17, ఆగస్టు 2024, శనివారం

తిరుమల వైభవం

 🔔 *తిరుమల వైభవం*🔔


శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల_మండపం చరిత్ర...!!


అది అక్కడ ఎందుకుఉంది.. చరిత్ర ఏమిటి ?


శ్రీవారి ఆలయం ఎదురుగా సన్నగా పొడువుగా నాలుగ్గాళ్ళపై ఓ మండపం కనిపిస్తుంది. అసలు ఈ మండపం ఎందుకు ఇక్కడ ఉందా? చాలా మందికి అనుమానం కలుగుతుంది.


నిజమే.. అంత పెద్ద మండపం ఎదురుగా చిన్న మండపం. దానిమీద ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు ఉంటుంది. అక్కడే సెక్యూరిటీ అత్యాధునిక ఆయుధాలతో కాపలా కాస్తూ ఉంటారు. 


ఈ చిన్నమండపానికి ఇంత పెద్ద సెక్యూరిటీనా అనిపిస్తుంది. కానీ, సెక్యూరిటీ ఉన్నది శ్రీవారి ఆలయానికి. అది వేరే విషయం.


మరి ఈ మండపం ఏమిటి? మండపాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారు. ? దాని పేరేంటి? ఇంకెందుకు ఆలస్యం ఈ కథనం చదివేయండి.


ఆ మండపం పేరే  గొల్ల_మండపం వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. 


గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది.


తొమ్మిది వందలో సంవత్సరం వరకూ కూడా ఆలయానికి సంబంధించిన కైంకర్యాలు మినహా అన్ని వ్యవహారాలు దిగువ తిరుపతికి సమీపంలోని తిరుచానూరులో జరిగేవి.


శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమలేశుని ఉత్సవాలు కొండమీదనే జరగాలని నిర్ణయించారు. వైష్ణవ సభ కూడా అందుకు ఆమోదం తెలిపింది. 


అయితే కారడవి. ముళ్ళపొదలు, ఆలయం సమీపానికి కూడా క్రూర జంతువులు వచ్చిపోయేవి. ఇలాంటి స్థితిలో చుట్టూ మడ వీధులను ఏర్పాటు చేసి అక్కడే ఉండడానికి అర్చకులకు కొన్ని నివాసాలను ఏర్పాటు చేయాలని నిర్ణియించారు.


రామనుజుల వారి గురువు, మేనమామ తిరుమల నంబి, శిష్యుడైన అనంతాళ్వారులను వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించణా బాధ్యతలను తీసుకున్నారు.


నిర్మాణ సమయంలో కూలీలను, పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు గొల్ల కులానికి చెందిన ఒక మహిళ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట.


ఆమెకు వేంకటేశ్వర స్వామి అంటే అచెంచల భక్తి. అందుకే కొండకింద నుంచి చల్ల కడవ నెత్తిన పెట్టుకుని తిరుమలకు చేరి ఆ మజ్జిగను వారికి ఇచ్చేది.


అక్కడి వారు పైకము ఇచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం మజ్జిగ ఇవ్వడం మానలేదు. అక్కడి వారు అడిగిన ప్రశ్నకు ఎండలో స్వామి సేవ చేస్తున్నవారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్ణెం వస్తుందంట కదా! సామి.


ఆ మహిళ సమాధానానికి ఆశ్చర్య పోవడం అక్కడి వారి వంతయ్యింది. తిరుమల నంబి, అనంతాళ్వారులను చూపించి వారు మోక్షం ఇప్పిస్తారని చెప్తారట.


ఆ మహిళ నేరుగా వారి వద్దకు వెళ్ళి సాములూ! మీతో గోయిందసామి మాట్లాడుతారట గదా! నాకు వైకుంఠం వత్తదంట. ఇప్పించండి సామి! అని అమాయకంగా అడిగింది.


ఆ రాత్రి చల్లలమ్మే మహిళ కోరికను తిరుమల నంబి అనంతాళ్వార్లు వేంకటేశ్వర స్వామికి విన్పించారు. అది రామానుజులు వారికి మాత్రమే సాధ్యమని స్వామి వారికి చెప్పారు.


రామానుజులవారు ఓ రోజు తిరుమలకు వచ్చారు. ఆ గొల్ల మహిళ సాష్టాంగ నమస్కారం చేసి. కొంచెం చల్ల తీసుకోండి సామీ! అంది. రామానుజల వారు మజ్జిగ సేవిస్తున్న సమయంలో.. తాను ఏమి కోరుకుంటున్నానో చెప్పేసింది.


వెంటనే రామనుజులవారుశ్రీనివాసా. పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక’ అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారట. అంతే వెంటనే మజ్జిగ అమ్మే ఆమె పరమపదం పొందింది.


వేంకటేశ్వ ర స్వామిపై అచెంచల భక్తితో ఉడతా సాయంగా తాను చేసిన పనికి గుర్తుగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన నాలుగు స్తంబాల మండపాన్ని నిర్మించారు.ఆమండపమేగొల్లమండపం


ఒకప్పుడు వీధుల మధ్యలో ఉన్న ఆ సన్నని మండపం తిరుమాడ వీధులను వెడల్పు చేసి అక్కడున్న వేయి కాళ్ళ మండపాన్ని తొలగించడంతో మరింత ఠీవీగా గొల్లమండపం ..అలా కట్టినదే తిరుమలేశుని ఆలయము ముందున్న నాలుగు స్థంబాల మండపము.. 

నేటి గొల్ల మండపం.


https://youtu.be/2WnzotqAEkw


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: