25, ఆగస్టు 2024, ఆదివారం

కృష్ణనామం

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 

కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.

మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!

నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /

ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //


కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః 

జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ // 

కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.  


కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /

యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //

కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.


హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ రామ హరే 

ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 

నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే 

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు. 


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

Panchaag



 

ఆకు కూరలు*

 *ఆకు కూరలు*



 

    *రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్.  భార్య డెలివరీకి వెళ్ళింది.  అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు, స్వయంపాకం చేసుకుంటాడు*.

     *ఆరోజు ఆదివారం.  పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు*.

*ఆకు కూరలు, ఆకు కూరలు అని కేక వినిపించింది*.  *డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది, పిలిచాడు*.

*"కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె.*

"పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.*

"*పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ*.

"మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు."  అన్నాడు చిరుకోపంగా

"నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ

పదిరూపాయలు ఇచ్చాడు.  *"గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని*.

*గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి ....*

*అవ్వ వెళ్ళిపోయింది.

"ఎంత ఆశో ఈ ముసలిదానికి,ఇవాళో రేపో చావబోతుంది, ఇంకా మూటలు కడుతున్నది"ముసిముసిగా నవ్వుకున్నాడు.*

అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.

*కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు.  అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది*. *ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది.*

*అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ.. బాబూ...కాస్త గంప కిందికి దించు!" అన్నది రవితో.*

*"ఏడవకమ్మా...నేనొచ్చి చెబుతాలే.  రేపు ఫీజు కడతాలే..నా తల్లే... ఇంటికిపొదాం పద"  అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.*

రవికి అర్ధం కాలేదు.  "ఎవరీ పిల్ల?"  అడిగాడు అవ్వను.*

*"నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకలమందు మింగి చచ్చిపోయింది.  మా ఆయన మూడేళ్ళబట్టీ మంచం మీదున్నాడు.*   *ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని  మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ  అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా.  మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు.* *నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు.  ఈరోజు చూడు బాబు... పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ*.

*రవి నరాలు మొత్తం బిగుసుకుని పోయాయి.   రక్తప్రవాహం స్తంభించి పోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు.  అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది*.  *మనసంతా ఉష్ణ జలపాతం  అయింది.  ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు  ధారలు కట్టాయి.  "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది.*  *ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటి గాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు ...*

*పర్సులో చెయ్యి పెట్టాడు.  బయటకొచ్చి "అవ్వా ... ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి"  అన్నాడు.   బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని.

హంపి మొహంజదారో శిధిలాలకు  ప్రతీకలాంటి   అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది*.

"*బాబూ ....ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది"*  అన్నది వణుకుతూ.

*"అప్పని ఎవరు చెప్పారు?  చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ....*  *ఇప్పుడే కాదు .... నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను .... రేపటినుంచి రోజూ  నేను ఉన్నా లేకపోయినా  పది రూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి*.

*మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు.  వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి*!


*ఇట్టాంటి చిట్టి కధలు మన మనస్సులని కదిలిస్తాయి ..*


*తమ కుటుంబాల కోసం, ఒంటరి మహిళలు, ఒంటరివాళ్లు ఎందరో చిరు వ్యాపారాలు చేసుకుంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ పల్లెల్లో పట్టణాలలో నిత్యం మనకు సమాజంలో ఎంతో మంది కనిపిస్తారు ,ఉన్నారు.* *అలాంటి వారి పట్ల మనము కాస్త జాలి, దయ, కరుణ చూపి అవసరమున్న వాళ్లకు కాస్త ఆర్థిక సహాయం అందించడం నిజమైన మానవత్వం అనిపించుకుంటుంది...*

*భూమిపై జీవించిన కొన్ని  రోజులు మానవత్వంతో జీవిస్తూ మనకున్న దాంట్లో కొద్దిమందికైనా సేవ ,సహాయం, సహకారం చేసుకుంటూ ఉన్నతంగా జీవిద్దాం... వచ్చినప్పుడు ఏం తీసుకురాం... పోయేటప్పుడు ఏమి తీసుకపోం... ఏమంటారు....*

*దానం,ధర్మం, సత్యాన్ని కాపాడితే అవే మనకు రక్షిస్తాయి... ఓ మంచి సమాజ నిర్మాణానికి పునాది ఇవే అనే విషయం మనకు అందరికీ తెలుసు...*

సంకల్ప బలం

 సంకల్ప బలం



రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.


ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.


తర్వాతి రోజుల్లో‌ ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో‌ బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.


కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. 

కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చాడు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.


తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.


ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీ‌అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!


వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.


ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం‌ నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.


'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.


దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.


ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.


తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలో‌ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.


మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!


from భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, పురాణాలు

ఆలోచించాలి

 🙏🕉️ శ్రీ మాత్రే నమః శుభోదయం🕉️🙏.    🔥సూర్యుడు ప్రతీ రోజు మనకి ఇలా గుర్తు చేస్తుంటాడు..మనం కూడా చీకటి నుండి వెలుతురులోకి రాగలమని..స్వయంగా ప్రకాశించగలమని🔥మన జీవితం దేవునితో చేస్ ఆడటం లాంటిది..మన ప్రతీ కదలిక తరువాత అతను తదుపరి కదలికను చేస్తాడు..మన కదలికలను అవకాశాలు అంటాము..ఆయన కదలికలను పరీక్షలు అంటాము🩸 ఏ వ్వక్తి ఐనా అతని ఆకారము ద్వారా కంటే దయ, గౌరవం, నిజాయితీ మరియు వారు చూపించే విధేయత వలన ఎన్నో రెట్లు ఎక్కువ ఆకర్షణీయం గా అవుతాడు🩸మనసును విశాలంగా చేసుకొని ఆలోచించాలి..జరిగే ప్రతీ విషయంలో మంచిని వెతికే ప్రయత్నం చేయాలి..జరిగిన చెదులో కూడా మంచిని చూసే శక్తి రావాలంటే మనసును పరమాత్మ తో అనుసంధానం చేయవలెను..తదుపరి మెడిటేషన్  క్రమం తప్పకుండా చేయడం..అందుకు కొన్ని రోజులు పాటు మనసులో శుభమైన ఆలోచనలను చేయడం ఒక వ్రతంగా చేపట్టాలి.. విధాత పరదాత పరమాత్మను స్మరిస్తే మనసును ప్రశాంతంగా ఉంచే మనోహర బహుమతి లభిస్తుంది🩸🩸🩸మీ అల్లంరాజు భాస్కర రావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ & ఏజ న్సీస్ గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593 9182075510 🙏🙏

వేమన సంబంధ 16 పుస్తకాలు

 *వేమన సంబంధ 16 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

వేమన పద్యములు www.freegurukul.org/g/Vemana-1


వేమన యోగి www.freegurukul.org/g/Vemana-2


వేమన పద్యాలు 5000 www.freegurukul.org/g/Vemana-3


విశ్వదాభిరామ వినురవేమ www.freegurukul.org/g/Vemana-4


వేమన వేద సూక్తులు www.freegurukul.org/g/Vemana-5


వేమన www.freegurukul.org/g/Vemana-6


వినుర వేమ www.freegurukul.org/g/Vemana-7


వేమన్నవాదం www.freegurukul.org/g/Vemana-8


మన వేమన www.freegurukul.org/g/Vemana-9


సత్యాన్వేషి వేమన www.freegurukul.org/g/Vemana-10


వేమన వివిధ దృక్కోణాలు www.freegurukul.org/g/Vemana-11


బొమ్మల యోగి వేమన www.freegurukul.org/g/Vemana-12


ప్రజాకవి వేమన www.freegurukul.org/g/Vemana-13


వేమన్న - సర్వజ్ఞులు www.freegurukul.org/g/Vemana-14


భారతీయ సాహిత్య నిర్మాతలు www.freegurukul.org/g/Vemana-15


వినురవేమ నీతికథలు www.freegurukul.org/g/Vemana-16


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు www.freegurukul.org/join

AR Caterers Add

 అందరికీ నమస్కారం.


మేము అనగా AR Caterers, మీ యొక్క అన్ని కార్యక్రమములకూ అవసరమైన ఆంధ్ర &  కర్ణాటక (శాకాహారం మాత్రమే) వంటలు శుచిగా చేసివ్వగలవారము. 

అలాగే రోజూవారి అల్పాహారం (ఉదయం & సాయంత్రం) మరియూ మధ్యాహ్న భోజనం కూడా సరఫరా చేయగలవారము. 

