం మనస్సులో ధైర్యాన్ని, కార్యశూరత్వాన్ని నింపుతుందని విశ్వాసం. ఈ మంత్రాల్లోని అలంకార శాస్త్రం మరియు శబ్ద సౌందర్యాన్ని గమనించవచ్చు.


తత్వాన్ని విచారిస్తే…

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రంలోని ప్రతీకలు సాధకుని అంతర ప్రయాణాన్ని సూచిస్తాయి:


‘ఇషుముఖమివ’ - ఏకాగ్రత - బాణం అంచు ఎంత సూటిగా, తీక్షణంగా ఉంటుందో, అద్వైత సాధకుని బుద్ధి అంత ఏకాగ్రతతో ఉండాలి.


‘జేతుమ్’ - ఇక్కడ జయించడం అంటే బయటి రాజ్యాలను కాదు, మనస్సులోని అజ్ఞానాన్ని, అరిషడ్వర్గాలను జయించడం.


జ్ఞానమనే బాణంతో అజ్ఞానమనే లక్ష్యాన్ని ఛేదించడమే ఇక్కడ యుద్ధ సన్నద్ధత.


‘విశిఖాసః కపర్దినః’ - ద్వంద్వాతీత స్థితి (Beyond Outer Forms)

ఇక్కడ 'విశిఖులు' (శిఖ లేని సన్న్యాసులు) మరియు 'కపర్దులు' (జడలు ధరించిన యోగులు) అనే ప్రస్తావన ఉంది. సన్న్యాసం అనేది త్యాగానికి గుర్తు, యోగం అనేది చిత్త వృత్తి నిరోధానికి గుర్తు.

అద్వైత దృష్టిలో, బయటి రూపం (శిఖ ఉందా లేదా అనేది) ముఖ్యం కాదు. అంతరంగా పరమాత్మతో అనుసంధానం అవ్వడమే ముఖ్యం. కిరణాలు భిన్న రూపాల్లో ఉన్నట్లు అనిపించినా, వాటన్నింటికీ మూలం సూర్యుడే. అలాగే, సాధకులు ఏ మార్గంలో ఉన్నా, అందరూ ఆ ఏకైక బ్రహ్మ వైపుకే ప్రయాణిస్తున్నారు.


అపధ్వస్తైర్వస్తివర్ణైరివ - దేహాభిమాన త్యాగం:

యుద్ధంలో లేదా తపస్సులో ఉన్నప్పుడు శరీర రంగు, అలంకరణల మీద దృష్టి ఉండదు.

అద్వైత సాధనలో 'దేహాభిమానం' (నేను ఈ శరీరాన్ని అనుకోవడం) వదిలేయాలి.

సూర్యకిరణాలు మేఘాలను, చీకటిని చీల్చుకుంటూ వచ్చినప్పుడు వాటి రంగులు మారినట్లు అనిపిస్తాయి, కానీ సూర్య ప్రకాశం మారదు. అలాగే, ఉపాధి వల్ల కలిగే మార్పులు ఆత్మకు అంటవు (అసంగత్వం).


‘సన్నద్ధాః’ - నిరంతర జాగృతి (Constant Awareness)

సూర్యకిరణాలు ప్రపంచాన్ని చీకటి నుండి రక్షించడానికి ఎల్లప్పుడూ ఎలా సన్నద్ధంగా ఉంటాయో, ఆత్మ చైతన్యం మనలో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది.

మనం చేయవలసిందల్లా ఆ సన్నద్ధతను గుర్తించడం. యుద్ధానికి సిద్ధమైన వీరుడిలా, సాధకుడు మాయా ప్రవాహానికి ఎదురు నిలిచి, తన నిజ స్వరూపాన్ని రక్షించుకోవాలి.


మంత్ర సారం:

అజ్ఞానమనే శత్రువును జయించడానికి నీ బుద్ధిని బాణం వలె తీక్షణంగా మార్చుకో. బాహ్య రూపాలతో సంబంధం లేకుండా (సన్న్యాసి లేదా యోగి), నీ లోపల వెలిగే ఆత్మ చైతన్యంతో యుద్ధానికి (జ్ఞాన సాధనకు) సన్నద్ధుడవు కావాలి. మాయా పొరలను చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణమే నీకు మార్గదర్శి.


ఈ మంత్రం ద్వారా ప్రకృతిని ఒక రణరంగంగా, జ్ఞాన సాధనను ఒక వీరకృత్యంగా అరుణ ప్రపాఠకము అభివర్ణించింది.