24, ఫిబ్రవరి 2021, బుధవారం

మాఘ పురాణం*_🚩 🚩 _*14 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*14 వ అధ్యాయము*_🚩


       *గురువారం*

*ఫిబ్రవరి 25, 2021*


🕉🌞🕉🌞🕉🌞🕉🌞


_*విప్రుని పుత్రప్రాప్తి*_


🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️


గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.

మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే, మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడుగగ, జహ్నమహర్షి యిట్లనెను. "జహ్నమునీ! వినుము. మాఘమాస వ్రతము నాచరించుటచే, ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు, కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను, హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి, జ్ఞానియై, సత్కర్మల నాచరించి, ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము" అని యిట్లు పలికెను.


పూర్వము గంగా తీరమున, బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతిదయజ్ఞానము, యింద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయునుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప, మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు, భార్యతో, "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు, మనకును, సద్గతులు కలుగునాయని విచారపడెను". అప్పుడామె, "నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును"అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు," ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి, నిశ్చలమైన తపముచేసి, మృకండు మహామునివలె, ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరిl.


బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు, శ్రీహరిని, మనసులో నిలుపుకొని, తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు, శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును, శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితో

 నుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము, మకరమండలముల కాంతితో, మరింత శోభాయమానముగ నుండెను. నారదమహర్షి స్తుతించుచుండగా, అప్సరకాంతలు పాటలు పాడుచుండగా, లక్ష్మీసమేతుడై, గరుత్మంతుని పైనెక్కి, ఆ బ్రాహ్మణునకు, వరమీయవచ్చెను.


తనను గమనింపక, తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి, చిరునవ్వు నవ్వుచు, "విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను, ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్యజ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి, నిశ్చల చిత్తముతో నతడు చేయుతపము, భగవంతుడగు శ్రీహరికి, మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన, యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు, బాహ్యప్రపంచమునకు, మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా, నా బ్రాహ్మణుడు, కారణమేమని, కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే యెదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు, శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.


_*విప్రకృత విష్ణుస్తుతి*_


నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |

నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||

గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |

కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |

అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |

జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |

కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||

నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |

విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||

సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |

హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||

పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |

ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||

జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |

వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||

జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |

ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||

నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |

గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||

కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |

కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||

సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |

భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||

నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |

నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||

(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు, భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము, అందరు చదువుట శ్రేయస్కరము)


జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి, ఆనంద పరవశుడై, నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు ''స్వామీ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము, ఇహలోకమున, పరలోకమున, సద్గతికి కారణమైన, పుత్రసంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమ"ని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన 

యీ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి, నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి, యంతర్థానము నుందెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు, తన యింటికి చేరెను. కొంతకాలమునకు, వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.


కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి, వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య, బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని, వానిని,  నిమురుచు, కన్నీరు కార్చుచు, నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో, ఆహారమును తీసికొనక, విచారించుచుండెను. "నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి, వరముగా, నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు, పండ్రెండు సంవత్సరములు జీవించి, విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను?" అని భర్తతో పలికెనుl.


ఆ విప్రుడును, భార్య మాటలను విని, బాధపడుచు, నామెనోదార్చ నిశ్చయించెను. ఆమె నూరడించుచు, యిట్లనెను. "ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది. అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు, నాకును, యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు, మనము మరిణించిన తరువాతనైన, మరణింపక తప్పదు కదా! మరి యీ ముందు వెనుకలు, వయస్సులకు కలదు కాని, మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము. జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో, నీకు విచారమేల? నీవు దుఃఖించినను, కానున్నది కాక మానదు. అనగా, నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతిప్రాణియు, తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపకుము" అని, యామెనూరడించెను, "మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి, పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము" అని పలికి, మరల గంగాతీరమున చేరి, నియమనిష్టలతో శ్రీహరిని, సర్వోపచారములతో, పూజించుచుండెను. శ్రీహరి, అష్టాక్షరీ మంత్రమును, జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది, ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు, శ్రీమన్నారాయణునకు, సాష్టాంగ నమస్కారము చేసి, నిలిచియుండెను.


*పదునాల్గవ అధ్యాయము*  

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మాఘ పురాణం*_🚩 🚩 _*13 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*13 వ అధ్యాయము*_🚩


      *బుధవారం*

*ఫిబ్రవరి 24, 2021*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 *సుశీలుని కథ*


🕉️☘☘☘☘☘☘🕉️


రాజా ! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను , ఉన్నతములగు వృక్షములతోను , పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి అవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.


కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ ! నీవెవరవు ? నీకీ పరిస్థితియేమి ? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా ! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను , ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన , దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క , గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన , నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.


సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా ! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే , వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.


సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని , కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక , పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నొంది పుణ్యలోకముల నందుదురు. 


స్నానము యేడు విధములు. అవి ,


*మంత్రములను చదువుచు చేయు స్నానము , మంత్రస్నానము.*


*మట్టిని రాచుకొని చేయు స్నానము , మృత్తికాస్నానము.*


*భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము , ఆగ్నేయస్నానము.*


*గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము , వాయవ్యస్నానము.*


*నదులు , చెరువులు మున్నగువానిలో చేయు స్నానము , వరుణ స్నానము.*


*ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము , దివ్యస్నానము.*


*మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము , మానసస్నానము.*


*ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు , వృద్ధులు , రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును , జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.*


*స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము , ఉమ్ము , ఆవలింత , మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని , పసుపు , కుంకుమ , ఫలములు , పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట , జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి , ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను , ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను , నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును , పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.*


స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని , గంగను , దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా , యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి , ఏకాదశి , శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను , దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును , పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.


*పదమూడవ అధ్యాయము*  

            *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మహమ్మారి మళ్లీ వస్తోంది!*

 *మహమ్మారి మళ్లీ వస్తోంది!*


*కొవిడ్‌పై రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్రం*


*ఆస్పత్రులు, పరికరాలు సిద్ధంచేస్తున్న ఆరోగ్య శాఖ*


*ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్లకు ఆదేశాలు*


*కొవిడ్‌-19 నిపుణుల కమిటీ అత్యవసర సమావేశం*


*ఎపిడిమాలజీ కమిటీతోనూ ఆరోగ్య శాఖ చర్చలు*


*సెకండ్‌ వేవ్‌ వచ్చే చాన్స్‌ ఉందని సభ్యుల సూచన*


*మార్చి మొదటి వారం నుంచే కేసులు పెరిగే అవకాశం*


*మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సూచన*


మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? సెకండ్‌ వేవ్‌తోపాటు కొత్త స్ట్రెయిన్‌ కూడా కలిసొస్తే.. పరిస్థితి ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్‌.. కఠిన ఆంక్షలు.. అమ్మో తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాదిలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో.. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి. కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కొవిడ్‌-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు. 


కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు. వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత  కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే సెకండ్‌ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఆ సూచలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడంలేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రోజుకు వంద లోపు కేసులు నమోదవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు పాజిటివ్‌ వచ్చినా సమాచారం ఇవ్వడం లేదు. ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరిగిపోతున్నాయి. ఇవేవీ ఆరోగ్యశాఖ లెక్కల్లోకి రావడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా బులెటిన్‌లో తక్కువ కేసులు చూపిస్తూ.. ఏపీలో కరోనా తీవ్రత లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


*మూడు నెలల వ్యత్యాసంతో మళ్లీ..*


తొలి విడతలో ఉత్తర భారతంలో మొదలైన కరోనా వైరస్‌ దక్షిణ భారతానికి వ్యాపించడానికి 3-4 నెలల సమయం పట్టింది. సెకండ్‌ వేవ్‌ కూడా ఇదే తరహాలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి రావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలు దాదాపు నిజం కాబోతున్నాయి. ఏపీలో నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. నిపుణుల కమిటీ అంచనా వేసినట్టే.. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఆ ప్రకారం చూస్తే మార్చి నెలలో ఏపీలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 


 *కొత్త స్ట్రెయిన్‌ వస్తే మరిన్నికష్టాలు* 


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైర్‌సను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణుల కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ కూడా బయటపడితే మాత్రం ప్రభుత్వానికి భారం తప్పదు. వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ తలకు మించిన భారంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా కరోనాను గుర్తిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించాలంటే ఈ టెస్టు సరిపోదు. దానికోసం శాంపిల్స్‌ను హైదరాబాద్‌, పుణెకు పంపించాల్సిందే. లేదంటే కొత్త స్ట్రెయిన్‌ గుర్తించే కిట్లు కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణ, మందుల కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన ప్రభుత్వానికి ఇది తలకుమించిన భారమే. కొవిడ్‌కు సంబంధించిన బిల్లులే ఇంతవరకు చెల్లించకుండా రూ.400 కోట్లు బకాయిలు పెట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ వస్తే మాత్రం మళ్లీ ఆర్థిక కష్టాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు.

🤷🏻‍♂️

కరోనా హెచ్చరిక

 *కరోనా హెచ్చరిక:

ప్రజా ప్రయోజనాల రీత్యా జారీ చేయబడింది. 

కరోనా వైరస్ వ్యాప్తి  ఇప్పుడు  2 వ దశలో  ఉందని, సోకిన 3 రోజులలోనే   తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

*దయచేసి మీ పనులు అన్ని పక్కన పెట్టి 2 నిముషాలు ఈ అత్యవసర కరోనా మెసేజ్ చదవండి..*

ఇంతకు ముందు కరోనా వైరస్ వేరు. ఇప్పుడు అది మారిన తీరు వేరు.. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది..

మరియు 60 ఏళ్ళు దాటిన వారికి తీవ్రం గాను, యుక్త మధ్య వయస్సు వారికి స్వల్పం గాను ప్రభావాన్ని చూపేది.కానీ world హెల్త్ organisation (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితి లోకి చేరుకుంది.ఏ మాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ వారినైనా సరే మూడే మూడు రోజుల్లో  మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ  మరలి రాని లోకాలకు తీసుకెళ్లి పోతూ ఉంది..

రోజూ కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు అయిన వాళ్ళని, అందర్నీ  దిగ్భ్రాంతికి గురి చేసి మూడే మూడు రోజుల్లో మృత్యు ఒడి లోకి జరుకుని  తీవ్ర దుఃఖాన్ని మిగుల్చు తున్నారు.. 

కరోనా వెరీ డేంజర్ స్టేజ్ లో ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు వెల్లడించిందంటే..  కరోనా సోకిన 1,2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే  ట్రీట్మెంట్ చేసినా బతకలేని స్థితిలో మనిషి ఊపిరి ఆపి ఉసురు తీసుకుంటూ ఉంది.. 

*ఏముంది కరోనా పోయింది లే.. ఎక్కువ కేసులు లేవు లే.. సి-విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాం లే.. మన వరకూ రాదులే.. దేవుడున్నాడు లే అని మాస్క్ లు లేకుండా, సామజిక దూరం పాటించకుండా, sanitisation చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మూడే రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్లి పోవడం గ్యారంటీ..* 

ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకుని నిలబడి తనని తాను మరింత ప్రమాదకర వైరస్ గా రూపు దిద్దుకుంది. 

కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్ లు అన్ని పక్కన పెట్టి   C, D, జింక్ లాంటి మల్టీ విటమిన్ లు తీసుకుంటూ, *మాస్క్ లు, హ్యాండ్ sanitisation లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ..*  అన్నిటికంటే మరీ ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగ వలెను..లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడ లేడు..


కావున ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వీడి,14 రోజుల కరోనా నుండి అత్యంత ప్రమాద కారిగా మారిన ఈ 3 రోజుల కరోనా వైరస్ ని నిశితంగా గమనిస్తూ పై సూచనలు జాగ్రత్తగా కాపాడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకో వలసిందిగా కోరుచున్నాము. 


ఈ మెసేజ్ ని 10 మందికి పంపి మీ పక్క వారు కూడా పాటించేలా జాగ్రత్త పడండి.. 


ఎందుకంటే, ఈ కరోనా వ్యాపించేది పక్క మనిషి నుండే అనే విషయాన్ని మర్చి పోవద్దు.. ఒక్కోసారి పనికి రాని చెత్త విషయాలను షేర్ చేస్తూ సమయం వృధా చేస్తూ ఉంటాం.

ఈ ఒక్కసారికి  ఈ విలువైన msg ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చెయ్యండి.. 


*గుర్తుంచుకోండి.. ఇప్పుడు ఉన్నది 14 రోజుల కరోనా కాదు.. 3 రోజుల కరోనా అనే విషయాన్ని మర్చిపోవద్దు..*🙏

మూడు జన్మల ముష్టివాడు

 ఒక గ్రామంలో ఒక  బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటి వద్ద  *భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ* అని అడిగాడు. 

ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు. *పండితుడికి కోపం వచ్చింది*  నేనిక్కడి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా.  వీటికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే ఏమేవ్ *మూడు జన్మల ముష్టివాడు* వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు.  ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది.  అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి.  వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా  ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు.  ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు అదా దానికే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా  అయితే ఇలా కూచో అన్నాడు.  ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.

*శ్లోకం* : 

*అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః*

*దరిద్ర దానాచ్చ కరోతి పాపం*। 

*పాప ప్రభావాత్ పునర్దరిద్రః*

*పునర్దరిద్రః పునరేవ పాపీ*॥

అని శ్లోకం చదివాడు. వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు.  నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు.  నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు. నీకు లేకపోయి వుండొచ్చు. ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు. లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. ఎందుకు ? 

ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా. నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు. 

*జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు* ఇలా కూచో అన్నాడు. పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు. పర్వాలేదు కూచో *జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి* కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. కూర్చున్నాడు బిచ్చగాడు. ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక.  అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్.  ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు.  *తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం*. తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు.    బిచ్చగాడికి విషయం అర్థమైంది.  వెంటనే  ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి. ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో  సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. తిరగడం కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు.  అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు.  ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. పుచ్చకున్న దాంట్లో  ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు  కాశీ వెళిపో కూడదు అని అనిపించింది. బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న  సగం దానం చేయడం. మిగిలినదే తినడం *అంటే అర్థాకలి* తన *ఆకలి కడుపుని* భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద  *కాశీ పట్టణాన్ని చేరాడు*. అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు.  ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం  ప్రసక్తి లేదు. లేదా సాయం ధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా ఆతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. *అతనొక సాధకుడని*కారణ జన్ముడనీ*  అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద  పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము. అతని పేరును  *కరపాత్ర స్వామీజీ* అని ప్రజలే ఆపేరు పెట్టారు .   కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరుపెట్టారు. ఇలాగ  వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస  చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతని కీవిషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లయినాక  ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ *కరపాత్ర స్వామీజీ* ని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన  15 ఏళ్లుగా తెలుసు.  వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే  ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ  వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ  వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.

 మన *కరపాత్ర స్వామీజీకి* అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ  1) *కరపాత్ర స్వామిజీ* ఎవరు. *ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను* ఎంత దౌర్భాగ్యుణ్ణి.  

2) *నాకు గురువు ఎవరు*  ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో  తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు.  అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు  ఆలోచించుకున్నాడు.  ప్రశ్నించుకుంటూ ఉంటే  తనకొక విషయం తట్టింది. *తనలో  మార్పునకు కారణమైన వ్యక్తే గురువు* అని నిర్ణయించుకున్నాడు.

 అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట  బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు.  దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు  ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన  ఖ్యాతి  ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి  గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో *కరపాత్ర స్వామిజీ* వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయనకూడా వెంటనే అంగీకరించాడు. *పండితుడువెళుతూనే పాద నమస్కారం చేసాడు* ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు. ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలామంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు *భిక్షా సమయం* అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. *పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి* అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరు లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన *ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.* ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెకుఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు.  ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగ పరచకూడదని కరతలంలో  భిక్ష పెట్టింది. 

అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామిజీ. అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే *పండితుడు*  *స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు*. స్వామిజీ ఇచ్చేశాడు. 

ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ  ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అ అడిగాడు. పండితుల వారు *నన్ను గుర్తు పట్టారా* అని.  అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు. 

సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు. వద్దండీ *శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు*. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. *నాగురుదేవులు మీరు*. అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు. 

అయ్యా ముందు వినండి. *నేను ఎవరో కాదు  మీమూడు జన్మల ముష్టివాణ్ణి* అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా  భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి *పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది*. అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు *నిష్కర్షగా* చెప్పాలి. ఆనాటికే కాదు  ఈనాటికీ నేను సామాన్యుడినే.  కానీ *ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా*  చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే *నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ*. లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను *మహా అహంకారిని పండితుడని గర్వం ఉండేది* నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక 

ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ  హాయిగా పరమానందానుభూతిని పొందారు.👏👏

*మన మహర్షులు - 2*

 *మన మహర్షులు - 2*


 *అత్రి మహర్షి:*


🍁🍁🍁🍁🍁


అత్రి మహర్షి  సప్తమహర్షులలో  ఒకరు.


అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు. 


అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు “లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్చక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి" అని అడిగాడు


అందుకు అత్రి మహర్షి సరే! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు


ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది. ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది


ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి  తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని, క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు.


https://www.facebook.com/సనాతన-హిందూ-ధర్మం-101453447917569/


 కొంతకాలం తర్వాత, అత్రి మహర్షికి  అనసూయాదేవితో వివాహం జరిగింది. 

 అనసూయాదేవి గొప్ప

పతివ్రతగా వినుతికెక్కింది.


 ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. 


అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి

అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు.


త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది.


త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒకసారి కౌశికుడి భార్య, సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది.


అత్రి మహర్షి సంతానం కోసం  వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు.


అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు.


 కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి  

 అనసూయా దేవికి చంద్రుడు,  దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు.


సంసారపోషణార్ధం  పృథు చక్రవర్తి దగ్గరకు ధనం కోసం  వెళ్ళాడు అత్రి మహర్షి.


ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు.


పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. 


అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు.


 అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు.


అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం, వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది. అప్పుడు

అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందర్ని చంపేశాడు.


అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి.


అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు, గురుప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాలాపవిత్రత, పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి.


దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది.

అత్రిమహర్షి......!


చదివారు కదా !... సప్తమహర్షుల్లో ఒకడయిన అత్రి మహర్షి గురించి...


రేపు మరో మహర్షి గురించి తెలుసుకొందాం...


*సనాతన హిందూ ధర్మం*

🍁🍁🍁🍁

మన మహర్షులు-32

 మన మహర్షులు-32


 యాజ్ఞవల్క్య మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


పూర్వం గంగానదీ తీరంలో ఉన్న చమత్కార పురంలో యజ్ఞవల్కుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడి భార్య సుకన్య. అతడు బ్రహ్మని గురించి తపస్సు చేసి బ్రహ్మవిద్యని వ్యాప్తి చెయ్యడానికి బ్రహ్మనే తనకు కొడుకుగా పుట్టమనడిగాడు


బ్రహ్మ సరేనన్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశీ ఆదివారం ధనుర్లగ్నంలో యజ్ఞవల్కుడికి కొడుకుగా పుట్టాడు. ఆ పిల్లాడు బ్రహ్మగారంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతడికి యాజ్ఞవల్క్యుడు, బ్రహ్మరాతుడు, దైవరాతుడని పేర్లు పెట్టారు.


యాజ్ఞవల్క్యుడికి సమయ సందర్భ కాలోచితం గా సంస్కారాలన్నీ జరిపించి విద్య నేర్చుకుందుకు పంపించారు.


 ఋగ్వేదం పాష్కలుడి దగ్గర, సామవేదం జైమిని మహర్షి దగ్గర, అధర్వణ వేదం ఆరుణి ఋషి దగ్గర నేర్చుకున్నాక యాజ్ఞవల్క్యుణ్ణి వైశంపాయనుడి దగ్గరకి పంపించారు.


 ఆయన సేవ చేసుకుని గురువుగారితో మంచి వాడనిపించుకుని యజుర్వేదం, వేదరహస్యాలు, పరమార్ధ రహస్యాలు అందరికంటే ముందే నేర్చేసుకున్నాడు యాజ్ఞవల్క్యుడు.


కాని యాజ్ఞవల్క్యుడు నాకు అన్ని వేదాలు వచ్చు. నేను బ్రహ్మహత్యాపాతకం కూడ ఏడు రోజుల్లో పోగొట్టగలనని గర్వంగా అనడం మొదలు పెట్టాడు. గురువుగారికి ఇది తెలిసి నిజం తెలిసికోడానికి అతని గర్వం అణిగించడానికి తన మేనల్లుణ్ణి కాలితో తన్ని నా బ్రహ్మహత్యాపాతకం ఎవరైనా తగ్గిస్తారా? అని శిష్యుల్ని అడిగాడు.


యాజ్ఞవల్కుడు 'వాళ్ళకేం తెలుసు నాకే వచ్చు 'అన్నాడు. గురువుగారు కోపం వచ్చి మూర్ఖా! నాకు రాని విద్య నీ దగ్గరేముంది? నీ గర్వం అణగాలనే ఇలా చేశాను అన్నాడు వైశంపాయనుడు.


నేను చెప్పిన వేదాలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపొమ్మన్నాడు.


 శిష్యుడు ఎంత బ్రతిమిలాడినా వినలేదు గురువు .


గురుదేవా! మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తానని యాజ్ఞవల్క్యుడు రక్తం రూపంలో వేదాలన్నీ

అక్కడే వదిలేసి తపస్సు చేసి వైశంపాయనుడి బ్రహ్మహత్యాపాతకం పోగొట్టాడు.


ఆ రక్తం గడ్డలు కట్టి వుంటే తిత్తరపక్షులు తిని తిత్తరులనే వేదాలు చెప్పాయి. వాటినే “తెత్తిరీయోపనిషత్తు" అంటారు.


యాజ్ఞవల్క్యుడు సూర్యుణ్ణి ఆరాధించి శుక్లయజుర్వేదం నేర్చుకుని ఎంతో మంది శిష్యులు మళ్ళీ వాళ్ళకి

శిష్యుల్లో ప్రచారంలోకి తెచ్చాడు. యాజ్ఞవల్క్యుడి మొదటి శిష్యుడు కణ్వుడు.


ఒకసారి జనక చక్రవర్తి యాగం చేసి ఋషులందర్నీ పిలిచాడు. యాజ్ఞవల్క్యుడు కూడ వెళ్ళాడు. యాగం అయిపోయాక జనకుడు మీలో గొప్పవాడెవరో చెప్తే ఆయనకి ధనరాశుల్ని ఇస్తాననీ మీరే తేల్చుకుని చెప్పండి నాకంత శక్తి లేదని అన్నాడు.


ఎవరికి వాళ్ళు లేవలేదు. యాజ్ఞవల్క్యుడు మాత్రం శిష్యుల్ని పిలిచి ఆధనం ఇంటికి తీసికెళ్ళండి అన్నాడు.


 శాకల్యముని లేచి నువ్వే గొప్పవాడివని నీకు నువ్వే నిర్ణయించుకుంటావా? నాతో వాదించమన్నాడు.


శాకల్యమునితో వాదించి ఆయన్ని ఓడించాడు యాజ్ఞల్యుడు .జనకుడు ఆయనని సన్మానించి పంపాడు.


జనకచక్రవర్తి యాజ్ఞవల్క్యుణ్ణి అడిగి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు.


తర్వాత విశ్వావసుడు యాజ్ఞవల్క్యుణ్ణి తత్త్వబోధన చెయ్యమని అడిగి విశ్వావిశ్వాలు, మిత్రావరుణులు, జ్ఞానజ్ఞేయాలు తపోతపాలు, సూర్యాతిసూర్యులు, విద్యావిద్యలు వేద్యావేద్యాలు వంటి చాలా విషయాల గురించి తెలుసుకున్నాడు.


మహర్షులందరూ కలిసి ఒక గొప్ప యోగికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందరికంటే గొప్ప యోగరహస్యాలు తెలిసినవాడు యాజ్ఞవల్క్యుడేనని అతనికి యోగీంద్ర పట్టాభిషేకం మాఘశుద్ధ పౌర్ణమినాడు చేశారు.


యాజ్ఞవల్క్యుడు ఋషులకి చెప్పిన విషయాలే 'యోగ శాస్త్రం',

 'యోగయాజ్ఞవల్య్యం

అనే పేరుతో పన్నెండు అధ్యాయాలులో గ్రంథాలుగా వచ్చాయి.


 'యాజ్ఞవల్క్యస్మృతి' అనే గ్రంథంలో నాలుగు కాండలున్నాయి. మొదటి దాంట్లో

పధ్నాలుగు విద్యలు, పరిషత్తు, సంస్కాత, స్నాతకం, పౌరోహితం, వివాహం మొదలైనవి రెండో కాండలో న్యాయస్థానం, శిక్ష, స్త్రీధనం గురించి మూడు, నాలుగు, కాండల్లో అపరకర్మ, అశౌచశుద్ధి, యతి ధర్మాలు, మోక్షమార్గం, యమ నియమాలు, ప్రాయశ్చిత్తాలు మొదలైనవి.


చేసే పనులు, పొందిన జ్ఞానం రెండూ కలిస్తేనే మోక్షం కలుగుతుంది. ఒక్క జ్ఞానం వల్ల మోక్షం రాదని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

రాజకీయ నాయకులకు పెన్షన్కు

 A. ➡రాజకీయ నాయకులకు పెన్షన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది.

 

B. ➡ ఈ కార్యంలో భాగస్వాములు అవండి మరియు మద్దతు ఇవ్వండి. 

 

C. ➡ ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు, మీ అంచనా కోసం పంపారు .. 

 

 D. ➡ప్రియమైన / గౌరవనీయమైన భారత పౌరులు ... మీరు ఈ సందేశాన్ని చదవమని అభ్యర్థన, మరియు మీరు అంగీకరిస్తే దయచేసి మీ పరిచయంలో ఉన్న ప్రజలందరికీ పంపండి మరియు ఇతరులకు పంపమని వారిని అడగండి. 

 

 E. ➡మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో ఉండాలి. భారతదేశంలోని ప్రతి పౌరుడు  స్వరం పెంచాలి. 😝__ 

 

 *2018 అభివృద్ధి చట్టం*

 

 1.  ➡ఎంపీలు పెన్షన్ పొందకూడదు ఎందుకంటే రాజకీయాలు ఉద్యోగం లేదా ఉపాధి కాదు. ఉచిత సేవ.  రాజకీయ నాయకులు, ప్రజా ప్రాతినిధ్య చట్టం క్రింద ఎన్నిక చేయబడవచ్చు, పదవీ విరమణ లేదు, కానీ మళ్లీ అదే పరిస్థితిలో వారిని తిరిగి ఎన్నుకోవచ్చు.  *(ప్రస్తుతం వారికి పెన్షన్ లభిస్తుంది, 5 సంవత్సరాల సేవ తర్వాత).* 

 

2.  ➡ ఇందులో మరో రుగ్మత ఏమిటంటే, ఒక వ్యక్తి మొదట కౌన్సిలర్‌గా ఉండి, తరువాత శాసనసభ్యుడిగా మారి, తరువాత ఎంపీగా మారితే, అతనికి *ఒకటి* కాదు *మూడు పెన్షన్లు* లభిస్తాయి. 

దేశ పౌరులకు ఇది గొప్ప ద్రోహం ... 

 దీన్ని ఆపడానికి వెంటనే చట్టం చేయాలి.  

 

 3.  ➡కేంద్ర వేతన సంఘంతో ఎంపీల జీత భత్యం సవరించబడుతోంది .... దీన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి .... 

 

  4.  ➡ప్రస్తుతం, ఎంపీలు తమకు తామే ఓటు వేసుకోవడం ద్వారా ఏకపక్షంగా జీతాలు మరియు భత్యాలను పెంచుతారు మరియు ఆ విషయంలో అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. 

 

 5.  ➡ఎంపీల ఆరోగ్య సంరక్షణ విధానాన్ని సవరించాలి. మరియు ఇతర పౌరుల మాదిరిగానే భారతదేశ ప్రజారోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ విధానంలోనే వారిని చూసుకోవాలి. ప్రస్తుతం వారి చికిత్స తరచుగా విదేశాలలో జరుగుతుంది .. వారికి చికిత్స విదేశాలలో చేయవలసి వస్తే, వారు దానికయ్యే ఖర్చులను వారే స్వంతంగా భరించాలి . 

 

6.  ➡ విద్యుత్తు, నీరు, ఫోన్ బిల్లు వంటి అన్ని రాయితీలు తొలగించాలి.  (వారు అలాంటి అనేక రాయితీలను పొందడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా పెంచుతారు)  

 

 7.  ➡నేరస్థులను ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించాలి, శిక్షాత్మక రికార్డులు, క్రిమినల్ అభియోగాలు మరియు సంకల్పం ఉన్న అనుమానాస్పద వ్యక్తులు పార్లమెంటు నుండి నిషేధించబడాలి .. 

 

8.  ➡ కార్యాలయంలోని రాజకీయ నాయకుల వల్ల వారి వల్ల కలిగే ఆర్థిక నష్టాలు కూడా వారి నుంచి తిరిగి పొందాలి, వారి నామినీలు, ఆస్తులు - ఎంపీలు కూడా సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలను పాటించాలి. 

 

 9.  ➡పౌరులు ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీపై తగ్గింపు లేదు ... ఎంపీలు, ఎమ్మెల్యేలకు లభించే సబ్సిడీలు, మరియు పార్లమెంట్ క్యాంటీన్‌లో సబ్సిడీతో సహా ఇతర రాయితీలు తొలగించాలి.

 

 10.  ➡పార్లమెంటులో సేవ చేయడం ఒక గౌరవం, దోపిడీకి లాభదాయకమైన వృత్తి కాదు. 

 

 11.  ➡వారిఉచిత రైలు, విమానాల ప్రయాణం ఆగిపోవాలి. 

 

 12.  ➡సామాన్యులు వారి దోపిడీని  ఎందుకు భరించాలి? 

 

 13.  🚷ప్రతి వ్యక్తి కనీసం ఇరవై మందితో కమ్యూనికేట్ చేస్తే, భారతదేశంలో చాలా మంది ఈ సందేశాన్ని పొందడానికి మూడు రోజులు మాత్రమే పడుతుంది. 

 

 14.  ➡ఈ సమస్యను లేవనెత్తడానికి ఇదే సరైన సమయం. 

 

 F.  ➡పై విషయాలతో మీరు అంగీకరిస్తే, దాన్ని ఫార్వార్డ్ చేయండి.  

  లేకపోతే, దాన్ని తొలగించండి. 

 G.  ➡మీరు నా 20+ లో ఒకరు, దయచేసి దీన్ని కొనసాగించండి ...  

 :ధన్యవాదాలు

COURT FEE

 

*COURT FEE REQUIRED TO BE AFFIXED IN FRESH CASES FILED BEFORE*

*THE ESTABLISHMENT OF DISTRICT AND SESSIONS JUDGE*

1. Regular Civil Appeal 50 (Each Relief)

2. Civil Misc. Appeal 50

3 Civil Revision 10

4 Rent Appeal 50

5 Civil Suit 50

6 Every other suit where it is not possible to estimate the

money value the subject matter in dispute and which is not

otherwise provided for by this Act.

50

7 Civil Misc. Application 10

8 Caveat Petition 25

9 MACT Petition 10

10 Execution Application against the order of MACT Award 10

11 Pauper Application 10

12 Petition U/s 34 of Arbitration and Conciliation Act 300

13 Petition U/s 9 of Arbitration and Conciliation Act 150

14 Execution petition against the Award u/s 36 of Arbitration

and Conciliation Act

200

15 Hindu Marriage Act U/s 13 and 13-B 50

16 Special Marriage Act 100

17 Plaint or memorandum of appal under the Parsi Marriage

and Divorce Act 1936

500

18 Plaint or memorandum of appeal in a suit by a reversioner

under the Punjab Customary Law or declaration in respect

of an alienation of ancestral land

500

19 Criminal Appeal where accused is on bail 10

20 Criminal Revision 10

కవితా వనితా

 🌸 *!! _సుభాషితమ్_!!

శ్లో|| కవితా వనితా చైవ

స్వయమేవాగతా వరా |

బలాదాకృష్యమాణాసా 

సరసా విరసా భవేత్ ||


తా|| కవిత్వం కాని, వనిత కాని తమంత వలచి పురుషుణ్ణి చేరితేనే అది శ్రేష్ఠంగా ఉంటుంది. అలాకాక బలవంతంగా వశం చేసుకోదలిస్తే ఫలితం వికటిస్తుంది - అని భావం.... 

🙏✨🌷