ప్రసాదాలు సైతం చేసివ్వగలవారము.


కావున మా సేవలను వినియోగించుకొనగలరని అందరికీ విజ్ఞప్తి అలాగే ఈ విషయాన్ని మీ యొక్క బంధు మిత్రులందరికీ తెలియపరుస్తూ మీ మీ WhatsApp & ఇతర గ్రూపులలో కూడా షేర్ చేయగలవారలు.


ధన్యవాదములు, 

రవి & అరుణ 

AR Caterers (A Brahmin Enterprise)

వారాసిగూడ, సికింద్రాబాద్

ఫోన్:  98494 22484 / 91107 56164

బొప్పాయి చెట్టు యొక్క ఉపయోగాలు -

 బొప్పాయి చెట్టు యొక్క ఉపయోగాలు - 


 # దీని పువ్వు నలిపి పేనుకొరికిన చోట రుద్దిన మరలా వెంట్రుకలు వచ్చును. ఇలా 4 నుంచి 5 దినములు చేయవలెను . 


 #దీని కాండము కి గాటు పెట్టిన పాలు కారును. ఆ పాలని 2 నుంచి 3 సార్లు పూసిన తామర , గజ్జి చిడుము మానును . 


 # ఈ పాలను 60 చుక్కలు దానికి సమానంగా పంచదార కలిపి మూడు సమాన భాగాలుగా చేసి మూడు పూటలా ఇవ్వవలెను . ఈ ప్రకారం ఇవ్వడం వలన అగ్నిమాన్ద్యం ( Dyspepsia) మానును . 


 # ఈ పాలు లొపలికి తీసుకొవడం వలన ప్లీహం  

లివర్ పెరుగుట పోగొట్టును .


 # పచ్చికాయ తీసుకొచ్చి నిలువునా కత్తితో గీతలు పెట్టిన పాలు కారును . ఆ పాలను ఒక చిప్పలో గాని , గాజుగిన్నెలో గాని తీసుకుని కాలుచున్న ఇసుకలో పెట్టిన తెల్లని చూర్ణం అగును. ఇలా అవడానికి 24 గంటల సమయం పట్టును . ఈ చూర్ణం పెద్దవారికి రోజుకీ ఒక్కసారి 2 గొధుమ గింజల ఎత్తు పంచదారతో గాని , పాలతో కాని లొపలికి ఇవ్వవలెను. మిక్కిలి జీర్ణశక్తిని ఇచ్చును. 


 # బొప్పాయకాయ పాలు తేలుకుట్టిన చోట రాయడం వలన తేలువిషం హరించును. 


 # పచ్చికాయ వండుకుని తినిన బాలింతలకు పాలు సక్రమంగా వచ్చును. 


 # బొప్పాయి ఆకు నూరి కట్టిన బోదకాలు వ్యాధి హరించును. 


 # బొప్పాయికాయ ముక్కలను మాంసం నందు వేసి వండిన మాంసం మెత్తగా ఉడుకును.


 # మొలలవ్యాధి కలిగినవారు బొప్పాయి పండు తినిన మొలలు తగ్గును . 


 # పండు యొక్క గుజ్జు వంటికి పూసిన శరీరం పేలినట్టు ఉండటం మానును . 


  ముఖ్య గమనిక - 


       ఈ బొప్పాయిని ఎక్కువ తీసుకోకూడదు. ఆలస్యంగా జీర్ణం అగును. కఫవాతము పెంచును. ముఖ్యంగా గర్బిణి స్త్రీలకు పచ్చికాయని ఇవ్వకూడదు. దీనికి రుతురక్తం జారీచేసే గుణం ఉన్నది. కావున గర్భస్రావం అయ్యే అవకాశం ఉన్నది. కడుపు నిండుగా తిని ఈ బొప్పాయి పండు తినిన జ్వరం వచ్చును. కావున తక్కువ మోతాదులో తీసుకొవడం మంచిది. 


  దీనికి విరుగుళ్లు - 


        శొంటి , పిప్పిలి , మిరియాల చూర్ణం లేక కషాయం తీసుకోవడం . 


        మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

బమ్మెఱపోతన రూప చిత్రణము


బమ్మెఱపోతన  రూప చిత్రణము 

                           -------------------------------------------------- 


సీ:  కుప్పించి  యెగసిన   కుండలమ్ముల కాంతి


                                గగన  భాగంబెల్ల   గప్పి కొనఁగ ;


     నుఱికిన  నోర్వక  యుదరంబు  లోనున్న


                                    జగముల  వ్రేగున  జగతి  గదుల ;


      చక్రంబుఁ జేపట్టి  ద చనుదెంచు  రయమున 


                                     పైనున్న  పచ్చని   పటము   జార;


   నమ్మితి  నాలావు  నగుబాటు   సేయకు


                                 మన్నింపు  మని   క్రీడి  మరలఁ  బిలువఁ ;


గీ:  గరికి  లఘించు  సింహంబు  కరణి   మెఱసి ,

      నేఁడు  భీష్మునిఁ  జంపుదు  నిన్నుఁ   గాతు,

     విడువు మర్జున!  యంచు , మద్విశిఖ  వృత్తిఁ

     దెరలి  చనుదెంచు  దేవుండు  దిక్కు  నాకు .


శ్రీ: ఆం:  భాగవతము-  ప్రథమస్కంథము- 40 వ: పద్యము;


                  తెలుగు  వారి పుణ్యాలపేటి,యైన, భాగవత గ్రంధంలో  పోతన రూపచిత్రణం  అత్యద్భుతం! ఆయాపాత్రల  యథాతధ స్థితిని  కన్నులకు  గట్టించటం  పోతన కవితలోని  ప్రత్యేకత! భాగవత ప్రధమ  స్కంధంలోని   భీష్మ స్తుతి యిందుకు చక్కని యుదాహరణ. 


                 నాఁడు  కురుక్షేత్ర  రణరంగంలో  ప్రచండంగా   యుధ్ధం  చేస్తున్నప్పుడు, అర్జునుఁడా బాణాఘాతములకు  నొచ్చి, కలత పడువేళ  చక్రధారియై  కృష్ణుఁడు  భీష్ముని  పైకి  నురుకు  దృశ్యము ను ఈపద్యమునందు  కన్ను లముందు నిలిపినాఁడు. 


అలతి యలతి సుందర పద భాసితమైన  యీపద్యానికి  అర్ధవివరణ  మక్కరలేదు. అయినను  భావార్ధ దర్శన మొనరింతముగాక! 


                   "  చక్ర ధారియై  కృష్ణుఁడు  రథమునుండి  యురికినపుడు  కుప్పించి యెగసినాడట .(ఒకింతశరీరమును  పైకి 

 లేపుట)అపుడాతని కర్ణాభరణముల కాంతి  మెఱపు మెరసినట్లయి  ఆదివ్యకాంతి నలుఁగడలవిస్తరించినదట, అట్లు ఉరుకుచే తనలోనున్న 14 భువనముల  భారము  కదలినట్లయి ఉదరము క్రిందికి పైకినూగెనట., చక్రధారియై  యురకు నపుడు  పైనున్న పీతాంబరము  జాినదట.అట్టిస్థితిలో అర్జునుడు ముకుళిత హస్తుడై


" కష్ణా! నాపరాక్రమమును  శంకింపకుము, నాశక్తి నే నెఱుంగుదును ,భీష్ముని నీవువధించి నాకు నలుగురిలో నవమానమును  ఘటింపకుము  మరలుమని "  వేడుచున్నాడట.అతనిమొరవిని,


              " ఏనుఁగు  పై నురుకు  సింహమువలె  గర్జించుచు, " నేడు  భీష్ముని  సంహరించి నిన్ను కాపాడెదను.నన్ను విడువుము"- అనిపలుకుచు  నాబాణములకు  తాళలేక  నాపై లఘించు  చక్రధారియే నాకు దిక్కగుగాక! 


                           అనిభీష్ముని  ప్రార్ధన!  ఇదీ పోతన గారి  రూపచిత్రణం!


                                                            స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కాళ్ళు కడుక్కోండి వడ్డించేస్తాను"

 ఇవన్నీ మీకు గుర్తున్నాయా?

బాల్యంలో అంటే 60, 70 ప్రాంతాల్లో మన మధ్యతరగతి ఇళ్లల్లో తరచుగా వినపడే మాటలు..

బంధువులు ఊరినుంచి రాగానే మంచినీళ్లిచ్చి, కుశల ప్రశ్నలు వేసినాక *"పొద్దున్న ఎప్పుడనగా బయలు దేరారో ఏమో, కాళ్ళు కడుక్కోండి వడ్డించేస్తాను"* అనే ఇల్లాలు 

పొద్దున్నే పాలవాడు గిన్నెలో పాలు పోయగానే 

"*ఈమధ్య బొత్తిగా నీళ్ల పాలు పోసేస్తున్నావు"*

పక్క వీధి పిన్నిగారితో "*మీ కోడలు నీళ్ళోసుకుందిటగదా.. ఇప్పుడు ఎన్నో నెల?"*

అనే ఎంక్వయిరీ లు 

*"ఈరోజు మా తాతగారి తద్దినం. నాలుగు అరిటాకులు అడిగి కోసుకు రమ్మంది మా అమ్మ ?"* పక్కింటి పిల్లాడి అభ్యర్ధన 

*"వెళ్ళేటప్పటికి బాగా రాత్రి అవుతుంది కదా!*

*కాస్త పులిహోర, పెరుగన్నం చేసిస్తాను. రైలులో తిందురుగాని"* ప్రయాణమవుతున్న బంధువులతో ఆప్యాయంగా ఇల్లాలు 

"*మీ పిల్లకు సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా లేక మేనరికాలు ఉన్నాయా?*" పొరుగింటి పిన్నిగారి ఆరా 

"*ఈ నెల నుంచి అద్దె ముప్పై పెంచుతానంటున్నారు*

*ఇంటాయన*" బెంగగా అద్దె ఇంటాయన 

*"ముందు ఆ బాత్ రూమ్ తలుపు రిపేర్ చేయించి పెంచమనండి"* ఇంటామే ఇచ్చిన హింటు 

"*పరీక్షలు దగ్గిర పడుతున్నాయి. ఇక ఆటలు ఆపి చదవండి*" నాన్నగారి హుంకరింపు 

"* తెల్లారగట్లే అయిదింటికి లేపుతా*.. *నాతోబాటే లేచి చదవండి. తెల్లారగట్ల చదివితే బాగా వస్తుంది చదువు"* అమ్మ బుజ్జగింపు 

"*ఏమండి.. బియ్యం తేవాలి. ఇక రెండు రోజులే వస్తాయి"* ఇల్లాలి అల్టిమేటం 

" *మీరు చదవడం అయిపోతే ఈ వారం ప్రభ ఒకసారి ఇవ్వండి పిన్ని గారూ... జీవనతరంగాలు చదివి ఇచ్చేస్తాను"* పక్కింటావిడతో ఇంటావిడ 

" *వెంకటేశా లో మాయాబజారు సినిమా మార్నింగ్ షోలు వేస్తున్నారుట. రేపు ఉదయం పిల్లలు స్కూళ్లకి, అన్నయ్య గారు ఆఫీస్ కి వెళ్ళాక వెళ్లొద్దామా వదిన గారూ?"* పక్కింటావిడ ప్రపోజల్ 

"*వారంలో ఒక్కరోజైనా నాగా పెట్టకుండా ఉండవు గదా నువ్వు*?" పనిమనిషితో కోపంగా ఇంటి ఇల్లాలు 

"*పెద్దాడు ఇంకా మణియార్డర్ పంపలేదేమిటో?"*

ఓ పెద్దాయన ఆరాటం 

*"పంపుతాడు లెండీ. జీతాలు ఇచ్చారోలేదో "*

కొడుకుని వెనకేసుకొస్తూ పెద్దాయన భార్య 

ఎవరన్నా బంధువులు ఇంటికి వస్తే, వారిని ఆదరంగా ఆహ్వానిస్తూ *"పొద్దున్న కాకి ఒకటే అరుస్తుంటే, ఇవాళ ఎవరో ఇంటికి వస్తారు అని అనుకుంటూనే ఉన్నాను. రండి రండి"*

"*సరే... జీతాలు రానీ.. కొందాం"* నెలాఖరులో అందరి నాన్నల స్టాక్ డైలాగ్ 

అప్పటి టెలిగ్రాములలో మచ్చుకి కొన్ని 

"Start immediately. Father not well"

"Arriving by tenth circar"

"Lakshmi delivered male child on fifth. Both are safe"

"*ఈసారి పండగ కి రేషన్ కార్డు మీద ఇంకో కిలో పంచదార ఎక్కువ ఇస్తున్నారుట"* అమ్మ ఆనందం 

"*కిరసనాయిలు కూడా ఇస్తే బాగుండును. కరెంట్ అస్తమానూ పోతోంది"* పక్కింటి పిన్నిగారి ఆశాభావం 

"*మొన్న ద్రోణంరాజు గారింట్లో పట్టపగలే గోడ దూకి దండెం మీద ఆరేసిన బట్టలు,* ఇత్తడి 

డేగిసా ఎత్తుకుపోయారుట!" అమ్మలక్కల పిచ్చాపాటి.

*"అయినా చోద్యం కాకపొతే ఇత్తడి డేగిసా అలా బయట వదిలేస్తారా ఎవరైనా.. ఎత్తుకెళ్లిపోరూ మరి?"* ఒక పిన్నిగారి మూతి విరుపు 

"*ఏంట్రా ఈ మార్కులు... హాఫ్ ఇయర్లీ కి కూడా ఇలాగే వస్తే చెప్తా నీ సంగతి*" నెత్తి మీద నాలుగు పీకి ప్రోగ్రెస్ కార్డు సంతకం పెడుతున్న నాన్నగారు 

"*నాన్నగారు అన్నవరం క్యాంపు కి వెళ్ళివచ్చారు. ప్రసాదం ఇచ్చిరమ్మంది అమ్మ*" సత్యనారాయణ స్వామి ప్రసాదం పొట్లం ఇస్తూ పక్కింటి పిల్ల. 

కళ్లకద్దుకుని మరీ తీసుకున్న ఇల్లాలు.

"*నాన్న గారి తిధి మళ్ళా ఆదివారమే. పచారీ సామాను ఏం కావాలో చూసి లిస్టు రాయి. సాయంత్రం వెళ్లి శాస్త్రి గారికి చెప్పి వస్తా*" అంటున్న నాన్నగారి మాటలు విని తాతగారి తద్దినానికి వచ్చే మేనత్త పిల్లలు, బాబాయ్ పిల్లలతో ఆడుకోవొచ్చనే పిల్లల ఆనందం 

*"నల్లులు ఎక్కువైపోయాయి. నల్లుల మందు తెండి. రేపాదివారం మందు కొట్టి మంచాలు ఎండలో పడేద్దాం"* ఇప్పుడు దోమల్లాగ అప్పుడు నవారు మంచాల్లో నల్లుల బాధ 

"*ఈ బియ్యం తీసుకెళ్లి మరాడించుకుని రారా. శనివారం ఫలహారం ఉప్పుడుపిండి చేయాలి"*

కొడుకుతో తల్లి.

*"అలాగే ఆ చేత్తోటే ఓ మెట్టవంకాయ కాల్చి పులుసుపచ్చడి పెట్టమ్మా. మీ ఆయనకు పిండిలోకి ఇష్టం"* కొడుకు ఇష్టం తెలిసిన తల్లి గారు కోడలుతో 

"*మీ అబ్బాయికి బ్యాంకు ఉద్యోగం వచ్చిందిట గదా... సంతోషం. ఇక పెళ్లి చేసేయొచ్చు*" కుర్రాడి తండ్రితో పక్కింటాయన.

*"ఏదీ ఇంకా జాయినే కాలేదు. అప్పుడే పెళ్ళా?"*

కుర్రాడి తండ్రి.

"*ఇప్పుడే కాదులెండి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా... మా బావమరిది కూతురు ఉంది. బంగారుబొమ్మ. డిగ్రీ చదువుతోంది. కాస్త దృష్టిలో పెట్టుకోండి"* పిల్ల మేనత్త మొగుడు కర్చీఫు వేసేసి కాఫీ తాగి వెళ్ళాడు 😃😃

దేవాలయాలు - పూజలు 21*

 *దేవాలయాలు - పూజలు 21*


సభ్యులకు నమస్కారములు.


అరుణోదయ కాలంలో, ప్రాతః సంధ్యా సమయాన అర్చకుల వారు దేవాలయ ప్రవేశం కాగానే, గర్భ గుడి శుద్ధి, మూలవిరాట్ మరియు ఉత్సవమూర్తులకును పూల మాలంకృతులను చేయడం, సుగంధ వత్తుల ప్రజ్వలన ఇత్యాది ఉపచారాలు.

 ఆ తదుపరి..

1) విఘ్నేశ్వర స్తుతి.

*శుక్లాంభరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే*


2) దీపారాధన.

*ఉద్దీపస్య జాతవేదో పఘ్నం నిర్ఋతిం మమ, పశూగ్ శ్చ మహ్య మావహా జీవనం చ దశో దిశ, ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్, జ్ఞాన నిర్మథ నాభ్యాసాత్ దీపం ప్రజ్వలయామ్యహం*.


3) దేవతా రాధన. 

వివిధ దేవాలయాలలో, వివిధ మూల మూర్తులు మరియు ఉత్సవమూర్తులు ఉంటాయి కాబట్టి, ఆ దేవాలయ సంబంధిత అర్చక స్వాములు ఆరాధనా ఉపచారాలు చేస్తారు. ఉదాహరణకు...


1) గణేశ దేవాలయము.

*ఏక దంతం మహా కాయం తప్త కాంచన సన్నిభం, లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం, మౌంజి కృష్ణాజినం ధరం నాగ యజ్ఞోపవీతనం, బాలేందు శకలం మౌళి వందేహం గణ నాయకం*.

అని.....


2) శ్రీ వేంకటేశ్వర స్వామి

*శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాస మంగళం, శ్రీ వెంకటాచలధీశం శ్రియ ధ్యాసితవక్షసం, శ్రిత చేతన మందారం శ్రీనివాస మహంభజే*. 

అని..


3) దుర్గా దేవి.

*సర్వ స్వరూపే సర్వేశి సర్వ లోక నమస్కృతే, భయే భస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే*.

అని...


4) శివ స్తుతి.

*నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం, పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం, నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం, నమో: నమః శంకర పార్వతీభ్యాం*.

అని....

ఈలా ఏ దేవతా మూర్తి ఉన్న ఆలయంలో ఆయా రాధనా శ్లోకాలు, మంత్రాలు అర్చక స్వాములు భక్తి పూర్వకంగా పఠిస్తూ వేదోక్త /ఆగమోక్త ప్రకారంగా నిత్య కైంకర్యాలు చేస్తూంటారు.


4) హారతి.

భగవంతునికి హారతి ఇవ్వడం శోడషోపచారాలలో ఒక భాగము. ఇది మంగళ దాయకం మరియు శుభసూచకము. గర్భాలయంలో భగవంతుని రూపాన్ని మరింత ప్రకాశవంతంగా దర్శించుటకు హారతి దోహదపడుతుంది. భగమంతునికి క్షేమాన్ని మంఖళకారకత్వాన్ని కోరుతూ, ఆయన దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని కనులారా మనసారా *తిలకిస్తూ* ఆయన వాత్సల్య అతిశయాన్ని *కీర్తిస్తూ* హారతిని సవ్యంగా (clockwise)వలయాకారంగా ఇవ్వబడుతుంది. 

హారతి రెండు విధములు. 

1) వత్తుల హారతి 2) కర్పూర హారతి. హారతులలో కర్పూర హారతి శ్రేష్ఠమని పెద్దల భావన. కర్పూర హారతిలో గూడా దిగువ చూపినట్లు వివిధములు.

 1) సాధారణ కర్పూరం 

2) హిమ కర్పూరం 

3) వర్ణ కర్పూరం

 4) శంకరావాస కర్పూరం.


కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి, చిన్న తబుకు (plate) యందుంచి అర్చక స్వాముల వారు భగవంతునికి హారతి ఇచ్చిన తదుపరి...ఆ దివ్యమైన హారతిని భక్తులు తన్మయత్వంతో కన్నులకద్దుకుని పరవశించుతారు. 


ధన్యవాదములు

*(సశేషము)*

సంపదలు

 "పరోపకరణం యేషాం 

జాగర్తి హృదయే సతామ్।

నశ్యంతి విపద స్తేషాం 

సంపద స్స్యుః పదే పదే।।"


ఈలోకంలో పరులకు ఉపకారం చేయాలని గుండెల నిండా మేలుకొల్పుకొని వుండే సజ్జనులకు ఆపదలు నశించి పోతాయి. సంపదలు అడు గడుగునా కలుగుతాయి।।

శుభోదయం 🙏🏻🕉️🙏🏻Goodmorning