23, డిసెంబర్ 2023, శనివారం

Panchang


 

ధ్యాసలో నుంచుకొనును ధ్యానాంగములను.

 🌹శ్రీమహావిష్ణు దర్శనము 🌹

         (ఆముక్త మాల్యద )


సీ. శర దిందు చంద్రికా గరిమపై గెల్చిన 

            మురువుతో వెల్గెడి మోము వాడు

    అర్క చంద్రుల శోభ లలమియు నున్నట్టి

            యరవింద నేత్రంబు లమరు వాడు

    సుందరోజ్వల వపు రిందీవరశ్యాము 

           స్వర్ణ వసన ధారు చారుదేహు

    మకరకుండలధారు మణిమయ కటిభూషు

           శ్రీవత్సలాంఛన చిద్విలాసు

తే. శంఖ చక్ర గదా శార్ఞ్గ చారు హస్తు

     మహిత మణిమయ శోభిత మకుట భూషు

     విమల తేజిత విభాసు విష్ణుదేవు 

     తనదు హృదియందు నీరీతి తలచ తగును.  


సీ. సర్వేశ్వరుడు విష్ణు సారూప్యమును గోరు

            నరుడు ధ్యానము నిట్లు నెరప దగును

     తొలుత నొక్కంగమున్ దలచి గుర్తించియు

            చిక్కబట్ట దగును చిత్తమందు 

     నయ్యది మనమందు నంటగా ధృఢరీతి

           తదుపరి యంగంబు తలచ వలయు

     నా రీతి యంగమ్ము లన్నిటిన్ వరుసగా 

           ధ్యానించ వలయును ధారణమున 

తే. హరిని నీరీతి చింతించ ననయముగను

     కదలుచున్నను లేక తా కదలకున్న 

     నెచట నున్నను తానిక నెట్టులున్న 

     ధ్యాసలో నుంచుకొనును ధ్యానాంగములను. 


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

ఉత్తర ద్వార దర్శనం

 🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷


*ఉత్తర ద్వార దర్శనం అంటే!*


*నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా...*


శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ పదము, పరమ ధామము, పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. వైకుంఠము అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది, తన ప్రాభవాన్ని తగ్గించగల, తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. ఈ పరమపదం శక్తి అన్ని లోకాల్లో, విభూతులలో, వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎటువంటి వారైనా చివరకు కోరుకొనేది పరమపదాన్నే. పరమపదమునకు మించిన ఉత్తమ స్థానం మరొకటి లేదు. పరమాత్మ తన పరిపూర్ణ పరివారంతో అక్కడ వేంచేసి ఉంటాడు. వైకుంఠ నగరంలో అనంతమైన మణిస్తంభములతో నిర్మించబడిన మహా మణిమండపమున మధ్యలో అన్నిటి కంటే కింద కూర్మనాథుడు ఉంటాడు. అతన్ని ఆధారం చేసుకొని మహా దిగ్గజములు ఈ బ్రహ్మాండాన్ని మోస్తుంటాయి. ఆ దిగ్గజముల మీద అద్భుతమైన మహాపద్మం ఉంటుంది. ఆ మహాపద్మం మీద అనంతమైన పాదములు గల మహా సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద వేయి పడగలతో ఆది శేషుడు విరాజిల్లుతూ ఉంటాడు. అతని పైన పరమాత్మ శయనించి ఉంటాడు.


వైకుంఠానికి వెళ్లినవారందరూ పరమాత్మ సేవ చేయగల అదృష్టాన్ని పొందలేరు. కొందరు మహాకూర్మాన్ని చూస్తారు, మరి కొందరు అష్టదిగ్గజాలను చూస్తారు, ఆపైన మరి కొందరు మహాపద్మాన్ని, మరి కొందరు పరమాత్మ సింహా సనాన్ని చూస్తారు. ఆపైన చేరుకు న్నవారు పరమాత్మను సేవించినా వారిలో కూడా నూటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పరమాత్మ కైంకర్యా న్ని నోచుకుంటారు. వైకుంఠాన్ని చేరిన ప్రతి వారు పరమాత్మను దర్శిం చలేరు. దర్శించిన ప్రతి వారు ఆయన కైంకర్యాన్ని చేయలేరు. పరమాత్మను సేవించడానికి కావాల్సిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానము కలవారు. మాత్రమే భగవంతుడిని దర్శించు కోగలరు, సేవించుకోగలరు. ఇటువంటి అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానమే ఉత్తర ద్వారం. ద్వారము అనగా మనం లక్ష్యాన్ని చేరడానికి సాధనము. మన లక్ష్యము భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడమా? చూడ డమా? భగవంతుడిని స్తోత్రం చేయడమా? భగవంతునికి సేవలు చేయడమా? భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడం దక్షిణ ద్వారం, భగవంతుడిని చూడడం తూర్పు ద్వారం, భగవంతుడిని కీర్తించడం పశ్చిమ ద్వారం, భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం. ఈ విషయాన్ని బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు.


వైకుంఠం చేరుకోగలగాలి అని చాలా మంది కలలు కంటూ ఉంటారు, వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరడం మాత్రమే. మరి కొందరు వైకుంఠం వెళ్లాలి పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు, వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం. వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయనను స్తుతించాలి అని మరి కొందరు కోరతారు, వారి లక్ష్యం పరమాత్మ స్తుతి మాత్రమే. ఇలాంటి వారు కాకతాము అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకొనే వారు వేల కోట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు. అటువంటి వారి గురించే ఆండాళ్లమ్మ అంటే గోదాదేవి తిరుప్పావులో ఉనక్కే నామ్ ఆట్ చెయ్ వోమ్ అని పలికింది. అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని. అలాగే మత్తనమ్ కామంగళ్ మాత్తు అని పలికింది అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని ఆండాళ్లమ్మ కోరింది. ఆండాళ్లమ్మ వైకుంఠాన్ని కోరలేదు, స్వామి దర్శనాన్ని కోరలేదు, స్వామి స్తుతిని కోరలేదు, స్వామి కైంకర్యాన్ని కోరింది. నీవేమీ వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగలగాలి. అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుం ఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడు. భగవంతుని లోకంలో ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం, భగవంతుని చూడడం, భగవంతుని స్తుతించడం ఇవేమి కోరవలసినవి కావు. పరమా క ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తపించగలగడమే ఉత్తర ద్వారం. మరి తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం వాటిలోనూ భక్తి ఉండి, అంతో ఇంతో జ్ఞానం ఉంది.


వైకుంఠం చేరితే చాలని, స్వామిని చూస్తే చాలని, స్వామిని స్తుతిస్తే చాలని అనుకుంటారు. ఇవన్నీ శాశ్వతం కాదు. వైకుంఠ లోకం వెళితే ఎప్పుడూ అక్కడే ఉండాలని నియమం లేదు. స్వామిని చూస్తే చాలు అనుకుంటే ఒక సారి చూస్తే సరిపోతుంది. స్వామిని స్తుతిస్తే చాలు అనుకుంటే ఒకసారి మనసారా స్తోత్రం చేస్తే సరిపోతుంది కానీ స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకం, స్వామి దర్శనం, స్వామి స్తుతి, స్వామి కైంకర్యం అన్నీ ఇమిడి ఉన్నాయి. వైకుంఠం చేరడం, స్వామి దర్శనం, స్వామి స్తుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరిపోతుంది కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేది. కానీ అంతరంగ కైంకర్యం అంటే స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయడం, స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం, స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయడం అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం కాక తానే దుప్పటై ఆయనని అతుక్కుని ఉండటం సేవ. దుప్పటి కప్పిన వారు కప్పి వెళ్లిపోతారు కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటిమీదనే ఉంటుంది. చందనం పూసినవారు వెళ్లిపోతారు కానీ చందనం ఒంటికే ఉంటుంది.


పరుపు ఇచ్చిన వారు వెళ్లిపోతారు కానీ పరుపు స్వామికి శయ్యగా ఉండిపో తుంది. అలాగే పాదుకలు ఇచ్చినవారు వెళ్లిపోతారు కానీ పాదు. కలు పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయి. మరి పాదుకలను సమకూర్చాలనా లేక పాదుకలు కావాలని కోరుకుంటామా?, చందనం పూయాలనా లేక చందనం అవ్వాలని కోరుకుంటా మా? ఏ పేరో ఏ సేవో ఏ సంబంధమో అవసరం లేదు ఎప్పుడు నీతోనే ఉండాలి, నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి. అని కోరుకోవాలి. అందుకే యామున మిశ్రులు స్తోత్ర రత్నంలో 


*నివాస శయ్యా ఆసన పాదుక అంశుక ఉపధాన శీతాతప*

*వారణాదిభిః శరీర భేదైః తవ శేషతాం గతః*


అని చెప్పారు అనగా ఆదిశేషుడు నీవు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు, పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు, కూర్చుంటానంటే తాను సింహాసనం అయ్యాడు, నడుస్తానంటే తాను పాదుకల య్యాడు, తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు, కట్టుకుంటానంటే తానే వస్త్రం అయ్యాడు, చలికి దుప్పటి అయ్యాడు, ఎండకి గొడుగు అయ్యాడు. అందుకే అతనని ఆది శేషుడు అంటారు. అంటే మొదటి  సేవకుడు. చలి వేస్తే దుప్పటి ఇచ్చినవాడు సేవకుడు కాదు తానే దుప్పటి కావాలి. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం.

వైకుంఠ ఏకాదశి

 🙏🙏🙏 *వైకుంఠ ఏకాదశి* 🙏🙏🙏


          వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి శ్రీమన్నారాయణుని దర్శనానికి ఉత్తర ద్వారములోనికి ప్రవేశించేటప్పుడు పఠించవలసిన శ్లోకము 👇


*ప్రళయాబ్ధిజలే శాయిన్ మధుకైటభ సేవితా ప్రార్ధితంతు ఉత్సవం తాభ్యాం కర్తుమారభే అనుజ్ఞాందేహి దేవేశా వైకంఠాలయ భూషణ* ll


          ఏకాదశి అంటే పదకొండు సమూహం. ఈ పదకొండు వైకుంఠం కావాలి, మరి దేని తోటి కొట్టబడకూడదు. ఈ పదకొండు పరమాత్మయందే ఉండడం వైకుంఠ ఏకాదశి. పదకొండు స్వామి సేవకు ఉపయోగించడం ఉత్తర ద్వార దర్శనం. స్వామిని చూడాలని అనుకున్న వారు ఒక్క కనులు పరమాత్మ వైపు ప్రసరింప చేస్తే చాలు, వినాలి అనుకున్న వారు చెవులు అప్పగిస్తే చాలు, అనాలి అనుకున్న వారు నాలుకతో కీర్తిస్తే చాలు, ఉండాలి అనుకున్న వారి శరీరం ఉంటే సరిపోతుంది తక్కినవి ఎక్కడ ఉన్నా కోరిక నెరవేరుతుంది. కానీ అన్ని వేళలా అన్ని విధములా కైంకర్యములు నీకే చేయాలి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు పదకొండూ పరమాత్మ యందు పరిపూర్ణంగా అర్పించాలంటే ప్రేమతో నిండిన జ్ఞానం కావాలి అదే ఉత్తర ద్వారం. దాని నుంచి దర్శనం పరమాత్మ అంతరంగిక కైంకర్యం. అంతేకాని ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు దేవాలయంలోకి వెళ్లి ఉత్తర ద్వారంతో ప్రవేశించి స్వామిని దర్శించుకుని రావడం సాంప్రదాయం అవుతుంది కానీ పరమభక్తితో కూడుకున్న పరమజ్ఞానం కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికైనా, ఇలా ఎందుకు చేయాలి ఇందులో అంతరార్ధం ఏమిటన్న జిజ్ఞాస కలుగుతుందనే పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆంతర్యం తెలుసుకుని శరీరంలో అణువణువూ, మనసు, అంతఃకరణం ఇలా అన్ని పరమాత్మకు సరమర్పించడమే నిజమైన ఉత్తర ద్వార దర్శనం.


*ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి* ?


          అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.


          ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.


*సర్వేజనాః సుఖినో భవన్తు!*

రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

23-12-2023 / శనివారం / రాశి ఫలితాలు

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో  ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మిధునం


దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి.  చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల  సహాయం  లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న  సమస్యలకు   పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

సింహం


ఉద్యోగ వ్యవహారాలలో తల పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పై వారి నుండి  ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

---------------------------------------

కన్య


సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు  తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం  బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

తుల


వృత్తి ఉద్యోగ  విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృశ్చికం


అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------

ధనస్సు


వ్యాపార పరంగా ఇబ్బందులు  తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

---------------------------------------

మకరం


ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది.  రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

---------------------------------------

కుంభం


సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

---------------------------------------

మీనం


ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

---------------------------------------

🍀 *శుభం భూయాత్* 🍁

వైకుంఠము

 "వైకుంఠము"అనే శబ్ధంలో విశేష అర్థము వుంది..కుంఠనం అంటే కలిసి వుండే స్థితిని చెడగొట్టడం అని అర్థము..అంటే వియోగము కలిగించడం.. వికుంఠ అంటే వియోగాన్ని తొలగించడం ,కలిసి ఉండవలసిన వారిని,సన్నివేశాలని, పదార్థాలని కలిపి ఉంచే పరమాత్మకు"వైకుంఠ" శబ్ధం సార్థకమైనది."వైకుంఠము" అంటే"సర్వేషాం సంశ్లేషితా భూమిః అద్భిః వ్యోమః చ వాయునా వాయుశ్చ తేజసా సార్ధం వైకుంఠత్తం అంతతో మయా"అని పంచ భూతాల, పంచీకరణాదులు చేసేది నేనే.అందుకే నన్ను వైకుంఠ వాసుడు అంటారు అన్నాడు..ఆయన మనకు దర్శనం ఇచ్చి  భిన్నత్వం గల సృష్టి లోని జీవులకు ఏకత్వం బోధించే ఏకాదశి కి " వైకుంఠ ఏకాదశి" అని పేరు వచ్చింది..దీనినే "ముక్కోటి ఏకాదశి" అని కూడా అంటారు. రేపే "వైకుంఠ ఏకాదశి" .. విష్ణు ఆలయాలన్నీ భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి.. తెల్లవారు జామునుంచే "ఉత్తర ద్వార దర్శనం" కోసం బారులు తీరి ఉంటారు..ఈ ద్వారం గుండా భగవంతుని దర్శిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం..భావన..ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పర్వం ఇది..మనకు పునర్జన్మ అంటూ ఉండదు..దక్షిణముఖంగా ఉన్న స్వామిని మనం దర్శించు కోవాలంటే ఉత్తర ముఖంగా నిలవాలి.. దక్షిణ ద్వారం సంసారానికి దారి చూపుతుంది..ఉత్తర ద్వారం మోక్షానికి మార్గం చూపుతుంది.. నవద్వారాలున్న దేహంలోని జీవుని దృష్టి సప్త ద్వారాలకు ఆవల యున్న భగవంతుని వైపు మరలడమే  ఈ పర్వదినం విశేషం..ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయాన మనం ఉత్తరాభిముఖులమై స్వామిని సేవించి కార్యసిద్ధిని సాధించి జ్ఞానం పొందుదాం.. పితృదేవతలు, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాము..ఓం నమో వేంకటేశాయ.. ఓం నమో నారాయణాయ... విష్ణు వైభవాన్ని కళ్ళారా ఉత్తర ద్వారము గుండా వెళ్ళి దర్శించుకుని ఆనందిద్దాము...పునీతులం అవుదాము...(సేకరణ)

⚜ శ్రీ భీష్మ కుండ్

 🕉 మన గుడి : నెం 277


⚜ హర్యానా : కురుక్షేత్ర


⚜ శ్రీ భీష్మ కుండ్



💠 భీష్మ కుండ్ కురుక్షేత్ర థానేసర్‌లోని నర్కటరి వద్ద ఉంది, దీనిని భీష్మపితామహా కుండ్ అని కూడా పిలుస్తారు


💠 ఇక్కడ భీష్మ ఆలయం ఉంది మరియు మహాభారత యుద్ధం ముగిసే వరకు భీష్ముడు అర్జునుడి బాణాల మంచం మీద పడుకున్న ప్రదేశం ఇది.


💠 భీష్ముని దాహం తీర్చడానికి అర్జునుడు భూమి వైపు బాణం వేసిన ప్రదేశం కూడా ఇదే.


💠 భీష్మపితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం హర్యానాలో కురుక్షేత్రానికి సమీపంలో ఉందని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.


⚜ స్థల పురాణం ⚜


💠 భీష్ముడు గంగాదేవి కుమారుడు మరియు

పరశురాముడి శిష్యుడు అయినందున,

భీష్ముడు తన కాలంలోని ఏ యోధుడితోనూ

ఓడిపోలేని శక్తిమంతుడు.


💠 భీష్మపితామహుడు పాండవులు మరియు కౌరవులచే గౌరవించబడ్డాడు, అయితే అతను మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇచ్చాడు.  

కొన్ని రాజకీయ కారణాల వల్ల, అతను కౌరవుల వైపు నుండి మహాభారత యుద్ధంలో ఇష్టం లేకుండా పోరాడవలసి వచ్చింది, కానీ అతను

పాండవులను చంపనని ప్రతిజ్ఞ చేశాడు. 


💠 ఈ ప్రమాణం వెనుక పాండవుల పట్ల

ఆయనకున్న అభిమానమే కారణం.

అంతేకాదు కౌరవులు పాండవులతో ఏళ్ల

తరబడి అన్యాయం చేస్తున్నారని లోకానికి

తెలిసింది. 


💠 పురాణాల ప్రకారం, భీష్ముడు అతను కోరుకున్నంత కాలం జీవించగలడు మరియు అతను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడనే వరం అతనికి ఉంది

 వీటన్నింటికీ అగ్రగామిగా, అతను అలుపెరగని, ఎవరి చేత ఓడింపబడలేని అతిపరా క్రమవంతమైన మహాయోధుడు


💠 పాండవులకి భీష్మ పితామహుడిని ఎదుర్కోవటానికి మార్గం లేదు, కాబట్టి వారు శ్రీకృష్ణుని నుండి సలహా కోరారు. 

భీష్మ పితామహ మరణ రహస్యం శ్రీకృష్ణుడికి తెలుసు. 


💠 భీష్మ పితామహుడి మరణ రహస్యం భీష్ముడికే అడిగి తెలుసుకోవలసిందిగా పాండవులను శ్రీకృష్ణుడు కోరాడు

తనను తాను విముక్తి చేసుకోవడానికి, పాండవులను ఎలా చంపాలో రహస్యంగా సూచించాడు.

అందువల్ల  పాండవులకు శిఖండిని యుద్ధంలో తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు, అతను పురుషుడు లేదా స్త్రీ కాదు, అతను నపుంసకుడు.


💠 భీష్ముడు గొప్ప యోధుడు మరియు యోధులతో మాత్రమే యుద్ధం చేయడం వల్ల నపుంసకుడు  అయిన శిఖండిపై దాడి చేయలేకపోయాడు.

ఈ విధంగా, ప్రణాళికాబద్ధంగా, అర్జునుడు శిఖండి వెనుక నిలబడి బాణాలు వేయడం ప్రారంభించాడు, భీష్మ పితామహుడు దీనితో గాయపడి అన్ని ఆయుధాలను విడిచిపెట్టి యుద్ధం యొక్క పదవ రోజున పడిపోయాడు.  


💠 భీష్మపితామహాను బాణాల మంచం మీద పడుకోబెట్టారు మరియు కౌరవులు మరియు పాండవులు చుట్టుముట్టారు.  

బాణపు శయ్యపై పడుకుని దాహం వేస్తూ నీరు కోరగా అర్జునుడు భూమిపై బాణం విసిరాడు.


💠 భీష్ముడు పడుకున్న చోట నుండి నీరు ప్రవహించింది.  ఈ నీటి ప్రవాహం మరెవరో కాదు, తన కొడుకు భీష్ముడి దాహాన్ని తీర్చడానికి భూమి నుండి పైకి లేచిన అతని తల్లి గంగ.


💠 భీష్ముడు ఇచ్ఛా మరణ (అతను కోరుకున్నప్పుడల్లా చనిపోవచ్చు) యొక్క వరంతో  సూర్యుడు ఉత్తర అర్ధగోళంలోకి వెళ్ళినప్పుడు ఉత్తరాయణంలో మరణించాలని ఎంచుకున్నాడు.  

ఉత్తరాయణంలో తుదిశ్వాస విడిచిన వ్యక్తికి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని

 నమ్ముతారు. 


💠 ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని భీష్మకుండ్ అని పిలుస్తారు. భీష్మ పితామహ పేరు మీద ఒక మెట్ల బావి ఉంది, ఇప్పుడు బంగంగా లేదా భీష్మ కుండ్ అని పిలువబడే నీటి ట్యాంక్ పక్కన ఆలయం ఉంది.

దీనిని తానేసర్‌ భీష్మ నర్కటరి ఆలయం అని పిలుస్తారు.


💠 ఈ ప్రదేశం యొక్క పూర్తి దర్శనానికి 45 నిమిషాల నుండి ఒక గంట సమయం పడుతుంది.  చారిత్రాత్మకంగా గొప్ప నేపథ్యం ఉన్న ఈ స్థలాన్ని సందర్శించడానికి ఎప్పుడైనా ఉత్తమ సమయమే.



💠 సమీప రైల్వే స్టేషన్ కురుక్షేత్ర.  

రైల్వే స్టేషన్ నుండి, భీష్మ కుండ్ చేరుకోవడానికి 19 నిమిషాలు (9 కిమీ) పడుతుంది.

Electro hydro power boat


 

Gliding


 

Couch wire fitting


 

Teertham yelaa sveekarinchali