2, మే 2026, శనివారం

శ్రీనివాస స్తుతి

  🌸శ్రీనివాస స్తుతి🙏


సీ.  వేంకటా చలపతి! వేగమే రావయ్య 

 సప్తగిరులు దిగి సాధుశీల!

అలమేలుమంగతోయాలసిం పకనిక 

శ్రీనివాసా! రావశీఘ్రముగను

భక్తుల రక్షించు వరదుడా బాధలు

తీర్చుమా జనులకు దీనబంధు 

కొండల పైనున్న కోనేటి రాయుడా!

కోర్కెలు తీర్చుమా కూర్మితోడ 

తే,.. మునులుసైతము దర్శించు ముక్తి కోరి

మానవులపైనదయచూపు మమత తోడ 

తిరుమలగిరిపైవెలసిన దివ్యమూర్తి!

నిత్యకళ్యాణములునీకు నిర్మలాత్మ!


సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

*సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శుక్రవారం 1 మే 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣1️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *212 వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*సంజయునికి ధర్మజుడు బదులిచ్చుట*```


సంజయుని మాటలు విన్న ధర్మరాజు “సంజయా! నీవు పలికింది నిజమే. కర్మలలో ధర్మం శ్రేష్టమైనదనుట సత్యం. ఒక్కొక్క చోట ధర్మం అధర్మ రూపంలో కనపడుతుంది. మరొకచోట ధర్మం అధర్మంగా కనపడుతుంది. ఇంకొకచోట ధర్మం తన సహజమైన ధర్మ రూపాన్నే ధరిస్తుంది. విద్వాంసులు తమ బుద్ది చేత దాని అసలు రూపాన్ని చూడగలరు. ధర్మాధర్మాలు ఆపత్కాలంలో భిన్న లక్షణాన్ని పొందుతాయి. ఆపత్ధర్మం యొక్క స్వభావం వీరేగా ఉంటుదని తెలుసుకో. కనుక నన్ను నిందించదలచుకున్న నేను చేసినది అధర్మం అని నిరూపించి నిందించు. నువ్వు చెప్పినట్లు కోపం నివారించదగినది. అహింస పరమ ధర్మమే. కానీ లోక కంటకులను, వంశనాశకులను, పాపాత్ములను నిర్మూలించి ప్రజలను రక్షించుట క్షత్రియ ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను. ఈ భూమండలం మీదున్న సమస్త ధనం లభిస్తుందన్నా,దేవతల సంపత్తి లభిస్తుందన్నా, దానికంటే గొప్పదైన బ్రహ్మలోక వైభవం వస్తుందన్నా సరే నేను అధర్మం స్వీకరించను. ఇక్కడ ధర్మానికి అధినాయకుడు, నీతిజ్ఞుడు, కుశలుడు, కర్తవ్యాకర్తవ్యములను, ధర్మాధర్మములను నిర్ణయించుటకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడు నేను చేయునది ధర్మమా అధర్మమా అని నిర్ణయించి చెప్పగలడు. అతడు రెండు వైపులా హితాన్ని కోరువాడు. అతని ఆధ్వర్యంలో అంధక, భోజక, యదు, వృష్టి, శృంజయ, కేకయ రాజులు నడుచుకుంటున్నారు. మాకు అతని మాట శిరోధార్యం " అన్నాడు.

```

*సంజయునికి శ్రీకృష్ణుడి సమాధానం*```


ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు 

"సంజయా! నేను పాండవుల మేలు కోరుకుంటున్నాను. అదే విధంగా దృతరాష్ట్రుని అభివృద్ధిని కూడా కాంక్షిస్తాను. నేను ఇద్దరినీ శాంతించమనే చెప్తాను. నా కోరిక కూడా అదే. నా వల్లగాని యుధిష్ఠిరుని వల్ల గాని ధర్మ లోపం జరుగదు. ఈ విషయం నీకు కూడా తెలుసు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు తెలివి తెచ్చుకుని పాండవులను పరామర్శించడానికి నిన్ను పంపాడు. నీవూ నీకు తోచిన ధర్మాన్ని వినయంగా చెప్పావు. నీ శాంతి వచనాలు సంతోషం కలిగించాయి. పైకి సవ్యంగా కనిపిస్తున్నా ధర్మరాజు మాటలు సంధి పొసగదని భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ధర్మరాజు మాటలు సరి అయినవే. ఎందుకంటే పుత్రపక్షపాతి అయిన ధృతరాష్ట్రుడు కొడుకు మాటలు విని పాండవుల రాజ్యంను ఆశిస్తూ వుంటే ధృతరాష్ట్రుడి తీపి మాటలకు పాండవులు రాజ్య భాగం వదులుతారా? యుధిష్ఠిరుడు స్వధర్మాన్నే ఆచరిస్తాడు. ఒకవేళ తమ స్వధర్మాచరణలో దైవ వశం చేత మృత్యువును కూడా పొందవచ్చు. అది కూడా వారికి మంచిదే. నీకు అన్ని ధర్మాలు తెలుసు. గతాన్ని మరచి పాండవులు కౌరవులతో సఖ్యంగా బ్రతకాలని అనుకుంటున్నారు. అది వారి కరుణ, గొప్పతనం. ధర్మం ప్రకారం తమ తండ్రి రాజ్యం పాండవులకు ఇవ్వకుంటే వారు యుద్ధానికి సన్నద్ధం కావడం అధర్మమా? అవమానాలు నిరంతరం సహిస్తూ బతకడం కంటే యుద్ధం చేయడం మేలు అని నాకు అనిపిస్తుంది. యుద్ధం క్షత్రియ ధర్మం కాదా? అని ధర్మరాజు అడిగాడు కదా! ద్విజులకు ధర్మాధర్మాలు నిర్ణయించిన పెద్దలు క్షత్రియులు యాచించ కూడదు వారు ఇవ్వడమే కాని తీసుకోకూడదు అని చెప్పిన విషయం లోక విదితం. వర్ణాశ్రమ ధర్మ రక్షకులైన క్షత్రియులు వారి ధర్మాన్ని వదులుతారా? ధర్మంగా సంపాదించిన సంపదను అధర్మ మార్గాన కాజేసిన వారిని శిక్షించడం ధర్మమని శాస్త్రాలు భోదించ లేదా? సంజయా! ఇక్కడ వచించిన ధర్మాలు కౌరవులకు చెప్పలేదా ? వారు కాదా అధర్మంగా ప్రవర్తించినది. వారు కాదా నిండు సభలో ద్రౌపదిని వలువలు లాగి అవమానించి పాండవులకు అవమానం కలిగించినది. లోకంలో జూదం ఎవరూ ఆడలేదా వారిని ఇలాగే అవమానించారా? పాండవులు సంధికీ సిద్ధమే యుద్ధం చేయడానికి సిద్ధమే. ఈ రెండు పరిస్థుతులు గ్రహించి నీవు ధృతరాష్ట్రుడికి వున్నది ఉన్నట్లుగా చెప్పు" అని సంజయుడిని నిలదీశాడు.```


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శనివారం*🍁 *🌹02, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    🍁 *శనివారం*🍁

 *🌹02, మే, 2026🌹*

 *దృగ్గణిత పంచాంగం*              


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : పాడ్యమి* రా 12.49 వరకు ఉపరి *విదియ*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : విశాఖ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*యోగం : వ్యతీపాత* రా 09.45 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : బాలువ* ఉ 11.49 *కౌలువ* రా 12.49 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

              *-ఈరోజు లేవు-*           

 అమృత కాలం  : *రా 09.25 - 11.11*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.30*

*వర్జ్యం    : ఉ 10.47 - 12.33*

*దుర్ముహూర్తం :ఉ 05.42- 07.24* 

*రాహు కాలం   :ఉ 08.53- 10.29*

గుళికకాళం      : *ఉ 05.42 - 07.18*

యమగండం    : *మ 01.40 - 03.16*

సూర్యరాశి : *మేషం*              

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.50*  

సూర్యాస్తమయం :*సా 06.37*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.42- 08.15*

సంగవ కాలం        :*08.15 - 10.48*

మధ్యాహ్న కాలం    :*10.48 - 01.21*

అపరాహ్న కాలం    :*మ 01.21- 03.54*

*ఆబ్ధికం తిధి  :వైశాఖ కృష్ణ పాడ్యమి*

సాయంకాలం    :*సా 03.54- 06.27*

ప్రదోష కాలం      :*సా 06.27 - 08.42*

రాత్రి కాలం         :*రా 08.42 - 11.42*

నిశీధి కాలం        :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం:*తె 04.12- 04.57*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*అపహాయ రఘూద్వహమన్యమహం* 

*న కథంచన కంచన జాతు భజే*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


    *🍁హనుమకృత🍁*      

*🍁సీతారామ స్తోత్రమ్🍁*


*రఘూణం కుల దీపం చ* 

  *నిమీనం కుల దీపికాం*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శుక్రవారం 1 మే 2026*


     *శ్రీ మహావిష్ణు పురాణం*

             *74వ భాగం*


*మాధాంత వంశము - సగర చక్రవర్తి జననం*```


మాంధాత కుమారుడు అంబరీషుడు. అంబరీషుడి కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుడి కుమారుడు హరిషుడు. వీరి సంతతి అంతా అంగిరసులు అనే ఆరు కోట్ల గంధర్వులుగా వృద్ధి చెందారు. వీరు పాతాళానికి వెళ్లి నాగజాతితో యుద్ధం చేసి చెదరకొట్టి వారి వద్ద నున్న రత్నాలు మణులు అపహరించారు.


నాగులు శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్లి అంగిరసులు అనే గంధర్వులు తమ లోకం పై దాడి చేసి తమ రత్నాలు మణులు అపహరించడం గురించి విన్నవించి రక్షించమని ప్రార్ధించారు. విష్ణువు వారికి అభయమిస్తూ "నాగులారా! భూమి పైన పురుకుత్సుడు అనే రాజు రాజ్యం చేస్తున్నాడు. అతనికి నా శక్తి రక్షణగా ఉంది. మీరు వెళ్ళి ఆ రాజుని ప్రార్ధించండి గంధర్వులను సంహరించి మీకు రక్షణ ఇస్తాడు" అని ఉపాయం చెప్పాడు.


నాగులు తమలోకం తిరిగి వెళ్లి పురుకుత్సుడు దగ్గరకు ఎవరిని పంపుదాము అని చర్చిస్తుండగా అక్కడ తపస్సు చేస్తున్న ముని వచ్చి "పురుకుత్సుడికి నర్మద (నది) అంటే చాలా ఇష్టం. నర్మదకు కూడా పురుకుత్సుడి పై ప్రేమ ఉంది. నర్మద చెబితే పురుకుత్సుడు కాదనడు. మీ పక్షాన యుద్దం చేసి శత్రువులను సంహరిస్తాడు. మీరు ఆమెను ప్రార్ధించండి" అని సూచించాడు.


నాగులు నర్మదానది వద్దకు వెళ్లి ప్రార్ధించగా ఆమె దివ్యకాంతగా దర్శనమిచ్చింది. నాగులు శ్రీమహావిష్ణువు పురుకుత్స మహారాజు గురించి చెప్పినది చెప్పి ఆ రాజుని తమకు సహాయం చేసేటట్టు చేయమని ప్రార్ధించారు. 


నర్మద అంగీకరించి పురుకుత్సునికి విషయం చెప్పి నాగుల వద్దకు తీసుకువచ్చింది. 


నాగులు స్వాగతించి సత్కరించి "మహారాజా! మహావిష్ణువు వాక్కుని నిజం చేయండి. మాకు సహాయంగా యుద్ధం చేసి శత్రువులైన గంధర్వులను సంహరించండి" అని ప్రార్ధించారు.


నర్మద కూడా నాగులకు సహాయం చేయమని చెప్పింది.   


నర్మద చెప్పడంతో వెంటనే పురుకుత్సుడు గంధర్వులతో యుద్ధం చేసి వారిని సంహరించి నాగులకు భయం తొలగించాడు. 


తమకు ఉపకారం చేసిన నర్మదకు నాగులు "ఎవరైతే "ఓం నర్మదా నమః" అని ఉభయ సంధ్యలలో భక్తితో స్మరిస్తారో వారికి సర్పవిషం సోకదు. నర్మద నామం పలికి భోజనం చేసేవారికి విషము పెట్టినా అమృతం అవుతుంది" అని వరం ఇచ్చారు. 


నర్మద వరం తీసుకుని ఆనందంగా తన మాట నిలబెట్టిన పురుకుత్సుని వరించి వివాహం చేసుకుంది.


పురుకుత్సునికి నర్మదకు త్రసదస్యుడు అనే కుమారుడు కలిగాడు. అతని కుమారుడు అనరణ్యుడు యజ్ఞం చేస్తుండగా రావణుడు వచ్చి యజ్ఞం భగ్నం చేసి అనరణ్యుని చంపి వెళ్లి పోయాడు. 


అనరణ్యుని కుమారుడు హర్యాక్షుడు. హర్యాక్షుని కుమారుడు ప్రియారణుడు. ప్రియారణుని కుమారుడు సత్యవత్రుడు.


సత్యవ్రతుడు వసిష్టుని శాపం పొంది త్రిశంకుడు అనే నామంతో ఛండాలుడై అడవుల్లో ఉండసాగారు. విశ్వామిత్రుడు కుటుంబాన్ని ఆశ్రమంలో వదలి తపస్సుకి వెళ్లినప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక జనులు చనిపోసాగారు. త్రిశంకుడు అడవిలో మృగాలను చంపి మాంసం తెచ్చి ఇచ్చి విశ్వామిత్రుడి భార్య పిల్లలు మరణించకుండా కాపాడాడు.


విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని, తన కుటుంబాన్ని కాపాడిన త్రిశంకుడు కోరినట్లు యాగం చేసి సశరీరంగా స్వర్గానికి పంపాడు. 


ఇంద్రుడు క్రిందకు తోసివేస్తే త్రిశంకుడు స్వర్గం మధ్యలో సృష్టించి ఉంచటంతో ఇంద్రుడు భయపడి స్వర్గంలోకంలో ఉండటానికి అనుమతించారు.


త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి వచ్చిన కలలో ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వామిత్రునికి సకల సంపదలు, రాజ్యం ఇచ్చేసి భార్య కుమారుడితో కాశికి వెళ్లి పోయాడు. అక్కడ భార్యాబిడ్డలను అమ్మి కాటికాపరిగా పని చేసి విశ్వామిత్రుడి ఋణం తీర్చాడు. సత్య పరీక్షకు నిలబడి గెలిచి సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. స్వర్గలోకంలో ఇంద్రునితో సమానంగా సింహాసనం అధిష్టించాడు.


హరిశ్చంద్రుని కుమారుడు లోహితాస్యుడు. అతని కుమారుడు హరిషుడు. హరిషుని కుమారుడు చంచుడు. చంచునికి విజయుడు, వసుదేవుడు అనే ఇద్దరు కుమారులు. విజయుని కుమారుడు రురుడు. రురుని కుమారుడు వృకుడు. వృకుని కుమారుడు బాహుడు.


బాహుడు రాజ్యం చేస్తున్న సమయంలో హైహయులు ఆకస్మత్తుగా దాడి చేసి రాజ్యం ఆక్రమించారు. బాహుడు భార్యలతో కలిసి అడవులలో గల ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లి శరణు కోరి ఆశ్రయం పొందారు. అప్పుడు పట్టపురాణి గర్భవతిగా ఉంది. సవతి అసూయ చెంది పట్టపురాణికి భోజనంలో విషం కలిపి పెట్టింది. ఆ విషము గర్భాన్ని స్తంభింప చేసింది.


అలా ఏడు సంవత్సరాలు గడచిపోయాయి. రాజ్యం కోల్పోయిన విచారంతో బాహుడు మరణించాడు. గర్భవతియై గర్భం రాని పట్టమహిషి భర్తతో కలిసి సహగమనం చేయాలని చితి మీద కూర్చుంది. ఔర్వ మహర్షి తెలిసి అక్కడకు వచ్చి పట్టపు రాణిని వారిస్తూ "తల్లీ! నీ గర్భం నుంచి బలపరాక్రములు కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. శత్రువులను ఓడించి చక్రవర్తిగా రాజ్యం చేస్తాడు. సహగమనం విరమించు" అని పలికాడు.


పట్టపురాణి మహర్షి మాటలు గౌరవించి సహగమనం మాని భర్తకు అంత్యక్రియలు చేసింది. ఔర్వ మహర్షి చెప్పినట్లు కొంతకాలం తరువాత గరముతో (విషముతో) కుమారుడు కలిగాడు. విషము భరించి పుట్టాడు కనుక ఔర్వ మహర్షి ఆ బిడ్డకు "సగరుడు" అని పేరు పెట్టాడు. జాతకర్మాదులు చేసి, ఉపనయనం చేసి విద్యాభ్యాసం ప్రారంభించాడు. అస్త్రాశస్త్రాలు, ధనుర్విద్యలు నేర్పించాడు.


                *సశేషం*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వైశాఖ పురాణం🚩*_ *14వ అధ్యాయము*

 *🐚శుక్రవారం 1 మే 2026🐚*


_*🚩వైశాఖ పురాణం🚩*_  

     *14వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️

         

*ఛత్రదాన (గొడుగు) మహిమ*```


శ్రుతదేవమహాముని ఇట్లు పలికెను. వైశాఖమాసమున ఎండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు ఎండ వలన బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము..


“పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ ఇది! 

వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి యచటనున్న మునుల యాశ్రమమునకు బోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు అనేకులచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.


అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని జూచి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞలేదు. ఇట్టిమేము నీకాతిధ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూరజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని పొందియు మీరు మాయెడల నీ విధముగ నుండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.


పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాతధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యాదోషమున నిలకడలేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను.


వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ ఆ యడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన యొద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన యుపకారములచే సేదదీరి సొరకాయబుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను. హేమాంగదుడు వ్రతము నాచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును , సొరకాయ బుఱ్ఱనీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.


దయాశాలియగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖధర్మము నాచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు. ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైనవాడు. కావున వీనిని రాజుగ చేయుమని నామాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని హేమాంగదుని వద్దకు బంపెను.


భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యము నిచ్చి విష్వక్సేనుని యనుమతితో భార్యతో బాటు వనముల కేగి తపమాచరింపబోయెను. విష్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణుసాన్నిధ్యమున కెరిగెను.


హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వైశాఖవ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మమార్గము నవలంభించి, శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది, పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శ్రుతకీర్తి మహారాజా ! వైశాఖ ధర్మములు సాటిలేనివి. సులభసాధ్యములు పుణ్య ప్రదములు. పాపమును దహించునని ధర్మార్థకామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చునని శ్రుతదేవుడు వివరించెను, అని నారదుడు అంబరీషునకు చెప్పెను.

```


*వైశాఖపురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

ఉరుగ్వే అనే దేశం లోఉరుగ్వే అనే దేశం లో

 ఉరుగ్వే అనే దేశం లో సగటున ప్రతి పౌరుని వద్ద 4 ఆవులు ఉన్నాయి.వ్యవసాయం దృష్ట్యా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఆ దేశం నిలుస్తుంది.

అది కేవలం 33 లక్షల జనాభా గల దేశం కానీ వారి వద్ద 1 కోటి 20 లక్షల ఆవులు వుంటాయి.

ప్రతి ఒక్క ఆవు చెవికి ఎలక్ట్రానిక్ చిప్ బిగించి ఉంటుంది. దాని కారణంగా ఆ ఆవు ఎక్కడ ఉందో గమనించ వచ్చు.

ఆ దేశం లో రైతు యంత్రం ద్వారా పంటను కోస్తు ఉండగా ఆ యంత్రం మరొ పక్కన ఆ ధాన్యం యొక్క పరిమాణం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ పరిమాణం ఆధారంగా రైతు ప్రతి చదరపు మీటరు కు ఎంత పంట పండిందో స్వయంగా విశ్లేషణ చేసుకుంటాడు. 

 2005 వ సంవత్సరంలో 33 లక్షల జనాభా గల దేశం 99 లక్షల మంది కి సరిపడేంత పంట పండించింది. 

 నేటి రోజున 2 కోట్ల 80 లక్షల మంది కి సరిపడేంత పంటను తీస్తుంది.

 ఉరుగ్వే దేశం యొక్క ఈ ప్రగతి వెనుక పశు పోషకులు మరియు రైతుల శతాబ్దాల తరబడి చేసిన పరిశోధన ఉన్నది.

వ్యవసాయాన్ని గమనించడం కోసం 500 మంది వ్యవసాయ రంగ నిపుణులు పనిలో ఉన్నారు మరియు వీరు డ్రోన్స్ సెటలైట్ ద్వారా 

రైతులను గమనిస్తూ ఉంటారు వారు సూచించిన ప్రకారమే రైతులు తమ పనులు కొనసాగిస్తుంటారు. 

అనగా పాలు పెరుగు నెయ్యి వెన్న తో పాటు వారి జనాభా కు ఎన్నో రేట్లు పంటలు పండించడం,

అందుకే పాలు పెరుగు నెయ్యి వెన్న మరియు ధాన్యాలు ఎగుమతి చేయబడతాయి మరియు ప్రతి రైతు లక్షల్లో ఆదాయం పొందుతాడు..

ఒక రైతు కనీస ఆదాయం ప్రతి నెలకు 

 120000 రూ.అనగా సంవత్సరానికి 190000 డాలర్లు 

ఆ దేశం యొక్క జాతీయ చిహ్నం సూర్యుడు, 

జాతీయ ప్రగతి చిహ్నం ఆవు మరియు గుర్రం,

ఉరుగ్వే లో ఆవును చంపితే వెంటనే మరణ శిక్ష అనే చట్టం..

 ఈ ఆవును ప్రేమించే దేశం అభినందనీయమై నది.. ముఖ్యమైన విషయమేమిటంటే ఈ గో సంపదంతా భారతీయ సంతతికి చెందినది, 

వీటీని 'ఇండియన్ కౌ ' అని సంబోధిస్తూ ఉంటారు. 

బాధాకరమైన విషయమేమంటే భారత దేశం లో గో హత్య జరుగుతుంది కానీ ఉరుగ్వే లో గో హత్యకు మరణ శిక్ష అనే చట్టం ఉంది....

మనం వ్యవసాయ దేశమైన ఉరుగ్వే నుండి ఏమైనా ‌నేర్చుకోవచ్చా? 

     "సురభి గో మాతకు వందనాలు".

Mantra - 27

 Mantra - 27 ARUNAM 3 anuvaakam


శరత్ ఋతువు (మరియు కొంతవరకు హేమంత, శిశిర ప్రభావం) లేదా ఆ సమయంలో ప్రకృతిలో కలిగే మార్పులను ఒక విలక్షణమైన దార్శనిక కోణంలో వివరిస్తుంది. ముఖ్యంగా, వర్ష ఋతువు ముగిసి చలికాలం వైపు వెళ్తున్నప్పుడు సూర్యుని ప్రకాశంలో కలిగే మార్పును ఈ మంత్రం అద్భుతంగా వర్ణిస్తుంది.


"అదుఃఖో దుఃఖ చక్షురివ|

తద్మాపీత ఇవ దృశ్యతే। 

శీతేనా వ్యథయన్నివ। 

రురుదక్ష ఇవ దృశ్యతే||" 


‘అదుఃఖో దుఃఖచక్షురివ’ - "అదుఃఖః" అంటే దుఃఖం లేనివాడు (సూర్యుడు లేదా పరమాత్మ). కానీ ఆయన “దుఃఖ చక్షురివ" - అంటే కన్నీరు నిండిన కన్నులు కలవాని వలె కనిపిస్తున్నాడు. శరత్కాలంలో ఉదయం వేళ మంచు కురవడం వల్ల లేదా చలి వల్ల కళ్ళు కొంచెం కలత చెందినట్లుగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది.


‘తద్మాపీత ఇవ దృశ్యతే’ - "తద్మా" అంటే ఒక రకమైన ఎరుపు లేదా పసుపు రంగు (పండ పారిన రంగు). ఆ సమయంలో సూర్యుడు పాలిపోయినట్లుగా, పసుపు-ఎరుపు రంగుల మిశ్రమంగా (పీత వర్ణం) కనిపిస్తాడు. గ్రీష్మంలో ఉన్న ప్రచండమైన కాంతి ఇక్కడ తగ్గిపోతుంది.


 ‘శీతేనావ్యథయన్నివ’ - "శీతేన" (చలితో) "అవ్యథయన్" (బాధించని వాని వలె). చలి కాలం ప్రారంభమైనా, అది మరీ క్రూరంగా ఉండదు; ఒక రకమైన హాయిని, ప్రశాంతతను ఇస్తూ మెల్లమెల్లగా స్పర్శిస్తుంది.


‘రురుదక్ష ఇవ దృశ్యతే’ - "రురుదక్ష" అంటే ఏడుస్తున్న వాని వలె లేదా కన్నీరు కారుస్తున్న వాని వలె. మంచు బిందువులు ఆకులపై పడటాన్ని లేదా సూర్యుని చుట్టూ మంచు పరదాలు కప్పి ఉండటాన్ని చూస్తే, ప్రకృతి ఏడుస్తున్నట్లుగా (రురోదన చేస్తున్నట్లుగా) కవిత్వ (poetic) కోణంలో వర్ణించారు.


అరుణప్రశ్నలోని ఈ మంత్ర భాగాలు మనిషి యొక్క అంతరంగ స్థితిని ప్రకృతితో ముడిపెడతాయి. సూర్యుడు ఒక్కడే అయినా, ఋతువుల మార్పు వల్ల ఆయన ప్రకాశం మారుతూ ఉంటుంది. గ్రీష్మంలో 'రుద్రుడి'గా దహించే సూర్యుడు, ఈ కాలానికి వచ్చేసరికి శాంతించి, పాలిపోయినట్లుగా, కరుణా స్వరూపిగా కనిపిస్తాడు.


ఈ మంత్రంలోని "కన్నీరు" లేదా "ఏడుపు" అనే పదాలు మంచు కురవడాన్ని సూచిస్తాయి. ఆకాశం నుండి కురిసే మంచు బిందువులే ప్రకృతి కన్నీరుగా ఇక్కడ దార్శనికులు poetic గా భావించారు. శరత్ మరియు హేమంత కాలాలు ఒక రకమైన నిశ్శబ్దానికి, వైరాగ్యానికి ప్రతీకలు. వసంతంలోని ఉత్సాహం, గ్రీష్మములోని తీవ్రత ఇక్కడ తగ్గి, ప్రకృతి ఒక రకమైన ధ్యాన స్థితిలోకి వెళ్తున్నట్లుగా ఉంటుంది.


చలి ప్రభావం వల్ల సూర్యుడు ప్రకాశం తగ్గి, పాలిపోయినట్లుగా, కన్నీరు నిండిన కళ్ళు కలిగిన వాని వలె కనిపిస్తూ, బాధించని చలిని ప్రసాదిస్తాడని ఈ మంత్రం భావం.


అద్వైత తత్వ విచారణ చేస్తే….

ఈ మంత్రం 'సాక్షి తత్వాన్ని' మరియు 'మాయా కల్పిత భేదాన్ని' వివరించడానికి ఈ మంత్రం ఒక అద్భుతమైన ఉదాహరణ:


‘అదుఃఖో దుఃఖ చక్షురివ (The Joyful Witness of Sorrows)’ - పరమాత్మ స్వరూపం 'ఆనందం'. ఆత్మకు దుఃఖం లేదు (అదుఃఖః). కానీ ఉపాధి (దేహం, మనస్సు) లో ఉన్నప్పుడు, లోకంలో జరిగే కష్టాలను చూస్తూ, తాను కూడా దుఃఖిస్తున్నట్టు కనిపిస్తాడు. ఇది సరిగ్గా ఒక నటుడు స్టేజి మీద ఏడుస్తున్నట్లు నటించడం వంటిది. లోపల నటుడు సుఖంగానే ఉంటాడు, కానీ పాత్ర కోసం దుఃఖాన్ని ధరిస్తాడు. అలాగే, పరమాత్మ ప్రపంచంలోని ద్వంద్వాలకు ప్రభావితం కాడు, కానీ మాయ వల్ల అలా 'కనిపిస్తాడు' (ఇవ).

చలికాలంలో మంచు వల్ల సూర్యుడు పాలిపోయినట్లు (కాంతి తగ్గినట్లు) కనిపిస్తాడు. అద్వైతంలో సూర్యుడు అంటే జ్ఞానానికి ప్రతీక. మంచు అంటే అజ్ఞానం లేదా 'ఆవరణ శక్తి'. సూర్యుడి ప్రకాశం ఎక్కడికీ పోలేదు, కానీ మన కళ్లకు అడ్డంగా మంచు ఉండటం వల్ల సూర్యుడే కాంతిహీనుడు అనుకుంటాం. అలాగే, మన అజ్ఞానం వల్ల లోపల వెలిగే ఆత్మ చైతన్యం మందగించినట్లు మనకు అనిపిస్తుంది.


చలి లోకాన్ని గజగజ వణికిస్తుంది, కానీ ఆ చలికి (శీతానికి) కారకుడైన సూర్యుడికి ఆ చలి వల్ల కలిగే వ్యధ (బాధ) ఉండదు.


దీనినే అద్వైతంలో "అసంగోహ్యయం పురుషః" (ఈ పురుషుడు దేనితోనూ అంటుకోడు) అని అంటారు.

ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వాటన్నింటికీ ఆధారమైన పరమాత్మ మాత్రం ఎప్పుడూ వికార రహితంగా (అవ్యథ) ఉంటాడు.


మాయా దృశ్యం (The Illusion of Appearance) - ఈ మంత్రంలో ప్రతి చోటా 'ఇవ' (లాగ, వలె), 'దృశ్యతే' (కనిపిస్తున్నాడు) అనే పదాలు వాడబడ్డాయి. ఇది అద్వైత సిద్ధాంతానికి పునాది. పరమాత్మ ఏడవడం లేదు, కానీ ఏడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. పరమాత్మ కాంతి తగ్గలేదు, కానీ తగ్గినట్లు కనిపిస్తున్నాడు.

ఈ "కనిపించడం" అనేదే మాయ. నిజం ఏమిటంటే - ఆయన ఎప్పుడూ పూర్ణుడు, స్వయం ప్రకాశుడు మరియు ఆనందమయుడు.


అద్వైత కోణంలో ఈ మంత్రం ఇచ్చే పరమ రహస్యం ఏమిటంటే, పరిస్థితులు మారినప్పుడు (ఋతువులు మారినట్లు), నీ మనస్సు దుఃఖించవచ్చు, నీ శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ నీలోని 'ద్రష్ట' (సాక్షి) ఎప్పుడూ దుఃఖ రహితుడే. పాలిపోయిన సూర్యుడి వెనుక అనంతమైన కాంతి ఎలా దాగి ఉందో, నీ శారీరక, మానసిక వ్యధల వెనుక అనంతమైన ఆత్మసుఖం దాగి ఉంది.


ఈ మంత్రంతో ఆరు ఋతువుల వర్ణన ద్వారా పరమాత్మ తత్వాన్ని వివరించే ప్రక్రియ ఒక సంపూర్ణతకు వస్తుంది. సృష్టిలోని వైవిధ్యంలో ఏకత్వాన్ని దర్శించడమే ఈ 'అరుణప్రశ్న' మంత్రాల లక్ష్యం.