17, సెప్టెంబర్ 2024, మంగళవారం

*శ్రీ కరికాన పరమేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 443*


⚜ *ఉత్తర కర్నాటక  : హోన్నవర*


⚜ *శ్రీ కరికాన పరమేశ్వరి ఆలయం*




💠 శ్రీ కరికాన పరమేశ్వరి దేవస్థానం భారతదేశంలోని కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న హోన్నవర పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం.


💠 కరికానమ్మ లేదా శ్రీ కరికన్ పరమేశ్వరి భారతదేశంలోని కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో శ్రీధర్ స్వామిచే స్థాపించబడిన హొన్నావర్ పట్టణానికి సమీపంలో ఉన్న హిందూ దేవత దేవాలయం. 


🔆  *చరిత్ర:*


💠 ఈ దేవాలయం సుమారు 500 సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు.  

16వ శతాబ్దంలో పోర్చుగీస్ దండయాత్ర సమయంలో అసలు ఆలయం ధ్వంసమైంది మరియు తరువాత స్థానిక పాలకులచే పునర్నిర్మించబడింది.


🔆.*వాస్తుశిల్పం:* 


💠 ఈ ఆలయం ద్రావిడ మరియు హొయసల శైలుల కలయికతో కూడిన ప్రత్యేకమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది.  

ఆలయ ప్రధాన ద్వారం దేవతల యొక్క క్లిష్టమైన శిల్పాలతో అందమైన గోపురం కలిగి ఉంది.



💠 కరికాన పరమేశ్వరి: 

ఈ ఆలయం శక్తి లేదా దైవిక స్త్రీ శక్తి యొక్క స్వరూపిణిగా విశ్వసించబడే దేవత కరికాన పరమేశ్వరికి అంకితం చేయబడింది.  

వారి కోరికలు తీర్చే మరియు వారికి శ్రేయస్సుని అనుగ్రహించే సామర్థ్యం కోసం అమ్మవారిని భక్తులు పూజిస్తారు.


💠 పండుగలు: 

ఈ ఆలయంలో నవరాత్రి, దీపావళి మరియు ఉగాదితో సహా ఏడాది పొడవునా అనేక పండుగలు జరుపుకుంటారు.  

నవరాత్రి సందర్భంగా, ఆలయాన్ని దీపాలు మరియు పూలతో అందంగా అలంకరిస్తారు  మరియు చివరి రోజున పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు


💠 ఈ ఆలయం హొన్నావర్ తాలూకాలోని ఎత్తైన శిఖరాలలో ఒకటి.  ఇది ప్రధాన పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రామతీర్థం అరేంగడి రహదారి వైపు ఉంది. 

Panchaag


 

గుండె జబ్బులు

 గుండె జబ్బులు= ఆయుర్వేద మందు - అర్జునరిష్ఠ 


ఈ రోజుల్లో 50 సంవస్తరాలు దాటిన వారికి తరచూ చూస్తున్న ఆరోగ్య సమస్య గుండె జబ్బులు. విచిత్రం ఏమిటంటే స్త్రీలలో పురుషులకు లేని కొన్ని హార్మోనులు ఉంటాయి కాబట్టి వారికి గుండె జబ్బులు రాకుండా వారి శరీరమే వారిని కాపాడుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం మనం తీసుకునే కలుషిత ఆహరం వల్ల స్త్రీలు కూడా గుండె జబ్బుల బారిన తరచూ  పడటం చూస్తున్నాం. 


గుండె జబ్బు అనగానే మనం రోజు వేనేది .B,P,  రక్త పోటు నిజానికి ఇది గుండెకు సంబందించిన వ్యాధి  అని మనం అనుకుంటున్నాం కానీ రక్తపోటు ప్రతీ  వారికి ఉంటుంది. దాని విలువలు ఎక్కువ అయితే దానిని Hypertension అని అంటారు ఇక్కడ మనం కొద్దిగా రక్త పోటు అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు ఈ విషయం బోధ పడుతుంది. మన శరీరం లోని అన్నిఅవయవాలు వాటి వాటి నిర్ణిత పనులు చేయాలి అంటే వాటికి శక్తి  కావలి. ఆ శక్తి రక్తం (మంచి రక్తం) ద్వారా వస్తుంది.  అంటే శరీరంలో ప్రతి అణువు అణువు ఉత్తేజితం కావాలంటే అక్కడకు రక్తం సరఫరా కావలి. రక్తం సరఫరా కావలి అంటే రక్తాన్ని పంపు చేసే పరికరంకావలి ఆ పరికరమే గుండె. (ఇంకా వివరంగా వేరొక వ్యాసంలో విశదీకరించ ప్రయత్నిస్తాను) గుండె కొట్టుకోవటం వలన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త పోటుని మనం కొలిస్తే అది 120/80 Hg  అనే రీడింగ్ ఉంటే ఆ మనిషి పూర్తి ఆరోగ్య వంతుడు అని అనవచ్చు కాకుండా ఈ రీడింగ్ అంతకంటే తక్కువగా ఉంటే Low Blood pressure అని అదే ఈ రీడింగు చాలా ఎక్కువగా ఉంటే Hypertension అని అంటారు. ఇటువంటి అసామాన్య పరిస్థితుల్లో మనకు అనేక ఇబ్బందులు కలుగుతాయి తక్కువ pressure ఉంటే రక్తం శరీరానికి అందక ఇబ్బందులు వస్తాయి ఎక్కువ pressure  ఉంటే రక్తనాళాలు ఆ వత్తిడికి లోనయి ఆవేశము, అసహనం, మొదలగు వాటితో మొదలై, పక్షవాతము, గుండె పోటు వరకు దారితీస్తాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన రక్త పోటును స్థిరంగా ఉంచుకోవాలి. 


ఇతర గుండె సంబంధ వ్యాధులు: chest pain,cardiac problems  like congestive heart failure, heart blockage, angina pectoris, myocardial infarction, ischemic cardiac myopathy, mitral regurgitation (which is a backflow of blood caused by the failure of the heart's mitral valve to close tightly) and asthma.


ఈ రోగాల పేర్లు మనం తరచూ వింటున్నాము. వీటిలో ఏ ఒక్క రోగం సోకినా లక్షలలో డాక్టర్లకి హాస్పెటళ్ళకి ఖర్చు చేయవలసి వస్తున్నది అన్నది కాదని ఎవరైనా చెప్పగలరా. 


రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పుడుకొని పొతే వారికి గుండె పోటు వస్తుందని గుండె పోటు వస్తే మనిషి అకస్మాత్తుగా చనిపోతాడని మనందరికీ తెలుసు. మన ఆధునిక వైద్యంలో రక్త నాళాలు పుడుకొని పోయిన వన్న విషయం నిర్ధారణ చేయటానికి Angiogram పరీక్ష చేస్తారు.  దాని గూర్చి చుడండి 


Angiograms are generally safe, complications occur less than 1% of the time. However, there are risks with any test. Bleeding, infection, and irregular heartbeat can occur. More serious complications, such as heart attack, stroke, and death can occur, but they are uncommon


అంటే Angiogram పరీక్షలో రోగికి పైన పేర్కొన్న రిస్కులు ఉంటాయి అన్నమాట. చూసారా సీరియస్ కంప్లైంట్ ఏమిటంటే heart attack, stroke, and death దీనిని బట్టి అది యెంత ప్రమాదకరమో తెలుస్తుంది. 


ఇటువంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి మనకు ఆంగ్లంలో ఒక సామెత వున్నది (A stitch in time saves nine) అదేమంటే సరైన సమయంలో తీసుకొనే నిర్ణయం భవిష్యత్తులో జరిగే పెను ఆపదను తొలగిస్తుంది. ఇవ్వన్నీ నేను చెప్పటానికి కారణం ఇప్పుడు మనం ఒక విపత్కర పరిస్థితిలో వున్నాము అదే కలుషిత ఆహరం. మనం తినే అన్ని ఆహార పదార్ధాలు కూడా కలుషితమే. గొంగళిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అన్నట్లుగా వుంది ప్రస్తుత పరిస్థితి. మనకు సులభంగా ఆరోగ్య సంరక్షణ చేసుకోవటానికి మన మహర్షులు మనకు అందించిన దివ్య జ్ఞ్యానం ఆయుర్వేదం. నేను మీకు ఇప్పుడు ఒక చక్కటి ఆయుర్వేద మందుని తెలుపుతున్నాను. దానిపేరే అర్జునరిష్ట  ఈ మందు మనకు సిరపు రూపంలో లభిస్తుంది. 



అర్జునరిష్ట  సిరపు 450 మిల్లి లీటర్ల పరిమాణము కలిగిం సీసాలలో లభిస్తుంది. అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి. మీకు పతంజలి మందు మిగిలిన వాటి కన్నా చవుకగా, నాణ్యంగా దొరుకుతుంది. ఏ కంపెనీ మందు వాడాలి అన్నది మీ నిర్ణయం. 


అర్జునరిష్ట  సిరపు ఎవరు యెట్లా వాడాలి: ఇది ద్రవ రూపంలో వున్న ఔషధము. దీనిని 50 సంవత్సరాలు నిండిన వారైనా లేక గుండె జబ్బుతో బాధ పడే వారు అందరు సురక్షితంగా ఉపయోగించ వచ్చు. దీని వాడకం వలన రక్త పోటు మొదలుకొని పైన పేర్కొన్న అన్నిరకాల రుగ్మతలతో బాధ పడే వారు వాడ వచ్చు.  ఈ మందుని భోజనం చేసిన తరువాత సీసా మీద పేర్కొన్న డోసు ప్రకారము మీ మీ సమస్య తీవ్రత అనుసరించి తీసుకోవచ్చు . రక్తపోటు వున్న ప్రతి వారు తప్పక ఈ మందు సేవనం చేయాలనీ నేను సూచిస్తాను. 


అర్జునరిష్ట  సిరపు సైడ్ అవేక్ట్లు::  ఈ ముందుకి తీవ్రమైన దుష్పరిణామాలు ఏవి లేవు చాలా మటుకు సురక్షితం. అయినా కూడా ఎప్పుడు మోతాదు మించి ఏ మందు వాడ రాదు. కొన్ని సామాన్యు మైన దుష్ ఫలితాలు ఉండవచ్చు కానీ అవి పెద్దగా అపకారం చేయవు. 


మిత్రులారా మీరు ఏ రకమైన గుండె జబ్బుతో బాధ పడుతున్నా  తక్షణమే ఈ మందుని వాడండి. మీకు Bi pass surgery (బైపాస్ సర్జరీ ) చేయాలి లేకపోతె చనిపోతారు అని డాక్టర్లు సూచించిన రోగులకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుందని నేను చెప్పటం కాదు వాడి మేరె నిర్దనించుకోండి. లక్షల రూపాయలు వెచ్చించి ఆపరేషనులు చేయించుకోవటం ముఖ్యమా లేక అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లో ఉండి ఆరోగ్యం చేకూర్చుకోవటం ముఖ్యమా అన్నది మీ నిర్ణయానికే వదిలి వేస్తున్నాను. 


గమనిక: తీవ్రమైన గుండె జబ్బులతో బాధ పడేవారు మంచి ఆయుర్వేద డాక్టరు సలహాతో ఔషధ సేవనం చేసి ఆరోగ్యవంతులు కాగలరు. 


మరో  ఔషధంతో మరల కలుద్దాము. 


మీ 


బుధజన విధేయుడు 


భార్గవ శర్మ


పాలు సేవించుట

 పాలు సేవించుట  వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు  -  


 

  పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - 


   పాలు మధురంగా ఉండును. జిడ్డుని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . శీతలం , అన్ని తత్వముల వారికి మంచిది . బలం కలుగజేయును . మేధస్సుకు మంచిది . ఆయువుని వృద్ది చేయును . బాలురు , వృద్ధులు, క్షీణించినవారు, ఆకలిచే కృశించిన వారు పాలు సేవించిన ఆరోగ్యం కలుగును.


              పాలు పితుకుతున్నప్పుడు వేడిగా ఉండు పాలు బలం , అమృత తుల్యంగా ఉండును. అలా కాకుండగా పితికిన తరువాత చల్లబడిన పాలు తాగినచో అనేక రోగాలు తెచ్చి పెట్టును. 


              పంచదార , పటికబెల్లం కలిపిన పాలు తాగినచో శుక్రం పెంచును.  బెల్లం కలిపిన పాలు తీసుకున్నచో మూత్రం బొట్లుబొట్లుగా పడు రోగంని నివారించును. పిత్తాన్ని , శ్లేష్మాన్ని పెంచును. రాత్రుల యందు పాలు తాగుచున్న యొడల అనేక దోషాలను పోగొట్టును . అలా పాలు సేవించాలి అనుకునేవారు భోజనం వేళకు , పాలు తాగు సమయానికి 2 గంటల వ్యవధి ఉండవలెను . భోజనం చేయకుండా పాలు తాగవచ్చు . పాలలో అన్నం కలిపి తినకూడదు.  అలా తినినచో " అజీర్ణం" కలుగును. రాత్రి నిద్రపట్టదు. 


  ప్రతిదినం పాలు తాగువారు పాటించవలసిన నియమనిబంధనలు  - 


 *  మంచి రంగు లేకుండా మంచి రుచి కలిగి ఉండని , పుల్లటి మరియు చెడు వాసన , గడ్డలుగా ఉన్న పాలను తాగరాదు.


 *  పాలతో ఎల్లపుడూ పంచదార మాత్రమే కలిపి వాడవలెను. లేనిచో పటికబెల్లం చూర్ణం కూడా వాడవచ్చు 


 *  పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.


 *  చేపల కూర తిని పాలు మరియు పాలపదార్థాలు తీసుకోరాదు . అలా తీసుకున్నచో తప్పక కుష్టువ్యాది కలుగును. 


 *  కొన్నిరకాల పుల్లటి వస్తువులు పాలతో చేరినపుడు విరుద్దముగా మారును . కావున పాలు తాగు సమయంలో కాని ఆ తరువాతనైనా పుల్లని వస్తువులను భుజించరాదు . 


 *  ఉలవలు , పరిగెలు , కొర్రలు, అనుములు , అడవి పెసలు మొదలైనవి పాలతో విరోధించును. కావున వీనిలో ఏ ఒక్కటి పాలతో కలిపి లోపలికి తీసుకోకూడదు . 


 *  అనుములు , మినుములు ముఖ్యంగా పాలతో విరోధించును.ఈ రెండు పదార్థాలకు సంబంధించిన ఆహారాలు తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు . అనారోగ్యం కలుగును.


 *  ముల్లంగి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పాలు వాడరాదు.


 * రాత్రుల యందు వేడివేడి గోధుమ చపాతీలు ఇగురు కూరలతో కాని , తీపి పదార్థాలతో కాని లేక పంచదారతోగాని కలిపి భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన చక్కటి ఆరోగ్యం కలుగును. 


 *  పాలయందు వెన్న ఆవులు, గేదెలు తిను ఆహారం నుండి పుట్టును . చిట్టు , పచ్చగడ్డి , పత్తిగింజలు , మినపరొట్ట మెదలైనవి తినిన పశువుల పాలు శ్రేష్టము. పల్లపు ప్రదేశాలలో ఉండు పశువులు ఇచ్చు పాలకన్నా మెట్ట ప్రాంతాలలో ఉండు పశువులు ఇచ్చు పాలు శ్రేష్టం. 


 *  ఆవుపాలు గేదెపాలకన్నా శ్రేష్టమైనవి . గేదెపాలల్లో ఆవుపాలు కంటే మందంగా ఉండును. కారణం వెన్నశాతం ఎక్కువుగా ఉండటం అందువలన ఆలస్యముగా జీర్ణం అగును. గేదెపాలు నిద్రను కలుగజేయును. చలవ చేయును . 


 *  మేకపాలు కారం, చేదు రుచులు కలిగి ఉండును. ఆకులను తినుట చేతను కొద్దిగా నీరు తాగుటచేతను , ఎక్కువ దూరం నడుచుట వలన మేకపాలు అన్ని వ్యాధులను పొగొట్టును. ముఖ్యంగా రక్తపిత్తవ్యాధి అనగా నోటి నుండి రక్తం బయటకి వెలువడు వ్యాధి తగ్గును. క్షయరోగం , దగ్గు , జ్వరములను తగ్గించును .  చంటిబిడ్డలకు తల్లిపాల తరువాత మేకపాలు శ్రేష్టమైనవి . 


      

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఐదు "వ"కారములు

 Ve🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం🕉️🙏 🏵️వస్త్రము, శరీరము, వాక్కు, విద్య, వినయము అనే ఈ ఐదు "వ"కారములు చేత మానవుడు పూజీంపబడుచున్నాడు.. అనగా శుభ్రమైన మంచి బట్టలు, ఆరోగ్యావంతమైన శరీరము, చక్కని సంస్కారవంతమైన మాట,గురువులయందు అణుకువ, పెద్దలయందు వినయము అను ఈ ఐదు లక్షణములు గల వ్యక్తి లోకంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతాడు🏵️దానం చేసే బుద్ది.. ప్రియమైన మాటలు మాట్లాడటం.. ధైర్యం కలిగి ఉండటం.. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండటం ఇవి నాలుగు పుట్టుకతో రావలసిందే గాని నేర్చుకుంటే వచ్చేవి కావు🏵️గుండెల్లో బరువు దించుకున్న తరువాత జ్ఞాపకాలపై వాటి బరువు మోపకుంటే మంచిది..ఈ ప్రపంచంలో చాలా మంది బ్రతికేది ఆహారం తిసుకుని, గాలి పీల్చుకొని కాదు..రేపు ఎదో జరుగుతుందని ఆశ పడి..ఆశల వలయంలో పరిభ్రమిస్తుంటారు..నిజాన్ని తెలుసుకో..ఈ రోజు ఉన్నతంగా మాలచుకో మిత్రమా!!🏵️🏵️ మీ అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజెన్సీస్ D.N 29-2-3 గోకవరంబస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా.రాజమండ్రి 9440893593 9182075510🙏🙏🙏

18. " మహాదర్శనము

 18. " మహాదర్శనము " -- పద్ధెనిమిదవ భాగము --వారే వీడు


18.  పద్ధెనిమిదవ భాగము -- వారే వీడు 


          కుమారునికి చౌలము , అక్షరాభ్యాసమూ విజయవంతముగా అయిన తరువాత, అనతి దినములలోనే  ఆచార్య దంపతులు బుడిలుల కుమారుడు కాత్యాయనుడి వివాహమునకు కొడుకుతోపాటు వెళ్ళినారు.  పెళ్ళినుండి వెనుతిరిగి వచ్చినారు కూడా . పెళ్ళింట్లో అందరూ కుమారుని కళ్ళార్పకుండా చూసేవారే ! వాడు కూడా అలాగే ఎవరు పిలిచినా వెళ్ళేవాడు . అలాగే ఎత్తుకొని ఏదో ఒకటి తినడానికి ఇచ్చేవారు . ముద్దులవాన కురిపించేవారు . ఆ నిండు పెళ్ళింట్లో ఒక విశేషము జరిగింది . కాత్యాయనుని భార్య ఔపస్వస్తికి కుమారుడు ఎన్నో దినముల నుండీ చూసినవాడి లాగా మాలిమి అయిపోయినాడు . ఇంకా పది పదకొండేళ్ళ వయసులో ఉన్న ఆ అమ్మాయిని అందరూ ’ అక్కా’ అని పిలువయ్యా అని ఎంత నేర్పించినా వినకుండా ’ అత్తా’ అని పిలుస్తాడు . ఈ సంగతి బుడిలుల చెవి వరకూ వచ్చింది . వారు నవ్వేసినారు , ’ ఇది కూడా ముందు జరగబోయే దానికి గుర్తో ఏమో ఎవరికి తెలుసు ? " అన్నారు . 


         ఇంకొక ఆశ్చర్యము ! ప్రతియొక్కరూ కుమారునికి ఐదు సంవత్సరాలైనా నిండియుండును అనువారే . తెలిసిన వారు మూడు సంవత్సరాలే అంటే , వెంటనే మూతీ ముఖమూ ముడుచుకొని , ’ చాలు ఊరికే ఉండండి , ఐదు సంవత్సరాలైనా లేకపోతే అలాగ గడగడా మాట్లాడుటకు అవుతుందా ? " అని ఆ చెప్పినవారు చిన్నబోయేలా చేస్తారు . అయినా అందరికీ దిగులు , బాలుడికి కను దృష్టి తగులుతుంది యని . అయితే , ఏ దేవుడి దయయో , ఏమీ కాలేదు . 


         ఫాల్గుణ మాసము వచ్చింది . ఎండ ఎక్కువౌతూ వచ్చింది . ఇంతవరకూ నీడను వదలి ఎండలోకి వచ్చువారు , ఇప్పుడు ఎండను వదలి నీడను వెతుకునట్లయింది . చెట్లూ చేమలు అన్నీ కొత్త చిగురులతో శోభించినాయి . ప్రతి చెట్టూ , కాంతివిహీనముగా నున్న , వాలిపోయి ఉన్న, ముదురుటాకులను వదలి , దుమ్ముపడి మాసిపోయి ఉన్న చీరను వదలి కొత్త పట్టుచీరను కట్టుకున్న కాంతలవలె అందముగా నున్నవి . తలపైన కావలసినన్ని చిగురుటాకులు నిండియున్ననూ , నేలపైన ఇంకా గడ్డి మొలవలేదు . బ్రాహ్మణ బంధువుల బ్రాహ్మణ్యము వలె తెల్లవారు జాము లోని చలి నిర్నామమగుచున్నది.  


         ఇప్పుడు కుమారుడు తల్లికన్నా ఎక్కువగా తండ్రిని పట్టుకున్నాడు . అయితే , తల్లి పిలిస్తే వెళ్ళకుండా అవమానము చేయడు . అగ్నిహోత్రపు సమయములో తప్ప ఇతరవేళలలో తల్లి కొడుకును చూడవలెనంటే పిలుస్తుంది , లేకున్నలేదు . తండ్రి ,  శిష్యులకు శాస్త్ర పాఠము చెప్పునపుడైతే కొడుకు అక్కడ తప్పనిసరిగా సిద్ధమై ఉంటాడు . తండ్రి , ఎత్తైన ఒక పీటను చేయించి , ఇసుక నింపి , దానిపై అక్షరములను రాసి ఇచ్చి , దీనిని దిద్దుతూ ఉండు అన్నాడు . యాజ్ఞవల్క్యుడికి అక్షరములను నేర్చుట కష్టము కాలేదు . ఎనిమిది దినములలోనే క గుణింతముతో పాటూ అన్నిటినీ నేర్చేసుకున్నాడు . పదునైదు దినములలోనే స్ఫుటముగా రాసిన దేనినైనా చదవగలడు . ఎవరైనా ఏదైనా చెప్పితే దాన్ని రాయగలడు , అంతవరకూ వచ్చింది . 


         ఒకదినము ఆచార్యుడు ఏదో ఆలోచనలో కూర్చొని ఉన్నాడు . యాజ్ఞవల్క్యుడు వచ్చి తొడపైన కూర్చున్నాడు . ఆచార్యుడు హఠాత్తుగా కళ్ళు తెరచిచూసి , తొడపై కూర్చున్న కొడుకును ఒక చేతితో అలాగే హత్తుకొని , ఇంకొక చేతితో వాడి తల, ముఖములను నిమురుతూ , " రాయుట అంతా అయినదేమయ్యా ? " అన్నాడు . 


         కొడుకు , ’ ఓ , మీరు ఇచ్చినదంతా రాసేసినాను , ఎట్లా రాసినానో తెలుసా ? అమ్మ ఇచ్చిన చక్కిలమును కరం కురం అని తిన్నట్లే గబగబా రాసినాను . నేను ఇప్పుడు ఎందుకు వచ్చినానో తెలుసా ? " 


తండ్రి ఆ ఉపమానమును విని నవ్వుతూ , " నువ్వే చెప్పు , నాకేమైనా పరకాయ విద్య వస్తుందా ? " అన్నాడు . 


        కొడుకు తండ్రి ముఖము చూస్తూ అన్నాడు , " మీకు వచ్చినవారి ముఖము చూడగానే తెలుస్తుంది కదా !  శిష్యుడు వస్తే , ఏమయ్యా , సందేహము వచ్చిందా ? ఇదేకదా ? అని చెప్పేస్తారు కదా ? " 


      తండ్రి అది విని తనను అనుకరిస్తున్న కొడుకును చూసి  సంతోషపడుతూ అన్నాడు , " అది శిష్యుల మాట . కానీ నువ్వు నా కొడుకువు కదా ! కాబట్టి నువ్వే చెప్పు  " .


         " ఊ , సరే , మీరు పెద్దవారు , మీమాట వింటే తప్పులేదు , ఆ దినము చూచితిరా , నాయనా! చౌలమగువరకూ తాళు , ఆ తరువాత ఏదైనా అడగవచ్చు అన్నారు, కదా ? " 


" ఔను " 


" ఇప్పుడు దానినే అడుగుటకు వచ్చినాను . అడగనా ? " 


         తండ్రికి కొడుకు ఏమి అడుగునో అని దిగులైంది . సందేహమయినది . అయినా , కొడుకు చిన్నవాడు , వీడేమి అడుగగలడు ? అని మాయా మోహములు ఆవరించి " అడుగు " అన్నాడు . 


         కొడుకు అడిగినాడు , " మొదట ఆ కడిగే సంగతి చెప్పండి . బయట కడగక ఉంటే మసి , లోపల కడగక ఉంటే మడ్డి అని అమ్మ చెప్పింది . నేను ఆలోచించినాను . బయట కడుగుట ఎలాగ అని తెలిసింది . అయితే ఈ మన లోపల కడుగుట ఎట్లా ? అది ఎంత ఆలోచించినా తెలియలేదు . అందుకే మిమ్మల్ని అడిగినాను . " 


         తండ్రి , కొడుకు ముఖమును చూచినాడు . ఎక్కడో చూచినట్లు గుర్తుకొచ్చింది . స్మృతి వెదకి , ఆనాటి కలను గుర్తు చేసింది . ఔను , కలలో చూచినవాడే వీడు . సందేహములేదు , ఆ నాడు పెద్ద దేహములో నాకు సమాన వయసులో దూరము కూర్చున్నాడు . ఈనాడు చిన్న దేహములో వచ్చి తొడపైన కూర్చున్నాడు . అంతే వ్యత్యాసము ! 


        ఆచార్యుడు సమాహితుడైనాడు . వాడు ఏమి అడిగినమూ మాయా మర్మములు లేకుండా చెప్పు అని చెప్పిన బుడిలుల మాట కూడా జ్ఞాపకము వచ్చింది . సరే , యనుకొని చెప్పసాగినాడు ;


         " విను నాయనా , నువ్వు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది . ఈ లోకములో ఎవరూ సామాన్యముగా ఈ లోపల కడిగే సంగతి ఆలోచించరు , గమనించరు కూడా ! కానీ లోపల కడుగుకొని పరిశుద్ధుడగు వరకూ శ్రేయో మార్గమే కనిపించదు . కాబట్టి లోపల కడిగేది ముఖ్యమైన పని . ఏమో అడగాలని ఉన్నావే , అడుగు . " 


" అప్పుడు , అమ్మ చెప్పిన శ్రేయస్సు , ప్రేయస్సు కదా , మీరు కూడా చెపుతున్నది ? " 


         " ఔను : రెండిటినీ యమధర్మరాజు నచికేతునికి చెప్పినాడు . లోపల కడగవలెను అని ఆలోచించువాడు , లోపల ఏముంది ? కడుగుటకు సాధ్యమా ? అనుదానిని కూడా ఆలోచించవలెను కదా ? చూడు , ఈ దేహమును ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చూస్తారు . వైద్యులు దీనిని ప్రాణమున్న ఇల్లుగానూ , వాత , పిత్త , కఫములు అను తాప త్రయములు ఇందులోని యజమానులు గానూ చెపుతారు . యోగులు , ఇది నరమండలము , చక్రముల స్థానము , ప్రాణాది పంచవాయువుల క్షేత్రము అంటారు . మంత్ర వేత్తలు దీనిని నానా దేవతల ఆవాస స్థానము , దేవతలందరూ ఈ దేహములో బీజరూపముగా , కార్యమునకు ఎంత కావలెనో , అంత స్థాయిలో మాత్రము తమ తేజస్సును ఇక్కడ ఉంచినారు . కాబట్టి ఇది దేవాలయము అన్నారు ." 


         జ్ఞానులు , ఈ దేహము పంచ కోశములనుండీ ఏర్పడిన పెద్ద గూడు , ఇది క్షేత్రము , ఇందులో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు , కాబట్టి ఇది వాని ( జీవుని ) ఇల్లు అంటారు . లౌకికులు , ఈ దేహమనగా తానే , దీని హాని , వృద్ధులే తన హాని వృద్ధులు . కాబట్టి ఈ దేహమును ఆరోగ్యముగా  , సుఖముగా ఉంచుకొన వలెను అంటారు . వీరిలో లౌకికులు మాత్రము , లోపల కడుగుట యంటే ఈ దేహమును ఆరోగ్యముగా ఉంచుకొనవలెను అంటారు . లోపలెక్కడైనా కశ్మలము చేరి నిలిస్తే అది రోగకారణము అగును . కాబట్టి శుచిగా ఉండవలెను అనునది వీరి మతము . " 


" ఇప్పుడు నాకు అమ్మ అపుడపుడు నూనె పట్టిస్తుంది , ఎందుకమ్మా అంటే , నీ ఒళ్ళు బాగుండాలి అంటుంది . అదేనా ఇది ? " 


         " ఔను , అది మొదటి ఘట్టము . అది వైద్యులు చేయు పని . వైద్యులు , యోగులు, మంత్రవేత్తలు , జ్ఞానులు అందరూ చూచే ఈ దేహములో కనిపించని ఏదేదో ఉంది అని ఒప్పుకుంటారు . అలాగే , ఈ దేహము ఒక సాధనము అనునది కూడా ఒప్పుతారు . వారందరూ దీనిని కడుగవలెను అని అంగీకరించిననూ , ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కడుగవలెను అంటారు . వైద్యులు విరేచనాది పంచ కర్మలతో శుద్ధి అంటారు . యోగులు ప్రాణాయామముతో శుద్ధి అంటారు . మంత్రవేత్తలు మంత్ర జపము వలన , ఆచారము వలన శుద్ధి యంటారు . జ్ఞానులు ఇంద్రియ మనో వ్యాపారములను పట్టులో ఉంచి విచారముల చేత పవిత్రము చేయవలెను అంటారు . " 


         " దేహము శుద్ధమైతే ఏమవుతుంది అనుదానిలో కూడ వీరివి వేరే వేరే లక్ష్యములు . వైద్యుడు , శుద్ధదేహము పటుత్వముతో ఉండును , ఆరోగ్యము లభించును: అప్పుడు ధర్మ , అర్థ , కామ , మోక్షములేవి కావాలన్ననూ సాధించవచ్చు అంటాడు . యోగి , శుద్ధ దేహము సాధించలేనిది ఏమి ? ఆకాశములో ఎగురవచ్చు , లోకాంతరములకు వెళ్ళి రావచ్చు , ఇంకొకరి దేహమును ప్రవేశించవచ్చు , కొండంత , లేదా , అణు మాత్రముగా మారిపోవచ్చు , సమాధిలో ఉండవచ్చు అని నానా సిద్ధులను ఒక్కాణిస్తారు . మంత్రవేత్తలు , ఉపాసన వలన , దైవ తేజస్సును పెంచుకొంటే ఇక్కడ ఉండియే ఏది కావాలన్నా పొందవచ్చును , పరములో పుణ్యలోకములను కూడా పొందవచ్చును , చివరికి దేవాప్యయము అంటే , ఉపాసకుడు ఉపాస్యమాన దేవతలో చేరిపోవచ్చును అంటారు . జ్ఞానులు , " ఈ సిద్ధులన్నీ క్షుద్రములు , మహత్తరమైన సిద్ధియంటే ఆనందలాభము. దానిని పొందుటకు ఈ శుద్ధ దేహమును ఉపయోగించవలెను" అంటారు.  వీరిలో ఏ ఒక్కరినో అని కాదు , మంత్రవేత్త , జ్ఞాని, మొదలు ఈ నాలుగు పద్దతులనూ అనుసరించవలెను . "


        కొడుకు ఏకాగ్ర మనసుతో విన్నాడు . అలాగే ఒక ఘడియ , తిన్నదానిని పైకి తెచ్చుకొను ఆవు వలె నెమరు వేస్తూ ఆచార్యుడు చెప్పినదంతయూ మనసులో పర్యాలోచించినాడు . చివరికి తండ్రిని అడిగినాడు , 


" తండ్రీ , మీరు చెప్పిన నాలుగు పద్దతులను ఉపయోగించు కున్నాము అనుకోండి , దానివలన హాని లేదు కదా ? " 


         " హాని ఎక్కడిది ? ఒకదానినుండీ ఇంకొకదానికి ఉపకారమై శుద్ధియగును . అందరికీ సమ్మతమగునట్లు ఒక ఉపాయమును చెపుతాను విను . ఈ మనుష్యుని దేహమునకూ , ఇతర మృగాదుల దేహములకూ ఒక వ్యత్యాసమున్నది . మృగాదుల దేహములలోనే వ్యత్యాసము ఉంది . మనుష్యుల వ్యత్యాసమున్నది మనుషుల మనసు లోనే ! కాబట్టి , తెలిసిన వారు దేహ దేహమునకూ వేరే వేరే శుద్ధి క్రమములను చెపుతారు . ఆ క్రమములన్నీ , వారి వారి మనసును అవలంబించుకొని ఉంటాయి . మనుష్యుడు , మృగములకు తెలీని " నాకు నమ్మకము లేదు " అను మంత్రమును చెప్పేస్తాడు . అది అన్నిటికీ ప్రయోగము అవగల ఏకబాణము . కాబట్టి మనుషుడు మొదట ఈ నిషేధరూపమైన మంత్రమును వదలి , ’ తాను నమ్మునదేమి ? ’ అనుదానిని విధిరూపముగా నిర్ణయించుకొన వలెను . దానికి తగ్గ సాధనమును ఉపయోగించుకో వలెను . "


" దీనికి ఏదైనా పేరుందా ? "


" ఉంది , దీనినే , తెలిసినవారు ’ శ్రద్ధ ’ అంటారు . శ్రద్ధయే , దేహము పెరిగిన దానికి గుర్తు . శుద్ధియగుటకూ గుర్తు . " 


" దేహము పెరుగుట అంటే ఏమిటి తండ్రీ ? చిన్నదిగా ఉన్నది పెద్దదియగుట అనా ? "


         " కాదు , దేహము బయట పెరుగుట వేరే , లోపల పెరుగుట వేరే . నువ్వు చెప్పింది బయట పెరుగునది . బయట పెరిగిన దేహములో కావలసినంత కశ్మలము చేరి , దానిలో శ్రద్ధ కనిపించకుండా పోవచ్చును . కాబట్టి నేను చెప్పిన పెరుగుట లోపల సంబంధమైనది . ఆ దేహము లింగ , వయసు , రూపములతో ఎలాగున్నా , దానిలో ధైర్యము , సౌజన్యాదులతో కూడిన శ్రద్ధ ఉంటే అది పెరిగిన దేహము . " 


" శ్రద్ధ అంటే ఏమి ? ఇంకా కొంచము విస్తారముగా చెప్పండి " 


         " ఇప్పుడు చూడు , నేనో , మీ అమ్మో ఏదైనా చెబితే నువ్వది నమ్ముతావు . ఈ పని చేయవద్దు అంటే చేయవు . ఇది చేయి అంటే నీకు అక్కర లేకున్నా చేస్తావు . ఇది శ్రద్ధ . ప్రయత్న పూర్వకముగా తన ఆలోచనాశక్తిని నిలిపి , తనకన్నా పైవారి మాటను సత్యమని అంగీకరించునది శ్రద్ధ . పైవారు ఉన్నారు , వారికి నా కన్నా ఎక్కువ తెలుసు అను నమ్మకమే శ్రద్ధ . ఒక్కొక్కసారి పై వారు కారణాంతరముల వలన తప్పు చేసినారనుకో , అప్పుడు శాస్త్రముల వలన ఈ శ్రద్ధను రూఢి చేసుకోవలెను . చూడు , నచికేతుని తండ్రి దానయోగ్యములు కాని ముసలివైన ఆవులను దానముగా ఇచ్చినాడు . అప్పుడు నచికేతుని శ్రద్ధ వాడికి శాస్త్రమును చూపించినది . ఎలాగ ?  ఆ శాస్త్ర వాక్కు , అదేయములను దానముగా ఇస్తే అసురలోకములు వచ్చును అన్నది . అప్పుడు అతనిలో జిజ్ఞాస పెరిగినది . జిజ్ఞాస అడిగింది , ’  సర్వస్వ దానము అంటే ఇదియేనా ? అలాగయిన , వారి వాడనయిన నన్ను కూడా దానము నిచ్చునా ? "  ఆ జిజ్ఞాస ఫలము ఏమిటో నీకూ తెలుసు . కాబట్టి , విను . అందరికీ సమ్మతమైనది , లోపల కడుగుటకు ఏదో ఒక విధముగా నైననూ ప్రయత్నించునది శ్రద్ధ . శ్రద్ధ ఒకటుంటే , అది వైద్యుడు , యోగి , మంత్రవేత్త , జ్ఞాని--వీరి పద్దతులలో ఏ ఒక్క దానినైనా , లేదా ఈ పద్దతులన్నిటినీ కొంత కొంత కలిపి , ఒక కొత్త పద్దతిని చేసి ఇచ్చియే తీరును . " 


" ఒకవేళ ఆ శ్రద్ధ తప్పుదారి పట్టితే ? " . 


         " దానికోసము అంతగా వ్యథ అవసరము లేదు . బండల ఇరుకులో పెరుగు మొక్క , ఆకాశము వైపుకు తిరిగి , చివరికి సూర్యుని చూచుటకు పెనుగులాడి సూర్యునికి అభిముఖముగా వచ్చునట్టి శ్రద్ధ , తప్పుదారి పట్టిననూ , దానిని తన స్వభావమే సరియైన దారికి తెచ్చి వదలును . నాయనా , ఇంత మాత్రమే అనుకోవద్దు , నేను చెప్పినది , భరద్వాజుడికి బ్రహ్మ దేవుడు  వేదమును ఇచ్చినట్లే , ఒక పిడికెడు మాత్రమే " 


" అయితే , భరద్వాజుడి కథ చెప్పండి " 


        " భరద్వాజుడు తపస్సు చేసి బ్రహ్మ వద్దకు వెళ్ళినాడు . బ్రహ్మ , ’ ఏమి కావలెను ? ’ అని అడిగినాడు . భరద్వాజుడు, ’ నాకు వేదము కావలెను ’ అన్నాడు . బ్రహ్మ అతడిని పిలుచుకొని పోయి , మండుచున్న అగ్నిపర్వతము నొకదానిని చూపి , ’ ఇగో , ఇదే వేదము ’ అని , ఆ తేజోరాశినుండీ ఒక పిడికెడు తీసి ఇచ్చినాడు .  నువ్వు అడిగిన ప్రశ్నకు నా ఉత్తరము కూడా దానివంటిదే ! "


" సరే , మరి నాకు విస్తారముగా ఎప్పుడు చెప్పెదరు ? " 


         " చూడయ్యా యాజ్ఞవల్క్యా , మొదట శాస్త్రమును నేర్చుకోవలెను . అప్పుడు మనసు , ఇది నిజమా కాదా , ఇది సరియా కాదా అని పారాడుతుంటుంది . అప్పుడు మనసును తనకు నచ్చిన విధముగా వదలక , దానిని పట్టులో ఉంచుకొని , శాస్త్రమును సరిగ్గా , క్రమముగా  అభ్యాసము చేస్తూ రావలెను. అప్పుడు అభ్యాస బలము చేత మనసు వంగి , శాస్త్రమును సరిగా తెలుసుకొనును . అది ఒక నిష్ఠ. అప్పుడు నిష్ఠతో తాను తెలుసుకొనిన , ’సరి ’యన్నదానిని ధృవపరచుకొనుటకూ , తనకూ ఇతరులకూ శాస్త్రము సరిగ్గా అర్థమగుటకూ , లౌకికమైన యుక్తులను చెప్పెదను .   అలాగ యుక్తి , అనుభవముల చేత శాస్త్రమును తనదిగా చేసుకొనిన , అప్పుడు శ్రద్ధ !  కాబట్టి నువ్వు శాస్త్రమును చదువు . అది అర్థము కానీ ! అప్పుడు , విస్తారముగా , పరమాణువు వలెనున్న దానిని పర్వతమంతగా చేసి చెపుతాను . " 


       " సరియే , అయితే మొదట శాస్త్రాభ్యాసము . తరువాత దాని అనుభవము , శాస్త్ర అనుభవములకు రెంటికీ సరిపోవు యుక్తి ! సరే , అటులనే  " 


        " చివరిమాట గుర్తుంచుకో , దేహము లోపల కశ్మలమును నింపునది , దురాహారము , దురాచారము , దుర్విచారములు . కాబట్టి వాటిని వదలవలెను . " 


" అలాగన్న నేమిటి ? " 


         "  చూడు , మొదటగా వచ్చేది ప్రేయస్సు , శ్రేయస్సు . తనకు తోచినట్లు నడచుట ప్రేయోమార్గము . ఆ ప్రేయో మార్గమును పట్టిందల్లా దుష్టము . ఇప్పుడు వేళ మించినది , ఇక్కడికి నిలుపుదాము , ఇంకొక దినము విస్తారముగా చెపుతాను . " 

Janardhana Sharma

(17-09-2024) రాశి ఫలితాలు

  (17-09-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

 17-09-2024

ఆప్తుల  నుండి అవసరానికి   సహాయ సహకారాలు అందుతాయి.  దీర్ఘ కాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది. సంతాన విద్యా విషయాలపై  దృష్టి సారిస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు  లభిస్తాయి.  సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 


వృషభం

 17-09-2024

ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు  అమలు చేస్తారు. దాయాదులతో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు.  వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు  లభించిన అవకాశలు సద్వినియోగం చేసుకోవాలి. 


మిధునం

 17-09-2024

ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతాన విషయమై  ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.


కర్కాటకం

 17-09-2024

మిత్రులకు  మీ అభిప్రాయాలు నచ్చే విధంగా ఉండవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా  పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఇంటా బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల  ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది. వ్యాపారాలు  మండకోడిగా సాగుతాయి.


సింహం

 17-09-2024

బంధుమిత్రుల సమాగమం ఆనందం  కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో  సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. సమాజంలో  కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక   ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వాహన అనుకూలత కలుగుతుంది. జీవిత భాగస్వామితో  దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.


కన్య

 17-09-2024

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానలు అందుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  మీ ప్రవర్తనకు అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు.


తుల

 17-09-2024

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగమున విలువైన పత్రములు  విషయంలో  జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత  నిర్ణయాలు కలిసిరా. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమంలో పాల్గొవడం మంచిది.


వృశ్చికం

 17-09-2024

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన  వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ  వివాదాలు  కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.  అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా  సాగుతాయి.


ధనస్సు

 17-09-2024

కీలక వ్యవహారాలలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.  సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.


మకరం

 17-09-2024

అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా  ఉంటుంది.  ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.  ఉద్యోగాలలో నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. 


కుంభం

 17-09-2024

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ  అవకాశాలు  లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.


మీనం

 17-09-2024

ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

*శ్రీ భూ కైలాస్ - మహాబలేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 442*





⚜ *ఉత్తర కర్ణాటక _ గోకర్ణ* 


⚜ *శ్రీ భూ కైలాస్ - మహాబలేశ్వర ఆలయం*


 

💠 మన గ్రంధాలలో భూకైలాసంగా వర్ణించిన పవిత్ర క్షేత్రం మరియు ఈ భూప్రపంచంలో 'ఆత్మలింగం' గల ఏకైక శైవక్షేత్రం గోకర్ణం. 

ఇక్కడ ఉన్న శివుణ్ణి 'మహాబలేశ్వరుడు' అని పిలుస్తారు. ఇది కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రతీరాన ఉన్నది.


💠 ఒకప్పుడు ఈ భూగోళమంతయూ జలమయమై ఉన్నదట. అప్పుడు బ్రహ్మ' సృష్టి కార్యం చేయమని రుద్రుని ఆదేశించాడు. 

మహాశివుడు పాతాళముకు వెళ్లి సృష్టి ఎలా చేయాలో ఆలోచిస్తూ సుదీర్ఘకాలం తపమాచరించాడు. ఎంతకాలమైనా మానవసృష్టి జరుగనందుకు బ్రహ్మ ఏమి జరిగినదో విచారించసాగాడు.


💠 ఈ విషయం తెలుసుకున్న శివుడు సూక్ష్మరూపం ధరించి భూమిపైకి వచ్చాడు. అయితే ఆ సమయానికి భూదేవి గోరూపం ధరించియున్నందున అట్టి గోవుకర్ణము నుండి శివుడు బయటికి రావలసి వచ్చినది. 

భూమాత ఈ విషయం గమనించి ఆందోళన పడసాగింది. 

అప్పుడు పరమశివుడు ఇక మీదట ఈ ప్రాంతం 'గోకర్ణమ'ను పేరున ప్రసిద్ధి చెందుతుందని సెలవిచ్చాడు. అందువల్లే, గోకర్ణంలోని శివాలయంలో శివలింగం పాన వట్టంపై లేకుండా దానిలోపల గోవు చెవి ఆకారంలో ఉన్నది. 


🔆 *స్థల పురాణం* 🔆

 

 💠 రావణుడి తల్లి, పరమశివుని భక్తురాలు, తన కుమారుడికి శ్రేయస్సు కోసం శివలింగాన్ని పూజించింది.  

ఈ పూజకు అసూయపడిన ఇంద్రుడు శివలింగాన్ని దొంగిలించి సముద్రంలో పడేశాడు.  శివుని భక్తితో చేసే పూజలకు విఘాతం కలగడంతో కలత చెందిన రావణుడి తల్లి నిరాహార దీక్షకు దిగింది.


💠 రావణుడు తన తల్లికి కైలాస పర్వతానికి వెళ్లి, ఆమె పూజ కోసం ఆత్మలింగాన్ని తీసుకువస్తానని వాగ్దానం చేశాడు.  

రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కైలాస పర్వతం వద్ద తీవ్రమైన తపస్సు చేసాడు మరియు తన శ్రావ్యమైన స్వరంలో శివుని స్తుతిస్తూ పాడాడు (శివ తాండవ స్తోత్రం).  అతను తన తలను కూడా నరికి, తన చర్మం మరియు ప్రేగుల నుండి తీసిన దారాలతో వీణను తయారు చేశాడు.  


💠 పరమశివుడు దయతో అతని ముందు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడిగాడు.  రావణుడు ఆత్మలింగాన్ని తన వరంగా కోరతాడు.  

శివుడు అతనికి వరం ఇవ్వడానికి అంగీకరిస్తాడు, దానిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. 

ఆత్మలింగాన్ని ఎప్పుడైనా నేలపై ఉంచినట్లయితే, అది ఆ ప్రదేశంలో పాతుకుపోయి ఉంటుంది.  


💠 రావణుడు గోకర్ణానికి చేరువలో ఉండగా,  తన సాయంత్రం కర్మలు చేయవలసి వచ్చింది, కానీ అతని చేతిలో ఆత్మ-లింగం ఉండటం వలన అతను దానిని చేయలేడని ఆందోళన చెందాడు.  

ఈ సమయంలో, ఒక బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణేశుడు అతనిని ఎదుర్కొన్నాడు.  రావణుడు తన కర్మలు చేసే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోమని కోరాడు మరియు దానిని నేలపై ఉంచవద్దని కోరాడు.  

తాను రావణుడిని మూడుసార్లు పిలుస్తానని, ఆ సమయంలో రావణుడు తిరిగి రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై పెడతానని గణేష్ అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.


💠 గణేశుడు మూడుసార్లు వేగంగా పిలిచాడు కానీ రావణుడు నిర్ణీత సమయానికి రాలేకపోయాడు.  రావణుడు తిరిగి రాకముందే, గణేశుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచి, రావణుడిని మోసగించి, తన గోవులతో సన్నివేశం నుండి అదృశ్యమయ్యాడు.  రావణుడు అప్పుడు భూగర్భంలోకి వెళ్తున్న ఏకైక ఆవును వెంబడించాడు.  

అయితే, అతను ఆవు చెవిని పట్టుకోగలిగాడు, ఎందుకంటే ఆవు శరీరం మొత్తం భూమి క్రింద అదృశ్యమైంది.  

ఇప్పుడు శిలారూపంలో కనిపిస్తున్న ఈ చెవియే ఆ ప్రాంతానికి "గోకర్ణం" అనే పేరు వచ్చింది.  "గోకర్ణ" అనే పదానికి "ఆవు చెవి" అని అర్ధం, సంస్కృతంలో గోవు అంటే "ఆవు" మరియు కర్ణ అంటే "చెవి".


💠 అప్పుడు, రావణుడు శివలింగాన్ని ఎత్తడానికి తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ అది గట్టిగా స్థిరంగా ఉండటంతో విఫలమయ్యాడు.  

తన శక్తినంతయు పోగొట్టుకొనిన రావణుడు చింతాక్రాంతుడై 'నీవే బల శాలివని' మహాశివుని స్తుతించి ఇక చేయదగినది లేక సిగ్గుతో అవమాన భారంతో, వైఫల్యంతో లంకకు వెళ్ళిపోతాడు. 

అందువలననే ఈ దేవుడు " మహా బలేశ్వరు"డని పిలువబడుచున్నాడు. 


💠 మహాశివుడు ప్రసన్నుడై 'గణపతి చేసినది అసాధ్యమైన కార్యము. ఈ సాహసకార్యము వలనే ఇచ్చట లింగస్థాపన జరిగినది. అందువలన మొదట శ్రీమహాగణపతిని దర్శించిన తర్వాతనే నన్ను పూజింపవలయునని' నిర్దేశించాడు. 

ఇప్పటికిని ఇప్పట గణపతి తలపై రావణుడు వేసిన మొట్టికాయ గుంతను చూడవచ్చును


💠 ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో  నిర్మించబడింది . ఆత్మలింగం చతురస్రాకారంలో ఉన్న సాలిగ్రామ పీఠం పై ఆలయంలో ప్రతిష్టించబడింది . పీఠం మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంది, ఇక్కడ నుండి భక్తులు ఆత్మలింగం యొక్క పైభాగాన్ని చూడవచ్చు .


💠 భారతీయేతర (పాశ్చాత్య) మూలానికి చెందిన హిందువులతో సహా విదేశీయులు గర్భగుడిలోకి ప్రవేశించడానికి మరియు శివలింగాన్ని చూడటానికి అనుమతించబడరు.


💠 ప్రతి ఏటా మహాశివరాత్రికి ఇచట ప్రత్యేక ఉత్సవాలు జరుగును. ఇచ్చట జరుగు రథోత్సవము ఎంతో ప్రసిద్ధి చెందినది. 


💠 గోవా నుండి కూడా గోకర్ణంకు బస్సులో వెళ్ళవచ్చు.

హైందవం వర్ధిల్లాలి 3

 *హైందవం వర్ధిల్లాలి 3*




జీవ కోటికి జీవించే మార్గాలు వేరు వేరుగా ఉండవచ్చును, కాని ధ్యేయం ఒక్కటే అయి ఉండాలి అదే *స్వధర్మ మరియు దేశ రక్షణ*.


 *స్వధర్మ రక్షణ హింసా వాదము కాదు*. వ్యక్తి స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలంటే ప్రక్క వానికి కష్ట నష్టములు కలుగకూడదు, ఇది ప్రాపంచిక ధర్మము, న్యాయము. కాని, ఈ మధ్య కాలంలో దురహంకారులైన  విదేశీ అన్య మతస్థులే  గాకుండా స్వార్థ పూరితులు మరియు అధికార దాహార్తులైన కొందరు  నాయకులు,  వారి అనుచర గణముల వలన  భారత దేశములోనే గాకుండా ఖండాంతరములలో గూడా బలహీనులపై దౌర్జన్యాలు, ప్రాణ మాన భంగాలు యధేచ్చగా జరుగుచున్నవి. ఇందుకు కారణం  జాతిలో  ఐకమత్య భావన లోపించడం. ఇందుకు ప్రధాన హేతువు  కొన్ని దుష్ట శక్తులు ప్రజలను కులాల వారీగా వీడదీసి చీలికలు సృష్టించడం రాజకీయ పార్టీలకు అంతేకాదు కులసంఘాల నాయకులకూ తమ పబ్బం గడుపుకోవడంమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నది.


ఏ సమాజంలో నైనా ఏదో ఒక రూపంలో విభజనలు ఉంటాయి అవి మతపరమైనవి కావు. సామాజిక అవసరాల కొరకు విభజనలు జరిగి ఉంటాయి....కానీ మన ధర్మంలోని చాతుర్వర్ణ  వ్యవస్థ, వృత్తుల పరంగా  ఏర్పడినా అవి క్రమంగా కులాలుగా విభజింపబడినా ఎవరి ప్రాధాన్యత వారిదే. 

ఈ విభజనలు సామాజిక జీవితాలను క్రమబద్ధం చేయడానికి మాత్రమే ఏర్పడినవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తరగతులుగా వర్గీకరింపంబడినా ఎవరి ప్రాముఖ్యత వారిదే. ఇందులో ఎక్కువ తక్కువల ప్రస్తావన హిందూ ధర్మంలో లేదు. అనాదికాల వర్గీకరణ వివరాలు ఒకసారి పునః పరిశీలిద్దాము. 

1) యజ్ఞ యాగాది క్రతువులు, తపోవనాలు, మంత్రానుష్టానాలు, శాస్త్ర మరియు జ్ఞాన పరిరక్షణ, సదాచార నియమాలు పాటిస్తూ, బోధిస్తూ జీవించేవారు *బ్రాహ్మణులు*.

2) రక్షణ, దండ నీతిని నిర్వహించే వారు.

 ప్రజా పరిపాలన నిర్వహించిన వారు *క్షత్రియులు*. 

3) వాణిజ్య వ్యాపారాలు, ధన సంబంధమైన లావా దేవీలు గరిపేవారు *వైశ్యులు*.

4) వృత్తి విద్యలతో, వస్తు ఉత్పత్తులతో, శ్రామిక వ్యవహారాలలో సమాజానికి సహకరించే వారు *శూద్రులు*. 


ఇవన్నీ విభిన్న స్థానాలే గాని విరుద్ధ స్థానాలు గావు. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువా గాదు. *ఇటువంటి సామాజిక వ్యవస్థ పరిపాలనా సౌలభ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో ఉంటుంది, ఉండి తీరుతుంది*. మన  ధర్మానికి,  సంస్కృతికి ఊపిరులూడదానికి ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించాలి.


ఈ సమాచారమంతా సర్వులకు విదితమే గదా, చర్విత చర్వణమెందుకుని ఆలోచన రావచ్చును. సామాజిక అవసరాలు, పరిపాలన, ప్రజల మధ్య  సంయమనమునకై ఉద్దేశించబడిన ఈ విభాగాలను పరదేశీయుల షడ్యంత్రాలు, కొంత మంది అన్యమతస్థుల పన్నాగాలు, వీరందరికీ వత్తాసుగా నిలిచే దేశ ద్రోహులు *ఈ విభాగాలను విభేదాలుగా వక్రీకరిస్తూ, చూపిస్తూ, వైరుధ్యాలు సృష్టిస్తూ, వైషమ్యాలకు బీజం వేస్తూ మన సమాజాన్ని కులాలు , వర్గాలుగా మరింత రెచ్చగొడుతూ   అత్యున్నత ధర్మాన్ని  చీలుస్తున్నారు, జాతిని ప్రమాదంలోనికి నెట్టుతున్నారు*. 

ఇందుకు ప్రత్యేక రుజువులు అవసరం లేదు చరిత్ర చెబుతున్నది.


*లోకో భిన్న రుచిః* అను లోకోక్తికి అనుగుణంగా హిందు జీవన విధానం... *ధర్మమా*, *మతమా* అను విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వాదన ప్రకారం హిందు మతమన్నది లేదు, ఉన్నదన్నవారికి సనాతన ధర్మం తెలియదనే చెప్పాలి అని. హిందూ ప్రాచీన జీవన శైలిని *కేవలం ఒక మతం స్థాయికి తగ్గించి, హిందూ ధర్మానికి సరిదిద్దలేని నష్టంకలిగించారని*. మరొక వాదన... *హిందూ జీవన విధానానికి మతం అను నిర్వచనాన్ని ఎందుకు తప్పుగా భావిస్తున్నారని*. అవుతే *ఇటువంటి చర్చలకు  ఇది సమయం కాదు, వేదిక కాదు కాబట్టి, ఇక్కడే ఈ చర్చకు స్వస్తి పలుకుదాము. మన దృక్పథం హైందవం వర్ధిల్లాలి* అంతే.


*కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి, హిందూ మతానికి  పునర్వైభవం తేవాలి*.


ధన్యవాదములు

*(సశేషం)*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం  - చతుర్ధశి - శతభిషం -‌‌ భౌమ వాసరే* (17.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*