28, జనవరి 2024, ఆదివారం

362 year old man


 

శ్రీ మార్తాండ్ సూర్యదేవాలయం

 🕉 మన గుడి : నెం 314




⚜ జమ్మూకాశ్మీర్  : అనంతనాగ్


⚜ శ్రీ మార్తాండ్ సూర్యదేవాలయం



💠 మార్తాండ్ సూర్య దేవాలయం ... దురదృష్టవశాత్తు హిందువులు అందరూ మరిచిపోయిన ఒక పురాతన సూర్యదేవాలయం.


💠 మార్తాండ్ సూర్య దేవాలయం జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కాశ్మీర్ లోయలో అనంత్‌నాగ్ నగరానికి సమీపంలో ఉన్న కర్కోట రాజవంశానికి చెందిన లలితాదిత్యకు నిర్మించాడు అని శాసనాల ద్వారా తెలుపబడే హిందూ దేవాలయం.  


💠 ఇది 8వ శతాబ్దపు నాటిది మరియు హిందూమతం/సనాతన ధర్మంలో ప్రధాన సౌర దేవత సూర్య (సూర్యుడు)కి అంకితం చేయబడింది.


💠 సూర్య భగవానుడిని సంస్కృత భాషా పర్యాయపదమైన మార్తాండ్ (మార్తండ్, మార్తాండ) అని కూడా పిలుస్తారు.  

ఈ ఆలయాన్ని మహమ్మదీయ రాజైన సికందర్ షా మీరీ ధ్వంసం చేశారు.


💠 మార్తాండ్ సూర్య దేవాలయం అద్భుతమైన నిర్మాణ  మరియు కాశ్మీరీ వాస్తుశిల్పానికి గర్వకారణం, ఇది ప్రపంచంలోని నిర్మాణ అద్భుతాలలో ప్రముఖ స్థానాన్ని పొందింది.  

ఈ నిర్మాణాన్ని 370 - 500 మధ్య కర్కోట రాజవంశానికి చెందిన రామాదిత్య ప్రారంభించినట్లు చెబుతారు.  

725 - 756 మధ్య కర్కోట రాజవంశం యొక్క మూడవ పాలకుడు లలితాదిత్య ముక్తాపిడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు.


💠 మిక్కిలి బ్రహ్మాండమైన ఈ సూర్య దేవాలయం పెద్ద పెద్ద స్తంభాలమీద దీర్ఘ చతురస్రాకారపు ఆవరణలో నిర్మించబడింది. ముందు మిక్కిలి ఎత్తుగా ఉండే గోడలతో చావడి గుండా లోపలికి ప్రవేశించాలి. 

ఈ గోడలకు నగిషీలతో వంపులు తీర్చిన ద్వారాలు ఉంటాయి.


💠 67 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు గల విశాలమైన ద్వార మంటపాలు మిక్కిలి దీనావస్థలో ఉన్నాయి. 

ద్వార మండపంలో విడిగా ఒక పూజా మందిరం ఉంది. ఈ మైదానంలో శిథిలమైన 84 స్తంభాలు ఉన్నాయి. రాశి చక్రంలోగల 12 రాశుల గుణిజమును సూచిస్తుంది.


💠 మార్తాండ్ సూర్య దేవాలయం కాశ్మీరీ నివాసుల కళ, నైపుణ్యాలు మరియు నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణ.  

ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం కాశ్మీరీ లోయ యొక్క అద్భుతమైన దృశ్య ప్రదేశాన్ని ఎంచుకున్నారు.  

ఈ ఆలయం చతురస్రాకారపు సున్నపురాయి ఆలయం మరియు గ్రీకు శైలిలో నిర్మించబడిన స్తంభాలను కలిగి ఉంది.  

ఈ ఆలయంలో రోమన్, గ్రీక్, చైనీస్, గుప్త, గాంధారన్ మరియు సిరియన్ - బైజాంటైన్ రూపాల మిశ్రమాలు ఉన్నాయి.


💠 ఒరిస్సాను పరిపాలించిన గంగ వంశపు రాజులలో ఒకటవ మహారాజా నరసింగదేవ 13వ శతాబ్దంలో కోణార్క్ దేవాలయం నిర్మించారు. 

కాశ్మీర్ శ్రీనగర్ మార్తాండ్ సూర్యదేవాలయం అప్పటికి సుమారు 500 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది.

కాశ్మీర్ లోయలో ఇస్లామ్ మతం స్థాపింపబడడానికి ముందే అశోక

చక్రవర్తి ఇచ్చట బౌద్ధమతాన్ని బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసాడు. 


💠 కాలక్రమేణా ఇక్కడ బౌద్ధమతం క్షీణించి మహమ్మదీయ పాలన పాతుకుపోయింది. 1346 ఇచ్చట మహమ్మదీయ పాలన ప్రారంభమైనది. 

కాశ్మీరును అప్పటివరకు అనేక హైందవ వంశాలు పరిపాలించినట్టు చరిత్ర వల్ల తెలుస్తుంది. 


💠 శ్రీనగర్ 68 కి.మీ. దూరంలో ఉన్న మార్తాండ్ అనేక నదులతో, కాలువలతో, మంచినీటి బుగ్గలతో ఆవరించబడి ఉంది. 

సుప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడు, పరిశోధకుడు అయిన సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్ ఈ దేవాలయాన్ని గురించి వివరిస్తూ ‘శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయం బ్రహ్మాండంగా విస్తరించుకున్న నిర్మాణం, శిల్పనైపుణ్యంతోను, వివిధ అలంకారాలతోను ఎంతో అద్భుతంగా ఉంది అని వ్రాసాడు.


💠 ఈ ప్రాచీన మార్తాండ తీర్థమే కాశ్యప మహాముని నివాసం అంటారు. 

మార్తాండ్లో మంచినీటి బుగ్గలు సాక్షాత్తు పరమశివుడు ఏర్పరచినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 

ఒకప్పుడు పవిత్రమైన పుణ్యతీర్థంగా వెలసిన మార్తాండ్ను నేడు ఏ కొద్ది మందో తప్ప యాత్రికులు ఎవరూ దర్శించడం లేదు.


⚜ విధ్వంసం ⚜


💠 దాదాపు 15వ శతాబ్దంలో షామీరి రాజవంశం యొక్క ఆరవ సుల్తాన్ అయిన సికందర్ బుత్షికాన్ అనే ఇస్లాం పాలకుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు.  

ఈ క్రూరమైన పాలకుడు హిందూ మతాన్ని అణచివేయడానికి మార్తాండ్ సూర్య దేవాలయంతో సహా అనేక హిందూ దేవాలయాలను కూల్చివేశాడు.


💠 మార్తాండ్ ఆలయాన్ని త్రవ్వి ధ్వంసం చేసిన తర్వాత, సికందర్‌కు పునాది క్రింద ఒక రాగి ఫలకం దొరికిందని ఒక ఆసక్తికరమైన సామెత ఉంది.  

అతను దానిపై ఉన్న సారాంశం చదివాడు మరియు అందులో ఇలా ఉంది "ఈ ఆలయాన్ని నిర్మించిన తరువాత, ఆలయం ఎంతకాలం ఉంటుందో రాజు తన జ్యోతిష్కుల నుండి తెలుసుకోవాలనుకున్నాడు మరియు పదకొండు వందల సంవత్సరాల తరువాత, సికుందర్ అనే రాజు నాశనం చేస్తాడని వారి ద్వారా తెలియజేయబడింది.  

"ఆ విషయం చదవడం ద్వారా సికందర్ ఆశ్చర్యపోయాడు, హిందూ పండితులు జరగబోయే నిజాన్ని అంచనా వేసి ప్రకటించాడు.  

రాగి ఫలకంపై ఉన్న ఈ లిపి గురించి రాజు సికందర్‌కు ముందే తెలిసి ఉంటే, హిందూ ప్రవక్తల అంచనా తప్పు అని నిరూపించడానికి అతను ఆలయాన్ని విధ్వంసం నుండి రక్షించేవాడు ఏమో..!


🔅 కొసమెరుపు :

హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పటి చాలా హిందీ చిత్రాలలో  ఈ అద్భుతమైన పురాతన హిందూ దేవాలయాన్ని "షైతాన్ కి గుఫా" (దెయ్యాల గుహ)గా ప్రదర్శించడం నిజంగా సిగ్గుచేటు , దౌర్భాగ్యం......

Panchang

 


Rama prasadam


 

Low water pressure tap


 

పంచకర్మ పద్ధతి

 ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ . 


     ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం . 


       విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను . 


       ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 *  నస్యకర్మ  - 


        దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు . 


 *  వమనకర్మ  - 


       వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి . 


 *  విరేచనకర్మ - 


       విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట. 


 *  నిరూహవస్తి - 


        ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన   ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను . 


 *  అనువాసనవ వస్తి - 


      దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే  అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది . 


        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఏ దోషం ఉండదు

 *సుభాషితం*

*--------------*

🌺

*ఏకః క్షమావతాం దోషో*

 *ద్వితీయో నోపపద్యతే ౹*

     *యదేన క్షమయా యుక్త*

*మశక్తం మాన్యతే జనః ౹౹*. 🌺

  *భావం : సహనం ఉన్నవారిలో ఒక దోషం ఉంది. ప్రజలు తమ వైపే ఆశక్తులు అని భావిస్తారు. ఇది కాకుండా వారిలో ఏ దోషం ఉండదు.*

🌺✍🏽

సంపూర్ణమౌతాయి

 _*🕉️నేటి సుభాషితము🕉️*_ 

 


_*జలబిందు నిపాతేన*_

_*క్రమశః పూర్యతే ఘటః|*_

_*స హేతుః సర్వ విద్యానాం*_

_*ధర్మస్య చ ధనస్య చ||*_


*భావము:ఒక్కొక్క నీటిబొట్టు పడటం వల్ల క్రమంగా కుండ నిండుతుంది. అలాగే, అన్ని విద్యలు, ధర్మము, ధనము కొద్దికొద్దిగా ఆర్జన చేస్తే సంపూర్ణమౌతాయి.*


   


 *📖 మన ఇతిహాసాలు 📓*



*బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది.* అవి 

బ్రహ్మచే సృష్టింప బడిన ఈ చరా చార సృష్టి నాలుగు వేదాల మీద నడుస్తున్నది. అవి 1. ఋగ్వేదము2. సామ వేదము3. యజుర్వేదము4. అధర్వణ వేదము వీటి నుండి 1. సంహితాలు దీని నుండి కర్మ కాండ 2. అరణ్యకాలు వీటినుండి జ్ఞాన కాండ3. ఉపనిషత్తులు వీటినుండి ఉపాసన కాండ అలాగే పై మూడింటినుండి 1. ఉపవేదాలు - ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ, శిల్ప మొదలగున్నవిన్నూ.....2. వేదాంగాలు - శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తి, కల్ప, జ్యోతిషం ఏర్పడ్డాయి. 3. ధర్శనాలు - వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత మ్దలగున్నవి ఏర్పడ్డాయి. 4. శాస్త్రాలు - నీతి, స్మృతి మొదలగున్నవి ఏర్పడ్డాయి. 5. ఆగమాలు - ఇందులో శైవ, శక్త మరియు వైశ్ణవాలూ అలాగే 6. పురాణాలు- అష్టాదశ పురాణాలు ఐ విధముగా వేదాలను సామాన్య మానవుడికి సులభముగా అర్ధమగు రీతిలో అమరిక చేయడం జరిగిన్ది. ఇక జ్యోతిషాన్ని కూడా కొన్ని శాఖలుగా విభజించడం జరిగినది.అవి 1. ప్రశ్నా శాస్త్రము, 2. హస్త రేఖా శాస్త్రము, 3. సంఖ్యా శాస్త్రము, 4. పాచికలు, 5. గవ్వలు, 6. ముఖము చూచి చెప్పుట, 7. చిలుక జ్యోతిషము మొదలగు శాఖలు

మన సీతమ్మ కథ..

 


శ్రీభారత్ వీక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🌹మన సీతమ్మ కథ.. సీతాదేవి చరిత్రను కళ్లకు కట్టినట్టు పరిచయం చేసే సీరియల్. సీతాయాశ్చరితం మహత్ అనే పరిశోధనా గ్రంథం రచించిన ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు ఎంతో రసరమ్యంగా అందిస్తున్న మనోహరమైన కథనం ఇది. అసలు సీత ఎవరు? వాల్మీకి రామాయణంలోను, మరికొన్ని రామాయణాల్లోను సీతమ్మను ఎంత ఉదాత్తంగా చిత్రీకరించారో వినండి. సీతమ్మ భారతీయుల ఆడపడుచు. భారతీయుల హృదయం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కొడుకే మోక్షకారకుడా?

: కొడుకే మోక్షకారకుడా?


కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై/

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్/

బడసెన్: పుత్రులులేని యాశుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్/

చెడునే మోక్షపదంబపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకము-ధూర్జటిమహాకవి;


భావము:-లోకంలో జీవనభ్రాంతిలోమునిగిన జనం "అపుత్రస్య గతిర్నాస్తి"-యను వాక్యము నూతగొని సంసారమగ్నులై మోక్షపథమునకు దూరమగుచున్నారు.యదార్ధమునకు సంతానము మోకషపదమునకు సహకారమనుట యసత్యము.

       ధృతరాష్ట్రునకు నూర్గురు కుమారులుగలిగిరి వారివలన అతనికి గలిగిన సద్గతులెవ్వి?

ఆజన్మబ్రహ్మచారియైన శుకునకు సంతతిలేకపోవుటచేకలిగిన దుర్గతులేవి?

      సంతతి లేకుండుట మోక్షపదమునకు అవరోధము యెంతమాత్రముకాదు.అదియొకభ్రమ!

కేవలమూ పరమేశ్వరానుగ్రహమే సద్గతికి మూలము.


                           స్వస్తి!🙏

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 03*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*క్లైబ్యం మా స్మ గమః పార్థ*

*నైతత్త్వయ్యుపపద్యతే ।*

*క్షుద్రం హృదయ దౌర్బల్యం*

*త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।।*


*భావము:*

ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.

 

*వివరణ:* 

జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహించుతూ అర్జునుడి అంతర్గత శక్తిని పెంపోదిస్తున్నాడు.

ఆర్జునుడిని, ప్రిథ (కుంతీ దేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంభోదించడం వలన అతనికి తన తల్లి కుంతీ దేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించటంచేత, అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఈ విధంగా, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. తన ఉన్నతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశపడవద్దని అర్జునుడికి, శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల ఆర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంభోదిస్తున్నాడు, తన క్షత్రియ ధర్మమయిన కర్తవ్యాన్ని విస్మరించాలనే ఆలోచనే, ఆ శత్రువు.

అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్త భ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తాడు. దీని మూల కారణం మానసిక బలహీనత. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన, ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

.           *🌹వేమన పద్యములు🌹* 

.             *అర్థము - తాత్పర్యము*

.                    *Part - 12*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 31*


*అంతరంగమందు నద్వైతమే యుండు*

*బాహ్యమందు ద్వైత భావముండు*

*యట్లుకాక తత్త్వ మలవడ నేరదు* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తత్త్వం తెలియాలంటే ద్వైత భ్రాంతి వీడాలి.

జీవాత్మ పరమాత్మలను వేరుగా చూడరాదు.

అభేద బ్రహ్మ బోధము కావాలి.


*💥వేమన పద్యాలు -- 32*


*అంతరంగ మెరుగ హరుడౌను గురుడౌను*

*యంతరంగ మెరుగ నలవికాదు*

*యంతరంగ మెరుగ నతడెపో శివుడయా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే అది ఆ శివునికొక్కడికే శక్యము , ఎదుటి వాని మనసుననున్నది గ్రహించినవాడే శివస్వరూపుడౌతాడు.


*💥వేమన పద్యాలు -- 33*

      

*అంతరంగ హృదయమందగా సాధించి*

*చింత లూడబెరికి చిక్కుపడక*

*వింతజూచి మెలగి విజ్ఞాన మందరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఏ చీకూ చింతా లేకుండా , చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించి జ్ఞానమును పొందవలెను.

సత్ప్రవర్తునుడై మెలగవలెను.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *151వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*కేతుగ్రహ మహిమ - 1*


*"పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ! రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !!”* 


నిర్వికల్పానంద చేతులు జోడించి ప్రార్థించాడు.


*“గురువుగారూ... 'పలాశపుష్పం' అంటే...”* సదానందుడు ప్రారంభించాడు.


*"మోదుగు పువ్వు నాయనా ! కేతువు వర్ణం మోదుగు పువ్వులాగా ఎర్రగా ఉంటుంది ! ఇతర గ్రహాలకు లాగే నవగ్రహాలలో నవమగ్రహమైన కేతువుకూ అనేక కారకత్వాలున్నాయి. వాటిలో మహత్తరమైన కారకత్వం ఒకటుంది. అదే మోక్షకారకత్వం ! మానవుడికి జనన మరణ చక్రం నుండి విముక్తి అనే 'ముక్తి' లభించాలంటే కేతుగ్రహ శుభవీక్షణ చాలా ముఖ్యం. ఆయన దయలేని కారణంగా విశ్వప్రయత్నం చేసినప్పటికీ . మోక్షాన్ని , అంటే స్వర్గాన్ని అందుకోలేకపోయిన పురాణ పురుషుడి గాథ చెప్పుకుందాం !”* నిర్వికల్పానంద ఉపోద్ఘాతం ముగించి , శిష్యుల వైపు ప్రసన్నంగా చూశాడు.


విమలానందుడూ , చిదానందుడూ , సదానందుడూ , శివానందుడూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు.


*“ఇందాక మనం హరిశ్చంద్రుడి కథ చెప్పుకున్నాం. ఆయన తండ్రి ఎవరో తెలుసా ? సత్యవ్రత మహారాజు ! ఆయన మనకు 'త్రిశంకుడు'గా తెలుసు !”*


*"సత్యవ్రత మహారాజుకు 'త్రిశంకుడు' అనే పేరు ఎందుకు వచ్చింది , గురువుగారూ ?"*


*"వశిష్ఠ మహర్షి శాపం వల్ల ఆయన త్రిశంకుడయ్యాడు. 'త్రిశంకుడు' అంటే మూడు పాపాలు చేసినవాడు అని అర్థం...”*


*"ఆ మూడు పాపాలు ఏవి , గురువుగారూ ?”* సదానందుడు అడిగాడు.


*“యుక్తవయస్సులో ఉన్నప్పుడు సత్యవ్రతుడు వివాహవేదిక మీద నుండి మంగళ సూత్రధారణ జరిగే ముందు , ఒక వధువును ఎత్తుకు వెళ్ళిపోయాడు. అది ఒక పాపం !”*


*"ఆ నేరానికి శిక్షగా ఆయన తండ్రి అయిన త్రయ్యారుణ చక్రవర్తి సత్యవ్రతునికి రాజ్య బహిష్కార శిక్ష విధించాడు. కన్నతండ్రి ఆగ్రహానికి గురి అవడం రెండవ పాపం.”*


*"దేశం వదిలి అరణ్యాలలో జంతువులను వేటాడి తింటూ నికృష్టమైన జీవనం సాగిస్తున్న సత్యవ్రతుడు , ఒకనాడు వశిష్ఠ హోమధేనువైన నందినిని చంపి , ఆ గోవు మాంసం ఆరగించాడు. గోమాంస భక్షణ మూడవ పాపం ! మూడు పాపాల కారణంగా - అంటే 'త్రిశంకల' కారణంగా అతన్ని 'త్రిశంకుడు'గా వ్యవహరించబడమని శపించాడు వశిష్ఠ మహర్షి. ఆనాటి నుండి సత్యవ్రతుడు త్రిశంకుడుగా ప్రఖ్యాతుడయ్యాడు !"* నిర్వికల్పానంద వివరించాడు.


*"ఒక్కగానొక్క కొడుకుని అరణ్యాల పాలు చేసినందుకు విచారించి త్రిశంకుడి తండ్రి త్రయ్యారుణ చక్రవర్తి అతన్ని రాజధానికి పిలిపించి , రాజుగా అభిషేకించాడు. చాలా ఏళ్ళ పాటు రాజ్యపాలన చేసిన త్రిశంకు చక్రవర్తికి జీవితం మీద విరక్తి కలిగింది. మరణించకుండా స్వర్గం చేరి , తద్వారా మోక్షాన్ని పొందాలన్న సంకల్పం బలంగా కలిగింది ఆయనకు. కులగురువైన వశిష్ఠ మహర్షితో ఆ విషయం గురించి చర్చించాడు...”* నిర్వికల్పానంద కథనం కొనసాగిస్తున్నాడు...


★★★★★★★★★★★★★★★★



*"గురుదేవా ! జీవితంతో విసిగిపోయాను ! రాజ్య పాలనతో అలసిపోయాను. ఈ జీవితం పట్లా , అధికారం పట్లా విరక్తి పుట్టింది...”*


*“ఈ వయసులో అది సహజమే త్రిశంకూ !”* వశిష్ఠమహర్షి చిరునవ్వుతో అన్నాడు. *“హరిశ్చంద్రుడు పెద్దవాడయ్యాడు కద ! అతన్ని రాజుగా అభిషేకించి , నివృత్తి జీవితం గడుపు !"*


*"నా ఉద్దేశం నివృత్తి జీవితం గడపడం కాదు. నాలో మోక్షేచ్ఛ బలంగా ఉంది. నేను స్వర్గానికి వెళ్ళాలి గురుదేవా !”*


వశిష్ఠుడు చిన్నగా నవ్వాడు. *“అది మన చేతుల్లో లేదు త్రిశంకూ ! స్వర్గమో , నరకమో - మనిషి మరణిస్తే గానీ తేలదు. మరణం మన చేతిలో లేదు. స్వర్గవాస కాంక్షతోనే ఆత్మహత్య ద్వారా మరణిస్తే నరకం తప్పదు !”*


*"గురుదేవా ! దయచేసి నన్ను చెప్పనివ్వండి ! నేను మరణించకుండానే , ఈ శరీరంతోనే నేరుగా స్వర్గానికి వెళ్ళాలి !"*


వశిష్ఠ మహర్షి నిర్ఘాతంపోతూ చూశాడు. త్రిశంకుడికి మతి భ్రమించిందా ?! *"త్రిశంకూ , ఒక సత్యం చెప్తాను విను ! సశరీరంగా స్వర్గానికి చేరే వ్యవహారం అలా ఉంచుదాం ! ఒకవేళ నీకు సమీప భవిష్యత్తులో సహజ మరణం సంభవించినప్పటికీ నీకు స్వర్గవాసమూ , మోక్షమూ లభించే అవకాశం లేదు...”*


*"గురుదేవా !"*


*"ఎందుకో తెలుసా ? మోక్షకారకుడైన కేతుగ్రహదేవత నీకు అనుకూలంగా లేడు ! కేతువు వక్రంగా వీక్షిస్తే , మోక్షం సిద్ధించదు !"*


త్రిశంకు చక్రవర్తి వశిష్ఠుడి వైపు రెప్పవేయకుండా , తీక్షణంగా చూశాడు. *"గ్రహచారాన్నీ , అదృష్టాన్నీ మరిచిపోండి. గురుదేవా ! నన్ను బొందితో స్వర్గానికి పంపించే మహత్తర సంకల్పంతో అద్వితీయమైన మహాయాగం చేయండి. మీరు అందుకు సమర్థులని నాకు తెలుసు. మా వంశానికి చెందిన వైవస్వత మనుమహారాజుకు యజ్ఞాచరణంతో సంతతి కలిగేలా చేశారు మీరు !"*


*"అది వేరు , త్రిశంకు ! నీ కోరిక అసాధారణమైంది ! ఆచరణ సాధ్యం కానిది ! నిజం చెప్పాలంటే నీది ఆశ కాదు ; వ్యామోహం - విపరీతమైన వ్యామోహం !"* వశిష్ఠ మహర్షి నిష్కర్షగా అన్నాడు.


*"నా విపరీత వ్యామోహాన్ని ఆశగా , ఆశయంగా పరివర్తింపజేయండి ! సశరీర స్వర్గయానానికీ , మోక్షానికీ అవసరమైన యాగం చేయండి !"* త్రిశంకుడు గంభీరంగా అన్నాడు.


*"ఆజ్ఞాపిస్తున్నావా , రాజా ?"*


*"అర్థించాను ; అభ్యర్థించాను ! ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను !"*


*"నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నాను !”*


*"గురుదేవా !"*


*"మళ్ళీ చెప్తున్నాను త్రిశంకూ ! మోక్షకారక గ్రహం నీకు అనుకూలంగా లేదు ! క్రతువు విజయవంతం కాదు ! సఫలం కాదు ! ఫలించని క్రతువుని ఈ వశిష్ఠుడు చేయడు !"*


తీక్షణంగా చూస్తున్న త్రిశంకుడి చూపుల్ని పట్టించుకోకుండా వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయాడు.


★★★★★★★★★★★★★★★★


ఆశ్రమ ప్రాంగణంలో అరుగు మీద కూర్చున్న విశ్వామిత్ర మహర్షి పాదాలకు ప్రణామం చేశాడు త్రిశంకు చక్రవర్తి.


*"ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు !"* విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు.


*"సమయోచితమైన దీవెన అనుగ్రహించారు ! కులగురువైన వశిష్ఠుడి నిరాదరణను రుచి చూసి , అవమాన భారంతో మీ సన్నిధికి వచ్చాను"* త్రిశంకుడు బరువుగా అన్నాడు.


*"ఏం జరిగింది , సత్యవ్రతా ?"* విశ్వామిత్ర మహర్షి అనునయంగా అడిగాడు. *"శాప రూపంలో ఆ వశిష్ఠుడు నీకు బహూకరించిన నామధేయంతో నిన్ను ఈ విశ్వామిత్రుడు సంబోధించడు !"*


*"ధన్యుణ్ణి ! రాజ్యాధికారం మీదా , జీవితం మీదా విరక్తి పెచ్చరిల్లిన కారణంగా , తగిన మహాయాగం చేసి , నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించి , ఆ విధంగా మోక్షం ఇప్పించమని ఆ వశిష్ఠ మహర్షిని అర్థించాను. ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించాడు !"* త్రిశంకుడి కంఠంలో ఆవేశం గంటలా ధ్వనించింది.


*"కారణం ?"*


*“మోక్షకారకుడైన కేతువు నన్ను వక్రంగా చూస్తున్నాడట !"* త్రిశంకుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.


విశ్వామిత్రుడు గొల్లున నవ్వాడు. *"చేయగలిగిన చేవ ఉన్న వ్యక్తిని అడగాలి , సత్యవ్రతా నువ్వు ! ఆ వశిష్ఠుడు ఎంత ? అతగాడి తపోబలమెంత ? బ్రహ్మర్షి అన్న అహంకారం ఒక్కటే - ఆ వశిష్ఠుడు కాని , వశిష్ఠుడి బలం ! హోమాగ్నిని పుట్టించలేని వాడు 'సమిథలు పచ్చివి' అన్నట్టు తన చేతగానితనాన్ని గ్రహచారానికి ఆపాదించాడు !"*


*"గురుదేవా... నా కోరిక మీరే తీర్చాలి !"* త్రిశంకు ప్రాధేయపూర్వకంగా అన్నాడు. *"సత్యవ్రతా ! సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన మేధావి మాత్రమే , 'మహర్షి' మాత్రమే నిన్ను సశరీరంగా స్వర్గానికి సాగనంపగలడు ! నీ కోరిక నేను తీరుస్తాను ! ఆ వశిష్ఠుడి కళ్ళు తెరిపిస్తాను !"* విశ్వామిత్రుడు సగర్వంగా అన్నాడు.


*"గురుదేవా ! మీరు అంగీకరించారు ! సశరీర స్వర్గ ప్రవేశంలో నాకింక అనుమానమే లేదు !"* త్రిశంకుడు ఆనందంగా అన్నాడు.


*"యజ్ఞ నిర్వహణకు సన్నద్ధం చేయించు. ముందుగా బ్రహ్మవాదులైన ఋషులను ఆహ్వానించు. నేను స్వయంగా యాజకత్వం వహించి యజ్ఞం చేయిస్తాను !”* విశ్వామిత్రుడు గంభీరంగా అన్నాడు.


త్రిశంకు చక్రవర్తి కృతజ్ఞతా పూర్వకంగా విశ్వామిత్రుడికి పాదాభివందనం చేశాడు. *"సశరీర స్వర్గ ప్రాప్తిరస్తు !”* దీవించాడు విశ్వామిత్రుడు.

  

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*వర వైకుంఠము సారసాకరము; దివ్యస్వర్ణ శాలాంక గో*

*పుర హర్మ్యావృత మైన తద్భవన మంభోజంబు; తన్మంది రాం*

*తర విభ్రాజిత భోగి గర్ణిక; దదుద్యద్భోగ పర్యంకమం*

*దిరవొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్.*


వైకుంఠం చాలా మేలైనపురం. అది ఒక పద్మాల కొలను అనుకొంటే అందులోని పసిడి గోపురాలతో కూడిన మేడల మధ్యనున్న శ్రీ మహావిష్ణువు ఉండే భవనం ఒక గొప్ప పద్మంలాగా ఉన్నది. ఆ భవనం లోపల విరాజిల్లుతున్న ఆదిశేషుడు, విష్ణువునకు సెజ్జగానుండి పద్మంలోని దుద్దులాగా కానవస్తున్నాడు. పైకి చక్కగా ఎత్తిపట్టి ఉన్న ఆ శేషుని తలలనే పానుపు మీద మాధవుడు మకరందాన్ని తనివితీరా గ్రోలటానికి వచ్చిన తుమ్మెదలాగా కనపడుతున్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


*ఆత్మపత్న్యాచ కలహో*,    

*మిథ్యానిందా పరస్త్రీయామ్*!                      

*స్వజనే ప్రేమ హీనత్వం*,         

*అశ్లీలం సర్వదా నృణామ్* !!


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము -  *భార్యతో పోట్లాడటం, ఏ పాపమూ ఎరుగని స్త్రీపై నిందలు మోపడం, తల్లి,తండ్రి మొదలైన తనవారిపై ప్రేమ లేకుండా ఉండటం*-- ఇవి వ్యక్తిని *సుజనుడు* గా నిలపవు.

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.          *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.             *సాంఖ్య యోగము*

.                  *శ్లోకము 03*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*క్లైబ్యం మా స్మ గమః పార్థ*

*నైతత్త్వయ్యుపపద్యతే ।*

*క్షుద్రం హృదయ దౌర్బల్యం*

*త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।।*


*భావము:*

ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.

 

*వివరణ:* 

జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహించుతూ అర్జునుడి అంతర్గత శక్తిని పెంపోదిస్తున్నాడు.

ఆర్జునుడిని, ప్రిథ (కుంతీ దేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంభోదించడం వలన అతనికి తన తల్లి కుంతీ దేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించటంచేత, అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఈ విధంగా, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. తన ఉన్నతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశపడవద్దని అర్జునుడికి, శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల ఆర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంభోదిస్తున్నాడు, తన క్షత్రియ ధర్మమయిన కర్తవ్యాన్ని విస్మరించాలనే ఆలోచనే, ఆ శత్రువు.

అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్త భ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు తదుపరి విశదీకరిస్తాడు. దీని మూల కారణం మానసిక బలహీనత. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన, ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 11*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 28*


*అంతరంగమందు నభవు నుద్దేశించి*

*నిల్పి చూడనాడ నిల్చుగాక*

*బాహ్యమందు శివుని భావింపనిలుచునా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

బాహ్యస్థితిలో శివుని గూర్చి తలపు స్థిరము గాదు.

అంతశ్శుద్ధి కలిగి పరమాత్మను ధ్యానించే మానవునికి సకల సుఖములు ప్రాప్తించును.


*💥వేమన పద్యాలు -- 29*

      

*అంతరంగమందు ననువుగా శోధించి*

*తలప దలప ముక్తి తగులు గాక*

*బాహ్యరంగమందు భాషింపదెలియునా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తగిన రీతిలో ముక్తి పొందాలంటే మనసు ప్రధానంగా చేసుకుని భగవంతుని ధ్యానించాలి.

ఒట్టిమాటలు ఎందుకు పనికి రావు.


*💥వేమన పద్యాలు -- 30*

      

*అంతరంగమందు నపరాధములు చేసి*

*మంచి వానివలెను మనుజుడుండు*

*యితరు లెరుగకున్న నీశ్వరుం డెరుగడా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తప్పులన్నీ చేసేసి , ఏమీ తెలియదు నాకు అంటే , మనుషులు ఊరుకోవచ్చేమో గాని ఈశ్వరుడు ఊరుకోడు.

తగిన సమయంలో బుద్ధి చెబుతాడు.

ఆ భగవంతుని దృష్టి నుండి ఎవరూ తప్పించుకోలేరు.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 12*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 31*


*అంతరంగమందు నద్వైతమే యుండు*

*బాహ్యమందు ద్వైత భావముండు*

*యట్లుకాక తత్త్వ మలవడ నేరదు* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

తత్త్వం తెలియాలంటే ద్వైత భ్రాంతి వీడాలి.

జీవాత్మ పరమాత్మలను వేరుగా చూడరాదు.

అభేద బ్రహ్మ బోధము కావాలి.


*💥వేమన పద్యాలు -- 32*


*అంతరంగ మెరుగ హరుడౌను గురుడౌను*

*యంతరంగ మెరుగ నలవికాదు*

*యంతరంగ మెరుగ నతడెపో శివుడయా*

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే అది ఆ శివునికొక్కడికే శక్యము , ఎదుటి వాని మనసుననున్నది గ్రహించినవాడే శివస్వరూపుడౌతాడు.


*💥వేమన పద్యాలు -- 33*

      

*అంతరంగ హృదయమందగా సాధించి*

*చింత లూడబెరికి చిక్కుపడక*

*వింతజూచి మెలగి విజ్ఞాన మందరా* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

ఏ చీకూ చింతా లేకుండా , చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించి జ్ఞానమును పొందవలెను.

సత్ప్రవర్తునుడై మెలగవలెను.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ – శ్లోకం – 71*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శివానందలహరీ – శ్లోకం – 71*

. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ఆరూఢభక్తిగుణకుఞ్చితభావచాప*

*యుక్తైః శివస్మరణబాణగణైరమోఘైః ।*

*నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీన్ద్రః*

*సానన్దమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్ ॥*


రాజు తన చాపమునుండి బాణపరంపర వర్షించి శత్రువులని నిర్జించి రాజ్యలక్ష్మిని పొందుతాడు. మనుష్యులు, తమ పాపములు అనే శత్రువులను జయించి మోక్షలక్ష్మిని పొందుట ఎలా సాధ్యమో శంకరులు చూపుతున్నారు.


బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, పరిపక్వత పొందిన భక్తి అనే అల్లెత్రాటితో‌ వంచబడిన మనస్సు అనే‌ వింటికి కూర్చబడినవీ, అమోఘములూ (వ్యర్థము కానివి) అయిన శివస్మరణము అనే‌ బాణ సమూహములతో‌ పాపములనెడి శత్రువులను నిశ్శేషముగా జయించి, విజయుడై ఆనందముతో‌ మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందుతాడు.


భక్తితో మనస్సును బంధించి నిరంతర శివనామస్మరణ చేయుట ద్వారా పాపరాశి ధ్వంసము చేసుకొని శివసాయుజ్యము పొందవచ్చునని శంకరుల ఉపదేశము.


👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

రాశి ఫలితాలు

 *శుభోదయం*

16.2291923113

*****

28-01-2024

భాను వాసరః ఆదివారం 

రాశి ఫలితాలు

XXXX

మేషం

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృషభం

చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. ఉద్యోగమున స్థానచలన  సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

---------------------------------------

మిధునం

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి  నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

కర్కాటకం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో  గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. 

---------------------------------------

సింహం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

కన్య

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతం ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. 

---------------------------------------

తుల

సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి,ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

వృశ్చికం

ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

ధనస్సు

బంధు,మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధనవ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.

---------------------------------------

మకరం

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

------------------------------------

కుంభం

సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

మీనం

 నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ  సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.

---------------------------------------

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.28.01.2024

 ఆది వారం (భాను వాసరే) 

 **********


గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే 

తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ పౌష్య మాసే కృష్ణ పక్షే

తృతీయాయాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.37

సూ.అ.5.50

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు

పుష్య మాసం 

కృష్ణ పక్షం తదియ రా.తె.4.05 వరకు.

ఆది వారం. 

నక్షత్రం మఘ మ.2.36 వరకు. 

అమృతం ప.11.53 ల 1.39 వరకు. 

దుర్ముహూర్తం సా.4.18 ల 5.03 వరకు. 

వర్జ్యం రా. 11.28 ల 1.14 వరకు. 

యోగం సౌభాగ్య ఉ.8.07 వరకు. 

కరణం వనజి మ.3.02 వరకు.   

కరణం భద్ర రా. తె. 4.05 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ తదియ. 

*********************

బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి:-

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

చిన్ని కృష్ణుడిని

 శ్లోకం:☝️

*కరారవిందేన పదారవిందం*

  *ముఖారవిందే వినివేశయంతం |*

*వటస్య పత్రస్య పుటేశయానం*

  *బాలం ముకుందం మానసా స్మరామి ||*


భావం: పద్మమువంటి చేతితో తన పాద పద్మమును ముఖ పద్మములో ఉంచే వటపత్రశాయి, చిన్ని కృష్ణుడిని నా హృదయంలో ధ్యానిస్తున్నాను.🙏

పంచాంగం 28.01.2024

 ఈ రోజు పంచాంగం 28.01.2024

Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: తృతీయా తిధి భాను వాసర: మఘ నక్షత్రం సౌభాగ్య యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ రా.తె 06:10 వరకు.

మఘ మధ్యాహ్నం 03:53 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:05


వర్జ్యం : రాత్రి 12:54 నుండి 02:42 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:35 నుండి 05:20 వరకు.


అమృత ఘడియలు : మధ్యాహ్నం 01:12 నుండి మధ్యాహ్నం 02:59


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

నేటివేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటివేద ఆశీర్వచనం *(28-01-2024, ఆదివారం)* 


https://youtu.be/yKmEBpTeZoE?si=u6KT5h5WNDboaM4D


🙏🙏