26, మే 2021, బుధవారం

కంచి పరమాచార్యస్వామివారి జయంతి*

 * కంచి పరమాచార్యస్వామివారి జయంతి* 


*శ్రీ కామకోటి పీఠ ప్రభవః*

*శ్రీ చంద్రశేఖర యతీంద్రాః*

*సర్వమత భక్త వందిత చరణాబ్జాః*

*జ్ఞానదాశ్చ విజయతే*


*జయ జయ శంకర హర హర శంకర* 


*ఈరోజు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామివారి జయంతి సందర్భంగా సంక్షిప్తంగా వారి చరిత్ర తెలుసుకుందాం*.. 


 

కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపరలో 68 వ పీఠాధిపతులు స్వామివారు. 


వారు పరమాచార్య, మహాస్వామి. మహా పెరియవ, మున్నగు పేర్లతో కూడా పిలవబడతారు.


ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటారు స్వామి.


స్వామి సంకల్పబలంతో ఇది ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరాల్సిందే. 


ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారు స్వామి.


*జీవిత విశేషాలు* !


కంచి మహాస్వామిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు1894 వ సంవత్సరములో దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం గ్రామమునందు ఒక స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబములో మే 20,న అనూరాధ నక్షత్రములో (చాంద్రమానానుసారము) జన్మించారు.


వీరి తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మీ ,శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు. వారికి చిన్నతనములో పెట్టబడిన పేరు స్వామినాథన్. 


జిల్లా విద్యాధికారిగా పని చేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వారు రెండవ అబ్బాయి. వారి ఇలవేల్పు, కుంబకోణము దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయము ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా బాలుడికి స్వామినాథన్ అని నామకరణము చేసారు.


స్వామినాథన్ దిండివనములో తన తండ్రి పని చేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. వారు చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించారు. 

వారికి 1905లో ఉపనయనము జరిగినది. 


13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించారు. 


చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతులే కారు.


వారిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్రపరిశోధ కుడు, జ్యోతిశ్శాస్త్రవేత్తను, ఆధ్యాత్మిక తరంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు. 


ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభాసామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితం,


అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదాలు సలిపి, అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ, సనాతన ధర్మపునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి. ఈయన 'నడిచే దేవుడి' గా ప్రసిద్ధికెక్కారు.


విశేషాలు !


చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఒకసారి తమిళ నాడులోని చిదంబరంసమీపంలోని 'ఆనంద తాండవ పురం'లో ఒక మూగబాలుడికి మాటలు రప్పించారు.


స్వామి మతాతీతుడు. 1926లో కారం బుక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్ళే దారిలో గుంపుగా ప్రజలు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారిలో మహమ్మదీయులూ వున్నారు. అలా ఓ మహమ్మ దీయుడు స్వామి పల్లకీ మోసాడు. స్వామి అతన్ని పిలిచి క్షేమం అడిగాడు. ఆ భక్తుడు 'ఆచార్యుల వారి రూపంలో నా కళ్ళకు 'అల్లా' కనిపించాడన్నాడు. మహాపురుషులు మతాతీతులు కదా !


భారత రాజ్యాంగం మతాన్ని 'ప్రాథమిక హక్కు'గా గుర్తించడానికి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారే కారణమని ఈ దేశంలో చాలా మందికి తెలియదు. వారు సన్యాసదీక్ష తీసుకొని మఠాధిపత్యం వహించడం వల్ల దేశ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. 


కాని భారతస్వాతంత్య్రాన్ని వారు మనస్ఫూర్తిగా కాంక్షించారు. ఉద్యమాన్ని సమర్థించారు. గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్ధరునే ధరించారు.


 'భారతరాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు' అని స్వామి తన భక్తులను హెచ్చరించాడు.మతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తింపజేయుటకు కృషి చేశారు.


*కంచి పీఠాధిపతులుగా* !


 ఫిబ్రవరి 13, 1907 వ సంవత్సరము లో స్వామి కంచి పీఠానికి 68 వ పీఠాధిపతిగా నియమించబడ్డారు. వేదరక్షణకోసం ఎన్నో వేదపాఠశాలలు నెలకొల్పారు, 


సంస్కృతి రక్షణ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వున్నారు. భారతదేశము అంతా పాదయాత్ర చేశారు. స్వామి వారి ఉపన్యాసములు చాలా ప్రసిధ్ది పొందాయి.


మహాస్వామి వారు 1994 జనవరి 8 న శనివారం రోజు బ్రహ్మీభూతులయ్యారు. వారి శత సంవత్సరం పూర్తి కావడానికి కేవలం నాలుగు నెలలు ముందే వారు విదేహముక్తులయ్యారు. 


కంచి మఠం 68వ పీఠాధిపత్యం అనుకోకుండా ఆనాడు మధ్యాహ్నం 2:58ని పరిసమాప్తమయ్యింది.


హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పేద - ధనిక, ఉన్నత వర్గం – నిమ్న వర్గం అనే తేడా లేకుండా మొత్తం భారతదేశం వారికి నివాళులు అర్పించడానికి తరలి వచ్చింది. 


అప్పటి ప్రధానమంత్రి పి.వి నరసింహారావు గారు తమ కార్యక్రమాలన్ని రద్దు చేసుకుని తమిళనాడుకు పయనమయ్యారు.


సంవత్సరం ఆరంభంలో స్వామి వారికి కఫం తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలకు స్వామి వారి దర్శనం ఆపేసారు. కానీ వారు కొద్దికాలంలోనే తేరుకుని మళ్ళీ ప్రజలతో మమేకమయ్యారు. 


ఆరోజు మహాస్వామి వారు ఉదయాన్నే 100 మంది భక్తులు పఠించిన విష్ణుసహస్రం విన్నారు. 


సేవకుని చేత వారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని తెప్పించి ఈ జన్మను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి, 


మళ్ళీ పుట్టనవసరం లేని స్థితిని కల్పించిన గురువుల బృందావనములు ఉన్న కలవై వంక తిరిగి నమస్కరించి, యోగమార్గం ద్వారా బ్రహ్మరంధ్రము నుండి ప్రాణముల ఉద్గమింపజేసి కొన్ని కోట్ల మందిని ఎన్నో విధాలుగా ఉద్ధరించి సాక్షాత్ ‘నడిచే దైవం’గా ప్రస్తుతింపబడిన మహాస్వామి వారు తాము ఈ భూమికి వచ్చిన కార్యాన్ని ముగించుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యాన్ని పొందారు.


స్వామి వారి దేహాన్ని రాత్రి 7:05 నిముషాలకు ప్రజల సందర్శనార్థమై వెలుపలికి తెచ్చి, వారు ఎప్పుడూ కూర్చుని భక్తులను ఆశీర్వదించే అరుగుపై ఉంచారు. సశరీరులుగా స్వామిని దర్శించిన చోటులోనే స్వామి వారిని చివరిగా చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. 


మొత్తం కంచి వీధులన్ని వేలమంది జనంతో నిండిపోయాయి. స్వామివారు జాత్యాతీతులు. వారిని దర్శించుకోవడానికి ఎందరో మహమ్మదీయులు, క్రైస్తవ సన్యాసినులు మూడు మైళ్ళ పొడవైన వరుసలను సైతం లెక్కచేయకుండా వచ్చారు. 


వందల మంది ఆస్థాన విద్వాంసులు, గాయకులు స్వామి వారికి ఇష్టమైన పాటలను పాడారు. తరువాత వారికి పుష్పాలతో పాటు బంగారు పుష్పాలతో కూడా అర్చన జరిగింది. ఏకహారతి, పంచహరతి, నక్షత్రహారతి వంటి నానా రకములైన మంగళహారతులను ఇచ్చి, చివరిగా కర్పూర హారతితో స్వామి వారికి చివరి పూజను పూర్తి చేశారు.


ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి, సన్యాసాశ్రమ ధర్మాలను తు.చ. తప్పక పాటించిన అపర శంకరావతారులు ఎన్నో దేవాలయాలను వేద పాఠశాలలను నెలకొల్పిన ధర్మస్వరూపులు. కొన్ని దశాబ్ధాలుగా పేలాలు, పళ్ళు, పాలు ఒక్కపూట మాత్రమే తీసుకుంటూ సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం పాదాచారియై ఆసేతుహిమాచలం నడిచారు. 


*మహాస్వామి వారు మన ప్రశంసలకు అతీతులు కేవలం మనం వారి సమకాలీనులు అని చెప్పుకోవడమే గర్వకారణం*

🙏🌹🙏💐🙏🌸

వీరమాచనేని బహిరంగ సవాల్!

 Teachers Society Channel:

ఆనందయ్యను ఏ విజ్ఞానంతో అడ్డుకుంటున్నారో సెలవిస్తారా?


జనచైతన్య వేదికకు వీరమాచనేని బహిరంగ సవాల్!


