1, జులై 2024, సోమవారం

Panchang


 

*శ్రీ నాగేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 365*






⚜ *కర్నాటక  : మోసలే - హసన్*


⚜ *శ్రీ నాగేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయం*



💠 మోసలే అంటే కన్నడలో మొసలి అని అర్ధం మరియు శ్రీ పరశురాముని తండ్రి అయిన రిషి జమదగ్ని అతని ఆశ్రమ స్థలంగా పరిగణించబడుతుంది.


💠 ఈ పవిత్రమైన గ్రామంలో సమ్మేళనం ఏకకూట దేవాలయాల యొక్క రెండు సారూప్య నిర్మాణాలను కలిగి ఉంది, హొయసల శిఖరం యొక్క హాల్ గుర్తుతో, మూడు అంచెల శిఖరం నుండి ఆదిస్థానం వరకు అత్యంత అలంకరించబడినది.


💠 మోసాలే హాసన్‌లో ఉన్న ఒక చిన్న గ్రామం.  ఈ గ్రామంలో హోయసల కాలం నాటి రెండు అందమైన దేవాలయాలు ఉన్నాయి.  

ఈ జంట దేవాలయాలు ఒకే సముదాయంలో ఉన్నాయి.  

ఈ దేవాలయాలను 12వ శతాబ్దంలో హోయసల అధిపతి వీర బల్లాల II నిర్మించినట్లు చెబుతారు.  

రెండూ ఏకకూటాచల దేవాలయాలు.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటిలో ఒకటి శివునికి, మరొకటి విష్ణువుకి అంకితం చేయబడింది.


💠 దక్షిణాన ఉన్న ఆలయంలో ప్రధాన దేవతగా నాగేశ్వరుని రూపంలో మహాదేవుడు & ప్రక్కనే మరియు సమాంతరంగా చెన్నకేశవ రూపంలో ఉన్న మహావిష్ణువు ఆలయం ఉంది


💠 శంఖ చక్ర గధ పద్మం యొక్క స్థానం ఆధారంగా, మనం విష్ణువు యొక్క 24 రూపాలను కనుగొనవచ్చు.  వాటిని చతుర్వింశతి రూపంగా పేర్కొంటారు.

వారిలో మొదటి రూపం కేశవ.  

ఇక్కడ శ్రీ విష్ణువు ఎగువ కుడి మరియు ఎడమ చేతిలో శంక మరియు చక్రాన్ని మరియు దిగువ కుడి మరియు ఎడమ చేతిలో పద్మ మరియు గాధను కలిగి ఉన్నాడు.  

విష్ణువు యొక్క ఈ రూపం హోయసల దేవాలయాలలో సర్వసాధారణం. 

 బేలూరుకు చెందిన చెన్నకేశవ స్వామిగా ప్రసిద్ధుడు.


💠 శిల్ప వర్ణనలు శైవ, శాక్త మరియు వైష్ణవ ప్రతిమాలను వివరిస్తాయి.  

నాగేశ్వర దేవాలయంలోని చిత్రాలలో నాథ, శ్రీదేవి, లక్ష్మీదేవి, గౌరీ, మహేశ్వరి, బ్రహ్మ, సదాశివమూర్తి, చిత్రధార మరియు భూమిదేవి వంటి పీఠాలపై వారి పేర్లు ఉన్నాయి. 


💠 చేన్నకేశవ ఆలయంలో భూదేవి, శ్రీదేవి, చామరధారిణి శిల్పాలతో పాటు గరుడ, కేశవ, సంకర్షణ, జనార్దన, వేణుగోపాల, అనిరుద్ధ, మాధవ శిల్పాలు ఉన్నాయి.


💠 ఈ ఆలయంలో వైష్ణవ మరియు శైవుల విగ్రహాలతో పాటు వేద దేవతలు మరియు శాక్త ఆరాధనల చిత్రాలు కూడా ఉన్నాయి.


💠 చెన్నకేశవ దేవాలయం ముందు, ద్వారం దగ్గర ఉన్న ఏకైక శాసనం, 1578లో 2 వ్యక్తుల గౌరవార్థం ఆలయానికి మంజూరు చేయబడిన కొన్ని దానాల గురించి ప్రస్తావించింది.

అంతేతప్ప ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనేది అస్పష్టంగా ఉంది, పునాది రాయి లేదు మరియు ఇతర శాసనాలు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.

ఆలయ ప్రతిష్ఠాపన గురించి ఎటువంటి పునాది రాయి మరియు శాసనాలు లేనందున, నిపుణులు ఆలయ శైలి మరియు ఆ కాలపు దేవాలయాలకు సంబంధించి నిర్మాణ ఆవిష్కరణల ఆధారంగా ఈ  జంట దేవాలయాలను 12వ శతాబ్దంలో హోయసల అధిపతి వీర బల్లాల II నిర్మించాడని చెబుతారు.  


💠 గర్భగృహం, శుకనాసి, నాలుగు స్తంభాల నవరంగ మరియు ప్రవేశ ద్వారం కలిగి ఉండటంలో అవి ఒకదానికొకటి సమానంగా ఉంటాయి.  

నవరంగ లోపల ఉన్న రెండు దేవాలయాలు ఉత్తర, దక్షిణ మరియు పడమర గోడలలో ఒక్కొక్కటి రెండు దేవకోష్ఠాలను కలిగి ఉన్నాయి.  

ఎత్తులో ఉన్న దేవాలయం యొక్క నక్షత్ర అధిష్ఠానం రెండింటికీ సాధారణమైన అచ్చులను కలిగి ఉంటుంది. 


💠 రెండు దేవాలయాలు మనోహరమైన గోపురాలను కలిగి ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి పైన హోయసల శిఖరం ఉంటుంది. 

ఈ ఏక కూట దేవాలయాల గోపురాలు మంచి స్థితిలో ఉన్నాయి. 


💠 జంట దేవాలయాలు హొయసల వాస్తుశిల్పం యొక్క ప్రామాణిక లక్షణాలతో నిర్మించబడ్డాయి, అయితే కొన్ని దేవతల పేర్ల కారణంగా అవి విలక్షణమైనవి.


💠 సోమనాథపూర్ వంటి ఇతర హోయసల దేవాలయాలలో వలె, ఈ శిల్పాలు వాటి శిల్పుల పేర్లను వెల్లడించవు. 

నిశితమైన పరిశీలకుడు మాత్రమే శిల్పి పేరు యొక్క ప్రస్తావనను చూడగలరు. 

మరోవైపు, తరువాతి కాలంలోని దేవాలయాలు ఏ శిల్పాలపై దేవతల పేర్లను పేర్కొనలేదు. దేవాలయాల పైకప్పులన్నీ సంక్లిష్టమైన నమూనాలు మరియు డిజైన్లతో చెక్కబడి ఉన్నాయి. 


💠 విష్ణు దేవాలయంలోని గర్భగుడి ద్వారం గజలక్ష్మి బొమ్మను కలిగి ఉంటుంది.

6 అడుగుల ఎత్తైన చెన్నకేశవుని చక్కగా చెక్కిన  చిత్రం క్రింద వైపులా శ్రీదేవి మరియు భూదేవితో కలిసి ఉంది. 

శివాలయం వెలుపలి గోడలపై వివిధ రూపాల్లో శివుని ఆసక్తికరమైన శిల్పాలు ఉన్నాయి. వాటిలో చాలా దురదృష్టవశాత్తు దెబ్బతిన్నాయి. 


💠 శివుడు, లింగ రూపంలో, గర్భగుడి లోపల ఒక పీఠంపై నిలబడి ఉన్నాడు.



💠 హాసన్ నుండి 15 కి.మీ దూరం

కర్ణుడు

 కర్ణుడు..


కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు. అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం "సంతాన సాఫల్య మంత్రం". ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు, అంటే ఆమెతో సంభోగం చేసి గర్భం చేసి వెళ్లడం కాదు వారి అంశతో ఒక పాపని సృష్టించి ఇచ్చి వెళ్లడం తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. 


ఇక విషయంలోకి వెడితే...

పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి  శ్రీమహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నరనారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. 


హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత  నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం నరుని’గానూ., ‘సింహ’ రూపం నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నరనారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై  తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నరనారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నరనారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నరనారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.


నరనారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకున్నాడు. 


నరనారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు  సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నరనారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. 


ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను, నరనారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్రకవచునే పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నరనారాయణులిరువురూ కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.


ఇది కర్ణుని వృత్తాతం.

శంఖము

 శంఖము

--------

సనాతన ధర్మములో శంఖానికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు.

దేవుళ్ళు, దేవతల చేతులలో శంఖము ఉన్నట్టు వర్ణింపబడి ఉంటుంది. శంఖాన్ని పూరించడము వలన అత్యంత శుభములు కలుగుతాయి.

క్షత్రియులకు శంఖము ఎలాగ యుద్ధపరమైన ఒక ఆభరణమో, బ్రాహ్మణులకు ఆది ధార్మికపరమైన ఆభరణము.

.

చండీ సప్తశతిలోనూ, భగవద్గీతలోను, ఇతర పురాణాలలోను , దేవతలు దానవులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు , పాండవులు కౌరవులతో మహా సంగ్రామము చేసినపుడు, ప్రతి దినమూ  ఆరంభములో శంఖనాదము చేసి గానీ యుద్ధము మొదలు పెట్టరు అని చదువుతాము. అలాగే యుద్ధాని విరమించే సంకేతముగా కూడా శంఖనాదము చేస్తారు.

.

బ్రహ్మవైవర్త పురాణములో, శ్రీకృష్ణ పరమ భక్తుడైన గోప సుదాముడు శాపవశమున శంఖచూడుడు అను రాక్షసుడిగా జన్మించి, దేవతలను బాధించుటచే, శంకరుడు అతడిని వధించెననీ, ఆతడి అస్థికలనుండీ మహా శంఖము ఆవిర్భవించెననీ చెప్పబడి ఉంది. దానిని విష్ణువు సంగ్రహించి తన వద్ద ఉంచుకున్నాడు.

.

మరొక కథనము ప్రకారము, " పంచజన " అనే భయంకరుడైన దానవుడు, సూక్ష్మ రూపములో సముద్ర గర్భములోని ఒక శంఖములో నివశించేవాడు. అవసరమైనపుడు తన నిజరూపము దాల్చి, బయటకు వచ్చి, దేవతలను, మనుషులను పీడించేవాడు.

.

ఒకసారి వాడు, ’ సాందీపని ’ మహర్షి యొక్క ఏకైన కుమారుడిని అపహరించుకొనిపోయి మింగేసినాడు.  అటుతరువాత కొంత కాలానికి, శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపని మహర్షి గురుకులములో విద్యాభ్యాసము పూర్తి చేసిన తరుణములో, గురువు గారిని ’ గురుదక్షిణ స్వీకరించవలసినదనీ, ఏమి అడిగినా ఇచ్చుటకు తాము సిద్ధమనీ ’  ప్రార్తిస్తారు. అప్పుడు సాందీపని మహర్షి, పంచజనుడు ఎత్తుకుపోయిన తన కుమారుని రక్షించి తీసుకురమ్మని గురుదక్షిణగా అడుగుతాడు.

.

బాలకుని వివరాలు అన్నీ తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు, సముద్రములోకి దూకి, పంచజనుడిని వెదకి వెళ్ళి పట్టుకుని చంపేస్తారు. అతడు నివసిస్తున్న శంఖాన్ని సంగ్రహించుకుని వస్తారు. అయితే బాలకుడు అప్పటికే మరణించాడని తెలుసుకుని, యమలోకానికి వెళ్ళి, ఆ బాలకుడిని బ్రతికించుకుని  తీసుకువచ్చి గురువుగారికి అప్పజెపుతారు.

పంచజనుడి నుండీ వచ్చింది కాబట్టి ఆ శంఖానికి ’ పాంచజన్యము ’ అనే పేరు వచ్చింది.


అందుకే, || త్వం పురా సాగరోత్పన్నః, విష్ణునా విధృతః కరే, దేవైశ్చ పూజితస్సమ్యక్ పాంచజన్య నమోఽస్తుతే || అను శ్లోకము ప్రకారము, మనము పూజించే శంఖము పాంచజన్యమే .

ఈ పాంచజన్యము అనే శంఖమును కృష్ణుడు సంగ్రహించి తనవద్ద ఉంచుకొన్నాడు.

.

శంఖము లో బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు. గంగా , సరస్వతీ నదులు మొదలుకొని అనేక తీర్థాల ఆవాస స్థానమే ఈ శంఖము.

అందుకే, శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకొని వింటే సముద్రపు హోరు వినిపిస్తుంది. మరే ఇతర వస్తువును పెట్టుకున్నా ఆ హోరు వినపడదు.

.

ఒక అతి ముఖ్యమైన విషయము మీరు గమనించి ఉంటారు.

కలిప్రభావము అని చెప్పినా కూడా, ఈ తరములో విపరీత భావాలు, రాక్షస ప్రవృత్తి గల వారు అధికముగా పుట్టుకొని వస్తున్నారు. ఒక తరము వెనుక ఇంతటి సంఖ్య లో ఉండేవారు కాదు. ఇంకా వెనుకటి తరాలలో అస్సలు ఇటువంటి మనుషులు ఉండేవారు కాదు.

.

దీనికీ, శంఖానికీ ఒక అతి దగ్గర సంబంధము ఉంది.

శంఖాన్ని పూజించేటప్పుడు చెప్పే శ్లోకాలలో,

|| గర్భా దేవారి నారీణాం విశీర్యంతే సహస్రశః |

తవ నాదేన పాతాళే పాంచజన్య నమోఽస్తుతే ||

అని పూజిస్తాము.

శంఖాన్ని గట్టిగా పూరిస్తే, ఆ నాదానికి రాక్షసులు , దానవులు, దైత్యులు బెదరి పారిపోవడమే కాదు, ఆ నాదము విన్న ఆయా రాక్షసుల భార్యలు గనక గర్భవతులై ఉంటే, వారి గర్భాలు విఛ్ఛిన్నమై పోయి పాతాళములో పడిపోతాయి.

.

సనాతన ధర్మములో చేసే పూజలలో శంఖ పూజ, శంఖనాదము చాలా ముఖ్యమైనవి.

ఇప్పటికీ కాశీ వంటి శివ క్షేత్రాల్లో , పూజలో అందరూ శంఖాన్ని పూరిస్తారు. జంగమ దేవరలు ఇంటింటికీ వచ్చి శంఖాన్ని పూరించేవారు. ఇప్పుడేదీ? శంఖాన్ని చూచిన వారు ఎందరు ? ఇంట్లో పెట్టుకున్నవారు ఎందరు ? పూజించేవారు, పూరించే వారు ఎందరు ?

.

శంఖ భయమనేది లేక పోవడముతో, ఇళ్ళలో శంఖ నాదాలు వినపడకపోవడముతో, , దానవ అంశతో , దానవ వాసనలు గల ఆత్మలు నిర్భీతిగా, నిరాటంకముగా మనుషులకు సంతానముగా పుడుతున్నాయి. అందుకే ఇటువంటి విపరీత ధోరణులున్న మానవులు పుట్టుకొస్తున్నారు.

శంఖములో నుంచిన నీరు దేవతలకు ప్రీతి పాత్రములు. శంఖనాదము దేవతలకు ఆహ్వానము వంటిది.  శంఖము ప్రతిధ్వనించు ప్రదేశమున శ్రీమహాలక్ష్మి సుస్థిరముగా ఉంటుంది. శంఖజలముతో స్నానము చేయువారు సర్వ తీర్థములలోను స్నానము చేసినట్లే. శంఖము ఉన్నచోట అమంగళములు ఉండవు.

.

శంఖములో పోసిన నీటికి అత్యంత ప్రాశస్త్యము కలదు. అది అతి పవిత్రమైనది. సర్వ దోషములను పోగొట్టగల జలమే, శంఖ జలము. అందుకే శంఖములో పోస్తే గానీ తీర్థము కాదు అన్నారు.


ఇక ఈ శంఖాలలో అనేక రకాలున్నాయి

వామావర్తము[ శంఖ మూలాన్ని పైనుండీ చూస్తే, ఎడమవైపున తెరచుకొని ఉండేది ], దక్షిణావర్తము [ కుడివైపున తెరచుకొని ఉండేది ] అని రెండు రకాలు. వీటిలో దక్షిణావర్తము ప్రశస్తమైనది అని చెపుతారు.

ఇవి కాక, నాలుగు వర్ణాల వారికీ నాలుగు రకాల శంఖాలు చెపుతారు.

.

కృష్ణుడి శంఖము పేరే పాంచజన్యము.

 అర్జునుడి శంఖము పేరు ’ దేవదత్తము ’

యుధిష్టిరుడి శంఖము పేరు ’ అనంత విజయము ’

భీముడి శంఖాన్ని ’ పౌండ్ర ’ అంటారు.

కుబేరుడికి ఉన్న నవ సంపదలలో  శంఖము కూడా ఒకటి.

.

శంఖాలు ఇంకా అనేక ఆకృతుల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. కొన్ని ’ గోముఖ ’ ఆకారంలో సహజంగా ఏర్పడి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ’ గోముఖ శంఖము ’ బొమ్మ మాయింటిలోనిది. ఇందులో కూడా సముద్ర ఘోష వినిపిస్తుంది. దీనినే గణేశ శంఖము అని కూడా అంటారు.

క్రోధమువలన

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *నిత్యం క్రోధా చ్ఛ్రియం రక్షే త్తపో రక్షేచ్చ మత్సరాత్* | 

       *విద్యాం మానావమానాభ్యా మాత్మానం తు ప్రమాదతః* ॥


తా𝕝𝕝 *క్రోధమువలన సంపదను, మత్సరమునుండి తపస్సును, మానవ మానములనుండి విద్యను, ప్రమాదమునుండి ఆత్మను (బుద్ధిని) రక్షించుకొన వలయును*॥

విద్యని గ్రహించి

 చదువుని సర్వమంగళం చేసుకున్న మనం దాని గురించి ఆలోచన చేయడం మనేశాము...


బట్టీలు పట్టించి, విద్యని గ్రహించి నేర్చుకునే  నైపుణ్యాలను చంపేస్తున్నారు...


ఎంత చెరుపు జరిగినా,

ఎంత విద్య చెడినా,

పేరెంట్స్ కు కావాల్సింది రంగు రంగుల క్లాస్ గదులు,

హంగు ఆర్భాటాలు చూపించే హాస్టల్ గదులు...


ఎక్కడ బిడ్డల నైపుణ్యానికి విలువ, గౌరవం, గుర్తింపు దక్కుతుందో అక్కడ చేర్పించండి...


అలాంటి విద్యాసంస్థలు దాదాపుగా లేవు...


We Edu hub academy online sessions teaches value based Education. We help you to clear their doubts, complete topic explanation, Languages like Telugu, Hindi, English, sanskrit, French, Tamil. All classes, all subjects, all boards clear explanation, calligraphy ( hand writing), Drawing, painting, pencil sketch, crayon art, water colours, paper craft, spoken English, spoken Hindi, Abacus 🧮, western dance, Zumba fitness dance weight loss classes exclusively for women, Devotional songs, devotional slokas, Bhajan songs, Harathi songs, Keerthanalu, Nithya devatha pooja vidhanam nd many more at ur door step without stepping out from ur comfort zone. Even parents can observe both student nd teacher.


Needy contact 6300671439.

దేవాలయాభివృధ్ధిలో

 *కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన మూర్తయేనమః*

         కనీసం *111₹* పంపి దేవాలయాభివృధ్ధిలో పాలుపంచుకోండి.111₹ అంటే మరీ తక్కువ అనే ఆలోచన తో ఎక్కువ పంపాలని వాయిదా వేయడం కన్నా 111₹ పంపడం ఉత్తమం,కావాలంటే తరువాత పరిస్థితి బాగున్నప్పుడు మరింత విరాళం ఇవ్వవచ్చు అని కూడా ఒకసారి ఆలోచించండి.

 రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో ప్రతిష్ఠించబడిన మన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పూర్వపు అభీష్ట గణపతి ఆలయంతో స్లాబ్ కలపకపోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం క్రుంగుతోంది. ఆర్థిక వనరులు సరిపడకపోవడంతో పునాది మాత్రమే కలిపి నిర్మాణం పూర్తిచేసి ప్రతిష్ఠా మహోత్సవం పూర్తి గావించాము. కానీ ఇప్పుడు స్లాబ్ భాగం కూడా సాధ్యమైనంత త్వరలోనే కలిపి రెండు ఆలయాలకు శిఖర నిర్మాణాలు చేయడానికి సంకల్పం చేసాము. తద్వారా దేవాలయం పటిష్ఠమై వర్ధిల్లగలదు. దయచేసి భక్తులు యధాశక్తి ఆర్థిక సహాయం చేయగలరని ఆకాంక్షించడమైనది.

*ఈ నిర్మాణం కొరకై ప్రతీ భక్తుడు కనీసం 111₹ పంపి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని పిలుపునిచ్చుచున్నాము.*

ఈ దేవాలయంలో నిత్యాభిషేకాద్యర్చనలతో బాటుగా *ప్రతీ పున్నమికి గోమయపు ప్రమిదలలో "సంధ్యాదీపోత్సవం",ప్రతీ సంకష్టహర చతుర్థి నాడు "పల్లకి సేవ" ,ప్రతీ మాస శివరాత్రికి "మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం" నిర్వహించబడుచున్నాయి.* ఇవియేకాక నిత్య వేదపారాయణం మరియు అనేక వైదిక క్రతువులు కూడా నిర్వహించబడుతున్నాయి. 

ప్రతి ఒక్కరూ కూడా ఒక్క *111₹* చొప్పున పంపి ఈ మహాకార్యంలో భాగస్వామ్యం తీసుకుని మన దేవాలయ అభివృద్ధి కి సహకరించగలరని ఆకాంక్షిస్తున్నాము.

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

*ABHEESTA GANAPATHI ALAYA TRUST*

మా గూగుల్ పే/ఫోన్ పే/UPI and WhatsApp number 9492050200 on the name of K.Srinivasa Sarma, FPCA of the trust.


*A/C No: 011712010001038*

*IFSC : UBIN0801178* 

*Devi Chowk Branch, Rajamahendravaram*.

దయచేసి విరాళాలు పంపిన వారు UPIరసీదు సాఫ్ట్ కాపీని మాకు వాట్సాప్ చేయగలరు.