12, ఆగస్టు 2022, శుక్రవారం

సాధ్వీమ తల్లులు

 మన అందరికీ పురందరదాసు కథ తెలిసిందే . అందులో సాధ్వీమతల్లి అయిన ఆయన ధర్మపత్ని సరస్వతమ్మ గూర్చి తెలిసిందే . పురందరదాసు అసలు పేరు శీనప్ప . కన్నడ సామ్రాజ్యములో పేరుబడసిన రత్నాల వ్యాపారి . ఆయన పిల్లికి బిక్షం వేసే రకం కాదు . మరి అయన ధర్మపత్ని మాత్రం అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు అందరికీ వారు వీరు అనిలేకుండా సకల మర్యాదలు చేసే మహా ఇల్లాలు . ఇదంతా గమనించిన శీనప్ప ప్రతీవాటినీ తన ఇంటిలో చెక్క పెట్టెలలో పెట్టించి తాళాలు వేసుకుని తాళాల గుత్తి తన దగ్గరే ఉంచుకునే వారు . ఒక సారి ఓ పేద బ్రాహ్మణుడు శీనప్ప ఇంటికి రాగా ప్రతీ రోజు రేపు రమ్మని తిప్పుకునేవాడు . అలా తిరిగీ తిరిగీ ఆ బ్రాహ్మణుడు అలసిపోయాడు గానీ విత్తం గానీ ఇంత ధాన్యం కానీ దానం చేయలేదు శీనప్ప . ఓ రోజు శీనప్ప ఇంట లేని నాడు ఆ బ్రాహ్మణుడు సరస్వతమ్మను దర్శించి తన పేదరికం బాపమని వేడుకున్నాడు . ఆమె ఇంట ఇపుడు ఏమీ ఆమె స్వాధీనములో లేదు . ఆ పేద బ్రాహ్మణుని పేదరికం చూసి జాలిపడి ఆమె తన ముక్కుకు ఉన్న రత్నం పొదిగిన ముక్కెర ఇచ్చి వేసి అమ్మి వేసి సొమ్ము తీసుకుని జీవించమంది . ఆ బ్రాహ్మణుడు అది అమ్మడానికి నేరుగా శీనప్ప కొలువై యున్న రత్నాల అంగడికి వెళ్లి అమ్మజూపాడు . ఆ ముక్కెర తానే స్వయంగా రత్నం పొదిగి చేయించింది , అత్యంత విలువైనది . అది చూసిన ఆయనకు నమ్మబుద్ధి కాక వెంటనే తన వద్ద ఉన్న నౌకరుని పంపి వెంటనే తన శ్రీమతి వద్ద యున్న రత్నం పొదిగిన ముక్కెర తీసుకురమ్మనమని చెప్పమని వ్రాసి పంపాడు . ఆమె ఆ పత్రం చదివి బెంబేలు పడిపోయి ఇంక తనకు ఇక దిక్కు తాను నిరంతరం కొలిచే పాండురంగడే అని తలచి విషం తీసుకోబోగా ఆపాత్రలో ధగ ధగ మెరిసే ముక్కెర కనబడింది దానిని తీసి శుభ్రం చేసి ఆమె ఆ ముక్కెరను నౌకరు చేత పంపింది . అది గాంచిన తరువాత శీనప్ప ఖరీదు కట్టి ఆ రత్నం పొదిగిన ముక్కెర కొని దానిని ఇంటికి తీసుకు పోయి అసలు విషయం విచారించగా అపుడు సంగతి తెల్సింది . ఆమె ఆ ముక్కెర ఆ బ్రాహ్మణునికి దానం చేసిన విషయం .. విష పాత్రలో ముక్కెర ఉండటం . అంతే అంతవరకూ కాకికి ఎంగిలి చేయి విదల్చని శీనప్పలో మార్పు వచ్చేసింది . మొత్తం తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ దాన ధర్మాలు వినియోగించారు . భక్తితో శ్రీరంగని మీద , వెంకటేశ్వర స్వామి వారి మీద కన్నడములో అనేక కీర్తనలు రచించారు . దాస సంగీతానికి ఆద్యుడు , కర్ణాటకా సంగీత పితామహుడు అయిన పురందర దాసులో మార్పు తెచ్చిన సంఘటన ఇదే . ఇటువంటి సాధ్వీమ తల్లులు పుట్టిన నేల ఈ భారతం .

వర్షాలు

 *దైవ సృష్టిలో ప్రకృతి లీలలు-వర్షాలు.* 

💧💧💧💧💧💧

దైవ సృష్టికార్యక్రమము లలో,ప్రకృతి మానవాళికి, జీవ జంతు జాలములన్ని టికీ ఇచ్చిన,ప్రాణాధారమై నది,ముఖ్యమైనది;నీరు. 

వర్ష రూపములో,జీవజాలా

నికి,ఇచ్చిన వరము.

ఇందులోకూడా పలు రక

ముల వర్షములతో,ఉప యోగకరముగా,ఆనంద

దాయకంగా అందిస్తున్నది.

ఎప్పుడూ ఒకే‌ వాన కాకుండా,రకరకాల విన్యాసాలతో,వర్షాలు వస్తుంటాయి. అవి :-


* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది,  కనిపించనంత జోరుగా కురిసే వాన.

* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన.

* మీసరవాన = మృగశిర కార్తెలో కురిసే వాన.

* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన.

* సానిపి వాన = అలుకు (కళ్లాపి) జల్లినంత కురిసే వాన.

* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి,ధారగా  పడేంత వాన.

* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన.

* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన.

* సాలు వాన = ఒక నాగలి సాలుకు సరిపడా వాన.

* ఇరువాలు వాన = రెండు సాల్లకు, విత్తనాలకు సరిపడా వాన.

* మడికట్టు వాన = బురద పొలం దున్నేటంత వాన.

* ముంతపోత వాన = ముంత తోటి పోసినంత వాన.

* కుండపోత వాన = కుండ తో కుమ్మరించినంత వాన.

* ముసురు వాన = విడువకుండా కురిసే వాన.

* దరోదరి వాన = ఎడతెగ కుండా కురిసే వాన.

* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన.

* రాళ్ల వాన = వడగండ్ల వాన.

* కప్పదాటు వాన =అక్కడ క్కడా కొంచెంకురిసే వాన.

* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

* దొంగ వాన = రాత్రంతా కురిసి, తెల్లారి కనిపించని వాన.

*తుఫాన్ వాన = ఈ వాన 

ప్రకృతి సమతుల్యం లేనప్పుడు,సముద్రాలు, నదులు పొంగుతూ,కష్ట, నష్ట దాయకంగా కురిసే అతి భీకరమైన వర్షము. 

* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన.

* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన.

* మొదటివాన = విత్తనా లకు బలమిచ్చే వాన.

* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన.

* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన.


సర్వేజనా 

సుఖినో భవంతు. 

💦💦💦💦💦💦

రామాయణానుభవం_ 121*

 🌹 *రామాయణానుభవం_ 121*


*రావణ మందిరం*

రావణాసురునితో సుఖాన్ని అనుభవించిన రమణీమణులు ఆయనకు సమీపంలోనే ఉన్నారు. కొందరు కూచున్నారు. అలసినవారు పడుకొన్నారు.


ఆ రాక్షస స్త్రీలకు దూరంగా ఒంటరిగా ఒక అందమైన శయ్యలో రూప సంపన్నురాలైన మరొక స్త్రీని హనుమ చూచాడు.


ఆమె అద్భుత సౌందర్యవతి, సర్వాభరణ భూషిత, రాజలక్షణ లక్షిత. ఆమె రావణుని పట్టపురాణి మండోదరి.


హనుమ ఆ అతిలోక సుందరిని చూచి సీతాదేవే అనుకొన్నాడు. "ఓహో! నా ప్రయత్నము ఫలించింది! నా అన్వేషణ (వెతుకుట) నెరవేరింది! సీతాదేవి నాకు కనబడింది" అని అత్యంత హర్షాన్ని పొందాడు.


ఆ ఆనందము పట్టలేకపోయాడు. తన భుజాలను, తొడలను చరుచుకొన్నాడు. తన తోకను ముద్దుపెట్టుకొన్నాడు. నవ్వుతున్నాడు. ఆడుతున్నాడు. ఇటు వెళ్లాడు. అటు వెళ్లాడు. " ఆ భవనములోని స్థంభాలపై పాకుతూ ఎక్కాడు. వాటినుండి జారి భూమిపై పడ్డాడు.


*ఆయాస్పోటయామాస చుచుంబ పుచ్చం!*

 *ననంద, చిక్రీడ, జగౌ, స్థంభానరోహత్,* *నివపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం* ॥


హనుమ తన కోతి స్వభావాన్ని ప్రదర్శించాడు అంటాడు వాల్మీకి.


మనుష్యులమైన మనమే కోతి చేష్టలను చేస్తుంటే నిజంగా కోతి అయిన హనుమ సహజమైన కోతి చేష్టలను చేస్తే కోతి బుద్ధిని చూపితే తప్పేమిటి?


"హనుమ నిజంగా కోతి మాత్రమే కాదు. బుద్ధిమతాం వరిష్ఠుడు. అంటే బుద్ధిమంతులలో గొప్పవాడు.


అందువలన హనుమ నిజంగా తన ఆలోచనకు మరొకసారి సిగ్గుపడ్డాడు. "ఛీఛీ ఎంత పాడు ఆలోచన!" అని తనను తానే అసహ్యించుకొన్నాడు.


*న రామేణ వియుక్తాసా స్వప్ను మర్హతి భామినీ। న భోక్తుం న్యాలంకుం। నపానముపసేవితుం।*


శ్రీరాముని ఎడబాసి నిరంతరము దుఃఖించే సీతామతల్లి నిద్రపోతుందా? ఆమెకు తిండి సహిస్తుందా? పానీయాన్ని ఆమె సేవిస్తుందా? ఆమెకు అలంకారాలు ఇష్టమవు తాయా?


*నాన్యం వరముపస్థాతుం। సురాణామపిచేశ్వరం||*


ఆమె అన్యుడైన పురుషుని మహేంద్రుని సైతము సమీపిస్తుందా? 


అందువలన ఈమె సీత కాదు. వేరే ఏ స్త్రీయో? అని నిశ్చయించుకొని పానభూమిలో సంచరించాడు.


**

హనుమకు మరొక విచారము ఆయన మనస్సులో బాధించడం మొదలుపెట్టింది.


"సాధారణంగా స్త్రీలను దగ్గరినుండి చూడకూడదు కదా! అందులో నిద్రిస్తున్న వారిని దగ్గరగా చూడడం మరింత పనికిరాదు కదా! మరి నేనిప్పుడు చేసిన పనేమిటి? బొట్టు చెదిరి, అందెలు తొలిగి, హారాలు, చీరలు జారిన ఆడవాళ్లను నిద్రిస్తుండగా దగ్గరి నుండి చూచానే? ఇది పాపం కాదా?"


హనుమ కొంతసేపటికి ఒక నిశ్చయానికి వచ్చాడు. తనకు తానే సమాధానం చెప్పుకొన్నాడు.

*తదిదం మార్గితం తావచ్ఛుద్ధేన మనసా మయా৷৷*

*రావణాన్తఃపురం సర్వం దృశ్యతే న తు జానకీ.*

“మనము ఏ పనిచేసినా ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నదే ముఖ్యము. 


నేను దురుద్దేశ్యంతో ఈ స్త్రీలను గమనించలేదు. వీరు ఇంత అస్తవ్యస్తంగా పడుకొని ఉన్నా,

వీరిని చూచినప్పుడు నా మనస్సు చెడు ఆలోచనలకు చోటివ్వలేదు. 

*న హి మే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ৷৷*

*అయం చాత్ర మయా దృష్టః పరదారాపరిగ్రహః.*

ఇంద్రియాలు చెడుగా ప్రవర్తించాలన్నా, మంచిగా నడుచుకోవాలన్నా మనస్సే కారణము. వీరిని ఈ స్థితిలో చూచినా నా మనస్సు చక్కగానే ఉంది. అయినా సీతాదేవి కూడ ఒక స్త్రీయే కదా!


ఆమెను స్త్రీల మధ్యలోకాక పోతే ఇంకెక్కడ వెతుకుతాము?


సీత కోసం సముద్రం దాటి లంకకు వచ్చాను. లంకలో ఎక్కడ వెదకాలి? ఏ జాతి జంతువు తప్పిపోతే ఆ జాతి జంతువులలోనే వెదకాలి.


 *న శక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుమ్.* 

స్త్రీ తప్పిపోతే స్త్రీలలోనే వెదకాలి. ఆడలేళ్ళలో వెదికితే స్త్రీ దొరకదు కదా! 


సీతజాడ తెలుసుకోమన్న ప్రభువు ఆజ్ఞను పాటించి రావణాంతఃపురం అంతా వెదికానే తప్ప స్త్రీలను చూడాలనే ఆసక్తితో కాదు. అందువలన నాకు ధర్మలోపం కలగదు." అనుకున్నాడు.


హనుమంతుడు నిరుత్సాహానికి లోనయ్యాడు. రావణమందిరం నుంచి దూరంగా వెళ్ళి ఆలోచించాడు.

ధాతుపౌష్టిక లేహ్యం

 ధాతుపౌష్టిక  లేహ్యం  ఉపయోగాలు  - 


 *  శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును . 


 * రక్తము నందలి దోషములను  పోగొట్టి రక్తమును శుభ్రపరచును . 


 *  కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును . 


 *  వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును . 


 * శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును . 


 *  వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును . 


 *  ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును . 


 *  రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును . 


 *  చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును . 


 *  స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును . 


 * మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు "ఆస్ట్రియోపోరొసిస్ " అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని  దరిచేరనియ్యదు . 


 * పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును . 


 *  మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును . 


 *  థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి . 


 *  మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . 


       

పాలుతో

 పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు  - 


 *  లంఘనం ( ఉపవాసం ) చేత బలహీనుడు అయినవాడు క్షీరం పానం చేయడం వలన బలవంతుడు అగును. అట్టివానికి జ్వరం నశించును. 


 *  కాగి చల్లారిన పాలు , కొంచం ఉష్ణంగా ఉన్న పాలు కాలమునెఱిగి జ్వరపీడితుడు సేవించవలెను 

కాచబడినదియు , గోరువెచ్చగా ఉండని పాలను జ్వరపీడితుడు సేవించిన మృత్యుడు అగును.


 *  పాలయందు శొంటి , ఖర్జురపు కాయ , ద్రాక్ష వీటిలో ఏదైనను కాచి అందు చెక్కర  కాని , నెయ్యి గాని , తెనే కాని వేసి చల్లార్చి అనుపానంగా సేవించిన యెడల  దప్పిక , తాపము వీటిని నివర్తింప చేయును . 


 *  పాల యందు ద్రాక్ష , చిట్టాముదపు వేరు , యష్టిమధూకం , సుఘంద పాల వేరు , పిప్పిలి , చందనం వీటిచే కాచబడిన పాలు సేవించిన లేక పాలకు నాలుగింతలు నీరు పోసి పిప్పిలి వేసి నీరంతా ఇగురునటుల కాచి తగినంత వేడిగా ఉన్నప్పుడు లొపలికి తీసుకున్న జ్వరం నశించును. 


 *  జ్వరం గలవాడు పంచమూలములు పాలల్లో వేసి కాచి అనుపానంగా సేవించిన యొడల చిరకాల జ్వరం నశించుటయే కాక కాసాశ్వాస , తలనొప్పి , పార్శ్వపునొప్పి కూడా నశించును.


 *  పాలయందు ఆముదపు వేరు గాని లేక బిల్వపత్రములు గాని వేచి  కాచి అనుపానంగా సేవించిన జ్వరం , మలబద్దకం నశించును. 


 *  పాల యందు శొంటి , చిట్టాముదపు వేరు , వాకుడు , పల్లేరు , బెల్లము వీటిని వేసి కాచి అనుపానంగా సేవించిన రక్తపిత్తము , అతిసారం , దప్పికతో కూడిన నొప్పులు అన్ని నివర్తించును.


  

     

సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .

 సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .


   వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 


              ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 


          ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.


         సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో గృ ధసీవాతం అని పిలుస్తారు .


  లక్షణాలు - 


     నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.


            ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .


              సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.


  సలహాలు - సూచనలు - 


    సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 


            వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 


         సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.


       

       ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు . 


            ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు. 


  

గోధుమగడ్డి చూర్ణం

 30 రోజుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు నేను ప్రయోగించిన సిద్ద యోగం -


    గోధుమగడ్డి చూర్ణం ఒకస్పూన్ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను . అదేవిధంగా ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఉదయం మరియు సాయంత్రం ఒక ఆపిల్ పండు తినవలెను . కేవలం నెలరోజుల్లో మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం అద్బుతంగా వృద్ధి అగును. 


       కొన్ని వందలమందికి ఈ యోగం ప్రయోగించాను . చాలా అద్బుతంగా పనిచేసింది. 


 

     


    

సత్య భామ కృష్ణుడు

 చదివితే ఎంత ఆనందంగా ఉన్నదో ఈ సంభాషణ:

సత్య భామ ః   " అంగుళ్యాః కః కవాటమ్ ప్రహరతి ?  ( వేళ్ళతో తలుపు తట్టినది ఎవరు ? ) 

కృష్ణుడు ; " కుటిలే , మాధవః " ( కొంటె దానా  , నేను మాధవుడిని ) 

సత్య భామ ః " కిం వసంతః ? " ( ఏమిటి వసంతుడా ?  )

(మాధవుడంటే వసంతుడు అనే అర్థం కూడా ఉంది ) 


కృష్ణుడు ;" నో చక్రీ " ( కాదు , చక్రిని  ) 

( చక్రం ధరించేవాడు ) 

సత్య భామ ః " కిం , కులాలో ? " ( కుమ్మరివా ? )

( చక్రి అంటే కుమ్మరి అని కూడా అర్థం ) 


కృష్ణుడు ;" నహి , ధరణీధరః  " ( కాను , ధరణీ ధరుణ్ణి ) 

( ధరణిని ఉద్ధరించు విష్ణువు )

సత్య భామ ః " కిం , ద్విజిహ్వః ఫణీంద్రః ? "  (   రెండు నాలుకల నాగరాజువా ? )

 ( ధరణీ ధరుడు ఆదిశేషుడు కూడా ) 


కృష్ణుడు ;" నాహం , ఘోరాహి మర్దీ "  ( కాదు , ఘోరమైన పామును మర్దించినవాడిని )

( ఆ పాము కాళియుడు ) 

సత్య భామ ః " కిముత ఖగ పతిః ? "  ( గరుత్మంతుడవా ? )

 ( గరుత్మంతుడు పాముకు శత్రువు )


కృష్ణుడు ;" నో , హరిః " ( కాదు , హరి ని ) 

సత్య భామ ః " కిం , కపీంద్రః ? "  ( కోతివా ? )

( హరి అంటే కోతి కూడా ) 


ఇత్యేవం సత్యభామా ప్రతిజిత వచనః  పాతు వ చక్ర పాణిః 

ఇలా సత్యభామ చేత మాటలలో ఓడిపోయిన కృష్ణుడు మిమ్మల్ని రక్షించు గాక !


( పాత చందమామ   ' అమరవాణి ' శీర్షిక నుండి )

విభాత మిత్ర గారి పోస్ట్.