వీరమాచనేని రామకృష్ణ...... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఆరోగ్యాభిలాషులకు పరిచయం అక్కర్లేని పేరు. జీవన శైలిలో ముఖ్యంగా ఆహారంలో స్వల్ప మార్పుల ద్వారా అనేక రకాల జీవన శైలి వ్యాధులకు చెక్ పెట్టిన అ‘సామాన్యుడు’. ప్రస్తుతం ఆనందయ్య మందుపై గగ్గోలు పెడుతున్న విజ్ఞాన వేత్తలకు కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆయన జనచైతన్య వేదిక లక్ష్మారెడ్డిగారికి ఈ లేఖ వ్రాసినా నిజానికి ఈ లేఖలో ప్రశ్నలకు ప్రజాక్షేమం కోరుకునే నికార్సయిన మేధావులు సైతం సమాధానం చెప్పాలి. లేదా ఈ ప్రశ్నల వల్ల ఇందుకు, ఇలా... సమాజానికి కీడు అని చెప్పగలగాలి. పెట్టుబడికి మాత్రమే కట్టుబడి లక్షల కోట్ల దోపిడీకి తమ విజ్ఞానాన్ని అమ్ముకుంటున్న లేదా తాకట్టు పెడుతున్న కుహనా మేధావులకు వంతపాడడం కాకుండా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం... లేదా ఈ ప్రశ్నలలోని లోపాలను వివరిస్తే ఖచ్చితంగా సమాజానికి మేలు చేసినవారవుతారు. లేని పక్షంలో అల్లోపతి ముసుగులో ప్రపంచాన్ని శాసిస్తున్న సోకాల్డ్ గైడ్లైన్స్ ను మెడికల్ మాఫియాపై సమైక్య పోరాటం చేయాల్సిన అవసరం ముఖ్యంగా వైద్యరంగం పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంగా మాత్రమే ఉండేలా ఉద్యమించాల్సిన అవసరం ఉందని జనవిజయం అభిప్రాయపడుతోంది. జనచైతన్య వేదిక వారికి వీరమాచనేని రామకృష్ణ వ్రాసిన లేఖను యథాతథంగా దిగువన ఉంచుతున్నాము. ఆరోగ్యాభిలాషులందరూ ఈ పోస్టును మిత్రులందరికీ షేర్ చేయాలని మనవి చేస్తున్నాము.



---------------------------



జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి గారికి నమస్కారాలతో..


ఒక మందు శాస్త్రీయ నిరూపణ చేశాకే ప్రజలకు పంపిణీ చేయాలి అనే గొప్ప విషయం అల్లోపతికి వర్తించదా..?! డయాబెటిస్ లాంటి జీవనశైలి వ్యాధులకు అల్లోపతిలో ఇస్తున్న వైద్యం చేతబడి, రంగురాళ్ళ కంటే హీనమైనది. దానిపై మీరు ఎందుకు పోరాడటం లేదు..?


ఈ ప్రపంచంలో గత వంద సంవత్సరాలలో అల్లోపతి మందులతో డయాబెటిస్ తగ్గిన ఒక్కడి పేరు చెప్తే మీకు రెండు కోట్లు బహుమతి ఇస్తాను. అలాగే మీకు తెలిసిన వంద మంది డయాబెటిస్ వారిని నా దగ్గరకు పంపండి. అందులో ఒక్కడికి తగ్గకపోయినా నేను తప్పు అని ఒప్పుకొని రెండు కోట్లు మీకు బహుమతి ఇచ్చి, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటాను. భూమిలో ఒక్కడికీ రోగం తగ్గించలేని మందులు ప్రపంచం అంతటా ప్రోటోకాల్ ఎలా అయ్యాయో, అందులో మాయాజాలం ఏమిటో మీరే చెప్పాలి.. వాటి గురించి మీ ప్రజా గొంతులు మూగపోతాయి ఎందుకో మరి..!


అల్లోపతి మాత్రమే ప్రపంచంలో అతి పెద్ద సైన్స్ అనేది నిర్వివాదాంశం.. కానీ అదేమీ అన్నింటిలో తోపు కాదు.. ముఖ్యంగా అందులో జీవనశైలి వ్యాధుల చికిత్స పేరిట దూరిన మందుల కంపెనీలు ఇరికించిన తప్పుడు గైడ్ లైన్స్ కారణంగా కోట్ల మంది బలి అయ్యారు.. ఇప్పటికీ బలి అవుతూనే ఉన్నారు.. డయాబెటిస్ చేస్తున్న విధ్వంసంతో పోలిస్తే కరోనా పిపీలకం.. కరోనా మరణాలలో కూడా డయాబెటిస్ దే సింహ భాగం..


మీకు ఒక సూటి ప్రశ్న. భూమి పుట్టాక ఒక్కడికీ డయాబెటిస్ రివర్స్ చేయలేని అశాస్త్రీయ అల్లోపతి మందులు నిషేదించమని మీరు ఎప్పుడయినా పోరాడారా..??


సింపుల్ గా ఆహారం తీసుకొనే విధానాలు మార్పు ద్వారా మొదటిరోజే మందులు మురుగ్గుంటలో పారేసి డయాబెటిస్ ను తరిమి కొట్టిన రిపోర్టులు మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను.


ఆనందయ్య గారి మందులో శాస్త్రీయత ఉందో లేదో నాకు తెలియదు. కాలం తేలుస్తుంది.. ఆనందయ్య గారు అల్లోపతి ని ఛాలెంజ్ చేయలేదు.. కానీ నేను డయాబెటిస్ కు మందులు వాడటం గురించి అల్లోపతి గైడ్ లైన్స్ మీద తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నాను. బహిరంగ సవాల్ విసురుతున్నాను.. వాళ్ళు ముందుకు రావటం లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు.. నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ హేతువాద సంఘాలు, జన ఆజ్ఞాన వేదికలు (కొన్ని సంఘాలు), ప్రతి దాంట్లో దూరే గోగినేని బాబు గారి లాంటి అశాస్త్రీయ సమర్ధకులు నా ఛాలెంజ్ ఎందుకు స్వీకరించటం లేదు..?


ఆనందయ్య గారి నాటు మందు అల్లోపతి మందుల వ్యాపారానికి ఎక్కడ గండి కొడుతుందో అని భయపడే మీ ప్రజా సంఘాలు అదే అల్లోపతి డయాబెటిస్ మందులపై తీవ్ర పోరాటం చేస్తున్న నా మీద కూడా అలాగే ముందుకు రావాలి అని మీకు బహిరంగ సవాల్ విసురుతున్నాను.


ఒక మందు అల్లోపతినా? ఆయుర్వేదమా? నాటుమందా? ఆహార విధానమో అనేది ప్రజలకు లోతుగా అవసరం లేదు. వారికి(మాకు) కావలసింది రోగం తగ్గటం, సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవటం మాత్రమే..


సైన్స్ రెండు రకాలు.. ఒకటి నిజం సైన్స్.. రెండోది సైన్సు ముసుగులో దాక్కున్న దొంగ సైన్స్.. ఈ రెండూ ఒకటి కాదు.. మీరు రెండిటినీ కలిపి సమర్ధిస్తున్నారు..!


ఒక వాక్సిన్ ఒకరికి 150 కు ఇస్తారు, అదే వాక్సిన్ మరి కొందరికి 1200 కు అమ్ముతారు.. 150 లోనే లాభాలు ఉంటాయి..ఇక 1200 అమ్మకంలో ఎంత మిగులుతుందో ఊహించండి.. పైగా పుట్టని శిశువు నుంచి కాసేపట్లో పోయేవాడికి కూడా భయపెట్టి మరీ మల్టిపుల్ డోసులు వేయించబోతున్నాం.. అంటే వందల కోట్ల డోసులు x వెయ్యి రూపాయల ప్రాఫిట్..


అది కూడా కేవలం ఒకటి రెండు కంపెనీలకు మాత్రమే సుమా..! ఇక బ్లాకు మార్కెట్ గాళ్ళ పండగల గురించి వేరే లెక్క.. నిజానికి రెమెడిసివర్ లాంటి మందు MRP షుమారు 3000 ఉంటే (అందులోనే 80% ప్రాఫిట్ మినిమం) బ్లాకులో ఎంతకు అమ్మామో తెలుసు కదా..


రోజుకు లక్ష బిల్లు వేసి జనాన్ని దోచుకున్న కొన్ని (అందరూ కాదు) కార్పోరేట్ హాస్పిటల్స్ మీద మీలాంటి ప్రజా సేవకులు పోరాడతారు అని మాలాంటి వాళ్ళు భావిస్తుంటే పోయి పోయి అమాయకుడు, ఏదో తనకు తెలిసిన మంచిని సొంతడబ్బులతో పంచుదామనుకున్న ఆనందయ్య మీద పడ్డారు.. ఆయన మీద పెట్టే కాన్సంట్రేషన్ లో వందో వంతు పైన జరుగుతున్న దోపిడీ ల మీద పెట్టి ప్రజలకు మేలు చేయండి సార్..!


హైడ్రాక్సీ క్లోరోక్విన్లు, ఫావిఫెరావిర్లు, ప్లాస్మా ధెరఫీలు, రెమెడిసివర్లు పని చేయవు అని తేలిపోయింది.. ఇక నికరంగా మిగిలింది జింకు సప్లిమెంట్లు, ఐరన్ టాబ్లెట్, విటమిన్/మినరల్ టాబ్లెట్లు పారాసెటమాల్ మాత్రమే.. అంటే నాలాంటోళ్ళు చెప్పే ఇమ్యూనిటీ ఫుడ్డు మాత్రమే మిగిలింది నికరంగా..


ఒక హేతువాది చెప్తాడు నాలుగు సార్లు నోబుల్ కు నామినేట్ అయిన వైరాలజిస్ట్ చెప్తే మేము వినము నోబుల్ వచ్చినోడు చెప్తే మాత్రమే వింటాము అని.. ఈ నోబుల్ గ్రహీతలు, కోట్ల డాలర్ల మందుల కంపెనీలు, సైన్స్ ప్రతినిధులు ఇంత వరకు ఒక్క పరిష్కారం ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలి.. ఈ నోబుల్ గ్రహీతలు ఇంతవరకూ జలుబు, షుగరు, బిపి, కాన్సరు, వైరస్ లు, ఆటో ఇమ్యూన్ రోగాలు వేటికీ మందు కనిపెట్టలేదు.. కనిపెట్టిన వాటిని ఎలా తొక్కేస్తారో చరిత్ర వివరంగా చెప్తుంది..


ప్రజలకు మంచి చేయాలన్న మీ సంకల్పం గొప్పది.. కానీ ఆచరణలో దానికి వ్యతిరేకంగా జరుగుతోంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తోంది.


నా అభిప్రాయాలతో మీరు విభేదించినట్లయితే మీ టీమ్ తో మీడియాలో బహిరంగ చర్చకు సిద్దం కండి.. నేను నా టీమ్ రడీ గా ఉన్నాము.. అన్ని విషయాలు ప్రజల సమక్షంలో వివరంగా చర్చిద్దాం.. మీ వాదన సబబుగా ఉంటే నా విధానం మార్చుకోవటానికి నేను సిద్దం.. ప్రజల మేలు కోసం ముందుకొస్తారని ఆశిస్తున్నాను..


భవదీయుడు,

వీరమాచనేని రామకృష్ణ ,

వాట్సప్ నెంబర్ : 9246472677

*కర్మ ఫలం తప్పదు

 *కర్మ ఫలం తప్పదు*


🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏


*కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు*.

మన పాపకర్మే  గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.


పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. 

కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.


తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.

 ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.


అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.


తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.


అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు. 


అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని  అన్నాడా కశ్యపుడు.


అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు. 


కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు.  ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి 

ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు. 


చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. 


వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. 


ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.


*ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.*


*మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.*

ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. 

అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.

*పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా*.


ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి. 

కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా,  పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.

ఏమిటి ఆ పాప కర్మ?  

ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. 

*మంచివారితో మహాత్ములతో చెలగాడటం*.

కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.


రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, *కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.*

 

పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! *మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది*. 


మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.

నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.

*మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది*.

కర్మ బలీయమైనది.


గోవిందా, నారాయణా, రామా,శివా!కాపాడు!కాపాడు!అని ప్రార్ధిస్తూ ఉంటాం. *ప్రాణాపాయంలో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు. ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా?* నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం వున్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు.


మన పుణ్యపలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది.

గురు అనుగ్రహం వున్నదా? 

గురు దృష్టి వున్నదా? 

శుభగ్రహ దృష్టి వున్నదా? 

వుంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు.

పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.


*"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."*

*"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది"* .


పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు,పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ.

కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.


తాతముత్తాతలు చేసిన *పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది*.

ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలన్ని కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది.

ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.


*మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము*.

వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది.

మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది. 


సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు వున్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా! 

కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ

చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు.

*అదే కర్మఫలం, కాల మహిమ*.


*కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు.* దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి.

తక్షకుడు విషనాగు అంటే *ప్రారబ్దకర్మ*. దానిని కూడా జయించింది *మంత్రశాస్త్రం*. 

కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే,  మంత్రం మరలా దానిని చిగురింప జేసినది.

అంటే *మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది* అని మనం తెలుసుకోవాలి.

మంత్రం ప్రాణం పోస్తుంది. 

కానీ ఆ *మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి! అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!*🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏

వైశాఖ పురాణం - 16

 _*వైశాఖ పురాణం - 16 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




 *యముని పరాజయము*



☘☘☘☘☘☘☘☘☘




అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా ! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన , ధ్వనులు వినిపించవేమి ? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి ? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి ? అని ప్రశ్నించెను. యముడును దీనుడై ఇట్లనెను. నారదమహర్షీ ! భూలోకమున ఇక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు ఇట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.


యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు , రోగము , యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.


అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.


*సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ*

*త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా*

*త్వాం* *యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||*


*నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః*

*తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||*


అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.


అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు , అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు , బీజము , విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు , దిక్పాలకులు , రూపముకల , ఇతిహాసపురాణాదులు , వేదములు , సముద్రములు , నదీ నదములు , సరోవరములు , అశ్వర్థాది మహా వృక్షములు , వాపీకూప తటాకములు , పర్వతములు , అహోరాత్రములు , పక్షములు , మాసములు , సంవత్సరములు , కళలు , కాష్ఠములు , నిమేషములు , ఋతువులు , ఆయనములు , యుగములు , సంకల్ప వికల్పములు , నిమేషోన్మేషములు , నక్షత్రములు , యోగములు , కరణములు , పూర్ణిమలు , అమావాస్యలు , సుఖదుఃఖములు , భయాభయములు , లాభాలాభములు , జయాపజయములు , సత్వరజస్తమోగుణములు , సాంత , మూఢ , అతిమూఢ , అతి ఘోరావస్థలు , వికారములు , సహజములు , వాయువులు , శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.


ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని ఇతడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి ? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి ? అని ఇట్లు సభలోనున్న భూతములు , దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను. స్వామీ ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.


దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి ? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా ? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు , దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు ? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు ? ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము ? నీవెందులకు వచ్చితివి ? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు 'అయ్యో' అని అతి దీనముగ బలికెను.




*వైశాఖపురాణం పదహారవ అధ్యాయం సంపూర్ణం*

విష్ణుమూర్తి-వెనుక వైపు జగన్మోహిని....

 _*ముందు వైపు విష్ణుమూర్తి-వెనుక వైపు జగన్మోహిని....*_


 ఈ అరుదైన యాత్రాస్థలం  'ర్యాలీ 'మన రాష్ట్రంలో గోదావరి గట్టున ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది. 


 ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని. ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో? 


నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇందులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది నిజమైన నిదర్శనం. కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి.


 అదేవిధంగా 'శిఖ' జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా, నిజంగా జుట్టు ఉందా? అనిపించేలా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే,!. 


ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది.అది 'విష్ణు పాదోధ్బవియైన గంగ' అనే ఆధ్యాత్మిక నమ్మకం.


 ఆమాట పక్కన పెడితే,, శిలల్లో 'జలశిల' అనే దాన్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం.


 గుడిప్రాంగణమంతా దశావతారాలకి సంబంధించిన శిల్పాలు కొలువై ఉన్నాయి.


 చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, 11 వ శతాబ్దం లో ఈ ఆలయాన్ని నిర్మించాడు. 


గోదావరి జిల్లా ప్రాంతంలో(రాలి-అంటేపడిపోవటం.అదేమార్పుచెంది 'ర్యాలి' గామారింది. '. ఈ ప్రాంతాన్ని పూర్వం 'రత్నపురి' అని పిలిచేవారు. భాగవత కధ ప్రకారం... దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యాడు. 


దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిపట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు. 


ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది. ఆ కారణంగా ఆప్రాంతానికి 'ర్యాలి' అని పేరు వచ్చిందని స్థలపురాణం. 


విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. 


అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.


తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుంది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు.

ఏ స్తోత్రం చదివితే ఏ ఫలితం

 ఏ స్తోత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది....

**ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి*... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు *ఎక్కడా దొరకదు*... *మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు*... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము... ప్రతి స్తోత్రం *కింద ఉన్న లింకులో వాటిని ఎలా చదవాలి వీడియో guide తో వచనంతో పిడిఎఫ్* అన్ని లింకులు ఇచ్చాము...

మీ అయిన వాళ్ళకి ఈ లింక్ ని పంపించడం మరిచిపోవద్దు...

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి, https://tinyurl.com/69fa4f22

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

https://bit.ly/36t2H69

💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!https://tinyurl.com/ppr64cmb

💠 కాలభైరవ అష్టకం - శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి.. ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !! https://tinyurl.com/3cf8wn3n


💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!::https://tinyurl.com/37dh6zc9

💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

https://bit.ly/36LY3As

💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !! https://tinyurl.com/2mbn8bwr

💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

https://bit.ly/2Q8O4QD

💠అర్థనారీశ్వర స్తోత్రం...ఉమామహేశ్వర స్తోత్రాలు భార్యాభర్తల మధ్య కలహాన్ని తొలగించుటకు... అన్యోన్య దాంపత్యానికి

భార్యాభర్తలు కలిసి వింటే చాలా అన్యోన్య దంపతులుగా మారతారు... దాంపత్య జీవన అర్థం.. భార్యా భర్తల బాధ్యతలు తెలుస్తాయి...

💠అర్థనారీశ్వర స్తోత్రం... భార్యాభర్తల మధ్య కలహాన్ని తొలగించుటకు...https://tinyurl.com/phynfbea

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://tinyurl.com/yaz4m9aj 

💠 శివతాండవ స్తోత్రము: https://tinyurl.com/39stztj4

💠 లింగాష్టకము: https://tinyurl.com/3r9xr76b

💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

https://bit.ly/3dGR0Nc

💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

https://bit.ly/3uTXnT6

💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !! https://tinyurl.com/58c34xev

💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. https://tinyurl.com/yth83p7k

💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !! https://tinyurl.com/4a7zc9v6

💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!https://tinyurl.com/3mx545af

💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !! https://tinyurl.com/em3h4crs

💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!https://tinyurl.com/bde54fwn

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

https://bit.ly/3hvpkgB

💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !! https://tinyurl.com/323y4btf

💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !! https://tinyurl.com/3m6dxfsr

💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !! https://tinyurl.com/uzvfk78n

💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !! https://tinyurl.com/39stztj4


💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !! https://bit.ly/2QVTGgZ

https://bit.ly/2QVTGgZ

💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

https://bit.ly/2YvUGZW

💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

https://bit.ly/39SphH2

💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!

https://bit.ly/2Ry0vWm

💠 శ్రీ సూక్తం - ధన లాభం !! https://bit.ly/2R4Tv3o

💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

https://bit.ly/3dLBuzU

💠 సుదర్శన అష్టకం - శత్రు నాశనం !! https://tinyurl.com/y3x6s2um

💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !! Https://bit.ly/3dL4Mie

💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !! https://tinyurl.com/tcfhmk3f

💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !! https://bit.ly/2SCaL0x

💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!https://bit.ly/345D3mB

💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

https://bit.ly/2RziDjc

💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

https://tinyurl.com/bjhd6w42

💠 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి

 https://bit.ly/36Y4RLB

💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి

 https://bit.ly/3jlAUtS

💠 మణిద్వీప వర్ణన 

https://tinyurl.com/3yd3c7de

🙏🙏🙏

ఇలాంటి విశేషాలను ఎన్నో మీకు అందిస్తున్న మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

https://www.youtube.com/c/sriragasriraga

నాట్యమొచ్చేస్తుందా

 కాల్లు చేతులు కదిలిస్తేచాలు నాట్యమొచ్చేస్తుందా ?

--------------------


64 కళలలో నాట్యం ప్రధానమైంది. హిందూదేశంలో నర్తనకళ చాలా ప్రాచీనమైంది, ఇది ఎంతో ఆదరణ పొందింది. నాట్యానికి అంగలక్షణం అనగా శరీరసౌష్టం ముఖ్యమైంది.

అంగలక్షణమంటే తల, ముఖం, వక్షస్థలం, కుక్షి (ఉదరం), కటి (నడుము), తొడ,మోకాలు, కాలు, పాదం (అరికాలు ) అనే పది శరీరభాగాలతో చేరి వుంటుంది.


అభినయమంటే శరీరభాగాలను కదల్చి హావభావాలను ప్రకటింపచేయడం. అభినయం ద్వారా అన్ని రకాల భావాలను ప్రకటింప చేసినప్పటికి వాచకం (గాత్రం) తోడైతే బంగారానికి సువాసనలు అద్దినట్లుగా వుంటుంది. వాచకానికి సాహిత్యం అవసరం. అభినయవాచకాల ద్వారా  విషయాన్ని ఖచ్చితంగా  ప్రకటించవచ్చును.


అంగలక్షణాన్ని నాట్యశాస్త్రకారులు నాలుగు భాగాలుగా విభజించారు. అవి 

(1) మహాంగం, ఇందులో ముఖం, ఛాతీ (యెద)నాభి, కటి అనే శరీరభాగాలతో అభినయం వుంటుంది.


( 2 ) కాళ్ళు చేతులు అంగాలుగా చెప్పారు.


(3) నఖ (గోర్లు), శిఖ (శిరం), దంతాలు అనేవి ఉపాంగాలు.


(4) ఆయుధం, వస్త్రం, ఆభరణాలు, వాద్యపరికరాలను ప్రత్యంగాలుగా చెప్పారు.


నాట్యంలో అభినయం ముఖ్యం. అభినయం కూడా నాలుగురకాలు, అవి.

(1) తల, కంఠం, కాలు, చేయి, ఇతర శరీరభాగాలను ఆడిస్తూ చేసేదాన్ని అంగికాభినయం అంటారు.(2) నోటితో పాడుతూ నాట్యం చేస్తే దానిని వాచికాభినయం అంటారు 

(3)  ఏ పాత్రకు అనుగుణంగా నాట్యం చేస్తారో ఆ పాత్రకు అనుగుణంగా వస్త్రాలు, ఆభరణాలు, ఆయుధాలు, సంగీతపరికరాలు ధరిస్తే దానిని ఆహార్యాభినయం అంటారు.ఉదా॥ సత్యభామ, శ్రీకృష్ణ, శివ, నటరాజు, గొల్లభామలకు వేరువేరుగా వస్త్రాభరణాలుంటాయి.

(4) కేవలం ముఖకవళికల ద్వారా హావభావాలను ప్రదర్శిస్తే దానిని సాత్వికాభినయం అంటారు.


నాట్యశాస్త్రంలో చేతులు ప్రముఖమైనవి.చేతివేళ్ళను చాపుట, ముడుచుట, వంచుట, విరుచుట, రకరకాలుగా కదల్చుట అనే ఐదు విన్యాసాలతో సందర్భోచితంగా పలు భావాలను ప్రకటించవచ్చు.


చేతులతో చేసే అభినయాన్నే ముద్రలు అంటారు. వీటినే హస్తముద్రలు లేదా సంజ్ఞా హస్తాలంటారు. ఇవి ఒక చేస్తో చేసేవి, రెండుచేతులతో చేసేవిగా వుంటాయి. అభయహస్తం ఒక చేస్తో చేయటానికి,అంజలి రెండు చేతులతో చేయటానికి ఉదాహరణలు.  ఒకచేత్తో చేసినా రెండుచేతులతో చేసినా దానిని ముద్ర అంటారు.


ఏకహస్త ముద్రలు  24 రకాలుగావున్నాయి. అవి


 (1) అభయహస్తం (2) వరదహస్తం (3) కటకహస్తం (4) సింహకర్ణహస్తం (5) వ్యాఖ్యానహస్తం (6) సూచీహస్తం (7) తర్జనీహస్తం (8) కర్తరీముఖహస్తం (9) అలపద్మహస్తం (10) విస్మయహస్తం.


 (11) పల్లవహస్తం (12) నిద్రాహస్తం (13) అర్థచంద్రాహస్తం (14) అర్థపతక హస్తం (15) త్రిశూలహస్తం (16) ముష్టిహస్తం (17) శిఖరహస్తం (18) భూస్వర్శహస్తం (19) కటిహస్తం (20) ఊరుహస్తం (21) ఆలింగనహస్తం (22) ధనుర్ హస్తం (23) ఢమరుహస్తం (24) తాడనహస్తం.


ఇక రెండు చేతులతో చేసేముద్రలు (1) అంజలి (2) ధ్యానం(3) పుష్పపుటం (4) ధర్మచక్రం.


ఇవేకాకుండా నాలుగు అలంకారముద్రలు కూడా వున్నాయి.అవి


(1) గజహస్తం లేదా కరిహస్తం. చేతిని నేరుగా చాపి మణికట్టు వద్ద వంచితే అది గజహస్తం. నటరాజవిగ్రహాలలో కరిహస్తాన్ని చూడవచ్చు.

(2) దండహస్తమంటే ఆసన (కూర్చున్న) భంగిమలో ఒక కాలును మడచి పీఠముమీద వుంచి మోకాలుపై మణికట్టును వుంచాలి. అయ్యప్పస్వామి విగ్రహం ఇందుకు ఉదాహరణ.

(3) డోలహస్తం. చెట్టుకొమ్మలోని రెండు రెమ్మలు కిందికి వేలాడురూపం. స్త్రీ ప్రతిమలలో చూడవచ్చును.

(4) ప్రసారితహస్తం. శయనరూపంలోవున్న విష్ణుప్రతిమలో, నృత్యగణపతి మొదలైన విగ్రహాలలో చేతిని పొడవుగా చాచి వేళ్ళను కిందికి (పల్లవముద్రలా) వదిలాలి.


నాట్యభంగిమలు ఈ నాటికి బ్రతికిబట్టకట్టాయంటే అందుకు శిల్పకళాశాస్త్రప్రకారం మనవారు నిర్మించిన హిందూదేవాలయాలే తార్కాణం.బేలూరు, హళేబీడు, మధుర, హంపి, తాడిపత్రి ఇలా చెప్పుకొంటూ పోతే నాట్యభంగిమలు లేని దేవాలయమే లేదంటే అతిశయోక్తే. ---------------------జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

మాతృభాష పై

 *మాతృభాష  పై మమకారం  :* 


తల్లిపాల వంటిది మాతృభాష, పోత పాల


వంటిది పరభాష’ అటువంటి అమ్మ భాషను


మరిచి పరభాషకు అంకితమైపోతున్నాము.


మాతృభాష కళ్లు లాంటిది, ఇతర భాష


కళ్లజోడు లాంటిది. కళ్లజోళ్లు ఎన్నైనా


మారుస్తాము కానీ కళ్లు మార్చలేము.


మాతృభాష తపస్సు, మహిత జగతికి


ఉషస్సు. తెలుగే మన ప్రాణం భవితకు


మాగాణం.


కనుక మనందరం ముద్దులొలికే తెలుగును


ముచ్చటగా పలకాలి. పలుకు పలుకులో


కులుకు పరవశించి పలకాలి.

నేడు శ్రీ కూర్మ జయంతి

 *🌹🌹 నేడు శ్రీ కూర్మ జయంతి 🌹🌹*


*శ్రీ కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి!*


         *దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవ , దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా , వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు*. 


      *అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది*. 


 *శ్రీకాకుళం జిల్లాలోని గారమండలం లో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు , హఠకేశ్వరుడు , సుందేశ్వరుడు , కోటేశ్వరుడు , పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ , కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది*. 


         *కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు , అతని భార్య వంశధారల తపస్సుకు , భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ , బ్రహ్మాండ , పద్మ పురాణాలలో వుంది*. 


            *శ్రీరాముడు , బలరాముడు , జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.*


*ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట*. 


 *దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం*. 


            *శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ , అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు*. 


  *ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు*. 


         *ఇక శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం ,  కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు*.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

చెడు* అనేది .

 *చెడు* అనేది ..


*విషయాలు, ఆలోచనలు, మాటలు* *అలవాట్లు, వ్యక్తులు*


ఏ రూపంలో అయినా రావచ్చు ...


మొదట ఒక అపరిచిత వ్యక్తిలాగా మనకు తారసపడుతుంది, 


నౌకరు లాగా చేతులు కట్టుకొని ఎదుట నిలబడుతుంది, 


ఆ తర్వాత స్నేహితుడి లాగా దగ్గరవుతుంది, 


*చివరకు యజమానియై మన తల మీద స్వారి చేస్తూ మనని తన  బానిస  చేసుకుంటుంది ..* 


తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ...