25, ఆగస్టు 2024, ఆదివారం

దేవాలయాలు - పూజలు 21*

 *దేవాలయాలు - పూజలు 21*


సభ్యులకు నమస్కారములు.


అరుణోదయ కాలంలో, ప్రాతః సంధ్యా సమయాన అర్చకుల వారు దేవాలయ ప్రవేశం కాగానే, గర్భ గుడి శుద్ధి, మూలవిరాట్ మరియు ఉత్సవమూర్తులకును పూల మాలంకృతులను చేయడం, సుగంధ వత్తుల ప్రజ్వలన ఇత్యాది ఉపచారాలు.

 ఆ తదుపరి..

1) విఘ్నేశ్వర స్తుతి.

*శుక్లాంభరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే*


2) దీపారాధన.

*ఉద్దీపస్య జాతవేదో పఘ్నం నిర్ఋతిం మమ, పశూగ్ శ్చ మహ్య మావహా జీవనం చ దశో దిశ, ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్, జ్ఞాన నిర్మథ నాభ్యాసాత్ దీపం ప్రజ్వలయామ్యహం*.


3) దేవతా రాధన. 

వివిధ దేవాలయాలలో, వివిధ మూల మూర్తులు మరియు ఉత్సవమూర్తులు ఉంటాయి కాబట్టి, ఆ దేవాలయ సంబంధిత అర్చక స్వాములు ఆరాధనా ఉపచారాలు చేస్తారు. ఉదాహరణకు...


1) గణేశ దేవాలయము.

*ఏక దంతం మహా కాయం తప్త కాంచన సన్నిభం, లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం, మౌంజి కృష్ణాజినం ధరం నాగ యజ్ఞోపవీతనం, బాలేందు శకలం మౌళి వందేహం గణ నాయకం*.

అని.....


2) శ్రీ వేంకటేశ్వర స్వామి

*శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాస మంగళం, శ్రీ వెంకటాచలధీశం శ్రియ ధ్యాసితవక్షసం, శ్రిత చేతన మందారం శ్రీనివాస మహంభజే*. 

అని..


3) దుర్గా దేవి.

*సర్వ స్వరూపే సర్వేశి సర్వ లోక నమస్కృతే, భయే భస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే*.

అని...


4) శివ స్తుతి.

*నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం, పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం, నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం, నమో: నమః శంకర పార్వతీభ్యాం*.

అని....

ఈలా ఏ దేవతా మూర్తి ఉన్న ఆలయంలో ఆయా రాధనా శ్లోకాలు, మంత్రాలు అర్చక స్వాములు భక్తి పూర్వకంగా పఠిస్తూ వేదోక్త /ఆగమోక్త ప్రకారంగా నిత్య కైంకర్యాలు చేస్తూంటారు.


4) హారతి.

భగవంతునికి హారతి ఇవ్వడం శోడషోపచారాలలో ఒక భాగము. ఇది మంగళ దాయకం మరియు శుభసూచకము. గర్భాలయంలో భగవంతుని రూపాన్ని మరింత ప్రకాశవంతంగా దర్శించుటకు హారతి దోహదపడుతుంది. భగమంతునికి క్షేమాన్ని మంఖళకారకత్వాన్ని కోరుతూ, ఆయన దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని కనులారా మనసారా *తిలకిస్తూ* ఆయన వాత్సల్య అతిశయాన్ని *కీర్తిస్తూ* హారతిని సవ్యంగా (clockwise)వలయాకారంగా ఇవ్వబడుతుంది. 

హారతి రెండు విధములు. 

1) వత్తుల హారతి 2) కర్పూర హారతి. హారతులలో కర్పూర హారతి శ్రేష్ఠమని పెద్దల భావన. కర్పూర హారతిలో గూడా దిగువ చూపినట్లు వివిధములు.

 1) సాధారణ కర్పూరం 

2) హిమ కర్పూరం 

3) వర్ణ కర్పూరం

 4) శంకరావాస కర్పూరం.


కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి, చిన్న తబుకు (plate) యందుంచి అర్చక స్వాముల వారు భగవంతునికి హారతి ఇచ్చిన తదుపరి...ఆ దివ్యమైన హారతిని భక్తులు తన్మయత్వంతో కన్నులకద్దుకుని పరవశించుతారు. 


ధన్యవాదములు

*(సశేషము)*

కామెంట్‌లు లేవు: