17, ఆగస్టు 2024, శనివారం

యజ్ఞోపవీతం

 🌹 *యజ్ఞోపవీతం విశిష్టత* 🌹

💐💐💐💐💐


*యజ్ఞోపవీతానికి ఎన్ని పోగులు ఉండాలి? కొందరు అత్యవసరమైన సమయాల్లో తమ జంధ్యంలో నుంచి కొన్ని పోగులు తీసి కొడుకులకు, ఇతరులకు ఇస్తుంటారు*

 *యజ్ఞోపవీతంలో మూడేసి చొప్పున  పోగులు ఒక యూనిట్ గా భావించాలి.*

 *బ్రహ్మచారికి 3 పోగులుగా ఉన్న యజ్ఞోపవీతాన్ని వేస్తారు.*

*పెళ్ళి అయ్యాక మామగారు భార్య తరఫు భార్య తాలూకు యజ్ఞోపవీతాన్ని వేస్తారు.అంటే మొగుడు భార్య కి తాళి కడతాడు. భార్య తాలూకు యజ్ఞోపవీతాన్ని మొగుడు భరిస్తాడు.*

 *అందుకే భార్య నెలసరిలో ఉంటే పుణ్య కార్యాలు చెయ్యరు. భార్య అంటే తనలో సగం కాబట్టి*.*పెళ్లి అయిన వాళ్ళు ఈ లెక్క ప్రకారం రెండు యూనిట్స్ అనగా 6 పోగులు వేసుకోవాలి.* *అంటే భర్త సంధ్య వారిస్తే భార్య కూడా చేసినట్టే. అందుకే పురాణ కాలంలో భార్యలు భర్త సంధ్యావందనానికి ఏర్పాట్లు చేసేవారు. ఇప్పటికి చేసే వారున్నారు.*

*సంధ్య వార్చడం ద్వారా ఏ రోజు పాపం ఆ రోజు ప్రక్షాళన అయిపోతుంది.*

 *మరోకకథ మూడు పొగులు ఉన్న యజ్ఞోపవీతం కూడా అదనంగా వేసుకుంటారు. అది ఎందుకనగా ఉత్తరీయం కోసం.*


 *ఉత్తరీయం లేకుండా ఎప్పుడు ఉండకూడదు. ఆ దోషం తగలకుండా మూడు పొగులు వేస్తారు.*

*ధర్మం ప్రకారం ఎప్పుడు మనిషి దిగంబరంగా ఉండకూడదు. ఆ దోషం రాకుండా నూలు పోగు గా మొలతాడు ఎప్పుడు ఉండాలి.*

 *మరో మూడు పొగులు ఉన్న యూనిట్ ను ఇష్టముంటే వేసుకోవచ్చు. ఇది వేరే వారికి ఇవ్వొచ్చు. ఒకవేళ ఎవరికైనా జంధ్యం తెగిపోతే ఇచ్చే అందుకు ఈ ఏర్పాటు.*

 *ప్రతి జంధ్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి.*

 *ఉపనయనము అయిన పిదప యజ్ఞోపవీతం ఒంటిపై లేకుండా వ్యక్తి ఉండనే రాదు. అలాగే భిన్న తంతువులు కల యజ్ఞోపవీతం కూడా ధరించరాదు. అందుకని, తను వేసుకున్న నాలుగవది వేరొకరికి దానం చేస్తారు.. ఇది కేవలం ఆ వ్యక్తి తను ఇంటికి వెళ్ళాక శుచియై, క్రొత్త యజ్ఞోపవీతాలను వేసుకునేంతవరకు 'ఆపత్ ధర్మ' ఏర్పాటు అని చెప్పవచ్చు.*

 *చాలా మంది పాటించడం లేదు కానీ, యజ్ఞోపవీతానికి చాలా పవిత్రత ఉన్నది. "యజ్ఞోపవీతం పరమం పవిత్రం...ప్రజాపతేర్యత్....." కదా ! అది ఎంత పొడవు ఉండాలి అన్నదీ చెప్పారు. నడుము క్రిందకు ఉండరాదు.. ఉన్నచో కొన్ని ముడులు వేసి, పొడవు తగ్గించుకోవాలి.*

 *ఎప్పుడు మార్చాలి, ఎంత తరచుగా మార్చాలి అన్నది కూడా చెప్పారు. అశౌచం వీడిన తర్వాత మార్చాలి. ఏ అశౌచం లేకపోయినా 3 నెలలకు ఒక సారి అని కొందరు, 6 నెలలకు ఒక సారి అని కొందరు పెద్దలు సెలవిచ్చారు. ఇక శ్రావణ పౌర్ణిమకు ఋగ్వేదులు మినహా మిగతా సాంప్రదాయాలవారు తప్పనిసరి గా మార్చుకుంటారు.*

 *ఈ కాలంలో కొంత మంది దానికి తాళం చెవులు తగిలిస్తారు. కొందరైతే ఏకంగా ఆ యజ్ఞోపవీతాన్నే తీసి గోడకూ తగిలించేస్తారని విన్నాను !*

 *యజ్ఞోపవీతాన్ని మూడు రకాలుగా ధరిస్తారు: ఉపవీతి, సంవీతి, నివీతి .*

 *ఉపవీతి అంటే ఎడం భుజం మీద నుండీ కుడి చేతి క్రిందుగా ధరించడం. ( దీన్నే 'సవ్యం' అనీ పిలుస్తారు.)*

*సంవీతి అంటే కుడి భుజంపై నుండీ ఎడమచేతి క్రిందవుండేట్లుగా వేసుకోవడం. ( దీన్నే ' అపసవ్యం' అనీ పిలుస్తారు.)*

*నివీతి అంటే మెడలో హారం లాగా ధరించడం.*

 *దైవ కార్యాలలో ఉపవీతం సవ్యంగా ఉండాలి. పితృ కార్యాలలో అపసవ్యం గా ఉండాలి. ఇక మనుష్య కార్యాలలో నివీతి గా ఉండాలి.మల, మూత్ర విసర్జనా సమయాయాలలో నివీతి చేసి కుడి చెవుకు చుట్టుకోవాలి*

 *అంటే మొత్తం 3 నుండి 12 పొగులు వేస్తారు. అర్హత బట్టి.*

 


*ॐశ్రీవేంకటేశాయ నమః*

కామెంట్‌లు లేవు: