14, మే 2024, మంగళవారం

ఆర్ద్రమైన కధ

 మంచి ఆర్ద్రమైన కధ ఈ కాలం కు అనుగుణంగా ఉన్నది ఈ కధ ను తెల్లవారు ఝామున చదవగానే కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి గుండె బరువెక్కింది 

రచయిత్రి కిరణ్ విభావరి కి ధన్యవాదములు తెలిపిన, మీరు ఇది చదవగానే అద్భుతం అనక మానరు 

ఇక చదవండి 

👇👇👇👇👇👇



కాఫీ పెట్టవూ

_______________________


"కొంచెం కాఫీ పెట్టిస్తావా అమ్మా" మామయ్య ఆశగా అడుగుతుంటే, ఏం చెప్పాలో తెలియక అలా నిల్చుంది మాలతి.


"ఏమ్మా పాలు అయిపోయాయా"మళ్లీ ఆయనే అడిగారు.


భర్త కోసం  ఫ్రిడ్జ్ లో దాచి ఉంచిన కప్పుడు పాలు చూసారా ఏంటీయనా అని మనసులో అనుకుంటూ, "ఆ.. అ..వు..ను మామయ్య" తలదించుకుని సన్నని గొంతుకతో చెప్పింది మాలతి.


"పర్లేదు లేమ్మా" అంటూ మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ గోడ వారగా నడుచుకుంటూ వెళ్ళి తన వాలు కుర్చీలో కూర్చుండి పోయారు మామయ్య.


సుమారు యనభై ఏండ్లు ఉంటాయేమో. వయసులో ఉన్నప్పుడు దర్జాగా, తీరైన అవయవ సౌష్టవంతో, కండపట్టి నిండుగా ఉండేవాడు కాస్తా వయసు మీద పడేసరికి ఎముకల గూడులా సన్నగా అయిపోయాడు. వయసులో ఉన్నప్పుడు ఏ దురలవాట్లు లేకపోవడం చేతనేమో పళ్ళన్నీ ఊడిపోయినా, తన పనులు తాను చేసుకోడానికి శరీరం కొంతైనా సహకరిస్తోంది.


అయినా ఎముకలు తప్పా పిసరంత కండ కూడా కనిపించని ఆ దేహం ఒకప్పుడు కొండలా ఉండేదంటే బహుశా ఎవరూ నమ్మక పోవచ్చు నేమో! వయసు చేసే గాయంతో కండలన్ని కరిగిపోయాయి. 


అరవై వసంతాలు కొండంత ప్రేమను పంచిన అతని భార్య పోయిన దగ్గర నుండి మరీ చిక్కి శల్యం అయిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు దగ్గర కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ఇప్పుడిలా గుక్కేడు కాఫీ చుక్కల కోసం అలమటిస్తూ ఉన్నాడు.


అతని భార్య బతికుండి ఉంటే అతనికోసం ఆమె కూడా కప్పుడు పాలు దాచి ఉంచేదేమో! అతడి ఆవేదనను అర్థం చేసుకునేదేమో! నోరు పిడచకట్టుకు పోతుంటే, నాలుకతో తడిచేసుకుంటూ, భారంగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఏ ఒక్క దురలవా టూ లేని పెద్దాయనకు ఈ కాఫీ తాగే అలవాటు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 


లాక్ డౌన్ కారణం చేత, ఎక్కడా షాపులు తియ్యట్లేదు. పాల వాడు కూడా రాలేనని చెప్పేశాడు. ఎక్కడో పది కిలోమీటర్ల అవతల ఉన్న ఓ షాపు నుండి కొన్ని లీటర్ల పాలు సంపాదించి, తెచ్చాడు కొడుకు. అవన్నీ అయిపోయాయి అంటోంది కోడలు. ఓ గుక్కెడు కూడా మిగాల్లేదా అనుకుంటూ భారంగా చూసాడు. 


ఇప్పుడు కొడుకింట్లో అతడో అతిథి మాత్రమే. ప్రశ్నించి, శాసించే అధికారం కానీ, శక్తి కానీ లేదిప్పుడు. మాటలు పలకడానికే ఓపిక ఉండదు. కోడలు మంచిపిల్ల కాబట్టి తను మాట్లాడే ముక్కలు ముక్కల్లాంటి భాషను అర్థం చేసుకుంటూ, అన్నీ సమయానికి అందిస్తూ ఉంటుంది. ఏదైతే ఏం వీళ్లకు భారం కాకుండా హాయిగా వెళ్లిపోతే చాలు అని రోజూ అనుకుంటూ ఉంటాడు. 


శక్తి మేరకు రెక్కలు ముక్కలు చేసుకుని, కొడుకును ప్రయోజకుడిని చేశాడు. ఒక్కడే నలుసు కావడంతో , వాడి మీదే ఆశలన్నీ పెట్టుకుని ప్రేమగా పెంచాడు. వాడికి ఏదైనా చిన్న బాధ కలిగితే తట్టుకోలేక పోయేవాడు. కొడుకు నోరు తెరిచి అడిగితే చాలు.. అప్పొ సప్పొ చేసైనా తెచ్చి పెట్టేవాడు. 


"ఆ రోజులు ఎంత హాయిగా ఉండేవో కదా!" గతాన్ని గుర్తు తెచ్చుకుని వెనక్కి వాలి ఆలోచనల్లో పడ్డాడు. జీవిత చరమాంకంలో ఉన్న అతడిప్పుడు చెయ్యగలిగింది అదొక్కటే. గతాన్ని, అది మిగిల్చిన తీపి గురుతులనూ నెమరవెస్తూ ఉండడం మాత్రమే అతను చెయ్యగలడిప్పుడు.


కొడుకుతో గడిపిన ఆ అమృత క్షణాలే అతడి స్మృతి పథంలో చిక్కగా నిండుకున్నాయి.


"వాడింకా లేవలేదా అమ్మా?" తన కొడుకును తలుచుకుంటూ మాలతిని ప్రశ్నించాడు. 


"లేదు మావయ్య గారు. అలసి పోయినట్టు ఉన్నారు. తిన్నా వెంటనే నడుం వాల్చేసారు. లేప మంటారా?" మాలతి అడిగింది.


"వద్దులే తల్లీ.. పడుకోని. మళ్లీ ఎన్ని రోజులకు దొరుకుతుందో ఈ నిద్ర." తనలో తను గొణుక్కుంటూ మెల్లగా చెప్పాడు. మాలతి వినిందో లేదో కానీ రాత్రి భోజనాలు సిద్దం చేయడానికి వంటింట్లోకి వెళ్ళి పోయింది.


" పాపం. ఎంత కష్ట పడతాడో నా కొడుకు" మనసులో భారంగా అనుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు అతడు పడిన కష్టమేదో చిన్నది అయినట్టు. 


ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ గా పని చేసి, చాలి చాలని జీతంతో నెట్టుకు వచ్చి, రాత్రి పదకొండు వరకూ ట్యూషన్లు చెప్పి, మళ్లీ పొద్దున్న పెందళాడే బస్సెక్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు రెండు బస్సులు మారి, రక్తాన్ని చెమటగా ధార పోసి, కొడుకును ఓ గవర్నమెంట్ అధికారిని చేశాడు. ఆ కష్టమంతా మరచి, ఇప్పుడు కొడుకు కష్టం చూసి దుఃఖిస్తున్నాడు. 

ఎంతైనా కన్న ప్రేగు కదా..మమకారం వదలలేక పోతున్నాడు. కుర్చీలో కూర్చుని అసహనంగా కదులుతూ ఆలోచనల్లో పడ్డాడు. ఆలోచనలు..ఇప్పుడు తనతో మిగిలి ఉన్నవి ఇవే కదా. వయసు మీద పడడం వల్ల చూపు మందగించింది. పుస్తకాలు చదవలేడు. వాలు కుర్చీలో కూర్చుని, పాత పాటలు అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాడు. 


కాఫీ నోట్లో పడకపోయే సరికి, తల లాగేస్తోంది. ధ్యాస మరాల్చడానికి పక్కనే ఉన్న రేడియో అందుకుని, తనకిష్టమైన దేవానంద్ పాటలు పెట్టుకుని వింటూ కూర్చున్నాడు.


ఇక రాత్రి కూరకు కూరగాయలు తీద్దామని, ఫ్రిడ్జ్ డోర్ తీసిన ప్రతీసారీ, భర్త కోసం దాచి ఉంచిన ఆ కప్పుడు పాలు తనతో ఏదో చెబుతున్నట్టు అని అనిపించింది మాలతికి. ఈ కరోనా కాలంలో పాలు దొరకడమే కష్టంగా ఉంది. భర్తకు సాయంత్రం పూట కాఫీ లేకపోతే, తలతిరుగుతుందని, ఎలాగోలా పాలు సంపాదించి , కొద్ది కొద్దిగా దాస్తూ నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ కప్పుడు పాలే మిగిలాయి. అవి మామయ్యకి ఇచ్చేస్తే , భర్త ఏం అనడు గానీ అతడు పడే అవస్థ తాను చూడగలదా! తల నొప్పితో విలవిలలాడుతాడు. 


పక్కింట్లో అడిగి చూసింది. వాళ్లకూ పాలు దొరక్క డికాక్షన్ పెట్టుకుని తాగుతున్నారట. బయట షాపులూ లేవు. హోటల్స్ అసలే లేవు. 


మామయ్య వాలు కుర్చీలో కూర్చుని, పాటలు వింటూ ఉన్నారు. పోనీలే కొంచెం అడ్జస్ట్ అయినట్టు ఉన్నారు అని అనుకుంది మాలతి.


"ఆయనకు కాఫీ ఇచ్చేటప్పుడు ఒకవేళ మామయ్య చూస్తే!" అని మనసులో ఒక నిమిషం పాటు అనుకున్నా, "ఆయన కష్టపడి వచ్చే మనిషి. పాపం కాఫీ కూడా లేకపోతే, అలసిపొడూ! మామయ్య అర్థం చేసుకుంటారులే" అని మళ్లీ సర్ది చెప్పుకుంది. 


"పోనీ ఆ కప్పుడు పాలలో ఓ కప్పుడు నీళ్లు కలిపితే? లేదు లేదు.. ఆయనకు చిక్కని కాఫీ ఉండాలి.లేదంటే అస్సలు తాగరు."

"పాపం మామయ్యకు కూడా తలతిప్పుతూ ఉందేమో! పాల పొడి ఉన్నా బాగుండు."

"కప్పుడు కాఫీ చెరి సగం చేసి ఇస్తే!? హ్మ్మ్.. ఉన్న కప్పుడు లో చెరిసగం అంటే ఓ చెంచాడు. అదేం సరిపోతుంది ఇద్దరికీ?!"

"ఆయనకీ విషయం చెప్పి చూస్తే! నాకొద్దు మొత్తం నాన్నకి ఇచ్చే మని, తను అవస్థలు పడతారు. మళ్లీ రాత్రి డ్యూటీకి వెళ్ళాలి. వద్దొద్దు..."

"నిన్ననే గుర్తు పెట్టుకోవలసింది. ఆయన మటుకు ఉన్నాయని ఊరుకున్నా. ఈ రెడ్ జోన్ ఏరియాలో రానని పాలవాడు హ్యాండ్ ఇచ్చాడు. రేపాయన్ని పంపి కనీసం ఒక ఐదు లీటర్లైనా తెచ్చి పెట్టేసుకోవాలి. " 

ఇలా సాగిపోయాయి మాలతి ఆలోచనలు.


భర్త మధ్యాహ్నం తిన్నాక  కునుకు తీసాడు. 

"ఈ లాక్ డౌన్ పుణ్యమా అని కొంత తీరిక దొరికింది ఈయనకి. రోజూ ఎంత ఒత్తిడో! ఎంత శ్రమ పడతాడో!" నిద్రపోతున్న భర్తను చూస్తూ అనుకుంది మాలతి. 


వాలు కుర్చీలో కూర్చున్న మామయ్యనూ చూసింది. ఆయనా కునుకు తీస్తూ ఉన్నాడు. వాలు కుర్చీలోనే ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన పెట్టుకున్న పాత హిందీ పాటలు లయ బద్దంగా మంద్రంగా వినిపిస్తూ ఉన్నాయి. 


"మామయ్య మేలుకునే లోపు ఈయన లేస్తే బాగుండు. కాఫీ ఇచ్చేస్తాను." అని అనుకుంటూ భర్తను చిన్నగా కదిలించింది. 


ఇంకా మత్తు దిగని అరమొడ్పు కళ్ళతో ఏంటని ప్రశ్నించాడు భర్త. "లేవండి..సంధ్య వేళ కావొస్తోంది. ఇంకా పడుకుంటే ఎలా?!" అంటూ మెల్లగా తట్టి లేపింది


"ఆప్పుడే సాయంత్రం అయిపోయిందా!" అనుకుంటూ నిద్ర లేచాడు భర్త. "మొహం కడుక్కుని రండి కాఫీ పెడతా"నంటూ వంట గదిలోకి వెళ్లిపోయింది మాలతి.


చప్పుడు లేకుండా మెల్లగా ఫ్రిడ్జ్ డోర్ తీసి, పాలు బయటకు తీసింది. వేడి చేసిన ఆ పాలలో కాఫీ కలుపుతుంటే, కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలు తాకుతోంది. 


కూర్గ్ నుండి తెచ్చుకున్న స్వచ్ఛమైన, పరిమళ భరితమైన కాఫీ గింజలతో చేసిన కాఫీ అది. దాని సువాసనకే సగం అలసట పోతుంది. ఉత్తేజితం చేస్తుంది. గదంతా కాఫీ సువాసనలు నిడుకుంటుంటే, మాలతి కాఫీ ఫిల్టర్ చేసి, ఒక గ్లాసు నుండి మరో గ్లాసులో పోస్తూ నురగలు తెప్పిస్తూ, భర్త కోసం చిక్కటి కాఫీ కలుపుతోంది.


"మాలతీ....మాలతీ....." భర్త పెద్ద పెద్ద అరుపులు విని, కాఫీ కప్పు కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టీ గబగబా అడుగులు వేస్తూ వెళ్ళింది. 


"ఏంటండి..టవల్ అక్కడే పెట్టాగా.." అంటూ వెళ్ళిన మాలతి, అక్కడి దృశ్యం చూస్తూ కొయ్యబారి నిల్చుండి పోయింది. 


ఒళ్ళో రేడియో పెట్టుకుని, చేతులూ నేలను తాకుతూ కుర్చీలోంచి పక్కకు వాలిపోయి, నిర్జీవంగా పడి ఉన్న మామయ్యను చూసి, బిక్క చచ్చిపోయింది. భయం భయంగా ఆయన శరీరాన్ని పట్టుకొని తిన్నగా కూర్చోబెట్టబోయింది. జీవుడు వదిలిన ఆ దేహం కళా విహీనంగా, శీతలంగా మారి పోయినా, ఆ ముఖంలో మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తన బాగోగులు చూసే మనిషిని , తన కన్నా ముందే వెళ్ళిన తన నెచ్చెలి చెంతకు చేరుకున్నాడనేమో!  మూసి ఉన్న ఆ కళ్ళు నిద్రపోయినట్లు ఉన్నాయి. ఇక చెప్పడానికి, అడగడానికి ఏం లేదన్నట్టు ఆ బోసి నోరు బిగువుగా మూసి ఉంది. ఇక ఆ దేహంతో పని లేదన్నట్టు ఉచ్ఛ్వాస నిచ్వాసలు తమ ఉనికిని కోల్పోయాయి. 


"మాలతీ....నాన్న...నాన్న...కదలటం లేదు మాలతీ" తండ్రి దేహం పట్టుకుని, వెర్రివాడిలా చెబుతున్న భర్త కళ్ళల్లో నీళ్ళు చూసి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిండుకున్నాయు. కళ్ళతోనే ఆయనిక మనకి లేరు అని బదులిచ్చింది. 


"ఇంతటి దుఖాన్ని తీర్చేవారు ఎవరు మాలతి? అనాథను అయిపోయాను..నేను అనాథను అయిపోయాను..మాలతి. నాన్న కూడా నన్నొదిలి వెళ్ళిపోయారా...ఇక నాకు అమ్మా నాన్న లేరా.. ఈ పాడు లోకంలో నా ప్రేగు బంధమే లేదా.. నాన్న వచ్చే నాన్నా...నా దగ్గరకు మళ్లీ వచ్చే నాన్నా..ఇదంతా ఒక డ్రామా అని చెప్పు నాన్నా..నన్ను ఆటపట్టించడానికి నువ్వు చేస్తున్న నాటకం అని చెప్పు నాన్న...ప్లీస్ నాన్నా వచ్చేవూ.. నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూస్తారు.. నేనొచ్చే వరకూ వీధి గుమ్మంలో ఎవరు కాపు కాస్తారు. నా కష్టం చూసి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారు... నా ఆనందం చూసి ఎవరు సంబరాలు చేసుకుంటారు.. నాకో చిన్న రోగమొస్తే ఎవరు నాన్న నన్నింకా  చిన్నపిల్లాడిలా చూసుకుంటారు!.. సాయంత్రం పూట నాతో ఎవరు నాన్న జీవిత అనుభవాలు , జ్ఞాపకాలు పంచుకుంటారు? నా పిచ్చి కబుర్లు ఆసక్తిగా ఎవరు వింటారు నాన్న. నా దెబ్బలు చూసి ఇకపై ఎవరు కన్నీళ్లు పెడతారు నాన్న.  నా వేలు పట్టుకుని అన్నీ నేర్పించిన నువ్వు,  నువ్వు లేకుంటే ఎలా బతకాలో నేర్పించలేదు కదా నాన్న.  నన్ను మోసం చేసి వెళ్లకు నాన్న.. తిరిగొచ్చే నాన్న.. తిరిగొచ్చెయ్ " తండ్రి దేహన్ని పట్టుకుని ఏడుస్తున్న భర్త ఏడుపులో మాలతి కూడా జత కట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్ది సేపటికే వాళ్ళ ఇల్లు స్మశాన రోదనలతో నిండిపోయింది.


సూర్యుడు అస్తమించాడు. గట్టు మీద పెట్టిన కప్పుడు కాఫీ చల్లారి పోయింది. మామయ్య చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. మాలతి కిచెన్లోని కాఫీ కప్పు వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. ఇకపై కాఫీ తాగగలదో లేదో ఆమే చెప్పాలి.. (సేకరణ - జగన్నాథ) 🙏

Eeswaraa














 

వైశాఖ పురాణం - 06

 Vaisakha Puranam -- 06

వైశాఖ పురాణం - 06

06 అధ్యాయము - వైశాఖమాస వైశిష్ట్యం

నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటెనుత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను.

మహారాజా ! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన ఉదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడా సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను , ప్రకృతిని మర్యాదలను రాజులను , వర్ణాశ్రమ విభాగములను , ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తనయాజ్ఞారూపములుగా చతుర్వేదములను , తంత్రములను, సంహితలను, స్మృతులను , పురాణేతిహాసములను , ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.

ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.

సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని , ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు సరికదా కోపము కూడా రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు, చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపజూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును ? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు. చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును ? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారములకిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగియుందురు. స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు , యాగభోగములకు , బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును. సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని , పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము , పుష్పము , ఫలము , జలము , శాకము , పుష్పమాల , తాంబూలము , చందనము , పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనే విలువకట్టరానంత పుణ్యము నిత్తును.

అని భక్తసులభుడు దయాశాలియు నగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను , పర్వతములను లతాతరువులను , జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను , తుష్టి , పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను , అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను , పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను , ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను , శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు , యథాశక్తిగ దానధర్మములను చేయుచు అతిథి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను , కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై , అతిథియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును , అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను , తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతటి వారినయినను యథోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా ! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యథాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యథాశక్తిగ పూజ , దానధర్మములను , భక్తి వినయములతో శ్రద్ధాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.

ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు , చారణులు , గంధర్వులు , సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు , అన్ని వర్ణములవారిని , అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై , చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు , శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరముల నిత్తురు.

శ్రీహరి వైశాఖమున మత్తులై , ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని , గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని , పరమేశ్వరునిగాని , ఇతర దైవతములను సజ్జనులను పూజించినను , వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లేనని తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు. సపరివారముగ వచ్చిన మహారాజును నగరము , గ్రామములు , వనములు , పర్వతములు , నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగ తమకు తోచిన పత్రము , పుష్పము , ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ ! తమయేలుబడిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట , సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను , అతిథులను , అభాగ్యతులను , దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యథోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నీయక యున్నచో మహారాజు కోపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాస వ్రత సమయమున వ్రతము నాచరించి యథాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగ నట్లు శిక్షింతురు. కావున సర్వ జనులును యథాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యథాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైశాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస వైశిష్ట్యమును వివరించెను.

వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం.

ఆదిశంకరుల సన్యాసాశ్రమ స్వీకరణ*

 *ఆదిశంకరుల సన్యాసాశ్రమ స్వీకరణ*  


శ్లో. 

తస్యోపదర్శితవతశ్చరణౌ గుహాయా ద్వారే న్యపూజయదుపేత్య స శంకరార్య : /

     ఆచార ఇత్యుపదీదేశస తత్ర తస్మై గోవిందపదగురవే స గురుర్యతీనాం //


గోవిందభగవత్పాదులు నివాసమున్న గుహద్వారం ముందు నిలబడి శంకరులు,  


' ఓ గురువర్యా ! తమ పాదపూజ చేయాలని ఈ శిష్యుడు ఆశిస్తున్నాడు. దయతో అనుమతించండి. ' అని ప్రార్ధించగా, గోవిందయతీంద్రులు గుహనుండి బయటకు రాకుండా, తమ పాదాలను గుహ ముఖద్వారంవద్ద వుంచి, పాదపూజకు అనుమతిని ఇచ్చినట్లుగా సంకేతం ఇచ్చారు.   


శంకరులు కూడా పరమభక్తితో గురుదేవుని పాదపద్మాలను పూజిస్తూ, ' గురుపాదపూజ ప్రతిశిష్యుడూ చేయవలసిన ప్రధమసేవ ' అని భావించారు. గోవింద యతీంద్రులు కూడా ' ఇది గురుశిష్య సంప్రదాయం ' గా ఆమోదముద్ర వేశారు.  


శిష్యుడు ఎంత తెలివైనవాడు అయినా గురుకృప తప్పక పొందాలి. ఆ గురుకటాక్షము లేనిచో అహంభావం వీడదు. గురుతత్వము బోధపడదు. ఆ శిక్షణలో భాగంగానే, శంకరులు గురువుగారైన గోవింద యతీంద్రులకు అనేక విధాలుగా వినయంతో పరిచర్యలు చేస్తూ, గురువుగారిని ప్రసన్నులుగా చేసుకుని వారివద్ద జ్ఞానతత్వాన్ని అభ్యసించ సాగారు. 


శ్లో.  

భక్తిపూర్వకృతతత్పరిచర్యా తోషితో>ధికతరం యతివర్య : /

       బ్రహ్మతాముపదిదేశ చతుర్భిర్వేదశేఖరవచోభి రముశ్మై //


ఈవిధంగా పరిచర్యలు చేస్తున్న శంకరుల సంపూర్ణ భక్తికి గురుదేవులు, గోవింద భగవత్పాదులు సంతోషించి, శంకరులపై పరిపూర్ణ అనుగ్రహం చూపించి, నాలుగు వేదాలలోని మహావాక్యాలలోని వాచ్యార్థ లక్ష్యార్ధలను విశదపరచారు. 


మహావాక్యాలు : 


మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ : ఇది ఋగ్వేదం లోని ఐతరేయోపనిషత్తు లోనిది. లక్షణ వాక్యము. 


ఇక రెండవది అహం బ్రహ్మాస్మి : యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులోనిది ఇది అనుభవ వాక్యము.   


మరి మూడవది తత్వమసి : సామవేదంలోని ఛాందోగ్యోపనిషద్ లోనిది ఉపదేశ వాక్యము.  


చివరిగా నాలుగవది అయమాత్మా బ్రహ్మ : ఇది అధర్వణవేదములోని మాండూక్యోపనిషద్ నుండి గ్రహించబడినది. సాక్షాత్కార వాక్యము.  


శ్లో.  

సాంప్రదాయిక పరాశరపుత్ర ప్రో>క్త సూత్రమతగత్యను రోధాత్ /

      శాస్త్రగూఢ హృదయం హి దయాళో: కృత్స్న మప్యయమ బుద్ధ సుబుద్ధి : //


గోవింద భగవత్పాదుల వద్దనుండి మహావాక్యాల సారం వినగానే శంకరులకు తాను అప్పటికే మననం చేసుకుంటున్న వ్యాసమహర్షి యొక్క బ్రహ్మసూత్రాలలోని అద్వైత రహస్యం జ్ఞప్తికి తెచ్చుకున్నారు.   


తదనుగుణంగా ' వ్యాసహృదయము, గురుదేవుల బ్రహ్మతత్వమూ ఒక్కటే ! ' అని శిష్యాగ్రగణ్యుడైన శంకరులు శాస్త్రములలో నిగూఢమైన విషయాన్ని గ్రహించారు.  


శ్లో.  

వ్యాస పరాశరుసుత: కిల సత్యవత్యాం తస్మాత్మజ శుకముని: ప్రథితానుభావ: /

      తచ్ఛిశ్యతా ముపగత: కిల గౌడపాదో గోవిందనాధ మునిరస్య చ శిష్యభూత : //  


గురుపరంపర చూద్దాం. సత్యవతికి పరాశరమహర్షి వలన వ్యాసమహర్షి జన్మించారు. వ్యాసమహర్షికి పరమశివుని దయవలన పుట్టుకతోనే వైరాగ్యం సంతరించుకున్న శుకయోగి కుమారునిగా ఆవిర్భవించారు. ఆ శుకబ్రహ్మ శిష్యులే గౌడపాదులు. వీరు పతంజలి మహర్షి అవతారమైన శ్రీ గోవిందనాధ యతీంద్రులను శిష్యులుగా అనుగ్రహించారు. గోవింద భగవత్పాదుల శిష్యులే మన ఆదిశంకరులు. ఈ విధంగా బ్రహ్మవిద్య శిష్యకోటిలోకి వ్యాప్తి చెందిందని తెలుసుకోవాలి. .  


సమస్త భువనాలను తనతలపై మోస్తున్న ఆదిశేషుడు పతంజలి మహర్షిగా అవతరించారు. పతంజలి మహర్షి భూలోకంలో శబ్దజ్ఞానాన్ని తన వ్యాకరణం ద్వారా ప్రచారం చేస్తానని ప్రతినబూని, గోవింద భగవత్పాదులుగా అవతరించారు.  


వారు తమ శిష్యఅగ్రగణ్యుడు, సాక్షాత్తూ శివస్వరూపమైన శంకరాచార్యులకు వ్యాకరణసూత్రాలతో బాటు, బ్రహ్మతత్వాన్ని బోధించారు. గోవింద భగవత్పాదులు దైవాంశ సంభూతులు. అలాంటి ఆదిశేషువు, పతాంజలుల అవతారమైన గోవింద దేశికులకు పరమశివుని అంశ అయిన ఆదిశంకరులు శిష్యునిగా రూపొందడం లోక కల్యాణార్థం జరిగిన శివలీలలోని భాగమే తప్ప వేరొకటి కాదు.  


శ్లో.  

సో>ధిగమ్య చరమాశ్రమమార్య : పూర్వపుణ్యనిచయై రధిగమ్యమ్ /   

      స్థాన మర్చ్యమపి హంసపురోగైరున్నతం ధ్రువ ఇవత్యై చకాశే //


అనేక పూర్వజన్మలపుణ్యాల వలన కేవలం విరాగులకు మాత్రమే దొరికే బ్రహ్మజ్ఞాన సముపార్జన అనే సాధన ముందుకు సాగడానికి అనువైన అంతిమ ఆశ్రమధర్మమైన సన్యాసాశ్రమాన్ని శంకరులు విధివిధానంగా గోవింద భగవత్పాదుల నుండి స్వీకరించారు.    


ఆ సమయంలో ధ్రువమండలము అన్ని గ్రహాలకన్నా కాంతివంతంగా శోభిల్లింది. శంకరులు పరమహంస పరివ్రాజక సింహాసనం అధిష్టించి, యతులలోకి అగ్రగణ్యులై ప్రకాశించారు. అద్వైతవాణిని వినిపించడానికి కంకణధారులైనారు.  


తెల్లని మంచుకొండల మీద మలిసంధ్యలోని సూర్యకాంతి పరుచుకున్నట్లు, శంకర యతీంద్రుల తెల్లని దేహకాంతి మీద నవ కాషాయవస్త్రం ధగధగలాడింది. 


( ఆదిశంకరులు సాక్షాత్తూ పరమశివుని అవతారం కాబట్టి శంకరుల లీలలు శివలీలలే ! )


 ఆదిశంకరుల జయంతి. వారి బోధలను ఆకళింపు చేసుకోవడమే వారికి మనం సమర్పించే నివాళి. 🌹💐🍎🙏💐🌹


జయజయ శంకర హరహర శంకర ! హరహర శంకర జయజయ శంకర !

జాగేశ్వర క్షేత్రం







 🙏 జాగేశ్వర క్షేత్రం -🚩 ఉత్తరాఖండ్🚩🏔🏔 💐🌺 ఇది సతీదేవి తపోస్థలి..🌹🌺 🙏 మృత్యుంజయ మంత్ర మూలస్థానం 🙏 అన్ని వైపులా వృక్షాలు... ప్రధానంగా దేవదారు చెట్లు ఆవరించి ఉన్న లోయ.! పక్కనే పారుతున్న జటాగంగ నది.. మధ్యలో శతాధిక ఆలయ సముదాయం.. 🙏🌺🌹అందులో మహాశివుడు🚩🌹💐 🌹🌺🙏జాగేశ్వర స్వామిగా కొలువు తీరాడు.🚩💐 ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దేవభూమిగా ప్రసిద్ధం. గొప్ప పుణ్యక్షేత్రాలకు నెలవు. వాటిలో జాగేశ్వర క్షేత్రం ఒకటి. నిజానికిది ఆలయాల సముదాయం. అక్కడ సుమారు నూటపాతిక చిన్నా పెద్ద గుడులు ఉంటాయి. వాటిలో ప్రధానమైనదీ, మహిమాన్వితంగా ఖ్యాతి పొందినదీ జాగేశ్వర ఆలయం. ఈ మందిరంలోని శివుడిని_ అర్థనారీశ్వర స్వరూపంగా భక్తులు కొలుస్తారు. అంతేకాదు, ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో ‘నాగేశం దారుకావనే’ అంటూ ప్రస్తావితమైన నాగేశ్వర క్షేత్రం ఇదేననీ, చుట్టూ దేవదారు వృక్షాలు ఉండడమే అందుకు తార్కాణమనీ నమ్మకం ఉంది. (ఈ విషయంలో అనేక వాదనలున్నాయి.... సరసగుజరాత్‌లోని జామ్‌నగర్‌ సమీపంలో ఉన్న నాగేశ్వర క్షేత్రం, మహారాష్ట్రలోని ఔంధ నాగనాథ్‌ ఆలయం కూడా నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రాచుర్యం పొందినవే) కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళే యాత్రికులు మార్గమధ్యంలో జాగేశ్వరుణ్ణి సందర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. సదాశివుడు సదా యోగనిద్రలో ఉంటాడనీ, హారతి సమయంలో మాత్రమే మేలుకొంటాడనీ, అయితే ఈ ఆలయంలో జాగేశ్వరుడు అన్నివేళలా జాగద్రావస్థలో ఉండి భక్తులను కరుణిస్తాడనీ, అందుకే ఈ స్వామిని ‘జాగేశ్వరుడు’ అంటారనీ చెబుతారు. పరమేశ్వరుని కోసం సతీదేవి తపస్సు చేసిన చోటు, అపమృత్యు భయాన్ని నివారించి, ఆయురారోగ్యాలను చేకూర్చే మహా మృత్యుంజయ మంత్రానికి మూల స్థానం ఇదేననీ కథనాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పుష్ఠీదేవిగా అమ్మవారు కొలువయ్యారు. దేవీ భాగవతంలో ప్రస్తావితమైన శక్తి పీఠాలలో ఇదొకటి. ప్రతిరాత్రీ ఈ ఆలయంలో స్వామివారికి పవళింపు సేవలో వేసే పక్క మరుసటి రోజు ఉదయానికి నలిగి ఉంటుందట! క్రీస్తుశకం ఏడో శతాబ్దం నుంచి పధ్నాలుగో శతాబ్దం మధ్య ఈ ఆలయాల నిర్మాణం జరిగిందని లభ్యమైన ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ఆదిశం

ప్రధాన ఆలయ నిర్మాణం ఆదిశంకరాచార్య నేతృత్వంలో జరిగిందని చెబుతారు. 


ఈ ఆలయం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అల్మోరా పట్టణానికి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది,


హరహర మహాదేవ్...🙏🚩


మన దైవం🙏భక్తి వైభవము🙏

A Collection from 

Admin 

Brahmana samaakhya

నేపాల్ మరియు ముక్తినాథ్ యాత్ర

 నేపాల్ మరియు ముక్తినాథ్ యాత్ర

May 24 న మొదలై 9 రోజులు యాత్ర

రైల్వే టికెట్లు ఇప్పుడు చేయించుకుంటే కానీ దొరకవు కాబట్టి వారం లోపల మీరు మీ టికెట్లు బుక్ చేసుకోగలరు

1.సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్ దాకా థర్డ్ ఏసి రాను పోను

వాహనంలో గోరఖ్పూర్ నుంచి 

2.ఖాట్మండు ముక్తినాథ్ దర్శనాలు ప్రోగ్రాం 

3. వింధ్య చలవాసిని 

4.మనోకామ్న 

5.నేపాల్ సైట్ సీన్ 

6.పశుపతినాథ్ మందిరము 

7.బుడే నీలకంఠనాథ్

8.పోకర లోయ దృశ్యం

9.మహేంద్ర గుహ దేవి

10.గుప్తేశ్వర్ గుహలు

11.గోరఖ్‌పూర్ మ్యూజియం

రూములు మూడు పుట్ల ఫుడ్డు మరియు ట్రాన్స్పోర్ట్ కలిపి మనిషి ఒక్కరికి 36000

12.ఈ ట్రైన్ టికెట్లు ఓపెన్ అయిన రోజే అయిపోతాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోగలరు 

13. మీ *ఆధార్ కార్డు* ఉంటేచాలు ఈ యాత్ర రావడానికి

14. లుంబిని

Contact *yanamandra* 

 *Sharada* *9247160975*

మంచిమాట

మంచిమాట

 🌹🌷 *నియమబద్ధత, క్రమశిక్షణ:* *నియమబద్ధత లేని పని నిరుపయోగం, మానవుడు జీవితంలో ఏం సాధించాలనుకున్నా క్రమశిక్షణ ప్రధానం.. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, బాధలు, మనోధైర్యాలతో ఎదుర్కొనే శక్తిని క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం అందిస్తుంది.. చిన్నతనం నుంచి అది అభ్యాసం కావాలి ప్రతి పనీ నియమానుసారం కాలానుగుణంగా చేయాలి ప్రకృతే దీనికి ఆదర్శం.*👏💐🤝

వైశాఖ పురాణం - 5 వ

 🍁 *మంగళవారం - మే 14, 2024*🍁

_*🚩వైశాఖ పురాణం - 5 వ అధ్యాయము🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 *వైశాఖమాస విశిష్టత*

☘☘☘☘☘☘☘☘☘

నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను.


మహారాజా ! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొకొలిపినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన ఉదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను , ప్రకృతిని మర్యాదలను రాజులను , వర్ణాశ్రమ విభాగములను , ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను , తంత్రములను, సంహితలను, స్మృతులను , పురాణేతిహాసములను , ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.


ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.


సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని , ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు. సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును ? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును ? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు. స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును ? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు , యాగభోగములకు , బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును. సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని , పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు , అంగవైకల్యము కలవారు , మహాత్ములు మున్నగు సర్వజనులకును , నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము , పుష్పము , ఫలము , జలము , శాకము , పుష్పమాల , తాంబూలము , చందనము , పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.


అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి 

శ్రీమహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను , పర్వతములను లతాతరువులను , జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను , తుష్టి , పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను , అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను , వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను , పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను , ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను , శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు , యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను , కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై , అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును , అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను , తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా ! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ , దానధర్మములను , భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.


ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు , చారణులు , గంధర్వులు , సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు , అన్ని వర్ణములవారిని , అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై , చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు , శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరముల నిత్తురు.


శ్రీహరి వైశాఖమున మత్తులై , ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని , గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని , పరమేశ్వరునిగాని , ఇతర దైవతములను సజ్జనులను పూజించినను , వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు. సపరివారముగ వచ్చిన మహారాజును నగరము , గ్రామములు , వనములు , పర్వతములు , నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్శించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము , పుష్పము , ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ ! తమయేలుబడిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట , సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను , అతిధులను , అభాగ్యతులను , దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నీయక యున్నచో మహారాజు కోపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాస వ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు శిక్షింతురు. కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైశాఖమాసవ్రతము కార్తీక మాఘ iమాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను.


_*వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం*_ 


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

మహాభాగవతం

 *14.5.2024 ప్రాతఃకాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది ఒకటవ అధ్యాయము*


*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*41.1 (ప్రథమ శ్లోకము)*


*స్తువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః|*


*భూయః సమాహరత్కృష్ణో నటో నాట్యమివాత్మనః॥9818॥*


*శ్రీశుకుడు నుడివెను* అక్రూరుడు ఇట్లు స్తుతించు చుండగా కృష్ణపరమాత్మ తన దివ్యరూపమును (శ్రీమహావిష్ణుస్వరూపమును) దర్శింపజేసెను. రంగస్థలము నందు ఒక నటుడు తన నటనకు తగిన రూపమును ప్రదర్శించిన పిమ్మట తెఱమఱుగున చేరినట్లు, ఆ వాసుదేవుడు అంతర్హితుడయ్యెను.


*41.2 (రెండవ శ్లోకము)*


*సోఽపి చాంతర్హితం వీక్ష్య జలాదున్మజ్య సత్వరః|*


*కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్॥9819॥*


భగవంతుడు తన రూపమును అంతర్ధానమొనర్చిన పిదప అక్రూరుడు త్వరత్వరగా జలముల నుండి బయటికి వచ్చెను. అనంతరము అతడు తన ముఖ్యవిధులను ముగించుకొని వచ్చి, రథమునందు ఉన్న బలరామకృష్ణులను గాంచి, ఆశ్చర్యపడుచు ఆసీనుడయ్యెను.


*41.3 (మూడవ శ్లోకము)*


*తమపృచ్ఛద్ధృషీకేశః కిం తే దృష్టమివాద్భుతమ్|*


*భూమౌ వియతి తోయే వా తథా త్వాం లక్షయామహే॥9820॥*


అంతట శ్రీకృష్ణుడు అతనిని ఇట్లు ప్రశ్నించెను. "నాయనా! నీవు భూతలముపైనను, ఆకాశమునందును, నీళ్ళలోను ఏవైనా అద్భుతదృశ్యములను గాంచితివా? నీ వైఖరి జూడగా నాకు అట్లనిపించుచున్నది".


*అక్రూర ఉవాచ*


*41.4 (నాలుగవ శ్లోకము)*


*అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వా జలే|*


*త్వయి విశ్వాత్మకే తాని కిం మేఽదృష్టం విపశ్యతః॥9821॥*


*అప్పుడు అక్రూరుడు ఇట్లనెను* "శ్రీకృష్ణా! భూమియందును, ఆకాశమునందును, నీటిలోనుగల అద్భుతములు అన్నియును విశ్వస్వరూపుడవైన నీలోనేగలవు. నేను నిన్నే చూచుచున్నప్పుడు ఇంక నేను చూడని అద్భుతములు ఏముండును?"


*41.5 (ఐదవ శ్లోకము)*


*యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వా జలే|*


*తం త్వానుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్టమిహాద్భుతమ్॥9822॥*

"పరబ్రహ్మస్వరూపా! భూ, గగన, జలములయందుగల సకల అద్భుతములయందు నీవే ఉన్నప్పుడు ఇక చూడదగిన ఇతరాద్భుతములు ఏముండును?"


*41.6 (ఆరవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా చోదయామాస స్యందనం గాందినీసుతః|*


*మథురామనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే॥9823॥*


ఇట్లు పలికిన పిదప అక్రూరుడు రథమును నడిపింపసాగెను. సాయంకాలము అగునప్పటికి అతడు బలరామకృష్ణులను మథురకు చేర్చెను.


*41.7 (ఏడవ శ్లోకము)*


*మార్గే గ్రామజనా రాజంస్తత్ర తత్రోపసంగతాః|*


*వసుదేవసుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం న చాదదుః॥9824॥*


పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు పయనించుచున్నప్పుడు మార్గమునగల గ్రామీణులు వారిని సమీపించి, దర్శించి, పరమానందభరితులైరి. వారు ఆ దివ్యపురుషులను కన్నులప్పగించి చూచుచు, తమ చూపులను వారినుండి మఱల్చలేకపోయిరి.


*41.8 (ఎనిమిదవ శ్లోకము)*


*తావద్వ్రజౌకసస్తత్ర నందగోపాదయోఽగ్రతః|*


*పురోపవనమాసాద్య ప్రతీక్షంతోఽవతస్థిరే॥9825॥*


నందుడు మొదలగు గోపాలురు ముందుగనే మథురను సమీపించి, అందలి ఉపవనములలో బసచేసిరి. పిమ్మట వారు బలరామకృష్ణుల కొఱకు నిరీక్షించుచుండిరి.


*41.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తాన్ సమేత్యాహ భగవానక్రూరం జగదీశ్వరః|*


*గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ॥9826॥*


జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు నందాదులను కలిసిన పిదప వినమ్రుడైయున్న అక్రూరుని చేతితో చేయి కలిపి, నవ్వుచు అతనితో ఇట్లు నుడివెను-


*41.10 (పదియవ శ్లోకము)*


*భవాన్ ప్రవిశతామగ్రే సహ యానః పురీం గృహమ్|*


*వయం త్విహావముచ్యాథ తతో ద్రక్ష్యామహే పురీమ్॥9827॥*


"తండ్రీ! నీవు రథమును తీసికొని, పురమున ప్రవేశించి, తిన్నగా ఇంటికి చేరుము. మేము ఇక రథము నుండి దిగి, ఈ ఉపవనమునందు కొంత విశ్రాంతిగైకొందుము. అనంతరము నెమ్మదిగా నగరమును దర్శించెదము".


*అక్రూర ఉవాచ*


*41.11 (పదకొండవ శ్లోకము)*


*నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో|*


*త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల॥9828॥*


*41.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఆగచ్ఛ యామ గేహాన్నః సనాథాన్ కుర్వధోక్షజ|*


*సహాగ్రజః సగోపాలైః సుహృద్భిశ్చ సుహృత్తమ॥9829॥*


*అక్రూరుడు ఇట్లు పలికెను* ప్రభూ! మీరు ఇరువురును లేకుండా నేను మథురలో ప్రవేశింపజాలను. భక్తవత్సలా! నేను నీ భక్తుడను. దయచేసి ఇప్పుడు నన్ను ఒక్కనినే పంపవలదు. పరమాత్మా! నీవు నా హితైషివి. నీవు బలరామునితోడను, నందాది గోపాలురతోను, తదితరులగు ఆత్మీయులతోడను కూడి మా ఇండ్లకు విచ్చేసి, మమ్ము అనుగ్రహింపుము.


*41.13 (పదమూడవ శ్లోకము)*


*పునీహి పాదరజసా గృహాన్నో గృహమేధినామ్|*


*యచ్ఛౌచేనానుతృప్యంతి పితరః సాగ్నయః సురాః॥9830॥*


స్వామీ! మేము గృహస్థులము. నీ పాదధూళితో మా గృహములను పునీతమొనర్చి మమ్ములను ధన్యులను గావింపుము. నీ పాదప్రక్షాళనచే పవిత్రములైన జలములను మేము సేవించుటవలనను, శిరస్సులపై చల్లుకొనుటచేతను, మా పితరులు, అగ్నులు, అట్లే దేవతలు తృప్తి చెందుదురు.


*41.14 (పదునాలుగవ శ్లోకము)*


*అవనిజ్యాంఘ్రియుగలమాసీచ్ఛ్లోక్యో బలిర్మహాన్|*


*ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాంతినాం తు యా॥9831॥*


దేవా! నీ పాదప్రక్షాళనముచే పవిత్రములైన తీర్థములను శిరమున ధరించినందున బలిచక్రవర్తియొక్క కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించెను. అంతేగాదు, అతడు సాటిలేని ఐశ్వర్యములను పొందెను. మఱియు ప్రసన్నులైన పరమభక్తులకువలె ఆయనకు ఉత్తమగతులు ప్రాప్తించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 14.5.2024 మంగళవారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*370వ నామ మంత్రము* 


*ఓం మధ్యమాయై నమః*


పశ్యంతీ వైఖరుల మధ్యగా ఉన్న వాగ్రూపురాలైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మధ్యమా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం మధ్యమాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత శ్రద్ధాభక్తులతో ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, అనంతమైన భక్తిప్రపత్తులు అనుగ్రహించును.


*మధ్యమా* అను శబ్దము వాక్కు యొక్క మూడవ స్థితి. పరమేశ్వరి *మధ్యమా* వాక్స్వరూపిణి. ఈ స్థితిలో నాదం జనిస్తుంది. అనాహత చక్రం మధ్యమావాక్కు యొక్క స్థానము. వాక్కులో స్పష్టత ఉండదు. శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇది ధాన్యపుగింజ మొలకెత్తిన తరువాత మారాకు వేసినట్లు ఉంటుంది.  ఈ స్థితిలో వాక్కు అస్పష్టమై, పసిపిల్లవాడి వచ్చీరాని మాటలమాదిరిగా ఉంటుంది.


*పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ* యను ఈ నాలుగు వాక్కుయొక్క స్వరూపములు.


పరబ్రహ్మతత్త్వం తెలుసు కొనుటలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు.  అవి 1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితిని చిత్రించే ఒక శ్లోకం ఉంది. 


*పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ*


చెట్టు నుంచి చివుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి. కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు. పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు. పశువు  *అంబా* అంటుంది. కాని, అంబను తెలుసుకొనలేదు. మనిషి కూడా అలాగే సృష్టిమూలాన్ని తెలుసుకొనలేక పోతున్నాడు. *పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ* శబ్దాలకు నిర్వచనం చెప్పే సందర్భంలో ఇచ్చిన ఈ నాలుగు ఉపమానాలు వరుసగా ఈ పదాలకు వర్తిస్తాయి. మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.


*పరా* విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి. అంటే, విత్తు భూమిలో పడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి. మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం *పశ్యంతి* మొక్క ఎదిగి, వృక్షంగా మారడం *మధ్యమ* స్థితి. పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం *వైఖరి’*


ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి *పరా వాక్కు*. తలపు *పశ్యంతీ వాక్కు* ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి *మధ్యమ వాక్కు* తలపు కార్య రూపం ధరించడం *వైఖరీ వాక్కు* గనుక పరమేశ్వరి అనాహత పద్మంలో,  మధ్యమా వాక్స్వరూపిణియై ఉంటుంది. 


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం మధ్యమాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సనాతన ధర్మం

 సనాతన ధర్మం : సైంటిస్టుల పరిశోధనల ఫలితమే.


హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం. ఎందుకంటే ఇది వ్యక్తుల నుంచి వచ్చిన జ్ఞానం కాదు. కెమిస్ట్రీని కనుగొన్నది ఎవరు? జువాలజీని కనుగొన్నది ఎవరు? ఇలా మిగితా విషయాలను కనుగొన్నది ఎవరో చెప్పగలమా? దీనికి కచ్చితమైన సమాధానం వుందా? అస్సలు వుండదు. అలాగే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు. ఓ క్రిస్టియననని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఓ ముస్లింని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే… తన గ్రంథాలయానికి ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు. అనంతం. హిందుత్వం మతం కాదు. భారతీయుల జీవన విధానం. ఇది అత్యంత సనాతనం.– స్వామి చిన్మయానంద

మహా విష సర్పములు

 విషములు వాని లక్షణములు - 


 మహా విష సర్పములు - 


 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.


 స్థాన విధి దోషము - 


 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.


 నక్షత్ర దోషము - 


 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .


 విష సాధ్య లక్షణములు - 


  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 


 తేలు విషము - 


  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 


 గర విష లక్షణము - 


 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 


 పెట్టుడు మందు లక్షణము - 


 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 


 విషాన్న లక్షణము - 


 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 


 విషము కలిపిన కూరలు - 


 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 


 విషాన్న పరీక్ష - 


  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

వైశాఖ పురాణం - 05

 Vaisakha Puranam -- 05


వైశాఖ పురాణం - 05


5వ అధ్యాయము - వైశాఖధర్మ ప్రశంస


నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు, వెండిపాత్రలలోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.


వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును.


విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును. వైశాఖమున బహిస్నానము నదీ/తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును, అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును? పోగొట్టుకొనలేడని భావము.


శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినది. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.


రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.


కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను, యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు, భర్తృప్రేమను కలిగియున్నను, వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. అనగా సర్వశుభలాభములనంది యువతులును వైశాఖవ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము. గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ వ్రతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచోయన్నియు వ్యర్థములగును సుమా! శాక సూపాదులు(కూర పప్పు) యెంత యుత్తమములైనను, యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము అత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, యింద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.


వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.


మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |

ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||


పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.


వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |

అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||

గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |

ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||

ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |

గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||


అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి/పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను/చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును. ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.


వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు, శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును, స్నానము, దానము చేయనివారును, నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.


తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను, స్నానమాడక నాలుక తన యధీనములో నుండి 'హరి' యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్నా శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని 'శవము' వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును.


పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.


వైశాఖ పురాణం పంచమ అధ్యాయము సంపూర్ణం.

పొందిన దానితో సంతృప్తి

 *2019*

*కం*

పొందిన దానికి తృప్తిని

బొందగ నీ వొందగలుగు పూర్ణ సుఖంబుల్.

పొందగలేనట్టి సిరుల

నొందగ సుఖమెల్లబోవు నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పొందిన దానితో సంతృప్తి ని పొందిన చో పరిపూర్ణమైన సుఖములు పొందగలరు. పొందలేని సంపదలను పొందాలనుకోవడంలోనే ఈ భూలోకంలో సుఖములన్నీ పోతాయి.


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

యోగిగా

 *మోహముద్గరమ్*

(శ్రీ ఆదిశంకరకృతం)


శ్లో𝕝𝕝 

*యోగరతో వా భోగరతో వా*

*సంగరతో వా సంగవిహీనః* ౹

*యస్య బ్రహ్మణి రమతే చిత్తం*

*నందతి నందతి నందత్యేవ* ॥19॥


భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*14-05-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ విషయమై  శుభవార్తలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలలో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.  వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరచి లాభాలు అందుకుంటారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. 

---------------------------------------

వృషభం


వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. వ్యాపారపరంగా సొంత ఆలోచన చేసి ఇబ్బంది పడతారు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఋణ   ప్రయత్నాలు విఫలం అవుతాయి

---------------------------------------

మిధునం


దూరప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. చేపట్టిన ప్రతీ పనీ అప్రయత్నంగా పూర్తవుతుంది. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. 

---------------------------------------

కర్కాటకం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన విద్యా సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.  వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన  ఫలితాలు అందుకుంటారు.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని  విజయం సాధిస్తారు. భూ సంబంధ క్రయ  విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

కన్య


సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు  దూరంగా ఉండటం మంచిది భాగస్వామి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  పని ఒత్తిడి పెరిగినా నిదానంగా  పూర్తి చేస్తారు. 

---------------------------------------

తుల


జీవిత భాగస్వామి ఆరోగ్యం పై  శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి మధ్యలో నిలిపివేస్తారు. బంధు మిత్రుల నుండి ఆశ్చర్యకర  విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. 

---------------------------------------

వృశ్చికం


శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులు  నూతన పదవులు పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

---------------------------------------

ధనస్సు


సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమకు స్వల్ప  ఫలితాన్ని పొందుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఋణ ఒత్తిడి పెరిగి మానసిక  సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఒడిడుకులు కలుగుతాయి. 

---------------------------------------

మకరం


కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన  పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ఫలించవు. చిన్ననాటి మిత్రులతో స్వల్పవివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో వాహన  ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది.

---------------------------------------

కుంభం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు  శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మీనం


మొండి బాకీలు వసూలు కావడం ఆలస్యం అవుతుంది.  విలాస వస్తువుల కోసం ధనవ్యయం చేస్తారు. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

_మే 14, 2024_

 ॐశుభోదయం, పంచాంగం ॐ

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

  *_మే 14, 2024_*  

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*వైశాఖ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *సప్తమి* పూర్తి

వారం: *భౌమవాసరే*

(మంగళ వారం)

నక్షత్రం: *పుష్యమి* మ3.07

యోగం: *గండం* ఉ9.35

కరణం: *గరజి* సా5.23

వర్జ్యం: మర్నాడు *తె4.53నుండి*

దుర్ముహూర్తము: *ఉ8.05-8.56*

*రా10.48-11.33*

అమృతకాలం: *ఉ8.21-10.02*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.32*

సూర్యాస్తమయం:*6.19*  *వృషభ సంక్రమణం* 

రా9.22 నుండిలోకాః సమస్తాః *సుఖినోభవంతు*

ఆంజనేయ శ్లోకాలు

 ఆంజనేయ శ్లోకాలు 


హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.


1. #విద్యా_ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!

సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

 

2. #ఉద్యోగ_ప్రాప్తికి :-


హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!

ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

 

3. #కార్య_సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!

రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

 

4. #గ్రహదోష_నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

 

5. #ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!

ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

 

6. #సంతాన_ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!

సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

 

7. #వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!

అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

 

8. #వివాహ_ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!

వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

 

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.14.05.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

************


గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే సప్తమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  సప్తమ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.32

సూ.అ.6.19

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

సప్తమి పూర్తి. 

మంగళ వారం. 

నక్షత్రం పుష్యమి

మ.3.06 వరకు. 

అమృతం ఉ.8.20 ల  10.02 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.05 ల 8.56 వరకు. 

దుర్ముహూర్తం రా.10.48 ల 11.33 వరకు. 

వర్జ్యం తె.4.52 ల మరునాడు ఉ. 6.36 వరకు. 

యోగం గండ ప.9.38 వరకు.  

కరణం గరజి సా. 5.19 వరకు. 

కరణం వనజి మరునాడు తె. 5.54 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు.    

*****************    

  పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర వైశాఖ   శుధ్ధ సప్తమి. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

భజగోవిందం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


     👇 //- ( *భజగోవిందం* )--👇


శ్లో𝕝𝕝 *భగవద్గీతా కించిదధీత గంగా జలలవ కణికాపీతా* |

*సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేవ న చర్చ* 20


భావం: *ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు*.


 ✍️🌸🪷🙏

వ్యక్తిత్వం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం :- పతిత్వా-యం కాయః కఠిన*

*దృషదంతే విదళితః |*

*వరం న్యస్తో హస్తః ఫణి*

*పతిముఖే తీక్ణదశనే* 

*వరం వహ్నౌ పాతస్త దపి* 

*న కృతః శీలవిలయః ||*


*అర్థం :- కొండ మీద నుంచి జారే కఠిన శిల కింద పడి నుజ్జునుజ్జు అయినా ఫర్వాలేదు. తీక్షణమైన జ్వాలలు కక్కుతున్న సర్పం నోటిలో చేయి పెట్టినా ఫర్వాలేదు. అగ్నిలో పడి శలభంలా మాడినా ఫర్వాలేదు. కానీ వ్యక్తిత్వం నాశనం కావడం ఏమాత్రం మంచిది కాదు*...


 ✍️🪷🌷🙏

మంగళవారం,మే 14,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం,మే 14,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - శుక్ల పక్షం

తిథి:సప్తమి పూర్తి

వారం:మంగళవారం(భౌమవాసరే )

నక్షత్రం:పుష్యమి మ3.07 వరకు

యోగo:గండం ఉ9.35 వరకు

కరణం:గరజి సా5.23 వరకు

వర్జ్యం:తె4.53నుండి

దుర్ముహూర్తము:ఉ8.05 - 8.56 మరల రా10.48 - 11.33

అమృతకాలం:ఉ8.21 - 10.02

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మేషం

చంద్రరాశి: కర్కాటకం 

సూర్యోదయం:5.32

సూర్యాస్తమయం:6.19


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

 *పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

మారాల్సింది_ఎవరు

 మారాల్సింది_ఎవరు?

                 ➖➖➖✍️


*ఆకలి కావడానికి ట్యాబ్లేట్ వేసుకోవాలి. అది అరగడానికి ఇంకో ట్యాబ్లేట్ వేసుకోవాలి.*


*అరిగింది బయటకు పంపడానికి కూడా ఇంకో ట్యాబ్లేట్ కావాలి.*


*ఇదీ మన జీవితం..!*


*శరీరానికి శ్రమ ఉండద్దు. కానీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి.*


*ఎలా సాధ్యం ...??*


*ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే గుర్తుకు వచ్చింది- పొద్దున హడావుడిలో బి.పి ట్యాబ్లేట్ వేసుకోలేదని! సిగ్నల్ పడితే ప్యారడైజ్ సర్కిల్ లో ఆగాను.*


*రోడ్డు పక్కన ఉన్న 80 ఏండ్ల పెద్దాయన ఎర్రగొడ్డు కారంతో కంచం నిండా అన్నం తిని, చుట్ట పీలుస్తూ తన్మయత్వం తో ప్రపంచాన్ని జయించినట్లు నా దిక్కు చూస్తే నా మీదా నాకే జాలి అనిపించింది.*


*బ్రేక్ ఫాస్ట్ కు ముందు, బ్రేక్ ఫాస్ట్ తరువాత, లంచ్ కు ముందు లంచ్ తరువాత, డిన్నర్ కు ముందు డిన్నర్ తరువాత అంటూ మెడికల్ షాప్ నే మింగించే డాక్టర్లు ఆ పెద్దాయన్ను చూస్తే ఏం సమాధానం చెప్తారు...?*


*చుట్టూ పొగ , కాలుష్యం, దానికి తోడు ఇరవై నాలుగు గంటలు వాహనాల రోద. అయినా వాడి ముఖంలో ఎంత ప్రశాంతత..?*

*ఎలాంటి చింతా చూద్దామన్నా వాని ముఖంలో కనిపించదే ....!*


*మరి ఎందుకు మిగితా జనాలు నిత్యం చస్తూ బ్రతుకుతున్నారు... ??*


*నాకు తెలిసి ఇప్పటి మనుషులు చావడానికి అణుబాంబులో, మారణ ఆయుధాలోఅక్కరలేదు అనుకుంటా...*

గట్టిగా కూర్చో బెట్టి కడుపునిండా అన్ని రుచులు తినిపిస్తే చాలు చచ్చి పోయేలా ఉన్నారు.*


*అందరికి ఆరోగ్యం గురించి చింతనే..*


*కాని ఆచారణలో మాత్రం అది అమలు కాదు!*

*ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం అలా ట్యూన్ చేసేసింది.*


*ఇక అంతే..!*


*జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలుసు. కానీ అదే ఫుడ్ ఎగబడి మరీ తింటారు.*


*నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని తెలుసు..*


*కానీ నడవడానికి అస్సలు ఇష్ట పడరు.*


*ఆరోగ్యం అందరికి కావాలి. కానీ దానికి సులువైన పద్దతులే కావాలి.*


*మెడికల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినట్లే కనిపిస్తుంది.*

*కానీ దాని నిజమైన ఫలితాలు మాత్రం బయట ఎక్కడా కనిపించవు.*


*ఈ మధ్య చాలా మంది క్యాన్సర్ భారిన పడి సరియైన ట్రీట్మెంట్ లేక చనిపోతున్నారు.*

*నిజానికి క్యాన్సర్ కు ట్రీట్మెంట్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు.*

*కీమోథెరపి ఒక్కటే క్యాన్సర్ ను బాగు చేస్తుంది అని ప్రతీ పేషేంట్ కు అదే కీమోథెరపి చేస్తున్నారు.*


*కీమోథెరపి శుద్ధ దండగా అని డాక్టర్ల కు కూడా తెలుసు, కానీ దాన్ని డాక్టర్లు ఒప్పుకోరు.*


*ఎందుకంటే కీమోథెరపి ని బేస్ చేసుకొని ఒక్క అమెరికానే 2.5 ట్రిలియన్ డాలర్లు సంపాదించు కొంటుంది.*


*కీమోథెరపి వల్ల ఉపయోగం లేదు అని జనాలకు తెలిసిన వెంటనే కీమోథెరపి ద్వారా సంపాదించే అంత పెద్ద మొత్తాన్ని అమెరికా కోల్పోవలసి వస్తుంది. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమే కాబట్టి అందుకు అమెరికా ఒప్పుకోక పోవచ్చు.*


*క్యాన్సర్ అనే జబ్బు కేవలం ధూమపానం, అల్కాహాల్ వలన వస్తుంది అని అన్ని ప్రభుత్వాలకు తెలుసు,*


*కానీ వాటిని బ్యాన్ చేసే శక్తి ఏ ప్రభుత్వానికైనా ఉందా ...??*


*అలా బ్యాన్ చేస్తే అస్సలు క్యాన్సర్ ను ఆమడదూరం లో పెట్టచ్చు. కానీ దాని వల్ల ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల నష్టం. మరి తమ ఆదాయం పోగొట్టుకొనే పని ఏ ప్రభుత్వమైనా ఎందుకు చేస్తుంది..??*


*డయాబెటిక్ అనేదాన్ని భూతద్దంలో చూపించి ఇన్సులిన్ వ్యాపారం ద్వారా మల్టీ మిలియన్ల డాలర్లు సంపాదించు కొంటున్న సంస్థలు కోకొల్లలు.*


*చక్కర వ్యాది అనేది అస్సలు అంత పెద్ద జబ్బే కాదు అనే దమ్ము ఎవరికి ఉంది...??*


*మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించు కోవాలి.*

*ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు.*


*మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, సరియైన రీతిలో వ్యాయామం చెయ్యడం, మంచి ఆహారం తీసుకోవడం ఒక్కటే ... ఇప్పుడు మన ముందు ఉన్న ఒకే ఒక్క కర్తవ్యం!*


*మన ఆరోగ్యం మన చేతుల్లోనే ... !*✍️

హీరేమగుళూర్ - చిక్కమగళూరు*

 🕉 *మన గుడి : నెం 316*


⚜ *కర్నాటక* :- 


*హీరేమగుళూర్  - చిక్కమగళూరు*


⚜ *శ్రీ కోదండరామ ఆలయం*



💠 పచ్చదనం మరియు కాఫీకి ప్రసిద్ధి చెందిన మెలెనాడ్ ప్రాంతంలోని చిక్కమగళూరు జిల్లా హిరేమగళూరులో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కోదండరామ దేవాలయం పురాతన కాలం నుండి పురాణాలు మరియు ఇతిహాసాలతో ముడిపడి ఉంది.  


💠 ఈ ఆలయంలో రాముడు, సీత మరియు లక్ష్మణ విగ్రహాలు ఏకశిలాగా చెక్కబడిన అద్భుతమైన దృశ్యం ఆరాధకులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది మరియు భక్తి సముద్రంలో తేలుతుంది.  

పురాతన భారతీయ దేవాలయాల అద్భుతమైన హొయసల శిల్పకళకు పర్యాటకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.



🔆 *ఆలయ చరిత్ర* 


💠 ఇది కర్ణాటకలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి మరియు దీనికి సంబంధించిన అనేక పురాణాలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి.  

స్థానికుల కథనం ప్రకారం రాముడు వాలిని చంపిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది.  

ఈ హత్యానంతరం సుగ్రీవుడికి కిష్కింద రాజుగా పట్టాభిషేకం చేసేందుకు రాముడు ముందుకు సాగాడు.


💠 ఈ ఆలయంలో ఉన్న మూడు విగ్రహాలు కూడా సుగ్రీవుడు స్వయంగా చెక్కినట్లు స్థానికులు నమ్ముతారు.  

అతను సమీపంలోని కొండపై నుండి సహజమైన బండరాయిని తీసుకువచ్చాడు మరియు ఈ అద్భుతమైన అద్భుత నిర్మాణానికి దానిని ఉపయోగించాడు.

 

💠 ఇక్కడి సీతమ్మ విగ్రహాల కళ్ళు తన భర్త పట్ల  గౌరవానికి చిహ్నంగా ఎల్లప్పుడూ భూమి వైపు మళ్లించే విధంగా చాలా క్లిష్టమైనవిగా చెక్కబడ్డాయి.



💠 మరొక పురాణ కథనం ప్రకారం, ఈ రోజు ఆలయం ఉన్న ప్రదేశం ఒకప్పుడు తొమ్మిది మంది సిద్ధుల నివాస స్థలం.  

ఒకప్పుడు సిద్ధ పుష్కరణి అనే గ్రామంలో ఉన్న చెరువు పక్కనే తపస్సు చేయడంతో సంబంధం కలిగి ఉన్నారు.  

ఈ పట్టణం భగవంతుడు పరశురాముని నివాస స్థలం కాబట్టి, దీనికి భార్గవ పురి  అని పేరు పెట్టారు.


💠 రాముడు మరియు లక్ష్మణులు తమ విల్లులు మరియు బాణాలతో ఇక్కడ చిత్రీకరించబడ్డారు.  

రాముడి విల్లును కోదండ అని పిలుస్తారు కాబట్టి, ఈ ఆలయాన్ని కోదండరామ ఆలయం అని పిలుస్తారు.

 

💠 ప్రపంచంలోని విగ్రహాల పాదాలు ఎడమవైపుకి వంగి ఉన్న ఏకైక ఆలయం ఇది.

పాదాల స్థానాన్ని గమనించండి.  

త్రయం (రాముడు, లక్ష్మణుడు మరియు సీత) యొక్క ప్రసిద్ధ  "మూడు విగ్రహాలూ తమ పాదాల స్థానాన్ని చూస్తూ వీక్షకుడి వైపు నడుస్తున్నట్లు కనిపిస్తాయి. 


💠 శిల్పి కిరీటం, నగలు మరియు శరీరాల స్థానాలను క్లిష్టంగా చెక్కారు. 

సీత భంగిమ, కళ్ళు క్రిందికి చూస్తున్న ఆమె నగలు నిజంగా చెక్కబడ్డాయ అనేలా ఉంటాయి.


💠 శ్రీరాముడు ప్రధాన దైవంగా ఉన్న ఈ ఆలయం 1200 సంవత్సరాల పురాతనమైనది.  ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన విగ్రహాల ఏర్పాటు.  

శ్రీరామ దేవాలయాలలో మధ్యలో శ్రీరాముని విగ్రహం, కుడివైపున శ్రీ లక్ష్మణుడు మరియు ఎడమవైపు సీతాదేవి (వివాహానంతరం ఆమె వామాంగిని) ఉండటం ఆనవాయితీ.  

శ్రీ హనుమ (లేదా శ్రీ ఆంజనేయుడు) యొక్క చిన్న విగ్రహం కూడా వారి పాదాల వద్ద ఒక మోకాలిపై ముడుచుకున్న చేతులతో స్థిరంగా కనిపిస్తుంది.  


💠 ఈ ఆలయంలో శ్రీరాముని కుడివైపున సీతాదేవి, ఎడమవైపున శ్రీ లక్ష్మణుడు ఉన్నారు.  

పరశురాముడు శ్రీరాముని సీతాదేవి వివాహానికి హాజరుకాలేదని, ఆ తర్వాత తన "ముహూర్తం" ముఖాన్ని చూపమని శ్రీరాముడిని ప్రార్థించాడని, అంటే తన వివాహ ముహూర్తంలో అతను ఎలా కనిపించాడో...

వివాహ సమయంలో, సీతా దేవి శ్రీరాముని కుడి వైపున ఉంటుంది (ఆచారాలు ముగిసే వరకు ఇంకా వివాహం కాలేదు), ఇక్కడ ఆలయంలో ప్రతిమలు తదనుగుణంగా అమర్చబడి ఉంటాయి (శ్రీరాముని కుడివైపున సీతాదేవితో).  అలాగే శ్రీ హనుమంతుడు వివాహానికి హాజరు కానందున ఆయన విగ్రహం కూడా ఈ ఆలయంలో శ్రీరాముని పాదాల వద్ద కనిపించదు.


💠 ఆలయం వెలుపల శ్రీ పరశురాముడు తన "ముహూర్తం" రూపాన్ని చూపమని ముకుళిత హస్తాలతో శ్రీరాముని వేడుకుంటాడు.


💠 ఈ ఆలయం మూడు దశల్లో నిర్మించబడింది,  దాని గర్భగృహ & సుఖనాసి నిర్మాణాలు హోయసల శైలిలో ఉన్నాయి.

మిగిలిన భాగాలు ద్రవిడ శైలిలో ఉన్నాయి.  ప్రస్తుత నవరంగ 14వ శతాబ్దానికి చెందినది.  ముఖమండపం 16వ శతాబ్దానికి చెందినది. 


💠 మనకు యోగ నరసింహ, సుగ్రీవ, కళింగ మర్ధన కృష్ణ, రామానుజాచార్య, మధ్వాచార్య మరియు వేదాంత దేశిక పుణ్యక్షేత్రాలు కూడా కనిపిస్తాయి.


💠 ఈ ఆలయాన్ని ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తారు మరియు ఫిబ్రవరిలో "జాత్ర" అని పిలువబడే వార్షిక వేడుకను కూడా నిర్వహిస్తారు.



💠 ఆలయం యొక్క ప్రశాంతత మీ ఇంద్రియాలను శాంతపరచి, మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది. మీ స్పృహను సానుకూలంగా మార్చుకోవడానికి ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేయండి. సర్వశక్తిమంతుని ఆశీర్వాదం పొందండి మరియు పరమాత్మతో కనెక్ట్ అవ్వండి.

శ్రీ రామ నవమి ఈ నగరంలో జరిగే ఒక ప్రముఖ హిందూ కార్యక్రమం.


💠 సమీప దేశీయ విమానాశ్రయం హుబ్లీ (143 కి.మీ.) వద్ద ఉంది.  

రైలు ద్వారా - 

హోస్పేట్‌కు సమీపంలో ఉన్న హంపి రైల్వే స్టేషన్ కోదండరామ చేరుకోవడానికి సమీప రైల్వే జంక్షన్.

సాధువుల నుండి జ్ఞానం

 జాతి న పూఛో సాధుకి 

పూఛి లీజియే జ్ఞాన్ 


జాతి మతం వంటి అంశాలను విడిచి పెట్టి తత్వము ఆధారం గా చేసుకుని 

సాధువుల నుండి జ్ఞానం పొందే అవకాశం జార విడుచు కోవద్దని 

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

9848647145

పంచాంగం 14.05.2024

 ఈ రోజు పంచాంగం 14.05.2024  Tuesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: సప్తమి తిధి భౌమ వాసర: పుష్యమి నక్షత్రం గండ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి రా.తె 04:20 వరకు.

పుష్యమి మధ్యాహ్నం 01:08 వరకు. 

సూర్యోదయం : 05:48

సూర్యాస్తమయం : 06:37


వర్జ్యం : రాత్రి 03:10 నుండి 04:55 వరకు. 


దుర్ముహూర్తం : పగలు 08:22 నుండి 09:13  వరకు తిరిగి రాత్రి 11:05 నుండి 11:50 వరకు.


అమృతఘడియలు : ఉదయం 06:17 నుండి 07:59 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.


ఈ రోజు  శ్రీ విద్యారణ్య స్వామి జయంతి 


వృషభ సంక్రమణం సాయంత్రం 05:50 లకు.



శుభోదయ:, నమస్కార: