17, ఆగస్టు 2024, శనివారం

Panchaag


 

_ఆగష్టు 17, 2024_*

ॐశుభోదయం, పంచాంగం ॐ  

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

   *_ఆగష్టు 17, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*శ్రావణ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *త్రయోదశి*

మర్నాడు తె4.04

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *పూర్వాషాఢ* ఉ10.21

యోగం: *ప్రీతి* ఉ10.22

కరణం: *కౌలువ* సా4.36

*తైతుల* తె4.04

వర్జ్యం: *రా6.12-7.46*

దుర్ముహూర్తము: *ఉ5.46-7.26*

అమృతకాలం: *ఉ7.09* వరకు

మర్నాడు *తె3.37-5.11*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *కర్కాటకం*

చంద్రరాశి: *ధనుస్సు*

సూర్యోదయం: *5.46*

సూర్యాస్తమయం: *6.23*

🙏 *శని త్రయోదశి* 🙏

  🌞 *సింహ సంక్రమణం* 🌞

 ఉ10.29 నుండి

లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

*శ్రీ మరికాంబ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 412*




⚜ *కర్నాటక  :  సగర -శివమొగ్గ (షిమోగా)*


⚜ *శ్రీ మరికాంబ ఆలయం* 



💠 మరికాంబ కర్నాటకలోని శివ మొగ్గ (షిమోగా) జిల్లాలోని సాగర పట్టణంలోని గ్రామ దేవత, ఆమె దుర్గ లేదా పార్వతి అవతారంగా నమ్ముతారు.  చిన్నదైన కానీ ఎత్తైన ఆలయం పట్టణం మధ్యలో ఉంది, చుట్టూ సందడిగా ఉండే బజార్లు ఉన్నాయి.  దారిన వెళ్లే చాలా మంది ప్రజలు ఒక క్షణం ఆగి ఆమెను ప్రార్థిస్తారు. 


💠 ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందినది, నాయకులు ఈ ప్రాంతాన్ని కేలాడి & ఇక్కేరి రాజ్యాలలో భాగంగా పాలించారు.  

మూడు సంవత్సరాలకు ఒకసారి దేవత తన గొప్ప రథంలో అడుగు పెట్టినప్పుడు జరిగే ఈ ఆలయ ఉత్సవం ప్రసిద్ధి చెందినది.


💠 ఆదిశంకరాచార్య తన దక్షిణ భారతదేశ పర్యటనలలో ఒక సమయంలో సాగర్‌ని సందర్శించారు. 

అతను పట్టణంలో ఉన్న సమయంలో అతని కలలో మారికాంబ దేవత కనిపించి, ఈ ప్రదేశంలో ఆమెకు ఆలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది. 

అనంతరం నగరం వెలుపలి సరిహద్దుల్లో అమ్మవారి పాద ముద్రలను ప్రతిష్ఠించారు.


💠ఆ కాలంలో (1596), కదంబ , చాళుక్య మరియు హొయసల రాజవంశాలు పరస్పరం యుద్ధంలో ఉన్నాయి. 

ఈ సమయంలో, కేలాడి మరియు ఇక్కేరి రాజ్యాన్ని పాలించిన వెంకటప్ప నాయకుడు, యుద్ధంలో విజయం సాధించడానికి దీవెనలు కోరుతూ ఈ దేవతను తన కుటుంబ దేవతగా స్వీకరించాడు. 

అతను యుద్ధంలో గెలిచిన తర్వాత, అతను దేవత యొక్క పాద ముద్రలను నగర శివార్ల నుండి ఒక కేంద్ర ప్రదేశానికి మార్చాడు మరియు పాదముద్రలను ఉంచడానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. 


💠 1950వ దశకం ప్రారంభంలో, ఆలయాన్ని నగరం మధ్యలో నుండి బయటి సరిహద్దులకు మార్చడానికి ఒక ఎత్తుగడ జరిగింది. 

ఆ సమయంలో, నగరం ప్లేగు మహమ్మారితో ప్రభావితమైంది, దీనికి కారణం ఆలయాన్ని తరలించే ప్రతిపాదన. 


💠 ఆలయం లోపలి గర్భగుడిలో ఎనిమిది చేతులతో, పులిపై స్వారీ చేస్తూ, రాక్షసుడిని చంపుతున్న దుర్గాదేవి యొక్క ఉగ్రరూప విగ్రహం  ఉంది. 

7 అడుగుల (2.1 మీ) ఎత్తైన విగ్రహం హనగల్‌కు వెళ్లే రహదారిలో ఉన్న చెరువు నుండి వెలికి తీయబడిందని నమ్ముతారు.


💠 ప్రతి మూడు సంవత్సరాలకు, ఫిబ్రవరి లేదా మార్చి నెలలో, ఆలయ వేదిక వద్ద 9 రోజుల పాటు జాతర జరుగుతుంది. 

మరికాంబ జాతర

 ఇది కర్ణాటకలోని ప్రధాన పండుగలలో ఒకటి. 

ఇది సామాజిక- మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు.


💠 ఈ సందర్భంగా, 16 అడుగుల (4.9 మీ) ఎత్తైన రథాన్ని, రంగురంగులగా అలంకరించి, విగ్రహం ప్రతిమను మోసుకెళ్లి ఊరేగింపుగా తీసుకువెలెత్తారు.


💠 మరికాంబ దేవి తన రుద్ర అవతారంలో 9 రోజులు ఉంటుంది.  స్మాల్ పాక్స్, ప్లేగు, కలరా వంటి అన్ని అంటువ్యాధులు మరియు వరదలు, కరువులు మరియు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు, వేలాది మందిని మృత్యువాత పడేటటువంటి అన్ని అంటువ్యాధులకు అధిపతి దేవతగా ప్రత్యేకంగా పూజిస్తారు.  

దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు మారికాంబ దేవి ఆశీస్సులు తీసుకోవడానికి తరలివస్తారు.


💠 జాతర మంగళవారం ప్రారంభమై వచ్చే బుధవారంతో ముగుస్తుంది.  

ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్టించి, భక్తులు కానుకలు సమర్పిస్తారు.


💠 ఈ అమ్మవారికి రెండు వేర్వేరు ఆలయాలు ఉన్నాయి.  ఒక ఆలయాన్ని అమ్మవారి ఇల్లు అని, మరొకటి భర్త ఇల్లు అని అంటారు.  అమ్మవారి మొదటి పూజ ఆమె తల్లి స్థానంలో నిర్వహించబడుతుంది.  

ఈ ప్రక్రియ అంతా దేవిని వివాహమాడడమే.


💠 మంగళవారం రాత్రి అమ్మవారి దర్శనం నుంచి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమవుతుంది.  

దేవాలయాల మధ్య దూరం అర కిలోమీటరు కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అమ్మవారి ఇంటి నుండి భర్త ఇంటికి చేరుకోవడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.  

అమ్మవారి ఇంటి నుండి దేవత బయటకు రావడానికి నిరాకరిస్తుంది అని పట్టణంలోని ప్రజలు నమ్ముతారు.  

అమ్మవారికి చాలా పూజలు మరియు నైవేద్యాలు చేసిన తర్వాత మాత్రమే ఆమె కదలడం ప్రారంభిస్తుంది.


💠 మిగిలిన రోజుల్లో దేవి భర్త ఇంట్లోనే ఉంటుంది.  తొమ్మిదవ రోజు రాత్రి, విగ్రహాన్ని లోతైన అడవిలో విడిచిపెట్టడానికి నృత్యాలు, పాటలు మరియు కోలాహలంతో ఊరేగింపుగా వీధుల గుండా తీసుకువెళతారు.


💠 గోకర్ణ నుండి తూర్పున 83 కిమీ (51మైళ్ళు) దూరంలో ఉన్న దీనిని దొడ్డమ్మ దేవాలయం అని కూడా పిలుస్తారు, అంటే కర్ణాటకలోని మరియమ్మలందరికీ వృద్ధ సోదరి.

భగవంతుడు

 *నిన్ను సృష్టించిన భగవంతుడు  నీకు ప్రసాదించిన నీ మతం, నీ భాష, నీ రూపం, నీ వేషం, నీ దేశం నీకు గొప్ప.*


ఎంత దార్శనిక శ్రేష్టుణ్ణైనా  మన ధర్మాచరణ నా కర్తవ్యమే అని ఆచార్య శంకరులు అనుకున్నారు. వారితో సమానులు ఎవరూ కూడా ధర్మమార్గంలో తమకు మినహాయింపు ఉంది అని ఎవరూ అనుకోలేదు. అటువంటప్పుడు మనమంతా ఏరీతిగా ఉండాలి?. మనకు ఇంకొక దుర్దైవం ఏమి వచ్చింది అంటే...? పాశ్చాతుల అంధానుకరణ పద్ధతులు,  అనేటటువంటివి మనవాళ్లలో వస్తున్నది, అంటే...? గుడ్డిగా పాశ్చాతులను అనుసరించటం అని. ఆ పాశ్చాతులలాగా నేనుంటే నేను పెద్దమనిషిని అవుతాను, గొప్పవాడినినైతాను, బాగా డబ్బు సంపాదించవచ్చు.. అనే భ్రమలు మనవాళ్లలో వస్తున్నవి. అది చాలా పొరపాటు. పాశ్చాతులను మనం ఎన్నడూ అనుకరించకూడదు. వాళ్ల సంస్కృతి వాళ్లకు, వాళ్ల రీతి వాళ్లకు, అది మనకు అనుకరణీయం కాదు. అది తప్పా, సరా? అనేటటువంటి విమర్శ మనకు అక్కర్లేదు, కానీ మన భారతీయులకు అవి అనుకరణీయం కాదు.  

మనము ఏ పరంపరలో ఏవచ్చామో?! ఏ ధర్మ మార్గంలో వచ్చామో?! అదే మనకు అనుకరణీయంకాని, అన్యులది మనకు అనుకరణీయం కాదు. అది ఎప్పుడు అనుకరణీయం అవుతుంది అంటే? మనకు ఉన్న ధర్మమార్గం మనకు శ్రేయఃప్రదం కాకపోతే, వాళ్లయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం అనటానికి ఏమైనా ప్రమాణం  శాస్త్ర సమ్మతంగా ఉంటే, అప్పుడు వాళ్ళది మనకు అనుకరణీయం అవుతుంది. వాళ్ళది మనకు శ్రేయఃప్రదం అనటానికి మన వేదాల్లో, పురాణాల్లో, ఋషుల వాక్కుల్లో ప్రమాణంగా ఎక్కడా ఏవిధంగా లేదు. అంతే కాకుండా, మనయొక్క ధర్మం మనకు శ్రేయఃప్రదం కాదు అనటానికి కూడా ప్రమాణం లేదు.

అలాంటప్పుడు మనం అన్యులధర్మాన్ని ఎందుకు అనుసరించాలి?. సర్వదా మనకు అది అనుకరణీయం కాదు. నిన్ను సృష్టించిన భగవంతుడు  నీకు ప్రసాదించిన నీ మతం, నీ భాష, నీ రూపం, నీ వేషం, నీ దేశం నీకు గొప్ప.అందులకే, ఏ విధంగా చూచినా మనయొక్క ధర్మాన్ని ఉపేక్షించటము తప్పు. అందువలన పాశ్చాతుల అంధానుకరణం మనకు పనికిరాదు. మన శాస్త్రప్రమాణమే మనకు సర్వదా శ్రీరామరక్ష.


--- *జగద్గురు శ్రీశ్రీశ్రీ  భారతీతీర్థ మహాస్వామి వారు.*

యజ్ఞోపవీతం

 🌹 *యజ్ఞోపవీతం విశిష్టత* 🌹

💐💐💐💐💐


*యజ్ఞోపవీతానికి ఎన్ని పోగులు ఉండాలి? కొందరు అత్యవసరమైన సమయాల్లో తమ జంధ్యంలో నుంచి కొన్ని పోగులు తీసి కొడుకులకు, ఇతరులకు ఇస్తుంటారు*

 *యజ్ఞోపవీతంలో మూడేసి చొప్పున  పోగులు ఒక యూనిట్ గా భావించాలి.*

 *బ్రహ్మచారికి 3 పోగులుగా ఉన్న యజ్ఞోపవీతాన్ని వేస్తారు.*

*పెళ్ళి అయ్యాక మామగారు భార్య తరఫు భార్య తాలూకు యజ్ఞోపవీతాన్ని వేస్తారు.అంటే మొగుడు భార్య కి తాళి కడతాడు. భార్య తాలూకు యజ్ఞోపవీతాన్ని మొగుడు భరిస్తాడు.*

 *అందుకే భార్య నెలసరిలో ఉంటే పుణ్య కార్యాలు చెయ్యరు. భార్య అంటే తనలో సగం కాబట్టి*.*పెళ్లి అయిన వాళ్ళు ఈ లెక్క ప్రకారం రెండు యూనిట్స్ అనగా 6 పోగులు వేసుకోవాలి.* *అంటే భర్త సంధ్య వారిస్తే భార్య కూడా చేసినట్టే. అందుకే పురాణ కాలంలో భార్యలు భర్త సంధ్యావందనానికి ఏర్పాట్లు చేసేవారు. ఇప్పటికి చేసే వారున్నారు.*

*సంధ్య వార్చడం ద్వారా ఏ రోజు పాపం ఆ రోజు ప్రక్షాళన అయిపోతుంది.*

 *మరోకకథ మూడు పొగులు ఉన్న యజ్ఞోపవీతం కూడా అదనంగా వేసుకుంటారు. అది ఎందుకనగా ఉత్తరీయం కోసం.*


 *ఉత్తరీయం లేకుండా ఎప్పుడు ఉండకూడదు. ఆ దోషం తగలకుండా మూడు పొగులు వేస్తారు.*

*ధర్మం ప్రకారం ఎప్పుడు మనిషి దిగంబరంగా ఉండకూడదు. ఆ దోషం రాకుండా నూలు పోగు గా మొలతాడు ఎప్పుడు ఉండాలి.*

 *మరో మూడు పొగులు ఉన్న యూనిట్ ను ఇష్టముంటే వేసుకోవచ్చు. ఇది వేరే వారికి ఇవ్వొచ్చు. ఒకవేళ ఎవరికైనా జంధ్యం తెగిపోతే ఇచ్చే అందుకు ఈ ఏర్పాటు.*

 *ప్రతి జంధ్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి.*

 *ఉపనయనము అయిన పిదప యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా వ్యక్తి ఉండనే రాదు. అలాగే భిన్న తంతువులు కల యజ్ఞోపవీతం కూడా ధరించరాదు. అందుకని, తను వేసుకున్న నాలుగవది వేరొకరికి దానం చేస్తారు.. ఇది కేవలం ఆ వ్యక్తి తను ఇంటికి వెళ్ళాక శుచియై, క్రొత్త యజ్ఞోపవీతాలను వేసుకునేంతవరకు 'ఆపత్ ధర్మ' ఏర్పాటు అని చెప్పవచ్చు.*

 *చాలా మంది పాటించడం లేదు కానీ, యజ్ఞోపవీతానికి చాలా పవిత్రత ఉన్నది. "యజ్ఞోపవీతం పరమం పవిత్రం...ప్రజాపతేర్యత్....." కదా ! అది ఎంత పొడవు ఉండాలి అన్నదీ చెప్పారు. నడుము క్రిందకు ఉండరాదు.. ఉన్నచో కొన్ని ముడులు వేసి, పొడవు తగ్గించుకోవాలి.*

 *ఎప్పుడు మార్చాలి, ఎంత తరచుగా మార్చాలి అన్నది కూడా చెప్పారు. అశౌచం వీడిన తర్వాత మార్చాలి. ఏ అశౌచం లేకపోయినా 3 నెలలకు ఒక సారి అని కొందరు, 6 నెలలకు ఒక సారి అని కొందరు పెద్దలు సెలవిచ్చారు. ఇక శ్రావణ పౌర్ణిమకు ఋగ్వేదులు మినహా మిగతా సాంప్రదాయాలవారు తప్పనిసరి గా మార్చుకుంటారు.*

 *ఈ కాలంలో కొంత మంది దానికి తాళం చెవులు తగిలిస్తారు. కొందరైతే ఏకంగా ఆ యజ్ఞోపవీతాన్నే తీసి గోడకూ తగిలించేస్తారని విన్నాను !*

 *యజ్ఞోపవీతాన్ని మూడు రకాలుగా ధరిస్తారు: ఉపవీతి, సంవీతి, నివీతి .*

 *ఉపవీతి అంటే ఎడం భుజం మీద నుండీ కుడి చేతి క్రిందుగా ధరించడం. ( దీన్నే 'సవ్యం' అనీ పిలుస్తారు.)*

*సంవీతి అంటే కుడి భుజంపై నుండీ ఎడమచేతి క్రిందవుండేట్లుగా వేసుకోవడం. ( దీన్నే ' అపసవ్యం' అనీ పిలుస్తారు.)*

*నివీతి అంటే మెడలో హారం లాగా ధరించడం.*

 *దైవ కార్యాలలో ఉపవీతం సవ్యంగా ఉండాలి. పితృ కార్యాలలో అపసవ్యం గా ఉండాలి. ఇక మనుష్య కార్యాలలో నివీతి గా ఉండాలి.మల, మూత్ర విసర్జనా సమయాయాలలో నివీతి చేసి కుడి చెవుకు చుట్టుకోవాలి*

 *అంటే మొత్తం 3 నుండి 12 పొగులు వేస్తారు. అర్హత బట్టి.*

 


*ॐశ్రీవేంకటేశాయ నమః*

చంద్రయాన్-2 కు వేదగణిత పరిష్కారాలు

 🇮🇳 🇮🇳 🇮🇳

నమ్ముతారా..? చంద్రయాన్-2 కు వేదగణిత పరిష్కారాలు సూచించి విజయానికి బాటలు వేసింది ఒక స్వామీజీ..!!


చంద్రయాన్-2 ప్రయోగానికి అంతా రెడీ… కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి… తేలడం లేదు, లెక్క తెగడమే లేదు… 900 కోట్ల ప్రాజెక్టు… కోట్ల మంది భారతీయుల ఆశలు… ప్రపంచం కన్ను… ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు… ఇస్రో శివన్ కూడా ప్రతిదీ వినే తరహా… దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు… ఆ సలహా ఏమిటంటే..? *‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు…’* ఆయన ఒక్క క్షణం విస్తుపోయాడు… ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయ బట్టల సన్యాసికి ఏం తెలుసు అనుకొన్నాడు, కానీ బయటికి చెప్పలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు… స్వామీజీనే శ్రీహరికోటను రమ్మని ఆహ్వానించారు… ఆయన వచ్చాడు… చూశాడు… ఆ లెక్కను చిటికెలో పరిష్కరించేసాడు శంకరాచార్య అలియాస్ నిశ్చలానంద సరస్వతి… ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్… ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది…

అబ్బే, ఏమాత్రం నమ్మగలిగేలా లేదు… ఇదంతా ఫేక్… అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు..! కాస్త అతిశయోక్తిలా ఉంది గానీ వార్త నిజమే… కాకపోతే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇలాంటివి కనిపించవు… అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి… ఈ స్వామి పూరి శంకరాచార్య పరంపరలోని 145వ పీఠాధిపతి… ఈయన 143వ శంకరాచార్యుడు భారతకృష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు… ఆయన వేదగణితంలో దిట్ట… ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్ చేసేవాడు… ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు…

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి… లెక్కలంటే లెక్కలే… ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు… రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి… కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది… ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది… ‘‘ఇందులో వింత ఏమీ లేదు… ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు… వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది… మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి… నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు… 11 పుస్తకాలు రాశాడు తను దీనిపై… చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు… సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు…’’ అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ రత్తా…


నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు… చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు… రెండేళ్ల క్రితం అహ్మదాబాద్ స్పేస్ రీసెర్చ్ స్టేషన్‌కు వెళ్లి… దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు… అహ్మదాబాద్ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్ పాఠాలు కూడా చెప్పాడు. 


సో, స్వామి అనగానే కాషాయాలు, ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి… ఇదుగో, ఇలాంటి నిశ్చలానందులూ ఉంటారు… ఆధునిక సాంకేతిక విజ్ఞానాని

పుత్రులు ఎన్ని రకాలు

 *పుత్రులు ఎన్ని రకాలు...*

1. ధర్మపత్నియందు పుట్టిన కుమారుడ్ని "ఔరసుడు" అని అంటారు.

2. కూతురికి పుట్టిన కొడుకుని "దౌహిత్రుడు" అని అంటారు.

3. తల్లిదండ్రులు ఇష్టపడి తన కుమారుని దానం చేస్తే అతన్ని "దత్త పుత్రుడు" అని అంటారు.

4. తన భార్యకు వేరే పురుషుని వల్ల పుట్టిన కుమారుని "క్షేత్రజుడు"అని అంటారు.

5. తల్లిదండ్రులు లేని వానిని తెచ్చి పెంచుకుంటే వానిని "కృత్రిముడు" అని అంటారు.

6. వ్యభిచారిణి అయిన భార్యకు పుట్టిన కొడుకుని "గూఢజుడు"  అని పిలుస్తారు.

7. ఒక పిల్లవానిని తల్లిదండ్రులు వదిలి పెట్టేస్తారు. వానిని వేరే దంపతులు పెంచుకుంటారు. అతనిని "అపవిద్ధుడు" అని అంటారు.

8. ఒక కన్య పెండ్లి కాకుండా కొడుకుని కంటుంది. వాడు ఆ కన్యను పెళ్లాడిన వాడికి కొడుకు అవుతాడు. అతనిని "కానీనుడు" అని అంటారు.

9. ఒక గర్భిణీ స్త్రీని పెళ్లాడితే దానికి పుట్టిన కొడుకుని "సహోడుడు" అని అంటారు.

10. భర్త విడిచిన స్త్రీ గాని, లేదా మగడు విడిచిన స్త్రీ గాని, లేదా విధవ గాని ఎవరి వల్లనైనా పుత్రుని కంటే వారిని "పౌనర్భవుడు" అని అంటారు.

11. దిక్కులేని పిల్లవాడు ఒక దంపతుల దగ్గరకు చేరి "నేను మీ కొడుకుగా ఉంటా" అని అంటే వానిని "స్వయం దత్తుడు" అని అంటారు.

12. తల్లిదండ్రులు అమ్మి వేస్తే కొనుక్కున్న స్వజాతి పుత్రునని "  ప్రీతుడు" అని అంటారు.

*ఈ పుత్రులందరూ కర్మకు అర్హులు అవుతారు. వీరిలో ఔరసుడు చాలా ముఖ్యుడు.*

తిరుమల వైభవం

 🔔 *తిరుమల వైభవం*🔔


శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల_మండపం చరిత్ర...!!


అది అక్కడ ఎందుకుఉంది.. చరిత్ర ఏమిటి ?


శ్రీవారి ఆలయం ఎదురుగా సన్నగా పొడువుగా నాలుగ్గాళ్ళపై ఓ మండపం కనిపిస్తుంది. అసలు ఈ మండపం ఎందుకు ఇక్కడ ఉందా? చాలా మందికి అనుమానం కలుగుతుంది.


నిజమే.. అంత పెద్ద మండపం ఎదురుగా చిన్న మండపం. దానిమీద ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు ఉంటుంది. అక్కడే సెక్యూరిటీ అత్యాధునిక ఆయుధాలతో కాపలా కాస్తూ ఉంటారు. 


ఈ చిన్నమండపానికి ఇంత పెద్ద సెక్యూరిటీనా అనిపిస్తుంది. కానీ, సెక్యూరిటీ ఉన్నది శ్రీవారి ఆలయానికి. అది వేరే విషయం.


మరి ఈ మండపం ఏమిటి? మండపాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారు. ? దాని పేరేంటి? ఇంకెందుకు ఆలస్యం ఈ కథనం చదివేయండి.


ఆ మండపం పేరే  గొల్ల_మండపం వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. 


గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది.


తొమ్మిది వందలో సంవత్సరం వరకూ కూడా ఆలయానికి సంబంధించిన కైంకర్యాలు మినహా అన్ని వ్యవహారాలు దిగువ తిరుపతికి సమీపంలోని తిరుచానూరులో జరిగేవి.


శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమలేశుని ఉత్సవాలు కొండమీదనే జరగాలని నిర్ణయించారు. వైష్ణవ సభ కూడా అందుకు ఆమోదం తెలిపింది. 


అయితే కారడవి. ముళ్ళపొదలు, ఆలయం సమీపానికి కూడా క్రూర జంతువులు వచ్చిపోయేవి. ఇలాంటి స్థితిలో చుట్టూ మడ వీధులను ఏర్పాటు చేసి అక్కడే ఉండడానికి అర్చకులకు కొన్ని నివాసాలను ఏర్పాటు చేయాలని నిర్ణియించారు.


రామనుజుల వారి గురువు, మేనమామ తిరుమల నంబి, శిష్యుడైన అనంతాళ్వారులను వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించణా బాధ్యతలను తీసుకున్నారు.


నిర్మాణ సమయంలో కూలీలను, పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు గొల్ల కులానికి చెందిన ఒక మహిళ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట.


ఆమెకు వేంకటేశ్వర స్వామి అంటే అచెంచల భక్తి. అందుకే కొండకింద నుంచి చల్ల కడవ నెత్తిన పెట్టుకుని తిరుమలకు చేరి ఆ మజ్జిగను వారికి ఇచ్చేది.


అక్కడి వారు పైకము ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం మజ్జిగ ఇవ్వడం మానలేదు. అక్కడి వారు అడిగిన ప్రశ్నకు ఎండలో స్వామి సేవ చేస్తున్నవారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్ణెం వస్తుందంట కదా! సామి.


ఆ మహిళ సమాధానానికి ఆశ్చర్య పోవడం అక్కడి వారి వంతయ్యింది. తిరుమల నంబి, అనంతాళ్వారులను చూపించి వారు మోక్షం ఇప్పిస్తారని చెప్తారట.


ఆ మహిళ నేరుగా వారి వద్దకు వెళ్ళి సాములూ! మీతో గోయిందసామి మాట్లాడుతారట గదా! నాకు వైకుంఠం వత్తదంట. ఇప్పించండి సామి! అని అమాయకంగా అడిగింది.


ఆ రాత్రి చల్లలమ్మే మహిళ కోరికను తిరుమల నంబి అనంతాళ్వార్లు వేంకటేశ్వర స్వామికి విన్పించారు. అది రామానుజులు వారికి మాత్రమే సాధ్యమని స్వామి వారికి చెప్పారు.


రామానుజులవారు ఓ రోజు తిరుమలకు వచ్చారు. ఆ గొల్ల మహిళ సాష్టాంగ నమస్కారం చేసి. కొంచెం చల్ల తీసుకోండి సామీ! అంది. రామానుజల వారు మజ్జిగ సేవిస్తున్న సమయంలో.. తాను ఏమి కోరుకుంటున్నానో చెప్పేసింది.


వెంటనే రామనుజులవారుశ్రీనివాసా. పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక’ అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారట. అంతే వెంటనే మజ్జిగ అమ్మే ఆమె పరమపదం పొందింది.


వేంకటేశ్వ ర స్వామిపై అచెంచల భక్తితో ఉడతా సాయంగా తాను చేసిన పనికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన నాలుగు స్తంబాల మండపాన్ని నిర్మించారు.ఆమండపమేగొల్లమండపం


ఒకప్పుడు వీధుల మధ్యలో ఉన్న ఆ సన్నని మండపం తిరుమాడ వీధులను వెడల్పు చేసి అక్కడున్న వేయి కాళ్ళ మండపాన్ని తొలగించడంతో మరింత ఠీవీగా గొల్లమండపం ..అలా కట్టినదే తిరుమలేశుని ఆలయము ముందున్న నాలుగు స్థంబాల మండపము.. 

నేటి గొల్ల మండపం.


https://youtu.be/2WnzotqAEkw


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      𝕝𝕝 శ్లోకం 𝕝𝕝 


  *ఏ వేదంబు బఠించె లూత? భుజంగ బే శాస్త్రముల్చూ చెఁదా*

  *నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చేమంత్ర మూహించెబో*

  *ధావిర్భావనిదానముల్ చదువు లయ్యా! కావు! మీ పాదసం*

  *సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 13*


తాత్పర్యము: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! సాలెపురుగు ఏ వేదములు పఠించినది? పాము ఏ శాస్త్రములు చదివినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది? బోయవాడు ఏ మంత్రములు నేర్చినాడు? *వేదవిద్యాతతులవల్లనా ప్రభో మోక్షము సాధింపదగినది? నీ పాద సేవాసక్తి ఉన్న చాలదా???*

      

✍️VKS ©️ MSV🙏

చమత్కార భాషణం!

 శు భో ద యం🙏


చమత్కార భాషణం!


ఏమీనన  దాబేలన /

నాముంగిటి కేలరాడు నరహరి పిన్నా /

రాముని ముమ్మాఱంపితి/

బ్రేమంబున బుద్దిచెప్పి పిలువవె కలికీ /  


 -చాటుపద్య రత్నాకరము-చతుర్థ తరంగము 70 వ పద్యము.


ఒక గడుసు యువతి తన చెలికత్తెతో తనకోసం ప్రయత్నిస్తున్న గడుసు  పిల్లవానికి పంపే సందేశం


"ఓ  కలికీ!ఆ నరహరి వట్టి బేల పిన్నవాడు .  నేనేమి  అనను .నాముందుకెందుకు రాడు?ప్రేమతో బుద్ధి చెప్పి పిలుచుకొనిరా.

 

 సరే ఈ  సందేశము  వదిలేద్దాము.

 ఈ పద్యం లో దశావతారములు ఎలా సూచింప  బడ్డాయో చూద్దాము 

.

          ఏమీనన, మీన/ తాబేలన, తాబేలు/ ముంగిటి* కిటి =వరాహము  / నరహరి/పిన్న=వామన / రాముని ముమ్మాఱంపితి/ బుద్దిచెప్పి* బుద్ది/ కలికీ

 

"మత్స్యః కూర్మ వరాహశ్చ నారసింహాశ్చ వామనః 

రామో రామశ్చ రామశ్చ బుద్ధ: కల్కి రేవచ"-

అని గదా దశావతారములు పేర్కొనబడినవి.

                        స్వస్తి!🙏🙏🌷🌷🌷🕉️🕉️🕉️🌷🕉️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🌷🌷🌷🌷

17.08.2024,శనివారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

17.08.2024,శనివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం


శ్రావణమాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణం నక్షత్రం శ్రీ మహావిష్ణువుది. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో బాగంగా కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా దర్శనమిస్తున్నాడు. శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం. ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం. అందుకే శ్రావణమాసంలో వచ్చే శనివారాలు ప్రత్యేకమైనవి అయితే శ్రవణం నక్షత్రం కలిసొస్తే మరింత ప్రత్యేకం అని చెబుతారు పండితులు. అప్పట్లో శ్రావణ శనివారం వ్రతాలు చేసేవారు. అందుకే ఈ నెలలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా ఒక్క శనివారం అయినా శ్రీ వేంకటేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని, కలిదోషం తొలగిపోతుందని అంటారు. 


శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం దిద్దాలి. ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలిమిడి కలిపి దానితో ప్రమిద చేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. జ్యోతి స్వరూపుడైన వేంకటేశ్వరస్వామిని గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి.

అష్టైశ్వర్యాలు అంటే…


             *అష్టైశ్వర్యాలు అంటే…*

                   ➖➖➖✍️

```

పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని దీవించడం వింటూనే ఉంటాం. ఐశ్వర్యం అంటే సంపద. అది ఉన్న చోట దేనికీ ఎలాంటి లోటు ఉండదు. 


అయితే ఆ ఐశ్వర్యమొక్కటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు. అవి కేవలం ఐహిక భోగాలు మాత్రమే. 


ఒక వ్యక్తికి సంఘంలో నిజమైన పేరు, ఆనందమయ జీవితం కలిగేది అతనికి అష్టైశ్వర్యాలు సిద్ధించినప్పుడే. 


మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న అష్టైశ్వర్యాలు ఏంటో మీరే చదవండి..

```

*రాజ్యమే రాజసం!*```

పూర్వం రాజ్యమంటే రాజు పాలించే ప్రాంతం. కానీ అష్టైశ్వర్యాల్లో రాజ్యమంటే ఆధీనంలో ఉన్న ప్రాంతం కాదు.  ఈ భూమండలంపై వ్యక్తి పేరు, యశస్సు, కీర్తి ఎంతవరకు విస్తరిస్తే ఆ ప్రాంతమంతా అతని రాజ్యమని అర్థం. ఈ రాజ్యమే అతనికి రాజసం తెచ్చి పెడుతుంది. అంటే మనిషి గొప్పతనం నలుమూలలా విస్తరిస్తే అది తనకు కలిగిన ఒక ఐశ్వర్యమన్నమాట.```


*ధనమే మూలం!*```

ధనం ఉంటేనే ఎవరికైనా విలువ. అదే ధనం  మీదగ్గర లేనప్పుడు సంఘంలో గౌరవమర్యాదలు దక్కడం కష్టం. జీవితంలో అతి ముఖ్యమైన కూడు, గూడు, బట్ట ఉండాలంటే ధనం తప్పనిసరి. డబ్బే లేని నాడు ఇవేవీ మీ చెంతకు రావు. అంటే ధనమే అన్నింటికి మూలమన్న సత్యాన్ని గ్రహించాలి. జేబులో పైసా లేని నాడు మనిషికి జీవితం కష్టాల్లో ఉంటుంది. కాబట్టి అష్టైశ్వర్యాల్లో ధనానిది ప్రత్యేక స్థానమని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.```


*ఇల్లాలే దీపం!*```

సంసార జీవితంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ.. కష్టసుఖాలు పాలుపంచుకొంటూ భర్తకు కొండంత ధైర్యాన్నిచ్చేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే.   అందుకే పెద్దలు ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. అర్థం చేసుకునే ఇల్లాలు ఉంటే జీవితం ఆనందంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఒకవైపు సంతానాన్ని ప్రయోజకుల్ని చేయటం, మరోవైపు అత్తమామల్ని ఆప్యాయతతో  చూసుకోవడం, భర్తతో సమానంగా ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలో ఇల్లాలి పాత్ర అద్వితీయం.```


*సగం బలం!*```

కొండంత సంపద ఉండి చివరి రోజుల్లో బాగోగులను చూసుకోవడానికి సంతానం లేకపోతే  జీవితానికి సంపూర్ణత చేకూరదు. పిల్లలు చేతికొచ్చారంటే తల్లిదండ్రులకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.సంతానం ప్రయోజకులయ్యారంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు.```


*ధైర్యే సాహసే లక్ష్మీ!*```

జీవితంలో కొందరు సాధించిన దాన్ని మరికొందరు సాధించలేరు. అలా జరగడానికి ఒక కారణం మీలోని ధైర్యసాహసాలు. జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించలేక కొందరు మధ్యలోనే వెనుకంజ వేస్తారు. మరి కొందరు ధైర్యం కూడదీసుకుని ముందడుగు వేసి విజయం సాధిస్తారు. సరైన సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినప్పుడు డబ్బు కూడా మీ దరికి చేరుతుంది. కష్టపడినప్పుడే కదా విజయం విలువ తెలిసేది. అలాంటి ధైర్యసాహసాలు కలిగి ఉండడమూ  అష్టైశ్వర్యాల్లో ఒక భాగమే.```


*ఆత్మస్థైర్యం ఉంటేనే మనుగడ!*```

మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఒకానొకసారి మిమ్మల్ని బలవంతుల్ని చేస్తే, మరొకసారి బలహీనుల్ని చేస్తోంది. బలహీనమైన సందర్భంలో మీలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేదే మీ మనుగడను నిర్దేశిస్తుంది. కొందరు గెలుపోటములను లెక్కచేయకుండా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అదే సందర్భంలో మరికొందరు ఓటమి కలిగినప్పుడు కుంగుబాటుకు లోనవుతారు.  ఓటమి, కష్టాలు, బాధలు కలిగినప్పుడు కుంగిపోకుండా ధీమాతో ముందుకు సాగేవారే నిజమైన ఐశ్వర్యవంతులు.```


*విద్యే విజ్ఞాన జ్యోతి!*```

విద్య కలిగిన వాడు విద్యావంతుడు అవుతాడు. సమస్త విషయాలపై జ్ఞానాన్ని సంపాదిస్తాడు. చదువు సరిగా రాకపోతే ఇతరులకు మీరు సరిగా దిశానిర్దేశం చేయలేరు. ఉద్యోగం రావాలన్నా, ఆధునిక సమాజంలో బతుకు బండిని నెట్టుకు రావాలన్నా- విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సంపాదనను దొంగిలించొచ్చు. పేరు, ప్రఖ్యాతులు నాశనం చేయవచ్చు. కానీ మీ దగ్గర ఉండే విద్యను ఎవరూ దొంగిలించలేరు. అందుకే విద్య అనేది దొంగిలించలేని ఐశ్వర్యం. ‘విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే’ అని అంటారు.```


*వినయమే ప్రధానం!*```

మానవుడు జీవితంలో విజయం సాధించాలంటే వినయం కూడా అవసరం. వినయాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రదర్శించినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది. వినయంగా వినడం, మాట్లాడటం, ప్రవర్తించడం, నేర్చుకోవడం వంటివి మిమ్మల్ని బలవంతులను చేస్తాయి. పెద్దవారి ముందు వినయం ప్రదర్శించకుండా ప్రవర్తిస్తే నష్టపోక తప్పదు. కాబట్టి వినయమనే ఐశ్వర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774.

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

ఏలినాటి శని

 ఈ నక్షత్రాలకు, రాశులకు ఏలినాటి శని నడుస్తున్నది. ఆ ప్రభా ఎక్కువ లేకుండా ఉండడానికి రుద్ర పారాయణ, రుద్ర అభిషేకం దోహదం చేస్తాయి.


ఈ కింద మంత్రం కూడా సాయం చేస్తుంది. ప్రతిదినం పారాయణ చేసుకోవడం మంచిది

                                                                                                                                                                          పిప్పలాద కృత శని స్తోత్రం 


ఉదయం మరియు సాయంత్రం అపమృత్యు దోష నివారణ, అర్ధాష్టమి శని, 7.5 మరియు 2.5 శని దోష  నివారణ నిమిత్తం


నమస్తే  క్రోధ సంస్థాయ పింగళాయ నమోస్తుతే   

 నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయచ నమోస్తుతే

నమస్తే  రౌద్ర దేహాయ నమస్తే చ అంతకాయ చ  

నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో

నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే

ప్రసాదంకురు దేవేశ దీనస్య ప్రణతశ్చచ ll

                                            …

వరలక్ష్మీదేవికి వందనమ్*

 *వరలక్ష్మీదేవికి వందనమ్*


మ॥

దరహాసమ్మున దృక్కులూన్చి ప్రియభక్తశ్రేణి సంరక్షణా 

స్థిరసంకల్పము లక్ష్యమై భువిని సుశ్శ్రేయమ్ము వాంఛించుచున్ 

వరలక్ష్మీ ప్రియరూపివై సిరుల నిర్వ్యాజమ్ముగా నిచ్చుచున్ 

వరలన్ శ్రావణమందు నైదువలు సంభావించి పూజింతురే! 


చం॥

కలశములోన నిర్గుణముగా నిను భావన జేసి భక్తితో 

లలితవిలాసహాససుమలాంఛనభాసితరూపరమ్యతామలవరలక్ష్మిగా స్తుతుల నర్చన జేయుచు వేడుకొంచు ని 

న్నలరుల భూషణమ్ముల పదాబ్జపులత్తుక లోర్మి బుల్ముచున్ 

కలకలలాడు శ్రావణపుకౌర్ణ్యము నందున గొల్తు రైదువల్ 


కం॥

ఇరుగు పొరుగు మహిళామణు 

లరుదెంచగ నీవుగ దలపందున గలుగన్ 

మరచిన దేహము నందున 

నరమరికలు లేక వాయనాంబుల తోడన్ 


ఉ॥

గౌరవ మిచ్చుటే విమలకాంచనపుష్పము నీ పదమ్ములన్ 

స్మేరముఖమ్ములన్ నిలిపి జేసెడు పూజగు నైదువాళికిన్ 

భూరి వరమ్ము లీయగదె మోహము ద్రుంచుచు కోరి వచ్చుచున్ 

భారము నీదె యంచు నిను ప్రార్థన వేడెడు స్త్రీజనాళికిన్ 

మీ

*~శ్రీశర్మద*

విరుద్ద ఆహారపదార్థాలు -

 మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు  - 


 

     ఈ  సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం.  ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.


  విరుద్ద ఆహారపదార్థాలు - 


 *  నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.


 *  తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు . 


 *  ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు. 


 *  కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.


 *  చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.


 *  చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు . 


 *  పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు. 


 *  ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు 


 * ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.


 *  మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .


 *  మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.


 *  ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .


 *  ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.


 *  పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.


 *  పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .


 *  తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును 


 *  ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.


 *  నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.


 *  ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.


 *  తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును 


 *  రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.


 *  బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు . 


 *  అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు . 


     పైన చెప్పిన విధంగా విరుద్ద ఆరపదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగన్దరం , గ్రహణి వంటి రోగాలు కలుగును.


  

       మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 *𝕝𝕝 శార్దూలము 𝕝𝕝* 


  *ఏ వేదంబు బఠించె లూత? భుజగం బే శాస్త్రముల్చూ చెఁదా*

  *నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చేమంత్ర మూహించెబో*

  *ధావిర్భావనిదానముల్ చదువు లయ్యా! కావు! మీ పాదసం*

  *సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 13*


*తాత్పర్యము: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! సాలెపురుగు ఏ వేదములు పఠించినది? పాము ఏ శాస్త్రములు చదివినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది? బోయవాడు ఏ మంత్రములు నేర్చినాడు?* *వేదవిద్యాతతుల వల్లనా ప్రభో మోక్షము సాధింపదగినది? నీ పాద సేవాసక్తి ఉన్న చాలదా???*

      

✍️🌹🌷💐🙏

ఆణిముత్యాలు

 

*విదురుడు చెప్పిన…


               *ఆణిముత్యాలు*

                 ➖➖➖✍️


*జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! *


*యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని ఋషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.*


*ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.*


*రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.*


*సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు.*


*విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!*


*జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.*


*మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.*


*‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు.*


*మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.*✍️

                     .... వి. లక్ష్మి శేఖర్.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9440652774.

లింక్ పంపుతాము.🙏

*శ్రీ రామేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 411*


⚜ *కర్నాటక  : కూడలి - శివమొగ్గ (షిమోగా)*


⚜ *శ్రీ రామేశ్వర ఆలయం* 



💠 కర్ణాటకలో అంతగా తెలియని వేలాది పురాతన దేవాలయాలు ఉన్నాయి. 

ప్రతి ఆలయానికి దాని స్వంత ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఉంటుంది. భారతదేశంలోని శివమొగ్గ ( షిమోగా) సమీపంలో ఉన్న అటువంటి పురాతన దేవాలయం - కూడలి రామేశ్వర దేవాలయం


💠 కుడ్లి దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి మరియు ఇది తుంగ & భద్ర అనే రెండు పవిత్ర నదుల సంగమ ప్రదేశం. 

పురాతన కాలం నుండి కూడలి ఒక ముఖ్యమైన ప్రార్థనా స్థలం, ధ్యానం మరియు శాంతి ప్రదేశం. ఈ చిన్న గ్రామం కొన్ని ముఖ్యమైన మరియు పాత దేవాలయాలకు నిలయంగా ఉంది, దీని మూలం గత సహస్రాబ్ది ప్రారంభంలో ఉంది. రామేశ్వర, నరసింహ, బ్రహ్మేశ్వర, ఋష్యాశ్రమ వంటి ఆలయాలు ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని 'దక్షిణ వారణాసి' అని పిలుస్తారు.



💠 బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కలచూరిలు, సేనులు, హొయసలలు, విజయనగర సామ్రాజ్యం మరియు కేలాడి నాయకులు వంటి వరుస రాజవంశాలు వారు నిర్మించిన కట్టడాల్లో తమ ముద్రను వదిలివేసారు.

దురదృష్టవశాత్తు, ఈ దేవాలయాలలో గణనీయమైన సంఖ్యలో ముస్లిం ఆక్రమణదారులచే గుర్తించబడనంతగా అపవిత్రం చేయబడింది లేదా శిథిలావస్థలో ఉన్నాయి. 


💠 మనుగడ సాగించిన కొన్ని ఎక్కువగా కేలాడి నాయకులు మరియు హొయసలలచే నిర్మించబడ్డాయి. 

పురాణాలు ,  మహాభారతం  మరియు  రామాయణ కథలను వర్ణించే అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు మరియు ప్యానెల్లు గ్రామంలోని వివిధ ప్రాంతాలలో మరియు నదీ తీరాలకు సమీపంలో ఉన్నాయి.

 

💠 ప్రసిద్ధ శ్రీ చింతామణి నరసింహ ఆలయానికి సమీపంలో దాదాపు 12వ శతాబ్దంలో నిర్మించిన హొయసలల యొక్క అంతగా తెలియని  ప్రసిద్ధి చెందిన నిర్మాణ ఆభరణం రామేశ్వర ఆలయం. 


💠 సంగమేశ్వర దేవాలయం పక్కనే ప్రసిద్ధ శ్రీ చింతామణి నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది.  దీనిని శ్రీ ప్రహ్లాదుడు ప్రతిష్టించి పూజిస్తాడని నమ్ముతారు.  


💠 శ్రీ చింతామణి నరసింహ దేవాలయం మాదిరిగానే , తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలో నవరంగ , సుకనాసి మరియు  గర్భ గృహాలు ఉన్నాయి .


💠 ఈ ఆలయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా పరిరక్షించింది.


💠 ఈ ఆలయం షిమోగా నుండి 18 కిలోమీటర్ల దూరంలో కుడ్లి/కూడ్లి అనే గ్రామంలో తుంగ మరియు భద్ర నది కలిసి తుంగభద్ర నదిని ఏర్పరుస్తుంది.


💠 కూడ్లి శివమొగ్గ నుండి 16 కి.మీ దూరంలో ఉంది, తుంగ మరియు భద్ర నదులు కలిసి ప్రవహించే ప్రదేశం కాబట్టి దీనికి కూడలి అని పేరు వచ్చింది.  

ఇది 16వ శతాబ్దంలో శృంగేరికి చెందిన జగద్గురు నరసింహ భారతి స్వామిచే స్థాపించబడిన స్మార్త మఠాన్ని కలిగి ఉంది.

మఠం ఆవరణలో శారదాంబ మరియు శంకరాచార్యుల మందిరాలు ఉన్నాయి.  వెలుపల, రామేశ్వర మరియు నరసింహునికి అంకితం చేయబడిన హోయసల కాలం నాటి రెండు దేవాలయాలు ఉన్నాయి.  

కూడలిని దక్షిణాది వారణాసి అని కూడా అంటారు.  


💠  ఆలయాన్ని సబ్బు రాయితో నిర్మించారు. ఆలయానికి మూడు ద్వారాలు ఉన్నాయి. 

ఈ మందిరం ఏకకూట నిర్మాణం (ఒకే మందిరం మరియు గోపురం).

ఆలయం ఉన్న వేదిక, జగతి, ఐదు సాదా అచ్చులను కలిగి ఉంటుంది. 

ఆలయం లోపల మరియు గర్భగుడి ఎదురుగా ఒక వేదిక ఉంది, దానిపై శిల్పకళా నందిని అమర్చారు. 

గర్భగుడిలో శివుని సార్వత్రిక చిహ్నం అయిన లింగం ఉంది.


💠 గర్భగుడిలో ప్రతిష్టించబడిన శివలింగానికి ఎదురుగా ఉన్న అద్భుతమైన నంది విగ్రహం. ఇది బహుశా హొయసల తొలి ప్రయోగాలలో ఒకటిగా చెప్పవచ్చు, ఎందుకంటే దేవాలయం గొప్ప అలంకారాలు మరియు విపరీతమైన అలంకరణలను కలిగి ఉండదు, తరువాత నిర్మించిన దేవాలయాలలో చూడవచ్చు.

 

💠 ప్రాంగణంలోనే స్వర్గ మండపం అని పిలువబడే బ్రహ్మేశ్వర ఆలయం (బ్రహ్మలింగేశ్వర ఆలయం) అని పిలువబడే అసంపూర్తి ఆలయం ఉంది. 

వీటితో పాటు సంగమేశ్వర దేవాలయం మరియు సంగమం వద్ద ఉన్న హరిహర దేవాలయం చూడదగినవి.


💠 ఎలా చేరుకోవాలి: 

కుడ్లి చేరుకోవడానికి శివమొగ్గ (షిమోగా) ప్రధాన బస్ స్టాండ్ నుండి పాత రైల్వే స్టేషన్ వైపు బయలుదేరి, పిలంగిరి మరియు జావల్లి గ్రామాల మీదుగా జావల్లి రహదారిపై ప్రయాణించి శివమొగ్గ (షిమోగా) నుండి 16.5 కి.మీ దూరంలో ఉన్న కుడ్లి చేరుకోవాలి.

ఆచార్య సద్బోధన:*

 


              *ఆచార్య సద్బోధన:*

                   ➖➖➖✍️


*భగవంతుడిని 'నాకు అది చేయి, ఇది చేయి' అని అడగడం ఒక విధంగా ఆయనకు షరతులు విదించడమే అవుతుంది.*


*ఆయనకు షరతులు విదించే కన్నా అంతా ఆయన ఇష్టానికి వదిలేయడం ఎంతో శ్రేయస్కరం.*


*షరతులతో భగవంతుని మెప్పించడం అసాధ్యం!* 


*అదొక వృథా ప్రయత్నం.*


*సమస్య చెప్పొచ్చు కానీ పరిష్కారం ఆయనకు వదిలేయాలి.*


*అంతా భగవంతుని ఇష్టానికి వదిలేసినపుడు మాత్రమే సరైన ఫలితాలను పొందుతాము.*


*యోగ్యత లేని కారణాన ఒకవేళ పొందలేకపోయినా నిరుత్సాహానికి తావుండదు.* 


*ఎందుకంటే ఫలితాన్ని భగవదర్పితం చేయడం వలన మనస్సులో దాని చింతన దాదాపుగా ఆగిపోతుంది.*


*మనం దేనికి అర్హులమో దానిని మాత్రమే పొందుతాము.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

17.08.2024,శనివారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

17.08.2024,శనివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం


శ్రావణమాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణం నక్షత్రం శ్రీ మహావిష్ణువుది. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో బాగంగా కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా దర్శనమిస్తున్నాడు. శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం. ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం. అందుకే శ్రావణమాసంలో వచ్చే శనివారాలు ప్రత్యేకమైనవి అయితే శ్రవణం నక్షత్రం కలిసొస్తే మరింత ప్రత్యేకం అని చెబుతారు పండితులు. అప్పట్లో శ్రావణ శనివారం వ్రతాలు చేసేవారు. అందుకే ఈ నెలలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా ఒక్క శనివారం అయినా శ్రీ వేంకటేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని, కలిదోషం తొలగిపోతుందని అంటారు. 


శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం దిద్దాలి. ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలిమిడి కలిపి దానితో ప్రమిద చేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. జ్యోతి స్వరూపుడైన వేంకటేశ్వరస్వామిని గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి.

దేవాలయాలు - పూజలు 13*

 *దేవాలయాలు - పూజలు 13*


సభ్యులకు నమస్కారములు.


గత వ్యాసాలలో తెలుసుకున్నాము దేవీ దేవతలకు దేవాలయాలలో గాని, గృహంలో గాని *నైవేద్యంగా* సమర్పించే ఆహార పదార్థాలు, ఫలాదులకు గూడా నిశ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది . దేవీ మరియు దేవతా మూర్తుల ప్రసన్నతకు ఆయా దేవతలకు అనుగుణ్యమైన ఆహార పదార్థాలను, ఫలాదులను *నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది*. 


ప్రసాదములలో దిగువ ఉదహరించిన విధంగా *నానావిధత్వము* గమనించ వచ్చును.

1) *గుడాన్న ప్రీతీ మానసా* :- బెల్లము మరియు అన్నము కల్సిన నైవేద్యము పట్ల కడు ప్రీతి గల్గిన దేవతలు.

2) *స్నిగ్దోన ప్రియా* :- స్నిగ్ధ అంటే తెలుపు. తెలుపుగా ఉండే అన్నము మరియు కొబ్బఱల మిశ్రమము గల నైవేద్యము పట్ల ప్రీతిగల దేవతా మూర్తులు. తెలుపు అంటే ప్రకాశము అని అర్థము గూడా కలదు.

3) *పాయసాన్న ప్రియ*:- క్షిరాన్నము = పాలు, శర్కర, అన్నము, మరియు ఇతర మధుర పదార్థాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన నైవేద్యము పట్ల ఆసక్తిగల మూర్తులు.

4) *మధు ప్రీతా* తేనెతో సంయుక్తంగా నైవేద్యమును ప్రీతిగా స్వీకరించే దేవతలు. 

5) *దద్ధన్యాసక్త హృదయ* :- అన్నము మరియు పెరుగు మిశ్రమముల పట్ల హృదయము (వాంఛ) కల్గిన దేవతలు.

6) *ముద్గోదనాసక్త హృదయ* :- పెసలు మరియు అన్నము కల్గిన నైవేద్యము పట్ల ఆసక్తి చూపే దేవతలు.

7) *హరిద్రానైక రసికా* :- పసుపుతో కల్సిన అన్నముతో తయారు చేయబడిన నైవేద్యము పట్ల రసికత = రసజ్ఞత = అమిత ఇష్టము కల్గిన దేవతలు.

8) *సర్వోదన ప్రీతి చిత్త* :- అన్ని రకముల నైవేద్యముల పట్ల చిత్తము = మనసు = ప్రీతి = ఇష్టము గల దేవీ దేవతలు.


అయితే శుద్ధ సాత్విక 

గుణంగలపదార్థాలను

నైవేద్యంగా సమర్పించినవైతే మరింత శక్తిమయమైన ప్రసాదాలుగ మనంపొందగలం.


మనం సమర్పించే ధనకనక వస్తువిశేషాలన్నీ *ధర్మమర్థంచకామంచ*

ధర్మ మార్గమున సంపాదించిన ధనమును ఉపయోగించి కామితార్దపూజలకు వినియోగించిన దైవత్వం సంపూర్ణంగా నిండిపోతుంది. *ధర్మ మార్గాన సంపాదించిన ధనము వలన చేయబడిన దైవ కార్యాలు విశేష ఫలితాన్ని సమకూరుస్తాయి*.


ధన్యవాదములు

*(సశేషము)*