12, ఆగస్టు 2022, శుక్రవారం

వర్షాలు

 *దైవ సృష్టిలో ప్రకృతి లీలలు-వర్షాలు.* 

💧💧💧💧💧💧

దైవ సృష్టికార్యక్రమము లలో,ప్రకృతి మానవాళికి, జీవ జంతు జాలములన్ని టికీ ఇచ్చిన,ప్రాణాధారమై నది,ముఖ్యమైనది;నీరు. 

వర్ష రూపములో,జీవజాలా

నికి,ఇచ్చిన వరము.

ఇందులోకూడా పలు రక

ముల వర్షములతో,ఉప యోగకరముగా,ఆనంద

దాయకంగా అందిస్తున్నది.

ఎప్పుడూ ఒకే‌ వాన కాకుండా,రకరకాల విన్యాసాలతో,వర్షాలు వస్తుంటాయి. అవి :-


* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది,  కనిపించనంత జోరుగా కురిసే వాన.

* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన.

* మీసరవాన = మృగశిర కార్తెలో కురిసే వాన.

* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన.

* సానిపి వాన = అలుకు (కళ్లాపి) జల్లినంత కురిసే వాన.

* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి,ధారగా  పడేంత వాన.

* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన.

* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన.

* సాలు వాన = ఒక నాగలి సాలుకు సరిపడా వాన.

* ఇరువాలు వాన = రెండు సాల్లకు, విత్తనాలకు సరిపడా వాన.

* మడికట్టు వాన = బురద పొలం దున్నేటంత వాన.

* ముంతపోత వాన = ముంత తోటి పోసినంత వాన.

* కుండపోత వాన = కుండ తో కుమ్మరించినంత వాన.

* ముసురు వాన = విడువకుండా కురిసే వాన.

* దరోదరి వాన = ఎడతెగ కుండా కురిసే వాన.

* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన.

* రాళ్ల వాన = వడగండ్ల వాన.

* కప్పదాటు వాన =అక్కడ క్కడా కొంచెంకురిసే వాన.

* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

* దొంగ వాన = రాత్రంతా కురిసి, తెల్లారి కనిపించని వాన.

*తుఫాన్ వాన = ఈ వాన 

ప్రకృతి సమతుల్యం లేనప్పుడు,సముద్రాలు, నదులు పొంగుతూ,కష్ట, నష్ట దాయకంగా కురిసే అతి భీకరమైన వర్షము. 

* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన.

* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన.

* మొదటివాన = విత్తనా లకు బలమిచ్చే వాన.

* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన.

* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన.


సర్వేజనా 

సుఖినో భవంతు. 

💦💦💦💦💦💦

కామెంట్‌లు లేవు: