6, మార్చి 2024, బుధవారం

Panchaag


 

Abhshekam


 

లాలించవలెను

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 లాలయేత్పంచవర్షాణి,

త్రివర్షాణి చ శిక్షయేత్|

ప్రాప్తే తు  హ్యష్టమే వర్షే,

బ్రహ్మకర్మ సమాచరేత్||


తా𝕝𝕝 శిశువు పుట్టిన ఐదు సంవత్సరాల వరకు లాలించవలెను. తరువాత మూడు సంవత్సరములు అమరకోశం, శబ్దమంజరి, ధాతురూపావళి, పంచమహాకావ్యాధ్యయనం చేయించాలి. ఎనిమిదవ సంవత్సరం వచ్చేసరికి బ్రహ్మకర్మ అంటే ఉపనయనం చేయాలి. ఇది తండ్రి చేయవలసిన విధి. తరువాత వేదాధ్యయనం నిమిత్తము గురుకులానికి పంపి వేదవేదాంగాది విద్యలను గురుముఖత: నేర్పించాలి. 


ఎవరు చేస్తారు ఇదంతా ఈరోజుల్లో? 


ఎవరో నూటికో కోటికో ఉంటారు మహానుభావులు.


వారికి శతకోటి వందనములు.🙏


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

న్యూస్ రీడర్

 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో ఎడిటోరియల్ ఎగ్జిక్యూటివ్ / న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ గా పూర్తి సమయం కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేసేందుకు అర్హులైన వారి నుంచి ప్రసార భారతి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ కాల పరిమితి 2 సంవత్సరాలు. జర్నలిజంలో PG / PG డిప్లొమా వుండి, వార్తా సంస్థల్లో కానీ, ప్రచురణ సంస్థల్లో కానీ మూడేళ్ల అనుభవం ఉండి, తెలుగు, ఇంగ్లీషు భాషల తర్జుమాపై గట్టి పట్టు ఉండాలి. అలాగే ఆడియో విజువల్ మీడియంలో  ప్రజెంటేషన్ నైపుణ్యం, వినసొంపైన స్వరం ఉండటం తప్పనిసరి. 58 ఏళ్లలోపు వయసు వారై ఉండాలి. ప్రసార భారతి వైబ్ సైట్ http://applications.prasarbharati.org పై ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను newsonair.gov.in/vacancies అన్న వెబ్ సైట్ ను చూడవచ్చు.

సరదాగా నవ్వినా తప్పే

 #సరదాగా 😉


"ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి మగాడు మొహం ఉదాసినంగా ముభావంగా విచారంగా పెట్టుకుని వెళ్ళాలి లేదంటే ఇంట్లో గొడవలు అవుతాయి”అన్నాడు ఏకాంబరం.


“ఛ అదేంటి అలా అంటావు.చక్కగా హాయిగా నవ్వుతూ ఉండాలి,గృహమే కదా స్వర్గసీమ” అన్నాడు పీతాంబరం.

  

“కాదు నేను చెప్పిందే కరక్టు.కావాలంటే జరిగింది చెప్తా విను” 


“ఏడుపు మొహంతో ఇంటికెడితే భార్య ఎదురొచ్చి ఏమండి అలా ఉన్నారు అంటుంది.ఆఫీసులో ప్రాబ్లం అని చెప్పగానే అబ్బ ఎంత కష్టపడుతున్నాడు అని ఆనందిస్తుంది.

అదే నవ్వుతూ వెళ్ళామనుకో.ఆ కధ ఇలా సాగుతుంది.


భార్య: ఏమండి ఏమిటి సంగతి ఇవాళ గొప్ప హుషారుగా ఉన్నారు.?


భర్త: ఏం లేదు.!


భార్య: ఏం  నాతో చెప్పకూడదా! 


భర్త: ఏం లేదన్నాను కదా! 


భార్య: నాకుతెలుసులెండి, దార్లో ఎవరైనా టక్కులాడి లిఫ్ట్ అడిగి ఉంటుంది. 


భర్త: అదేంలేదే బాబు, ఆఫీసులో ఈ రోజు సరదాగా గడిచింది అందుకని. 


భార్య: ఏముంది మీ రిసెప్షనిస్టు మిమ్మల్ని చూసి పళ్ళికిలించి ఉంటుంది. 


భర్త: అదేం లేదు అంటే వినవేం!  అయినా ఆవిడ అలాంటిది కాదు.


భార్య: ఆహా! అంతవరకూ వచ్చిందా ఆవిడ మీద ఈగ వాలనివ్వట్లేదు మీరు.


భర్త: ఆవిడ అలాంటిది కాదు అన్నానా-దానికి పెడర్ధాలు తీస్తావేం?


భార్య: అబ్బో!ఆవిడ మహా గొప్పది,నేనే పెడర్ధాలు తీసేదాన్ని!


భర్త: ఎక్కడినుంచి ఎక్కడికి లింకులు పెట్టేస్తావే?


భార్య: అవునుమరి నేను లింకులు పెట్టేదాన్ని అదిమాత్రం  మహా సాధ్వి.


భర్త: ఛ!సరదాగా నవ్వినా తప్పే ఈ కొంపలో.


భార్య: అవును మరి మీకు మీ పిల్లలికి గొడ్డుచాకిరి చేస్తున్నాను కదా ఇది కొంపలాగే ఉంటుంది మీ కంటికి 


భర్త: అంటే నువ్వే కష్టపడుతున్నావా? నేను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించడం లేదా!


భార్య: మహా కష్టపడి పోతున్నారు.కష్టపడే వాడికి పొద్దున్నే స్ప్రేలు సెంట్లు ఎందుకో!


భర్త: నేనో ఆఫీసరుని . నీట్ గా తయారవడం కూడా తప్పేనా!


భార్య: అవును మీరేమో పెద్ద ఆఫీసరు.నేను కూలిదాన్ని.ఇంకెందుకు ఈ కూలిదాని ఇంటికి రాకండి!


భర్త: దినమ్మ జీవితం ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బలు ఛ!


భార్య: ఈ ఏడుపుమొహం దానితో ఇంకెందుకు నేను మా పుట్టింటికి పోతాను మీరు హాయిగా కులకండి!


భర్త: పోతే పో ఏం బెదిరిస్తున్నావా? 


భార్య: నేనెందుకు పోతాను?మీ అంతు దాని అంతు చూడకుండా పోను


భర్త: (ఏడుపుమొహం పెట్టి)ఇంకఆపవే ఏమిటి ఈగోల పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో


భార్య: (భర్త మొహంలో ఏడుపుచూసిన ఆనందంలో)రండి భోజనం వడ్డిస్తా.


ఫ్రెండ్స్ ఇక మీఇంటికి మీరెలా‌ వెళ్తారనేది మీ ఇష్టం 😋😂😆😉😁

శ్రీ సూర్య దేవాలయం

 🕉 మన గుడి : నెం 247


⚜ ఝార్ఖండ్  : బుండు -రాంచీ


⚜ శ్రీ సూర్య దేవాలయం



💠 ఈ ప్రముఖ సూర్య దేవాలయం రాంచీ- బొందు సమీపంలో ఉంది, ఇది సూర్యుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయ సముదాయం.


💠18 చక్రాలు మరియు 7 సహజసిద్ధమైన గుర్రాలు ఈ ఆలయంలో భారీ రథం రూపంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో శివుడు, పార్వతి మరియు గణేష్ వంటి అనేక ఇతర దేవతలు కూడా ఉన్నారు.


💠 ఈ ఆలయాన్ని సంస్కృతి విహార్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ నిర్మించింది. 

స్వామి శ్రీ వాసుదేవానంద సరస్వతి 24 అక్టోబర్ 1991న శంకుస్థాపన చేశారు మరియు 10 జూలై 1994న స్వామి శ్రీ వామదేవ్ జీ మహారాజ్ ప్రాణ ప్రతిష్ఠ చేపట్టారు.

యాత్రికుల కోసం ధర్మశాల కూడా నిర్మించబడింది.  

సూర్య భగవానుని ఆరాధించడం కోసం భక్తులు ఛత్ పూజ సమయంలో స్నానం చేసే చెరువు కూడా ఉంది


💠 18 చక్రాలు మరియు 7 గుర్రాలతో గొప్ప రథం రూపంలో రూపొందించబడిన సూర్య దేవాలయం ఒక అద్భుత దృశ్యం.  

ఈ ప్రత్యేకమైన నిర్మాణ రూపకల్పన సూర్య భగవానుడు రథాన్ని నడుపుతున్నట్లు సూచిస్తుంది, ఇది వారంలోని ఏడు రోజులు మరియు కాంతి యొక్క ఏడు రంగులను సూచిస్తుంది.  

ఈ ఆలయ సముదాయంలో శివుడు, పార్వతి మరియు గణేశుడు వంటి అనేక ఇతర దేవతలు కూడా ఉన్నారు.  చుట్టుపక్కల ఉన్న పచ్చని పచ్చిక బయళ్ళు ఆలయ ఆకర్షణను పెంచుతాయి, సందర్శకులకు నిర్మలమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.


🔅 చరిత్ర 🔅


 💠 సూర్య దేవాలయం అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ముఖ్యంగా ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతంలోని చాత్ వ్రతాలకు.

హిందూమతంలో సూర్య భగవానుడి ఆరాధనకు గొప్ప చరిత్ర ఉంది, పురాతన గ్రంథాలు, కళలు మరియు రామాయణం మరియు మహాభారతం వంటి ఇతిహాసాలలో ప్రస్తావనలు ఉన్నాయి.  

అయితే, మధ్యయుగ కాలంలో, ముస్లిం ఆక్రమణదారులు సూర్య దేవాలయాలను ధ్వంసం చేయడం వల్ల సూర్యుని ఆరాధన క్షీణించింది.


💠 మధ్యయుగ కాలంలో, ప్రజలు పగటిపూట బ్రహ్మ దేవుడితో పాటు సూర్యుడిని, మధ్యాహ్నం శివుడిని మరియు సాయంత్రం విష్ణువును పూజించేవారు. 

కొన్ని ప్రాచీన గ్రంధాలు మరియు కళలు సూర్యునికి గణేశుడు, ఇంద్రుడు మొదలైన ఇతర దేవుళ్ళతో ఆరాధింఛాయి.

సూర్యుని దేవుడిగా ఉండటం బౌద్ధ మరియు జైన సాహిత్యంలో కూడా కనిపిస్తుంది.


💠 సూర్యుడు రామాయణంలో శ్రీరామునికి మరియు మహాభారతంలో కర్ణుని వంశ పితగా చిత్రీకరించబడ్డాడు.

సూర్యుడు చాలా ప్రత్యేకమైన వేద దేవుళ్ల కంటే ఎక్కువ కాలం హిందూమతం యొక్క ప్రధాన దేవుడిగా కొనసాగాడు. అయినప్పటికీ, 13వ శతాబ్దంలో ముస్లింలు ఉత్తర భారతదేశంలోని సూర్య దేవాలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించినప్పుడు ప్రజలు సూర్యుడిని ఆరాధించడం మానేశారు. 

ఇప్పటికీ కొన్ని సూర్య దేవాలయాలు కొనసాగుతున్నాయి కానీ వాటిలో చాలా వరకు పూజలను అనుమతించవు.

సూర్య యొక్క వ్యుత్పత్తి వైరుధ్యం యొక్క అంశం. 


💠 బొందు సూర్య దేవాలయంలో ప్రతి సంవత్సరం జనవరి 25 మరియు 26 తేదీలలో చారిత్రక తుసు జాతర నిర్వహించబడుతుంది.  ఈ జాతర గత 25 సంవత్సరాలుగా మకర సంక్రాంతి ముగింపు సందర్భంగా జరుగుతుంది.  జాతరను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు


💠 ఈ జాతరలో ఎంబ్రాయిడరీ, కత్తి, దుప్పటి మొదలైన నిత్యజీవితంలో ఉపయోగించే అనేక వస్తువులు మరియు పెద్ద ఊయలలు, నృత్యం, పిల్లలు మరియు పెద్దల కోసం ఇతర బహుళ వినోద సాధనాలు కనిపిస్తాయి.


💠 సూర్య మేళా కాకుండా, ఛత్ మహాపర్వ శుభ సందర్భంగా ఇక్కడ ఛత్ మేళా కూడా జరుగుతుంది.

ఝార్ఖండ్ మరియు పొరుగు రాష్ట్రాల నుండి యాత్రికులను ఆకర్షిస్తూ, ఛత్ పండుగ సమయంలో సూర్య దేవాలయం సజీవంగా ఉంటుంది.  

ఈ పండుగ సమయంలో, ఆలయం లైట్లు మరియు కొవ్వొత్తులతో అందంగా అలంకరించబడి, ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  


💠 భక్తులు ఆలయం వద్ద గుమిగూడి సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసే ముందు పక్కనే ఉన్న పవిత్ర చెరువులో పవిత్ర స్నానం చేస్తారు.  ఈ ఆచారం ఆత్మను శుద్ధి చేయడానికి మరియు పాపాలను కడగడానికి సహాయపడుతుందని నమ్ముతారు.


💠 సూర్య దేవాలయం దగ్గర చెరువులో ఛత్ మహాపర్వ్ శుభ సందర్భంగా, చాలా మంది భక్తులు ఈ చెరువులోని సూర్య భగవానుడికి అర్ఘ్యము సమర్పిస్తారు.


💠  ఇది జార్ఖండ్ రాజధాని నగరం రాంచీకి సుమారు 40 కి.మీ దూరంలో కొండపైన ఉంది.

ఆవకాయ

 “ఆవకాయ “ 

కలిపెడిది ఆవకాయట😀😀😀


ఆవకాయ మీద తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉద్భవించింది.


ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామ గారట మరి నే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా


కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!


కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు  కాడోయ్!


కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!


ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్


ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ  మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!


మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ  మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది


చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి  ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి  కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే


అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.


పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆశ్వాదించండి.

దీనత్వం అనేది చాలా ఎక్కువ

 *సుభాషితం*

*---------------*

🌺 *అప్రార్ధితాని దుఃఖాని*

     *యథైవాయాంతి దేహినాం ౹*

     *సుఖాన్యపి తథా మన్యే*

     *దైన్యమాత్రాతిరిచ్యతే ౹౹*. 🌺

     

   *బావం ; కోరుకోక పోయినా దుఃఖాలు ఎలా వెతుక్కొని వస్తాయో అలా సుఖాలు కూడా వస్తాయి అని తెలుసుకోవాలి.దుఃఖంలో దీనత్వం అనేది చాలా ఎక్కువ.*

🌺✍🏽

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

**********

06-03-2024

సౌమ్య వాసరః బుధవారం 

 రాశి ఫలితాలు

*****

మేషం

ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.  సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాలు నుండి విముక్తి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

వృషభం

ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు.

---------------------------------------

మిధునం

దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఋణ ఒత్తిడి వలన శిరోభాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

---------------------------------------

కర్కాటకం

మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.  ఉద్యోగాల్లో అధికారుల  ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు  మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

సింహం

అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

కన్య

బంధు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు  మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

---------------------------------------

తుల

ఉద్యోగమున బాధ్యతలు సరిగా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువులు విషయంలో  జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు.

---------------------------------------

వృశ్చికం

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.  వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన  వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

--------------------------------------

ధనస్సు

అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి ఊహించని ధన  సహాయం  అందుతాయి.

---------------------------------------

మకరం

ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది.  ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. వృత్తి బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

---------------------------------------

కుంభం

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సంతానం విద్యా విషయాల సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

---------------------------------------

మీనం

ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృధా పెరుగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు.

---------------------------------------

*గమనిక* :౼

మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

సంకల్పము

 *శుభోదయం*

16.2291923113

Xxxxxx

సంధ్యా వందన 

మరియు ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.06.03.2024

బుధ వారం (సౌమ్య వాసరే) 

****************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే కృష్ణ పక్షే

ఏకాదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య  వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే

శిశిర ఋతౌ 

మాఘ మాసే 

కృష్ణ పక్షే  ఏకాదశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.20

సూ.అ.6.03

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

శిశిర ఋతువు

మాఘ మాసం 

కృష్ణ పక్షం ఏకాదశి రా. 12.27 వరకు. 

బుధ వారం. 

నక్షత్రం పూర్వాషాఢ ప.10.48 వరకు. 

అమృతం తె.3.41 ల 5.13 వరకు. 

దుర్ముహూర్తం ప. 11.48 ల 12.35 వరకు. 

వర్జ్యం రా. 6.28 ల 8.00  వరకు. 

యోగం వ్యతీపాత ఉ.7.55 వరకు.  

యోగం వరీయాన్ తె. 5.13 వరకు. 

కరణం బవ మ.1.05 వరకు.  

కరణం బాలవ రా.12.27 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

*************

పుణ్యతిధి మాఘ బహుళ ఏకాదశి. 

************

గమనిక* :౼

మా సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

బ్రాహ్మణ పరిచయ వేదిక  *పరిచయం - పరిణయం*

*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి

*80195 66579/98487 51577*.

*************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏#

దుఃఖించకూడదు

 శ్లోకం:☝️

*ఏకవృక్షసమారూఢా*

  *నానావర్ణా విహంగమాః |*

*ప్రభాతే దీక్షు దశసు*

  *యాంతి కా తత్ర వేదనా ||*

 

భావం: రాత్రి అనేక రకాల పక్షులు చెట్టుపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటాయి కానీ ఉదయం అవి మొత్తం పది దిక్కులకు ఎగురి పోతాయి. దానికి మనం గాని చెట్టు గాని ఎందుకు విలపించాలి? (అదే విధంగా, మన ప్రియమైన వారి నుండి వియోగం కలిగినప్పుడు కూడా మనం దుఃఖించకూడదు).

పంచాంగం 06.03.2024

 ఈ రోజు పంచాంగం 06.03.2024 Wednesday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస కృష్ణ పక్ష: ఏకాదశి తిధి సౌమ్య వాసర: పూర్వాషాఢ నక్షత్రం వ్యతీపాత యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి రా.తె 04:12 వరకు.

పూర్వాషాఢ మధ్యాహ్నం 02:45 వరకు.

సూర్యోదయం : 06:35

సూర్యాస్తమయం : 06:20


వర్జ్యం : రాత్రి 10:09 నుండి 11:38 వరకు. 


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:04 నుండి 12:41 వరకు.


అమృతఘడియలు : పగలు 10:11 నుండి 11:42 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

సామూహిక ఉపనయనములు

: *బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్* 

గాయత్రి భవన్, సచివాలయనగర్,వనస్థలిపురం,హైదరాబాద్-70

🕉️🕉️


 *సామూహిక ఉపనయనములు*


 *తేది 30.3.24* 

ఫాల్గుణ మాసం, పంచమి, శనివారం. ఉ.9.42 గం లకు


 *వేదిక* 

రామాలయం,గురుద్వారా ప్రక్కన, వనస్థలిపురం, హైదరాబాద్


 *ప్రవేశ రుసుము* ₹ 3000.

ముగ్గురికి భోజనం ఏర్పాటు చేయబడును.

అదనపు భోజనం ఒక్కొక్కరికి ₹150.

(క్రింద పంపుతున్న q r కోడ్ స్కానర్ ద్వారా రుసుము,అసోసియేషన్ ఖాతాలో జమచేసి, వివరములు ,స్క్రీన్ షాట్,వాట్సాప్ ద్వార *6302454218* కు పంప వలయును.)


దీక్షా వస్త్రములు, పూజా సామాగ్రి అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది.


పంచ శిఖలకు ఏర్పాటు కలదు.


 *నమోదుకు చివరి తేదీ* 25.3.24


 *కావలసిన వివరములు* 

వటువు పేరు

తండ్రి పేరు

వటువు వయస్సు

గోత్రం

చిరునామా

పోన్ నెంబరు.


ఇతర వివరములు కావలసినవారు వాట్సాప్ ద్వారా *6302454218* కు తెలియ చేయవలయును.


ఇట్లు

చింతపల్లి మంగపతి రావు

గౌరవ అధ్యక్షులు


పోచంపల్లి శ్రీధర్ రావు

అధ్యక్షులు


నందిరాజు లక్ష్మీ నారాయణ

కార్యదర్శి.


🕉️🕉️

[2/1, 06:40] Lakshmi Narayana Nandiraj: పై మెసేజ్ మీ యితర గ్రూపులకు పంపగలరు.


Kindly send the above message to brahmin groups.


Secretary

తాత్కాలిక కష్టాలు..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*తాత్కాలిక కష్టాలు..*


"ఆ స్వామివారిని పూర్తిగా నమ్మి కొలుస్తున్నాము..కష్టమొచ్చినా..సుఖమొచ్చినా...ఆ స్వామి దయ అని భావిస్తున్నాము.."


సర్వ సాధారణంగా చాలా మంది భక్తులు నాతో చెప్పే మాట ఇది..కానీ సుఖాన్ని ఆస్వాదించినంత ఆనందంగా కష్టాన్ని ఓర్చుకోలేరు..చిన్న కష్టం కలగగానే.."శ్రీ స్వామివారిని ఇంతగా పూజిస్తున్నామే..మా కెందుకీ పరీక్ష పెట్టాడో..?" అని సంసాయాత్మక బుద్ధిని బైట పెడుతుంటారు..ఇది మానవ నైజం..సర్వకాలసర్వావస్థలయందూ ఒకే రీతిని స్పందించేవారు బహు అరుదుగా వుంటారు..అటువంటి వారే నిజమైన భక్తులు..వారు సుఖ దుఃఖాలను రెండింటినీ సమంగా చూస్తారు..రెండూ ఆ స్వామివారి ప్రసాదం గానే భావిస్తారు..


సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రిందట..దంపతులిద్దరు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఇద్దరూ అరవై ఏళ్ల పైబడిన వారే..నెల్లూరు ప్రాంతం వారు..శ్రీ స్వామివారికి అత్యంత భక్తులు..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన చేసే రోజుల్లోనే దర్శించుకొని ఆశీర్వాదం పొందివున్నారు.. శ్రీ స్వామివారు మొగలిచెర్ల లో ఆశ్రమం నిర్మించుకొని, తన సాధన కొనసాగిస్తున్న కాలంలో రాలేక పోయినా..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి, సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళుతూవుండేవారు..అన్నదానం అంటే ఆ దంపతులకు మహా ఇష్టం..శ్రీ స్వామివారి దగ్గర అన్నదానానికి ప్రతిసారీ విరాళం ఇచ్చేవారు..


వారికి మొత్తం ముగ్గురు సంతానం..ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల..అందరూ చక్కగా చదువుకున్నారు..మంచి ఉద్యోగాల్లో వున్నారు..వివాహాలూ జరిగాయి..ఏ రకంగానూ పిల్లల గురించి చింత పడాల్సిన అవసరం లేదు..తాము శ్రీ స్వామివారిని మొదటిసారి దర్శించుకున్న రోజే..శ్రీ స్వామివారు.."అంతా మంచి జరుగుతుంది..శుభం.." అని ఆశీర్వదించారనీ..ఆరోజు నుంచీ.. తమకు కానీ..తమ పిల్లలకు కానీ..ఎటువంటి ఇబ్బందీ కలుగాలేదనీ..చెప్పుకుంటారు..రెండోసారి శ్రీ స్వామివారిని కలిసినప్పుడు.."కష్ట సుఖాలు అనేవి..పగలు రాత్రి వంటివి..వస్తూ పోతూ ఉంటాయి..రెండింటినీ సమంగా చూడండి.."అన్నారట..ఆ మాట వాళ్ళిద్దరి మనసులో హత్తుకుపోయింది..


ఈసారి వాళ్లిద్దరూ శ్రీ స్వామివారి మందిరానికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది..ఆ భార్యాభర్త లలో ఆవిడకు ఆరోగ్యం దెబ్బతిన్నది..డాక్టర్లు పరీక్షలు చేసి..ఆవిడ కాన్సర్ తో బాధ పడుతున్నదనీ.. మరో ఐదారు నెలల సమయం మాత్రం ఉందనీ..ఆపైన ఆవిడ బ్రతకడం కష్టమని చెప్పారు..బాధ్యతలు అన్నీ తీరిపోయాయి అని తెలిసినా..ఎవరూ మృత్యువును ఆహ్వానించరు.. ఇంకొంత కాలం జీవించి ఉండాలనే కోరుకుంటారు..కానీ ఆ దంపతులు అట్లా ఆలోచించలేదు... తమ జీవితాలు చరమాంకంలో ఉన్నాయనీ.. ఇంతకాలం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా..మొత్తమ్మీద సంతృప్తి కరమైన జీవితాన్ని గడిపామనీ..శ్రీ స్వామివారు తమతో కష్ట సుఖాలను సమంగా చూడమని చెప్పారు కనుక..ఇప్పుడొచ్చిన ఈ వ్యాధి తాలూకు బాధను కూడా సంతోషంగానే స్వీకరిస్తాననీ ఆవిడ తెలిపారు..ఆ దంపతుల ముఖంలో ఎటువంటి విచారమూ లేదు..ఎప్పటిలాగే శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని..మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..అంత కష్టం లోనూ అన్నదానానికి విరాళం ఇచ్చారు..


తమ ఊరికి బైలుదేరేముందు నా దగ్గరకు వచ్చి.."ఎప్పుడు మృత్యువు వచ్చినా సంతోషమే..కాకుంటే నేను పోయిన తరువాత ఈయన ఇబ్బంది పడతారు..అదొక్కటే నా బాధ..ఈ వయసులో ఒకరికొకరం తోడుగా వున్నాము..తాను ఒంటరి తనం తో బాధ పడతారేమో నని నాకున్న ఒకే ఒక్క ఆలోచన..అంతకు మించి ఇంకేమీలేదు.." అని ఆవిడ చెప్పింది..అదేసమయం లో ఆయన అందుకొని.."ప్రారబ్ధాన్ని తప్పించుకోలేము..అంతా ఆ స్వామి దయ..చూద్దాం..ఆయనదే భారం.." అన్నారు..


ఆ తరువాత ఆ దంపతులు అప్పుడప్పుడూ మందిరానికి వస్తూనే వుండేవారు.. ఆరునెలల కంటే సమయం లేదని చెప్పిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా.. మరో ఐదారేళ్ళ పాటు ఆవిడ హాయిగా వున్నది.. "శ్రీ స్వామివారు చెప్పినట్టు..ఆ కాన్సర్ అనే కష్టం కూడా తాత్కాలికంగా వచ్చి వెళ్లిపోయిందేమో ప్రసాద్!.." అని నాతో ఆయన పలుమార్లు చెప్పేవారు..ఒక సంవత్సరం క్రిందట ఆ దంపతులిద్దరిలో ..ముందుగా ఆయన.. ఆ తరువాత మరో ఇరవై రోజుల కల్లా ఆవిడా కన్నుమూసారు..మరణం లోనూ ఎక్కువకాలం ఎడబాటు లేదు ఇద్దరిమధ్యా..


శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తీ..విశ్వాసం తో పాటు స్థితప్రజ్ఞత కూడా వాళ్లకు అంతకాలం పాటు రక్షగా ఉన్నది..పుణ్యదంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగాసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -‌  ఏకాదశి - పూర్వాషాఢ  -‌ సౌమ్య వాసరే* (06.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/oL6WMTl7TPA?si=Bpabl5_G2YBn_o64



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విష - ప్రతివిషములు

 విష - ప్రతివిషములు .


      సాధారణముగా మనం తీసుకునే పదార్థాలు కొన్నిసార్లు విషముగా మారి మనిషిని తీవ్ర అస్వస్థతకు గురిచేయవచ్చు. ఒక్కొకరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. మనుష్యుల రోగాలకు ప్రధానమైన కారణం మనం తీసుకునే ఆహారమే . అతి ఆహారం లేదా విరుద్ధ ఆహారం ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు . కావున తీసుకునే ఆహారం మరియు ఏదన్నా సమస్య వచ్చినపుడు దానికి విరుగుళ్లు తెలుసుకొవడం కూడా ఎంతో అవసరం . అలానే మరొక్క విషయం మీరు సంపూర్ణ ఆరొగ్యవంతులుగా ఉండాలి అనుకుంటే ముందు మీరు తీసుకునే ఆహారం లో తగిన మార్పులు అనగా అప్పటికప్పుడు వండిన ఆహారం మాత్రమే తినండి అలానే అప్పుడప్పుడు కొంచం ఉపవాసాలు చేస్తూ జీర్ణవ్యవస్థకు కొంచం విరామం ఇవ్వడం మంచిది . ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఇది పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. " త్రికాలభోజనే మహారోగి , ద్వికాల భోజనే మహా భోగి , ఎకకాల భోజనే మహాయోగి " అని పురాతన గ్రంథాలలో ఉన్నది. అదేవిధంగా కడుపు నిండగా పీకల వరకు తినవద్దు . మీయొక్క ఉదరం యొక్క కొలతలో సగభాగం వరకు మాత్రమే ఆహారం తీసుకొండి పావు వంతు నీరు తాగవలెను. మిగిలిన సగభాగం వాయుప్రసారానికి అణుగుణంగా ఖాళీగా ఉంచండి. ఇప్పుడు మీకు ఆహారపదార్థములు వాటి విరుగుళ్ల గురించి వివరిస్తాను.


 * అటుకులు - సైన్ధవ లవణం.


 * అతి పులుసు - బెల్లం , పంచదార.


 * అనుములు - మంచి గంథం .


 * ఆవాలు - ఉశిరికపప్పు .


 * ఇంగువ - మంచి జీలకర్ర , ఉప్పు .


 * ఉమ్మెత్త - చింతపులుసు , తామర పువ్వులు .


 * ఉమ్మెత్త గింజలు - నిమ్మరసం , జీలకర్ర.


 * ఉప్పు - జీలకర్ర.


 * ఉడుగ - కరక్కాయలు .


 * కంద - తమలపాకు .


 * కర్పూరం - గుంటకలగర .


 * కోడిమాంసం - పుల్లటి పెరుగు , నిమ్మ రసం.


 * కొబ్బరి - బియ్యము .


 * గంజాయి - నిమ్మరసం , ఉల్లిపాయ.


 * గన్నేరు - కరక్కాయలు .


 * గంధకం - చెరుకు రసం.


 * గుమ్ముడు - మజ్జిగ .


 * గురువింద - నెయ్యి.


 * గోరింటాకు - తానికాయ.


 * గోధుమపిండి - ఉల్లిగడ్డ , దోసకాయ .


 * చింతకాయ - పసుపు .


 * చింతపండు - ఉప్పు , ఉల్లిగడ్డ.


 * జిల్లేడుపాలు - నీలియాకు , చంచలాకు .


 * జిల్లేడు ఆకు - ఉప్పిపండ్లు .


 * జీడి - దూలగోవిల. 


 * జీడిగింజ - మోదుగుపువ్వు , కొబ్బరినూనె .


 * జీర్ణం కాని అన్నం - వాము , ఉప్పు , ఆవాలు .


 * జెముడుపాలు - తంగేడు ఆకు .


 * తాంబూలం వల్ల పొక్కిన - చింతపండు కొబ్బరి.


 * త్రికటుకములు - బియ్యపు కడుగు.


 * తెలకపిండి - నూనె .


 * తేనె - మంచినీరు.


 * నల్లమందు - అల్లం , బాదం , ఆవునెయ్యి.


 * నిమ్మపండు - ఖర్జురపు కాయ .


 * నూనె - తెల్ల గలిజేరు రసం.


 * నెయ్యి - వేడినీరు .


 * నేరేడుపండ్లు - పాలు .


 * నేపాళం - వస మాడ్చిన మసిని మరగకాచిన నీటిలో కలిపి గంటగంటకు తాగించవలెను . మజ్జిగ అన్నం మాత్రమే ఇవ్వవలెను.


 * పనస పండు - శొంటి .


 * పాషాణాలు - పమిడిపత్తి రసం.


 * పెరుగు - ఉప్పు , పంచదార , వేడినీరు .


 * పొత్తిదుంప - శొంటి.


 * బెల్లము - పెసలు , గేదె పెరుగు , మజ్జిగ .


 * మజ్జిగ - చిల్లగింజ .


 * మినప పిండి - ఉప్పు , అల్లం .


 * విషముష్టి - నేరేడు , మొగలి .


 * వత్సనాభి - చిర్రివేళ్ళు , మజ్జిగ , మేకమూత్రం .


 * శనగ పిండి - మంచి జీలకర్ర , ఉప్పు .


 * సున్నము - తిప్పతీగ , పసుపు .


     

        పైనచెప్పిన విధముగా ఆహార పదార్థాలు మరియు వాటి విరుగుళ్లు గురించి తెలుసుకొవడం చాలా మంచిది .


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     

     కాళహస్తి వేంకటేశ్వరరావు  


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


        9885030034

మూడు ధాతువులు

 మానవశరీరం నందలి మూడు ధాతువులు గురించి సంపూర్ణ వివరణ  -


   మానిషి యొక్క శరీరం నందు ప్రధాన పాత్ర వహించునవి మూడు ధాతువులు అవి .


 1 . వాతం 2 .పిత్తం. 3 . శ్లేష్మం .


    మనిష్యుని యొక్క తల భాగం నుంచి రొమ్ము భాగం వరకు శ్లేష్మ సంబంధ శరీరం ఉండును.  రొమ్ము క్రింద నుంచి నడుము పైభాగం వరకు ఉండునది పిత్త శరీరం . నడుము క్రింద బాగం నుంచి పాదాల వరకు ఉండునది వాత శరీరం.  ప్రతి ఒక్కరిలోనూ ఇదే విధముగా ఉండును.  అవి తమయొక్క స్థానాన్ని దాటి ప్రకోపించినప్పుడు మనుష్యునికి ఆయా సంబంధ వ్యాధులు కలుగును. అనుభవం గల వైద్యుడు సరిగ్గా సమస్యని గుర్తెరిగి వైద్యం చేయవలెను .


      ఇప్పుడు ఈ మూడు ధాతువులు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.


 *  వాతము - 


           కన్ను మూసి తెరవాలి అన్నను , ముక్కుతో శ్వాస పీల్చి వదలాలి అన్నను, కాళ్ళు చేతులు కదల్చాలన్న , రక్తం శరీరం అంతా ప్రవహించాలన్న , జీర్ణక్రియ సంపూర్ణంగా జరగాలన్నా వాయువు సహాయం కావలెను.  ఇక్కడ వాతమునకు మరొక పేరే వాయవు. శరీరంలో నాడుల ద్వారా ఈ క్రియలు అన్నియు జరుగును. ఎప్పుడైనా ఈ క్రియలలో ఆటంకం కలిగి నొప్పులు వచ్చాయి అంటే అది పూర్తిగా వాతసంబంధమైన సమస్యగా పరిగణించాలి.


            ఈ వాతం శారీరక క్రియలనే కాకుండా మానసిక క్రియలను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక మనిషి అతిగా ఆలోచించడం మరియు పిచ్చిపట్టడానికి కూడా ఈ వాతమే కారణం. శరీరంలోని వాతం విపరీతంగా ప్రకోపించి తలకు ఎక్కినప్పుడు మనుష్యునికి పిచ్చిపట్టును. తీవ్రమైన భాధ, విచారం కలిగి ఉండును. ఆయుర్వేద గ్రంధాలలో వాతం యొక్క హెచ్చుతగ్గులు వలన కలిగే రోగాలను 80 రకాలుగా వివరించారు. వాటిని అశీతివాతాలు అంటారు.  ఈ వాత వ్యాధులను నయం చేయాలి అంటే నాడుల్లో ఉండే మాలిన్యాలను తొలగించే ఔషధ సేవన అత్యుత్తమం .


 *  పైత్యం -


           పిత్తమునే పైత్యంగా వ్యవహరిస్తారు .  మనము తీసుకున్న ఆహార పదార్ధాలు అన్ని జీర్ణం కావాలంటే వేడి అవసరం . దేహము నందు ఉండే మాలిన్యాలు అన్నింటిని బయటకు వెడలించుటకు కూడా వేడి అవసరం . శరీరం నందు ఉండు మాలిన్యాలను దహించుటకు కూడా పిత్తం ఎంతో అవసరం . ఈ పిత్తం దేహాన్ని చురుకుగా , చలాకీగా ఉంచుటకు కూడా అవసరం. దేహము యెక్క వేడి నందు హెచ్చుతగ్గులు కలిగినను , భాధలు కలిగినను పైత్యం యొక్క పరిమితిలో సమస్యలు మొదలు అయినవని గ్రహించాలి.


                 ఆకలి లేకున్నను , మితము తప్పిన ఆకలి ఉన్నను , మలమూత్రాదులు ఎక్కువ ఉన్నను, లేకున్నను , చెమట ఎక్కువ పోసినా , పొయ్యకున్నను అది పైత్య సంబంధ సమస్యగా గుర్తించాలి. పైత్యం అనగా అగ్నిసంభంధమైనది. దేహములో ఎక్కడైనను మంటలు పుట్టినాయి అంటే అది ఖచ్చితంగా పైత్య ప్రభావంగా  గుర్తుంచుకోవాలి. దేహంలో యే భాగమైనా కాంతి 

తగ్గినను, దేహంలో ఎక్కడైనా గడ్డకట్టినను జరిగింది అంటే అది పైత్యం తక్కువ కావడం వలన సంభవించిందిగా భావించాలి. దేహం పైన ఎక్కడైనా కురుపు లేచింది అంటే శరీరంలో పైత్యం పెరిగింది అని తెలుసుకోవలెను.  ఈ పైత్య వ్యాధుల నివారణ కొరకు శరీరంలో ఉండు వేడిలో హెచ్చుతగ్గులు లేకుండా సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి.


 *  శ్లేష్మము  -


           మనము తినిన ఆహారం అంతయు జీర్ణావయవముల యందు వచనమై రసముగా మారును. ఈ రసముకే ఆంగ్లము నందు "లింఫ్ " అందురు. జీర్ణశయం నందలి కోట్లాదిగా వ్యాపించి ఉన్న శోషరసకేశ నాళికలు ద్వారా ఈ రసం స్వీకరించబడి శోషరస వాహికలలో చేరుచున్నది.దేహము నందు రక్తనాళాలు ఎట్లు వ్యాపించి ఉండునో ఈ శోషరస వాహికలు దేహమంతా వ్యాపించి ఉండును. ఈ రస వాహికలకు శ్లేష్మరస వాహికలు అని పేరు .


            మన శరీర కదిలికల వలన శరీరం నందలి అతిగా వేడి పుట్టకుండా కాపాడునది ఈ శ్లేష్మము  యంత్రం పనిచేయునప్పుడు యంత్రభాగాల యందు వేడి జనించకుండా కందెన ఎలా ఉపయోగపడునో అదేవిధంగా శ్లేష్మం పనిచేయును. శరీరం నందు శ్లేష్మం తక్కువైనచో శరీరభాగాలు తీవ్రవేడికి గురి అగును.  హెచ్చుతగ్గులు లేని శ్లేష్మం వలన శ్వాసనాళాలు సాఫీగా పనిచేయును .  శ్లేషం దేహమునకు సరిపోనంత ఉండిన నిరుత్సాహము , అలసట , నిస్తేజము వంటి మానసిక ఆందోళనలు యే కాక దేహము నందు వేడి , దేహము యొక్క చివరలు , పాదములు , చేతులు మంటలుగా ఉండటం, కండ్లు తిరుగుట, శోష, దప్పిక , గాబరా , దాహాము మొదలయిన దుర్గుణాలు కనిపించును.


           ఈ శ్లేష్మము దేహావసరాలకు మిగిలియున్నప్పుడు తరువాత వాడుకొనుటకు కొంతభాగం మేధముగా మారును . దీనినే కొవ్వు అనుదురు. ఈ మేధము ఉదరము నందు , రొమ్ముల యందు , పిరుదల యందు చేరి నిలువ ఉండును.  సరైన ఆహారం దొరకనప్పుడు , ఉపవాస సమయాల్లో ఈ కొవ్వుని శరీరం తన క్రియలకు ఉపయోగించుకొనును. ఈ శ్లేష్మం అధికమైనప్పుడు ముక్కునుంచి చీమిడి కారడం, కురుపు నుంచి వెలువడే చీము, పురుషుల్లో కలిగే శుక్లనష్టం, స్త్రీలలో వచ్చు తెల్లబట్ట, గడ్డలలో గట్టిగా ఉండు పదార్థం , మోకాలి సంధి యందు నొప్పి కలుగును.  


              కావున పైన చెప్పిన మూడు ధాతువులలో హెచ్చుతగ్గులు జరగకుండా మంచి ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకోవాలి. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034