5, ఏప్రిల్ 2021, సోమవారం

*What is meditation?* This was a question haunting a small boy. His parents were at wit's end, as they could not explain it in a simple language the boy could comprehend. Once the family went for a dharshan to Shri Ramana Maharishi. The boy put forward his question to Ramana Maharishi. Shri Ramana laughed to himself. Then with smiling face, he asked his devotee to serve the boy dosa from the kitchen. So, on a plain leaf, a dosa was served. Shri Ramana looked at the boy and said, " Now I will say "Hmm" Then only you should start eating. Then again I will say "hmm" After that no piece of dosa should be left on your plate." The boy agreed. He was so excited. Others were watching expectantly. Now the boy was eagerly waiting for the signal by looking at Shri Ramana's face. When he gave the signal "hmm" the boy started eating. Now his attention was on Shri Ramana. He wanted to finish dosa before the signal. The boy was eating dosa in a hurry , tearing big chunks of dosa, but, all the time keeping his attention on Shri Ramana. The dosa was reducing in size gradually. There was a small piece left. The boy was looking anxiously at Shri Ramana for the second signal. The moment he gave the signal, the boy immediately put the dosa in his mouth. Now Shri Ramana asked him " where was your attention till now? On me or on Dosa?" The boy replied " On both" Shri Ramana said" Yes. You were actively involved in finishing dosa, with your attention on me. You were not distracted at all. Like this when you do your daily activities with your attention or thoughts on God in the back ground, it is known as meditation." The two signals "hmm" are birth & death. Within these two events, one can engage in meditation, as demonstrated by Shri Ramana Maharishi. But to understand this we all need divine grace to mellow & mature. We all differ from each other and hence take different time to comprehend this great truth.🙏

 *What is *What is meditation?*


This was a question haunting a small boy. His parents were  at wit's end, as they could not explain it in a simple language the boy could comprehend.


Once the family went for a dharshan to Shri Ramana Maharishi. The boy put forward his question to Ramana Maharishi.


Shri Ramana laughed to himself. Then with smiling face, he asked his devotee to serve  the boy dosa from the kitchen. 


So, on a plain leaf, a dosa was served. Shri Ramana looked at the boy and said,

" Now I will say "Hmm" 

Then only you should start eating. Then again I will say "hmm" After that no piece of dosa should be left on your plate."

The boy agreed. He was so excited. Others were watching expectantly.  Now the boy  was eagerly waiting for the signal by looking at Shri Ramana's face. When he gave the signal "hmm" the boy started eating. Now his attention was on Shri Ramana. He wanted to finish dosa before the signal. The boy was eating dosa in a hurry , tearing big chunks of dosa,  but, all the time keeping his attention on Shri Ramana. The dosa was reducing in size gradually. There was a small piece left. The boy was looking anxiously  at Shri Ramana for the second signal. The moment he gave the  signal, the boy immediately put the dosa in his mouth. 


Now Shri Ramana asked him " where was your attention till now? On me or on Dosa?"


The boy replied " On both"


Shri Ramana said" Yes. You were actively involved in finishing dosa, with your attention on me. You were not distracted at all.

Like this when you do your daily activities with your attention or thoughts  on God in the back ground, it is known as meditation."


The two signals "hmm" are birth & death. Within these two events, one can engage in meditation, as demonstrated by Shri Ramana Maharishi. But to understand this we all need divine grace to mellow & mature. We all differ from each other and hence take different time to comprehend this great truth.🙏?*


This was a question haunting a small boy. His parents were at wit's end, as they could not explain it in a simple language the boy could comprehend.


Once the family went for a dharshan to Shri Ramana Maharishi. The boy put forward his question to Ramana Maharishi.


Shri Ramana laughed to himself. Then with smiling face, he asked his devotee to serve the boy dosa from the kitchen. 


So, on a plain leaf, a dosa was served. Shri Ramana looked at the boy and said,

" Now I will say "Hmm" 

Then only you should start eating. Then again I will say "hmm" After that no piece of dosa should be left on your plate."

The boy agreed. He was so excited. Others were watching expectantly. Now the boy was eagerly waiting for the signal by looking at Shri Ramana's face. When he gave the signal "hmm" the boy started eating. Now his attention was on Shri Ramana. He wanted to finish dosa before the signal. The boy was eating dosa in a hurry , tearing big chunks of dosa, but, all the time keeping his attention on Shri Ramana. The dosa was reducing in size gradually. There was a small piece left. The boy was looking anxiously at Shri Ramana for the second signal. The moment he gave the signal, the boy immediately put the dosa in his mouth. 


Now Shri Ramana asked him " where was your attention till now? On me or on Dosa?"


The boy replied " On both"


Shri Ramana said" Yes. You were actively involved in finishing dosa, with your attention on me. You were not distracted at all.

Like this when you do your daily activities with your attention or thoughts on God in the back ground, it is known as meditation."


The two signals "hmm" are birth & death. Within these two events, one can engage in meditation, as demonstrated by Shri Ramana Maharishi. But to understand this we all need divine grace to mellow & mature. We all differ from each other and hence take different time to comprehend this great truth.🙏

సహనావవతు

 శుభమస్తు, శుభోదయం, మన పురాతన సుసాంప్రదాయ అఖండ భారతీయ సనాతన ధార్మిక చైతన్య స్రవంతి, సకల విశ్వ జీవరాశికి సంపూర్ణ నిత్య సత్య ఆరోగ్య మార్గదర్శక స్ఫూర్తి ! నేడది నిజ నిర్ధారణాత్మకమై, సత్య చైతన్య దార్శనిక స్వరూపమై, సకల విశ్వ వ్యాప్తమై భాసిల్లుతుండ, సకల ప్రాణులందు సత్వర రోగనిరోధక శక్తి ఇనుమడింపచేసెడి వివిధమైన, అమృతతుల్యమైన ఓషధులకాలవాలమైన మన భరతఖండంలో, హిమవత్పర్వత ప్రాంతాల పరిసరాలలో అనాదిగా అలరారుతున్న అనేకానేక రకాల, సకల ఆరోగ్య ప్రదాయక సంజీవినీ మూలికలు, సంపూర్ణ ఆరోగ్య ప్రదాతలుగ ప్రతి క్షణం, విశ్వ జీవరాశి సుఖసంతోషాలకు తోడ్పడడం మనకెంతో ఆనందకరమైన మహోన్నత విషయంగ సద్భావాన్ని పంచుకుంటూ, ఈ సువిశాల విశ్వంలోని సకల చరాచర జీవజాలం అందరూ సమైక్యంగ ఆ ఓషధీ పరిమళాన్ని ఆస్వాదించడానికి, సకల మానవాళి తమ వంతు సంపూర్ణ కృషి సల్పాల్సిన సమయం ఆసన్నమైందన్న సత్యాన్ని గ్రహించి, అందరికీ సకల ఓషధులు సంపూర్ణంగ, పుష్కలంగా సమకూరేలా నిత్య సుమైత్రీ చైతన్య స్ఫూర్తివంతమైన కృషి సల్పడం నేటి తక్షణ కర్తవ్యం !                                                           🙏" సహనావవతు ! సహ నౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వి నావధీతమస్తు !మా విద్విషావహై ! "                                               🌹ఓం శాంతి శ్శాంతి శాంతిః !                                                                                           ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

నిత్యాత్ముడై యుండి

 నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు....


భావము :


- శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు


త్రైమూర్తులు = బ్రహ్మవిష్ణుమహేశ్వరులనబడు త్రిమూర్తులు; 

విగ్రహంబు = శరీరము;

ఇనచంద్రులు  = సూర్యచంద్రులు;

అవ్యక్తుడు = ప్రకాశము గానివాడు;

అద్వంద్వుండు = ద్వంద్వము లేనివాడు అద్వితీయుడు;

భువనైక హితమనోభావకుడు =  లోకమునకు ముఖ్య హితమునే మనస్సున భావించువాడు


     శ్రీవేంకటేశ్వరుడు నిత్య స్వరూపుడై యుండుట వలననే 'నిత్యుడు' అనబడి ప్రకాశించుచున్నాడు. సత్యస్వరూపుడగుటవలననే తాను 'సత్యుడు' అనబడుచున్నాడు. లోకములో ఎల్లవారికి ప్రత్యక్షమై యుండి పరబ్రహ్మముగా నున్నాడు గావుననే భక్తులచే స్తుతింపదగి యున్నాడు.  


1. ఏ దివ్యమూర్తి లోకములనెల్ల పాలించుచున్నాడో, ఎవనిని బ్రహ్మాది దేవతలెల్ల అన్వేషింతురో, ఎవడు ప్రపన్నులకు తనదైన (నిక్కమైన) మోక్షము నొసంగ జాలియున్నాడో, ఎవడు లోకమునకు ముఖ్యహితము గూర్తువాడో ఎవడు ఏ ఆకారమునూ తన ఆకారముగా కలిగియుండుట లేదో (నిరాకారుడో), ఎవడు బ్రహ్మవిష్ణుమహేశ్వరులనబడు త్రిమూర్తులు ఏకమైన మూర్తిగానున్నాడో, ఎవడు

సర్వాత్ముడో, ఎవడు పరమాత్ముడో ఆ దివ్యమూర్తియే శ్రీవేంకటగిరి నాథుడు. 


2. ఏ దేవుని శరీరమున ఈ సమస్త భువనములు పుట్టినవో, ఎవని శరీరమున ఇవన్నియు లయమగుచున్నవో, ఈ చరాచరమైన సృష్టియంతయు ఎవ్వని శరీరమో, సూర్యచంద్రు లెవ్వని నేత్రములో, ఎవడు ఈ సర్వజీవులలో అంతరాత్ముడైయున్నాడో, ఎవని చైతన్యమీ చేతనముల కెట్లనాధారమో, ఎవడు ప్రకాశముగానివాడో ఎవడు అద్వితీయుడో, ఆ దేవుడే ఈ వేంకటాచల నాథుడు. 


3. భూమి, ఆకసము ఏ వేల్పు పాదయుగ్మమో ఎవని పాదముల తుదియు, కేశముల తుదియు అంతము లేనివో, ఈ మహావాయువెవ్వని నిట్టూర్పో, పరమ భాగవతులైన ఈ పుణ్యాత్ములెవ్వనికి నిక్కమైన దాసులో, ఎవడు సర్వేశ్వరుడో, ఎవడు పరమేశ్వరుడో, ఎవడు ప్రపంచమునకు ముఖ్య హితమునే మనస్సున భావించువాడో, ఎవడు మిక్కిలి సూక్ష్మమైన వాడో, ఎవడు మిక్కిలి స్థూలమైన వాడో, ఆ దేవుడే శ్రీ వేంకటేశ్వరుడు.

మీనం, కమఠం,

 మీనం, కమఠం, వరవారాహం

నరహరి, వామన, రామం, రామం,

కృష్ణం, బుద్ధం, కల్కిమ్ విష్ణుం..

దశవిధ రూపం దర్శనభాగ్యం..


దశావతారాలకు దశ కంద కదంబం.🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


కం.

ఝషమై కరమున నిమడక

విషధిని మీనముగ నిండు విషరుహ నయనా

విషయమ్ముల నడగించుము

విషయాతీతా విలసిత విషధర శయనా!


కం.

మందరగిరిధర కచ్ఛప

కుందనపీఠా భవహర కూర్మాకారా

అందించుము కరకమలము

బందీలై యున్న యెడల భవబంధములన్!


 కం.

భూమీధర సూకరముఖ

స్వామీ క్షీరాబ్ది శయన  స్వారస్య గుణా

రోమశ నీ ఘట్టనచే

కామక్రోధాదులన్ని ఖండించుమయా!


కం.

స్తంభంబందున వెడలిన

శుంభద్జ్యోతివి నరహరి శోణిత దంష్ట్రా

దంభానల గర్వములే

కుంభినినుంభితమయినవి కొఱుకుము తండ్రీ!


కం.

అడుగొక్కటి మేదినిపై

నడుగొక్కటి నభమునంత నడుగిడ బలిపై

నడుగొక్కటి వేయుమయా

వడుగా షడ్వర్గతతుల వామన రూపా!


కం.

జనకుని పలుకుల వీనుల

వినినంతనె ఆచరించు విశ్రుత రామా!

అనితర బల విక్రమమున

గొనకొని వేయవె మదమును గొడ్డలితోడన్!


కం.

ఒక సతియే నొక రాముని

కొక బాణము, నొక పలుకట, నొక మార్గమదే

ఒకటే గద పరమాత్ముడు

ఒకటే పరమాణువందు నొక్కొక్కరిలో!


కం.

నిర్మల గీతాచార్యా

ధర్మము కొరకై వెలసిన దాక్షిణ్యనిధీ

కర్మవు కర్తవు క్రియవై

మర్మము బోధించి కృష్ణ మము బ్రోవుమయా!


కం.

సత్యమునే పలుకుమనెడు

చైత్యుని మార్గము నడచిన చైతన్యంబున్

ప్రత్యహమున ప్రత్యయమై

ప్రత్యక్షంబగును నిత్య ప్రస్థానంబున్


కం.

లోకములెల్లను పాపపు

భీకర కలి జలధి మునిగి భీతిల్లంగన్

చేకూర్చుటకై హితమును

కాకోదర శయను వచ్చి కల్క్యై తేల్చున్!


కం.

పదియవతారములందున

సదమల హృదయుని ఘనతర  సంస్తుతి జేయన్

విదళించుచు పాపమ్ముల

కుదురుగ జేయును మనసుకు కుశలమునొసఁగున్!

కొత్త . (స్టైయిన్) యొక్క 7 లక్షణాలు:

 కొత్త . (స్టైయిన్) యొక్క 7 లక్షణాలు:


1. భరించలేని నొప్పులు

2. కండ్లకలక, కళ్ళు ఎర్రబారడం

3. చర్మం మీద దద్దుర్లు

4. భరించలేని తలనొప్పి

5. చేతి లేదా కాలి వ్రేళ్ళు రంగు మారుట

6. నీళ్ల విరేచనాలు

7. గొంతు నొప్పి


దయచేసి ప్రతి ఒక్కరూ విథిగా మాస్కులు ధరించుట😷, శానిటైజర్ రాసుకొనుట🧴, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారి పై మరొకమారు యుద్ధాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తయారు చేద్దాం. సంసిద్ధంకండి

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


మన చుట్టూరా పరివేష్ఠించి ఉన్న అనంతుని సర్వవ్యాపకత్వాన్ని స్పృశించలేము, అలాగని అది లేదని అనలేము. ఎందుకంటే అది అంతటా నిండి ఉన్నది.


ఈ జీవితంలో భగవంతుడు మనకు ఏ పాత్రనూ ఇవ్వలేదనుకోవడం మహాపరాధం. భగవంతుని శక్తి మనలోనూ, మన చుట్టూ నిండి ఉంది.


అవిభాజ్యంగా ఏకమై ఉన్న ఆ పరమాత్మని సత్తా విశ్వమంతటా నిండి ఉంది. మనమంత అందులో భాగస్వాములమే! అయితే దివ్యత్వపు పరిధి మనకు దూరంగా ఉన్నంతకాలం, మనకు దాని గురించిన అసలైన జ్ఞానం కలగదు.


తీవ్రవ్యాకులత కలిగి అందులో జీవించినప్పుడే మనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించగలం.


*శుభంభూయాత్*

కర్మఫలము

 కర్మఫలము:*

🍁🍁🍁🍁🍁

అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని *దుర్వాస* మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు. “త్రేతాయుగాన  *వాలి* వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు.” అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు. 

మొగలిచెర్ల

 *విషానికి విరుగుడు..*


"ఏమైంది కొండయ్యా?..చాలా బాధపడుతున్నావు..?" అని అడిగాను.."గంట క్రితం చేతి మీద తేలు కుట్టిందయ్యా..భుజం దాకా నొప్పి పెడుతున్నది..స్వామి దగ్గరకు వచ్చేసాను.." అని చెప్పాడు..ఈ లోపల మా అర్చకస్వామి స్వామివారి సమాధి వద్ద వెలిగించిన దీపపు ప్రమీదలోని నూనె కొద్దిగా తీసుకొచ్చి..కొండయ్య కు తేలు కుట్టిన ప్రదేశం లో దానిని పూయమని చెప్పారు..కొండయ్య ఆ నూనె తీసుకొని..స్వామివారికి నమస్కారం చేసుకొని..తన చేతిమీద పూసుకున్నాడు.."పో..పోయి..ఆ మంటపం లో పడుకో..మరి కొద్దిసేపటిలో నొప్పి తగ్గిపోతుంది.." అని అర్చకస్వామి చెప్పారు.."అలాగే స్వామీ.." అని కొండయ్య వెళ్లి స్వామివారి సమాధికి ఎదురుగా ఉన్న మంటపం లో పడుకున్నాడు..అతని భార్య అతని ప్రక్కనే కూర్చున్నది..ఒక గంట కాలం గడిచింది..కొండయ్య లేచి కూర్చున్నాడు.."ఎలా ఉంది?" అని భార్య ఆతురత తో అడిగింది..నొప్పి చాలా వరకూ తగ్గిపోయిందనీ..కేవలం తేలు కుట్టిన ప్రదేశం లోనే కొద్దిగా నొప్పి పుడుతున్నదనీ కొండయ్య చెప్పాడు..మరో అరగంట తరువాత..ఆ నొప్పి కూడా తగ్గిపోయిందని చెప్పి.. తన భార్యతో కలిసి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..నా దగ్గరకు వచ్చి.."అయ్యా..వెళ్ళొస్తాను.." అన్నాడు.."సరే కొండయ్యా..జాగ్రత్త గా ఉండు.." అని చెప్పాను..


ఇటువంటి సంఘటనలు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ప్రతి వారమూ ఒకటి రెండు సార్లు చూస్తూనే ఉంటాము..తేలు కుట్టినా..పాము కరచినా..మొగిలిచెర్ల..ఆ చుట్టుప్రక్కల గ్రామాల లోని ఎక్కువ మంది గ్రామస్తులు మరే వైద్యమూ చేయించుకోరు..నేరుగా శ్రీ స్వామివారి మందిరం వద్దకు వస్తారు..అటువంటి వారు రాగానే..ఆ సమయం లో స్వామివారి మందిరం లో ఉన్న అర్చకస్వాములు..గబ గబా స్వామివారి సమాధి ప్రక్కనే వెలుగుతున్న దీపపు ప్రమిద లోని నూనె కొద్దిగా తీసుకొచ్చి..వారికి ఇచ్చి..ఆ విషపు పురుగు కుట్టిన చోట ఆ నూనె రాయమని చెపుతారు..అదొక్కటే వైద్యం..మరో గంటా..రెండుగంటల్లో..ఆ వచ్చిన వ్యక్తి తనకు నొప్పి తగ్గిపోయిందని చెప్పి..స్వామివారి సమాధికి నమస్కరించి..తిరిగి తన పనికి వెళ్లిపోతూ వుంటారు..కానీ ఒకటి రెండు  గంటల సేపు ఆ బాధ పడాలి..నొప్పి ని భరించాలి..తప్పదు..


ఇలాటి సంఘటన గురించి ఒక అనుభవాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను..పది పన్నెండేళ్ల క్రితం..విజయవాడ నుంచి మారుతీరావు గారని ఒక వ్యక్తి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆరోజుల్లో స్వామివారి మందిరం వద్ద  ఉండటానికి కనీస వసతులు కూడా లేవు..ఉన్న రేకుల షెడ్ లోనే పడుకోవాలి..లేదా స్వామివారి మందిరం లో ఉన్న ఒక్క మంటపం లోనే ఉండాలి..మారుతీరావు గారు వచ్చింది శనివారం నాడు..వారు వస్తూ వస్తూ దారిలో మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని..అక్కడినుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొగిలిచెర్ల స్వామివారి వద్దకు వచ్చారు..అదే సమయం లో మొగిలిచెర్ల ను ఆనుకొని ఉన్న నారసింహాపురం గ్రామం లో గల ఒక రెడ్డి గారి అబ్బాయికి తేలు కుట్టి..ఆ  అబ్బాయిని కూడా స్వామివారి మందిరానికి తీసుకొచ్చారు..ఆ అబ్బాయి వయసు పన్నెండేళ్ళు..నొప్పి భరించలేక ఏడుస్తున్నాడు.."ఊరుకో నాయనా..స్వామి దగ్గరకు వచ్చాము..నూనె పూస్తారు..నొప్పి తగ్గిపోతుంది.." అని ఆ పిల్లవాడి తండ్రి కుమారుడిని ఓదారుస్తున్నాడు..ఈ లోపలే అర్చకస్వామి స్వామివారి సమాధి ప్రక్కన ఉన్న దీపపు ప్రమిద లోని నూనె తీసుకొచ్చి..ఆ పిల్లవాడి తండ్రి చేతికి ఇచ్చారు..ఆ నూనె ను ఆ పిల్లవాడికి తేలు కుట్టిన చోట రాశారు..మంటపం లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు..


"ప్రసాద్ గారూ..ఇలా స్వామివారి వద్ద ఉన్న నూనె రాయడం..తేలు విషానికి అది విరుగుడు గా పనిచేయడం..అనేది నమ్మశక్యం గా లేదు..మీరేమో నిశ్చింతగా చూస్తూ వున్నారు..నా మాట విని ఏదైనా ప్రాథమిక వైద్యం అందించే మార్గం చూడండి..నాకు ఆయుర్వేద వైద్యంలోను, హోమియో వైద్యం లోనూ  ప్రవేశం ఉన్నది..మీ వద్ద కొన్ని మాత్రలు పెడతాను..ఎవరైనా ఇలా వస్తే..వారికి ముందుగా ఆ మాత్రలు ఇవ్వండి..ప్రాణహాని జరుగకుండా ఉంటుంది.." అన్నారు.."ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇక్కడ తేలు, పాము ఇట్లాటి విషపు పురుగుల బారిన పడ్డ ఏ వ్యక్తికీ ప్రాణహాని జరుగలేదు.." అని చెప్పాను.."మీరు చదువుకున్న వారు..కొంచెం ఆలోచించండి.." అన్నారు.."ఏమీ వద్దండీ..మా అందరికీ స్వామివారి మీద అపార నమ్మకం.." అని చెప్పాను..మారుతీరావు గారు ఇక ఏమీ మాట్లాడలేదు..


ఆరోజు రాత్రికి మారుతీరావు గారు నిద్ర చేసి..ఆదివారం ఉదయం స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చారు..అక్కడే ఉన్న అర్చకస్వామితో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ వున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..నిన్న రాత్రి ఈ మంటపం లోనే పడుకున్నానండీ..నిన్న తేలు కుట్టిన పిల్లవాడు కూడా రాత్రి ఇక్కడే వున్నాడు..వాడు చాలా ఉషారుగా వున్నాడు..నాకే ఆశ్చర్యం వేసింది..కేవలం స్వామివారి వద్ద ఉన్న నూనె పూయగానే తేలు తాలూకు విష ప్రభావం మాయమై పోయిందా?..రాత్రంతా ఆలోచించాను..కొన్ని విషయాలను తార్కికంగా ఆలోచించకుండా..కేవలం భక్తి తో చూడాలి అని అనిపించింది..అందుకే అర్చకస్వామి వారిని అడిగి ఆ నూనె కొద్దిగా చిన్న సీసా లో తీసుకున్నాను..నేను మీ వద్ద మాత్రలు ఉంచడం కాదు..నేనే నా వద్దకు ఇలాటి సమస్యతో వచ్చేవాళ్లకు..స్వామివారి వద్ద ఉన్న ఈ నూనెను ఇస్తాను.." అన్నారు..


మారుతీరావు గారిలో ఉన్న అనుమానం అనే విషానికి కూడా స్వామివారే విరుగుడు చూపించారు అని మాకు అర్ధం అయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మార్గదర్శకాలు

 *ICMR న్యూఢిల్లీ వారి మార్గదర్శకాలు..*


*కొన్ని చాలా ముఖ్యమైన అంశాలు*


*1. 2 సంవత్సరాల పాటు విదేశాలకు ప్రయాణాన్ని వాయిదా వేయండి ..*

*2. 1 సంవత్సరం బయట ఆహారం తినవద్దు..*

*3. అనవసరమైన వివాహం లేదా ఇలాంటి ఇతర వేడుకలకు వెళ్లవద్దు..*

*4.అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు ..*

 _*5. కనీసం 1 సంవత్సరం పాటు రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్లవద్దు ..*

*6. సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి ..*

*7. దగ్గుతూ ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి ..*

*8. ఫేస్ మాస్క్‌ను క్రమం తప్పక ఉంచండి..*

*9. ప్రస్తుతం ఒక వారం పాటు చాలా జాగ్రత్తగా ఉండండి ..*

*10. మీ చుట్టూ ఎటువంటి గందరగోళాన్ని ఉంచవద్దు ..*

*11. శాఖాహార ఆహారాన్ని ఇష్టపడండి...*

*12. ఇప్పుడు 6 నెలలు సినిమా, మాల్, క్రౌడ్ మార్కెట్‌కు వెళ్లవద్దు. వీలైతే పార్క్, పార్టీ మొదలైనవాటిని కూడా తప్పించాలి ..*

*13. రోగనిరోధక శక్తిని పెంచండి ..*

*14. బార్బర్ షాపులో లేదా బ్యూటీ సలోన్ పార్లర్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ..*

*15. * అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండండి, సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ..*

*16. కొరోనా యొక్క ముప్పు త్వరలో ముగియదు..*

*17. మీరు బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్, రింగులు, రిస్ట్ వాచ్ ధరించవద్దు. వాచ్ అవసరం లేదు.మీ మొబైల్‌కు సమయం వచ్చింది..*

*18. చేతి కర్చీఫ్ వాడవద్దు. అవసరమైతే శానిటైజర్ & టిష్యూ తీసుకోండి..*

*19. బూట్లు మీ ఇంటిలోపలికి తీసుకురాకండి. వాటిని బయట వదిలివేయండి..*

*20. మీరు బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు మీ చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేయండి..*

*21. మీరు అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని మీకు అనిపించినప్పుడు పూర్తిగా స్నానం చేయండి..*


వచ్చే 6 నెలల నుండి 12 నెలల వరకు లాక్డౌన్ ఉండే అవకాశం లేదు.అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.


దీన్ని మీ కుటుంబం & స్నేహితులతో పంచుకోండి.

_*ధన్యవాదాలు..*_


*ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూ Delhi*

https://www.icmr.gov.in/       💐💐🙏🙏🙏💐💐