విశ్వ దర్శనం, ఎన్నో ప్రత్యేకతల సమాహారం ! సృష్టిలో ప్రకృతి ఒసగెడి ఆలంబన, వర్ణనాతీతం ! ప్రాతఃకాలపు కుక్కుట నాదామృత సుస్నేహ వీక్షణం, వసుధైక కుటుంబక నిత్య స్ఫూర్తి ! విశాల విశ్వపు వాడవాడలా కలుపుగోలుతనం, భారతీయ సంస్కృతికి ప్రత్యక్ష దార్శనికత ! భారతీయ సనాతన ధార్మిక చింతన, విశ్వ సమున్నత, సమైక్య సంక్షేమాభివృద్ధికి, సుచైతన్య దివ్య ప్రకాశిక ! భారతీయ ఓషధీ సంపద, విశ్వ జీవ నిత్య సత్య చైతన్య సురక్షా మార్గ నిర్దేశక దివ్య జీవన బాట ! విద్వేషాలు, కోపతాపాలు, అసూయానుమానాలు,తేలేవెన్నటికి, నిత్య సుహృద్భావ ప్రశాంత జీవన మార్గ దృక్పథాన్ని ఈ పవిత్ర భువిపై ! సకల చరాచర విశ్వ జీవజాలపు అనునిత్య సన్మైత్రీ భావనాత్మకత, విశ్వ మానవాళికి అత్యవసర విషయం ! విశ్వ సమైక్య చింతనా మార్గ నిర్దేశకులుగా విశ్వ మానవాళి ఈ ఇలపై కలసిమెలసి నడవాల్సిన సమయం ! నేడు విశ్వ వ్యాప్తమైన విలక్షణ పరిస్థితుల దృష్ట్యా, విశ్వ సుసంక్షేమాభివృద్ధికై విశ్వ మానవాళి, తమకు సృష్టి కర్త ఒసగిన మహత్తర శక్తిని సక్రమ రీతిలో వినియోగించాల్సిన ప్రస్తుత ఆవశ్యకత ! సువ్యక్తిత్వ, సుహృద్భావ, సుచైతన్య దివ్య ప్రకాశికగా వెలుగొందేందుకై సృష్టి కర్త విశ్వ మానవాళికి ప్రత్యేక అవకాశం ఈయడం గమనార్హం ! " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! " ' ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ' ✍️గుళ్లపల్లి ఆంజనేయులు
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
18, జనవరి 2023, బుధవారం
ధర్మం/నీతి/విలువలు సంబంద 78 పుస్తకాలు
ధర్మం/నీతి/విలువలు సంబంద 78 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో
https://www.freegurukul.org/blog/dharmam-pdf/
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)